సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

7, ఏప్రిల్ 2022, గురువారం

సమాసములు

 

·          సమాసములు

        

·         అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి

·         ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.

·         సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

·         విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము

·         విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము

·         విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును

·         ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము

·         ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.

·         అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము

·         సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరం - ద్వారక అను పేరుగల నగరం.

·         నఞ్ తత్పురుష సౌకచంకమాసము: అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు '' వర్ణము వచ్చును. ఈ '' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - '' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము

·         ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.

·         బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

·         బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

సమాసపదం

అర్థం

ఏ సమాసం

అనంతం

అంతం లేనిది

నఞ తత్పురుష సమాసం

అర్ధరాత్రి

రాత్రి యొక్క అర్ధభాగము

షష్ఠీ తత్పురుష సమాసం

అసాధ్యము

సాధ్యము కానిది

నఞ తత్పురుష సమాసం

ఆలుమగలు

ఆలును మగడును

ద్వంద్వ సమాసం

ఊతపదాలు

ఊతం కొరకు పదాలు

చతుర్థీ తత్పురుష సమాసం

కంటినీరు

ఠన కంటి యందలి నీరు

సప్తమీ తత్పురుష సమాసం

కనకాభిషేకము

కనకముతో అభిషేకము

తృతీయాఅబ్బ తత్పురుష సమాసం

కుటీరపరిశ్రమ

కుటీరము లోని పరిశ్రమ

సప్తమీ తత్పురుష సమాసం

కులవృత్తులు

కులము యొక్క వృత్తులు

షష్ఠీ తత్పురుష సమాసం

కూరగాయలు

కూరయు, కాయయు

ద్వంద్వ సమాసం

గంగానది

గంగ అను పేరుగల నది

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

గృహప్రవేశము

గృహమునందు ప్రవేశము

సప్తమీ తత్పురుష సమాసం

చంద్రుడు

చల్లనైన కిరణములు కలిగినవాడు

బహువ్రీహి సమాసం

చతుర్ముఖుడు

నాలుగు ముఖములు కలవాడు

బహువ్రీహి సమాసం

చిరునవ్వు

చిన్నదైన నవ్వు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

తల్లిదండ్రులు

తల్లియును తండ్రియును

ద్వంద్వ సమాసం

త్రికరణాలు

త్రి (మూడు) సంఖ్యగల కరణాలు

ద్విగు సమాసం

తెలుగుభాష

తెలుగు అను పేరుగల భాష

నటజ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

దీపావళి

దీపముల యొక్క ఆవళి

షష్ఠీ తత్పురుష సమాసం

నరసింహుడు

సింహము వంటి నరుడు

ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

నల్లకలువ

నల్లనయిన కలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

నవరసాలు

నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు

ద్విగు సమాసం

పరోపకారము

పరులకు ఉపకారము

షష్ఠీ తత్పురుష సమాసం

పార్వతీపరమేశ్వరులు

పార్వతియును పరమేశ్వరుడును

ద్వంద్వ సమాసం

పినాకపాణి

పినాకము పాణియందు కలవాడు

బహువ్రీహి సమాసం

పుట్టినిల్లు

పుట్టినట్టి ఇల్లు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పురుషోత్తముడు

పురుషుల యందు ఉత్తముడు

సప్తమీ తత్పురుష సమాసం

పెనుతుఫాను

పెద్దదైన తుఫాను

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

భూగర్భం

భూమి యొక్క గర్భం

షష్ఠీ తత్పురుష సమాసం

భూలోకము

భూమి అనే పేరుగల లోకము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

మధ్యాహ్నం

అహ్నం యొక్క మధ్య భాగం

షష్ఠీ తత్పురుష సమాసము

మనోవాక్కాయములు

మనస్సును, వాక్కును, కాయమును

బహుపద ద్వంద్వ సమాసం

మానస సరోవరము

మానస అను పేరుగల సరోవరము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ముందడుగు

ముందుకు అడుగు

షష్ఠీ తత్పురుష సమాసం

ముక్కంటి

మూడు కన్నులు కలవాడు

బహువ్రీహి సమాసం

ముల్లోకములు

మూడు అయిన లోకములు

ద్విగు సమాసం

మేఘచ్ఛాయ

మేఘము వంటి ఛాయ

ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం

రక్తపుపోటు

రక్తము యొక్క పోటు

షష్ఠీ తత్పురుష సమాసం

రామలక్ష్మణులు

రాముడును లక్ష్మణుడును

ద్వంద్వ సమాసం

వయోవృద్ధులు

వయస్సు చేత వృద్ధులు

తృతీయా తత్పురుష సమాసం

వాణిజ్యపంటలు

వాణిజ్యము కొరకు పంటలు

చతుర్థీ తత్పురుష సమాసం

విద్యాధనము

విద్య అనెడి ధనము

అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం

వేదాంగాలు

వేదాల యొక్క అంగాలు

షష్ఠీ తత్పురుష సమాసం

శస్త్రచికిత్స

శస్త్రముచే చికిత్స

తృతీయా తత్పురుష సమాసం

సప్తాహాలు

సప్త (ఏడు) సంఖ్యగల అహాలు

ద్విగు సమాసం

సముద్రతీరము

సముద్రము యొక్క తీరము

షష్ఠీ తత్పురుష సమాసం

ప్రత్యయాలు విభక్తి పేరు

డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.

నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అందున్, నన్--- సప్తమీ విభక్తి.

, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి. ...




 

అలంకారములు

 
అలంకారములు
1. శబ్దాలంకారములు
శబ్ద ప్రాధాన్యం గలవి శబ్దాలంకారములు.
1.వృత్త్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడింది.
ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. మరొక్క ఉదాహరణ పద్యంలో గడన గల మగని జూసిన,అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సుమతీ. ఈ పద్యంలో  అనే అక్షరము పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడా శబ్ధాలంకరమునకు మరొక ఉదాహరణ: (అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చింది.
·         ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట.
·         ఉదాహరణ: భీకర కర వికరముల్.
·         హారతి హారతి కి ఇచ్చిరి.
·         నందన నందన నీకు వంద వందనాలు
·         సుందర దరహాస రుచులు.
·         లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము.
·         ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
·         మానవత్వము గలుగు మనిషి మనిషి .
·         తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు .
·         విద్య నభ్యసించు విద్యార్థులు విద్యార్థులు .
·         ప్రభా ధనులు నా కనులలో కనుము కనుము

 

.
·         యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు.
·         ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.
·         ఓ హారికా జోహారికా
·         మనసు భద్రమయ్యే మన సుభద్రకు .
·      
·         ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము.

   లేమా దనుజుల గెలవగ లేమా. 

·         ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
·         మార సుందర, సుందర ధీర మూర్తి, మూర్తి గత లో ప పూజితాంగ, అంగ
·         విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి.

 

·         అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణలు:
1. తోటలో నారాజు తొంగి చేసెను నాడు;
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.

 

2. భాగవతమున భక్తి 
జీవితమున రక్తి.

 

3. భాగవతమున భక్తి, 
భారతంలో యుక్తి, 
రామ కథ యే రక్తి

 

2. అర్థాలంకారములు
అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు. లాగా తెల్లగా ఉంది). 

ఉపమాలంకారము 


 

ఉపమాలంకారము లో నాలుగు అంశాలు ఉంటాయి. అవి 1. ఉపమానము: పోలికగా చెప్ప బడినది. 2. ఉపమేయం: పోల్చబడింది. 3. సమాన ధర్మం: ఉపమేయ ఉపమానాలకున్న సమాన ధర్మాన్ని తెలిపేది . 4. ఉపమా వాచకం: ఉపమేయ సమాన ధర్మాలను కలిపి చెప్పడానికి ఉపయోగించే అక్షరాలు, పదాలు.

(ఓ కృష్ణ నీ కీర్తిి హంసవలె ఆకాశగంగ యందు మునుగు చున్నది). 

(దూడ పాలు తాగుతున్న సేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను పాషాణ దేనువు వలె కదలక నిలిచి ఉన్నది). 

( స్వాతి ముఖం చంద్రబింబము వలె అందముగా వుంది).  

1.    అన్వయాలంకారం: ఉపమానము, ఉపమేయము ఒకటే వస్తువగుచో అది అన్వయాలంకారం. ఉదాహరణ: (రచిత్ రచిత్ వలె అతిలోక సుందరుడు). (రామ రావణ యుద్ధము రామ రావణ యుద్ధము వలె ఉన్నది). (చంద్రుడు చంద్రుని వలె కాంతిలో గొప్పవాడు).
2.    ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం. ఉదాహరణ: (రాజా నీయందు ధర్మము అర్ధము వలెను, అర్థముు ధర్మము వలెను శ్రీమంతులు). (ఆ నరసింహినుకిిిిి ఈ నరసింహ రాయలుు సాటి, ఈ నరసింహ రాయలకు నరసింహుడు సాటి).
3.    ప్రతీపాలంకారం : ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది. ఉదాహరణ: (పద్మముు నీ లోచనము తో సమానం.) (సూర్యుడు నీ ముఖము తో సమానుడు).

 

4.    రూపకాలంకారం : ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.

