సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

17, డిసెంబర్ 2022, శనివారం

దాశరథి కవితా శైలి

"అగ్నిధార" కావ్యఖండికలోనే మానవ పరిణామాన్ని గురించి "?" (ప్రశ్నార్థకం) శీర్షిక గల కవితను పొందుపర్చాడు.

 "ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో" అంటూ ప్రారంభమయ్యే ఈ గేయంలో కేవలం రెండు పంక్తులలోనే మొత్తం భూమి పుటుక, మానవ పరిణామం గురించిన శాస్త్రీయ అవగాహనను చాలా సరళంగా తెలియజేశాడు. సూర్యుని నుంచి వేరుపడిన అనేక అగ్నిముద్దల్లో, చల్లబడిన ఒక మద్దయే మన భూమి. ఈ శాస్త్రీయ అవగాహనని ప్రజలకు తెలియచేసేలా 'భూగోళం పుటుక కోసం రాలిన సురగోళాలెన్నో" అని రాశారు. అలా చల్లబడిన ఈ భూగ్రహంపై కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జీవం ఏర్పడింది. ఈ జీవపదార్థాం అనేక మార్పులు చెందుతూ, నేటి అత్యున్నతమైన మానవుని రూపంగా ఆవిర్భవించింది. ఈ మానవ పరిణామాన్ని చాలా చక్కటి, చిక్కటి పదాలలో వ్యక్తం అయ్యేలా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో." అని రాశారు. ఇలా సంక్లిష్ట శాస్ర విషయాలను చాలా సులభశైలిలో పామరులకు కూడా అర్థం అయ్యేలా భూగ్రహ, మానవ పరిణామాల గురించి శాస్త్రీయ అవగాహనను కల్పించాడు.

తెలంగాణ ప్రజల కన్నీళ్ళను “అగ్నిధార"గా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం అద్భుత రచనలు దాశరథి చేశాడు. సముద్రం మనకు పైకి ప్రశాంతంగా అగుపించినా, తన గర్భంలో ఎన్నో అగ్ని పర్వతాలున్నాయని హెచ్చరించాడు. నల్లని, నిర్మల ఆకాశంలో మనకు కనిపించే సూర్యుడిలాంటి నక్షత్రాలు అనేకం ఉన్నాయని తెలియజేశాడు. ఇలా సముద్ర శాస్త్ర, ఖగోళ శాస్ర విశేషాలను ఈ కవితలో ప్రారంభంలోనే ప్రస్తావించాడు. రాజులతో నిండిన గత చరిత్ర నుండి, నేటి వర్తమాన ప్రపంచం వరకు సమస్యల పరిష్కారం పేరుతో సాగిన సాగుతున్న అకాల యుద్దల వల్ల అనేక మంది ప్రజలు బలవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే కులమతాల పేరుతో చాలా మంది అమాయకులు హత్యచేయబడుతున్నారని ఆవేదన చెందాడు. ఈ సమస్యలన్నీ నేటికీ కొనసాగటం ఒక హేయమైన వాస్తవం. సమస్యలను, బాధలను ఏకరువు పెట్టడమే కాకుండా వాటి పరిష్కారం కూడా ఆయన చాలా కవితాత్మకంగా ఇదే కావ్యంలో పేర్కొన్నారు. మంచిపాలన లక్ష్యం అన్నార్తులు, అనాధులుండని నవయుగం వైపుకు సమాజాన్ని నడిపించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పాలన సాగాలని, ఆ పాలనలో పిల్లల భవిష్యత్తుకు కూడా భరోసా ఉండాలని ఆయన వాంఛించాడు.

గత మూడు దశాబ్దాలుగా జనవిజ్ఞాన వేదిక ప్రధానంగా అక్షరాస్యతా ఉద్యమం, మద్యనిషేధ ఉద్యమం, వనితా కళా యాత్రలు, శాస్ర ప్రచారం, మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాల సందర్భంగా శాస్ర విషయాలను - సాంసృతిక అంశాలను మిళితం చేసింది. ఈ అనుభవం నుండేదేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకోవడం మన అందరికి తెలుసు.

శాస్త్రీయ దృక్పథానికి, సాహిత్యానికి గల సంబంధం ఈనాటిది కాదు. ప్రధానంగా తెలుగు సాహిత్యంలో వేమన అతి చిన్న పదాలు, పాదాలతో కూడిన తన పద్యాల ద్వారా ఎన్నో హేతువాదధోరణులను ప్రజలలో విజయవంతంగా వ్యాప్తి చేయడం మన ఘనమైన సాహితీ వారసత్వం. ఆ క్రమంలో ఎందరో ప్రముఖ కవులు, రచయితలు, సంస్థలు, ఉద్యమాలు తమ కార్యాచరణలో సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ భావాలను ప్రజలలో వ్యాప్తి చేశారు. ఈ వెలుగులో దాశరథి సాహిత్యాన్ని ప్రధానంగా ఈ గేయాన్ని ప్రజలలో ప్రచారంలో పెట్టాలని జె.వివి సంకల్పించింది. ఈ నేపధ్యంలో ఎంతో విస్తృతమైన మన తెలుగు సాహిత్యంలో "పరిణామ గేయకర్త దాశరథి" అని సగర్వంగా జెవివి ప్రకటిస్తున్నది. ఈ కవిత ద్వారా దాశరథి రగిలించిన శాస్త్రీయ సృహ ఆధారంగా పురోగతి దిశగా మనందరం

ఏ గ్రహమూ చేయలేని పని

మన పుడమి చేసి చూపింది

నీటిని ఒడిసిపట్టి

తన ఖ్యాతిని చాటింది

చుక్క చుక్కని దరిజేర్చి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...