సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

11, అక్టోబర్ 2023, బుధవారం

ix. 6. దీక్షకు సిద్ధంకండి



పాఠం  నేపథ్యం, ఉద్దేశం:

తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితం గానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో 'తెలంగాణ ప్రజా సమితి' పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు: 
ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనిని ఆంగ్ల భాషలో పాంప్లెట్ (Pamphlet) అంటారు.


"తెలంగాణ హిస్టరీ సొసైటీ" తరఫున 2009లో వెలువడ్డ పుస్తకం, "1969 ఉద్యమం - చారిత్రక పత్రాలు" అనే ఈ పుస్తకంలో పనుల 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. 
ఆ కరపత్రమే ఈ పాఠం.
____________________________________
విద్యార్థులకు సూచనలు

పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.

 వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులలో చూసి తెలుసుకొండి.
-------------------------------------------------------------------------------------

ప్రవేశిక

దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని -పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.
----------------------------------------------------------------------------------

1

దీక్షకు సిద్ధంకండి!

  అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి, మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజా సమితి ఆదేశాలను అందజేసింది. గత తొమ్మిది నెలల నుండి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యోగం కొనసాగుతున్న అర్థం చేసుకోలేని సుబేదార్ల రాజ్యంలో ఇంకా ఈ నిరసన వ్రతాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు. 


బాపూజీ పేరున బ్రతుకుతున్న ఈ బడామనుషులంతా భక్తి వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను మరుగు పరుస్తున్నారు. జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు. ఆయ అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది. ఒకచోట మతకల్లోలము, వేరొకచోట హత్యలు, మరొకరు కాల్పులు ఇదీ మన బ్రతుకు. దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది. ఇందుల మంచి ఉదాహరణ మన తెలంగాణ. ఆంధ్రపాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్రప్రభుత్వ ఉక్కుపాదాన కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయినారు. స్వేచ్ఛ కరువైంది. తమ బానిస బంధాలను త్రెంచుకొని ఆత్మగౌరవు కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది. ఈ ప్రజాపోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. వేలాది యువకులు అంగవిహీనులయినారు. లక్షలాది ప్రజలు సత్యాగ్రహసమరంలో పోరాడి కారాగారంలో బంధింపబడినారు. అయినా బ్రహ్మరాక్షసుల పాలనలో సత్యాగ్రహాలకు, పికెటింగులకు, ధర్నాలకు విలువలేకుండా పోతున్నది. తన ఉపవాసదీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది.

మన యీ శాంతియుత విప్లవాన్ని అంచనావేయడంలో పొరబాటు జరుగుతున్నది. ప్రశాంత గంభీర జలధిలోని వ్రళయాల వరిశీలన జరగడం లేదు. ప్రజాభిప్రాయానికి మన్నన జరగడంలేదు. రోజురోజుకు దారుణ హింసాకాండ రక్తపాతం తెలంగాణ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. యువతరం ఆవేశం కట్టలు తెంచుకొంటున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం వున్నది. ఏ ఎండకాగొడుగు పట్టే శాసన సభ్యులపైన కోపం పేరుకుంటున్నది. యువత, విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్నిజ్వాలలు       62

మండుతున్న సంగతిని గురించి పదేపదే హెచ్చరిస్తున్నా ముఠా రాజకీయాల కుళ్లులో కేరింతలాడుతున్న యీ, స్వార్ధపరులకు అర్ధం కావడం లేదు.

మ పెగ్గు ము కో

అందుకే యీ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు. నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలర్పించడానికి సిద్దమయిన సమయంలో శాంతి సందేశాలు, నీతివాక్యాలు వారి హృదయాలను కలచివేస్తున్నమాట వాస్తవమే. కాని గాంధీ శతజయంతి సంవత్సరంలో వారి విధానాలు ఆచరణలో చూపించి నిజమయిన భారతీయులమని రుజువు చేయాలి. సత్యాహింసల ద్వారా పరప్రభుత్వాన్ని పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాసు రాకాసి ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి.

వెల: ఆలు ఆనా ఆకు క్తాన్ని د

1లో

ఇంత కాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇకనైనా అర్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనకుంటే అక్టోబర్ 10 నుండి నిరాహారదీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి నాయకుడు ప్రకటించినాడు. ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణా సమ్మతిని గాంధీజీ శతజయంతి పేరున చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహారదీక్షల కార్యక్రమం ప్రజాసమితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి. జాతిపితకు తెలంగాణా ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉపవాసదీక్ష,

అక్టోబర్ 2న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల నను వరకు, ఇదివరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాసదీక్షల #ను కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి. న్యాయం చేకూరాలి. ధర్మం వర్ధిల్లాలి. సత్యమేవ జయతే.

తెలంగాణ ప్రజాసమితి,

విద్యార్థి కార్యాచరణ సమితి.

వరంగల్,

30.09.1969.




ఇవి చేయండి

D5D1T4

1. అవగాహన - ప్రతిస్పందన

1. కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.

2. ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.

3. పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాస్త వివరించండి.

కీలకపదాలు

వివరణ

4. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీస ఒక కరపత్రమైనా చూస్తున్నాం.

ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లుగాని, ముద్రణాలయం పేరుగా కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకాని చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది, కరపత్రం మనిషి భావస్వేచ్ఛక సంకేతం.

ప్రశ్నలు:

అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.

ఆ) కరపత్రాలు మన దేశంలో ఎప్పటినుండి ఉన్నాయి?

ఇ) కరపత్రాలు ఎందుకు?

ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి? 

ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం? 



వ్యక్తీకరణ సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు?
జ. 1969 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని విద్యార్థులు ప్రజలు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు

జవాబు: 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన:
1969
లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.

కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.

అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.

 

ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..

తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం:
1969
వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.

ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.

  • ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
  • ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
  • ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
  • ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
  • ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
  • ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
  • ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.
ఆ)అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలన డం లో ఆంతర్యం ఏంటి?

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమ నాయకత్వం ఏమి చేయాలి?

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాఖబు రాయండి.

అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969
తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.

ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.

నేటి ఉద్యమ విజయానికి కారణాలు :

  1. నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
  2. నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
  3. 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
  4. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
    ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.

 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:

తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.

మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. మిషన్ కాకతీయఅనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.

ది. X X X X X

ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.




III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.

ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.

ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.

2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి

(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)

అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.

అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి

ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి


2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.

‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

  1. భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
  2. ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
  3. రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
  4. శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
  5. నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం

3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు
మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి
మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.


9, అక్టోబర్ 2023, సోమవారం

IX. 5. శతక మధురిమ

v శతక మధురిమ

చదువండి- ఆలోచించి చెప్పండి.

బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట యేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!

ప్రశ్నలు

1. బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు?

2. చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నారు?

3. పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి?

4. ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడుతాయి?

పాఠం ఉద్దేశం

శతక పద్యాలు నైతికవిలువల్ని పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

 పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతక పద్యాలలో ప్రతిపద్యం చివర మకుటం ఉంటుంది. శతక పద్యాలు అంటే ఏ పద్యానికి అది స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్ల భూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలు ఉన్నాయి.


కవుల పరిచయం

1. సర్వేశ్వర శతకం: 
యథావాక్కుల అన్నమయ్య ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యమున్నది.

(13వ శతాబ్దం)

2. శ్రీకాళహస్తీశ్వర శతకం: ధూర్జటి: శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల్లో ఒకడు. 'రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు...' అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకరించిన కవి. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులితమాధురీమహిమ... గలదిగా కీర్తించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు.


3. మల్ల భూపాలీయం నీతిశతకం: ఎలకూచి బాల సరస్వతి ఈయన నాగర్ కర్నూల్ జిల్ల జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో తొలి త్ర్యర్థి కావ్యమైన 'రాఘవయాదవ పాండవీయం తోపాటు దాదాపు పన్నెండు గ్రంథాలు రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వా

4. భాస్కరశతకం: మారద వెంకయ్య : ఈయన 'భాస్కరా' అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లు తన పద్యధారను కొనసాగించాడు.

5. ఉత్పలమాల : ఉత్పల సత్యనారాయణాచార్య: ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతంవాడు. రసధ్వని, ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు, గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణచంద్రోదయం మొదలైన పుస్తకాలు రాశాడు.


6. ఏకప్రాస శతపద్యమాలిక: గౌరీభట్ల రఘురాను శాస్త్రి: ఈయన సిద్ధిపేట జిల్లా

రిమ్మనగూడలో జన్మించాడు. వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక, శివపద మణిమాల, భావానందస్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలు రాశాడు.


7. నింబగిరి నరసింహశతకం: డా॥అందె వేంకటరాజం ఈయన జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించాడు. నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి రాశాడు. నింబగిరిశతకం, ఈశ్వరశతకాలతోపాటు, 'వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన' అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. 'కవి శిరోమణి', 'అవధాన యువకేసరి', 'అవధాన చతురానన' అను బిరుదులను పొందాడు.

11-09-2006

& చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడిశెట్టి చంద్రయ్య: ఈయన నాగర్ కర్నూల్ జిల్లా

తాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్రవిలాసం అనే హరికథలను, రామప్రభుశతకం, మృత్యుంజయ శతకం, పాలెం వేంకటేశ్వరశతకం, శ్రీశిరీషనగగండికా మాహాత్మ్యం, కర్పరాద్రి మాహాత్మ్యం అనే కావ్యాలను రాశాడు.


విద్యార్థులకు సూచనలు:

ca. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

. పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.

వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.


కుల శైలంబులు పాదు పెల్లగిల్ల దిక్కూలంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదం చద్భంగి నుప్పొంగి నన్
జలజాత ప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దల కంచలబ్జడు చొప్పుడప్పడు భవద్భక్తుడు సర్వేశ్వరా!
-యథావాక్కుల అన్నమయ్య

ప్రతిపదార్థం :

సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామీ !
కులశైలంబులు = కులపర్వతాలు (సప్తకుల పర్వతాలు)
పాదు = ఆశ్రయము (స్థిరత్వము)
పెల్లగిలి = పెల్లగింపబడి (ఉన్మూలితమై)
దిక్కులంబునన్
(దిక్ + కూలంబునన్ = దిక్కుల ఒడ్డున (దగ్గర)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రములు
మేరలన్ = హద్దులను (చెలియలికట్టలను)
ఆక్రమించి = అతిక్రమించి
సముదంచద్భంగిన్
(సముదంచత్ + భంగిన్)
సముదంచత్ = అధికంగా పైకినెట్టబడిన
భంగిన్ = విధముగా
ఉప్పొంగినన్ = మిక్కిలి పొంగినా
జలజాతప్రియ శీతభానులు ;
జలజాతప్రియ = పద్మములకు ప్రియుడైన సూర్యుడును
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడునూ
యథాసంచారముల్ = (వారు) సంచరింపవలసిన తీరుగా సంచరించడం (తిరుగవలసిన రీతిగా తిరగడం)
తప్పినన్ = మరచిపోయినా
భవద్భక్తుండు
(భవత్ + భక్తుండు) = నీ భక్తుడు
తలకండు = చలించడు;
ఉబ్బడు = పొంగిపోడు;
చొప్పు = పద్ధతిని
తప్పడు = దాటడు; (విడిచిపెట్టడు)

భావం : ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్యచంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్ధతిని తప్పడు.

విశేషములు :
1) కులపర్వతాలు ఏడు అవి :

మహేంద్రము
మలయము
సహ్యము
శక్తిమంతము
గంధమాదనము
వింధ్యము
పారియాత్రము

భావం: సర్వేశ్వరా! కుల పర్వతాలు ఉన్మూలమయ దిక్కుల అంచులలో పడిపోయనా సముద్రాలు తీరాలను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తమ గతులు తప్పినా నీభక్తుడు చలించడు అదే విధంగా ఉబ్బిపోడు. ఇదంతా జ్ఞానికి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా ఒక్క శివభక్తి మనసున నాటుకుంటే చాలు మనమెవరమన్న సంగతి అనగా తాను ఎవరో తెలుసుకొనే జ్ఞానాన్ని కలిగిఉంటాడు శివభక్తుడు.!

శా . జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాడవుట హింసారంభకుండవుట మి
థ్యాతాత్పర్యము లాడు టన్నియు బరద్రవ్యంబు నాశించి యీ 
శ్రీ తానెన్ని యుగంబు లుండ గలదో శ్రీకాళహస్తీశ్వరా!‌. - ధూర్జటి.

ప్రతిపదార్థం :

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరా!
జాతుల సెప్పుట
(జాతుల్ + చెప్పుట) = జాతకాలు చెప్పడమూ,
సేవచేయుట = రాజులకు కాని, ఇతరులకు కాని సేవ చేయడము
మృషల్ = అసత్యములు
సంధించుట = కూర్చుటయు; (మాట్లాడడమూ)
అన్యాయవిఖ్యాతిన్;
అన్యాయ = అన్యాయ మార్గములో
విఖ్యాతిన్ = కీర్తిని
పొందుట = పొందడమూ
కొండెకాడు = కొండెములు చెప్పేవాడు (ఒకరిమీద చాడీలు చెప్పేవాడు)
అవుట = అవడమూ, (కావడం)
హింసారంభకుండు
(హింసా + ఆరంభకుండు) = హింసా ప్రయత్నము చేసేవాడు
జౌట = అగుటయూ (కావడమూ)
మిధ్యా తాత్పర్యములు = అసత్యమైన భావములు
ఆడుట = చెప్పడమూ;
అన్నియున్ = ఈ పైన చెప్పిన అన్ని పనులునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనాన్ని
ఆశించి = చేజిక్కించుకోవాలనే ఆశ చేతనే కదా!
ఈ శ్రీ = ఇలా సంపాదించిన ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలకాలముపాటు
ఉండగలదో = నిలిచి యుంటుందో! (ఎవ్వరికీ తెలియదు)

భావం : ఓ శ్రీకాళహస్తీశ్వరా! లోకములోని మనుష్యులు, జాతకములు చెప్పడమూ, ఇతరులకు సేవలు చేయడమూ, అసత్యము లాడడమూ, అన్యాయంగా కీర్తిని సంపాదించడమూ, చాడీలు చెప్పడమూ, హింసా ప్రయత్నం చేయడమూ, అనవసర అర్థాలు చెప్పడమూ వంటి పనులు చేస్తూ, తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. కాని ఇలా సంపాదించిన ధనం, ‘ఎంతకాలం నిలుస్తుంది ? (ఎంతోకాలం నిలబడదని భావం.)


