భూమిపుత్ర. శుక్రవారం 29 జనవరి 2021. సాహిత్యం
"అచ్చు" ఆత్మగౌరవ కవిత్వం
దళిత కవిత్వంతోనే తెలుగు సాహిత్యం జీవద్భాషను నమోదు చేసుకోగలుగుతున్నది. దళిత కవులే స్పష్టమైన మట్టి మనుషుల భాషను రాయ గలుగుతున్నారు. యోగ్యత కలిగిన భావానికి ఇప్పుడిప్పుడే న్యాయం జరుగుతుంది. ఉన్నత కులాల కవులు రూపొందించిన ప్రమాణాలు కాలదన్ని, వాస్తవ జీవిత తత్వాన్ని ప్రమాణాలుగా ప్రతిపాదిస్తున్నారు. జీవితం ఎలా ఉంటే అలా చెప్పడమే' గొప్ప కళ' అని తీర్మానం చేశారు. అసలు దళిత జీవితమే 'శిల్ప సహిత జీవితమనే' ఎరుకతోనే కవిత్వం రాస్తున్నారు. వాస్తవం కానిది ఎంత గొప్ప శిల్పంతో రాసిన అది దండగే అని, దండోర వేసి ప్రకటిస్తున్నారు. అగో అట్లాంటి దళిత కవులలో సిద్దెంకి యాదగిరి మొదటి వరుసలో ఉన్నారు. సిద్దెంకి |యాదగిరి నాకు ఉస్మానియా యూనివర్సిటీ లో 2002వ సంవత్సరంలో పరిచయం. తాను ఎమ్మే తెలుగు నేను ఎమ్మే ఎకనామిక్స్ అంటే దాదాపు మా పరిచయం 18 సంవత్సరాలుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సందర్భం లో అనేక కవి సమ్మేళనాల్లో తరచుగా కలిసి వేదిక పంచుకున్నాం. తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవం పెరుగుతుందని అప్పటి ఉద్యమం చెబితే నమ్మినాము. తెలంగాణ కల సాకారం అయ్యాక మొదటి ముఖ్యమంత్రి దళితుడే అంటే అదీ కూడా ఇద్దరం నిజమే అనుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం మోసపోయాం అని కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి 'జంబూ సాహితి' సంస్థను స్థాపించాలని ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇద్దరం కలిసి ప్రతి సంవత్సరం దళిత కథా వార్షిక తేవాలని నిర్ణయించుకున్నాం. ఈ రకంగా మా ఇద్దరిని సాహిత్యమే కలిపింది కలిసి ప్రయాణం సాగించేలా చేస్తున్నది సిద్దెంకి యాదగిరి కాలంతో పాటు సాగిపోయే కవి. జరగరాని సంఘటనలు జరిగితే కదిలి పోతారు, చలించిపోతారు. సంఘటనల పట్ల చాలా స్పీడ్గా స్పందిస్తారు. స్పాంటేనియస్తో కలాన్ని దులిపిస్తారు. ఆ స్పందించే తనంలో డొల్లతనం ఏమాత్రం ఉండదు. జారిపోయే తత్వం అసలే కాదు. తన జాతి పట్లనే కాక సమాజ స్థితిగతుల పట్ల, అనేకనేక ప్రాపంచిక పరిణామాల పట్ల, నిఘా పెట్టి వుంటాడు, నిశిత పరిశీలనతో స్పందించడం యాదగిరిలో అద్నపు గుణం ఇతనికి సామాజిక చైతన్యంతో పాటు సాహిత్య చైతన్యం కూడా ఎక్కువే. ఇవన్నీ ఉన్నాయి కనుకనే సమకాలీన సంఘటనలపై కవిత్వాన్ని రాశి పోస్తున్నారు. ఆ రాశిలో వాసి తగ్గకుండా చూసుకుంటున్నారు. సిద్దెంకి రాసిన "మా తొవ్వ"తెలంగాణ ఉద్యమానికి బలం చేకూర్చిన కవిత్వం తెలంగాణ ప్రజల పక్షాన గొంతు వినిపించిన కవిత్వం అది, "బతుకుపారం" కవితా సంపుటి లో చిక్కటి చక్కటి కవిత్వం రాసారు. కేవలం కవితల్లో నే గాక "తప్ప" కథల సంపుటితో గొప్ప కథలను తెలుగు సాహిత్యానికి అందించారు. ఇప్పటి "అచ్చు" కవిత్వం కూడా మాదిగ జీవితమంత స్వచ్ఛంగా ఉంది. అచ్చు అనగా చెప్పులు చేసేటప్పుడు తోలును ఆకారంలో | పాదం కోసుకోవడాన్ని అచ్చు అంటారు. ఇది పూర్తిగా మాదిగ అస్తిత్వ పదం. చాలా గొప్ప పేరు పుస్తకానికి పెట్టాడు సిద్ధింకి |యాదగిరి.
కవి అంటే కవిత్వమంటే ఒక అందమైన నిర్వచనాన్ని సిద్దెంకి కవి .. అని కవి యాదగిరి ఇచ్చిండు "విత్వం చూపు ఎంత సున్నితంగా ఉండాలో ఒక కవితలో చెప్పిండు. మొగులు మీద కారుమబ్బుల్ని ఎగ వోసి /తురిమిన పదాల్లో ఉరుముల్ని పుట్టించే, రాపిడి ఎక్కడున్నా... విరిగిపోయిన చీమ కాలు బాధ విని/ విలపించే వాడే కవి .. చూపును కవిత్వీకరించారు. విరునవ్వుతో పలకరించే సిద్దెంకి హక్కుల కోసం అస్తిత్వం కోసం పాటుపడే ఉద్యమాల కోసం తన అక్షరాలను సాక వొస్తారు. అట్లా తెలంగాణ ఉద్యమానికి, దళిత ఉద్యమానికి తన కవిత్వాన్ని నిట్టాడిగా చేశారు. ఉద్యమంతో మమేకమై విభిన్న జీవితాలను చిత్రించారు. అట్లని తెలంగాణ వచ్చాక స్తబ్దతగా ఏమి లేరు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన అనేక పొరపాట్లను తన కలం నిలదీస్తూనే ఉంది .
నీ హామీలు బూటకం/నాటకం/
నువ్వు అడేది మావోళ్ళు బతుకుల్ని అరడుగుల కాగడా జేసి/కాలుతున్నరు.... ఇక మేలుకో అని" పాబంది" కవితలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తన చుట్టూ ఉన్న జీవితాలను, మార్పులను అక్షరాలుగా ఒడిసి పడుతున్నారు. సిద్దెంకి ఏ కవిత తీసుకున్న ఆ కవితలో కన్నీళ్ల అనవాళ్లు చెలిమిలాగా ఊరుతయి. దుఃఖ పడుతున్న నేల'అనే కవితలో రైతు కష్టాలను బాగా చెప్పారు నేల లోతుల్లోకి దిగి అడుగంటిన జీవజాలాన్ని మనసు దోసిళ్ళతో దేవి పైరు గొంతుల్ని తడిపి/పోయే ప్రాణాల్ని నిలపాలనే నిలువెత్తు కోరిక రైతుది అని ప్రకటించారు. కానీ దేశానికి అన్నం పెడుతున్న రైతు పట్ల కేంద్ర ప్రభుత్వం నిన్న చాలా ఘోరంగా ప్రవర్తించి దాడి చేయించిందిఅక్షర చైతన్యం కోసం, సమాజ మార్పు కోసం పనిచేస్తు.. అక్షర వ్యవసాయం చేస్తున్న మేధావులు రచయితలు జర్నలిస్టుల పట్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. రక్తపు కూడు తింటూ దేశభక్తి నినాదాలు ఇచ్చే మనుషుల కపటత్వాన్ని నిలదీస్తాడు గారీ లంకేష్ హత్యను ఖండిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ పత్రిక శీర్షికలై మేలుకొలుపుతుంటే ధరించని పిరికి మతమౌఢ్యం/ కలం గుండెల్ని కాలుతున్న బంధూకు/ నెత్తురు కూడు/ తినమరిగిన రాజకీయం..... అంటూ కపట రాజకీయాన్ని గల్లా పట్టి నిలదీశారు. తన జాతి సమస్యలు పరిష్కారం ఎట్లా అవుతాయో సిద్ధంకికి బాగా తెలుసు, అంబేద్కర్ చెప్పిన మాస్టర్ కి ఈ కవికి బాగా అర్ధం అయ్యింది. అందుకే అంబేద్కర్ పేరుతో సాగే ఉద్యమాలు "బువ్వ లేని బోనం లాగా" ఉండకూడదని నాయకులను హెచ్చరిస్తున్నారు.
మనం బోధించాల్సినది/
అధికారం అందుకోలేని జాతులు అంతరిస్తాయని/సమీకరించి నేర్పాల్సిన రణతంత్రం/మనపై మనం పోరాడాల్సింది/ఉధ్వాస నిచ్వాసలుగా కలలు కనే /రాజాధికారం కోసమే(చూపుడు 3)
పై కవితలో అధికారం లేని జాతులకు అఖండ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. గుండెల్లో ఎంత అలజడి వున్నా, ఎంత కల్లోలం ఉన్నా, అటుపోట్లు ఉన్న, నిబద్ధతతో నిర్మాణాత్మకంగా నడిచే ఉద్యమ పోరాటాలే చివరికి ఫలితాలు సాధిస్తాయని చెప్పారు..
ఎన్ని గండాలు దాటితే ఇంత బతుకు బతుకుతున్నాం /లోకమంతా అలజడి ఉన్నప్పుడే మన లోగుట్టు తేల్చేది/
రచయిత సిద్దెంకి యాదగిరి
కళు
సిద్దెంకి యాదగిరి
కల్లోలం అయినప్పుడే/
మన కట్టుబాటు తెలిపేది /నిప్పులు గుండం తొక్కే నిబద్ధత నిలబడేది...."
అంటూ దళితులు భౌతిక పోరాటాలను మాత్రమే నమ్మితే విజయము సాధించలేరని, జ్ఞానంతో, ఆలోచనలతో నడిపే పోరాటాలను ఎంచుకోవాలని సూచిస్తూ ఇలా అంటారు.
"పరిగెత్తాల్సిందే నువ్వు కాదు/
ప్రభుత్వాలు పాఠశాలలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మతాల చుట్టూ, దేవుళ్ల చుట్టూ రాజకీయాల్ని తిప్పుతున్న తీరు సిద్దెంకి నచ్చలే అందుకే
"గుడిసెల సీకట్లు నింపి"
"గుళ్ళూ గోపురాలకు బంగారం తాపుతాది"
అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుళ్లు గోపురాల కోసం ప్రజా ధనాన్నిఖర్చు చేస్తున్న తీరును తీవ్రంగా నిరసించారు. సిద్ధంకి యాదగిరి "అచ్చు" మొత్తం కవిత్వం చదివితే ఏమి వస్తది అని మీరు అడిగితే... అన్యాయంపై పోరాడే స్ఫూర్తి వస్తది, న్యాయానికై 'కత్తుల వంతెన మీద కాలు మోపడానికి కావలసిన ధైర్యం వస్తుంది. "ప్రేమ మరణమంత బలమైనది" అనే సత్యాన్ని తెలుసుకునే చూపు వస్తది. "నింగి నేలను ఏకం చేసే విశ్వాసం" వస్తది. అన్యాయాన్ని చూసి "గొంతు ఎగ చిమ్మడం నేర్చుకోవడం వస్తది"ఇజాల కోసం కాకుండా నిజాల కోసం, సమాజం కోసం గొంతు విప్పి చైతన్యాన్ని అచ్చు కవిత్వం మనకు ఇస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి