సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 SCERT         🌐 School Edu Dept.         🌐 LEARNING MANAGEMENT SYSTEM _ SCERT         🌐 * * PGI(Performance Grading Index         🌐 * * DIKSHA WEB         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"    
🌐 భాషను ఎంచుకోండి

9, సెప్టెంబర్ 2026, బుధవారం

నీలి నేల ఎతలు దళిత కథ – స్త్రీ చిత్రణ - కొలిమి అంతర్జాల పత్రిక 01.09.2026 - డా. సిద్దెంకి

www.siddenky.blogspot.com
కొలిమి సౌజన్యంతో .....

దళిత కథ – స్త్రీ చిత్రణ

కులం, లింగం అనే రెండు అణచివేత వ్యవస్థలు భారతీయ సమాజంలో పరస్పరం ముడిపడి దళిత స్త్రీల జీవితాలను సంక్లిష్టమైన వివక్షకు గురిచేస్తున్నాయని దళిత స్త్రీల సాహిత్యం ప్రతిపాదిస్తుంది. ఉన్నతకుల స్త్రీలకూ, దళిత పురుషులకూ భిన్నంగా దళిత స్త్రీలు కులవివక్ష, పితృస్వామ్యం, శ్రమదోపిడీ, లైంగిక హింస, సామాజిక వెలివేత వంటి బహుళ అణచివేతలను ఎదుర్కొంటారు. ఇంట్లో పితృస్వామ్యం గోడదెబ్బలా, బయట కులస్వామ్యం చెంపదెబ్బలా బాధిస్తుంది. ఈ ద్వంద్వ అణచివేతకు వ్యతిరేకంగా దళిత స్త్రీవాద సాహిత్యం ప్రత్యామ్నాయ స్వరంగా అవతరించింది. ఇది దళిత స్త్రీని బాధితురాలిగానే కాకుండా, తన అస్తిత్వాన్ని ప్రకటించే, ఆధిపత్యాన్ని ప్రశ్నించే, ఆత్మగౌరవం కోసం పోరాడే చైతన్యవంతురాలిగా చిత్రిస్తుంది. బాధను ప్రతిఘటనగా, మౌనాన్ని స్వరంగా మలుస్తూ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే సాహిత్యంగా దళిత స్త్రీల రచనలు నిలుస్తాయి.



మనుష్యులని మరయంత్రాలుగా చూసే సమాజంలో మానవత్వం లేదు. ప్రతి పని ఫలితం కడుపు కొరకే. మనిషికి భుక్తి కావాలి. విముక్తి కావాలి. తనకు కావలసిన దాని కోసం మనిషి పరిస్థితిని ఎలా మలుచుకుంటాడో తెలియజెప్పే మామిడి సత్యవతి కథ ‘స్వేఛ్చ’. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రంగడు పని చేస్తూనే వుంటాడు. రాత్రి ఏ అవసరమొచ్చినా సిస్టర్ నైట్ డ్యూటిలా చేస్తాడు. అయినా జానకమ్మకు ఆమె కోడలుకు వానిమీద జాలి, దయలేదు. వాడికి ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. స్వేచ్ఛలేని వాడికి సినిమాలు ఉండనట్లే రంగడికి లేవు. అంతకు ముందు పనిచేసి పారిపోయిన సూరిగాడు పక్కింట్లోకి పనికి వస్తాడు. వాడు సినిమాలో రావుగోపాలరావు సినిమా సన్నివేశం వివరిస్తూ గంగిని సినిమాకు చూడుమని నాలుగు రూపాయలలోంచి ఒక రూపాయి యిస్తాడు. అది చూసిన రంగనికి స్వేచ్ఛ కావాలని కోరుకుని రాత్రికి రాత్రే వెళ్లిపోతాడు. ఈ అలగా జాతిని కాంగ్రెస్‌వాడు, కమ్యూనిస్టు వాడు బాగుచేయలేడని అనుకుంటుంది జానకమ్మ. తనకు కావల్సింది ప్రాధేయపడి, పోరాడి పొందలేని రంగడు పారిపోయాడు. పోరాటానికి సిద్ధమైతే వ్యవస్థలో నలిగిపోతాడు. ఇలాంటి రంగల్లు అడుగుకు ఒకరు చొప్పున కనబడుతారు. వాళ్లంతా ఏకమై పోరాడితే జీవచ్చవాలు కనబడవు. ఈ దేశంలోని మనుష్యులు మనుష్యులుగా గుర్తించబడుతారని జానకమ్మ చిన్న కొడుకు రాఘవ ఆలోచిస్తుంటాడు.

తల్లిలేని పిల్లలుపడే కష్టాలను చిత్రంచిన మామిడి సత్యవతి “తెరతొలగింది” కథ. శశిరేఖ, కృష్ణ కదులుతున్న రైలులో ఉన్నారు. కృష్ణ చెబుతుంటే వింటున్నట్టే వింటుంది. ఎందుకో ఆమెకు గుండె దడదడలాడుతుంది. ఆలోచనలతో అలజడిగా ఉంది మనసు. రైలు ఆగింది. ఒక ముసలమ్మ ఇద్దరు పిల్లలతో కంపార్టుమెంట్‌లోకి ప్రవేశించింది. ముసలమ్మను శశిరేఖ అడుగుతుంది. దుర్మార్గుడైన మా కొడుకు మరో యువతి ఆకర్షణకు లోనవడం వల్ల బి.ఏ చదివిన కోడలు కుమిలిపోయింది. నేను వారించిన. ఇలాంటి సంబంధాలు ఎక్కువ రోజులుండయని చెప్పినా కనీసం పిల్లలకోసమైనా బతకాల్సింది. చనిపోయింది. ఆ యువతి రెండో భార్యగా తిష్టవేసిందని చెబుతుంటే కృష్ణ అసహనంగా చూస్తున్నాడు. నా పిల్లలకు సవతితల్లితో ఇలాంటి బాధలుంటాయని తలంచింది. నా పిల్లలకోసమే నా జీవితమని తలుచుకుంటుంటే మనసు దూదిపింజలా తేలిపోయింది. అప్పుడే రైలు దిగి ఇంటికి వెళ్ళిపోయింది. స్నేహితుల ఇండ్లలో ఉండిపోను ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య అని వేడుకుంటుంది. యిక మనిద్దరమే ఒకరికి ఒకరం తోడు అన్నట్లుగా ఒకడి మీద ఒకడి కాలుచెయ్యి వేసిపడుకున్నారు. ఆ దృశ్యం చూడగానే శశిరేఖ హృదయం ద్రవించింది. కన్నీటితో ఇద్దరినీ గుండెలకు హత్తుకుంది. పాఠకునిలో, పాత్రలో పరివర్తన తెచ్చేవిధంగా సందేశంగా ముగుస్తుందీ కథ.

భర్త చెడువ్యసనాలను మాన్పించి తనదారిలోకి తెచ్చుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నమే మామిడి సత్యవతి ‘సుశీల’ కథ. గురజాడ ‘దిద్దుబాటు’తో సరితూగే లాంటి రచనగా ఈ కథను పోల్చవచ్చు. డెబ్బై దశకం వరకు మగ ఉద్యోగులు సంపాదిస్తున్నామనే యావలో కొన్ని వ్యసనాలలో మునిగి తేలేవారనీ తెలియజేస్తున్న కథ. “నీవు నలుగురు పిల్లల తల్లివి. ఎవరో కొన్నారనీ రెండువందలు పెట్టి చీరలు కొంటావా?” అని శేఖరం సుశీలను అడుగుతాడు. “ఏమీ పనిచేయని ఎదురింటి ఇరువై అయిదేళ్ల వితంతువు రెండు వందలు పెట్టి కొంటుంటే పెద్దాఫీసరు పెళ్లాన్ని కదా! అందుకే కొన్నానని” సుశీల చెప్పగానే శేఖరం కంపించిపోతాడు. “ఎవరో పెద్దాఫీసర్ రాత్రి తొమ్మిది గంటలకు వస్తాడు. నేను చూసాను. ఆఫీసు పనివలన మీరు పదిగంటలకు వస్తారు. నా సంసారాన్ని రచ్చకీడుస్తానా? అన్నట్లు మీ నెల ఖర్చులు మూడువందలకు పైగా దాటుతుందండి. ఖర్చు కొంతయినా తగ్గించుకొండి.” అని పనిలో మునిగిపోయింది. తరువాత నెల నుండి శేఖరం ఖర్చు పాతిక దాటలేదు. ఎదురింటావిడ వెంకటగిరి చీరలు కొనడం మానేసింది.

పెళ్లికాని యువతిని సమాజం ఎలా హేళనగా చూస్తుందో తెలిపే బోయ జంగయ్య కథ ‘సాలిని’. ఒక పెద్దమనిషి ఉంపుడుగత్తెగా ఉండుమంటాడు. మరొకడు రెండో పెళ్లి చేసుకుంటానంటాడు. సంఘ సేవకురాలిగా పని చేసినప్పటికీ సాలినిని శీలం లేనిదిగా భావిస్తారు.

పొలం పనిచేస్తూ విధవరాలైన జీవితాన్ని చిత్రంచిన బోజదే మరోకథ ‘లేకి బతుకులు’. మాల చంద్రమ్మ రాములు పొలం బావిని వారికే జీతముంటారు. ప్రమాదవశాత్తు మోటబావిల్లో పడి ఊపిరి ఆడక చనిపోతాడు. పరిగె ఏరుకోమన్న యజమాని సుశీల అందులోంచి సగం తీసుకుంటుంది.

సమాజంలో భర్తపోయిన స్త్రీలంటే చులకన. లొంగదీసుకోవడం కోసం ఎన్ని ఎత్తులు వేస్తారో, లొంగకపోతే ఆ కుటుంబాన్ని ఎలా హింసిస్తారో, లైంగిక కోరికలు తీర్చనందుకు చేసే దౌర్జన్యాలను తెలిపే జాతశ్రీ కథ ‘మల్లెతీగ’. జానకమ్మ తనకు తండ్రి వయస్సు అంతటి పెద్దరాంరెడ్డి తనపైన కన్ను వేశాడనీ, రాఘవయ్య చెప్పుకుంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతానని మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాడు. తదనంతరం జానకమ్మ కొడుకు సారయ్యను పెద్దరాంరెడ్డి తన ఇంటిలో దుద్దులు దొంగతనం చేశానడనీ చెట్టుకు కట్టేసి హింసిస్తాడు. ఇంత జరుగుతున్నా రాఘవయ్య జానకమ్మని, రాఘవయ్యని పట్టించుకోడు. నిందలేయడానికి కూసుండ్రు. న్యాయం చేయడానికి కాదనగానే కర్రందుకోరా దాన్ని కొడుదాం అంటాడు. అనుచరులు వద్దంటారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతారు. సారయ్య పోలీసులకు అప్పగిస్తాడు. రాంరెడ్డి నీ మీద మనసు పడ్డాడు. నీ కొడుకు రావాలంటే అతని కోరిక తీర్చాల్సిందే అని రాఘవయ్య జానకమ్మతో తన నీచ బుద్ధిని తెలుపుతాడు. కోపగిస్తుంది. ఖాకీలు ఆమె శరీరంతో మూడురోజులు ఆడుకొని జానకమ్మ కొడుకుని విడిపిస్తారు. ఒక విధవ జీవితం కుక్కలు చింపిన విస్తరి అంటే ఏమిటో అర్తమవుతుంది. కథ చదువుతుంటే మనసు కుతకుత ఉడుకుతది.

దూర దేశానికి వెళ్లిన పెనిమిటి. ఒంటరి స్త్రీలను లైంగికంగా వేధిస్తే ఎలా గుణపాఠం ఎలా చెప్పాలో చిత్రంచిన గూడ అంజయ్య కథ ‘అమ్మక్క’. పాలు అమ్ముకునే అమ్మక్కను సంగిరెడ్డి, పోలీసు కన్నలాల్ వేధించిండు. నోరున్న మనుషులను చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టాలి అని చెప్పిన నల్లపోశాలు మాట అమలు పరచడానికి అమ్మక్క అత్తా కోడండ్లు మాంకలమ్మ జాతర్ల కన్నాలాల్ రాగనే దొంగ దొంగ అని అరవగానే ఊరిజనాలంత ఏకమై కొట్టి పోలీస్ స్టేషన్‌ల అప్పగించారు.

దుబాయివోయిన చెంద్రయ్య ఎయిడ్స్ రోగాన్ని ఎంటబెట్టుకొచ్చిండు. ఆరునెల్లల్ల కాలం జేసిండు. తాళ్ల రేవుకు గంగదాటిన అమ్మక్క జాడలేదు.

బలహీనతలమీద దెబ్బ కొడుతారు. లొంగదీసుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తారో తెలిపే చైతన్య ప్రకాశ్ కథ ‘దేవ’. పెనిమిటి ఊరికి పోయింది తెలుసుకున్న మల్రెడ్డి పటేల్ తన భార్య పిలిచిందని పిలిపించుకున్నడు. ఇంట్లకు రాంగనే తలుపు పెట్టిండు. పోతా అని తలుపు తెరిసింది. ‘నీకెన్ని జేసిన. అప్పు గట్టుడు ఆలిసెమైన ఒప్పుకున్నా. బొంబాయికి పోతాంటే సాయపడ్తి. పొలం అచ్చు కట్టిత్తి. లేదంటే నా అప్పుకట్టు..అత్తవా? పోతవా?’ దబాయించిండు పటేల్. ఏడుసుకుంట నిలవడ్డది దేవ. ఉరుకొచ్చి రెక్కపట్టిండు పటేల్. “‘పటేండ్ల రూపం మారిందే గాని గుణం మారలేదు!” అని అనుకుంది దేవ.

నాకు నేనే ఆయుధాన్నని ఎరిగిన బాలమ్మను దొర బలాత్కారాన్ని తిప్పికొట్టిన పూలన్‌దేవి జీవితంలాంటి కథ గోగు శ్యామల రాసిన ‘తాటక’. దొర జీతగాళ్లతో పోటి నీళ్లు పారపెడుతుంటే ఓర్వలేని దొర బావికాడ జొన్న సేన్లకు గుంజకపోతూ “ఏమే తాటకి లo… మొగోనిలెక్కన నీళ్లు పారవెడుతున్నవే.” జాకెట్ల చేతిపెట్టి కలెతిప్పుతుండు. ఎంతో ఆడోళ్లను కరాబు చేసిన మాటలు గురుతుకొచ్చినయి బాలమ్మకు. ఈరిగెల పడితే ఇడిసిపెడుతడు అనుకున్నవా? నీవు పిలిస్తే ఎవ్వరు రారే. మొగోల్లకన్న ముందు వోయి నీళ్లు పారపెడుతావే” అని చెంపమీద కొట్టిండు. దూరాన పడిలేచింది. మీద పడడానికి వస్తున్న దొర కాళ్లమధ్య గుత్తిమీద తన్నింది. ‘సస్తినే తాటకి ముండా!… పట్టుకోండిరా” అని దొర పిలుస్తుండు. ఊరుఊరంతా దొర పిచ్చలమీద తన్నిందట అని మాలమాదిగ ఆడోళ్లు గుసగుసలు పెడుతుండ్రు.

మనసుపడ్డ మనిషి మంచితనాన్ని తెలుసుకోలేని మర్మమే బోయిని భాస్కర్ కథ ‘గడ్డిపర్క’. పనిచేస్తూ కన్నును కోల్పోయిన రాముని భార్య సీతమ్మ మీద మనసుపడ్డ రాజయ్య ఒక రోజు రాత్రి నీ మీద కాయిసుపడ్డ అని అడుగుతాడు. “నీవు నా భర్త చిన్నప్పటి దోస్తువి. నన్నింతే అర్థం చేసుకున్నవా? నా మొగుడు గడ్డిపర్క అనుకుంటున్నవు. నిజమే నీలాగ బుర్దల బొర్రే పంది కాదు. నన్ను కదిలియ్య ఏ మొగోని తరం కాదు. నీ అసొంటి లత్కోరోనికి తప్ప. పో. పో.” అన్నది సీతమ్మ. పడుకున్నట్లే పడుకుండి మేల్కతోటి ఈ మాటలు విన్న రాముడు “ఆనాడు నువ్వు నా భార్య వైనందుకు సంబరపడ్డ. ఇప్పుడు నీ మొగున్ని అయినందుకు గర్వపడుతున్న” అని అంటడు. దళిత స్త్రీలు ఎంత ఉత్తమతత్వాన్ని చూపుతున్నారో తెలుపుతుందీ కథ.

స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాలను వివరించే జాజుల గౌరి కథ ‘నీళ్లబాయి’. మోటలు పోయాక మోటర్లు వచ్చాయి నీళ్ల ఊటలు కనబడుతున్నాయి. నీళ్లబాయిల ఆడామగా తేడాలేకుండా చిన్నప్పటి నుంచే ఈత కొట్టడం సాధారణమైంది. “గీ ఆడిపోరలకు గింతనన్నా సెరం లేదమ్మ మగ పోరగాండ్లుగల్సి ఎట్ల ఈత కొడ్తుండ్రో సూడు” లింగ వివక్షను చిత్రంచింది.

దళిత స్త్రీకి ఇంటా బయట రెండు చోట్ల వివక్ష ఎలా ఉంటుందో? ఎలా వేధిస్తారో తెలిపిన పచ్చనూరు అనురాధ కథ ‘పాట నేర్చిన నెమలి’. స్వప్న పెద్దమనిషి కాగానే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. పెళ్లి వద్దంటది. తల్లిదండ్రులు వినరు. కళ్యాణితో కలసి ఆడుతుంది. పాడుతుంది. ఇంట్ల తెలియగానే బడికి బందువెడ్తరు. జండా వందనం రోజున బలవంతం మీద ఆడుతుంది. పాడుతుంది. అందరు మెచ్చుకుంటారు. డాన్స్ నేర్చుకుంటున్నపుడు కళ్యాణి పెద్దమ్మ “మీది మాలకులం అని ఎద్దేవా” చేస్తది. కాంతా టీచర్ పంపిన నోట్స్ తెచ్చిన తోటి విద్యార్థులు ఇంటికి రావడం వలన అనుమానిస్తుంటది తల్లి రాజవ్వ. అనారోగ్యం ముదురుతుంటది. ఏవో పసరు మందులు రాస్తుంటారు. ఒకరోజు రాత్రి హాస్పిటల్ తీసుకెళతారు. శవమైతది. పెళ్లే వద్దన్న స్వప్నకు జిల్లేడు కొమ్మకు పెళ్లి చేస్తారు. కళ్యాణి, మిత్రులందరు ఏడుస్తారు. అంత్యక్రియలు ముగిసాక “నాకు స్వప్ననే ప్రేరణ. నా ఇష్టాన్ని గుర్తించే సమాజం కావాలి” అని ఓదార్పు కోసం వచ్చిన కళ్యాణి చెప్పింది. ఆడేచోట, పాడేచోట ప్రతిసారి తలుచుకుంటుంది.

