ప్రఖ్యాత కవి,అష్టావధాని, సరస్వతీ ఆలయ నిర్మాత అష్టకాల నరసింహరామశర్మ ఈ తేది 8-2-2023 రోజున లోకాన్ని విడిచివెళ్ళటం విషాదకరం. బాధాకరం .
శ్రీరామచంద్రిక ,పురుషోత్తముడు వంటి కావ్యాలు, శిథిలవిపంచి, ఆత్మ వేదం ఖండకావ్యాలు, వాసరేశ్వరి,శ్రీరామప్రభు శతకాలు నాకు తెలిసిన నేను ఆత్మ కథ రచించారు.
ప్రముఖ సాహితీవేత్త, అవధాని అష్టకాల నరసింహ రామశర్మ మృతి... కేసీఆర్, హరీష్ సంతాపం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నరసింహ రామశర్మ మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు.
సిద్దిపేట ప్రాంతానికి ఎనలేని సేవచేసిన నరసింహ రామశర్మ ఆ ప్రాంత కీర్తిప్రతిష్టలు మరింత పెంచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మరణం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు తీరని లోటని అన్నారు. నరసింహ రామశర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇక రేపు(శుక్రవారం) సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ లో అష్టకాల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభసభ్యులు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం పార్థీవదేహాన్ని అనంతసాగర్ లో వుంచి నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గోనెపల్లిలో మా గురువు.(1990-1998)
వారు పుస్తకం చూడకుండా అన్ని పద్యాలు నోటికి చెప్పేవారు.
వారి బోధన నన్ను తెలుగు వైపు మళ్ళించింది.
ప్రముఖుల సంతాపం:
గురుతుల్యులు.., జ్ఞానానికి,అనుభవానికి నిలువెత్తు రూపం.కదలాడే సరస్వతి.ఆయన మనలను విడిచివెళ్ళడం మాటలలో చెప్పలేని విషాదం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ఓం శాంతి.
- నందిని సిద్ధారెడ్డి
డెబ్భై నాలుగులో వెల్కటూర్ ఉన్నత పాఠశాలలో, ఎనిమిదవ తరగతిలో నాకు తెలుగు బోధించిన గురువు. పద్యాలన్నీ నోటికే రాగయుక్తంగా ఆలాపించేవారు. చుక్క పద్యాలే కాదు. అన్ని పద్యాలు అప్ప చెప్పించుకునే వారు. చూచి రాత కాపీలో తప్పులు గుర్తించి శిక్షించేవారు. నేను చదివిన ఎనిమిదవ తరగతి మొదటి పాఠం,, దుర్యోధనుని దురాలోచన,, నన్నయ విరచితం పద్యాలు మొదలు పదకొండవ పాఠం,, మందలింపు.. సంపత్ రాఘవా చార్య విశ్వనాథ విజయం నుండి తీసుకున్న పద్యాలవరకు నాకు ఇప్పటికి కంఠతా పాఠం. ఆయన బోధనా విధానం అటువంటిది. ప్రభావితం చేయగలిగే ఉపాధ్యాయుడు. శ్రీ అష్ట కాల నరసింహ రామశర్మ గారు. -పప్పుల రాజిరెడ్డి
అవధాని నరసింహరామశర్మ గారు అనగానే 'శిథిల విపంచి' నాకు గుర్తొస్తుంది.
వారు అష్టావధానం చిన్న కోడూర్ ఉన్నత పాఠశాలలో చేసినప్పుడు దత్తపది పృచ్ఛకునిగా పాల్గొనటం నా అదృష్టం.
ఈ విషాదకర సంఘటన వినటం విషాదకరం.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. -కందుకూరి శ్రీరాములు
https://m.facebook.com/100063613365339/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి