సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

పాట అంటే ఏమిటి? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాట అంటే ఏమిటి? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, సెప్టెంబర్ 2023, శనివారం

పాట ఎలా రాయాలి

పాట  అంటే ఏమిటి?
పాడుకోడానికి వీలుగా ఉంటూ, ఒక చిన్న లయ అంతర్లీనం గా ఉంటూ, వీలయినంత సరళంగా ఉండటమే పాటకి లక్షణాలు.



పాట ఆకృతి

పాటకి ముఖ్యంగా కావలసినది మాత్రా ఛందస్సు

మాత్ర అంటే ఏమిటి ? ఒక లఘు శబ్దం పలకడానికి పట్టే సమయం అని సామాన్యంగా అర్ధం చెబుతారు.

ఉదాహరణకు అ అనే శబ్దం ఉచ్చరించడానికి 1 క్షణం పడితే ఆ ఉచ్చరించడానికి 2 క్షణాలు పడుతుంది. మొదటి దానిలో ఒక మాత్ర ఉన్నది…రెండవదానిని ఉచ్చరించడానికి రెండు మాత్రలు సమయం పడుతుంది..

లఘువులు, గురువులు అని మనం చందస్సులో చదివే పాఠాల్లో ఈ మాత్ర ప్రస్తావన ఉంటుంది.

పాట యొక్క ప్రతి పాదం లోనూ సమానమైన మాత్రలు ఉంటే పాటలో ఆంతర్లీనంగా ఒక లయ ఏర్పడి, పాడుకునే లక్షణం, వినసొంపు గా ఉండటం దానికి తోడవుతాయి.

ఉదా:

రాయాలి అనుకుంటే మీరు మంచి పాట

రావాలి మీమదిలో అందమైన మాట

1వ వాక్యంలో 2+2+1, 1+1+2+2, 2+1, 2+1, 2+1 = 20 మాత్రలుంటే

2 వ వాక్యంలో 2+2+1, 2+1+1+2, 2+1+2+1, 2+1 = 20 మాత్రాలున్నాయి

ఇలా మరికొన్ని వాక్యాలు ఇదే మాత్రల కొలతలో మీరు రాస్తే అదే ఒక పాట ఔతుంది.

పాట రాసేటప్పుడు అంత్యప్రాస - పాట చివరి అక్షరం ఒకటే అవటం ( రిపీట్ అవటం) చాలా సొంపుగా వినిపిస్తుంది.

నా మెడలో తాళిబొట్టు కట్టరా

నా నుదుట నిలువు బొట్టు పెట్టరా

నీ పెదవి మీద చిరునవ్వు చెరగదురా

నా సిగపువ్వుల రేకైనా వాడదుర, వాడదురా

ఈ అంత్యప్రాస హిందీ సినిమా పాటల్లో, ఆరుద్ర గారి పాటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంత్యప్రాసలు లేకుండా ఎక్కువ పాటలను రాసింది బహుశా సిరివెన్నెల గారే నేమో…

ఇది ఖచ్చితమైన నియమం కాదు, కానీ మొదట్లో ఇలా అలవాటు చేసుకుంటే, కాస్త పాట ముందుకు కదులుతుంది, ఎక్కువ పదాలు మనకి తెలుస్తాయి, పాట ఆకర్షణీయంగా తయారౌతుంది.
----------------------------------------------

“ఎవరి వృత్తి వారికి అలవాటుపడిన తర్వాత తేలిక కావచ్చు కానీండి. ఎవరయినా రాస్తున్నారు అనే మాటను మీరు కొంచెం పార్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాట రాయడానికి కొన్ని ప్రత్యేకమైన యోగ్యతలు ఉన్నాయి. టుమ్రీ పాటలు రాయడం వేరు. ఒక డైనమిక్ సన్నివేశానికి పాటలు రాయడం వేరు. పురాణాలు, చరిత్ర గ్రంథాల పరిచయంతో, అలంకారశాస్త్రం తెలిసివుండి వ్యాకరణ ఛందస్సు శాస్త్రాలను జీర్ణించుకుని ఏ తరహా పాట ఇచ్చినా రాయగలిగే సామర్థ్యం ఉండటం వేరు. ఇప్పుడు ఎవరయినా రాస్తున్నారు. అంటే ఎవరు రాసినా చెల్లే సినిమాలు వస్తున్నాయి. పాటలకోసం ప్రత్యేకంగా ఫలానావారిని పిలవాల్సిన పనిలేదు. మాటలగారడి కనుక ఎవరయినా రాసెయ్యవచ్చు అనుకుంటున్నారు. ఛందస్సు లేకపోతే పాట కాదు అని పూర్తిగా నమ్మేవాళ్లలో నేనూ ఒకణ్ణి. లేకపోతే అది డైలాగ్ అవుతుంది. మీరన్నట్లు తేలికగానే కనిపిస్తుంది.

