నినాదం : (Slogan స్లోగన్ లేదా moto మోటో) సాహిత్యపరంగా చూస్తే దీనర్థం, ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య. ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేష ఉద్దేశం.
సూక్తి :
ఉక్తి అంటే చెప్పినది. ఇది సంస్కృత పదము. సూక్తి అంటే చక్కగా చెప్పబడిన మాట. పదాలు సవరించు.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి.
జ.
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు
సూక్తులు:
మాటకు ప్రాణం సత్యం
అభాగ్యతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ
నగర జీవనంపై కొన్ని నినాదాలు రాయండి.
జ:
“నగరంలో మనిషి జీవితం – చదవదగ్గ ఒక గ్రంథం”.
“నగరజీవికి తీరిక దక్కదు – నగరజీవికి కోరిక తీరదు”.
“నగరంలో మనిషివి మెర్క్యూరి నవ్వులు – నగరంలో మనిషివి పాదరసం నడకలు”.
“నగరంలో వాహనాల రద్దీ – అవుతాడు మనిషి రోగాల బందీ”.
“నగరంలో కొందరికి సుఖాల నెలవు – కొందరికి కష్టాల కొలువు”.
“విద్యా – వైద్య కేంద్రం నగరం – విలాసాల సంద్రం నగరం”.
“సాంకేతికతకు పెద్దన్న నగరం – వ్యాపారాలు దండిగున్నది నగరం”.
“పల్లె తల్లివంటిది – నగరం ప్రియరాలివంటిది”.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు వ్రాయండి.
జ:
వైధవ్య వివాహాలు – భావిభారతకు సౌభాగ్యాలు
మత పిశాచాలను చంపు – మమతానుబంధాల్ని పెంచు
అంటరానితనము – సమాజాన్ని కూల్చే అణుబాంబు
మూఢవిశ్వాసాన్ని త్యజించు – నూత్న సత్యాన్ని ఆహ్వానించు
శకునాలు చూడడం – పిఱికితనాన్ని గౌరవించడం.
నీకు తెలిసిన పల్లెసీమల అందాల్ని గూర్చి సూక్తులు రాయండి.
జవాబు:
పల్లెసీమల అందం – పసిడి పంటల నిలయం
పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
పాడిపంటలతో పల్లెలు – పసిడి నవ్వులతో పిల్లలు
సమాజానికి మూలనిధులు
పల్లెల సీమల జగతి – దేశాభివృద్ధుల ప్రగతి.
పల్లె సీమలే మన దేశపుధాన్యాగారాలు.
రణగొణ ధ్వనులు లేని పల్లెటూళ్ళు – ప్రశాంతమైన పరుకటిళ్ళు
దేశానికి పట్టుగొమ్మలు – మన పల్లెటూళ్ళు.
తెలంగాణ వైభవాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తెలంగాణ వీరుల గడ్డ – త్యాగాలకు అడ్డ.
కాకతీయుల కదనరంగం తెలంగాణ
కళలకు మూలస్తంభం తెలంగాణ
సర్వమానవ సమానత్వం అది తెలంగాణ తత్త్వం.
దాశరథి పద్యాలు వరద గోదావరి పరవళ్ళు.
తెలంగాణ కోటి రత్నాల వీణ.
భిన్న సంస్కృతుల సంగమం తెలంగాణ.
కలం పట్టిన కవులెందరికో కన్నతల్లి తెలంగాణ.
గలగలమని నదులు నడయాడిన నేల తెలంగాణ