సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

లేఖ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లేఖ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2024, శుక్రవారం

VI. 4. లేఖ

vi.4. లేఖ                                                                                                                                                                               పాఠం ఉద్దేశం

లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “లేఖారచన” ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలుంటాయి.                                                                  ప్రవేశిక

వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధోవికాసానికి బాటలు వేస్తుంది. మానసిక చైతన్యాన్ని కల్గిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖా రూపంలో ఉన్న ఈ పాఠం చదువండి.                                                                                                                                                                      ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. హైదరాబాద్, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా! మరి మీ ప్రాంతంలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి చెప్పండి.
జవాబు.
మాది నల్గొండ జిల్లా ఆకుపాముల. మా జిల్లాలో పానగల్, భువనగిరి కోట, భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట లాంటి చూడదగ్గ స్థలాలు ఉన్నాయి. సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం1. కింది వాక్యాలు చదివి వాటికి సంబంధించిన స్థలాల పేర్లను పాఠంలో వెతికి రాయండి.

అ. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా! అని ఆశ్చర్యం వేసింది.
జవాబు.
ఇది నాగార్జునసాగర్కకు సంబంధించినది. సాగర్ ఆనకట్ట నిర్మాణం గురించి చెప్పిన మాటలు.

ఆ. తొలి కందపద్యాలు ఇక్కడ శిలపై చెక్కబడి ఉన్నవి.
జవాబు.
బొమ్మల గుట్ట గురించి చెప్పిన సందర్భంలో చెప్పిన విషయాలు.

ఇ. మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా! అని అనిపించింది.
జవాబు.
వరంగల్ కోట.

ఈ. అక్కడున్న బొగ్గు బావులను చూసినం.
జవాబు.
సింగరేణి బొగ్గు గనులు.

ఉ. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు.
జవాబు.
చార్మినార్ గురించి.

2. కింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “విజ్ఞానయాత్రల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది.” దీనిని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించుటకు విజ్ఞాన యాత్రలు తోడ్పడతాయని లేఖ పాఠం ఆధారంగా రాయండి.
జవాబు.
విజ్ఞానం కొరకు చేసే యాత్రలు విజ్ఞానయాత్రలు :

అనేక ప్రదేశాలు తిరగటం వల్ల విషయావగాహన పెరుగుతుంది.
ఆయా ప్రదేశాలలోని భాష, అక్కడి ప్రజల ఆచారాలు, ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి.
చారిత్రక విషయాలు అవగతం అవుతాయి.
నిర్మాణాలు, కట్టడాలవల్ల ఆనాటి వాస్తు, శిల్పకళ మున్నగు విషయాలు తెలుస్తాయి.
ఆనాటి పండుగలు, జన జీవనం తేటతెల్లం అవుతాయి.
నదులు’ వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి.
దేవాలయాలలో వాస్తుకళ, సాంకేతిక పరిజ్ఞానం, కట్టడ నిర్మాణాలు (తెలుస్తాయి) ప్రత్యక్షంగా దర్శిస్తారు.
పాతకాలం నాటి నీరుపారుదల విధానం, చెరువుల నిర్మాణం సాగు, తాగునీటి విధానాలు తెలుస్తాయి.
క్రమశిక్షణ పెరుగుతుంది. స్నేహభావం, సోదర భావం, సర్దుబాటు ధోరణి పెరుగుతాయి.
IV. సృజనాత్మకత/ప్రశంస

మీరు చూసిన యాత్రా విశేషాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

                                                                                                                siddipeta,
                                                                                                            ది. x x x x x x

ప్రియమైన స్నేహితురాలు సాయిశృతికి,

నీ మిత్రురాలు రాయునది. నేను క్షేమం. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులను మా ‘సార్లు’ భద్రాచలం తీసుకువెళ్ళారు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న దీనిని నిర్మించాడు. చుట్టూ దండకారణ్యం ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పర్ణశాల ఉన్నది. భద్రగిరిపై నిర్మించబడిన దేవాలయం ఇది. జటాయువుపాక, దమ్ముగూడెం, శబరిగిరి మొదలైనవి దర్శనీయ స్థలాలు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మేమందరం గోదావరిలో స్నానం చేసి, అన్నీ చూసి వచ్చాము. అక్కడి వాతావరణం ఎంతో బాగుంది. నీవు చూసిన యాత్రను గురించి రాయకోర్తాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
బి. శ్రావ్య, కోదాడ.

