సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

7, ఏప్రిల్ 2022, గురువారం

సమాసములు

 

·          సమాసములు

        

·         అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి

·         ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.

·         సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

·         విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము

·         విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము

·         విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును

·         ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము

·         ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.

·         అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము

·         సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరం - ద్వారక అను పేరుగల నగరం.

·         నఞ్ తత్పురుష సౌకచంకమాసము: అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు '' వర్ణము వచ్చును. ఈ '' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - '' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము

·         ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.

·         బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

·         బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

సమాసపదం

అర్థం

ఏ సమాసం

అనంతం

అంతం లేనిది

నఞ తత్పురుష సమాసం

అర్ధరాత్రి

రాత్రి యొక్క అర్ధభాగము

షష్ఠీ తత్పురుష సమాసం

అసాధ్యము

సాధ్యము కానిది

నఞ తత్పురుష సమాసం

ఆలుమగలు

ఆలును మగడును

ద్వంద్వ సమాసం

ఊతపదాలు

ఊతం కొరకు పదాలు

చతుర్థీ తత్పురుష సమాసం

కంటినీరు

ఠన కంటి యందలి నీరు

సప్తమీ తత్పురుష సమాసం

కనకాభిషేకము

కనకముతో అభిషేకము

తృతీయాఅబ్బ తత్పురుష సమాసం

కుటీరపరిశ్రమ

కుటీరము లోని పరిశ్రమ

సప్తమీ తత్పురుష సమాసం

కులవృత్తులు

కులము యొక్క వృత్తులు

షష్ఠీ తత్పురుష సమాసం

కూరగాయలు

కూరయు, కాయయు

ద్వంద్వ సమాసం

గంగానది

గంగ అను పేరుగల నది

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

గృహప్రవేశము

గృహమునందు ప్రవేశము

సప్తమీ తత్పురుష సమాసం

చంద్రుడు

చల్లనైన కిరణములు కలిగినవాడు

బహువ్రీహి సమాసం

చతుర్ముఖుడు

నాలుగు ముఖములు కలవాడు

బహువ్రీహి సమాసం

చిరునవ్వు

చిన్నదైన నవ్వు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

తల్లిదండ్రులు

తల్లియును తండ్రియును

ద్వంద్వ సమాసం

త్రికరణాలు

త్రి (మూడు) సంఖ్యగల కరణాలు

ద్విగు సమాసం

తెలుగుభాష

తెలుగు అను పేరుగల భాష

నటజ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

దీపావళి

దీపముల యొక్క ఆవళి

షష్ఠీ తత్పురుష సమాసం

నరసింహుడు

సింహము వంటి నరుడు

ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

నల్లకలువ

నల్లనయిన కలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

నవరసాలు

నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు

ద్విగు సమాసం

పరోపకారము

పరులకు ఉపకారము

షష్ఠీ తత్పురుష సమాసం

పార్వతీపరమేశ్వరులు

పార్వతియును పరమేశ్వరుడును

ద్వంద్వ సమాసం

పినాకపాణి

పినాకము పాణియందు కలవాడు

బహువ్రీహి సమాసం

పుట్టినిల్లు

పుట్టినట్టి ఇల్లు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పురుషోత్తముడు

పురుషుల యందు ఉత్తముడు

సప్తమీ తత్పురుష సమాసం

పెనుతుఫాను

పెద్దదైన తుఫాను

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

భూగర్భం

భూమి యొక్క గర్భం

షష్ఠీ తత్పురుష సమాసం

భూలోకము

భూమి అనే పేరుగల లోకము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

మధ్యాహ్నం

అహ్నం యొక్క మధ్య భాగం

షష్ఠీ తత్పురుష సమాసము

మనోవాక్కాయములు

మనస్సును, వాక్కును, కాయమును

బహుపద ద్వంద్వ సమాసం

మానస సరోవరము

మానస అను పేరుగల సరోవరము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ముందడుగు

ముందుకు అడుగు

షష్ఠీ తత్పురుష సమాసం

ముక్కంటి

మూడు కన్నులు కలవాడు

బహువ్రీహి సమాసం

ముల్లోకములు

మూడు అయిన లోకములు

ద్విగు సమాసం

మేఘచ్ఛాయ

మేఘము వంటి ఛాయ

ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం

రక్తపుపోటు

రక్తము యొక్క పోటు

షష్ఠీ తత్పురుష సమాసం

రామలక్ష్మణులు

రాముడును లక్ష్మణుడును

ద్వంద్వ సమాసం

వయోవృద్ధులు

వయస్సు చేత వృద్ధులు

తృతీయా తత్పురుష సమాసం

వాణిజ్యపంటలు

వాణిజ్యము కొరకు పంటలు

చతుర్థీ తత్పురుష సమాసం

విద్యాధనము

విద్య అనెడి ధనము

అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం

వేదాంగాలు

వేదాల యొక్క అంగాలు

షష్ఠీ తత్పురుష సమాసం

శస్త్రచికిత్స

శస్త్రముచే చికిత్స

తృతీయా తత్పురుష సమాసం

సప్తాహాలు

సప్త (ఏడు) సంఖ్యగల అహాలు

ద్విగు సమాసం

సముద్రతీరము

సముద్రము యొక్క తీరము

షష్ఠీ తత్పురుష సమాసం

ప్రత్యయాలు విభక్తి పేరు

డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.

నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అందున్, నన్--- సప్తమీ విభక్తి.

, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి. ...




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...