సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, మే 2026, ఆదివారం

కాలాన్ని మరువని నల్లాల కథలు

దళిత కథలలో విస్మృతికి గురైన కథలు నల్లాల లక్ష్మీరాజం గారివి. ప్రధానంగా దళిత కథలలో ఎక్కడ వారి కథ ప్రచురించ బడకపోవడం,వారి గురించి వారి కథల గురించి చర్చించకపోవడం విశ్లేషించకపోవడం బాధాకరం.గొప్ప కథలు రచించిన నల్లల లక్ష్మీరాజు తిరుగు ప్రయాణం కథలపై నా విశ్లేషణ.
ప్రచురించిన తొలి వెలుగు పత్రిక తేది. 24.05.2026 నప్రచురితమైంది తొలివెలుగు యాజమాన్యం,సంపాదకులు, మధుకర వైద్యులు అన్న గారికి పేరుపేరునా జై భీమ్ లు
///////////////////////

నల్లాల లక్క్ష్మిరాజం ‘తిరుగులేని ప్రయాణం’  విస్మృత కథకులు నల్లాల లక్క్ష్మిరాజం జగిత్యాల జిల్లాలోని తక్కెళ్లపల్లిలో రాజవ్వ, రాజయ్యల దంపతుల సంతానముగా తేది: 05.10.1970న జన్మించారు. వీరిది మాల కులం. కష్టపడుతూ చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ప్రచారాన్ని కోరుకోలేదు. తన పనిలో నిమగ్నమయ్యే వ్యక్తిత్వం కలవారు. వీరి కథలు ‘మÖడుతరాల తెలంగాణ కథ’, ‘తెలంగాణ దళిత కథలు’లో లేవు కాబట్టి విస్మృత కథకుడిగా చెప్పుకోవచ్చు.  వీరు రచించినవి ఎనిమిది కథలు మా(తమే తన కాలాన్ని నిక్షిప్తం చేశాడు. తన కథా సంపుటి పేరు ‘తిరుగు ప్రయాణం’. లక్క్ష్మిరాజం తొంభై దశకంలోని కల్లోలాన్ని తన కథల్లో ఇముడ్చుకున్నారు. పోలీసు కావడం వలన పోలీసు దృక్పథం, పోలీస్ నేపథ్యంతో వారి కథలలో కనబడుతుంది. దొరల పెత్తనాలు, అణిచివేతలు, అక్రమాలు దర్శనమిస్తాయి. 

  నక్సల్బరీ ఉద్యమానంతరం అటు ఊరిని శాసించే దొరలో, దొర అంటే భయపడే రాజేష్‌లో భయోత్పాతాన్ని చిత్రించిన  కథ ‘తిరుగు ప్రయాణం’. భయం వల్ల ఇరువురి జీవితాలు ఎంత అతులాకుతులం అయ్యాయో తెలియజేస్తుంది. దొర తన జీతగాడైన రాజేష్‌ని కొట్టడం వల్ల నేను అన్నలకు చెప్పుతనని రాజేష్ బెదిరిస్తూ వెళ్లిపోతాడు. అదే రోజు పక్కూరి దొర రాజగోపాల్‌రావు దొరను చంపిన అన్నలు నన్ను ఏం చేస్తారో అని తెలియక రాత్రకి రాత్రే పట్టణానికి పారిపోతాడు. కొన్నాళ్లకు దొర హైద్రాబాద్ నుండి ఊరికి పోతుండగా దాహమేసి భయంతో రోడ్డు పక్కన హోటల్లోకి వెళుతాడు. అక్కడున్నది రాజేష్. నీళ్లిచ్చి పరస్పరం పలకరించుకుంటారు. చర్చించుకుంటారు. నేను ఆ రోజు నేను అన్నలకు చెప్పలేదనీ, ఊరికి ఉత్తరం రాస్తే మీరు వస్తారనీ భయపడ్డాను. ఊరు మీదకే పాణం గుంజుతుందనీ, వెళ్లాలనీ ఉందని రాజేష్ చెబుతాడు. ఈ పట్టణంలో మనుషులు యంతాల్ల ఉన్నారనీ నాకు ఊరికి పోవాలని ఉందనీ దొర చెబుతాడు. బతుకమ్మ పండుగ రోజు ఇద్దరు కలిసి వెళతారు. తాను ఊరిలో ఉండననీ, మీరు ఊరిలో ఉంటే మంచిదని దొరకు రాజేష్ చెబుతాడు.  ఇద్దరు ఊరి గురించి చర్చించుకుంటారు. ఊరికి కొద్దిదూరంలో రాజేష్ అమ్మమ్మ చెల్లెలు కలుసుకున్నాడు. ‘దొర (దొరను ఊరిడ్సేలా చేసిన రాంరెడ్డి పటేల్)ను రాత్రి ఎవరో చంపారట. ఊల్లె దొరలు ఎవరూ లేరు. బొంబాయికి దెంకపోయిండు’ అని చెప్పగానే ఊల్లెకు పోతే నిన్ను పోలీసులు పట్టుకపోతరు. ఈ దొరను వెళ్లగొట్టిన రాంరెడ్డి పటేలే దొర. దొరయి అన్నీ అక్రమాలే. అన్నలు చంపిండ్రు. ఊరు ఉడుకుతుంది. “పో బిడా!్డ ఎక్కడన్నా మంచిగా బత్కుపో” అంది ముసలమ్మ. రాజేష్, దొర వెనక్కి తిరుగు ప్రయాణమవుతారు.
 విప్లవోద్యమం వల్ల గ్రామాల్లో దొరల ఆధిపత్యం క్షీణించి భయం ఇరువురిలో పెరిగింది. పీడితులకు ధైర్యం, పీడకులకు ఆందోళన వచ్చింది. హత్యలు, అస్థిరత వల్ల ప్రజలు పట్టణాలకు వెళ్లారు. దొర, రాజేష్ మధ్య మానవత్వం పెరిగినా భయం కొనసాగింది. తిరుగు ప్రయాణం ఆ కాలపు అనిశ్చితి, మార్పును ప్రతిబింబిస్తుంది.

