పాఠం ఉద్దేశం:
వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకొని వారిని వెక్కిరించకుండా అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. వారిపట్ల మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపముతో క్షమాపణ అడగాలి. పిల్లలు ఈర్ష్యభావాన్ని విడిచిపెట్టి మానసిక పరివర్తన కలిగి పెద్దలకు ఎటువంటి అపకారం చేయకుండా వారితో గౌరవ భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ ‘నాయనమ్మ’ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘కథానిక’ (ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక (ప్యేయత. మానవతా ఏలువలను తెలియజెప్పే కథానిక ఇది.
ప్రవేశిక:
కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. “అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం” అనే భావన భారతీయ కుటుంబానికి (ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మ… ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పలల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్భూర్తి ఈ పాఠం చదివి పొందుదాం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
(అ) రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు? ఎందుకు?
జవాబు.
నాకున్న మంచి మిత్రుడు మధు. ఆతడు వరంగల్లులో ఉంటాడు. నాఈడు వాడే. అతడు అందరివలె తుంటరి కాదు. నేను చేసే తప్పులను సరిదిద్దుతాడు. చదువు విషయంలో సహాయం చేస్తాడు. పెద్దలతో ఎలామెలగాలో చెబుతాడు. అతనివల్ల నేనెంతో పరివర్తన చెందాను. అందుకే అతడు నాకు మంచిమిత్రుడు.
(ఆ) మీరు వృద్ధులకు ఎటువంటి సేవచేస్తారో తెలుపండి?
జవాబు.
మేము వృద్ధులకు రోడ్డుదాటటంలో సహాయం చేస్తాము. ఆరోగ్యం సరిగాలేనివారిని దవాఖానాకు తీసుకెళ్తాము. స్పృహ కోల్పోయేస్థితిలో ఉంటే ప్రథమచికిత్సగా వారికి సపర్యలు చేసి నీరు తాగించి, తినడానికి ఏదైనా ఇచ్చి తినిపిస్తాము. వారికి మా చేతనైనంత వరకు సేవ చేస్తాము. అవసరమైతే పెద్దల సహాయం తీసుకుంటాము.
(ఇ) “కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి” ఎందుకో రాయండి.
జవాబు.
కుటుంబంలో అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, పినతండ్రి, పిన్నమ్మ, వారి పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఎంత చదివినా జీవితంలో కొన్ని పెద్దల ద్వారా అనుసరించి నేర్చుకోవాలి. అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు అనుకరణ ద్వారానే నేర్చుకుంటాము. పిల్లలు చేసే తప్పులను సరిదిద్దుతారు. దండనలు, బుజ్జగింపులు, కీచులాటలు, అన్యోన్యతలు, ప్రేమాభిమానాలు సమిష్టికుటుంబంలోనే ఉంటాయి. స్వార్థంతో విడిపోయి ఇలాంటి అనుభూతులకు దూరంగా బతకడంలో ఏ మాత్రము సుఖసంతోషాలుండవు.
(ఈ) “ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషంవంటిది” దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
విషం మనిషి నాడీవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపి తొందరగా మనిషిని చంపేస్తుంది. ఈర్ష్యకూడా అలాంటిదే. ఈర్ష్య మనసుకు సంబంధించినది. ఓర్వలేనితనంవల్ల మనిషి మంచి ఆలోచన చేయడు. మంచి పనులు చేయడు. ప్రతీకారంతో చెడు ఆలోచనలు, చెడుపనులు చేస్తాడు. చెడు ఫలితాలను పొందుతాడు. సమాజంలో చెడ్డవానిగా గుర్తింపు పొందుతాడు. గౌరవ మర్యాదలు కోల్పోయి, అందరిచే దూషింపబడతాడు. అంటే ఈర్ష్యకలవాడు నైతికంగా చచ్చిపోతాడన్నమాట. అందుకే ఈర్ష్య మనసుకు విషం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
శేఖర్ మార్పురావడానికి కారణాలేమిటి? నేటికాలంలో ఎక్కువమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు? దుస్థితికి కారణాలు వివరించండి ?
జవాబు.
శేఖర్ రవి తనతో ఎక్కువ సమయం ఆడుకోలేదనే కోపంతో నాయనమ్మ కాలు విరగడానికి కారణమయ్యాడు. తర్వాత అవ్వ బాధపడడం చూచి అవ్వ స్థానంలో అమ్మను ఊహించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు.
నేటి కాలంలో వృద్ధులు చాలామంది వృద్ధాశ్రమాల్లో గడుపుచున్నారు. దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్నకుటుంబాలుగా మారడం.
జీవన విధానంలో డబ్బుసంపాదనే ధ్యేయంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టళ్ళలో విడిచిపెడుతున్నారు. దీంతో వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన దంపతులు విశ్రాంతి తీసుకోవాలి. వారికి వృద్ధులను పట్టించుకునే తీరిక లేదు కనుక వృద్ధాశ్రమాల్లో వదిలి వస్తున్నారు. ఇంకనూ వృద్ధుల వద్ద సంపద లేకపోవడం, వారి పనులు వారు చేసుకోలేకపోవడం నాగరికత పేరుతో నాజూకు అధికమై పరిశుభ్రత పేరుతో వృద్ధులను అసహ్యించుకోవడం వంటి కారణాలు నేటి దుస్థితికి తోడై వృద్ధాశ్రమాలను పెంచుతున్నాయి.
V. పదజాల వినియోగం
1. ఈ కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.
అంధులు = గుడ్డివారు
ద్వేషం = పగ
జ్ఞాపకం = గుర్తు
తుంటరి = అల్లరిచేసేవాడు
జపమాల = జపం చేసుకునే మాల
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది వాక్యాలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.
(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!
జవాబు.
(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!
2. ఈ కింది వాక్యాలలో క్రియలను గుర్తించి పక్కనే రాయండి.
(అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు.
జవాబు. వెళ్ళాడు.
(ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది.
జవాబు. చదివి నిద్రపోయింది.
(ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు.
జవాబు. పరిగెత్తుతున్నాడు.
(ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
జవాబు. చేసి, వెళ్ళాడు.
పై వాక్యాలలో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి? ఈ రెండు క్రియల్లో భేదం గమనించారా?
(ఆ) చదివి, నిద్రపోయింది.
(ఈ) చేసి, వెళ్ళాడు.
3. కిందివాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.
(అ) చెంబుతో నీళ్ళుముంచుకొని, తాగుతుంది.
జవాబు. అసమాపక క్రియ : ముంచుకొని
(ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
జవాబు. అసమాపక క్రియ : ఆపివేసి
(ఇ) పరీక్షచేసి, కాలువిరిగిందని చెప్పాడు.
జవాబు. అసమాపక క్రియ : చేసి
(ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
జవాబు. అసమాపక క్రియ : తీసుకొని
సమాపకక్రియ : తాగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి