"నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర
ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి"
అంటూ డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారు, భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలై... సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మరీ మనముందు నిలుపుతుంది. విశ్వంభర.
ఈ కావ్యానికి తెలంగాణ నేల నుంచి తెలుగు మొత్తం వట్టి జ్ఞానపీఠఅవార్డు తెచ్చిన సృజనశీలి
#మరణం_నను_వరించి_వస్తే ఏమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను...
లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను
తిరుమల గిరి హుండీలో జొరబడమంటాను...
కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను
అలిగి వున్న పడుచు జంటతో కలబడమంటాను...
క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను
పస చచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను...
లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను
తెగ వొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను....
అహంకార మెదురై వస్తే ఏమంటాను నేనేమంటాను
నరుని వదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను....
కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను
దిగులెందుకు ఓయి సినారె తెగబడమంటాను.
______
ఏ హరివిల్లు విరబూసినా....నీ దరహాసమనుకొంటినీ...
ఏ చిరుగాలి కదలాడినా.....నీ చరణాల శృతి వింటిని...
నీ ప్రతిరాకలో...ఎన్ని శశిరేఖలో....
నిను చూడక నేనుండలేను......
___________
నవ్వని పువ్వు,
వెన్నెల వాడ,
జలపాతం,
ఋతుచక్రం,
దివ్వెల మువ్వలు,
మంటలు- మానవుడు,
నాగార్జున సాగరం,
కర్పూర వసంత రాయలు,
విశ్వంభర.....మొదలైన 80 కి పైగా గ్రంధాలు రచించారు
తెలంగాణ సిరిసిల్ల జిల్లా అనుమాజీపేట జిల్లాలోని గ్రామమైన హనుమాజీ పేటలో 1931వ సంవత్సరం, జూలై 29వ తేదీన జన్మించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ
ఆధ్వర్యంలో
సి. నారాయణ రెడ్డిగారి జయంతి కార్యక్రమం
తేది. 29.07.2025 న
రవీంద్రభారతి హైద్రాబాద్ లో కవిసమ్మేళనం
అవకాశం కల్పించిన తెలంగాణ సాహిత్య అకాడమీ
కార్యదర్శి నా మోజు బాలాచారి గార్కి
తిరుపాల్ గారి కృతజ్ఞతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి