వ్యాసం
మీరు చూసిన విజ్ఞాన ప్రదేశాన్ని గూర్చి మీ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
నేను చూసిన విజ్ఞాన ప్రదేశం గోల్కొండ కోట
గొల్లలు తమ మందల్ని మేపుకోవటం వల్ల గోలకొండకి మొదట్లో గొల్లకొండనే పేరుండేది. బహుమనీ సుల్తానుల కొలువులోని సుల్తాన్ కులీకుతుబ్షా 1518లో గోల్కొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు.
ఈ గోల్కొండ కోట హైదరాబాద్ నగర సమీపంలో నిర్మించబడింది. భారతదేశంలోని అజేయ దుర్గాలలో గోల్కొండ కోట ఒకటిగా ప్రసిద్ధి పొందింది. కోట గోడ చుట్టూ లోతైన కందకం కూడా నిర్మించబడింది. ఈ కోట సుమారు 120 మీ. ఎత్తు గల కొండపై నిర్మించబడింది. మహాభక్తుడైన రామదాసు ఈ కోటలోని చెరలో బంధించబడ్డాడు. మహాద్వారం, నుండి ఒక చిన్న గుహలో చేసిన శబ్దాలు 128 మీటర్ల దూరంలోని సభాభవనంలో వినబడేటట్లుగా నిర్మాణం చేయబడింది.
గోల్కొండ కోట ఒకప్పుడు సర్వైశ్వర్య సంపన్నమైందని చరిత్ర చెబుతున్నది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడ లభింఛినదేనని చాలామంది నమ్ముతారు.
ఇలా ఎన్నో విజ్ఞానదాయకమైన విశేషాలతో కూడిన ప్రదేశం గోల్కొండ కోట, తప్పక ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రాంతం. చెరసాల ప్రాంతం చూసినపుడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో కదా అని బాధ కల్గింది. ఒకచోట ఉండి శబ్దం చేస్తే మరోచోట వినబడే విధానం ద్వారా శత్రువులను పసిగట్టే రక్షణ వ్యవస్థ పటిష్టం చేసే నిర్మాణ కౌశలం తెలుస్తున్నది. కోట నిర్మాణం కూడా ఎంతో బాగుంది.
ఇట్లు,
జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు,
సిద్దిపేట