1. అధికారులు లేఖలు
2. అనధికార (బంధు మిత్రులకు రాసే)లేఖలు
లేఖ రాసేటప్పుడు కుడి వైపున పేజీ పై భాగంలో తేదీ రాసి విరామ చిహ్నమైన కామా పెట్టాలి. అక్కడే రెండో లైన్ గా స్థలము రాసి (.) పులిస్టాప్ పెట్టాలి రాయాలి.
పర్యావరణ పరిరక్షణ కోసం పత్రికా సంపాదనకు రాసే లేఖ.
తేది: 15-2-2023,
సిద్దిపేట.
గౌరవనీయులైన పత్రిక సంపాదకులు,
ఈనాడు పత్రిక కార్యాలయం,
సోమాజిగూడ,
హైదరాబాద్.
విషయం: పర్యావరణ పరిరక్షణ గురించి పత్రికలో ప్రచురించి ప్రజలకు అవగాహన కలిగించాలని కోరుతూ....
ఆర్యా!
నా పేరు సిరి. నేను సిద్దిపేట పట్టణంలో నివసిస్తున్నాను. మా సిద్దిపేట పట్టణం అందంగా ఆకర్షణీయంగా ఉంచడానికి గౌరవ మంత్రివర్యుల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షన్ లో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు దుకాణాల ముందు, రోడ్డుపైన వివిధ ప్రాంతాల్లో, వైద్యశాలలో బాధ్యతారహితంగా ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవేస్తూ పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నారు. తత్ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా మీరు అవగాహన కలిగించగలరని సవినయంగా కోరుతున్నాను.
ఇట్లు
తతమ విధేయుడు,
Xxxxxxxxxx,
.........................,
సిద్దిపేట.
(Note: web version లో చూడండి. స్పష్టంగా కనిపిస్తుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి