సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

daanasheelam www.siddenky.blogspot.com దాన శీలము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
daanasheelam www.siddenky.blogspot.com దాన శీలము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2023, ఆదివారం

1. దానశీలము - డా. సిద్దెంకి

దానశీలం పరీక్ష




దాన శీలము 

పాఠ్యాంశ వివరణ:     ‘దానము’ అనగా త్యాగంఅడిగినది లేదనకుండా ఇవ్వడంఉచితంగా ఇవ్వడం మరియు ఇచ్చిన దానిని తిరిగి తీసుకోకుండా ఉండడం. శీలము’ అనగా గుణముస్వభావము మరియు మంచి ప్రవర్తన. దానశీలము”  అంటే  దానము  యొక్క  గొప్పదనం. దానశీలము అనే ఈ పాఠ్యభాగం ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని దానం చేయడం లోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. పురాణ ప్రక్రియకు చెందిన ప్రాచీన పద్యాన్నిపరిచయం చేస్తూ త్యాగాన్ని మరియు శీలాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈయబడిన పాఠం ఇది.


ప్రక్రియ పరిచయం:  పురాణాలు18. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. సర్గంప్రతిసర్గంవంశంమన్వంతరంవంశాను చరితం’ అనేవి పురాణ లక్షణాలు.


విశిష్టత  బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినాహెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు.



  పూర్వకథ/నేపథ్యం:    బలిచక్రవర్తి  తన  శక్తిసామర్థ్యాలతో  స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు.  ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా  కొంత  కాలానికి విష్ణువు  వామన అవతారం  ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు  బలిని  దానం  ఇవ్వవద్దంటాడు.



కవిపరిచయం:   దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతనామాత్యుడు.

కవి పేరు : పోతన (బమ్మెర పోతన)

కాలం: 15వ శతాబ్దం(1420 ప్రాంతానికి) చెందిన కవి. 

స్థలం: జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామం

తల్లి దండ్రులు: లక్కమాంబ, కేసన

బిరుదు: సహజ పండితుడు. 

అనువాదం: సంస్కృతంలోని భాగవతపురాణాన్ని తెలుగులోకి భావానువాదం చేశాడు. ఇది పన్నెండు స్కంధాల బృహద్రచన. (ఇందులో కొంతభాగం సింగన, గంగన, నారయలు పూరించారు). 

రచనలు: 1. వీరభద్ర విజయం, 

2.భోగినీ దండకం, 

3.నారాయణ శతకం 

పోతన రచనల్లో సుప్రసిద్ధమైనది భాగవతం.

 రచనాశైలి:  పండిత పామరజన రంజకం.

- కవి, రచనాశైలి గురించి...  

శబ్దలంకారాల సొగసు భాగవతంలో మధుర భక్తి తర్వాత తరాల వాళ్లకు ఆదర్శం. ఆయన పద్యాల్లోని ధారాశుద్ధి, భావస్పష్టత తెలుగువాళ్లకు పద్యాలపై మక్కువ పెంచింది. 

అందుకే గజేంద్రమోక్షం, శ్రీకృష్ణ లీలలు, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీ కళ్యాణం తదితర భాగాల్లోని పద్యాలెన్నో తెలుగువాళ్లకు కంఠస్థమైయాయి.

భాగవతంలోని అవతారిక పద్యాల్లో నుంచి కూడా ఒకటి రెండు పద్యాలైనా తెలియని తెలుగువారు ఉండరు.


పాఠం ద్వారా విద్యార్థులు గ్రహించాల్సిన ముఖ్యాంశాలు:-
1) పాఠం ఉద్దేశం
2) కథ (విషయం)
3) పద్యాల కంఠస్థం-ప్రతిపదార్థ తాత్పర్యాలు గ్రహించడం.
4) ముఖ్యాంశాల గురించి భిన్నకోణాలో అవగాహన
5) కవి, కవిశైలి గురించి వివరాలు
6) భాషాంశాలు

 

1) పాఠం ఉద్దేశం:- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఆడిన మాట తప్పకుండా ఉండడం; 

దానం గొప్పతనాన్ని గ్రహించడం, విద్యార్థుల్లో పెంపొందింపజేయడం లక్ష్యంగా ఈ పాఠం నిర్దేశించారు. 

ఈ ఉద్దేశం నెరవేరడానికి విద్యార్థులకు అవగాహన ఉండవలసిన అంశాలు.

ఆడిన మాట తప్పకుండా ఉండడం వల్ల సమాజంలో మనిషికి ఉండే గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, వ్యక్తీకరించాలి.

ఆడినమాట తప్పని చారిత్రక, ఇతిహాసిక, పౌరాణిక పురుషుల/వ్యక్తులకు సంబంధించిన కొన్ని అంశాలు దృష్టిలో ఉండాలి.

 ఉదా:- సత్యహరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రంతిదేవుడు, సక్తు ప్రస్తుడు.గోవు (పులిబారిన పడినప్పుడు), భీష్ముడు, కర్ణుడు,   మొదలైనవారు.

దాన గుణంలో ప్రసిద్ధులైనవారి గురించి తెలుసుకుని ఉండాలి. శిబిచక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, వివేకానందుడు (బాల్యంలో), ప్రకాశం పంతులు, సంగం లక్ష్మీబాయి, ఆధునిక సమాజంలో మీకు తెలిసిన ఒకరిద్దరు వ్యక్తులు-వాళ్లు చేసిన దానాలు.

దాన గుణం ప్రత్యేకత-ఆధునిక కాలంలో దానాలు-రక్తదానం, అవయవదానం మొదలైన అంశాలపై అవగాహన.

2) కథ:-

పాఠ్యాంశానికి సంబంధించిన కథ-కీలకాంశాలు.

రాక్షసరాజైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు, ఉత్తమ గుణ సంపన్నుడు. అతని కుమారుడు విరోచనుడు. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి.

