సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.
2, ఆగస్టు 2024, శుక్రవారం
VI. 6 . ప్రేరణ
VII. 5. పల్లె అందాలు
.....,: XXXX
ఇట్లునీ మిత్రుడు,శంకర్.
చిరునామా :కె. సురేష్,7వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
VII. 4 అమ్మ జ్ఞాపకాలు
VI. 12. కాపాడుకుందాం
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఒక కట్టెలు కొట్టేవాడున్నాడు.
ప్రశ్న 2.
బొమ్మలోని వ్యక్తి ఏమి చేసి ఉండవచ్చు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి కట్టెల కోసం చెట్లన్నింటినీ నరికేసి ఉండవచ్చు.
ప్రశ్న 3.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని మీరు అంగీకరిస్తారా ? ఎందుకు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని నేను అంగీకరించను. ఎందుకంటే చెట్లు మనకు ప్రాణాధారం. చెట్లను కొట్టేస్తే వాతావరణంలో సమతౌల్యం లోపిస్తుంది.
ప్రశ్న 4.
ప్రకృతిని కాపాడాలంటే ఏమి చేయాలి ?
జవాబు.
ప్రకృతిని కాపాడాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి.
మన చుట్టూ ఉన్న చెట్లూ చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి.
ప్రవేశిక:
చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్ని ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా! అయితే ఈ పాఠం చదవండి.
ఇవి చేయండి
1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
ఈ పాఠం ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పండి?
జవాబు.
పెరిగిపోతున్న జనాభా వల్ల, వాళ్ల అవసరాలు తీర్చటానికి, మనుషుల్లో పెరిగిపోతున్న అంతులేని ఆశల వల్ల, స్వార్థంవల్ల అడవులు నాశనమైపోతున్నాయి. వాతావరణం, ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి. జంతువులకు, పక్షులకు గూడు కరువైపోతోంది అని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది.
ప్రశ్న 2.
“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి ?
జవాబు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి సంపద మనకు దేవుడిచ్చిన వరం. అది ఏ ఒక్కరి సొంతం కాదు. అందరికీ దాని మీద అధికారం ఉంది. అధికారం గురించి మాట్లాడినప్పుడు బాధ్యత గురించి కూడా మాట్లాడాలిగదా! మనం ఇంత సంపద సొంతం చేసుకున్నప్పుడు దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదేనని మర్చిపోకూడదు. మనం దానిని జాగ్రత్తగా వాడుకుంటూ మన తరువాత తరాల వారికోసం జాగ్రత్త చెయ్యాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. పాఠం చదివి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి.
(అ) పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదట గదా! అయితే ఈ సారి ఎందుకు ఎండిపోయింది ?
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. గోపాల్ అన్నమ్మతో ఈ మాటలు అన్నాడు.
(ఆ) జనం మధ్యలో సెల్వర్లాయె. ఇక ఎట్లా బతుకుతయ్ ?
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠలోనివి. అన్నమ్మ లక్ష్మితో అన్న మాటలివి.
(ఇ) బావులు, నదులు ఇవన్నీ నీళ్లతోటి కళకళలాడితే నీళ్లకేం కష్టం.
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. లక్ష్మి గోపాల్తో అన్నది.
(ఈ) తేళ్లు, పాములు భయంతోటి అల్లాడవట్టె.
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. నరసయ్య అన్నమ్మతో అన్న మాటలివి.
2. కింది పేరాను చదివి పట్టికను పూరించండి.
నేను చెట్టును. మీకు తల్లివంటిదాన్ని. నన్ను నరికి కరువు కోరల్లో చిక్కుకోవద్దు. మానవుల్లారా ! అమ్మలాంటి నన్ను కొట్టకండి. కాసుల కోసం అమ్మకండి. పండ్లను, నీడను, ప్రాణవాయువులను ఇచ్చే త్యాగజాతి మాది. చచ్చిన మీ మనుషులకై బతికిన మమ్ములను నరికే జాతి మీది. చేతనైతే మీ పుట్టిన రోజున పది మొక్కలను నాటి నీరు పోసి కాపాడండి. కానీ దయచేసి తుంచకండి.
చేయకూడనివి చెట్లను నరకకూడదు. కొట్టకూడదు. డబ్బుకోసం అమ్మకూడదు. తుంచకూడదు.