సరిగమలు రాకపోయినా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ధోరణి మొదలయి చాలా రోజులయింది కూడా. కవిత్వ వాసన, భాషాధికారం, సంగీత పరిచయం లేకుండా పాటలు రాయడం కూడా అలాగే మొదలయింది. ఇవన్నీ వాటంతట అదే వస్తున్న పరిణామాలు, ఒకరిని తిట్టుకుంటూ ప్రయోజనం లేదు” అంటూ తన అభిప్రాయం చెప్పారు  వేటూరి.

------------------------------------------------------------------------------------------------------

*

పాట రాయటం అభ్యాసం చేయటం ఎలా…?

చిన్న చిన్న మాటలతో , మాత్రలు సరి చూసుకుంటూ ప్రతి పదానికి ఎన్ని మాత్రలు వస్తాయి అని లెక్కపెడుతూ మీరు రాస్తూ ఉంటే కొన్ని రోజులు పోయాక, మొదటి పాదం అనుకోగానే రెండో పాదం మొదటి దాని లయ కి అనుగుణంగా రావడం మొదలవుతుంది..

మనకి పద్య ఛందస్సులలో జాతులు, ఉపజాతులు అని రకాలు ఉన్నాయి.

ఉత్పలమాల వంటివి వృత్తాలు, వీటికి ఒక ఫార్ములా ఉంటుంది - భరనభభరవ

కందము, మధ్యాక్కర వంటివి జాతులు

సీసము, ఆటవెలది, తేటగీతి ఉపజాతులు.

పాటలు రాయడానికి సీస పద్యాలు, తేటగీతి, ద్విపద వంటి ఛందస్సులు సాధన చేస్తే బాగుంటుంది. వీటిలోని యతి నియమాలు మనం పాటించకపోయినా… వాటిలోని మాత్రా నియమాలను అనుసరిస్తూ పాటలు కూర్చవచ్చు

ఉదా: సీస పద్యంలో ఒక పాదంలో మొదటి సగంలో 4 ఇంద్ర గణాలు, 2వ సగంలో 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు ఉంటాయి.

ఇందులో వృత్తాలలో ఉండే కఠిన నియమాలు లేవు గనుక పదాల్ని మారుస్తూ ప్రయత్నం చేస్తే సహజంగానే మాత్రల కొలత పట్టుబడుతుంది..

సీస పద్య ఛందస్సు గతిలో నడిచిన ఒక ప్రముఖమైన పాట

ఆరేసు కోబోయి పారేసు కున్నాను

4 త గణాలు తో ఉంది

గణాలు గురించి[1] నా పాత జవాబు కొంత సహాయకారి కావచ్చు..

మనకున్న ప్రముఖ కవుల, వాగ్గేయకారుల గీతాలు మనకి పాఠాలు. అయితే వీటిని పరిశీలించి పాటలు రాద్దాము అనుకుంటే కొంత చిక్కే అని నా అనుభవం. సినారె గారి "ఆధునికాంధ్ర కవిత్వం" పుస్తకం చదివి పాటలు రాద్దామని నేను అనుకుని ఆ పుస్తకం మొదలెట్టాను. అంత స్థాయి పుస్తకం ప్రారంభ యత్నానికి సరికాదు.

పరిశీలన, పరిశోధన కోణంలో కాక, వినడం, imbibe చేస్కోవడం అంటే మనసులోకి ఎక్కించుకోవడం చేస్తే వారి ప్రేరణ అంతర్లీనంగా మనకి అందుతుంది.

*

పాట లోని భావం, కవిత్వం, సృజనాత్మకత.. వీటికి అందరు సాహిత్యకారుల వలెనే నిరంతర పఠనం, సాహిత్య అనుసరణ మార్గాలు.

పాటకి కావాల్సిన భావము, స్వభావము మనసులో నింపుకుని, అప్పుడు పాట రాయడం మొదలుపెడితే పాట త్వరగా వస్తుంది అని నా అభిప్రాయం. ఇదమిత్థం గా తేలని ఆలోచనతో పాట మొదలెడితే పల్లవి తర్వాత పాటంతా పూరించడమే సరిపోతుంది.