బలిచక్రవర్తి మహావీరుడు. ఉత్తమ గుణాలు కలిగినవాడు. ఆడిన మాట తప్పని సత్యసంధుడు. దానం చేయడమనే వ్రతానికి కట్టుబడిన వాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయని వాడు.

బలి చక్రవర్తి ఉత్తముడైనప్పటికీ రాక్షసజాతికి నాయకుడు. అతని అండచూసుకుని రాక్షసులు దేవతలను, సాధుసత్పురుషులను హింసించే తమ సహజ గుణాన్ని మరింత వికృతంగా ప్రదర్శించేవారు. రాక్షసులకు దేవతలతో ఉన్న జాతివైరం వల్ల బలిచక్రవర్తి కూడా ఇంద్రున్ని స్వర్గం నుంచి తరిమేసి, ఇంద్రపదవిని అలంకరించాడు.

బలిచక్రవర్తిని ఓడించలేని దేవతలు రాక్షసుల వల్ల తాము అనుభవిస్తున్న బాధలను విష్ణుమూర్తికి తెలియజేస్తారు. విష్ణువు తాను వామనుడుగా అవతరించి, బలి చక్రవర్తిని స్వర్గం నుంచి తొలగించి, మేలు చేస్తానని వాగ్దానం చేస్తాడు.

అన్నమాట ప్రకారం వామనుడుగా మారి, నర్మదానదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి, తనకు మూడడుగుల నేల కావాలని యాచిస్తాడు విష్ణువు.

అతడు విష్ణువని, అడిగిన దానంలో మోసం ఉందని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి దానం ఇవ్వకూడదని, ఇస్తే బలిచక్రవర్తితో పాటు రాక్షసకుల వినాశనం, రాజ్యనాశనం సంభవిస్తుందని హెచ్చరిస్తాడు.

చుక్క పద్యాలు - ప్రతి పదార్థాలు:

మత్తేభం

I   I  U

U  I    I

U  I    U

I   I  I

U  U  U

I    U

I  U

కు ల మున్  

రా  జ్య  ము 

దే జ మున్ 

ని  లు  పు 

మీ  కు  బ్జుం  

డు  వి  శ్వం 

 భ  రం

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం

                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

షార్ట్ కట్   మ సభ 1-14

    ప్రతిపదార్థాలు అన్వయ క్రమంలో రాయాలి. అన్వయ క్రమము అనగా భావము చెడకుండా క్రమంగా రాయడం. ఉదా కంటిన్ జానకి

జానకి = సీతను

కంటిన్ = చూసాను)

   మ.    కులమున్   రాజ్యము  దేజమున్    నిలుపు మీ కుబ్జుండు విశ్వం భరం
డలతిం బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండ ముం 
గలడే మాన్ప నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం, బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!

వదాన్య + ఉత్తమా! = దాతల్లో శ్రేష్టుడా! (ఓ బలి చక్రవర్తీ)

కులమున్  =‌ వంశాన్ని 

రాజ్యము = రాజ్యాన్ని 

తేజమున్  = తేజస్సును 

నిలుపుము = కాపాడుము 

ఈ కుబ్జుండు  = ఈ పొట్టి వాడు

విశ్వంభరుడు = విశ్వంను భరింపగలిగే వాడు 

త్రివిక్రమ స్ఫురణ వాడై = త్రివిక్రముడంతటివాడై మూడు లోకములను ఆక్రమించ గలవాడై

 బ్రహ్మాండము = ఈ బ్రహ్మాండం అంతటినీ

 నిండున్      = వ్యాపిస్తాడు  

మాన్పన్      = నిరోధించగలవాడు

ఒకండు.       = ఒక్కడైనా 

 కలడు + ఏ   = ఉన్నాడా? (లేడు)

నా             = నా (యొక్క) 

పలుకులు  = మాటలు 

కర్ణంబులన్ = చెవుల నిండా  

ఆకర్ణింపు    = విను 

దానము.    = దానం 

గీనము       = గీనము వంటివి

వలదు      ‌‌  = వద్దు 

వర్ణిన్          = బ్రహ్మచారిని 

పనుపమా   = పంపించవయ్యా

తాత్పర్యం: దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ,  రాజ్యాన్నీపరాక్రమాన్నీనిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరానా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.    బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు. 

తాను గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నానని, ఎవరేది అడిగినా (ధనం, కోరిక, కీర్తి, పదవి) కాదనకుండా ఇస్తానని మాట ఇచ్చి, ఇప్పుడా వాగ్దానభంగం చేయలేనని అంటాడు బలిచక్రవర్తి.

అంతేకాదు, ఆడినమాట తప్పేవాళ్లు దుర్మార్గులకన్నా నీచులని, వాళ్లను భూదేవి భరించలేదని చెబుతాడు. పూర్వపు రాజులు ఎంత సంపాదించినా, అహంకారంతో విర్రవీగి, నామరూపాలు లేకుండా అంతమైపోయారని, శిబిచక్రవర్తి లాంటి సత్యసంధులు, దాన గుణ సంపన్నులూ ఇప్పటికీ కీర్తి పొందుతున్నారని అంటాడు.

ఇంకా, ప్రాణం పోయినా, నరకం ప్రాప్తించినా, సమస్త సంపదలూ, రాజ్యం నశించినా, వచ్చినవాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్లో ఎవ్వరైనా, తెలిసిన వాడైనా తాను మాట తప్పననీ ప్రకటిస్తాడు బలిచక్రవర్తి.

ఆ విధంగా ప్రకటించి, భార్య అయిన వింధ్యావళితో కూడి, ఆ వామనుని కాళ్లు కడిగి, ఆ నీళ్లు నె త్తిన చల్లుకుని ‘విష్ణుస్వరూపుడవైన బ్రాహ్మణోత్తమా! వేద ప్రామాణికంగా మూడడుగలనేలను నీకు దానం చేస్తున్నాను’ అంటూ వామనుడు కోరిన మూడడుగుల నేలను దానమిస్తాడు.

