సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

10వ తరగతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
10వ తరగతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2026, శనివారం

అపరిచిత పద్యం & గద్యం

అపరిచిత పద్యం & గద్యం 


తలనుండు విషము ఫణికిని వెలయంగాఁ దోఁక నుందు వృశ్చికమునకున్ దల తోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ప్రశ్నలు – జవాబులు
1. పాములో విషం ఏ భాగంలో ఉంటుంది?
జవాబు: పాముకు విషం తలలో ఉంటుంది.
2. వృశ్చికం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు: తేలు.
3. శరీరమంతా విషం కలిగినది ఎవరు?
జవాబు: ఖలుడు (దుర్జనుడు) శరీరమంతా విషం కలిగి ఉంటాడు.
4. ఈ పద్యంలో మకుటం ఏది?
జవాబు: సుమతీ!
5. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు?
జవాబు: బద్దెన (సుమతీ శతకం కవి).



ఇ) కింది పద్యాన్ని చదువండి. దాని కింద ఇచ్చిన వాక్యాలలో తప్పు (X), ఒప్పు (/)లను గుర్తించండి. రాయండి. 5×2=10

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్ 
సర్పంబు పడగ నీడను
గప్ప వసించు విధంబు గదరా సుమతీ!

7. తప్పులు వెతికే వారిని కొల్వరాదు. (✓)
8. ఈ పద్యము ఏ శతకంలోనిది.(x)
9. తప్పులు వెతికి ఇతరులను బాధించరాదు.(✓)
10. కప్ప నీడలో పాము ఉన్నది.(x)
11. తప్పులు వెతికే పురుషుడు పాములాంటి వాడు.(✓)

 

.వె.

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు

పట్టెనేని బిగియ పట్టవలయు

పట్టు విడుట కన్న బరగజచ్చుట మేలు

విశ్వదాభిరామ! వినురవేమ!

        -వేమన

 

1. ఏమి పట్టరాదు?

 -----------ప ట్టు పట్టరాదు -------------------

2. పట్టిన తరువాత విడువకూడనిది ఏది?

--------పట్టిన తరువాత విడువరాదు.-------------------------

3. పట్టు ఇలా పట్ట వలెనని కవి అంటున్నాడు?

-------------గట్టిగా పట్టవలెను. --------------------

4.పట్టు విడవడం ఎలాంటిది?

------బరగజచ్చుట మేలు------------

5. పై పద్యాన్ని ఎవరు రచించారు

----------వేమన రచించారు---------------


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను

సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను

కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

1. ఆడంబరంగా పలికే వాడు ఎవరు ?       (        )

అ) సజ్జనుడు  ఆ) మూర్ఖుడు  ఇ) అల్పుడు  ఈ) దుర్జనుడు

2. మంచివాడు ( సజ్జనుడు) ఇలా మాట్లాడుతాడు...       (        )

అ) గట్టిగా  ఆ) ఆడంబరంగా  ఇ) చక్కగా  ఈ) చల్లగా

3. కంచుకనకం దీనిలో ఎక్కువ శబ్దం చేసేది ఏది ?       (        )

అ) కనకం  ఆ) కంచు ఇ) బంగారం  ఈ) వెండి

4. పై పద్యంలో కనకం తో పోల్చబడిన వాడు ఎవరు ?       (        )

అ) అల్పుడు  ఆ) మూర్ఖుడు  ఇ) సజ్జనుడు  ఈ) దుర్జనుడు

5. ఈ పద్యమును రచించిన కవి ఎవరు ?       (        )

అ) మారద వెంకయ్య  ఆ) బద్దెన  ఇ) భీమన  ఈ) వేమన

అపరిచిత గద్యము చదివి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరెడ్డి కార్డు ఉండేవాడు ఇతడు దూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు ఒక్కొక్క కాలువకు ఒక నీరటి కాడ ఉండేవాడు అతడు కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు వీరిద్దరూ కలిసి నీటి చుక్కను కూడా వృధా పోనీయకుండా పంటచేలకు ఉపయోగించేవారు "పెద్ద నీరటి కాడు"  పదవి వంశపారంపర్యంగా వచ్చి కానీ చిన్న నీరటి గాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు. 

ప్రశ్నలు 

1. నీరేటికాడు ఏ పని చేసేవాడు 

2. పెద్ద నీరెడ్డి కార్డు పదవిలోనికి ఎలా వచ్చేవాడు 

3. నీళ్లను పాలించడం కోసం రైతులు ఎవరిని నియమించుకునేవారు? 

4. చెరువు నీళ్లను సమానంగా పంచేది ఎవరు? 

5. పై పేరాకు శీర్షికను సూచించండి. 

పదజాలం

 కింది ఖాళీలను సరియైన పదాలతో పూరించండి.

1. సైనికులు యుద్ధంలో శరీరంపై రక్షణగా ధరించేది ........

2. అమ్మకనారగాయలు....... తో తరుగుతుంది

3. పొలంలో.......... పనిచేస్తాడు

4. ఆలస్యమైన పరీక్షకుల అనుమతించరు

5. గురువులు ...... కుమార్గదర్శకులు

6. వర్షం కురియగానే .... పులకరిస్తుంది. 



అపరిచిత పద్యం 

కింది పద్యం చదివి తప్పు ఒప్పులు గుర్తించండి. 

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు 

కడివిడైనా నేమి డరము పాలు 

భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు 

విశ్వదాభిరామ వినురవేమ 

1. ఖరము పాలు మంచివి  (    )

2. కడువేడు అంటే చాలా  (    )

3. గంటెడు అంటే ఎక్కువ  (    )

4. గోవు అంటే ఆవు  (    )

5. ఖరము అనగా ఏనుగు (    )