చిరునామా :
వి. సాయిశృతి,
6వ తరగతి,
రంగాపురం,
మంచాల మండలం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలు చదువండి. వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి.

అ. గుడి = దేవాలయం, కోవెల

ఆ. ఆనవాళ్ళు =గుర్తులు, జాడలు, చిహ్నములు

ఇ. ఆనందం =సంతోషం, హర్షం.

ఈ. ప్రథమ =మొదటి, ఆది

ఉ. సందర్శించుట =చూచుట2. కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. అనుభూతి
జవాబు.
విహారయాత్రలలో పొందే అనుభూతులు మరచిపోలేనివి.

ఆ. ఆకర్షణ
జవాబు.
రామప్పగుడిలో నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.



ఇ. కమ్మగా
జవాబు.
కమ్మగా వండిన గారెలు నోరు ఊరిస్తాయి.

ఈ. జ్ఞాపకం
జవాబు.
ఇష్టపడి చదివిన విషయం జ్ఞాపకం ఉండిపోతుంది.

ఉ. దర్శనం
జవాబు.
పురాతన కట్టడాలు, ఆలయాల దర్శనం మనసుకు ఆనందం.

ఊ. ప్రాచీనం
జవాబు. గోల్కొండ కోట చాలా ప్రాచీన కట్టడం

ఋ. యాత్ర
జవాబు.మా విహారయాత్ర సుఖంగా సాగింది.

ౠ. మహనీయుడు
జవాబు.గాంధీ వంటి మహనీయుడు పుట్టిన దేశం మనది.

3. కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి.

అ. దుర్గం, కోట, ఖిల్లా, జాగ
జవాబు.జాగ అనేది స్థలం.
దుర్గం, కోట, ఖిల్లా – పర్యాయపదాలు

ఆ. గుడి, బడి, దేవాలయం, మందిరం
జవాబు.బడి  చదువు నేర్పేది బడి.
గుడి, దేవాలయం, మందిరం – పర్యాయపదాలు

ఇ. శిల, రాయి, దండ, బండ
జవాబు.
దండ శిల, రాయి, బండ – పర్యాయపదాలు

ఈ. గాలం, నీరు, జలం, సలిలం
జవాబు.
గాలం గాలం చేపలు పట్టడానికి ఉపయోగం
నీరు, జలం, సలిలం – పర్యాయపదాలు

ఉ. కన్ను, నేత్రం, రెప్ప, నయనం
జవాబు.
రెప్ప రెప్ప కంటిలో భాగం. మిగతా
కన్ను, నేత్రం, నయనం – పర్యాయపదాలు

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. మీకు తెలిసిన స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను రాయండి.

అ. స్త్రీలింగ పదాలు
జవాబు.
అంజన, గిరిజ, వనజ, లక్ష్మి, హేమ, నాగమణి

ఆ. పుంలింగ పదాలు
జవాబు.
వినాయకుడు, చక్రపాణి, విష్ణువు, హరి, చెన్నయ్య, రమణ.

ఇ. నపుంసకలింగ పదాలు
జవాబు.
పుస్తకం, గోడ, చెట్టు

విభక్తి ప్రత్యయాలు :

కింది వాక్యాలను గమనించండి.

అ. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి, బతుకమ్మ పండుగ ప్రతీక.
ఆ. హోళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఇ. పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.
ఈ. వాణి పూజ కొరకు పూలను కోసింది.
ఉ. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం.

పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువండి.
ఉదా : పీర్ల ఇత్తడి వెండి తయారుచేస్తారు.
పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. ‘పీర్ల ఇత్తడి వెండి’ అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదువండి.
“పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు”. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని “విభక్తి ప్రత్యయాలు” అంటారు.

విభక్తి ప్రత్యయాలు:

ప్రత్యయాలు విభక్తులు
అ. డు, ము, వు, లు ప్రథమా విభక్తి
ఆ. ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి ద్వితీయా విభక్తి
ఇ. చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) తృతీయా విభక్తి
ఈ. కొఱకు(న్), కై (కోసం) చతుర్థీ విభక్తి
ఉ. వలన(న్), కంటె(న్), పట్టి పంచమీ విభక్తి
ఊ. కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్) షష్ఠీ విభక్తి
ఋ. అందు(న్), న(న్) సప్తమీ విభక్తి
ౠ. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

లేఖ ప్రక్రియ






  • అధికారిక లేఖ :  ఏ రకమైన వ్యాపార లేఖ లేదా అధికారులకు లేఖ అయినా ఈ అందించిన వర్గంలోకి వస్తాయి.
  • అనధికారిక లేఖ : ఇవి వ్యక్తిగత లేఖలు. వారు ఎటువంటి సెట్ నమూనాను అనుసరించాల్సిన అవసరం లేదు లేదా ఏదైనా ఫార్మాలిటీలకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. అవి వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయి లేదా వ్రాతపూర్వక సంభాషణ. అనధికారిక లేఖలు సాధారణంగా స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు మొదలైన వారికి వ్రాయబడతాయి.
  • వ్యాపార లేఖ : ఈ లెటర్ బిజినెస్ కరెస్పాండెంట్‌ల మధ్య వ్రాయబడింది, సాధారణంగా కొటేషన్లు, ఆర్డర్‌లు, ఫిర్యాదులు, క్లెయిమ్‌లు, సేకరణల కోసం లేఖలు మొదలైన వాణిజ్య సమాచారాన్ని కలిగి ఉంటుంది. అలాంటి లేఖలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా అధికారికంగా ఉంటాయి మరియు ఫార్మాలిటీల నిర్మాణం మరియు నమూనాను అనుసరిస్తాయి.


  • అధికారిక లేఖ : ఈ రకమైన లేఖ కార్యాలయాలు, శాఖలు, సబార్డినేట్‌లకు అధికారిక సమాచారాన్ని తెలియజేయడానికి వ్రాయబడింది. ఇది సాధారణంగా నియమాలు, నిబంధనలు, విధానాలు, ఈవెంట్‌లు లేదా అలాంటి ఏదైనా ఇతర సమాచారం వంటి అధికారిక సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. అధికారిక లేఖలు కూడా ప్రకృతిలో అధికారికంగా ఉంటాయి మరియు నిర్దిష్ట నిర్మాణం మరియు ఆకృతిని అనుసరిస్తాయి.
  • సామాజిక లేఖ : ఒక ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా వ్రాసిన వ్యక్తిగత లేఖను సామాజిక లేఖ అంటారు. అభినందన లేఖ, సంతాప లేఖ, ఆహ్వాన పత్రం మొదలైనవి అన్నీ సామాజిక లేఖలు.
  • ఉపాధి లేఖలు :  ఉద్యోగానికి బంధించి ఏదైనా లేఖలు, జాయినింగ్ లెటర్, ప్రమోషన్ లెటర్, అప్లికేషన్ లెటర్ మొదలైనవి.


  • లేఖా రచన విధానం (ఉత్తరాలు వ్రాయడం )

     

                అందరికి అర్ధమయ్యే తేలికభాషలో ఉత్తరాలు వ్రాయటం ఓక కళ. ఈ లేఖలను, సాంఘిక లేఖని, వ్యవహార లేఖలని రెండు  రకాలుగా విభజించవచ్చు. ఈ లేఖారచనలో రెంటికి ఒకే పద్దతి అనుసరించారాదు .కాబట్టి ఎవరెవరికి ఏయే  రీతిలో ఉత్తరాలు వ్రాయాలో తెలుసుకోవాలి లేఖను ప్రారంభించే సందర్బంలో లేఖకు కుడిప్రక్క పై భాగంలో తానున్న ఊరు తేది వ్రాయాలి.
                                                                 
    సాంఘిఖలేక
          
    మిత్రులకు , బందువులకు రాసే లేఖలు, పెండ్లీ, పుట్టినరోజు  మొదలైన శుభకార్యాలకు, బంధువులకు,స్నేహితులకు పంపే పిలుపు పత్రికలూ మొదలైన వాటిని సాంఘిఖ లేఖలంటారు.
    సాంఘిఖ లేఖలోతల్లితండ్రులకు రాసే సందర్భాలో ప్రారంభంలో :
                  
    పూజ్యులయిన నాన్న గార్కి,
                  
    ప్రియమైన నాన్న గార్కి,
                  
    ప్రియమైన అమ్మ (తల్లి) గార్కి,
    మిత్రులకు అయితే !
                  
    ప్రియ మిత్రుడికి
                  
    ప్రాణ స్నేహితునికి శ్రీ ..........కు
    పరిచయము లేనివారైతే:
                  
    అయ్యా!-
                  
    అమ్మా!---అని సంభోధించాలి
             
    పూర్వం మనదేశ ఆచారాన్ని బట్టి పెద్దవారికైతే "మహారాజశ్రే" "బ్రహ్మశ్రే" "శ్రీ వెదమూర్తులు" మొదలయిన మాటలు ఉపయోగిస్తారు. అలాగే స్త్రీలకు రాసే సందర్భాల్లో "మహాలక్ష్మి సమానురా" లనీ."శ్రీమతి" భర్త చనిపోయినవారికైతే "గంగాభగీరధీ సమానురాలైన" అని మొదలైన వాటిని ఉపయోగిస్తారు.చిన్నవారైతే "చిరంజీవి'అని  పేర్లకు ముందు చేరుస్తారు. తనకంటె పెద్దలైన వారికి నమస్కారాలు: వందనాలు అని చెప్పాలి.తనకంటే ఛిన్నవారికి రాసే సందర్భాల్లో 'గ్రహింపవలయును'. ఇట్లు" శ్రేయోభిలాషి' అని వ్రాయాలి.

     

                                    (1)  మాదిరి సాంఘిక లేఖలు
                                                                           
                  తేది:05-09-2023,

                                                                                          సిద్దిపేట.



    ప్రియమైన నాన్నగారికి,
            
    తమ కుమారుడు అనిల్ కుమార్ నమస్కరించి  వ్రాయు ఉత్తరము. ఉభయకుశలోపరి.
    మాకు సంవత్సరాంత పరీక్షలు ఏప్రిల్ నెలలో జరుగు తున్నాయి బాగా చదువు చున్నాను, పరీక్ష ఫీజు కట్టుటకు పం రూపాయలు పంపవసిందిగా ప్రార్దిస్తున్నాను.
                    
    చిత్తగించవలెను.

                                                                                              ఇట్లు
                                                                                 హర్షవర్ధన్.

                                                                                

     

     

    చిరునామా:

    ఇం. నెం.3-5,

    సుభాష్ నగర్,

    హైద్రాబాద్ - 500301

                                                           

                                     (2) మాదిరి సాంఘిక లేఖలు 

                                                                                 తేది: 23-09-23,

                                                                                 సిద్దిపేట.

     

    ప్రియమైన స్నేహితురాలు గీతశ్రీ కి,

              ప్రేమాభివందనాలు. ఉభయకుశలోపరి.

    నీను సంక్రాంతి సెలవులకు హైద్రాబాద్ కి  వస్తాను. ఇద్దరము కల్సి ఛార్మినార్ మొదలైన చూద్దాం. ఇందిరా పార్క్ ఇంకా ఎన్నో ఎన్నో చూస్తూ సంతోషంగా గడుపుదాం నీవు కూడా పరీక్షలు బాగా వ్రాయి అమ్మకు నాన్నకు నమస్కారములు తెలుపు.

    ఇట్లు

    .నందిని

               

    చిరునామా:

    ఇం. నెం.3-5,

    సుభాష్ నగర్,

    హైద్రాబాద్ - 500301

                  

        శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.

    జ:

    సిద్దిపేట ,

    --/--/2023.

    ప్రియమైన మిత్రునకు,

    ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.


    అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :


    పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.

    రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.

    శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.

    మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

    అలవర్చుకోకూడని గుణాలు :


    విష్ణు భక్తులను నిందించరాదు.

    భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.

    సజ్జనులను మోసం చేయరాదు.

    దేవతామాన్యములను ఆక్రమించరాదు.

    అసత్యాన్ని పలకరాదు.

    మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.

    మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

    ఇట్లు,
    నీ మిత్రుడు,

    X X X X X.


    చిరునామా :

     

    పి. అంజిరెడ్డి ,

    10వ తరగతి,

    జిల్లాపరిషత్ హైస్కూల్,

    ఇందిరానగర్,

     సిద్దిపేట  (జిల్లా.)

  •                                                 


  • డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

    మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...