సర్వప్రాణులకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువుకు బలిచక్రవర్తి దానమీయగానే దిక్కులన్నీ బలిచక్రవర్తిని ప్రశంసించాయి.

శార్ధూలం  

U  U  U

I  I  U

I   U   I

I  I  U

U  U  I

U  U  I

U

 కా   రే  రా

జు  లు?  రా

జ్యముల్  గ    

లు  గ  వే?

గ  ర్వో న్న

తిం బొం ద

రే?

            1 వ అక్షరానికి 13 కి యతి మైత్రి 
     నాలుగు పాదములుండును 

శ్యామస 13

     

 . శా.            కారే రాజులురాజ్యముల్ గలుగవేర్వోన్నతిం బొందరే?

             వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరేభూమిపైఁ 
             బేరైనం గలదేశిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై 
             యీరే కోర్కులువారలన్ మఱచిరే యి క్కాలమున్భార్గవా!

  భార్గవా        = భృగు వంశ వారసుడా! ఓ శుక్రాచార్యా! 

                            (భార్గవుడు - భృగువు పుత్రుడుశుక్రుడు).

 రాజులు = రాజులు
కారు + ఏ =  (కాలేదా) అయ్యారు కదా
రాజ్యముల్ రాజ్యములు
గలుగవే - 

కలుగవు + ఏ  కలిగి ఉన్నారు కదా!
గర్వ + ఉన్నతిన్ + పొందరు + ఏ


గర్వ              అహంకారముతో
ఉన్నతిన్      విర్రవీగుటను 
పొందరు+ఏ  పొందియున్నారు
వారేరీ - వారు    వాళ్ళందరు 
ఏరి                   ఎక్కడ ఉన్నారు?
సిరి - 

సిరిని       సంపదలను 
మూటఁగట్టుకొని - 

మూటగట్టుకొని కూడగొట్టుకొని
పోవంజాలిరే     తీసుకెళ్ళగలిగిరాలేదు 
భూమిపైన్ + పేరైనన్ + కలదే 
భూమి             నేలపైన 
పేరైనన్           కనీసము పేరైన
కలదే              ఉన్నదాలేదు
శిబిప్రముఖులుంబ్రీతిన్ - 

శిబి                 శిబిచక్రవర్తి
ప్రముఖులున్  మొదలగువారు
ప్రీతిన్ కోరి
యశఃకాములై – 
యశః             కీర్తి
కాములు        కోరువారు
                  అయ్యి
యీరే-ఈరే     ఇవ్వలేదా 
కోర్కులు         కోరెవారి కోరికలు  
వారలన్         వారిని
యిక్కాలమున్ - 

 ఇప్పటి; 
కాలమున్   కాలమునందును; 
మఱచిరే   మరచిపోయారాలేదు; 

    తాత్పర్యం:  ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదావారిని ఈనాటికీ లోకం మరువలేదు  కదా.

మత్తేభం

I   I   U

U    I    I

U   I    U

I   I  I

U  U  U

U  U

I  U

ని  ర  యం

బై    న,   ని

బం  ధ మై

,   ధ   ర

ణీ   ని  ర్మూ

ల  నం బై

,  దు  

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం

                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

షార్ట్ కట్   మ సభ 1-14

నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు   
 ర్మరణంబైనఁ, గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;     
హరుఁ డైనన్, హరి యైన, నీరజభవుం భ్యాగతుం డైన నౌఁ;           
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

ప్రతిపదార్థం:
ధీవర్యా  =  బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్యా !

నిరయంబైన - 

నిరయంబు నరకము దాపురించినా

ఐనన్          అయినా సరే

నిబంధమైన - 

నిబంధము కట్టివేయబడుట (కారాగార బంధనం)

ఐనన్          జరిగినా సరే 

ధరణీ నిర్మూలనంబైన - 

ధరణీ              రాజ్యము

నిర్మూలనంబు నాశనము

ఐనన్             అయినా సరే 

దుర్మరణంబైనఁ గులాంతమైన - 

దుర్మరణంబు దుర్మరణము

ఐనన్            సంభవించినా సరే

కుల               =  వంశము 

అంతము.     నాశనము

ఐనన్            జరిగినా సరే

నిజమున్     సత్యమునే

రానిమ్ము      ఒప్పుకొనెదను 

కానిమ్ము పో - 

కానిమ్ము      జరిగెడిది జరగ నిమ్ము

పో          భయం లేదు 

హరుఁ డైనన్ - 

హరుడు శివుడు

ఐనన్    అయినా

హరియైన - 

హరి    విష్ణువు

ఐనన్  అయినా

నీరజభవుండభ్యాగతుం డైన నౌఁ దిరుగన్ - 

నీరజభవుండు = (నీటిలో పుట్టిన కమలం నుండి ఉద్భవించిన) బ్రహ్మదేవు డయినా 

అభ్యాగతుండు   అతిథిగా వచ్చినవాడు

ఐనన్                 అయినా

                       సరే



వినుమా వినుము

వేయి = వేయి (పెక్కు ) మాటలు 

ఏటికిన్   దేనికి

నాదు  నా యొక్క

జిహ్వ = నాలుక

తిరుగన్ = వెనుతిరుగుట

నేరదు = చేయలేదు



తాత్పర్యం:ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనానాకు దుర్మరణం  వచ్చినా సరేనా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడువిష్ణువుబ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).

ముఖ్య వివరణలు : దశ దిక్కులు= పది దిక్కులు- దిక్కులు దిక్పాలకులు:- 

    1.తూర్పు-ఇంద్రుడు

    2.పడమర-వరుణుడు

    3.ఉత్తరము-కుబేరుడు

    4.దక్షిణము-యముడు,

    5.ఈశాన్యం-శివుడు

   6. నైరృతి-నిరృతి

   7.వాయవ్యము-వాయువు

   8. ఆగ్నేయము-అగ్ని

   9. ఆకాశం-బ్రహ్మ

   10.భూమి-శేషుడు.