 

ఉదాహరణలు: 
(ఓ రాజా నీ యశశ్చంద్రిక లు దిగంతాలకు వ్యాపించి ఉన్నాయి)
( మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు) 
(ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.) 
(ప్రజస్వత్ తేనె పలుకులు అందరికీ ఇష్టమే)

 

5.    పరిణామాలంకారం : ఉపమానము ఉపమేయముతో తాదాత్మ్యమును పొంది క్రియను నిర్వహించిన అది పరిణామాలంకారం.
6.    ఉల్లేఖాలంకారం : ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం. ఉదాహరణలు:(ఆ రాజు ప్రజల చేత దేవుని గాను, యాచకుల చేత కల్ప వృక్షము గాను, విరోధుల చేత రౌద్రుని గాను చూడ బడుతాడు.) (శరత్ వక్తృత్వ మునందు బృహస్పతి, కీర్తి యందు అర్జునుడు, విలువిద్య యందు భీష్ముడునాడు)
భ్రాంతిమద అలంకారం : ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమద అలంకారం. ఉదాహరణ:(ఆ మేక ఈ రైతు ని కసాయివాడని అనుకొని,భయం తో అక్కడి నుండి పారిపోయింది. )
7.    సందేహాలంకారం : సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం. ఉదాహరణ:(ఈమె ముఖము పద్మమో చంద్రుడో నిిశ్చయములేదు.)
ఉత్ప్రేక్షాలంకారము : ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం. ఉదాహరణలు: ( ఆ యేనుగు నడిచే కొండా అనిపించుచున్నది). (చీకటిలో నీడను చూసి దెయ్యం ఏమో అనుకున్నాను). (దూరముగా ఉన్న తాడుని చూసి పాము ఏమో అని భయపడ్డాను.)
8.    అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
9.    దీపకాలంకారం : ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
10. ప్రతివస్తూపమాలంకారం : రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
11. దృష్టాంతాలంకారము : రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం. ఉదాహరణలు:( ఓ రాజా నీవేే కీర్తిమంతుడు చంద్రుడే కాంతి వంతుడు)( సత్య పురుషుడు తననెవరూ కోరక పోయిన మేలుు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. కలువలను వికసింప చేయమని చంద్రుని ఎవరు ప్రార్థిస్తారు)
12. నిదర్శన
13. వ్యతిరేకాలంకారం : ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
14. శ్లేషాలంకారము : అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం. ఉదాహరణ: మానవ జీవితం సుకుమారం. 1)మా నవ జీవితం సుకుమారమైనది మనవ జీవితం సుకుమారమైనది 2) మీ  సంగతి ఏమిటి?    మీసం గతి ఏమిటి? 3)గురూజీ వనం బాగుందా? గురూ జీవనం బాగుందా? 4) మాట  మాట పెరిగింది.    మా  టమాట పెరిగింది. 5)ఆహారం చూడు ఎంత బాగుందో! ఆ హారం చూడు ఎంత బాగుందో! 6)మాతా తమరు నిమిషంలో చేరారు.     మా తాత మరునిమిషంలో చేరారు. 7)నావ లతలపై పడింది.   నా వల తలపై పడింది. 8)ఆమె కవితలతో జీవనం చేయును.   ఆమె కవి తలతో జీవనం చేయును. 9)మాతా  మరను పట్టుకో.   మా తామరను పట్టుకో.
15. అప్రస్తుత ప్రశంసాలంకారం : ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
16. వ్యాజస్తుతి అలంకారం : పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.ఉదాహరణలు:(ఓ గంగా పాపాత్ములను కూడా స్వర్గమునకు చేర్చు నీకు వివేకము లేదు) ( ఓ ధూ తిక, బాగు బాగు! నా కోసం నీవు దంతాల చేత, గోర్ల చేత గాయాలు పొందావు. ఇంతకంటే ఏమి చేయగలవు.) దూది కాక
17. వ్యాజనిందాలంకారం : నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
18. విరోధాభాసాలంకారం : విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.
19. విశేషోక్తి అలంకారం : సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
20. విషమాలంకారం : అనను రూపాలయిన (సమాలు కాని)
21. సారాలంకారం : పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
22. యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
23. కావ్యలింగాలంకారం : సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
24. అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం. ఉదాహరణలు: (శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యము కానిది లేదు కదా!) ( ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాద లేపనము కరిగిపోవడం తెలియలేదు దైవ కృతము నకు అసాధ్యం లేదు కదా.)
25. తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
26.    లోకోక్తి అలంకారం : సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
27. ఛేకోక్తి అలంకారం : లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
28. వక్రోక్తి అలంకారం : శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
29. స్వభావోక్తి అలంకారం : జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం. ఉదాహరణలు:( శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడె పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో, గొప్ప హుంకార ముతో, గర్జిస్తూ ఉన్నాడు.)
30.       ఉదాత్తాలంకారం : సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.

x