సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

వీర తెలంగాణ - డా. తెలంగాణ. siddenky.blogspot.com లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వీర తెలంగాణ - డా. తెలంగాణ. siddenky.blogspot.com లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఆగస్టు 2023, శుక్రవారం

3. వీర తెలంగాణ - డా. సిద్దెంకి


10th తెలుగు - 3వ పాఠం: వీర తెలంగాణ
10వ తరగతి - తెలుగు వాచకము
3వ పాఠం - వీర తెలంగాణ


పాఠ్యాంశ వివరణ:
         వీర అనగా శత్రువును వణికించువాడు. పరమత సహనము లేనివాడు. కుంకుమ పువ్వు మొదలగు అర్థములు గలవు. తెలంగాణ అనగా పూర్వము హైదరాబాదు నిజాము ఏలుబడిలో నున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రములోని భాగము, తెలుగుదేశ సంబంధమైన, తెలుంగు ఆణెం, తెలుగు స్థానం మొదలైన అర్థాలు గలవు.

       తెలంగాణలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపిన తెలంగాణ ప్రజల సాహసాన్ని వీరత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టే ఆదునిక పద్య ప్రక్రియకు చెందిన పాఠం ఈ వీర తెలంగాణ

             పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. ప్రాచీన పద్య రచనలు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేవి కావు. కఠినమైన గ్రాంథిక భాషలో ఉండేవి. కాని ఆధునిక పద్యం అలాకాదు. అందరికి అర్థమయ్యే సులభ శైలిలో సరళంగా ఉండడం వీటి ప్రత్యేకత.

పాఠ్యభాగ వివరాలు : ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి. డాక్టర్ దాశరధి కృష్ణమాచార్యులు రచించిన దాశరధి సాహిత్యం ఒకటవ సంపుటి 'రుద్రవీణ' లోనిది.


కవి పరిచయం:
కవి పేరు: దాశరథి కృష్ణమాచార్య. 
జననం: 22-7-1925
మరణం: 5 -11-1987

రచనలు:
  1. అగ్నిధారమహాంధ్రోదయంరుద్రవీణ, అమృతాభిషేకం' ఆలోచనాలోచనాలుధ్వజమెత్తిన ప్రజకవితా పుష్పకంతిమిరంతో సమరంనేత్ర పర్వంపునర్నవం'గాలిబ్ గీతాలు, నవమి, నవమంజరి, ఖబడ్దార్ చైనా, వ్యాసపీఠం, బాలలగేయాల,జయదేవకృత గీతగోవింద కావ్యం (వ్యాఖ్యానం),మిన్నేటిపొంగులు (హీరాలాల్ మోరియా కవితలకు అనువాదం),ప్రణయసౌధం (అనువాదకావ్యం), యాత్రాస్మ్రతి (ఆత్మకథ),జ్వాలాలేఖిని.
'నా గీతావళ ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గిపెట్టెద' అని ప్రకటించిన కవి.
అవార్డులు:
1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి
ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ"
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "

బిరుదులు:
కవిసింహం
అభ్యుదయ కవిసామ్రాట్
యువకవిచక్రవర్తి
ఆంధ్రవిశ్వవిద్యాలయం వారి 'కళాప్రపూర్ణ'
ఆంధ్ర,ఆగ్రా,శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల గౌరవడాక్టరేట్లు
ఆంధ్రకవితాసారధి
ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి 1977 నుంచి 1983 వరకు..
ఆంధ్రా కవితా సారధి.

ఉద్యమం:
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కూడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు. తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.

      తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి.గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు.  

        ప్రస్తుత పాఠ్యభాగం: వీర తెలంగాణ డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది.

పాఠం నేపథ్యం/ఉద్దేశం 

          తెలంగాణలో రజాకార్లు అరాచకత్వాన్ని ఎదిరించి పోరాడిన ధీరులు ఎందరో ఉన్నారు. వారిలో లో ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమై తెలంగాణ ధైర్యసాహసాలను పద్యాల రూపంలో దాశరథి ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించటం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణా ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో వినవచ్చు.