చదువుకు ఆటంకాలు సృష్టిస్తున్న పరిస్థితులను అధిగమించి కొడుకును చదివించిన రాజవ్వ జీవితమే నల్లాల లక్క్ష్మిరాజం ‘రాజవ్వ కొడుకు’. పటేళ్లు దేవయ్యను వెటకారంగా చూస్తరు. ఝండా వందనం నాడు బహుమతి ఇవ్వడానికి తటపటాయిస్తే చేతులోంచి గుంజుకుంటడు. ఒక్కటికి నాలుగు చెప్పి తండ్రి బాగా కొట్టేల పురికొల్పుతరు. కొడుకును, తల్లిని రాజనర్సు కొడుతడు. దేవయ్యను మెచ్చుకున్న ఉపాధ్యాయుడు ‘దొరలకు పాలేర్లు దొరుకర భయం కావొచ్చు. ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు. దేవయ్య మంచివాడు”అని చెప్పిండు. భర్తను ఒప్పించింది. దేవయ్యను జగిత్యాల హాస్టల్ల జాయిన్ చేసింది. ఫస్టు క్లాస్‌లో పాసయిండు. రాత్రిళ్లు పనులు చేస్తూ చదువుకున్నడు. వకీలు అయ్యిండు. రిజర్వు కేటగిరి సర్పంచ్ అయ్యిండు. ఝండా వందనం నాడు అనర్గళంగా ప్రసంగించాడు. సమావేశమయ్యాక రాజనర్సు దారెంట వెళ్లుతుంటే రాజేశ్వరరావు కూసుండే గద్దెవైపు చూసా ఉమ్మి వేస్తూ నడవసాగాడు. 

