సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

VII. 5. పల్లె అందాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
VII. 5. పల్లె అందాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2024, శుక్రవారం

VII. 5. పల్లె అందాలు

VII. 5.   పల్లె అందాలు

 ప్రశ్నలు
1. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.ఆకాశంలో సూర్యుడు, పక్షులు కనిపిస్తున్నాయి. క్రింది నుండి కొండపైకి దారి వేశారు. ఇళ్ళు, చెట్లు, పశువులుతో పల్లె కనిపిస్తోంది. పల్లె పచ్చని మొక్కలతో అందంగా ఉంది.


2. మీరు చూసిన పల్లెకు, బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి?
జవాబు. మేము చూసిన పల్లె పచ్చని పొలాలలతో నిండి ఉంది. చల్లనిగాలి, పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. పైబొమ్మలోని పల్లె కూడా అలానే ఉంది.


3. పల్లెలో ఏమేమి ఉంటాయి?
జవాబు. పల్లెలో చిన్న ఇళ్ళు, పాడి ఆవులు, గేదెలు, పచ్చని పొలాలు అందరూ కలసిమెలసి ఉండే వాతావరణం ఉంటుంది. రకరకాల పండ్లు, పూలచెట్లు, చెరువులు, సెలయేళ్ళు ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1. కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?
జవాబు. ఇంకా పెద్ద పాత్రతో, చిన్న సముద్రంతో పోల్చవచ్చు. బాగా విచ్చిన తామరపువ్వుతో పోల్చవచ్చు. హైదరాబాద్ లోని చెరువులను హుసేన్ సాగర్, నిజాంసాగర్ అని సాగరంతో పోల్చడం జరిగింది. (వనపర్తి సంస్థానంలోని 7 పెద్ద చెరువులను సప్తసముద్రాలుగా పిలిచేవారు. కావున చెరువును సముద్రంగా పోల్చవచ్చు.

ప్రశ్న 2.
పాఠంలో “చెరువును పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు కదా! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?
జవాబు. మా పాఠంలో కవి చెరువును పద్మాలకు నిలయాలు అని చెప్పాడు. పూర్వం పరిశుభ్రత, స్వచ్ఛత ఉండడం వలన అవి అలా ఉండేవి. నేడు రసాయనాలు, మురికి, చెత్తా, చెదారంతో నిండి చెరువులు కలుషితం అవుతున్నాయి.

ప్రశ్న 3.సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది?
జవాబు.
సూర్యోద  సమయంలో చెరువు పరిశుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది. సూర్యుని లేత కిరణాలు చెరువులో పడి, అందులోని తామరపూలు వికసించి ఎంతో అందంగా ఉంటాయి. లేత కిరణాలు పడి చెరువు స్వచ్ఛత వలన చూడ ముచ్చటగా ఉంటుంది.

ప్రశ్న 4.పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?
జవాబు. పూలను ఆడవారు తమ తలపై పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతిరోజు దేవునికి సమర్పించడానికి, పూజలు చేయడానికి వినియోగిస్తారు. పండుగలలోను, పెళ్ళిళ్ళలోను, ఇంకా ఇతర సమయాలలో అలంకరించడానికి వాడతారు. గౌరవనీయులైన వారి మెడలో వేయడానికి పూల మాలలను వాడతారు. పూలు అలంకార సాధనం.

ప్రశ్న 5. ఏఏ ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి?
జవాబు. వసంతఋతువు – చైత్ర, వైశాఖం
గ్రీష్మఋతువు – జ్యేష్టం, ఆషాఢం
వర్షఋతువు – శ్రావణం, భాద్రపదం
శరదృతువు – ఆశ్వయుజం, కార్తీకం
హేమంతఋతువు – మార్గళిరం, పుష్యం మాఘం, ఫాల్గుణం
శిరరఋతువు – మాఘం, ఫాల్గుణం – మోదుగ


ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.
జవాబు.
పాఠంలోని పద్యాలలో ఊరు చెరువులు, పూలు, పండ్లు, పంటలు, పాడి, చేనేత కార్మికుల గూర్చి చెప్పారు. మేము చూసిన ఊరు హుజూర్ నగర్. కుమ్మరి కుండలు చేస్తాడు. రైతులు పంటలు పండిస్తారు. వడ్రంగివారు చెక్కపని చేస్తారు. ఆయా ఋతువులలో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి.

ప్రశ్న 2.పాఠంలోని పద్యాలను రాగంతో చదవండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు. ముందిచ్చిన పద్యాల భావాలు చూడండి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణకిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.

(అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి?
జవాబు.
అమూల్య సంపదలు అనగా చాలా విలువైన సంపదలు అని అర్థం. వాటికి విలువ కట్టలేమని భావం.

(ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి?
జవాబు.ఆనందానికి నెలవు అంటే సంతోషానికి నిలయం అని అర్థం.

(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే మీకేం అర్థమయింది?
జవాబు. ప్రేమ చూపడం అని అర్థమయింది.

(ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి?
జవాబు.అనురాగం అంటే ప్రేమ. పట్టుగొమ్మ అంటే స్థానము. పల్లె ప్రేమకు, అనుబంధాలకు స్థానం అని అర్థం.

(ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు.పల్లె తల్లిప్రేమ.

2. పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.
(అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
జవాబు.“ రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.”

(ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
జవాబు. “అరుణ కిరణాల దేవత కర్ష్యమిచ్చు ప్రత్యుషస్సున మయూరి పద్మలతలు.”

(ఇ) దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
జవాబు. ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.

(ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.
జవాబు. “జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేళలందు”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
 (అ) కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి.
జవాబు. మా ఊరి అంగడికూడా కవి ఊరి అంగడిలా అన్ని వస్తువులతో నిండి ఉంటుంది. మా ఊరి అంగడిలో అన్ని వస్తువులూ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు ఇంటిలో ప్రతినిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మా అంగడిలో లభిస్తాయి. అంగడిలోని సరుకులు తాజాగా ఉంటాయి. చౌకగా లభిస్తాయి.

(ఆ) గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరివల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది?
(లేక)
గ్రామాల్లోని కులవృత్తి వారి వలన కలిగే లాభాన్ని వివరించండి.
జవాబు. గ్రామాలలో అనేక కులాల వారు ఉంటారు. వారు వారి కులవృత్తులను చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కాపులు, పద్మశాలీలే కాకుండా మంగలిపనివారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం వృత్తులవారు, పశుకాపరులు ఉంటారు. ఆయా కులాల వారు వారి వృత్తులను నిర్వర్తించడం వలన ఊరివాళ్ళ అవసరాలు తీరుతాయి. అందరికీ పని దొరుకుతుంది. అసమానతలు పోతాయి.

(ఇ) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? (లేక) ఆదర్శగ్రామానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జవాబు. ఆదర్శగ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా జీవించాలి. అన్ని మతాల పండుగల్లో అందరూ పాల్గొనాలి. ఎవరికి ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చినా అందరూ సాయం చేయాలి. ఒకరి అవసరాలకు వేరొకరు నిలబడాలి. పేద, ధనిక తేడా చూపకుండా కలసి మెలసి ఉండాలి. గ్రామం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకొని అందరూ కలసి పూర్తి చేయాలి. మనుషులు, మనసులు వేరైనా ఒకే ఆలోచనతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే ఆదర్శగ్రామం.
 
(ఈ) ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది?
(లేక)
సమాజంలో ఊరికి, చెరువుకు దగ్గరి బంధం ఉంది. వివరించండి
(లేక)
ఊరు చెరువుల బంధం విడదీయరానిది. వివరించండి.
జవాబు.
ఊరు అంటే ప్రజలు, వారితోపాటు పశువులు, పక్షులు. వీరందరికీ  నీరు కావాలి.  నీరు ఒక కాలంలో దొరికి ఒక కాలంలో దొరకకపోతే కష్టం. అందుకే నీరు నిల్వ ఉంచే చెరువు ప్రతి ఊరికి అవసరం. నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికీ కావాలి. ఇన్ని అవసరాలు తీరాలంటే నీరు అన్ని కాలాలలో నిల్వ ఉంచే చెరువు కావాలి. ఇలా చెరువుకు, ఊరుకు విడదీయలేని సంబంధముంది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు.ఊరికి అందాన్నిచ్చేవి :
తామరపూలతో, కలువపూలతో నిండిన చెరువులు, మంచినీటి బావులు. ఊరిని పండు ముత్తైదువులా చేసే బంతి, చేమంతి వంటి పూల మొక్కలు, పరిమళం వెదజల్లే గులాబీ, మొల్ల, గన్నేరు, దాసన వంటి పూల మొక్కలు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన చెట్లు. వివిధ వృత్తులవారు, పశువులను పోషిస్తూ పంటలను పండించే కాపు బిడ్డలు. జనం రాకపోకలతో సందడిగా ఉండే అంగళ్ళు. ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇవేవీ ఉండటం లేదు. చెరువులు కనబడటం లేదు. పచ్చని పొలాలు మాయమయి పోతున్నాయి. ట్రాక్టర్ల రాకతో పశువులు కనబడడం లేదు. ఇప్పుడు పల్లెలన్నీ పట్నాలలాగే ఉన్నాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ). పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను చూసిన పల్లె ఖమ్మం జిల్లా వైరాకు దగ్గరగా ఉన్న సిరిపురం. ఈ ఊరిలో ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రధానంగా పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఎక్కడ చూచినా మనోహరమైన దృశ్యాలతో చూడముచ్చటగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు వెచ్చని స్పర్శతో నిద్ర లేపుతాయి. కొలనుగట్లపై ఏపుగా పెరిగిన గడ్డి, కొలనులోని కలువల అందాలు నా మనసును దోచుకున్నాయి. కొలనులలోని తామరపూల సౌందర్యం చూడగానే నేను ఎంతో పులకించిపోయాను. ఆ అందం వలన కలిగిన మధురానుభూతులు నా హృదయాన్ని పెనవేసుకొని పోయాయి.

(ఆ). మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.
జవాబు.
అర్ఘ్యం

కొలనులోని జలములలో
కదలాడే చిరుత అలల
తానమాడి సంధ్యవార్చి
ధ్యానములో కొంత మునిగి
మెత్తని తన చేతులెత్తి
దోసిళ్ళుగ వాటి జేర్చి
నిర్మలమౌ జలములతో
దోసిళ్ళను నింపుకొని
తరుణారుణ కిరణ మణికి
తరణికి ఆ తరుణీమణి
మనోహరిణి పద్మలతిక
ప్రత్యుషస్సు సమయమ్మున
అర్ఘ్యమిచ్చి అర్చించెను
కర్మసాక్షి దినకరునికి

(ఇ). నీవు చూసిన పల్లెను వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయుము.
లేఖ
జవాబు.

.....,
 : XXXX

ప్రియమైన స్నేహితునికి కుశలములతో నీ మిత్రుడు శంకర్ వ్రాయునది. నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. నేను ఈ మధ్య వైరా దగ్గరలోని గోపాలపురం అనే పల్లెను చూశాను. అక్కడి నా స్నేహితులతో కలసి వేసవి సెలవులు గడిపాను.
ఆ వూరి ప్రజలు చాలా మంచివారు. అమాయకులు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ చూచినా చెట్లు, పూలమొక్కలు, పాడి ఆవులు, గేదెలు, పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారంతా కష్టజీవులు. నేను వారి వృత్తిపనులు చూసి చాలా ఆనందించాను. వడ్రంగి చేసే బొమ్మలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. నేత వారు నేసే వస్త్రాలు ఎంతో మన్నికగా ఉన్నాయి. వాటిపై వేసే అందమైన అద్దకాలు తనివితీరా చూడాల్సిందే! ఎలాంటి కాలుష్యం లేదు. నీవు కూడా వీలైతే ఏదైనా పల్లెకు వెళ్ళిరా. నీ అనుభూతులు రాయి.

ఇట్లు
నీ మిత్రుడు,
శంకర్.

చిరునామా :
కె. సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

V. పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అదే అర్థాన్నిచే పదాలు రాయండి.

ఉదా : సంపద తో గర్వపడకూడదు.
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి.
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం.
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది.
జవాబు.
ఉదా : సంపద తో గర్వపడకూడదు. – (కలిమి, ధనము)
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. – (చెరువు)
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం. – (వస్త్రాలు, వలువలు)
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది. – (పట్టణం, ప్రోలు)

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.
జవాబు.
(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. – (అలలు)
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది. – (చెరువు తూము)
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి. – (పశువుల పాక)

3. పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి.

(అ) ఊరు పసుపు అద్దినట్లుండడానికి కారణం చేమంతి పూలతో నిండి ఉండడం
(ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండడానికి కారణం గోరింటాకు వలన పారాణి అద్దినట్లుంది.
(ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండడానికి కారణం పట్టుకుచ్చుల పూలు
(ఈ) పండు ముత్తైదువగా ఉండడానికి కారణం పై మూడింటి వలన
4. భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.

ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – ఉత్వసంధి
(అ) భీముడు + ఇతడు = భీముడితడు – ఉత్వసంధి
(ఆ) అతడు + ఎక్కడ = అతడెక్కడ – ఉత్వసంధి
(ఇ) ఇతడు + ఒకడు = ఇతడ్కడు – ఉత్వసంధి
(ఈ) ఆటలు + ఆడు = ఆటలాడు – ఉత్వసంధి

2. కింది పదాలను కలిపి రాయండి.

(అ) ఏమి + అది = ఏమది
(ఆ) ఎవరికి + ఎంత = ఎవరికింత
(ఇ) మరి + ఇప్పుడు = మరెప్పుడు
(ఈ) అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.
మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తుకు) అచ్చుపరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు. “ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా! దీనినే ఇత్వసంధి అంటారు. సూత్రం : ఏమి మొదలైన పదాలలో ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

3. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
(అ) చెప్పాలంటే = చెప్పాలి + అంటే – ఇత్వసంధి
(ఆ) ఒక్కటే = ఒక్కటి + ఏ – ఇత్వ సంధి
(ఇ) రానిదని = రానిది + అని – ఇత్వ సంధి
(ఈ) నీటినిసుమంత = నీటిని + ఇసుమంత – ఇత్వసంధి
(ఉ) చెప్పినదియేమి = చెప్పినది + ఏమి – ఇత్వసంధి
(ఊ) వచ్చినపుడు = వచ్చిరి + అప్పుడు – ఇత్వసంధి
(ఋ) ఎన్నియేని = ఎన్ని + ఎని – ఇత్వ సంధి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...