చెవికిం కుండల మొప్పు కాదు శృతమే చేదమ్మి కిన్గంకనం
బు విబుషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్ 
బ్రవి లేపంబులు గావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతి వాచాస్పతీ!
 - ఎలకూచి బాలసరస్వతి

ప్రతిపదార్థం :

లవితేంద్రాతి వైభవా !
లవిత (లలిత) = సుందరుడైన
ఇంద్ర = ఇంద్రుడి
అతిగ = అతిక్రమించిన (మించిన)
వైభవా = వైభవము గలవాడా!
నీతివాచస్పతీ = నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా!
సురభి మల్లా = ఓ సురభిమల్ల భూపాలుడా!
చెవికిన్ = చెవులకు
శ్రుతమే (శ్రుతము +ఏ) = శాస్త్రపాండిత్యమే కానీ,
కుండలము = కుండలములు ధరించడం
ఒప్పుగాదు (ఒప్పు + కాదు) = అందము కాదు
చేదమ్మికిన్ = పద్మము వంటి చేతికి;
దానమే
(దానము + ఎ) = దానమే కాని
కంకణంబు = కంకణము
‘విభూషాఢ్యము
(విభూషా + ఆఢ్యము) = గొప్ప అలంకారము
కాదు = కాదు;
మహిన్ = భూమండలములో
పుణ్యాత్ము = పుణ్యాత్ముని యొక్క
నెమ్మేనికిన్
(నెఱి + మేనికిన్) = అందమైన శరీరానికి
ఉపకార ప్రౌఢియే = గొప్ప ఉపకారమే కాని
ప్రవిలేపంబులు = పూత పూసుకొనే సుగంధ ద్రవ్యములు
సొమ్ములు + కావు = ఆభరణములు కావు

భావం : వైభవంలో ఇంద్రుని మించినవాడా! నీతిలో బృహస్పతితో సమానమైన వాడా! ఓ సురభిమల్ల మహారాజా! చెవులకు శాస్త్రపాండిత్యమే అందంకాని, కుండలాలు కాదు. చేతులకు దానమే అందంకాని, కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణం కాని, సుగంధ విలేపనాలు కావు.




ఉ.భూపతికాత్మ బుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!
- మారద వెంకయ్య


ప్రతిపదార్థం:

భాస్కరా = ఓ సూర్య భగవానుడా!
భూపతికిన్ = రాజునకు;
ఆత్మబుద్ధి = తన తెలివి
మదిన్ = మనస్సు నందు
పుట్టనిచోన్ = కలుగకున్న పక్షంలో
ప్రధానులు = (ఆ రాజుగారి) మంత్రులు
ఎంత = ఎంతయో
ప్రజ్ఞాపరిపూర్ణులు = గొప్పబుద్దితో నిండినవారు
ఐనన్ = అయినప్పటికీ
కార్యము = పని
కొనసాగదు = నెరవేరదు;
ఎట్లనన్ = ఎలా అంటే
కార్యదక్షులై = పనులయందు నేర్పరులైన
ద్రోణభీష్మకృప యోధులు ;
ద్రోణ = ద్రోణాచార్యులు
భీష్మ = భీష్ముడు
కృప = కృపాచార్యుడు మొదలయిన
యోధులు = వీరులు;
అనేకులు = అనేకమంది
కూడి = కలసి
కౌరవక్ష్మాపతికార్యము = కౌరవులకు రాజయిన దుర్యోధనుని పనిని; (యుద్ధ విజయాన్ని)
ఏమైనన్ = ఏ మాత్రమైనా
చేయగన్ = చేయడానికి
చాలిరె = సరిపోయినారా? (సరిపోలేదు)

భావం : భాస్కరా! రాజుకు సరైన ఆలోచన పుట్టనపుడు, మంత్రులు ఎంత తెలివి కలవారయినా, కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచనలేని దుర్యోధనుడి పనులను, కార్యదక్షులైన ద్రోణ, భీష్మకృపాచార్యాది మహావీరులు, నెరవేర్పలేక పోయారు కదా!

విశేషము : దుర్యోధనుని పక్షంలో మహావీరులయిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటి వారున్నా, దుర్యోధనుడికి యుద్ధ విజయాన్ని వారు తెచ్చిపెట్టలేకపోయారు.




చం. ధనము, ధనాభిమానము, సదా ధన తృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటే పేదకడు ధన్యుడు, సజ్జనా
ప్తిని శమియించు వెంకటపతీ! అఖిలాండ పతీ! శ్రియఃపతీ!