ప్రవేశిక : సముద్రం పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలి కట్ట దాటడం ఎవరు ఊహించలేరు. కాని తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు.  ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును, దాశరధి పద్యాలలో విని ఉత్తేజితలం కావడానికి ఈ పాఠంలోకి.... పయనిద్దాం.....


ఛందస్సు  :

                                   

ఉత్పలమాల

  U    I     

  U     I     U

I    I    I

     I     I 

  U     I     I 

    I      U

  I      U

నీ   యొ  డి

లో       పెం

   చి   తి   వి

నిం   డు   

   కో    టి  తె 

  ర్ర   లన్!


శాట్కట్ : ఉత్పల భ ర టెన్ 
            ఉత్పలమాల - భ ర న భ భ ర వ 
        10 (1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి మైత్రి 
                    ప్రాస నియమం ఉంటుంది.             
                    నాలుగు పాదములుండును.

   

*ఉ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!

          ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
          జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
          చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

ప్రతి పదార్థాలు
ఓ మాత = ఓ తెలంగాణ తల్లీ
నీ             = నీ
యొడిలోన = ఒడిలో
తెలుగు       = తెలుగు
కోటి            = కోటి లేదా గుంపు
కుర్రలన్       = పిల్లలను 
నిండుగా     = పరిపూర్ణంగా పెంచావు 
ప్రాయము    = వయసు వచ్చి రాగానే
కృపాణము = కత్తులు
ఇచ్చితి         = ఇచ్చావు
యుద్ధమాడి = యుద్ధములో గెలుచుటకు
వాజ్రేయ        = వజ్ర సంకల్పము వంటి 
భుజాబలమ్ము = భుజ పరాక్రమ బలమును, తెగింపును
జగమ్ము     = ప్రపంచమంతా
దరిసింప    = వీక్షించే విధంగా
నవాబుతో = నిజాం నవాబు తో
సవాల్       = తిరుగుబాటుగా సవాల్ 
చేయుమటంటివి = చేయమని ఆదేశిస్తివి
ఈ తెలుగు = ఈ తెలుగు నేల నుంచి 
జిగి = కాంతులు వెదజల్లే శాంతి కోసం
మెండు = గొప్పగా చేయమంటివి.

          తాత్పర్యం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!

మత్తేభం

I   I  U

U    I    I

U   I    U

I   I  I

U   U   U

I   U   U

I    U

తె  ల   గా 

ణ  మ్ము  న

గ   డ్డి   పో  

 చ  యు ను   

సం ధించెన్ 

కృ  పా ణ  

మ్ము! రా

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం

                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

షార్ట్ కట్   మ సభ 1-14


*మ.   తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
            జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ
            తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం
            చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్

ప్రతిపదార్థములు:
తెలగాణమ్మున = తెలంగాణ నేలలో 
గడ్డిపోచయును = గడ్డి పోస లాంటి అతి సామాన్యులు కూడా
కృపాణము = కత్తులు
సంధించెన్ = గురి పెట్టారు 
రాజ            = రాజ్య సిరిసంపదలతో 
లలాముండను = గర్వంతో ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న 
వాని               =వానితో
పీచమడచన్ = ఆ(గర్వాన్ని) అణుచుకు
యుద్ధము   = యుద్ధం 
సాగించెను = సాగించిరి
జగమెల్ల     = ప్రపంచమంతా 
ఏమి అగునో = ఏమవుతుందోనని (ఎంతమంది ప్రాణమానందన ఆస్తులకు                              నష్టం కలుగుతుందోనని)
 భీతిలిపోయెను = భీతిల్లి భయముతో వణికిపోయింది.
దిశాంచలమున్ = నాలుగు దిక్కులలో
చక్రధనుః = శంఖ చక్రవిల్లంబులతోటి  పరంపరలతో (మారునాయుదములతో) పరస్పరం
దివిన్         =ఆకాశంలో గాలిలో తేలియాడుతుండగా
సయ్యాటలాడెన్ = ప్రాణాలకు తెగించి ఆయుధాలతో తలపడ్డారు

           తాత్పర్యం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.

మత్తేభం

I   I  U

U    I    I

U  I    U

I   I  I

U  U  U

I   U  U

I   U

   తె  ల  గా   

ణా!   భ   వ 

దీ   య   పు   

త్ర  కు  ల     

లో తీండ్రిం  

చు  వై   ప్ల  

వ్య   సం

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం
                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 
                    నాలుగు పాదములుండును 
                    ప్రాస నియమం కలదు 
షార్ట్ కట్   మ సభ 1-14


*మ. తెలగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
          చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
          జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
         ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

ప్రతిపదార్థములు:
తెలగాణ = తెలంగాణ
భవదీయపుత్రకులలో;
భవదీయ = ఆత్మీయులైన 
పుత్రకులలో = పుత్రులందరిలో
తీండ్రించు =  ప్రకాశించే (తీక్షణమై, ఉగ్రరూపం దాల్చిన)
 వైప్లవ్య      = మౌలికమైన మార్పు కోసం (సమూలమైన పరిణామం నిమిత్తం)
సంచలనమ్ము = సంచలనం 
ఊరక            = ఊరకనే వెళ్లలేదు 
వసుధ          = భూమండల
చక్రం             = వలయమంతా
ఉజ్వల వైభాతిక భానునిన్;
ఉజ్వల        = ప్రకాశమానమైన 
వైభాతిక       = విరజిల్లే 
భానునిన్     = మేల్కొల్పే సూర్యుని 
పిలిచి            = ఆహ్వానించి
దేశంబంతటన్ = దేశమంతా 
కాంతి           = వెలుగులు వెదజల్లే విధంగా
వార్ధులు       = సముద్రములు
నిండించిరి    = పారించిరి
వీరు             = వీరే 
వీరులు         = తెలంగాణ వీరులు 
పర              = అందరికోసం 
అర్థులు        = త్యాగాన్ని అర్థించి మేలు చేశారు, పరోపకారులై...

       తాత్పర్యం: అమ్మా! తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా..

II వ్యక్తీకరణ - సృజనాత్మకత : 

1. ఐదు వాక్యాలలో జవాబులు:
అ) "తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి" అన్న కవి మాటలను మీరు ఎట్లా సమర్థిస్తారు?
జ. దక్షిణ భారతదేశంలో బహమనీ సుల్తానుల పాలన అంతమైన తర్వాత ఏర్పడ్డదే నేటి తెలంగాణ. కులికుద్బుషా వంశస్థులు గోల్కొండ కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకొని దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ. పై. 1687లో ఢిల్లీ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోలకొండ కోటను సర్వనాశనం చేసి కుయుక్తితో తెలంగాణ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నవాబులు తెలంగాణ ప్రజలను పీడించి రకరకాల పన్నులను వసూలు చేశారు. 
గోల్కొండ పట్టణ అభివృద్ధికి వారి విలాసాలకు ఖర్చు చేశారు. ఔరంగాజేబు ప్రతినిధులుగా ఈ ప్రాంతాన్ని పాలించిన వారు కూడా దుర్మార్గులై ప్రజల్ని పీడించారు.  తెలంగాణ ప్రజలు ప్రతి విషయంలో అస్వతంత్రులు. 

ఆ) 'తెలంగాణమ్మున గడ్డి పోచయున్ సంధించిన్ కృపాణము' ఎందుకన్నా డు?
జ. గడ్డి పోచ అనగా అతి బలహీనమైనది అని అర్థం. తెలంగాణ ప్రజలు నైజాం పాలనలో రజాకార్ చేతులలో అత్యంత బలహీనులు. తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. ప్రతి తెలంగాణ పౌరుడు విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. కారాగార శిక్షల అనుభవించారు. కొందరు ప్రాణ త్యాగం చేశారు. మరికొందరు అల్పులైనా ఏమిటికి పనికిరానివారు అనుకున్నా గడ్డిపూసలాగున్నవారు ప్రాణాలకు తెగించి నిజాం చక్రవర్తితో పోరాడారు రైతాంగ పోరాటంలో రైతులే గెలిచారు అందుకే దాశరధి కవి గడ్డిపోచయున్ సంధించెన్ కృపానమ్ము అని రాశాడు.