పంచ భూతాలు= పృథివి(భూమి)ఆపస్సు (నీరు)తేజస్సు(అగ్ని)వాయువు(గాలి)ఆకాశం. (నీరు నిప్పు గాలి భూమి ఆకాశం పంచ భూతాలు. భూతము అనగా ప్రాణము. పంచ భూతాలు అనగా ఐదు ప్రాణాలు.)

          

4. ముఖ్యాంశాల గురించి భిన్నకోణాల అవగాహన:-

నూతన విద్యావిధానంలో అత్యంత కీలకమైన అంశమిది. నిర్దేశిత పాఠం ఏ ఉద్దేశం ఆధారంగా రూపొందించారు; విద్యార్థి జీవితానికి, భాషాసాహిత్యాల అభిరుచికి, వ్యక్తిత్వవికాసానికి, ఆలోచనా విధానానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న అంశాలను ఆధారంగా చేసుకొనే పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి, పాఠంలోని కీలక విషయాల గురించి అవగాహన, విశ్లేషణ అవసరం.

    ఆధారాలు:- పై అంశాల అవగాహనకు పాఠం మధ్యలో గళ్లలో చర్చకోసం ఇచ్చిన ప్రశ్నలు, పాఠం చివర అభ్యాసాల్లో ఇచ్చిన ప్రశ్నలు ఆధారంగా చేసుకొని విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ధోరణిలో ఆలోచించాలి.

ఆశించే కీలకాంశాలు:-
1) శుక్రుడు బలిచక్రవర్తి దానాన్ని అడ్డుకోవడం.
2) మానధనుల లక్షణాలు
3) కీర్తి సంపాదించడం గొప్పవిషయమా?
4) ‘తిరుగన్ నేరదు నాదుజిహ్వ’ అంటే
5) శిబి గొప్పదాత-ఎందుకు?
6) అడిగింది ఇవ్వడంలోని తృప్తి-అనుభవాలు
7) పొడవు-కురుచ పదాల వెనుకున్న అర్థం
8) మానధనులు మాట తిరుగకుండడం
9) దిక్కులు పొగడడం అంటే

పై ప్రశ్నలు-అంశాలను గమనించినప్పుడు.. విద్యార్థులు ఈ పాఠం ద్వారా ఏఏ అంశాలను అవగాహన చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? అనుభవాలు ఎలా జోడించాలి అనే విషయాలు స్పష్టమవుతాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకొని, తమ భావనలు (స్పందనలు) అక్షర రూపంలో స్పష్టంగా వ్యక్తీకరిస్తే ప్రశ్నలన్నిటికీ/ ఏ ప్రశ్నకైనా జవాబు రాయగలిగే సామర్థ్యం కలుగుతుంది.

ఆ ప్రశ్నల విశ్లేషణలో ఏర్పడే భావనలు....

రాక్షసకుల గురువుగా తన జాతిని, ఆజాతికి నాయకుడైన బలిచక్రవర్తిని కాపాడుకోవడం శుక్రాచార్యుని బాధ్యత. వంచనతో విష్ణువు బలిచక్రవర్తిని, రాక్షసజాతిని నాశనం చేయడానికి వచ్చిన విషయం గ్రహించిన శుక్రుడు ఆ నిజం తెలిపి తన వాళ్లను కాపాడుకునే కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది సమర్థనీయం.

మానధనులంటే గౌరవమే సంపదగా కలిగిన వారు. అంటే పరువు మర్యాదల కోసం జీవించే వాళ్లు. వీళ్లు గౌరవానికి హాని కలిగించే ఏ పనినీ సమర్థించరు. తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడితే ప్రాణాలైనా వదులుకుంటారు. నీతి, నిజాయితీగా జీవించడం, మాటకు కట్టుబడి ఉండడం, ఎవరినీ యాచించకుండా ఉండటం, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలనుకోవడం, తగని పనులు చేయకుండా ఉండడం వంటి లక్షణాలు వీళ్ల సహజసిద్ధమైన గుణాలు.

కీర్తి సంపాదించడం నిజంగా గొప్ప విషయమే. ఈ లోకంలో ధనం చాలామంది సంపాదిస్తారు. నాయకత్వాన్ని కొందరు సంపాదిస్తారు. కాని కీర్తిని సంపాదించే వాళ్లు కొందరే ఉంటారు. అది తేలికగా లభించేదికాదు. ఎంతో అంకితభావం, నియమబద్ధమైన జీవితం, నిరంతర కృషి, నీతి-నిజాయితీ, సహనం, ఔదార్యం వంటి ఉత్తమ గుణాలతో ప్రవర్తించే వాళ్లే కీర్తి సంపాదించగల్గుతారు.

    ‘జిహ్వ తిరుగనేరదు’ అంటే ‘ఆడినమాట తప్పను’ అని అర్థం.

ఒక పావురాన్ని కాపాడడం కోసం ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడ్డ శిబిచక్రవర్తి నిజంగా గొప్పదాత.

ఎవరైనా ఏదైనా అడిగితే-దాన్ని ఇవ్వడంలో ఎంతో తృప్తి ఉంటుంది (విద్యార్థుల వ్యక్తిగతానుభవాలు జోడించాలి)

పొడవు-అంటే గొప్ప, శ్రేష్ఠత్వం అని అర్థం. దానికి వ్యతిరేక పదం కురుచ-ఈ పదానికి అల్పం, తక్కువ అనే అర్థాలున్నాయి. శ్రేష్ఠుడైన విష్ణువు తనను తాను అల్పునిగా చేసుకొని బలిచక్రవర్తిని దానం అడగడం అల్పత్వానికి ప్రతీక కదా!

‘దిక్కులు’ అనేవి అమూర్త పదార్థాలు. అంటే కనిపించనివి. కనిపించని దిక్కులు బలి చక్రవర్తిని ఎలా పొగుడుతాయి? దీని అర్థం దిక్కులలోని సమస్త ప్రాణులూ ఆ మహనీయుడిని పొగిడాయని.