ప్రతిపదార్థం :

వేంకటపతి
అఖిలాండపతీ = ఓ వేంకటేశ్వరా!
(అఖిల + అండ, పతీ) = ఓ బ్రహ్మాండనాథా!
శ్రియఃపతీ = లక్ష్మీపతీ!
ధనమున్ = ధనమునూ
ధనాభిమానమున్
(ధన + అభిమానమున్) = ధనమునందు అభిమానమునూ
సదా = ఎల్లప్పుడునూ
తృష్ణయున్ = పేరాశయునూ (అనే); (ధనం సంపాదించాలనే కోరికయును)
మూడు దోషముల్ = మూడు దోషాలూ
ధనికునకున్ = ధనవంతుడికి (ఉంటాయి)
అందున్ = ఆ మూడు దోషాలయందు
తొల్తటిది = మొదటిది (అనగా ధనము)
పేదకున్ = బీదవానికి
లేదు = లేదు
అతని = ఆ పేదవాడి
తృష్ణ = ధనముపై పేరాశ
సజ్జనాప్తిని (సజ్జన + ఆప్తిని) = మంచివారితో కూడడం (సహవాసం) వల్ల
శమించున్ = శమిస్తుంది (నశిస్తుంది)
కావునన్ = కాబట్టి
ధనికుని కంటెన్ = ధనవంతుడి కన్నా
పేద = బీదవాడు
కడున్ = మిక్కిలి
ధన్యుడు = ధన్యాత్ముడు

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా, అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.



మత్తేభం. గరమునచ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీ యాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూదినిడనైన్సంధి లేదో ప్రభూ
హర శ్రీ వేములవాడ రాజఫణి హరా! రాజరాజేశ్వరా!
-గౌరీభట్ల రఘురామ శర్మ.

ప్రతిపదార్థం :

ఓ ప్రభూ = ఓ ప్రభువా!
హర = ఈశ్వరా
శ్రీవేములవాడ = సంపత్కరమైన వేములవాడ అనే పుణ్యక్షేత్రంలో వెలసిన
రాజఫణి, హారా = పెద్ద సర్పము కంఠహారంగా కలవాడా?
రాజరాజేశ్వరా = ఓ రాజరాజేశ్వర స్వామీ !
గరమున్ = కాలకూట విషాన్ని
మ్రింగి = మ్రింగి (తిని)
సుజన దుఃఖమ్మున్ = సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని
హరించితిన్ = పోగొట్టాను
అంచున్ = అని
నీ యాత్మలోన్ (నీ + ఆత్మలోన్) = నీ మనస్సులో
మురియంబోకు = సంతోషపడవద్దు
ఈ నరులందున్ = ఈ మనుష్యులందు
ఉండు = ఉండే
విషమ్ము = విషము
సూదిన్ = సూదిని
ఇడనైనన్ = గ్రుచ్చడానికైనా
సంధిలేదు = సందులేదు
ముందు = ముందుగా
మనుష్యదుర్విషమున్ = మనుష్యులలో ఉన్న చెడ్డ విషాన్ని
ఉన్మూలింపుమా = నశించునట్లు చెయ్యి

భావం : సర్పరాజు వాసుకిని కంఠమున ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామీ ! విషాన్ని మ్రింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నీలో నీవు మురిసిపోవద్దు. సూదిమొనకు కూడా చోటు లేనంతగా నిండిపోయిన ఆ మనుష్యులలోని భయంకరమైన విషాన్ని ముందుగా తొలగించు.


సీ||కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు?
తేగీ॥
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు?
వరశుభవిలాస | శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ ! నరసింహ! దివ్యనామ!

ప్రతిపదార్థం :

వరశుభవిలాస;
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారే వాడా!
భవ్యగుణధామ;
భవ్య = శ్రేష్ఠమైన
గుణ = గుణాలకు
ధామ = నిలయమైనవాడా!
‘శ్రీ నింబగిరి నివాస;
శ్రీ = సంపత్కరమైన
నింబగిరి = నింబగిరియందు
నివాస = నివసించేవాడా?
దివ్యనామ = ఇంపయిన పేరుగలవాఁడా?
నరసింహ = ఓ నరసింహస్వామీ
కోడలిన్ = కోడలిని (కొడుకు భార్యను)
కూతురు చందానన్ = తన కూతురునువలె
చూచినన్ = చూచినట్లయితే
మందిరమునన్ = ఇంట్లో
ఘోరముల్ = భయంకరములైన సంఘటనలు (కోడలిని దహనం చేయడం, కొట్టడం, విషాన్ని త్రాగించడం వంటివి)
మండునే = చెలరేగుతాయా ?
కార్మిక జనులన్ = ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను
భాగస్థులుగాన్ = (ఆ) ఫ్యాక్టరీ లాభనష్టాల్లో భాగము కలవారిగా
కాంచన్ = చూస్తే
కర్మశాలన్ = ఫ్యాక్టరీలో
అలజడుల్ = ఆందోళనలు (సమ్మెలు వగైరా)