మాదిగ స్నేహితునితో అన్న పెళ్లికి అన్ని పనులు చేసింతర్వాత నువ్వు మాదిగవని కులవివక్షల్ని చూపిన కథ కేపి లక్క్ష్మి నరసింహ ‘అన్న పెళ్లయ్యేంత వరకు’లో కొట్టొచ్చినట్లు చిత్రించాడు.

దళిత సర్పంచ్‌ల దీనస్థితిని ఆవిష్కరించిన డా. పసునూరి కథ ‘ఊగి ఊగి ఉయాల’.“ఏడ మారుతది బిడ్డా మన రాత! నేను సర్పంచినేగని నా ఇష్టంతోటి రాజ్యమేలనీకి సర్పంచ్ అయినానురా, ఆ పెద్దిరెడ్డి పటేల్ నిలబడితే నిలబడ్డ. ఏలి (వేలి ) ముద్దరెయ్యమంటే ఏసిన. సూత్తాంటే ఐదేండ్లు వొడిసే… సర్పంచ్‌గా వున్నా గూడా గిట్లనే కూలీనీ చేసుకుంటి. ఇప్పుడు సర్పంచిగిరి పోయినంక గూడ మల్ల గదే దిక్కైంది బిడ్డా!” అని అగ్రకుల స్త్రీవాదాన్ని తిప్పి కొట్టింది పెద్దమ్మ.

స్త్రీలపట్ల వివక్ష, హింస అస్థిత్వస్పృహ కలిగినప్పటినుంచే కథల్లోకి ప్రవేశించాయి. పురుషాధిపత్యానికి దళిత స్త్రీ ఎలా బలయితుందో డప్పోల్ల రమేష్ ‘దునియల’ కథ వివరిస్తుంది. ఒక దశలో జీవితం మీద విరక్తి పుట్టినా చావడానికి సిద్దమై చావు పరిష్కారం కాదని అనుకున్నది బతికి సాధించడమే నిజమైన పరిష్కారం చూపుతది.

పాఠశాలలో ఉన్న స్నేహం ఊళ్లోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలిపేది జూపాక సుభద్ర కథ ‘బల్లె దోస్తులు ఊల్లెగాదు’లో బట్టలు, గాజులు ఇచ్చి పుచ్చుకోవడం కులం వల్ల ఏర్పడే అవస్థను తీర్చి దిద్దింది. మాదిగలకు బతుకమ్మ లేకుండా చేసిన మనువాదుల కుటల్ని పసిగట్టి చిత్రిక పట్టిన జూపాక సుభద్ర ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ వివరిస్తుంది.

ఎక్కువ కులాలతో మిళితమవడాన్ని దళితులకు చేయూతను ఇచ్చిన బహుజన తత్వాన్ని చిత్రించిన తప్పెట ఓదయ్యగారి ‘మల్లక్క’ కథ. మల్లక్క కుర్మ. రచయిత మాదిగ. తన కుమార్తె అడిగినందుకు ఉపాధ్యాయుడు తనగతం చెప్ప్పుతడు. మా అయ్య సచ్చిపోయినపుడు ఆ అక్కనే సందం చేసిందీ. నా సదువుకు సాయం చేసింది. మీ అమ్మతో పెళ్లి చేసింది. నువ్వు, నీ చెల్లెలు, నీతమ్ముడు పుట్టినప్పుడు అతీగతీ లేని యాల్ల అన్నీ తానై నాకు సాయం చేసింది. ఆప్పటి బాధలు చెపుతూ మనసును పిండేస్తడు. అది కథకాదు జీవితం గనుక మనసుతెరల బతుకు వెన్నెలను పిండోలే ఆరవోస్తడు..

పుట్టి పెరిగాక ప్రయోజకుడై బతుకు మీద తన్నడమే బాధకరం. మనసు విరిగిపడే దృష్టాంతాన్ని విలపించిన అమృతవర్షిణి జయరాజ్ కథ ‘ఋణానుబంధం’. ఈ కథలో అగ్రజాతి స్త్రీ ప్రేమలోపడి కన్నతల్లిని ఆమె త్యాగాన్ని మరిచిపోవడం బాధాకరం. సర్వం కోల్పోయిన తల్లిగా కనబడుతుంది. అగ్రజాతి స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్న కులానికి, తలానికి, రక్తసంబంధానికి దూరమైతారనీ వివరిస్తుంది.

శ్రీహర్ష గానకచేరికి మనసుపడి రెండో మనువాడిన హంసలేఖిని నిస్వార్థ జీవితం గంధం విజయలక్క్ష్మి కథ ‘రెండో మనసు. మూడో మనిషి’. విశేషకృషి చేసిన శ్రీహర్షకు గానగంధర్వ బిరుదు ప్రధానమయ్యాక మిత్రులకు పార్టీ ఇస్తాడు. మీకు పిల్లలుంటే ఎంతో బాగుండు అని అన్నారు. నేను తండ్రినే. లేఖిని తల్లిని కాకుండా ఒప్పించిన. అని చెప్పే మాటలు లేఖిని వినపడ్డాయి. గుండెపోటుతో మరణించినప్పుడు ఎందుకు ఏడుపు వస్తలేదని వసుధ అడిగినప్పుడు అతనిది స్వార్థం. రెండో మనసు. నేను మూడో మనిషిని అని బాధ పడుతుంది.

బూతం ముత్యాలు ‘మాయమ్మ మల్లమ్మ’, జాజుల గౌరి ‘అమ్మ’, స్త్రీవాద కథలు. పురిటిలోనే పసిపిల్లలను అమ్ముకునే దుస్తితిని కొమ్ము రజిత ‘ఫెర్టిలిటి’కథలో వివరించింది. తాళపల్లి యాకమ్మ ‘మమతల మల్లెలు’ కథ నాన్న ఘనత పతాకస్థాయి కల్పించింది. మహిళలందరి సమస్యలకే తీరుగా ఉండవని కులాన్ని, ఆర్థికస్థితిని బట్టి వేరువేరని ‘ఉత్సవం’ కథలో యాకమ్మ చిత్రించింది. పల్లెటూర్లలో బాల్యవివాహాన్ని అడ్డుకోవడం గురించి తాళ్ళపల్లి యాకమ్మ ‘గురుదక్షిణ’ సామాజిక స్పృహకలిగిస్తుంది. గర్భిణీ స్త్రీ చనిపోతే బొందల గడ్డలో పూడ్చిపెట్టేటపుడు అవమానించి, అడ్డుకొని, చివరకు బొందల గడ్డలో కూడా స్త్రీ వివక్ష ఎదుర్కొంటున్నదని తెలియజేసే కథ డి.జి హైమావతి ‘బొందల గడ్డకు దూరంగా’ మహిళల దుర్భర వివక్షకు దుర్బిని. ఆర్థిక స్థాయి పెరిగినా, వివక్ష పోదనీ, పూజచేసే వద్ద బైండ్ల పూజారి ఉంటేనే సమానత్వం ఉంటుందని కలగన్న కథ గోగు శ్యామల కథ ‘కలల రాణి’ భవిష్యత్తు దర్శనం చేసింది. అవమానాల మధ్య సమాజంలో స్తీల బతుకు ఎంగిలి విస్తరిలా ఉందని కిరణ్‌చర్ల ‘ఇత్తారాకుల తట్ట’ కథలో దృశ్యీకరిస్తాడు. భర్త రోజు కొడుతుంటే తిరగబడ్డ భార్య కథే మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’ వివరిస్తది. విప్లవం బాట పట్టిన సెల్లెల్ని చూద్దామని వెళ్లిన అక్కకు చెల్లెలు మరియ మనువాద బ్రాహ్మణీయ భావజాలం నింపుకున్న మంజుల అని తెలియగానే వెనుదిరిగిన అక్క బాధే జూపాక సుభద్ర ‘మా సెల్లే మల్లక్క’ కథ వివరిస్తుంది. పిల్లలు లేని గొడ్రాలు శుష్క జీవితాన్ని పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో బహుమఖీన పాత్రల్లో ఒదుగుతున్న స్త్రీ జీవితాన్ని జాజుల గౌరి ‘నిట్టూర్పు’ కథలో వివరిస్తుంది. వీరి ‘కంచె’ కథ ఎదుగుతున్న బాలిక జీవితంలో కంచెలు ఎలా మొలుస్తాయో దృశ్యీకరిస్తుంది.

పెరుమాండ్ల రామ్‘కన్నీటి కథ’ దు:ఖపు తెరతో ముగిస్తాడు. ‘ఆమె పేరు హంపి’ (కిరణ్ చర్ల) కథ అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్న రూరల్ లైఫ్ గురించి రాసాడు. డి. జి హైమవతి కథ ‘సీతవ్వ’లో దళిత ఆత్మగౌరవం కనబడుతుంది. చనిపోయిన భర్తను తలుచుకుంటూ విషాదంగా చిత్రంచాడు. గంధం విజయలక్క్ష్మి కథ ‘ముచ్చలిక’ గోసంగి స్త్రీ సాధించుకున్న విజయాలు విశదపరిచింది. వీరి ‘ఫీజు’ కథలో మోసంచేసిన భర్తను కటకటాల పాలు చేసిన మహాలక్క్ష్మి ఒక మేల్కొల్పు. ప్రేమించి పెద్ద చేసిన వ్యక్తి నాయనమ్మ కళ్ళ ముందు చనిపోతూన్న దీనస్థితిని చిత్రించిన సిద్దెంకి యాదగిరి కథ ‘నాయనమ్మ’ ఆత్మీయతకు చిరునామా.

వీరిదే ‘ఎంతకంతే’ కథ ప్రపంచీకరణ నేపథ్యంలో దంపతుల సంబంధాల్లోని మార్పులను సమర్థంగా చిత్రించింది. ఎయిడ్స్‌ నేపథ్యమైనా, ఊహించని ముగింపుతో కథ ప్రత్యేకతను సాధించింది. గురజాడ ‘దిద్దుబాటు’ ముగింపును గుర్తుచేసే ఆశ్చర్యం కలిగించింది.

మన్నె ఏలియా సంస్కారవంతమైన కథ నేటి పల్లెల్లో కూడా ఉందని తెలియజేసే కథ “లచ్చవ్వ”. లచ్చవ్వ, బక్కయ్య భార్యా భర్తలు. బక్కయ్య తాగుబోతు. తాగిన తర్వాత బాధలు పెట్టడం, పంచాయతి చేయడం మామూలే. ఓపికతో భరించిన లచ్చవ్వ మంచితనంతో భర్తను మార్చుకుంటుంది. మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’లో భార్యను ఇల్లిల్లు తిప్పికొట్టే రాజారావును, తిరగబడి ఒక్క గుద్దు గుద్దుమని తమ్ముడు చెబితే, తిరగబడ్డ కాంతక్క భయపడుతుంటాడు.

ఊరి పీడనను చిత్రించిన భూతం ముత్యాలు కథ ‘ఉసురు’. భర్తపోయి సుంకరితనం చేస్తున్న మాల సూరమ్మ లొంగకపోయేసరికి అందరు చూస్తుండగానే కొట్టిండు పటేలు. ఫిర్యాదు చేస్తే సాక్ష్యం లేనిది ఏమి చేయలేమని చేతులు ఎత్తేసిండ్రు పోలీసోల్లు. ఉసురు ఉట్టిగపోదని శాపనార్థాలు పెటింది సూరమ్మ. మరికొన్నాళ్లకు గొల్లపెద్దులు భార్యను కూలికి అఘాయిత్యం చేయబోతే మందకాస్తూ చూసిన పెద్దులు గొడ్డలికి బలి అయ్యాడు.

మాల మాదిగ ఆడోల్ల గోసలు మాటలకందయి. కాపాడే పురాణ పురుషులు లేరు. రారు. భూస్వాముల ఆగడాల” సావు ఎతలల్లో బయటపడ్డ వాస్తవాలను విలపించిన విషాదాలే జూపాక సుభద్ర రాసిన ‘పగిలిన పచ్చిపుండ్లు’. మాదిగోనికి మంచి పెండ్లాం ఉండొద్దు అనే సామెతవోలే. మొగని పక్కలనుంచి బలాత్కారం చేసుడే. ఆడోళ్ల బతుకులు కుక్కలు చింపిన ఇత్తార్లేనని ఏతం బొక్కెన తీరు ఎత్తిపోసింది. మామకు ఇద్దరు పెళ్లాలుండేవారనీ, మామ సావునాడే తెలుసుకొన్నది. అత్తబతుకును, ఆమెలాంటి కింది కులాల ఆడోల్లను పటేల్ భూస్వాములు ఎట్లా నాశనం చేసారో తెలిపింది. కథ చదువుతుంటే మనసంతా పచ్చిపుండ్లలా సలుపరం పెడుతది.

గజిటెడ్ సంతకం కోసం వెళితే లంచం ఇవ్వాలని పేర్కొనే జాజుల గౌరి కథ ‘దస్కత్’. కొడుకు స్కాలర్‌షిప్ ఫాం మీద సంతకం కోసం డాక్టర్ దగ్గరకు వెళితే రెండు రోజులు ఆపి చివరకు ముప్పై రూపాయలు లంచం అడుగుతారు. నా కూలి రోజుకు నలుబై. ఎక్కడి నుంచి తేవాలని బోరున విలపిస్తది. సంతకం కావాలంటే పైసలు ఇయ్యాలంటాడు కంపోండర్. అవ్వా! ఇయ్యరాదే కొడుకు అనడం నిస్సహాయ స్థితిని తెలుపుతుంది.

జాతర అనేది ఊరంతా కలసి చేసుకునే పండుగ అయినప్పటికీ, అగ్రవర్ణ వ్యక్తిని అనుకోకుండా తాకినా జరిగే ఘోర పరిణామాలను అనేక సంఘటనలు తెలియజేస్తాయి.

మహిళపై జరిగే హింసను, పురాణ ప్రతీకలతో ఆధునిక జీవితాన్ని మేళవిస్తూ చింతకింది శివశంకర్ రాసిన “బొందల గడ్డ” కథ విప్లవ చైతన్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తుంది.

కులం ఒక్కటే. వివక్షలలో తేడా. స్త్రీలకు కులం లోపలి వివక్ష. ఆఖరి ఘడియలోను వివక్ష. అంతిమ యాత్రలోనూ వివక్ష. దహనంలో వివక్ష. కేవలం స్త్రీలకు మాత్రమేనని రూఢీపరచిన డి. జి. హైమావతి కథ ‘బొందలగడ్డ’. గర్భిణీ స్త్రీ పురిటినొప్పులు పడుతూ చనిపోయింది. బొందల గడ్డలో పూడ్చిపెట్టనీయ్యకుండా అవమానాలు శవానికి మసిరాయడం, నల్లకోడిని కట్టడం, అడుగడుగున అవమానాలు జరుపడం ఒక హేయమైన చర్యగా పశ్నించింది. ఆమె స్నేహితురాలు చావులో ఇలాంటి అనవసరమైన కట్టుబాట్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నాయి.

కుటుంబం కోసం జీవితం ధారపోసింది గీత. చెల్లెలు పిల్లల్ని అనాధలు చేసి వెళ్లిపోయినప్పుడు ముప్పైఐదేళ్లు నిండిన గీత తన తల్లి మాట విని, తాను పెళ్లి చేసుకోవద్దని గీసుకున్న గీతదాటి ఆలోచించింది. వాసుతో పిల్లల కోసం కొత్త జీవితాన్ని ప్రారంబించాలనుకోవడమే డా. మండల స్వామి కథ ‘బతుకు గీత’ భవిష్యత్తుకు పునాది.

ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం అని బలంగా నమ్మించే కథ ఇది. కష్టాన్ని నమ్ముకొని కాలంతో పాటు ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలమనే సందేశాన్ని స్పష్టంగా అందిస్తుంది. సిస్టర్ అనసూయ రచించిన ‘విక్టరీ ఇస్ యువర్స’ కథ, గెలుపు శక్తి మనలోనే ఉందని గుర్తుచేస్తూ, ప్రతి మనిషిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రేరణగా నిలుస్తుంది.

మనసు క్షణక్షణం మారుతుంది. స్త్రీల మనసు గురించి చైతన్య స్రవంతిలో రాసిన మొగురం రాజనర్సు కథ ‘మనసు’. అదే చూపు. తదేకమైన చూపు. వెంటాడే చూపు. వేటాడే చూపు. గుచ్చుకునే చూపు అని తన అందం గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటదొక యువతి. రైలులో ఆమెకి నచ్చిన ఒక యువకున్ని ఉద్దేశించి పలకరిస్తాడు. పేరడుగుతాడు. అప్పుడు నా తడాఖా చూపెడుత అని అనుకుంటది. రైలు ఆగగానే టీ తాగడానికి వెళ్తుంటే నన్ను రమ్మని అడుగొచ్చుకదా! అని అనుకుంటుంది. అతను ఆమెను అసలే చూడడు. పట్టించుకోడు. ఇతడు మగాడేనా అని అనుకుంటుంది.

నెలనెల స్త్రీలకు కలిగే ఋతుక్రమంతో వివిధ కులాలలో ఉండే ఛాందసవాద ఆచారాలు వ్యవహారాలు, కట్టుబాట్లు ఎలా నియంత్రిస్తాయో, తెలుపుతూ ప్రత్యామ్నాయ పరిష్కారం దిశగా ఆలోచింపజేసే జూపాక సుభద్ర కథ ‘అంటు- ముట్టు’ దుర్మార్గ మహిళాలోకానికి ప్రత్యామ్యాయం చూసే మార్గదర్శనము చూపుతుంది.

తాగుబోతు భర్త బతుకును మార్చిన భార్య మంచితనాన్ని తెలిపే నూకపొంగు వెంకయ్య కథ ‘గంది దుళ్ళ’. నువ్ తాగుడు మానకపోతే నేను చచ్చిపోత అని బెదిరించగానే పిల్లల కోసం మారిన భర్త “ఇకముందు తాగనని” ప్రమాణం చేస్తాడు.