పాట అంటే ఇష్టమైన అందరికీ అభినందనలు 🙏🏼

ఫుట్‌నోట్స్

[1] మీరు పద్య రచన చేయగలరా? ఛందో బద్ధంగా రాయడం ఎలా, ఎందుకు నేర్చుకున్నారు?కు నళినీకాన్త్ వల్లభజోస్యుల (Nalinikanth Vallabhajosyula)యొక్క సమాధానం
ఈ పాట అనవసరంగా పాడయిపోయిందే అని మీరు బాధపడ్డ సందర్భం ఏమిటి?
ఈ మధ్య కాలంలో ఒక పాట విషయంలో మాత్రం సాహిత్యానికి తగ్గ న్యాయం చిత్రీకరణలో జరగలేదని అనిపించింది. అది అరవింద సమేత వీరరాఘవ చిత్రంలోని పెనివిటి పాట.

ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారు ఎలా తీశారు? అన్న దానిపై ఎలాంటి విమర్శ చెయ్యట్లేదిక్కడ. ఎందుకంటే దర్శకుడిగా ఆయనకు సవాలక్ష టెన్షన్స్ ఉంటాయి. అది నేను అర్థం చేసుకోగలను. ఎన్నో పనులు ఉంటాయి. ఆయనకు క్షణం తీరిక కూడా దొరకని రోజులు ఉంటాయి.

ఇక్కడ కేవలం నేను నా విషువలైజేషన్ ను మాత్రమే పంచుకుంటున్నాను. ఆ పాటలోని సాహిత్యానికి, సంగీతానికి మైమరచిపోయి ఇలా ఉండుంటే బావుండు అని ఊహించుకున్నాను.

రచన - రామజోగయ్య శాస్త్రి గారు

సంగీతం - థమన్ గారు

గాత్రం - కాలభైరవ గారు


పెనివిటి సాంగ్

ఇటీవలి కాలంలో మీరు విన్న అత్యంత అర్థవంతమైన పాట ఏమిటి?
పాటల జోలికి, సినిమాల జోలికి నేను వెళ్ళటం లేదు గానీ నేను సినిమాలు చూసినంతకాలం, పాటలు విన్నంత కాలం అర్థంపర్ధం లేని పాటలే ఎక్కువ వినబడేవి.

అసలు ఎలా వ్రాసి ఉంటారా అనే అనుమానమూ వచ్చేది. హీరోయిన్ ని ఒక ఆబ్జెక్టుగా భావిస్తే బోలెడన్ని పాటలు చకచకా పకపకా వ్రాసేయొచ్చని తర్వాత అర్ధమైంది.

హీరోయిన్ ఉన్నది "ఆఫర్" చేయడానికే అనేది పాయింట్ గా పట్టుకుంటే ఎన్నెన్ని పాటలు వ్రాయవచ్చో కదా.

హీరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకోండి అప్పుడు హీరోయిన్ ఇలా పాడుతుంది.

సర్కిలూ సర్కిలూ సోదా చేయ్ వయ్యో..
ఆత్రమోయనుమానమో తీర్చుకోవయ్యో

అబ్బే ఆత్రమోయనుమానమో అనేది కొత్త పదం ఏమీ కాదండి. "ఆత్రమో అనుమానమో".. కలిపి పాడేసి కొంతకాలం దాకా ఆ పదం ఏమి

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీలో మీరు పాడుకునే పాటలు ఏవి?
ఒంటరిగా ఉన్నపుడు నచ్చినట్టు ఉండవచ్చు. ముఖ్యంగా పెద్దగా పాటలు పాడుకుంటూ రెండు స్టెప్పులు వేస్తూ మంచి కాఫీ చేస్కోవచ్చు.

నేను కొత్త పాటలు ఎక్కువ వినను అండి. నాకొక వింత భయం ఉంది. కొత్త పాటలు వింటే పాత పాటలు ఇక విననేమో లేదా అవి జాబితా కిందకి వెలిపోతాయేమో అని భయం.

నేను ఎక్కువగా పాటలే వింటూంటా. లోక్డౌన్ లో నా చెవులు నొప్పి పుట్టి ఆసుపత్రికి కూడా వెళ్ళవలసి వచ్చింది.

నా పాటల జాబితా లో మీకు ఒక మూడు పాటలు తెలియ చేస్తాను.

"ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవు లేవురా"- ఖుషీ సినిమా లో పాట.

"అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే" - ప్రేమికుడు సినిమా లోని పాట.

"నీవు లేక వీణ, పలుకాలేనన్నది.. నీవు

"ఏదయ మీ దయ మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు"ఈ పాట యే సందర్భంలో పాడారు? ఎవరు వ్రాసారు? తెలుపగలరు?
ఏదయ! మీ దయ మా మీద లేదు..

ఇంతసెపుంచుతారిది మీకు తగునా?

దసరాకు వస్తిమని విసవిసలు పడక!

చేతిలో లేదనక అప్పివ్వరానక!

రేపురా మాపురా మళ్ళీ రమ్మనకా!

ఇప్పుడు లేవనక ఇవ్వలేమనక!

ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమీ!

పావలా బెడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు,

ముప్పావాలా ఇస్తే ముట్టేది లేదు, ఇచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము.

అయ్య వారికి చాలు అయిదు వరహాలు పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు.

శీఘ్రమే పంపండి శ్రీమంతులారా!

జయీ భవా ! జయీ భావ! జయీ భావ!










*శిబి డేగ - సంవాదం* 


ఓ శిబిరాజా! నీ గుణగణాలు గొప్పవటా ఓ శిబిరాజా!
ఆకలితో నుంటిని నా ఆహారం విడిచిపెట్టు !!ఓ!!
1.
ఆహారం తిని జీవులు అభివృద్ధిని పొందుతాయి 
పావురాన్ని ఇవ్వకుంటే ప్రాణాలే పోతాయి
నా భార్యా పిల్లలంతా నా వెనకే మరణింతురు 
ఒక్కజీవి కొరకు పెక్కుజీవుల చంపుట మేలా !ఓ!
2. 
ధర్మానికి కీడు చేసే ధర్మం గొప్పది కాదు ll 2 ll
ధర్మమంటే ఏమిటి? అందరికి మేలు కలగాలి
పావురాలు డేగల కాహారమనెను వేదము
కావున నా యాహారం పావురాన్ని విడిచిపెట్టు!! ఓ!!
3.
ఓహో డేగా! నీ మాటలు బహుముచ్చటాయె llఓll
పక్షివయ్యు ధర్మాలని పలికెదవే తెలిసినట్లు 
ప్రాణభయంతోడ ఈ పావురమూ శరణన్నది
ఆశ్రితులను విడిచిపెట్టు టదియెట్లు ధర్మమయా !!ఓ!!
4.
నీ యాకలి తీర్చుటకు పావురమే కావలెనా..?!!నీ!!
అడవిలోన ఎన్ని లేవు? ఆకలి తీర్చెడు ప్రాణులు
పందులు, దున్నలు, లేళ్లు, పక్షుల మాంసాలు నీకు
కోరినంత తెచ్చియిత్తు కోపమంత వదలిపెట్టు !!ఓ!!
5.
ఓ శిబిరాజా! మా ఆహారమే పావురాలు !! ‌ఓ!!
పావురాన్ని కాపాడగ ప్రతిన నీవు చేసియుంటే
దీని ఎత్తు నీ మాంసం కోసి తూచిపెట్టు నాకు 
ప్రతినను చెల్లించుకో.. పావురాన్ని ఉంచుకో.. !!ఓ!!
6.
ఓహో డేగా! నాపై నీ దయ చూపినావు !!ఓహో!!
తగినంతగ నామాంసం తక్కెడతో తూచి యిత్తు
తనువులోని మాంసమంత తరిగిన సరిపోదాయె
నా కాయము నర్పించి నీ కోరిక తీర్చెదను !! ఓహో !!
7.
బళి బళి రాజా! బాగున్నదయా నీ త్యాగం...!!బ!!
డేగను నేనింద్రుడను పావుర మతడగ్ని చూడు
నీ ధైర్యము నీ శౌర్యము అసాధ్యమ్ము అన్యులకు
నీ కీర్తి శాశ్వతముగ నిలిచిపోవు నో రాజా! !!2!!

-------రచన,
మధుసూదన్ కోమటి,
SA (Telugu),
ప్ర.ఉ. పాఠశాల పానగల్లు, నల్లగొండ.

( 8వ తరగతి - తెలుగు "త్యాగనిరతి" పాఠం ఆధారంగా వ్రాయబడినది )

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...