చేయవలసినవి మొక్కలను నాటాలి. నీరు పోసి కాపాడాలి.
త్యాగజీవులు అందించేవి పండ్లు, నీడ, ప్రాణవాయువులు
శీర్షిక చెట్టు తల్లి వంటిది.
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) “చెరపకురా చెరువులను, చెడిపోతావు” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి?
జవాబు.
చెరువులను చెరపకూడదు. అంటే పాడుచేయకూడదు. స్వార్థం కోసం ఆక్రమించుకోకూడదు. పశువులను కడిగి, చెత్తాచెదారం పడేసి, రసాయనిక వ్యర్థాలను కలిపి అనేక విధాలుగా చెరువులను కలుషితం చేయకూడదు. చుట్టుపక్కల ఉండే నీటిగుంటలను మూసేయటం, నేలంతా గచ్చు చేయటం వల్ల భూమిలోకి నీరు ఇంకక చెరువులు ఎండిపోతాయి. కనుక అలాంటి ప్రమాదం లేకుండా చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నీటికి కొరత ఏర్పడి మనుషులే గాక పశువులు, పక్షులు,ఇతర జీవాలు కూడా బాధపడవలసి వస్తుంది.
(ఆ) “అడవులను నాశనం చేసుకుంటపోతే ఇంకా భయపడే కాలం వస్తది” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.
అడవులను నాశనం చేస్తుంటే ప్రకృతి సంపద హరించి పోతుంది. వానలు పడవు. ఎండలు పెరిగిపోతాయి. జంతువులకు నివాసాలు లేకుండా పోతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. అడవుల్లో జంతువులు వచ్చి ఊళ్ళమీదపడి అన్నీ నాశనం చేస్తాయి. కొన్ని జంతువులు ప్రజల ప్రాణాలు తీస్తాయి. ఎండల తీవ్రత వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని భయంకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావానికి లోనై అనేక వ్యాధులపాల పడతారు. అందుకే అడవులను నాశనం చెయ్యకూడదు. (ఇ) “మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” దీనితో మీరు ఏకీభవిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు.
“మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” ఈ మాటలు చాలా సరైనవి. నేను దీనితో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం ప్రకృతిలో సృష్టిస్తున్న భయంకరమైన మార్పుల వల్ల మన ఆరోగ్యాలూ పాడౌతున్నాయి. జీవరాసులూ అంతరించిపోతున్నాయి. మన అనుకూలం కోసం సెల్ఫోన్లు తయారు చేసుకొని సెట్టవర్లు నిర్మిస్తే ఆ టవర్ల నుంచి వచ్చే తరంగశక్తిని తట్టుకోలేక పక్షి జాతులు చనిపోతున్నాయి. ఇలాగే భూకాలుష్యం, శబ్దకాలుష్యం, జలకాలుష్యం, వాయుకాలుష్యం మనమే సృష్టిస్తున్నాం. మనమే రోగాలపాలిట పడుతున్నాం.
(ఈ) “వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయె” ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి?
జవాబు.
కాళ్ళకు మట్టి అంటకుండా ఇంటిముందు, ఇంటివెనుక అంతా గచ్చు చేస్తున్నాం. ఇంటిమీద ఇల్లు కట్టేసి ఇళ్ళమధ్య కాస్తకూడ జాగా వదలటం లేదు. రోడ్లన్నీ కాంక్రీటు వేస్తున్నాం. ఇలా ఎక్కడా నేల అనేదే కనబడకుండా అంతా కాంక్రీటు గచ్చులే. చివరికి నీళ్ళు పోయే మోరీలు కూడా సిమెంటు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడా భూమిలోకి నీళ్ళు దిగడం లేదు. నేలలో తేమలేకుండా పోతోంది. ఎన్ని అడుగులు తవ్వినా నీళ్ళు పడవు. బావుల్లోకి, చెరువుల్లోకి ఎటునుంచి ఊట దిగదు. ఇలా అనేక విధాలుగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది.
(ఉ) మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో పూర్వకాలం నుంచి ఇళ్ళలోనూ, ఇళ్ల బయటా కూడా పచ్చనిచెట్లు కనిపించేవి. చల్లని గాలి ఇళ్ళకు అందం, ఎంతో హాయిగా ఉండేది. ఇప్పుడు చెట్లు కొట్టేసి రోడ్లు, కాలువలు వేశారు. ఇంట్లో చెట్లుకూడా పోషణ అందక ఎండిపోతున్నాయ్. ఇళ్ళలో చెత్తంతా వీధుల్లోనూ, కాలువల్లోనూ విసిరేస్తున్నారు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఆరోగ్యాలు ఎక్కడి నుండి వస్తాయి. నిలబడిపోయిన మురుగు, పేరుకు పోయిన చెత్త వల్ల ఈగలూ, దోమలూ చేరి మనుషులు రోగాలపాలౌతున్నారు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు” దీనిని విశ్లేషిస్తూ రాయండి.
జవాబు.
ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. పూర్వకాలంలో ఈ కొండలు, నదులు, అడవులు, సెలయేళ్ళు, అడవి జంతువులు, అడవులలోని ఉత్పత్తులు సమృద్ధిగా లభించేవి. ప్రకృతి ఆనందకరంగా, హాయిగా ఉండేది. సకాలంలో వర్షాలు కురిసేవి. వాతావరణంలో ఋతువుల మార్పులు మంచి సుఖాన్నిచ్చేవి. రాను రాను జనాభా పెరిగిపోతున్నది. అవసరాలు పెరిగిపోతున్నాయి. అడవులు నరికేస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రకృతి సంపదను కరిగించేస్తున్నారు.
తమ తరువాత వచ్చే వారికి ఏమివ్వాలని ఆలోచించటం లేదు. సాంకేతికంగా అభివృద్ధి సాధించారు. ఆధునిక పరికరాలు వాడుతున్నారు. కర్మాగారాలు, పరిశ్రమలు అధికంగా స్థాపించి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలోకి వదిలి నీళ్ళను కలుషితం చేస్తున్నారు. పొగతో గాలి కలుషితమైపోతున్నది. ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ఇది తప్పు. మానవులు తమ తప్పు తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తే లేదు.
ప్రశ్న 2.
మానవులు, పక్షులు, పశువులు …………… సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ ఎట్లా వుండాలి ?
జవాబు.
మానవులు, పశువులు, పక్షులు, ఇతర జలచరాలు ప్రకృతిలోని జీవులన్నీ సుఖంగా జీవించాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.
నీరు : నీటిని వృథా చేయకూడదు. వర్షపు నీటిని నిలవ చేయడానికి ఇంకుడు నీటి గుంటలు తవ్వాలి. నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీటిని కలుషితం చెయ్యకూడదు. పశువులను కడగటం, బట్టలుతకటం వంటి పనులు జలాశయాల్లో చెయ్యకూడదు. మురుగునీరు, ఫ్యాక్టరీల నీరు పోవడానికి వేరే ఏర్పాట్లు చెయ్యాలి. వాడుకునే నీటిలోకి వదలకూడదు.
గాలి : ఫ్యాక్టరీలను ఊరికి దూరంగా నిర్మించుకోవాలి. జనావాసాల మధ్య ఉంటే ఆ పొగ, దుమ్ము, ధూళి వలన కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల ఆరోగ్యం పాడౌతుంది. మురికి ఇల్లంతా నిండిపోతుంది.
శబ్దం : ఆ శబ్దాల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇంట్లో మనం ఉపయోగించే టి.వి.లు, రేడియోలు వంటివి కూడా తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. సెల్ఫోన్ల వాడకం తగ్గించటం వల్ల మనకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా ప్రమాదం తప్పుతుంది. వాహనాల వినియోగం నియంత్రించాలి. దానివల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలి. చెట్లను అధికంగా పెంచాలి. ఒక చెట్టునరికే ముందు పది చెట్లను పెంచాలి. ఇలా చేయటం వల్ల ప్రకృతిని కొంతవరకు కాపాడగలుగుతాం.
IV. సృజనాత్మకత/ప్రశంస
ప్రశ్న 1.
“పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలు పంచుకోవాలని ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.
ప్రకటన
అక్కా తమ్ముళ్ళు ఆడుకుంటూ ఒక చెట్టు కిందికి చేరారు.
తమ్ముడు : అక్కా! అదిగో నువ్వు పట్టుకోవాలన్న సీతాకోకచిలుక.
అక్క : ఔను. ఉండు ఇప్పుడే పట్టుకుంటా……… దొరకలేదురా.
తమ్ముడు : పోనీలే అక్కా! హాయిగా ఎగరనీ.
చెట్టు : పిల్లలూ ఆడుకుంటున్నారా ?
అక్క : ఎవరది ? చెట్టుతల్లా!
తమ్ముడు : అవునమ్మా! ఆడుకుంటున్నాం.
అక్క : అమ్మా! ఈ దెబ్బలేంటి ?
చెట్టు : ఇందాక కొంతమంది అల్లరి పిల్లలు నామీద రాళ్ళు విసిరారు.
తమ్ముడు : అయ్యో! నొప్పిగా ఉందా ?
చెట్టు : లేదులే. మీరు చాలా మంచివాళ్ళు. మీకు నేనంటే చాలా ఇష్టం. ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.
అక్క : ఇప్పుడెందుకులేమ్మా!
చెట్టు : తీసుకోండమ్మా! ఫరవాలేదు. నేను వీటిని మోసేది మీలాంటి వాళ్ళకోసమే. మీకు కావలసినన్ని తినండి. మిగతావి ఇంటికి తీసుకుపోండి.
అక్క, తమ్ముడు : ధన్యవాదాలు చెట్టుతల్లీ! వస్తాము. టాటా.
V. పదజాల వినియోగం
1. కింది పదాలు చూడండి. వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి.
(అ) తొందరగా – జల్ది
(ఆ) దురాక్రమణ – కబ్జా
(ఇ) శబ్దాలు – చప్పుళ్ళు
(ఈ) సంతోషం – సంబరం
(ఉ) కాలువలు – నదులు
(ఊ) ఇంతకుముందు కాలం – తాతలనాడు, మునుపు
(ఋ) ప్రాణులు – జీవులు
(ౠ) పిల్లవాళ్లు – పోరగాళ్ళు
(ఎ) వాహనాలు – మోటార్లు
(ఏ) వేగంగా పోవడం – బర్రుబర్రున పోవటం
2. కింది పదాలలో భిన్నమైన పదాన్ని గుర్తించి గీతగీయండి.
(అ) పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క
(ఆ) బావులు, నదులు, సముద్రాలు, చెరువులు
(ఇ) కారు, స్కూటర్, సైకిలు, లారీ
(ఈ) బీడిపొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ
3. కింది పట్టికను చదివి అందులోని ప్రకృతి – వికృతులను
డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం
మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...
-
తొలి వెలుగు ఈ పేపర్ కాలంపై కలం మోగిస్తున్న నిప్పుల తప్పెట ‘‘ప్రత్యామ్నాయ మేథోమథనం మానవ అస్తిత్వాన్ని చాటే అంతిమ లక్...
-
7.శతక మధురిమ - వివిధ శతక కవులు పాఠం ఉద్దేశం: సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్...
-
పాఠం నేపథ్యం ప్రతిష్ఠానపురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు దారితప్పి , జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాల...
-
మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...
-
అ – ర - తలకట్టు ఆ – ా – దీర్ఘం ఇ. – ి – గుడి ఈ – ీ – గుడి దీర్ఘం ఉ – ు – కొమ్ము ఊ – ూ – కొమ్ము ధీర్ఘం ఋ – ృ – ఋత్వం ౠ – ౄ – ఋత్వ ధీర్ఘం ఎ...
-
దానశీలం పరీక్ష దానశీలం పరీక్ష -2 దానశీలం పరీక్ష -4 దాన శీలము పాఠ్యాంశ వివరణ: ‘ దానము ’ అనగా త్యాగం , అడిగినది లేదనకుండా ఇవ్వడం , ...
-
X. 8. లక్య సిద్ధి పాఠం ఉద్దేశం: దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపా...
-
9. జీవన భాష్యం: పాఠం ఉద్దేశం: మనిషి దేనిని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం ప...
-
పుస్తక సమీక్ష - ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి పుస్తక సమీక్ష, ప్రాజెక్ట్ పని రాసే విధం పుస్తక సమీక్ష ఎలా రాయాలి? పుస్తక సమీక్ష ...
-
గోలకొండ పట్టణం ఆదిరాజు వీరభద్ర రావు కింది లింక్ లు నొక్కి వినండి గోలకొండ పట్టణం - 1 గోలకొండ పట్టణం -2 గోలకొండ పట్టణం -3 పాఠము ఉద్దే...