క్రమ్మునే = వ్యాపిస్తాయా? (జరుగుతాయా?)
దళితులన్ = హరిజనులను
నిజసహోదరులుగాన్ = తన తోడబుట్టినవారిగా
మన్నించన్ = గౌరవిస్తే (ఆదరిస్తే)
జగానన్ = ప్రపంచంలో
ఉత్పాతములు = ఉపద్రవములు
పుట్టునే = కలుగుతాయా ?
పరమతస్థులన్ = = ఇతర మతాలవారిని
తమ వారిగా = తమకు కావలసిన వారిగా (తమ మతంలోని వారిగా)
ప్రేమించన్ = ప్రేమగా చూస్తే
కలహాగ్నులు
(కలహా + అగ్నులు) = కయ్యాలు అనే అగ్నిహోత్రములు
ఆగడములు = దౌష్ట్యములు (అన్యాయాలు)
రేగునే = విజృంభిస్తాయా? (పెరుగుతాయా?)
అఖిల జీవులన్ = అన్ని ప్రాణులనూ
తనవోలెన్ = తనవలెనే (ఆత్మవత్ సర్వభూతాని అన్న విధంగా)
ఆదరింపన్ = ప్రేమగా చూస్తే
ఉర్వియందున్ = భూమండలంలో
ఆపదలు = ఆపత్తులు
ఉద్భవించునే = సంభవిస్తాయా ? (సంభవింపవు)

భావం : నింబగిరిలో విలసిల్లే దేవా! శ్రేష్ఠమైన శుభాలతో ఒప్పేవాడా! అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా! ఓ నరసింహదేవా! కోడలిని కూతురి మాదిరిగా చూస్తే, ఇంట్లో ఘోరాలు సంభవించవు. కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారంలో అల్లర్లు జరుగవు. దళితులను తన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే, ప్రపంచంలో ఉపద్రవాలు పుట్టవు. ఇతర మతస్థులను తనవారిగా ప్రేమతో చూస్తే, కొట్లాటలు, ఆగడాలు పెరగవు. ప్రాణులనందరినీ తనవలె ఆదరంగా చూస్తే, భూమిమీద కష్టాలు పుట్టవు గదా





శా. ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్పుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్థిన్ సల్పుచున్ భవ్యమౌ నాశీర్వాదము నొజచేఁ బడసితానందంగనౌనంచిశాంతంబును నచ్యుతార్చిత 

పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!
-ఇమ్మడిజెట్టి చంద్రయ్య

ప్రతిపదార్థం:

అచ్యుతార్చితపదాబ్జా ;
అచ్యుత = శ్రీమహావిష్ణువు చేత
అర్చిత = పూజింపబడిన
పదాబ్జా (పద + అబ్జా) = పద్మములవంటి పాదములు
చంద్రమౌళీశ్వరా = చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామీ !
ఆశాపాశ నిబద్ధుడై ;
ఆశాపాశ = ఆశలు అనే త్రాళ్ళచే
నిబద = కట్టబడినవాడై
చెడక = చెడిపోక
నిత్యంబు = ఎల్లప్పుడునూ
ఓర్పుతో = సహనముతో
దేశికాదేశంబున్ ;
దేశిక = గురువుగారి యొక్క
ఆదేశంబున్





తలదాల్చి
(తలన్ + తాల్చి) = శిరసావహించి
యోగవిధులు = యోగాభ్యాస విధులు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగ విధులు)
అర్థిన్ = ప్రీతితో
సల్పుచున్ = ఆచరిస్తూ
భవ్యమ్ = అనుకూలమైన
ఆశీర్వాదమున్ = ఆశీస్సును
ఒజ్జచేస్ = గురువుగారిచేత
పడసి = పొంది
(అంచితంబు + ఔ) = ఒప్పియున్న
తాన్ = తాను
అందంగనౌన్ = అందుకోగలడు (సంపాదించగలడు)

భావం : విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వరా! ఆశ అనే పాశముచే బంధింపబడి, చెడిపోకుండా, ఎల్లప్పుడూ ఓర్పుతో గురువుగారి ఆదేశాలను తలదాల్చి, యోగాభ్యాస విధులను ఆచరిస్తూ, గురువుగారి దివ్యమైన ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శ్రేష్ఠమైన శాంతిని
పొందగలుగుతాడు.

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
అ) ధన తృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జ. ధన తృష్ణ అనగా ధన దాహం. ధన సంపాదన కోసం మనుషులు అడ్డదారులు తొక్కుతారు. సత్పురుషుల సాంగత్యం నుండి విడివడుతారు. లంచగొండి తనం పెరగడం, ఆశ్రిత బంధుపక్షపాతం వీటికి కారణాలు.
ధనము పై దురాశ అంత తేలికగా నశించదు. సత్పురుషుల సహవాసం మంచి మాటల వల్ల క్రమంగా ధనము పై దురాశ పోతుంది. సంపాదించినది మనిషి చనిపోయిన రోజు వెంట రాదని తెలియజేయాలి. నీతి నిజాయితీ కీర్తి మాత్రమే విలువ తెస్తాయని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ధన తృష్ణ క్రమక్రమంగా తగ్గిపోతుంది.

ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి?
జ. బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం మనిషికి మిన్న అని చెప్పారు పెద్దలు. చెవులకు శాస్త్ర పాండిత్యం అందాన్ని ఇస్తుంది కానీ బంగారు కుండలాలూ అందాన్ని ఇవ్వవు. బంగారు కడియాల వల్ల చేతులకు అందం రాదు దానధర్మాల వల్లనే సౌందర్యములపడుతుంది. మానవునికి సుగంధ లేపనాలు శోభను ఇవ్వవు. శాస్త్ర పండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.


ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి?
జ. ఆపదలకు కారణం మన ప్రవర్తన.
ప్రవర్తనలో మార్పు వచ్చినట్టయితే ఆపదలు రానే రావు. 
బిడ్డ వలె కోడలిని చూడాలి.
కార్మికులను భాగస్తులుగా పెంచి లాభంలో వాటా ఇవ్వాలి.
దళితులను తమ సహోదరులుగా భావించాలి. 
పరమతస్తులను తన వారివలె ప్రేమించాలి.
జీవులందరికి తన వలె చూసుకుని ప్రేమించాలి.

ఈ) .‘ధనికుని కంటే పేద గొప్ప కదా !’ దీని గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ఉత్పల సత్యనారాయణాచార్య “ధనము, ధనాభిమానము, శ్రియఃపతీ !” అను పద్యంలో ‘ధనికుని కంటే పేద కడు ధన్యుడు” అన్న వారి అభిప్రాయంతో నేను గొంతు కలుపుతున్నాను. ఎందుకంటే ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడు ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. కాని పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కనుక ధనికుని కంటే పేద గొప్ప కదా !

2) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) 'శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, విమర్శిస్తాయి' వివరించండి.
జ. సమాజంలోని ప్రతి విషయం కవిత్వమై ప్రతిబింబిస్తుంది. మంచిని కొనియాడుతుంది. చెడును విస్మరించాలి అని నొక్కి చెబుతుంది. సంఘంలో ఉన్న అనేక దురాచారాలను కవులు ఎత్తిచూపుతారు. శతక పద్యాలలో శతక కవులు మంచి చెడులను ప్రతిబింబంగా చూపుతారు. 
    మన శతక పద్యాలలో దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలోని నాటి సంఘంలోని మనుషులు ఇతరుల సంపాదన ఆశించి ఎలా జీవిస్తున్నారో చెప్పాడు. పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం. అబద్దాలాడడం. వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం. చాడీలు చెప్పడం. హింసను ప్రేమించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. నేటి కాలంలో కూడా ఇవన్నీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
అందె వెంకటరాజం గారు అత్తా కోడళ్ళ పంచాయతీలు. కర్మాగారాల్లో అలజడులు. దళితుల పట్ల అగ్రవర్ణాల చూపే అరాచకాలు. అనేక అంశాలను ఎత్తిచూపారు. ఇది నేటి సమాజాన్ని విమర్శిస్తున్నట్లుగా ఉంది. 
        ఈశ్వరుడు విషయము మింగడం వలన లాభం ఏమీ లేదని కవి పేర్కొంటూ నేటి మనుషులలో అవినీతి, అరాచకం, లంచగొండితనం, దురాచారాల వంటి విషం పెరిగిపోయింది. వాటిని ఈశ్వరుడు మింగితే బావుండును అని విమర్శించాడు.
 కాబట్టి శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. విమర్శిస్తాయి.


3. శతక మధురిమలోని ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక నీతికథను తయారుచేయండి.
జవాబు:
భక్తులే కాదు మనుషులన్న వారెవ్వరైనా పద్ధతిని, నీతిని తప్పకూడదని సర్వేశ్వర శతకపద్యం చెబుతోంది. నీతి, నిజాయితీలు మనిషి ఉన్నతికి దోహదపడతాయనేదే ఈ కథ.

నిజాయితీ

రామాపురంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని, వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు రాజయ్య ఆ అడవిలో నది ఒడ్డునున్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొడుతుండగా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు, మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నించాడు. కాని గొడ్డలి దొరకలేదు. ఎంతో బాధతో భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాడు. తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు.

అతని ప్రార్ధనను విని గంగాదేవి ప్రత్యక్షమై, “ఎందుకు బాధపడుతున్నావు” అని అడిగింది. “తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు” అని బాధపడ్డాడు. ”సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి ?” అని బంగారు గొడ్డలిని చూపించింది. “నాది కాదు తల్లీ !” అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి దేవత వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి?” అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచి “ఇదేనా ?” అన్నది. రాజయ్య సంతోషంతో “అమ్మా ! ఇదే నా గొడ్డలి” అని ఆనందంతో పరవశించాడు.
రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది.
నీతి : నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.


 (లేదా)
పాఠంలోని పద్య భావాల ఆధారంగా విద్యార్థుల్లో నీతి విలువల పట్ల అవగాహన పెంచడానికి ఒక కరపత్రాన్ని తయారు చేయండి.


      

విద్యార్థులు - నీతి నియమాలు

విద్యార్థి సోదరులారా! 

పెద్దలు సూచించిన నీతి నియమాలు పాటిద్దాం. దైవ భక్తి కలిగి ఉందాం. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ర్యాంకుల కోసం, క్రీడల కోసం, తప్పుదారులు తొక్క వద్దు. తోటి విద్యార్థులపై నిందారోపణలు చేసి హింసను ప్రేరేపించకూడదు. దేశభాషలందు వెర్రి తను మంచిది కాదు. విద్య ప్రధానం అలంకారాలు అవసరం లేదు. పరోపకారమే అసలైన అలంకారం తెలుసుకోండి.

మీరు తలపెట్టే కార్యాన్నిసాధించడం కోసం కష్టపడి పని చేయండి మీ ఆలోచన ఆచరణాత్మక రూపకంగా మార్చుకోండి. మన చుట్టూ మనల్ని నిందించే మనుషులు ఎక్కువగా ఉంటారు. వారిని జాగ్రత్తగా గమనించండి. దళితుల్ని సోదరులుగా భావించండి. పరమతల వారిని ప్రేమించండి జీవులందరిని మీలాగే చూసుకోండి పెద్దలపట్ల గౌరవాన్ని పెంపొందింప చేయండి శాంతి సత్యం అహింసలకు ప్రధాన స్థానం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. 

 

ఇట్లు 

విద్యార్థి మిత్రులు.

 

III. భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. ఆపద = కష్టం
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో వ్యవహరించాలి.
ఆ. నిక్కం : అవగాహన చేసుకొని చదివినదే నిక్కమైన చదువు.
ఇ. ఒజ్జ : అన్ని విద్దెలకు ఒజ్జ ఆ బొజ్జగణపయ్య.
ఈ. తృష్ణ : అర్జునుని గెలవాలన్న తృష్ణతో కర్ణుడు పరశురాముని శిష్యుడయ్యాడు.
ఉ. విభూషణము : నెమలి ఈక అదృష్టం ఏమిటంటే శ్రీకృష్ణుని విభూషణం కావడమే.

2. అర్థాలు:

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1.తృష్ణ=దప్పిక

2.సజ్జనుడు: మంచినే కోరుకుంటారు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు: సత్పురుషుడు.

3.“మహి= భూమి 

 4. ఆకసమున శీతభానుడు వెన్నెల కురిపిస్తున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు:చందమామ

 5. అబద్ధములు – అనే అర్థం వచ్చే పదం
జవాబు:మృషలు

6.మంత్రులు – అనే అర్థం వచ్చే పదం
జవాబు. ప్రధానులు

7.కొండెములాడు వానితో స్నేహం వద్దు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు: చాడీలు చెప్పేవాడు

 8.“పరద్రవ్యం” అంటే అర్థం
జవాబు: ఇతరుల సొమ్ము

 9.ఉర్వి అంటే ధరణి అనే అర్థం. ఇటువంటి అర్థం వచ్చే మరొక పదం
జవాబు: భూమి

3. ప్రకృతి వికృతులు గుర్తించండి.
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో అని తెలిసి దోసం చేయడం తప్పు.
  1. దోషం - దోసం
  2. సింహం - సింగం
  3. కార్యము - కర్జము
  4. కలహము - కయ్యం 

1. భాషాంశాలు – వ్యాకరణం
  1. కలహాగ్నులు =  కలహ+అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
  2. వెంకటేశ్వర = వెంకట + ఈశ్వర = గుణ సంధి
  3. కుండల మొప్పు = కుండలము  + ఒప్పు =  ఉత్వ సంధి 
  4. యోధులనేకులు = యోధులు  + అనేకులు = ఉత్వ సంధి 

కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి
  1. కార్యదక్షులు - కార్యమునందు దక్షుడు - సప్తమి తత్పురుష సమాసం 
  2. మూడు దోషాలు - మూడు అయిన దోషాలు - ద్విగు సమాసం 
  3. కర్మశాల - కర్మం కొరకు శాల - చతుర్థి సమాసం 
  4. ఆశా పాశం - ఆశ అనెడి పాశం - రూపక సమాసం



అదనపు సమాచారం:
. వాక్యాలు :
 1.రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు. రామకృష్ణారావు జైలుకు వెళ్ళారు. పై వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే.
జవాబు: రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.

2. పాండవులు అరణ్యవాసం చేశారు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పై వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే...
జవాబు:పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.
3.సామాన్య వాక్యాలు ఏవి ? 
జవాబు:చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
4.“నేను ఈ ఇడ్లీలు చేశాను” అంది హైమ – ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే
A) హైమ అన్నది “నేను ఈ ఇడ్లీలు చేశాను,” అని హైమా అన్నది
జవాబు: తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.