కవి పరిచయం:
కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 – 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
ప్రవేశి క :
అమ్మంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు. పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం వచన కవిత (ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య (ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచనశైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ నా బాల్యంలో నాకు నీళ్ళు పోసేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నంకాని ఏదో ఒకటిగాని పెట్టేది. దెబ్బ లేదా బాధ పడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేదికాదు. రాత్రి, పగలు నావెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది. మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.
ప్రశ్న 2.మీరు మీ అమ్ సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. మా అమ్మ ఇంటి పనులలో సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.
అంశం పోలిక
ముగ్గులేసిన ప్రాంగణం అద్దకపు చీర
పండ్లు పాల బలపాలు
ఇల్లు దవాఖానా
దొరలబిడ్డలు తెల్లకుందేళ్ళు
ముక్కుపోగు నెలవంకలా అర్ధచంద్రాకారం
వడ్లు దంచే చప్పుడు మద్దెల మోత
ముక్కు పుల్ల విష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం
గంటీలు గడియారంలోని లోలకం
అమ్మ ఒడి గుమ్మి
2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.
భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.
(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.
(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
జవాబు.
ఆదిశంకరుల తల్లిపేరు ఆర్యాంబ.
(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.
(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
జవాబు.
గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం అతని తల్లి పుతిలీబాయి.
(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు అంతా ఆ మహనీయుల తల్లులే!
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?
జవాబు.
కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతి వాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసిన వాడుగా గుర్తింపు పొందాడు.
ఆ. కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
(లేదా)
అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది ?
జవాబు.
కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.
ఇ. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి.
(లేదా)
మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.
జవాబు.
మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తన కిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మా కిష్టం.
ఈ. అమ్మచేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి.
(లేదా)
మీ ఇంట్లో నీ తల్లికి సాయం చేయడంలో నీ పాత్ర ఏమిటి?
జవాబు.
అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తనే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసేపనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
ప్రశ్న 1.అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబుచేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది. అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొర కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందీలో పోసి వడ్లను దంచేది.
అమ్మ అందం : అమ్మ ముక్కు పోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలాగా అందంగా ఉంది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉంది. గంటలు గడియారంలోని లోలకంలాగా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.
అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. అమ్మ పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.
అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారి కెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి, అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ
2. పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి. (అదనపు ప్రశ్న)
1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీర లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులం లా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.
3. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి.
ప్రశ్న 1.
జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
జవాబు.ఇ) ముంగిలి
ప్రశ్న 2.
మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
అ) గోడకు వేసే సున్నం
ఆ) బట్టలకు రంగు వేసే విధానం
ఇ) రంగు వేయడం
ఈ) రంగు తీసివేయడం
జవాబు.
ఇ) రంగు వేయడం
ప్రశ్న 3.
బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
అ) కట్ట
ఆ) గోడ
ఇ) తీరం
ఈ) దూరం
జవాబ
2. ఈ కింద గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) కంచు మోగునట్లు కనకంబు మోగునా ?
కనకంబు = బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం
ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
కుందేలు – శశకము, చెవులపిల్లి, శరభం
ఇ) ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
దూడ – పెయ్య, లేగ, క్రేపు
3. ఈ కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
కుల్య (ప్ర) – కాలువ (వి)
ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
ఆకాశం (ప్ర) – ఆకసం (వి)
ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.
మొగము (వి) – ముఖము (ప్ర)
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. ఈ కింది పదాలను విడదీయండి.
అ) అతడెక్కడ =అతడు + ఎక్కడ
ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను
ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు
2. ఈ కింది పదాలను కలపండి.
అ) మేన + అల్లుడు =మేనల్లుడ
ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు
ఇ) ఏమి + అంటివి =ఏమంటివి.
ఉత్త్వ సంధి:
ఈ కింది పదాలను గమనించండి.
అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ) అతడు + ఎక్కడ = అతడైక్కడ = ఉ + ఎ = ఎ
మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు.
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.
3. ఈ కింది పదాలను కలిపి రాయండి.
అ) చెట్టు + ఎక్కి = చెట్టెక్కి
ఆ) వాడు + ఎక్కడ = వాడెక్కడ
ఇ) ఎదురు + ఏగి =ఎదురేగి
4. ఈ కింది పదాలను విడదీయండి.
అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని
ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి
ఇ) ఎట్లున్నది = ఎట్లు+ ఉన్నది.
......................