సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

23, ఫిబ్రవరి 2023, గురువారం

net / setతెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌

నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌ 


1. ఖండ కావ్య ప్రక్రియకు ఆద్యుడు ఎవరు?
1) కందుకూరి 2) గురజాడ 3) రాయప్రోలు 4) చిలకమర్తి

2. ‘హిత సూచిని’ ఏ ప్రక్రియకు సంబంధించింది?
 1) ప్రహసనం 2) వ్యాసం 3) ఏకాంకిక 4) కథ

3. తుది వర్ణానికి ముందున్న వర్ణం?
1) ఉత్తమం 2) ఉపోత్తమం 3) ఉపధ 4) సంహిత

4. ‘నింద్య గ్రామ్యం’కు ఉదాహరణ?
1) ప్రాణగొప్పము 2) మృతకప్ప 3) కపిల కన్నులు 4) జీవగర్ర

5. ‘ఆధారం’ ఎన్ని రకాలు?
1) 2 2) 3 3) 4 4) 5

6. ప్రత్యాయాలను గురించి వివరించే పరిచ్ఛేదం?
1) తద్ధిత 2) ఆచ్ఛిక 3) క్రియ 4) కృదం

7. ‘టమోటా’ ఏ భాషా పదం?
1) ఆంగ్లం 2) పోర్చుగీసు  3) తమిళం 4) కన్నడం

8. తెలుగుభాషకు మూల లిపి?
1) ఖరష్ఠీ 2) చిత్ర 3) దక్షిణబ్రహ్మీ 4) పైవన్నీ

9. మధ్య ద్రావిడ భాషలెన్ని?
1) 3 2) 8 3) 12 4) 10

10. సాంఘిక విమర్శలకు ఆద్యుడు?
1) టైనీ 2) అరిస్టాటిల్‌ 3) ఇలియాట్‌ 4) కాలరిడ్జ్‌

11. ‘రఘువంశం’ కర్త?
1) భారవి 2) కాళిదాసు 3) భానుడు 4) మాఘడు

12. ‘నా కథలు’ పేరుతో పద్యాలలో స్వీయ చరిత్ర రాసుకున్నదెవరు?
1) త్రిపురనేని 2) తుమ్మల 3) బోయి భీమన్న 4) బుచ్చిబాబు

13. ‘తెలుగు భారతి’ పురస్కారాన్ని 2010 ఏప్రిల్‌ 1న పొందింది ఎవరు?
1) భద్రిరాజు కృష్ణమూర్తి 2) చేకూరి రామారావు 3) ఇనాక్‌ 4) రవ్వా శ్రీహరి

14. తెలుగు భాషా దినోత్సవం?
1) ఆగస్టు 29 2) ఫిబ్రవరి 21   3) మే 28  4) ఆగస్టు 8

15. ‘కవిత్వాన్ని జీవిస్తాను -జీవితాన్ని కవిత్వీకరి స్తాను’ అన్న కవి?
1) సినారె 2) తిలక్‌ 3) పాపినేని శివశంకర్‌ 4) శివరామకృష్ణ

16. ‘తాళి కట్టిన మృగం’అని కళ్ళెర్రజేసిన స్త్రీవాద కవయిత్రి?
1) మందర, హైమావతి 2) ఓల్గా 3) తుర్లపాటి రాజేశ్వరి 4) హైమావతి

17. ‘కవిత్వానికి జీవితానిచ్చి ఆయుధం చేయాలన్న’ కవి?
1) శ్రీమన్నారాయణ 2) అఫ్సర్‌ 3) త్రిపురనేని శ్రీనివాస్‌ 4) శ్రీనివాసాచార్య

18. ‘ స్త్రీవాద కథలు’ ప్రధాన సంపాదకుడు?
1) కె.లక్షీనారాయణ 2) ఆర్‌.చంద్రశేఖర రెడ్డి 3) జయధీర్‌ తిరుమలరావు 4) వేదగిరి రాంబాబు

19. ఆంధ్ర వాజ్మయంలో ప్రత్యేకమైన ప్రక్రియ?
1) పురాణం 2) ఇతిహాసం 3) కథ 4) ఉదాహరణం

20. ‘యక్షగానం’ ఏ కవితా శాఖకు చెందింది?
1) ఆశు 2) మధుర 3) చిత్ర 4) విస్తర

21. ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అని పలికిన కవి?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) శ్రీనాథుడు

22. శ్రీనాథుని రచన అంకితం పొందిన బంధువు?
1) వీరభద్రారెడ్డి 2) ముమ్మడి శాంతయ్య
3) బెండపూడి అన్నయామాత్యుడు 4) మామిడి సింగన

23. ‘సీమ కథ’లెవరివి?
1) నగ్నముని 2) భానుమతి రామకృష్ణ
3) సింగమనేని నారాయణ 4) వాసిరెడ్డి సీతాదేవి