ఆశలు అడియాసలు చేసిన తమ్ముడు మిగిలిన మానసిక క్షోభ తెలిపే ఐనాల సైదులు కథ ‘చిన్నమ్మ’. చిన్నమ్మ పెద్దమనిషి కాగానే చదువద్దని తల్లి సూరమ్మ పొరు పెడుతుంది. సూరమ్మ తమ్ముడు ప్రకాశ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు. వేరే వాళ్లని పెళ్లి చేసుకొని దూరదేశం పోతాడు. కొన్నాళ్లకు సర్వం కోల్పోయి అనారోగ్య పీడితుడై వస్తాడు. పెళ్లి చేసుక”ంటాను అంటే చిన్నమ్మ కళ్లు చింతనిప్పుల్లా మండుతాయి.

ఉన్నతకులాల వారిని పెళ్లిచేసుకుంటే ఎలాంటి వివక్ష ఉంటుందో ఉపకులం వారు ప్రధాన కులం అబ్బాయిని, అమ్మాయిని చేసుకన్నా అదే పరిస్థితి ఉంటుందని తెలిపే సంపతి సోమయ్య కథ ‘ముచ్చటగా మూడో ముడి. ప్రేమ పెళ్లిలతో కులసమానం’ రాదు. కుల నిర్మూలన జరుగదని వివరిస్తుంది.

సతికి పతి, పతికి సతి సంబంధం చెప్పే సిస్టర్ అనసూయ కథ ‘ఆదర్శం’. రోగగ్రస్తమై చనిపోయిన భార్య కలలు నిజం చేయాలని భర్తని మళ్లీ పెళ్లి చేసుకొమ్మని అందరు ఒత్తిడి చేస్తుంటారు. భర్త తన భార్య కలలు నిజం చేస్తాడు. భర్త నిఖార్సుతనాన్ని వివరిస్తుంది. భర్త కోరికలను సాధించిపెట్టే మహిళల్లాగే భార్య ఆశయాలు సాధించాలనే భర్తలున్నారనీ తెలుపుతుంది.

పిల్లలు లేకపోతే ఏవిధంగా హింసిస్తారో తెలిపే రామ్ పెరుమాండ్ల ‘కన్నీటి కథ’ నిజంగా కన్నీరు తెప్పిస్తుంది.

గొడ్రాలని, ప్రతికార్యం కాడ ఎన్ని చీత్కారాలతో పిల్లలు లేక అవమానాల పాలైన ముత్యాలు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు. అని తెలిపే సిద్ధంకి యాదగిరి కథ ‘విరిగిన కల’. పిల్లల కోసం ఊరు మీద గర్భిణిగా మారిన వీరవ్వను మారుమనం తెచ్చింది ముత్యాలు. కొడుకు పుట్టిండు. ఎంతో ప్రేమను కురిపించే ఊశయ్య. నీకే పుట్టిండా అనే భరించని మాటకి ఉరిబెట్టుకుని చనిపోయిన విషాదం ముగింపులో కనబడుతుంది.

నిందలు మోపి ఆగం చేసిన ‘పిన్నం’ లాంటి బతుకులను ఉదాహరణగా నిలిపిన మేడి చైతన్య కథ ‘ఇత్తారాకుల తట్ట’. చిన్నాన్న పిన్నంను అనుమానంతో కొడ్తుండేవాడు. చంకచాటు బిడ్డగా ఉన్న రాజిగాన్ని గుంజుకొని ఆమెను ఊరెల్ల కొట్టారు.రాజిగాని మీద ప్రాణం. ఆమె విలువ తెలిసొచ్చేవరకు పదేళ్లు దాటింది. బాబాయి పిలిచినా రాలేదు. రాజిగాని పెళ్లిచూపులప్పుడు రాలేదు. పెళ్లికాడికి వచ్చింది. పెళ్లి తరుపువారు “నీలాంటి లంజలు దీవిస్తే మా బిడ్డకూడా బిచ్చమెత్తుకుంటదే.”అని ఆ మనిషి కొట్టింది. పెళ్లి చేసుకుంటున్న కొడుకు రాజిగాడు స్పందించలేదు. రచయిత తల్లే స్పందించింది. ఓదార్చింది. ‘నా అమ్మని కొట్టెది ఎవడ్రా?’ ఒక్క మాటనలేదని రచయితకి బాధ కలిగింది. బలవంతంగా యారాలు తినపెట్టింది. వాళ్ల గురించి ఎందుకు తపన పడుతావు అని అడిగిండు. నువ్వు పెద్ద కొడుకువు. వాడు చిన్న కొడుకువు. వాడికి తెలియదంది. వానపడుతున్నప్పుడు తిన్నందుకు ఇత్తారాకుల తట్ట ఎత్తుకొని ముందుకుపోతుంటే ఎంగిలి మెతుకులు వాననీల్లు చారు మొఖం మీదికి కారుతూనే ఉన్నాయి. ఆ చీకట్లో కొడుకు పెళ్లి చూసిన పిన్నం చీకట్లో కలిసిపోయింది. బాధలో బాధ్యత. బాధ్యతలో అవమానం ఓర్చుకున్న మాతృతత్వం మరిచిపోలేనిది.

దళిత కథా సాహిత్యంలో స్త్రీ చిత్రణ ఒక జీవన వాస్తవానికి అద్దం పడుతుంది. కులం, పితృస్వామ్యం, పేదరికం, లింగ వివక్ష, లైంగిక దోపిడీ వంటి సంకెళ్ల మధ్య నలిగిన దళిత స్త్రీ కన్నీటి కథ మాత్రమే కాదు; ఆత్మగౌరవం, ప్రతిఘటన, చైతన్యం, విముక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతీక. వివిధ కథల్లోని స్త్రీ పాత్రలు బాధను భరించే నిస్సహాయులుగా కాక, పరిస్థితులను ప్రశ్నించే ధీరులుగా, కుటుంబాన్ని నిలబెట్టే మాతృమూర్తులుగా, అన్యాయాన్ని ఎదిరించే చైతన్య స్వరాలుగా దర్శనమిస్తాయి. అందుకే దళిత స్త్రీ కథనం సమాజపు చీకటి మూలలను వెలుగులోకి తెచ్చే సాహిత్య దివిటీ. ఈ కథల పరిమళం సమానత్వం, మానవత్వం, స్వేచ్ఛ, ఆత్మగౌరవం వైపు సమాజాన్ని నడిపించే చిరస్మరణీయ సాహిత్య సుగంధంగా నిలుస్తుంది. దళిత స్త్రీల జీవితాలు శకశకాలాలు విరిగిపడుతున్న దృశ్యాలు చాలా రికార్డు అయ్యాయి.

(ఇంకా ఉంది…)

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జీవన వాస్తవికత - సిద్దెంకి యాదగిరి "తప్ష" కథలు - అరిగె కమలాకర్


నాటి నుంచి నేటి వరకు మానవుని జీవితంలో అంతర్భాగమైన కథకు ఎంతో ఆదరణ ఉంది. ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక మార్పులు వచ్చి పుస్తక పఠనం తగ్గినప్పటికీ కథకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో వచ్చే అనేక సంఘర్షణలకు పరిష్కారాలను చూపడం, బుద్ధి కుశలతను పెంపొందించడం కథల  ప్రధాన లక్ష్యం. వాస్తవిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించడం కథల యొక్క లక్షణం. స్వరాష్ట్ర ఏర్పాటులో కూడా కథ ప్రధానమైన పాత్ర పోషించింది.అలాంటి కథలను అందించిన కథ పుస్తకం సిద్దెంకి యాదగిరి "తప్ష". "ఒక కథకుడికి రచన సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చు కానీ జీవితము తెలియకపోతే సరి చేయడం ఎవరివల్లా కాదు" అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. మనవుని జీవితాన్ని ముడిసరుకు చేసి జీవిత వాస్తవికతను కళాత్మకంగా వ్యక్తీకరించి పాఠకుడిని ఆలోచింపచేయగలిగిన కథకులు సిద్దెంకి యాదగిరి. కథ మనిషి జీవితంలో అంతర్భాగం... మనిషి జీవిత ప్రతిబింబం కథ. 
          సిద్దెంకి యాదగిరి కథలు నిత్యనూతనంగా ఉంటాయి. కథ వస్తువు నవ్యత తో పాటు సామాజిక వాస్తవిక జీవితానికి దృశ్య రూపకంగా తోస్తుంది. కథను వినూత్న రీతిలో వ్యక్తీకరించడం, కథలోని మాలుపులు పాఠకులలో ఆలోచన రేకెత్తించి, ఉత్సుకథ కలిగిస్తాయి. కథను ఆకట్టుకునేలా రాయడంలో సిద్దెంకి కథలా ప్రధాన లక్షణం. తప్ష లో మొత్తం 15 కథలు ఉన్నాయి."ఆత్మ గౌరవ సాధన నినాదంతో ప్రయాణించిన మహనీయులకు మరియు సిద్దెంకి యాదగిరి నాయినమ్మ సిద్దెంకి మలవ్వ" అంకితం ఇవ్వడం జరిగింది.
        సిద్దెంకి యాదగిరి తప్ష కథలలో మొదటిది ' విరిగిన కల' ఈ కథ ఎంతో వైవిధ్యంతో కనబడుతుంది. ఈ కథ పేరులోనే రచయిత యొక్క శిల్పనైపుణ్యం తెలుస్తుంది. కలలు కనడం మానవ సహజం.... కానీ ఆ కలలను సహకారం చేసుకునే కృషే ఈ కథ. ఈ కథలోని పాత్రలు ఊశయ్య , ముత్యాలు, ఈరమని. ఊశయ్య , ముత్యాలు భార్యాభర్తలు. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. భార్య ముత్యాలు ఒత్తిడి వల్ల ఊశయ్య రెండవ పెళ్లి చేసుకుంటాడు.ఇది ఈ కథ యొక్క ఇతివృత్తం. వారు సంతానం కోసం " మొక్కని దేవుడు లేడు తిరగని తీర్థం లేదు". భర్తకు భోజనం పెట్టి ముత్యాలు ఇలా అన్నది " ఇగో మిట్టపల్లి కాడ తల్లి చచ్చిపోయిన బిడ్డ ఉన్నాడట. తెచ్చుకుందాం సాదుకుందాం. నంగునూర్ల తండ్రి సచినపోరగండ్లు నల్గురున్నారట. ఒక్కరిని ఇస్తారట ఏమంటవు". అనడంలో తల్లితనంకై ఆరాటాన్ని ఆవిష్కరించినాడు. స్త్రీ త్యాగానికి మారుపేరని, అరమరికలు లేని ప్రేమ కు నిదర్శనం అని నిరూపించాడు. సంతానం కోసం ఊశయ్యకు గర్భవతి అయినా ఈరమనితో  ముత్యాలు వివాహం చేయడం కథ మరింత పరిపుష్టం అయింది. సంతానం కలవడంతో ఒకరోజు ఊశయ్య , ఈరమని మందలించడం. ఈరమని భర్తను కూడా లెక్కచేయకుండా 
ప్రవర్తించడం తో కథ ముగుస్తుంది.
    "ఒగోల్ని అనడు.. ఓగోల్తోటి అనిపించుకోడు, పిల్లగాడంటే గట్లుండలె" అనే అన్మంతు అనే పాత్రతో పల్లెటూరులో ఉండే వావి వరుసలు, అనుభవ పాఠాలను అశువుగా అందించిన గురువులుగా అందించాడు.
"పైసలు చేయని పని మనుషులు జేత్తరు" అనడంలో పల్లెలో ఉండే సహకార భావన ఉంది. ఎవరు ఎలాపోయే నాకేంటి నేను బాగుంటే చాలు అనే ప్రస్తుత సమాజానికి బుద్ధిచెప్పే మాటే ఈ" బుద్ధి మాట "కథ.
    మనుషుల మనసులు కదిలించిన కథ" బోధ". చదువు ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుంది. "పాఠశాల చిన్న సమాజం" అందులో పుస్తక పాఠాలు కాదు... జీవిత పాఠాలు నేర్చుకుంటారు. భారతదేశంలో కులాలు, ఉపకులాలు అనేకం ఉన్నాయి. పూర్వం నుండి  కులాల మధ్య అస్పృశ్యతలు సహజంగా కనిపిస్తాయి. కానీ ఉప కులాల మధ్య కూడా అనేక అస్పృశ్యతలను గుర్తించి బోధ కథను నిర్మించడం రచయిత యొక్క పరిశీలన దృక్పథానికి తార్కానంగా చెప్పవచ్చు."బల్లె కులానికి ఒకడు చదువుతాడు అన్లా అందరికంటే తక్కువ కులపోలు మనమే కదా? అవునా కాదా ? నా తోటోళ్లు నేను కలిసాడుకుంటునం. కలిసి చదువుకుంటున్న". అని మానవులంతా ఒక్కటేనని బాలయ్య పాత్ర ద్వారా తెలియజేశాడు. జంతువుల మధ్య లేనటువంటి ఈ భేద భావం మానవుల్లో ఎవరు కలిగించారు అని వ్యతిరేకిస్తూ "ఎవరైనా మట్టి పని చేసిన సరే అందరూ మీ పొరగాండ్లను బడికి సదవడానికి పంపుండ్రి " అని చదువు యొక్క ఆవశ్యకతను రఘుపతి రెడ్డి అనే మరొక పాత్ర ద్వారా చెప్పించాడు రచయిత. సమాజంలో అందరూ జ్ఞానవంతులైనప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుంది. కొడుకు పుట్టాడన్న సంతోషం తీరకముందే, కళ్ళారా చూడకముందే దేశం కోసం దేశ రక్షణలో ప్రాణాల సైతం తృణప్రాయంగా వదిలినట్టి సైనికుడి కదే రేపటి సూర్యుడు.ఇది గుండెను పిండేసిన కథ."చనువాళ్ళతోపాటు కన్నీళ్లు కూడా సేవిస్తున్నాడు నాన్న దృష్టిలో రేపటి కమాండర్" అన్న ఈ మాటలుకు కనులు చెమ్మగిల్లక తప్పదు. ఇది సైనిక పరాక్రమాలతో పాటు, గ్రామీణ జీవనానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. రాయి తగిలి చచ్చిపోయే వాళ్లు, ప్రమాదంలో ఆయువు మోడిన వాళ్లు, పగలతో కొట్టుకొని చనిపోయే వాళ్లు, ప్రతి ఒక్కరు ఏదో ఒక తీరుగా, ఎప్పుడూ ఒకప్పుడు చనిపోతారు. చావడం తప్పనప్పుడు ప్రజల కోసం, దేశం కోసం, చావడంలో అమరత్వం ఉంటుందని రచయిత తెలియజేశారు.
     మార్పు కథ మరో భిన్నమైన జీవితాన్ని పట్టుకున్నది. ఏదైనా ఒక విషయాన్ని కంటితో చూడడం సహజం కానీ ఒక విషయాన్ని హృదయాంతరాల నుంచి వెలికి తీయడం రచయితకు సాధ్యం. రోడ్డు పక్కనో, సిగ్నల్ దగ్గరనో, బస్ స్టాపుల్లో, రైల్వే ప్లాట్ఫారంపై చాలామంది బాలల దుస్థితిని మనం చూస్తూనే ఉంటాం. కానీ వాటిని కొంత సమయంలో మర్చిపోవడం జరుగుతుంది. రచయిత మాత్రం దానిని దేశ ముఖచిత్రంపై దారిద్యం యొక్క జాడలకు నిదర్శనంగా నిలబెట్టారు. రచన సామాజిక చైతన్యానికి, బాధ్యతకు నిదర్శనమని నిరూపించారు.
 సునీల్ అనే ఉపాధ్యాయుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి స్పీడ్ గా వెళ్తుంటే 8 సంవత్సరాల పిల్లవాడు చింపిరి జుట్టు మోసిన బట్టలతో ఎదురొచ్చి కాళ్ళ మీద వాడతాడు. అలాగే సునీల్ కాళ్లపై కూడా ఆ పిల్లవాడు పడడం. పది రూపాయల కోసం అతని ఆరాటం ఆకలి పోరాటాన్ని గమనించి  అరడజన్ అరటి పండ్లు కొని అతని ఆకలి తీర్చాడు."ఏవూర్రా మీది?" 
                "ఏమో తెలియదు"
                " సదువుకో పోయినావురా?"
                "సదువనియ్యారు"   " అదే?"
      "మేం అడుక్కొచ్చి మాయ్యవ్వలకు   రోజు పైసలు ఇవ్వకపోతే తిండి పెట్టరు". ఈ సంభాషణ ఆకలి యొక్క తీవ్రతను బాల కార్మికుల యొక్క దుర్భర పరిస్థితిని మన కళ్ళకు కడుతుంది. కన్న తల్లిదండ్రులు కూడా ఇలా ప్రవర్తించడం ఎంత అమానవియం. పసివాడని చూడకుండా పక్క బొక్కలు ఇరిగేదాకా కొడతారా సోయి తప్పి పడిపోయిన పట్టించుకోని తల్లిదండ్రులు ఉంటారని? మనం ఊహించగలమా! పిల్లవాడికి సోయి వచ్చిన తర్వాత తను పక్కనే తాగుతూ మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులు గాని తల్లిదండ్రుల మాటలు విని చెత్తకుండీలో తెచ్చుకున్నారని గుర్తించాడు. పిల్లవాడు కంట్లో యాసిడ్ పోసి గుడ్డివాడిని చేయాలన్న వారి ఆలోచన విని కన్నీటి సంద్రం అయ్యాడు పిల్లవాడు. ఆ పిల్లవాడినే కాకుండా వాళ్ళ తమ్ముడిని, చెల్లెల్ని పరిస్థితులను వివరించాడు. హాస్టల్లో చేరితే సమయానికి ఆహారం దుప్పట్లు ఇస్తారని చెప్పిన పిల్లవాడు మాటలు, బాల కార్మికుల భావోద్వేగాలు పాఠకుల హృదయాలు స్పందింప చేస్తుంది. 
    తప్ష కథలో  చదువుకున్న వారిలో పైకి కనిపించని కులవివక్ష ఎలా ఉందో వివరించాడు. గుడిసెలాంటి మిద్దె ఇంట్లో తన కంట్లో దీపం వెలిగించుకుని చదివి ఉద్యోగం సంపాదించిన నర్సయ్యను కులం నొసటిమీద పత్స బొట్టై వెక్కిరించింది. ఉద్యోగరీత్యా సిద్దిపేటలో కిరాయి రూంల కోసం వెతుకుతున్నపుడు రూం కిరాయికి ఇవ్వం అని మొఖం మీదనే చెప్పడం.కుల రక్కసి రకరకాలుగా వేధించినప్పుడు ఎలాగైనా ఇంటి స్థలం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.కొంత జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇందులో కులం నిన్ను ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టదు అని నిరూపించాడు. వెల్కమ్ నగర్లో నడకతో రోజును ప్రారంభించే అందరూ ఉద్యోగస్తులే అయినా కులం వారిలో  విభజన రేఖలను గీసింది. 
      కన్నయ్య దంపతులు ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది రాకేశ్ సార్ని. తను ఆహ్వానించగానే అంబేద్కర్ వాంచించిన ప్రపంచం ఆవిష్కృతమైందని సంతోషంతో పొంగిపోతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలని ఉవ్విళ్లూరుతున్న రాకేష్ సార్ కు. లోకల్ కు    వెళుతున్న నర్సయ్య సార్ కనిపించాడు.కన్నయ్య సార్ వాళ్ళు కార్డు  ఇచ్చిండ్రా? అని అడిగాడు...లేదు ఇవ్వలేదే? అని ప్రశ్నార్థకంగా మొఖం పెట్టిండు నర్సయ్య సార్. వాళందరిది బిల్డింగ్లు  ధనికవర్గం. నాది రేకుల షెడ్డు బీద వర్గం. ఎప్పుడైనా ధనికులందరూ ఒక్కటే అని అనుకున్నాడు. ఇది ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇది ఆత్మగౌరవ జరిగిన అవమానం."నిన్నొక తీరు. నన్నొక తీరు పెండ్లికి పిలిచారు. నర్సన్నను ఇప్పటివరకు పిలువనేలేదు" దేశం నరాలలో పారుతుంది రక్తమా?లేక కులమా? అన్నట్లు ఉంది. రాకేష్ సార్, వెంకటయ్య సార్, నర్సయ్య సార్లు పోతే అందరం పోదాం.లేకుంటే లేదు. అని తప్ష చేసుకున్న తీరు ఈ కథకు పతాకస్థాయికి తీసుకొచ్చాడు రచయిత.
       
ఈ కథలు మట్టిలో పుట్టిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ గ్రంథ పురస్కారముగా కథా ప్రక్రియలు 2019వ సంవత్సరానికి ఎంపికైనది. 
మామూలు జీవితాలే అయినప్పటికీ మహోన్నతంగా తీర్చిదిద్దిన సిద్ధంకి యాదగిరి కథ రచన నైపుణ్యం పాటకున్ని ఎంతగానో హత్తుకునేటట్లు చేస్తుంది. ఈ కథలలో చదివించే గుణం కలదు.
      సిద్దెంకి యాదగిరి కథలు క్లుప్తంగా, నిర్దిష్టంగా ఉంటాయి. భావుకతతో కూడిన కథలు అందించడంలో రచయితది అందెవేసిన చేయ్యి. పాత్రల మధ్య సంఘర్షణ, సమస్యల సంక్లిష్టతను చూపడం జరిగింది. కథాంశాలు ఎక్కడ సడలిపోకుండా ఎత్తుగడలు ప్రదర్శించడం.
ఈ  కథశిల్పం  పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుంది. సిద్దెంకి రచనల్లో పల్లె మట్టిసౌరభాలు, సామెతలు, పలుకుబడులు తెలంగాణ భాషాయాస మూలాలను నిలుపుతాయి. అచ్చమైన పల్లెజీవనము, సహకార, ఆదర్శతత్వాలు పాఠకుల హృదయాలను తట్టిలేపుతాయి. సిద్దెంకి కథలు తెలంగాణ భాషాయాసలను చిరునామాలుగా నిలుస్తాయి.

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు హల్లులు (మహా ప్రాణాలు గాకుండా శబ్ధం తో )

www.siddenky.blogspot.com తెలుగు హల్లులు – ధ్వని & అక్షర గుర్తింపు

తెలుగు హల్లులు

ధ్వని గుర్తింపు → అక్షర గుర్తింపు → పద గుర్తింపు

🏆 స్కోర్: 0

ధ్వని అక్షర గుర్తింపు హల్లులు (ధ్వని)


www.siddenky.blogspot.com తెలుగు హల్లులు – ధ్వని & అక్షర గుర్తింపు

తెలుగు హల్లులు

ధ్వని గుర్తింపు → అక్షర గుర్తింపు → పద నిర్మాణం → వాక్య నిర్మాణం

🎯 అభ్యాస స్కోర్ : 0   /   0

తెలుగు అచ్చులు ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు శబ్దంతో

తెలుగు అచ్చులు - పదాలు, ధ్వని మరియు గుర్తింపు

తెలుగు అచ్చులు (Vowels)

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

సూచన: పదంపై నొక్కగానే ఆ పదం చదువుతుంది మరియు రంగు మారుతుంది. (ఉదాహరణకు 'అ' అక్షర పదాలు కింద ఇవ్వబడ్డాయి)

1. సరళ పదాలు (అ)

🌙
అర
🌊
అల
🚜
అరక
🏕️
అట
👧
అమల
🌱
అనప
➡️
అవతల
😒
అలక
😓
అలసట
🕊️
అమర

2. గుణింత పదాలు (అ)

🌲
అడవి
🏪
అంగడి
🍍
అనాస
🗣️
అరుపు
🦚
అందం
🐘
అంబారి
🤔
అపోహ
అరులు
🏁
అంతు
🌫️
అగోచర

3. ద్విత్వ పదాలు (అ)

👩‍👧
అమ్మ
👧
అక్క
👦
అన్న
👵
అత్త
🪞
అద్దం
🍘
అప్ప
📦
అట్ట
🤸
అల్లరి
👵
అవ్వ
👨
అన్నయ్య

31, ఆగస్టు 2026, సోమవారం

ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు అచ్చులు పద అభ్యాసం

.

తెలుగు అచ్చులు – పదాభ్యాసం

1. అ — 10 పదాలు

అడుగు     అరటి     అటు    అటవి            అగరు

  1. అగ్ని
  2. అణువు
  3. అనువు
  4. అమృతం
  5. అవసరం

ధ్వని గుర్తింపు:
🔊 అని పలకండి. ధ్వనితో ప్రారంభమయ్యే పదాన్ని గుర్తించండి.

అక్షర గుర్తింపు:
అ ఆ ఇ


2. ఆ — 10 పదాలు

  1. ఆకు
  2. ఆవు
  3. ఆట
  4. ఆరు
  5. ఆకు
  6. ఆమ
  7. ఆకాశం
  8. ఆదివారం
  9. ఆహారం
  10. ఆనందం

ధ్వని గుర్తింపు:
🔊 అని పలకండి. ధ్వనితో మొదలయ్యే పదాన్ని గుర్తించండి.

అక్షర గుర్తింపు:
ఇ ఈ ఉ


3. ఇ — 10 పదాలు

  1. ఇల
  2. ఇటు
  3. ఇటుక
  4. ఇసుక
  5. ఇరుగు
  6. ఇనుము
  7. ఇడ్లీ
  8. ఇరుకు
  9. ఇతి
  10. ఇష్టం

అక్షర గుర్తింపు:
ఈ ఉ ఎ ఐ

ధ్వని గుర్తింపు:
🔊 ఇ – ఇ – ఇ
ధ్వని ఉన్న పదాన్ని ఎంచుకోండి:
ఇటుక / ఆకు / ఊయల


4. ఈ — 10 పదాలు

  1. ఈగ
  2. ఈత
  3. ఈడు
  4. ఈర
  5. ఈశ్వరుడు
  6. ఈశుడు
  7. ఈనాడు
  8. ఈసారి
  9. ఈదురు
  10. ఈతరం

అక్షర గుర్తింపు:
ఉ ఊ ఏ


5. ఉ — 10 పదాలు

  1. ఉడత
  2. ఉడుకు
  3. ఉడుము
  4. ఉరము
  5. ఉరుము
  6. ఉసురు
  7. ఉలవ
  8. ఉంగరం
  9. ఉప్పు
  10. ఉతుకు

6. ఊ — 10 పదాలు

  1. ఊయల
  2. ఊరు
  3. ఊట
  4. ఊపిరి
  5. ఊరగాయ
  6. ఊరేగు
  7. ఊహ
  8. ఊహలు
  9. ఊదటం
  10. ఊపడం

7. ఋ — 10 పదాలు

  1. ఋషి
  2. ఋణం
  3. ఋతువు
  4. ఋజువు
  5. ఋజువు
  6. ఋణదాత
  7. ఋణపడి
  8. ఋగ్వేదం
  9. ఋషిక
  10. ఋతువు

ధ్వని గుర్తింపు:
🔊

అక్షర గుర్తింపు:
ఉ ఊ ఎ ఏ

సాధారణ ప్రాథమిక తెలుగు పదసంపదలో ఋతో ప్రారంభమయ్యే పదాలు చాలా పరిమితం. పైవి ప్రధానంగా సంస్కృత మూల పదాలు.


8. ౠ — ప్రత్యేక గుర్తింపు

అచ్చుతో ఆధునిక తెలుగు సాధారణ వాడుకలో సరళ పదాలు దాదాపు లేవు.

అక్షర గుర్తింపు

ౠ ఋ ఊ

ధ్వని గుర్తింపు

🔊 అనే అచ్చును ఉపాధ్యాయుడు పలికి, విద్యార్థితో పునరావృతం చేయించాలి.

గుణిత గుర్తింపు

క + ౄ = కౄ


9. ఌ — ప్రత్యేక గుర్తింపు

అచ్చుతో సాధారణ తెలుగు పదాలు చాలా అరుదు.

అక్షర గుర్తింపు

ఎ ఇ ఉ

ధ్వని గుర్తింపు

🔊 అని పలికి గుర్తించండి.

గుణిత గుర్తింపు

క + ౢ = కౢ


10. ౡ — ప్రత్యేక గుర్తింపు

అచ్చుతో సాధారణ తెలుగు వాడుకలో పదాలు లేవు.

అక్షర గుర్తింపు

ఌ ఋ ఏ ఐ

గుణిత గుర్తింపు

క + ౣ = కౣ


11. ఎ — 10 పదాలు

  1. ఎలుక
  2. ఎర
  3. ఎరుపు
  4. ఎడమ
  5. ఎగురు
  6. ఎగర
  7. ఎండు
  8. ఎత్తు
  9. ఎరువు
  10. ఎలుగు

12. ఏ — 10 పదాలు

  1. ఏనుగు
  2. ఏరు
  3. ఏడు
  4. ఏది
  5. ఏట
  6. ఏకము
  7. ఏకాంతం
  8. ఏలిక
  9. ఏలుగు
  10. ఏరడం

13. ఐ — 10 పదాలు

  1. ఐదు
  2. ఐక్యం
  3. ఐతే
  4. ఐశ్వర్యం
  5. ఐకమత్యం
  6. ఐదు
  7. ఐనా
  8. ఐతిహ్యం
  9. ఐక్యము
  10. ఐహికం

ఐక్యం, ఐకమత్యం వంటి పదాల్లో సంయుక్తాక్షరాలు ఉన్నందున ప్రారంభ స్థాయి పిల్లలకు ఇవ్వకుండా, అవసరమైతే ఐదు, ఐతే, ఐనా వంటి సులభ పదాలనే ఉపయోగించండి.


14. ఒ — 10 పదాలు

  1. ఒంటె
  2. ఒడ్డు
  3. ఒడిలో
  4. ఒర
  5. ఒలుకు
  6. ఒరుగు
  7. ఒత్తు
  8. ఒలిచు
  9. ఒంటరి
  10. ఒరుసు

ఒడ్డు, ఒత్తు వంటి పదాల్లో ద్విత్వ అక్షరాలు ఉన్నాయి. మీ నియమం ప్రకారం వాటిని తొలగిస్తే: ఒంటె, ఒర, ఒలుకు, ఒరుగు, ఒలిచు, ఒరుసు వంటి పదాలను మాత్రమే ఉపయోగించాలి.


15. ఓ — 10 పదాలు

  1. ఓడ
  2. ఓటు
  3. ఓటమి
  4. ఓపిక
  5. ఓర
  6. ఓల
  7. ఓదార్పు
  8. ఓనం
  9. ఓటరు
  10. ఓపికగా

16. ఔ — 10 పదాలు

  1. ఔషధం
  2. ఔను
  3. ఔతారం
  4. ఔన్నత్యం
  5. ఔదార్యం
  6. ఔత్సాహిక
  7. ఔపచారిక
  8. ఔచిత్యం
  9. ఔదాసీన్యం
  10. ఔరా

ప్రారంభ స్థాయి కోసం ఔను, ఔషధం, ఔరా వంటి పదాలనే ముందుగా ఉపయోగించడం మంచిది.


🎯 కృత్యం–1: అక్షర గుర్తింపు

సూచన: ఇచ్చిన అచ్చులలో ప్రశ్నలో ఉన్న అచ్చును గుర్తించి చుట్టండి.

1. అ

అ ఆ ఇ ఉ ఎ

2. ఈ

ఇ ఈ ఉ ఊ ఏ

3. ఎ

అ ఇ ఎ ఏ ఐ

4. ఓ

ఒ ఓ ఔ ఆ ఉ

5. ఔ

ఔ ఓ ఐ ఏ అ


🔊 కృత్యం–2: ధ్వని గుర్తింపు

ఉపాధ్యాయుడు పదాన్ని చదవాలి. విద్యార్థి మొదటి ధ్వనిని గుర్తించాలి.

ఉదాహరణ:

ఆవు → ఆ
ఇటుక → ఇ
ఈగ → ఈ
ఉడత → ఉ
ఊయల → ఊ
ఎలుక → ఎ
ఏనుగు → ఏ
ఐదు → ఐ
ఒంటె → ఒ
ఓడ → ఓ
ఔషధం → ఔ

విద్యార్థి గుర్తించాలి:

పదం
ఆకు
ఇసుక
ఊయల
ఉడత

🎲 కృత్యం–3: పదకేళి

క్రింది పదాలను సరైన అచ్చు కింద రాయండి.

ఆకు – ఇటుక – ఈగ – ఉడత – ఊయల – ఎలుక – ఏనుగు – ఐదు – ఒంటె – ఓడ – ఔషధం


✏️ కృత్యం–4: ఖాళీలు పూరించండి

సరైన అచ్చును పెట్టి పదాన్ని పూర్తి చేయండి.

  1. __కు → ఆకు
  2. __టుక → ఇటుక
  3. __గ → ఈగ
  4. __డత → ఉడత
  5. __యల → ఊయల
  6. __లుక → ఎలుక
  7. __నుగు → ఏనుగు
  8. __దు → ఐదు
  9. __ంటె → ఒంటె
  10. __డ → ఓడ
  11. __షధం → ఔషధం

✅ కృత్యం–5: తప్పొప్పులు

సరైనదానికి ✓, తప్పుకు ✗ పెట్టండి.

  1. ఆకు → తో మొదలవుతుంది. □
  2. ఇటుక → తో మొదలవుతుంది. □
  3. ఈగ → తో మొదలవుతుంది. □
  4. ఉడత → తో మొదలవుతుంది. □
  5. ఊయల → తో మొదలవుతుంది. □
  6. ఎలుక → తో మొదలవుతుంది. □
  7. ఏనుగు → తో మొదలవుతుంది. □
  8. ఐదు → తో మొదలవుతుంది. □
  9. ఓడ → తో మొదలవుతుంది. □
  10. ఔషధం → తో మొదలవుతుంది. □

🧩 కృత్యం–6: అచ్చు–పదం జతపరచండి

అచ్చును పదంతో కలపండి.

─── ఏనుగు
─── ఆకు
─── ఇటుక
─── ఈగ
─── ఉడత
─── ఊయల
─── ఎలుక
─── ఏనుగు
─── ఐదు
─── ఒంటె
─── ఓడ
─── ఔషధం


📌 ఉపాధ్యాయునికి ముఖ్య సూచన

మీరు చెప్పిన “ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు వద్దు” అనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తే, అగ్ని, ఇష్టం, ఉంగరం, ఐక్యం, ఒత్తు, ఓదార్పు వంటి పదాలను ప్రాథమిక పదజాబితా నుంచి తొలగించడం మంచిది.

అలాగే ౠ, ఌ, ౡలకు 10 చొప్పున కల్పిత పదాలు తయారు చేయడం కంటే, అక్షర గుర్తింపు → ధ్వని గుర్తింపు → గుణిత రూపం → సరళ పదం లభ్యత అనే క్రమంలో బోధించడం శాస్త్రీయంగా సరైన విధానం.


తెలుగు అచ్చులు ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు శబ్దంతో

తెలుగు అచ్చులు - ధ్వని మరియు అక్షర గుర్తింపు

🌸 తెలుగు అచ్చులు 🌸

ధ్వని గుర్తింపు • అక్షర గుర్తింపు • పదకేళి

🔤 అక్షర గుర్తింపు

👉 అక్షరాన్ని నొక్కండి — ఆ అక్షరం మాత్రమే వినిపిస్తుంది.

🔊 ధ్వని గుర్తింపు

👉 పదాన్ని నొక్కండి — పదం మాత్రమే వినిపిస్తుంది.

🎮 అక్షరాలు తారుమారు చేసే ఆట

క్రింద ఉన్న అక్షరాలను సరైన క్రమంలో నొక్కి పదాన్ని తయారు చేయండి.

⭐ స్కోర్: 0    |    ప్రశ్న: 1
ఈ అచ్చుతో పదం తయారు చేయండి:
మీ సమాధానం ఇక్కడ కనిపిస్తుంది

👩‍🏫 విద్యార్థికి సూచనలు

1️⃣ అక్షరాన్ని నొక్కి దాని ధ్వనిని వినండి.

2️⃣ పదాన్ని నొక్కి పదాన్ని వినండి.

3️⃣ తారుమారు చేసిన అక్షరాలను ఒక్కొక్కటిగా నొక్కండి.

4️⃣ సరైన పదాన్ని తయారు చేయండి.

5️⃣ సరైన సమాధానం వస్తే 👏 చప్పట్ల శబ్దం వినిపిస్తుంది.

6️⃣ అభినందన సందేశం కూడా శబ్దంతో వినిపిస్తుంది.