పాఠం ద్వారా విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాలు:- 

II వ్యక్తీకరణ సృజనాత్మకత:

అ)'ఈ కుబ్జుండలతింబోడు' అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?

జ. కుబ్జుండు అనగా పొట్టివాడు. పొట్టివాడైన వామనుడు తానడిగిన కొద్దిపాటి ఆ మూడడుగుల నేలతో వెళ్ళడని, ఆ మూడడుగులతోనే మూడు లోకాలను కొలుస్తాడని, బ్రహ్మాండమంతా వ్యాపిస్తాడని, బలి చక్రవర్తి రాజ్యాన్ని, మొత్తం స్వాధీనం చేసుకుంటాడని శుక్రాచార్యుడు చెప్పిన మాటల్లోని సారాంశం. అందుకే శుక్రుడు బలి చక్రవర్తిని, అతని వంశాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకోవాలని ఉపదేశించాడు. రాక్షస వంశ గురువైన శుక్రుడు రాక్షస రాజైన బలిని కాపాడాలని భావించాడు. అందుమూలంగా నేను శుక్రుని మాటలతో ఏకీభవిస్తాను.

ఆ). హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు?

జ. హాలికుడు అనగా రైతు. రైతు సంతృప్తిగా ఉండాలి అంటే సారవంతమైన పొలము ఉండాలి నాణ్యమైన విత్తనాలు లభించాలి ప్రభుత్వమే వడ్డీ రహిత అప్పును అందించాలి. సాగునీరు సరిపెడంతా అందించాలి. యంత్రాలను కల్పించాలి. సకాలంలో ఎరువులు అందజేయాలి. పొలంలో పనిచేసేందుకు చౌకగా కూలీలు దొరకాలి. 

పొలంలో పనిచేసిన కూలీల కూడా ఉపాధి పని భాగం కల్పించాలి. గిట్టుబాటు ధర ఉండాలి.

మార్కెట్ సదుపాయం ఉండాలి.

 సకాలంలో డబ్బులు అందజేయాలి.

ఇ) సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అనడంలో బలి చక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది ?

జ. పూర్వకాలంలో సిరి సంపదలతో తులతూగిన రాజులు ఎందరో ఉన్నారు. వారికి రాజ్యాలు ధనధాన్యాలు లెక్కకు మించిన సౌకర్యాలు, విలాసాలు ఉన్నాయి. వారు మరణించినప్పుడు వారు పరలోకానికి వెళ్ళుతూ తాము సంపాదించిన ధనాన్ని తమ వెంట తీసుకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరు సంపాదించినా చనిపోయే రోజు సిరిసంపదలను తీసుకొని వెళ్లలేరు. సంపదలు అశాశ్వతం. మనుషులు శాశ్వతంగా ఉండాలి అంటే వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టతలే శాశ్వతంగా నిలుస్తాయని బలి చక్రవర్తి మాటల్లోని ఆంతర్యం.

ఈ) 'ఆడిన మాట తప్పకూడదు' ఎందుకు?

మనుషులు ఎవరైనా ఆడిన మాట తప్పకూడదు. పూర్వం భూదేవి చెడ్డ పని చేసిన వాడైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని నేను మోయలేను అని బ్రహ్మతో చెప్పిందట. మందుకు పత్యం మాటకు సత్యం అనే నానుడి లోకంలో సామెతగా నిలిచిపోయింది. తాను అన్న మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమాన దానులైన వారికి ఉత్తమ మార్గం. అభిమాన దనులు మాట తప్పరు. సత్యవాక్యం వల్ల పుణ్యం లభిస్తుంది. సత్యం మాట్లాడే వారికి స్వర్గాది పుణ్య లోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడిన మాట తప్పకూడదు.


2.అ) నేటి సమాజానికి దానగుణంగా వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.

జ. నేటి సమాజానికి దానగుణంగాల వ్యక్తుల అవసరం:

లక్షాధికారైన లవణం కానీ మెరుగు బంగారంబు మింగబోడు

నేటి సమాజంలో ధనవంతులు, పేదవారు, కడుదరిద్రులు ఉన్నారు. ధనవంతులలో పరిశ్రమాధిపతులు, మహాసంపన్నులు ఉన్నారు. వారి వద్ద ధనం మూలుగుతుంది. వారు ఆ ధనాన్ని వివిధ బ్యాంకుల్లో దాస్తున్నారు. తమ సంతానానికి వారసత్వంగా ఇస్తున్నారు. సమాజంలో ఎందరో పేదవారికి కట్టుకోవడానికి, బట్ట తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేదు. త్రాగడానికి సరైన మంచినీరు దొరకని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ధనవంతులు తమ దాతృత్వ గుణాన్ని చాటుకోవడానికి బీదవారికి వివిధ మౌలిక వసతులను కల్పించవలెను. వారికి మంచినీటి సదుపాయాలు మరుగుదొడ్లు, విద్యా వైద్య సౌకర్యాలను అందించాలి.

మంచి విద్యాలయాలు వైద్యశాలలు ప్రారంభించి బీదవారికి సాయపడాలి. ఆదాయం  ఎంత దాచినా' వారు చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని తమ వెంట తీసుకెళ్ళు లేరు. అక్రమార్గంలో కూడా పెట్టిన సొమ్మును ఈ డి, సి బి ఐ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆస్తిని జప్తు చేయకముందే బీదవారికి దానధర్మాణ రూపం లో అందజేయడం అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించినట్లు అవుతుంది.

కాబట్టి ధనవంతులు బిల్గేట్స్ ల విప్రోధిపతి ప్రేమ్ జీల టాటా బిర్లాల వలె తన సొమ్మును దానధర్మకార్యాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా సంతృప్తి ఆనందం కలుగుతాయి. ఎదుటివాడు ముఖంలో సంతోషం వెల్లి విరిస్తే అదే స్వర్గము. చాలామంది ధనవంతులు సహాయం చేసిన వారు ఉన్నారు.  వారి మార్గంలో అనేకమంది సాయం చేసి సమాజంలోని ఒరిదుడుకులను తారతమ్మ భేదాలను తొలగించవలసిన అవసరం ఉంది.

‘దానశీలము’ సారాంశం:       శుక్రాచార్యుడు – దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడుఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.

     అప్పుడు బలిచక్రవర్తి…. ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరారాజ్యాలు లేవావారేమైనా మూటగట్టుకొని పోయారాఅడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది.

        ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినాబంధనం ప్రాప్తమైనాఈ భూమండలం అదృశ్యమైనానాకు దుర్మరణం వచ్చినానా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువుశివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.

     ఎన్ని కష్టాలకు గురైనాపేదరికం వచ్చినామరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూపంచభూతాలు బళి బళి” అని పొగడాయి. 

3 సత్యవాక్కు, దానగుణం ఆవశ్యకత ఆధారంగా సూక్తులు-నినాదాలు:-
సూక్తి-అంటే మంచిమాట: నినాదం అంటే నినాదించేది అని అర్థం. నినాదాలు ఉద్యమాల్లో, ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో ఉపయోగిస్తుంటారు.

 ఉదా:- సూక్తులు:-

ఆడి తప్పకు - ఇచ్చి దెప్పకు  

పలికి బొంకకు - ఇచ్చి పుచ్చుకోకు

సత్యమే సర్వమత సారం

సత్యమే ధర్మం

సత్యం సుకృతము, అసత్యము పథకం

. మనిషిని మాధవుడుగా నిలబెట్టేశక్తి ‘సత్యం’.

 దయగల హృదయమే దేవాలయం.

. సత్యమే జీవనం! అసత్యమే మరణం!

         . దాతృత్వాన్నే పాటించు!

                                పదికాలాలూ జీవించు!!

III భాషాంశాలు : 

పదజాలం 
సొంత వాక్యాలు 
పలికి లేదనుట= మాట తప్పడం
 నేను పలికి లేదనను.
 కురుచగుట = పొట్టి అగుట
నా చొక్క మా తమ్మునికి కురుచగయ్యింది
చేతులొగ్గు= యాచించడం 
నేనెవరికీ చేతులొగ్గను


2. వ్యుత్పత్యర్థాలు:
నీరజభవుడు -  నీటిలో నుండి పుట్టిన కమలం నుండి జన్మించిన వాడు (బ్రహ్మ)
త్రివిక్రముడు - ముల్లోకాలను జయించి  ఆక్రమించిన వాడు (విష్ణువు)

3. సమానార్థాలు లేదా పర్యాయపదాలు
జలము : నీరు, సలిలం, ఉదకం.
యశః : కీర్తి, ప్రఖ్యాతి.

4. ప్రకృతి వికృతులు:
సిరి - శ్రీ 
విష్ణువు - వెన్నుడు 
ధర్మం - దమ్మం 
బ్రహ్మ - బమ్మ

5. నానార్ధాలు రాయండి
కులము : జాతి, వంశము, శరీరము, ఇల్లు.
క్షేత్రము : వరిమడి, భార్య, భూమి, శరీరం, తీర్థము, పుణ్యస్థలం
హరి:  విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం.
చిత్రము: చిత్తరువు, బొమ్మ, ఆశ్చర్యం, అద్భుత రసం.

వ్యాకరణాంశాలు:
గర్వోన్నతి = గర్వ + ఉన్నతి = గుణ సంధి
అభ్యాగతుడు = అభి + ఆగతుడు = యణాదేశ సంధి 
వదాన్యోత్తముడు = వదాన్య + ఉత్తముడు = గుణ సంధి
అణు+ ఆయుధాలు - యణాదేశ సంధి.

సమాస పదాలకు విగ్రహ వాక్యాలు సమాసాల పేర్లు

జీవధనములు - జీవమును, ధనమును - ద్వంద్వ సమాసము. 
మూడు అడుగులు - మూడు సంఖ్య గల అడుగులు - ద్విగుసమాసం
దశ దిక్కులు - దశ సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము 
భూతప్రేతములు - భూతమును, ప్రేతమును - ద్వంద్వ సమాసము


ఆ + చోట

ఆ +చోట

----------------------2 వ సూత్రం 
అచ్చోటు --------------------- 3 వ సూత్రం 
త్రికములు అనగా : ఆ, ఈ, ఏ

 1) ఆ, ఈ, ఏ అనే సర్వనామములు త్రికం అనబడుతాయి. 

2) త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. 

3) ద్విరుక్తంబగు హల్లునకు (హల్లు పరమైనపుడు) ఆచ్ఛికమైన దీర్ఘమునకు హ్రస్వంబగు 



పాఠం-అదనపు అంశాలు:-

సూచనలు : ప్రతి పదార్థం రాసే విద్యార్థులు అంవ్యక్రమమ్ పాటించాలి.

ఒక పాఠం అధ్యయనం చేసిన తర్వాత ఆ పాఠాన్ని పిల్లలు ఎంతమేర అర్థం చేసుకున్నారో, ఆ పాఠం ద్వారా భాషా సాహిత్యాంశాలపై వాళ్ల అవగాహన ఏ మాత్రం పెంపొందిందో, నిజజీవితానికి ఆయా అంశాలను ఎంత సమర్థంగా వినియోగించుకోగలరో తెలుసుకోవడానికి (అంచనా వేయడానికి) పాఠం చివర ‘ఇవిచేయండి’ అనే పేరుతో అభ్యాసాలు కల్పించారు. వాటన్నిటినీ పిల్లలు వ్యక్తిగత సామర్థ్యంతో పూర్తిచేయాలి. అవి సక్రమంగా సాధించగలిగితే, పరీక్షలో ఎటువంటి ప్రశ్నలకైనా అవలీలగా జవాబులు రాయగలరు.

   1) రక్తదానం-అవయవదానం-ప్రాధాన్యత:-

దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు మన దగ్గరున్నా ఏ సంపదనైనా, వస్తువునైనా ఇవ్వడం.

అనాదిగా అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం, ద్రవ్యదానం మొదలైన దానాలను చేస్తున్నారు మనపూర్వులు. ఆ సంప్రదాయం ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం అభివృద్ధి చెందిన నేపథ్యంలో మానవుడు సృష్టికి ప్రతిసృష్టి చేసే స్థాయికి చేరుకుంటున్నాడు. ప్రాణ ప్రతిష్ట చేయడం మినహా, ప్రాణమున్న మానవున్ని మామూలు వ్యక్తిగా మనగలిగేటట్లు చేయడంలో మనిషి విజ్ఞానం చాలా వరకు సఫలమమైంది. ఈ ప్రయత్నంలో భాగంగానే మానవుల రక్తాన్ని, అవయవాలను కూడా ఒకరి నుంచి మరొకరికి వినియోగించే శాస్త్రపరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. పర్యవసానంగా రక్తదానం, అవయవదానం ప్రాముఖ్యత, గుర్తింపూ పెరిగాయి.

రక్తదానం:-    

రక్తం-మనిషిని సజీవంగా ఉంచి జీవనక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పతుంది. సగటున ప్రతి మనిషి శరీరంలోనూ 200 ఔన్సుల రక్తం ఉంటుంది. రక్తం ఆక్సీజన్(ప్రాణవాయువు)ను శరీర భాగాలన్నిటికీ అందజేస్తుంది. జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరమంతటా వ్యాపింపజేస్తుంది. రక్తం తనంతటతాను గడ్డ కట్టుకునే శక్తిని కూడా కలిగి ఉండి కొంతమేర రక్త స్రావాన్ని అడ్డుకుంటుంది. అందుకే రక్తం మనిషి శరీరంలో అత్యంత కీలకమైంది.

ప్రమాదాలు జరిగినప్పుడు; శస్త్రచికిత్సలు చేసిన ప్పుడు; రక్తం పూర్తిగా పాడైపోయినప్పుడు; కిడ్నీలు, కాలేయం వంటివి పని చేయడం మానేసినప్పుడు రక్తమార్పిడి అవసరమవుతుంది.

ఒక మనిషి ఒకసారి 8ఔన్సుల రక్తాన్ని ఇవ్వవచ్చు. ఈ 8 ఔన్సుల రక్తం రెండురోజుల్లో మళ్లీ సమకూరుతుంది. అందుకే ఆరోగ్యవంతులైనవారు వీలైనన్ని సార్లు రక్తదానం చేయవచ్చు.

మనిషి ప్రాణాన్ని కాపాడే రక్తం దానం చేయడమంటే ప్రాణదానం చేసినట్లే. ఈ విలువ గ్రహించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్త నిధులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి.

అందుకే ఆధునిక కాలంలో రక్తదానం ఎంతో విలువైంది. పుణ్య ప్రదమైంది. మానవతా సదృశమైందని అందరూ గ్రహించాలి.

అవయవదానం:-

మనిషి శరీరంలోని అంతరావయవాల్లో గుండె, మూత్రపిండాలు (కిడ్నీలు), కళ్లు, కాలేయం వంటివి ఇటీవలి కాలంలో మార్పిడి చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడడం, చూపు నివ్వడం, దీర్ఘ రోగాల బారి నుంచి కాపాడటం వంటి పుణ్యప్రదమైన కార్యక్రమాలు అందరి మన్ననలనందుకుంటున్నాయి.

మనిషి చనిపోయిన తర్వాత ఉపయోగపడని ముఖ్యమైన అవయవాలను శరీరం స్పందించడం మానిన సమయంలో, మెదడు నియంత్రణ పూర్తిగా కోల్పోయిన (బ్రెయిన్ డెడ్) సందర్భంలో గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయం వంటివి తీసి, నిర్ణీతకాలంలో ఇతరులకు అమర్చే వ్యవస్థ ఉంటుంది. ‘కిడ్నీ’ బతికున్నప్పుడు కూడా ఒకరి నుంచి మరొకరికి మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పిడి కార్యక్రమం అవయవదానం చేసే వ్యక్తుల లేదా వాళ్లబంధువుల పూర్తి అంగీకారం, సహకారంతోనే జరుగుతుంది.

దానాలన్నింటి ద్వారా మేలు జరుగుతుంది కాని, రక్తదానం, అవయవదానం వల్ల పరోక్షంగా ప్రాణదానం జరుగుతుంది. అందుకే ఇవి అన్ని దానాల్లోనూ విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి.

ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచి, మానవ శ్రేయస్సుకు, సంక్షేమానికి తోడ్పడే రక్తదానం, అవయవదానం కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వం, ప్రచారసాధనాలు ముందుకు రావాలి.

    2) రైతుకు తృప్తినీయగల వసతి సౌకర్యాలు:-

అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా పేరుగాంచిన రైతు తృప్తిగా ఉంటేనే అందరికీ ఆరోగ్యం, ఆనందం. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మేధావులు, వ్యాపారులు, దళారీలు సహానుభూతితో వ్యవహరించి, వాళ్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి.

    సకాలంలో సాగునీరు, తాగునీటి వ్యవస్థను కల్పించడం; అంతరాయం లేని విద్యుత్ సరఫరా; మేలిరకం విత్తనాలు; ఆధునిక వ్యవసాయ పరికరాలు; సబ్సిడీమీద ఎరువులు, విత్తనాలు; అధికోత్పత్తికి అవసరమైన విజ్ఞానం, అవగాహన; ఉత్పత్తి చేసిన సరుకును తరలించే రవాణా వ్యవస్థ; ఉత్పత్తులకు తగిన ధర; ధర పలుకు సమయంలో మద్దతు ధర; ప్రకృతి బీభత్సం నుంచి ధాన్యాన్ని కాపాడుకునే గిడ్డంగులు తదితర వసతి సౌకర్యాలుంటే రైతులు తృప్తిగా జీవించగలుగుతారు.

3) సిరిమూట గట్టుకొని పోవడం:-

అంటే సంపాదించిన ధనాన్ని మరణానంతరం వెంటతీసుకొని పోవడం. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు. భౌతికమైన ఏ సంపదనూ తన వెంట తీసుకుని పోలేరు. అందుకే సంపాదించిన ధనాన్ని ప్రజలకు మేలు చేయడానికి వినియోగించాలి. అప్పుడు ధనం స్థానంలో పుణ్యం అంటే ‘చేసిన మేలు’ మిగులుతుంది. తన గురించి తాను ఆలోచించకుండా, తనదనుకున్నదంతా పరులకోసం నిస్సంకోచంగా ఇచ్చిన త్యాగధనులు చరితార్థులై చరిత్రలో నిలిచిపోతారు. అందుకే పోయేటప్పుడు ఎవరూ సిరిమూట గట్టుకొని పోలేరన్న వాస్తవం వ్యాప్తిలోకి వచ్చింది.

    4) ఆడినమాట తప్పకుండా ఉండడం:-

అంటే మాటంటే దాన్ని తు.చ తప్పకుండా నెరవేర్చడం. వాగ్దానం తప్పకూడదన్నమాట. దీన్నే మాటమీద నిలబడడం అంటారు. అలా మాటమీద నిలబడే వాళ్లకు ఇంట బయటా గౌరవమర్యాదలుంటాయి. కాని, ఆడినమాట తప్పినవాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లనెవ్వరూ నమ్మరు. ఎంతటి గొప్పస్థానంలో ఉన్నా చులకనైపోతారు. సొంతమనుషులు కూడా వాళ్లను తేలికగా తీసుకుంటారు. సమాజం నుంచి, బంధువుల నుంచి సరైన సహకారం లభించదు. అవకాశం వస్తే అల్పులు కూడా అవమానించడానికి సాహసిస్తారు. అనుకున్న పనులు నేరవేరవు.

మానధనులు ఎలా ఉంటారు?

మానధనులైన వాళ్లు మాటతిరుగరు-అంటే ప్రాణం పోయినా ఆడినమాట తప్పరు అని భావం. మానధనులు,యుద్ధంలో వెనుదిరగాకుండా వీరమరణం పొందుతారు. వారు మాటకు కట్టుబడి సత్యంలోనే బ్రతుకుతారు. తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్తితి ఏర్పడితే ప్రాణాలైన వదులుకుంటారు. నీతి ,నిజాయితిగాా జీవించడం,మాటకు కట్టుబడి వుండడం, ఎవరిని యాచిoచకుండా వుండడం,వంటివి వీరి సహజసిద్దమైన గుణాలు.

దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం

సమాజంలో ఏకాలంలోనైనా పేదలు, ఉపేక్షితులు, బాధితులు ఉంటారు. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అయితే ఆదుకోవడానికి ప్రధానంగా కావలసింది మంచి మనస్సు, ధనం. ఈ రెండు కలిగిన వాళ్లు మాత్రమే దాతలుగా పేరు పొందగలరు.

సమాజంలోని అసమానతల కారణంగా పేదరికం పూర్తిగా అంతరించడం లేదు. నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి, ఛాందసభావాలు పేదలను ఎదగనీయకుండా అడ్డుపడుతున్నాయి. వాటిని అధిగమించడానికి పేదలను ఆదుకోవడానికి మనసున్న ధనవంతులు ముందుకు రావాలి.

కులం, వర్గం, జాతి కారణంగా నీచంగా చూస్తున్న వాళ్లను సాటిమానవులుగా భావించాలి. సమాజాన్ని మేల్కొల్పాలి.

ముసలీతనం, రోగాల బారిన పడడం, అనాథలుగా మారడం వల్ల దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. వాళ్లను ఆదుకొని, అండగా నిలబడేందుకు వదాన్యులు ముందుకు రావాలి.

   












దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I

"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)

ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )

సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)

ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.

ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.

పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)

గణాలు-రకాలు .    సవరించు

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు


ఏకాక్షర గణాలు    సవరించు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.


U, U, U

ఉదా: శ్రీ, శై, లం

రెండక్షరాల గణాలు    సవరించు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు

లగ లేదా వ IU ఉదా: రమా

గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ

గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు    సవరించు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు


అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII

మధ్య గురువు జ గణము IUI

అంత్య గురువు స గణము IIU

సర్వ లఘువులు న గణము III

ఆది లఘువు య గణము IUU

మధ్య లఘువు ర గణము UIU

అంత్య లఘువు త గణము UUI

సర్వ గురువులు మ గణము UUU

ఇవి మూడక్షరముల గణములు


ఉపగణాలు    సవరించు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు


సూర్య గణములు. ఇవి రెండు.

న = న = III

హ = గల = UI

ఇంద్ర గణములు. ఇవి ఆరు.

నగ = IIIU

సల = IIUI

నల = IIII

భ = UII

ర = UIU

త = UUI



        ఉత్పల మాల   లక్షణములు

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20

ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ

యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము

ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.


ఉత్పల భరి10

 1:10


మత్తేభము   

స భ ర న మ య వ


లక్షణములు   

మత్తేభము వృత్తమునందు గణములు

స    భ    ర    న    మ    య    వ

I I U    U I I    U I U    I I I    U U U    I U U    I U

సి రి కిం    జె ప్ప డు    శం ఖ చ    క్ర యు గ    ముం జే దో    యి సం ధిం    ప డే

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20

ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ

యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గుర్తుండడం కోసం  మసభ 14


        చంపకమాల

లక్షణములు

పాదాలు: 4

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు


గుర్తుండడం కోసం చంపన లెవెన్ 

చంపకమాల నజభజజజర 

1 అక్షరానికి 11 అక్షరానికి యతిమైత్రి


శార్దూలం 

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19

ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ

యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు.


గుర్తుండడం కోసం

శ్యామ స 13


please follow  www.siddenky.blogspot.com



డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...