కులం ఎలా శిక్షిస్తుందో, ఎలా హత్యచేసుకునే పరిస్థితులు కల్పిస్తుందో, ధ్వంసం చేస్తుందో తెలిపే కథ ‘దొమ్మరి గంగడు’. దొమ్మరులు వేశ్యావృత్తికి, జిమ్నాస్టిక్స్‌కి, దొంగతనానికి పెట్టింది పేరు. వాటినుండి బయట పడడానికి రైస్ మిల్లులో పనిచేస్తాడు. యజమాని దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసుల లెక్క ప్రకారం పెద్దదొంగగా రికార్డుల్లో నమోదు చేశారు. గంగని పెద్దకూతురు సరోజ వ్యభిచార వృత్తిలో కొనసాగుతూ హెచ్ఐవీ సోకి చనిపోతుంది. బడిలో క్లాస్‌మేట్ ఒకడు గోపితో మీ అక్క దగ్గరికి వస్తున్నరా? అన్నాడు. నేను కూడా మీ అక్కవద్దకు అలానే వస్తున్నరా అంటాడు. పెద్ద గొడవ జరిగి బడిమానివేస్తాడు. చిన్న కూతురు వ్యభిచార వృత్తిచేయనని మొండికేసి లారీ డ్రైవర్‌తో లేచిపోతుంది. “నాతో దొంగతనానికి రాకపోతే మీ అమ్మను పొడిచి, నేను చస్త.” అని తండ్రి బెదిరిస్తే గోపి తన తండ్రితో దొంగతనానికి వెళతాడు. దొంగతనం చేసిన డబ్బును చేతిలో పెట్టి “ఈ డబ్బు సంచితో దూరంగా పారిపో” అని గంగడు తలనరుక్కుంటాడు. కర్మకాండలలో గంగని స్థానంలో గోపిని కేసులలో రికార్డు చేస్తమనుకునే పోలీసుల ఎత్తులను చిత్తుచేస్తూ దొరకకుండా గంగలో గంగని ఎముకలు కలుపుతాడు. కొన్నాళ్లకు వృద్ధిలోకి వచ్చి దొమ్మరికాలనీ పాఠశాల స్థాపించి ఎమ్మెల్యేతో ప్రారంభించి తానే ఉపాధ్యాయుని మారిపోతాడు. అననుకూల పరిస్థితులలో అభ్యుదయం వైపు పురోగమించాలో తెలుపుతుంది.

ఏది విత్తుతమో అదే కోస్తము అని చెప్పినట్లుగా అక్రమసంబంధాల ఫలితాలు, పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలిపే కథ ‘మా ఊరి ముచ్చట్లు’. శాంతమ్మ, చుక్కారెడ్డిలు పట్టుపడ్డారు. ఇద్దరినీ కొడుదామని చూస్తున్నప్పుడు శాంతమ్మ భర్త నర్సయ్య “నా పెండ్లాం నా ఇష్టం. నడుమ మీకేంది?” నర్సయ్యను తిట్టుకుంటూ ఎక్కడోల్లు అక్కడ పోతరు. రిజర్వేషన్ కేటగిరి కింద శాంతమ్మను ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండ్రు. అధికారం చుక్కారెడిది. ఇద్దరు ఆలుమొగలులా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండ్రు. వాడ ఆడోళ్లను తిరస్కార భావంతో చూసేది. మీరు నన్ను సర్పంచ్ చెయ్యలే. మీతో నాకవసరం లేదని శాంతమ్మ అనేది. చుక్కారెడ్డి భార్య మంగమ్మ జీతగాడు బుచ్చన్నతో చాటుమాటున పక్క సుఖం పొదుతుంది. ‘మాలమాదిగి జాతి చిల్లరజాతి. సిగ్గెక్కడిది? మానం ఎక్కడిది? అని తిడ్తుండేది.  చుక్కారెడ్డి దంపతులకు పరస్పర రహస్యాలు తెలుసు. మిగతా జీతగాళ్లకూ, ఊరోల్లకూ తెలుసు. ఎప్పటోల్నే బుచ్చిగా అని పిలుస్తుంటది. చుక్కారెడ్డి కూతురు రజిత, శాంతమ్మ కొడుకు శంకరి ని ప్రేమించి వంకర తొవ్వలు తొక్కి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అది తెలిసిన చుక్కారెడ్డి వీర రౌద్రుడై ‘ఆ లంజెకొడ్కు ఎటువొయిండు ?, బతుకనియ్యము. చెప్పు.’ అని తిడుతండు. కోర్టుల పెండ్లి చేసుకున్నరు. ఊరంతా ఇవే ముచ్చట్లు... 

అత్త పెట్టే హింసను భరించలేని చెల్లెలు, చెల్లెలు అత్త అయ్యాక బిడ్డకోసం బాధపడ్డ బాధ్యతాయుత త్యాగాన్ని తెలిపే కథ ‘పునరావృతం’ అత్తింటి భరించలేక ఇల్లు చేరిన చెల్లెలు బాధను చూడలేని అన్న, జాగ అమ్మి కట్నకానుకల కోసం జాగ అమ్మి చెల్లించడానికి సిద్ధపడ్డడు. నా కోసం మీరేమి త్యాగం చెయ్యొద్దని చెబుతున్నా అన్న వినలేదు. కట్నకానుకలని పోసి చెల్లెలు సంసారం నిలబెట్టాడు. ఇరువై ఏళ్ల తర్వాత అల్లునికి కొలువు వచ్చింది. బిడ్డను ఇస్తనని పోయినప్పుడు తొంభైవేలు ఇస్తే ఖాయం లేకుంటే లేదని చెల్లెలు ఖరాకండిగా చెబుతుంది. ఒప్పుకొని వచ్చి భార్యకు వివరిస్తాడు. పెరడు, ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామని చర్చించుకుంటున్నప్పుడు ఆ మాటలు విన్న నా కోసం మీరేం త్యాగం చేయొద్దనీ చెబుతున్నా వినని తండ్రి(నాటి అన్న) అన్నింటిని బేరం పెడుతాడు. చరిత్ర పునరావృతం అవుతుందని ఆలోచించుకుంటాడు. 

కర్తవ్యం కన్నులు మూసుకుని పేల్చిన తుపాకి గుండ్లు గురితప్పి ఓ అమాయకున్ని.... సిద్ధాంతం శృతి తప్పి భ్లాస్టింగై కర్తవ్య పరున్ని బలితీసుకోగా అభిమానమే ఆకాశమంత ఎత్తు ఎదిగిందని వివరించిన నల్లాల లక్క్ష్మిరాజం కథ ‘పడగనీడలో పావురాలు’ నీతి నిలువెత్తుగా విధి నిర్వహణ చేసే ప్రకాశ్ అందరి ఆదరాభిమానాలు పొందాడు. పత్తాలాడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తమ్మున్ని ప్రేమించే అన్నను తమ్ముడే కొట్టిండు. వస్తున్న పోలీసులను చూసి అటక మీద దాచి పెట్టాడు. ‘వద్దు సార్. వాడు అమాయకుడు. నన్ను పట్టుక పోండ్రి సార్. తాగి కొట్టిండని తప్పైందనిపించాడు తమ్మునితో..’ ఎన్నో తీర్ల బతిమాలిండు రాజయ్య. రాజయ్య కానిస్టేబుల్ ప్రకాశ్‌కి కోడిని కోసుకొమ్మని ఇచ్చిపోయిన తెల్లారి చనిపోయిండు. పక్కూర్ల ఉన్న చిన్నవ్వ ఇంటికి పోయిండు. బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేశారు అన్నలు. పోలీసులు వచ్చి కాల్పులు జరిపారు. రాజయ్య గడ్డివాములో దాక్కున్నారు. పోలీసు గుండ్లు దూసుకెళ్లాయి. చూడడానికి పోతున్న ప్రకాశ్‌ను అందరు ఆడిపోసుకుంటున్నా ముందుకే వెళుతున్నాడు. అప్పుడప్పుడు ప్రకాశ్ పరామర్శించడం వలన పోచయ్య కోలుకున్నాడు. ఓటు నిర్భయంగా వేయాలని చెప్పి వస్తుండగా మందుపాతరలు పేలి ముక్కముక్కలయ్యిండు. గూడెం అంతా ఏడిసింది. సార్‌ని పోషయ్య మా గూడెంలోనే దహనం చేస్తామని చెప్పారు. ఓదార్చిండ్రు.

 ‘భలే బామ్మర్ది’ కథలో హస్యంతో ఆత్మీయత పుష్కలంగా పండించాడు.
మిరిగుడ్లు, పుండాకోరాడా!, కుదపెట్టుడు, ఇడ్సిపెడ్తం, దెంకపోయిండ్రు లాంటి జగిత్యాల పలుకుబడులు రికార్డు చేసిండు. శీలం కంటే కులం గొప్పదేమో! ఏమో!, “విశ్వాసం నాకెందకు లేదు బావ నా మీదికేయి కుక్క గూడ వేస్తే” అని వ్యంగం పండిస్తాడు. సమాజాన్ని చిత్రిక పట్టిన కథల రాజసం ఒలలాడే తిరుగులేని పయనమే ‘తిరుగులేని ప్రయాణం’. తెలుగు సాహిత్యం స్మరించదగిన కథలు అందించిన లక్క్ష్మిరాజంకి పోలీస్ సెల్యూట్‌లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి