సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

2, మార్చి 2023, గురువారం

"సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం" - గ్రంథా ఆవిష్కరణ

ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి ద్వారా "సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం" గ్రంథావిష్కరణ ఈరోజు అనగా తేదీ 2 మార్చ్ 2023న సాయంత్రం 6:30 గంటలకు విపంచి కళానిలయం సిద్దిపేటలో మాన్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఆవిష్కరిస్తారు.

ఈ కార్యక్రమంలో సారస్వత పరిషత్వ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారు కె.వి.రమణాచారి గారు నందిని సిద్ధారెడ్డిగారు దేశపతి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమ సమన్వయకర్త జుర్రు చెన్నయ్య గారు హాజరవుతారు. 

ఈ పుస్తకం
సిద్దిపేట జిల్లా వైశిష్యాన్ని, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, ఉద్యమ, విద్య, వైద్య, అనేక పరిణామాలను అన్నింటిని నిక్షిప్తం చేసింది.

40 మంది ప్రముఖ రచయితలు రాసిన వివిధ విభాగాల క్రింద 41 వ్యాసాల సమాహారమే సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం.  

మిత్రులందరినీ తప్పకుండా సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు విపంచి కళానిలయానికి రావాలని ఆహ్వానిస్తున్నాం.

డా. సిద్దెంకి యాదగిరి
"సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం" - గ్రంథ కోర్ కమిటీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...