I. అవగాహన - ప్రతిస్పందన 20 మార్కులు
1. పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణం నుండి ఇస్తారు.(1-5 ఒకటి నుండి ఐదు ప్రశ్నలు ఇస్తారు. జవాబులు ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాయాలి.2. ఖాళీలు పూరించమని అడగవచ్చు.3. తప్పొప్పులు గుర్తించమని ప్రశ్న ఇవ్వవచ్చు.4. జతపరచమనవచ్చు.5. సరియైన సమాధానానికి సరైన మార్కు పొందుకోవొచ్చు)
ముఖ్య భావం గుర్తించాలి: ముందుగా పేరాగ్రాఫ్ మొత్తం చదివి ప్రధాన భావం, ఉపభావాలు గుర్తించాలి.
WH ప్రశ్నలు ఆలోచించాలి: ఎవరు, ఏమి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే కోణాల్లో ప్రశ్నలు తయారు చేయాలి.
పాఠ్య ఆధారితంగా ఉండాలి: ప్రశ్నలకు జవాబులు పేరాగ్రాఫ్ నుంచే దొరికేలా స్పష్టంగా రూపకల్పన చేయాలి.
వివిధ స్థాయిల ప్రశ్నలు ఇవ్వాలి: సరళ (గుర్తింపు), అర్థగ్రహణ, అభిప్రాయాత్మక ప్రశ్నలను కలిపి ఇవ్వాలి.
స్పష్టమైన భాష ఉపయోగించాలి: చిన్న వాక్యాలు, క్లుప్తమైన పదజాలంతో విద్యార్థులకు అర్థమయ్యేలా రాయాలి.
ఆ) 6వ ప్రశ్నగా పాఠంలోని చుక్క పద్యాల మీద అవగాహనను పరీక్షిస్తారు.
- పద్యాన్ని పూరించి భావాన్ని రాయమనడం
- ప్రతిపదార్థాన్ని రాయండి (అన్వయ క్రమంతో, భాషా దోషాలు లేకుండా రాస్తే ఐదు మార్కులు పరీక్షా హాల్లో పై సూచనలు ఇలా అన్వయించుకోవాలి:
-
మొదట పూర్తి పాఠ్యాన్ని చదవాలి: తొందరపడకుండా ఒకసారి శ్రద్ధగా చదివి ప్రధాన భావం గ్రహించాలి.
-
తెలిసిన పదాల నుంచి ప్రారంభించాలి: ముందుగా అర్థం తెలిసిన పదాలకు ప్రతిపదార్థం రాయాలి; తెలియనివి తరువాత ఆలోచించాలి.
-
సందర్భం ఆధారంగా అర్థం ఊహించాలి: తెలియని పదాలకు ముందు–వెనుక భావాన్ని చూసి సరళమైన అర్థం రాయాలి; ఖాళీ వదలకూడదు.
-
సమాసం–సంధి గుర్తించాలి: క్లిష్ట పదాన్ని విడదీసి విగ్రహం చేసుకుంటే అర్థం సులభమవుతుంది.
అన్వయ క్రమం రాస్తూ కర్త–కర్మ–క్రియ క్రమం పాటించాలి: పద్యాన్ని గద్యరూపంలో మార్చి పూర్తివాక్యంగా రాయాలి.
-
చివర సమీక్ష చేయాలి: రాసిన ప్రతిపదార్థం, అన్వయం, భావం సరైనదేనా అని ఒకసారి చదివి తప్పులు సరిచేయాలి.
-
ఇ) అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం నకు 10 మార్కులు
- 10 పాయింట్ల సాధనలో ఈ భాగం చాలా కీలకం.
- అందరికీ తెలిసిన సుపరిచితమైన పద్యాన్ని అపరిచిత భాగం కింద ఇస్తారు.
- అపరిచిత గద్యంలో భాగంగా పర్యావరణము, పరిశుభ్రత, విజ్ఞాన శాస్త్రాలు, సాహిత్యము, సంప్రదాయములు ఏదైనా ఒక అంశంపై పేరాగ్రాఫ్ ఇవ్వబడుతుంది.
- ఐదు ప్రశ్నలు ఇస్తారు.
- ఐదు ప్రశ్నలు తయారు చేయమంటారు.
- తప్పు ఒప్పుల్ని గుర్తించమంటారు.
- జతపరచమంటారు.
- ఖాళీలు పూరించమంటారు.
- కీలక పదాలను వివరించమని కోరవచ్చు.
- జవాబు ఒక వాక్యంలో రాయాలి (ఏకపద జవాబులకు మార్కులు స్కోర్ పొందలేరని గమనించాలి.
అపరిచిత గద్యానికి జవాబు రాయడానికి పద్ధతి1. ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి– ముందు ఇచ్చిన గద్యాన్ని పూర్తిగా చదవాలి.– తర్వాత ఒక్కో ప్రశ్నను అర్థం చేసుకోవాలి.
2. సమాధానం ఎక్కడుందో గుర్తించాలి.– గద్యంలోని వాక్యాలనే తీసుకోవాలి.– ఎక్కువగా మీ మాటల్లో చిన్నగా మార్చి రాయాలి.
3. తప్పులు చేయకూడదు– పాఠ్యానికి సంబంధం లేని మీ ఊహ రాయకూడదు.– గద్యానికి కచ్చితమైన సమాధానం మాత్రమే రాయాలి.
4. వాక్యరచన సరళంగా ఉండాలి– పొడవైన వాక్యాలు అవసరం లేదు.– సరళమైన 2–3 వాక్యాల్లో రాయాలి.)
II స్వీయ రచన - సృజనాత్మకత 40 మార్కులు
ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు 12మార్కులు.5, 6 వాక్యాల్లో తప్పకుండా రాయాలి.ఇందులో ఛాయిస్ లేదు.పాఠ్యాంశంతో పాటు కవి, రచయిత గురించి లేదా శైలి గురించి ఖచ్చితంగా అడుగుతారు.
ఆ) భాగం: స్వీయరచన
- పద్యభాగం నుండి(16,) రెండు ప్రశ్నలు
- గద్య భాగం నుండి (17)రెండు ప్రశ్నలు
- ఉపవాచకం నుండి (18)రెండు ప్రశ్నలు ఇస్తారు.
- ఒక్కొక్క ప్రశ్నకు ఏడు మార్కుల చొప్పున మొత్తం 21 మార్కులు
- ప్రతి భాగం నుండి ఒక్క ప్రశ్నకు జవాబు రాయాలి.
- ప్రతి జవాబు 10 నుంచి 12 వాక్యాలలో రాయాలి.
- 120 పదాల కంటే ఎక్కువ పదాలతో జవాబు రాయాలి.
- సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉండాలి.
- ప్రశ్నలు అనుసరించి జవాబు రాయాలి.
- భాషా దోషాలు లేకుండా రాయాలి.
- వాక్య క్రమం ఉండాలి.
సృజనాత్మక అంశాలు రెండు ఇస్తారు.7 మార్కులు. ఒక్క ప్రశ్నకు సమాధానంఒక ప్రశ్నకు జవాబు తప్పకుండా రాయాలి.ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న 23 సృజనాత్మక అంశాలలో ఏవైనా ఇవ్వవచ్చు.
- లేఖ
- వచన కవిత
- సంభాషణ
- ఏకపాత్రాభినయం
- ప్రశంసా పత్రం
- అభినందన వ్యాసం
- వ్యాసం
- కరపత్రం
- ఆహ్వాన పత్రం
- కథ
- గేయం
- ప్రశ్నావళి
- నినాదాలు - సూక్తులు
- కథలు పొడిగించడం
- .....
- మొదలైన అంశాలపై సృజనాత్మకంగా రాయాలి
III భాషాంశాలు 20 మార్కులు
(పదజాలం & వ్యాకరణాంశాలు)
- సొంత వాక్యాలు
- అర్థాలు
- ప్రకృతి - వికృతులు
- సమానార్థకాలు లేదా పర్యాయపదాలు
- వ్యుత్పత్తి అర్థాలు
- వ్యుత్పత్తి పదం
- జాతీయాల వివరణ
- కర్తరీ, కర్మణీ వాక్యాలు
- ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు
- సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు
- గ్రాంథికం నుంచి వ్యవహార వాక్యం లోకి మార్చి రాయడం.....
- సంధులు
- సమాసాలు
- అలంకారాలు
- గణవిభజన మొదలైన ఇస్తారు.
- ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.
- పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి.
- ప్రశ్న ఏ కోణం నుండి ఇస్తే ఆ కోణం నుంచి వివరించగలగాలి.
- విద్యార్థులకు సూచనలు:
- ప్రశ్న పత్రాన్ని క్షున్నంగా చదవాలి.
- ప్రశ్నను అర్థం చేసుకోవాలి.
- ప్రశ్నను అనుసరించి మాత్రమే జవాబు రాయాలి.
- ప్రతి జవాబుకు ప్రశ్న సంఖ్య మరవకూడదు.(తప్పకుండా శీర్షిక పెట్టవచ్చు. దానశీలం పాఠ్యభాగ సారాంశం రాయండి అనే ప్రశ్నకు దానశీలం పాఠ్య సారాంశం: అని రాయాలి. అలా రాయడం వలన దిద్దే ఎగ్జామినర్ కి సులువుగా అర్థమవుతుంది)
- ప్రతి వాక్యానికి 6,7 పదాలు రాయాలి.
- వాక్యాలు సమదూర0 పాటించాలి.
- ప్రతి విషయంపై స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
- పరీక్ష రోజు వరకూ వాటిని నిత్యం పునశ్చరణ / మననం చేసుకోవాలి.
- పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి.
- మైండ్ మాపింగ్ (భావనా చిత్రాన్ని) ద్వారా గుర్తించుకోవాలి.
- ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి సొంతంగా ఆలోచిస్తూ చదవాలి.
- ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి.
- విరామ చిహ్నాలు పాటించాలి.
- భాషా దోషాలు లేకుండా రాయాలి.
- వాక్య క్రమం ఉండాలి.
- 1. పాఠ్యాధారిత ప్రశ్నల స్వభావం
- గద్య పాఠం, పద్య పాఠం నుంచి ప్రశ్నలు వస్తాయ
- కొన్ని “చిన్న సమాధానాలు” (2–3 వాక్యాలు)
- కొన్ని “విస్తృత సమాధానాలు” (6–8 వాక్యాలు).
- పద్యాల్లో భావార్థం, సందర్భం, అలంకార విశ్లేషణ అడుగుతారు.
- గద్యాల్లో పాత్ర విశ్లేషణ, సంఘటన వివరణ, సందేశం అడుగుతారు.
- 2. రాయడానికి సాధారణ పద్ధతి
- ✓: ప్రశ్నను బాగా చదవాలి.
- సమాధానం పాఠ్యం నుంచే రావాలి. (మనకిష్టమొచ్చిన ఊహలు కాకుండా పాఠంలో చెప్పినదాన్ని రాయాలి.)
- ✓చిన్న సమాధానాలకు 2–3 వాక్యాలు, పెద్ద సమాధానాలకు 6–8 వాక్యాలు.
- ✓సూటిగా, సులువైన భాషలో రాయాలి.
- ✓పద్యం అయితే — ‘సందర్భం’, ‘భావార్థం’, ‘అలంకారము/ప్రాస/యతి’ విడిగా రాయాలి.