24.‘పురాణ వైర గ్రంధమాల’ పేరుతో భారతీయ చరిత్రకు కొత్తరూపు కల్పించడానికి, కొన్ని చారిత్రక 
సత్యాలు వెలికి తీసే ప్రయత్నంగా నవలలు రాసి సంచలనం కలిగించిందెవరు?
1)చలం 2) విశ్వనాథ సత్యనారాయణ 3) బుచ్చిబాబు 4) గోపీచంద్‌

25.చలం మొదటి నవల?
1) జీవిత ధర్మం 2) అమీనా
3) శశిరేఖ 4) మైదానం

26.భరతుడు పేర్కొన్న అలంకారాల సంఖ్య?
1) 4 2) 80 3) 100 4) 108

27. కావ్య హేతువులుగా ప్రధానంగా పరిగణించిన వెన్ని?
1) 3 2) 4 3) 5 4) 6

28. ఒకొక్క పద్యానికి ఒకొక్క నక్షత్రం పేరు వచ్చే టట్లుగా ఇరవై ఏడు పద్యాలు రాసినట్లయితే దానిని 
ఏ పేరుతో పిలవవచ్చు?
 1) భాస్కరమాలిక 2) వారణమాల
3) తారావళి 4) శశికళ

29. ‘సాహిత్య దర్పణం’ కర్త?
1) అచ్యుతరాయలు 2) భరతుడు
3) విశ్వనాథుడు 4) భామహుడు

30. స్తోత్ర రూపకమైన కావ్యం?
1) కోశం 2) వాక్‌వాక్యం 3) గాథ 4) దండకం

31. శృంగార నాయికలు ఎందరు?
1)4 2) 8 3) 10 4) 12

32. వేమనపై సి.పి.బ్రౌన్‌ పుస్తకం ఎపుడు వెలువడింది?
1) 1809 2) 1819 3) 1829 4) 1839

33. ‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు’ అనే పద్యం ఏ శతకంలోనిది?
1) వేమన 2) సుమతీ 3) దాశరథీ 4) భాస్కర

34. అవధాన విద్యలో ఆరితేరిన కవులు ఎవరు?
1) తిరుపతి వేంకట కవులు 2) కొప్పర
3) వేంకటరామకృష్ణ 4) పైవారు అందరూ

35. ‘పండరీ భాగవతం’ ద్విపద గ్రంథకర్త?
1) ఉప్పలస్వామి 2) పుట్టపర్తి
3) తుమ్మల 4) త్రిపురనేని

36. ‘అంతా మిథ్య’ అని తలంచి వైరాగ్యం ప్రదర్శించిన కవి ఎవరు?
1) ధూర్జటి 2) సంకుసాల నృసింహ
3) వేమన 4) బద్దెన

37. ‘హృదయోల్లాస’ వ్యాఖ్య ఎవరిది?
1) వేదం వెంకటరామశాస్త్రీ                   2) తాపీ ధర్మారావు
3) వెంపరాల సూర్యనారాయణశాసి్త్ర 4) ములపాక బుచ్చయ్యశాసి్త్ర

38. విజయరాఘవ నాయకుడు రాసిన యక్షగానం?
1) విప్రనారాయణ చరిత్ర 2) రఘునాథాభ్యుదయం 3) కాళీయ దర్శనం 4) పైవన్నీ

39. ‘కుమార భారతి’ బిరుదాంకితుడు?
1) పెద్దన 2) తిమ్మన
3) తెనాలి రామకృష్ణ 4) సూరన

40. కవి చౌడప్పను ఎవరి ఆస్థాన కవిగా పేర్కొంటారు?
1) విజయరాఘవ నాయకుడు 2) రఘునాథ నాయకుడు 3) శహాజీ 4) కృష్ణాజీ

41. వెన్నెలకంటి సిద్ధయమంత్రికి అంకితమిచ్చిన గ్రంథం?
1) కేయూర మహా చరిత్ర 2) విక్రమార్క చరిత్ర 3) భోజరాజీయం 4) పైవన్నీ

42. పాలవేకరి కదిరీపతి ఏ శతాబ్దానికి చెందిన కవి?
1) 16 2) 17 3) 18 4) 19

43. జక్కన ఎవరి సమకాలిక కవి?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) శ్రీనాథుడు

44. ‘రాధికా సాంత్వనం’ ఎవరికి అంకితం ఇచ్చారు?
1) రాధ 2) రాముడు 3) బాలకృష్ణుడు 4) శివుడు

45. ‘రసాభరణం’ ఏ ప్రక్రియకు చెందింది?
1) ఛందస్సు 2) అలంకార శాస్త్రం
3) కథా కావ్యం 4) చారిత్రక కావ్యం

46. ‘శశాంక విజయం’ కర్త?
1) శేషం వెంకటపతి 2) జక్కన
3) మంచన 4) గౌరన

47. 1955లో వెలువడిన మధునాపంతులు సత్య నారాయణ శాస్త్రి ‘ఆంధ్రమహాపురాణం’ ఎన్ని
 పర్వాలుగా రచించారు?
1) 7 2) 9 3) 11 4) 18

