సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

వ్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వ్యాసం రాయడం ఎలా?

వ్యాసం: వ్యాసం , ఒక విశ్లేషణ, వివరణాత్మక, లేదా విమర్శనాత్మక సాహిత్యకూర్పు సాధారణంగా ఒక వ్యాసం అంటారు.

మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించాడు.
ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్.
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు. తొలి వ్యాస గ్రంథం 'హితసూచని'.
తొలితెలుగు వ్యాసరచయిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.

తెలుగు లోప్రఖ్యాతి చెందిన వ్యాసాలు - రచయితలు
సాక్షి వ్యాసాలు - పానుగంటి లక్ష్మీనరసింహ

మాణిక్యవీణ - విద్వాన్ విశ్వం

మిత్రవాక్యం - వాకాటి పాండురంగారావు  

వ్యాస చంద్రిక - గురజాడ అప్పారావు

తెలుగు సాహిత్య విమర్శ - యస్.వి.రామారావు

ఆంధ్రసాహిత్య సంగ్రహం - కవిత్వవేధి (కలం పేరు)

బేకన్ ఉపన్యాసాలు అనేపేరుతో వ్యాసాలు రచించినది - కళాంచి రామనుజాచార్యులు.  


వ్యాసంలోని కొన్నిముఖ్యమైన భాగాలు;

ప్రారంభం:
నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం:
విషయ విశ్లేషణ :
అనుకూల, ప్రతికూల అంశాలు :
సూచనలు / అభిప్రాయం:
ముగింపు.



వ్యాసం 

మీరు చూసిన విజ్ఞాన ప్రదేశాన్ని గూర్చి మీ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.

జవాబు.



నేను చూసిన విజ్ఞాన ప్రదేశం గోల్కొండ కోట


గొల్లలు తమ మందల్ని మేపుకోవటం వల్ల గోలకొండకి మొదట్లో గొల్లకొండనే పేరుండేది. బహుమనీ సుల్తానుల కొలువులోని సుల్తాన్ కులీకుతుబ్షా 1518లో గోల్కొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు.


ఈ గోల్కొండ కోట హైదరాబాద్ నగర సమీపంలో నిర్మించబడింది. భారతదేశంలోని అజేయ దుర్గాలలో గోల్కొండ కోట ఒకటిగా ప్రసిద్ధి పొందింది. కోట గోడ చుట్టూ లోతైన కందకం కూడా నిర్మించబడింది. ఈ కోట సుమారు 120 మీ. ఎత్తు గల కొండపై నిర్మించబడింది. మహాభక్తుడైన రామదాసు ఈ కోటలోని చెరలో బంధించబడ్డాడు. మహాద్వారం, నుండి ఒక చిన్న గుహలో చేసిన శబ్దాలు 128 మీటర్ల దూరంలోని సభాభవనంలో వినబడేటట్లుగా నిర్మాణం చేయబడింది.


గోల్కొండ కోట ఒకప్పుడు సర్వైశ్వర్య సంపన్నమైందని చరిత్ర చెబుతున్నది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడ లభింఛినదేనని చాలామంది నమ్ముతారు.


ఇలా ఎన్నో విజ్ఞానదాయకమైన విశేషాలతో కూడిన ప్రదేశం గోల్కొండ కోట, తప్పక ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రాంతం. చెరసాల ప్రాంతం చూసినపుడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో కదా అని బాధ కల్గింది. ఒకచోట ఉండి శబ్దం చేస్తే మరోచోట వినబడే విధానం ద్వారా శత్రువులను పసిగట్టే రక్షణ వ్యవస్థ పటిష్టం చేసే నిర్మాణ కౌశలం తెలుస్తున్నది. కోట నిర్మాణం కూడా ఎంతో బాగుంది.


ఇట్లు,

జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు,

సిద్దిపేట  



డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...