48. ‘తెలుగు కవితా వికాసం’ కర్త?
1) వేల్చేరు నారాయణరావు 2) కడియాల రామ్మోహన్‌రాయ్‌
3) అద్దేపల్లి రామ్మోహన్‌రావు 4) పైవారు ఎవరు కాదు

49. ‘సాహితీ సమితి’ సభాపతి?
1) శివశంకరశాస్త్రి 2) వేదుల
3) శ్రీశ్రీ 4) పైవేవీ కావు

50. శివశంకరశాసి్త్ర రచన?
1) కావ్యావళి 2) హృదయేశ్వరి
3) వకుళమాల 4) పైవన్నీ?

51. ఆంధ్రప్రభ వార పత్రికలో ‘మాణిక్యవీణ’ ద్వారా పాఠకుల్ని చైతన్యపరిచింది ఎవరు?
1) బసవరాజు 2) అడవి బాపిరాజు 3) విద్వాన్‌విశ్వం 4) శ్రీశ్రీ

52. ‘కోయిలా కోయిలా కూయబోకే.. గుండెలు బద్దలు చేయబోకే’ అన్నదెవరు?
1) బసవరాజు 2) నండూరి
3) ఆరుద్ర 4) కొనకళ్ల వెంకటరత్నం

53. ‘ఆడదాని జూడ నర్థంబు జూడగ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు’ అన్నదెవరు?
1) బద్దెన 2) వేమన 3) దాశరథి 4) ఏనుగు లక్ష్మణకవి

54. సుదీర్ఘ ఉత్పలమాలికలతో కవిత్వం ఎలా ఉండాలో చెప్పిందెవరు?
1) నంది తిమ్మన 2) పెద్దన 3) సూరన 4) భట్టుమూర్తి

55. ‘పారిజాతాపహరణం’ ఎన్ని ఆశ్వాసాల కావ్యం?
1) 5 2) 7 3) 8 4) 9

56. ‘శ్రీకాళహస్తి మహాత్యం’ ఎన్ని గద్యపద్యాలు గల మధుర ప్రబంధం?
1) 455 2) 555 3) 655 4) 755

57. ఆరు రకాల శ్లేషలు ఉపయోగించిన ప్రబంధకవి?
1) పెద్దన 2) సూరన 3) తిమ్మన 4) మల్లన

58. ‘మానవుడే నా సందేశం.. మానవుడే నా సంగీతం’ అన్న కవి?
1) సినారె 2) తిలక్‌ 3) శ్రీశ్రీ 4) ఆరుద్ర

59. ‘ఆడమంగళం’ ఎవరి రచన?
1) కందుకూరి 2) గురజాడ
3) చిలకమర్తి 4) పానుగంటి

60. ‘గురజాడ వట్టి ఫొటోగ్రఫీ కాదు ఎక్సరే ఫొటోగ్రఫీ ’ అన్నదెవరు?
1) కె.వి. రమణారెడ్డి 2) శ్రీశ్రీ
3) కృష్ణశాసి్త్ర 4) దాశరథి

61. సంవిధాన చక్రవర్తి?
1) నన్నెచోడుడు 2) కేతన
3) నాచన సోమన 4) పాల్కురికి సోమన

62. గరుడపురాణం’ కర్తగా చెప్పే కవి?
1) పింగళి సూరన 2) తెనాలి రామకృష్ణ
3) భట్టుమూర్తి 4) మాదయగారి మల్లన

63. తెలుగు జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలు ఎందరు?
1) ఇద్దరు 2) ముగ్గురు 3) నలుగురు 4) ఆరుగురు

64. వేంకట పార్వతీశ్వర కవుల రచన?
1) ఏకాంతసేవ 2) భావ సంకీర్తనం
3) కావ్య కుసుమావళి 4) పైవన్నీ

65. 1908 నాటి కన్యాశుల్కం తొలి నవలలోని అంకాల సంఖ్య?
1) 5 2) 7 3) 8 4) 9

66. ముత్యాలసరాలకు మూలం?
1) కర్ణాటక భాషలోని ఒక షట్పది
2) పారసీ భాషలోని ఒక గజల్‌
3) వృషభగతిరగడ 4) పైవన్నీ

67. 1909లో జరిగిన కన్యాశుల్కం పునర్ముద్రలోని అంకాల సంఖ్య?
1) 4 2) 6 3) 7 4) 9

68. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ తొలి అధ్యక్షుడు?
1) ఎన్‌.గోపి 2) రాయప్రోలు
3) సినారె 4) కసిరెడ్డి వెంకటరెడ్డి

69. కోకిలస్వామి బిరుదాంకితుడు?
1) సినారె 2) పానుగంటి
3) చిలకమర్తి 4) రాయప్రోల్




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...