ఇ) తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు? 
జ. తెలంగాణలో సంధ్యాభాను
తెలంగాణ ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక లోని వివిధ ప్రాంతాలు తెలంగాణ ఏలుబడిలో ఉండేవి. కాకతీయ చక్రవర్తులు అంతరించిన తర్వాత తెలంగాణ ప్రాంతం దుర్మార్గులైన పరిపాలకుల చేతిలో ఉండిపోయింది. తెలంగాణ గొప్పతనం, విశిష్టత చాలా కాలం తరుష్కుల చేతుల్లో చిక్కుబడి ఉన్నాయి. తెలంగాణ ప్రజల జీవితాల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వెలుగు రేఖలు లేకుండా పోయాయి.
1948లో నైజం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం వల్ల తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటు అయింది తెలంగాణ రాజ్యం భారత యూనియన్ లో విలీనమైంది ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించింది. మెరుపుతీగల కాంతి రేఖలు ప్రజలందరికీ బ్రతుకు త్రోహం చూపెట్టాయి అందుకే దాశరధి కవి స్వచ్ఛమైన వెలుగులు వెదజల్లే కాంతివంతమైన సూర్యుడు మొదటగా ఉదయించాడని కొత్త ఆశలు రేకెత్తించాడు తెలంగాణ జీవితాల్లో ఉదయభానుని కాంతి తొలిసారిగా వెలుగులు తెచ్చిందని కవి అంతరార్థం తెలంగాణ భారత్ యూనియన్లో కలవడానికి సంధ్యాభానుని ఉదయంగా కవి గారు పేర్కొన్నారు.

2. పది వాక్యాల జవాబులు
అ) వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
సారాంశము :
         తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 
         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 
      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.

(లేదా)


సారాంశం:
ఓ తెలంగాణమా! నీ పెదవులతో ఊపిన శంఖధ్వనులు ఈ భూమండల మంతా ఒక్కమారుగా బొబ్బుడు.. పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగాతరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.

2) అమ్మా తెలంగాణమా! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. నీ ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం. స్వచ్ఛమైన కాంతిమంతమైన సూర్యుడు ఉదయించాడు. వచ్చింది.

3) అమ్మా! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్ర సమానమైన భుజపరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాంరాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!

4)ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తిబట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలోఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.

5) తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గు వైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.

6) అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలాన్నంతా

సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు.

వీరంతా వీరులు, పరోపకారులు కూడా.

7) అమ్మా! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. రుద్రులు మెచ్చేటట్లు యుద్ధం చేసి చివరకు విజయాన్ని సాధించాం.

8) కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం | చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.

3. సృజనాత్మకంగా /;ప్రశంసిస్తూ రాయండి.
ఆ) తెలంగాణ తల్లి తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయం రాసి ప్రదర్శించండి లేదా ఆత్మకథ రాయండి.
జ. నేను తెలంగాణను మాట్లాడుతున్న నేను నీ తల్లిని. 
మీకు జన్మనిచ్చిన గడ్డను. నా సాహసోపీతమైన వైభవం, నా ఘనత మీకు వివరిస్తాను.
కాకతీయ కథనరంగం వీరుల పరాక్రమాన్ని, భుజబలాన్ని, బుద్ధి బలాన్ని ఎంతని వర్ణించను? ఆ వీరుల వారసత్వం అందిపుచ్చుకున్న మీరు తరతరాల బానిసత్వాన్ని రూపుమాపడానికి నిజాం రాజ్యముతో కలబడినారు. 
రాజ్య గర్వంతో విర్రవీగుతున్న నిజం వెనక్కి మరలి చూడకుండా తరిమికొట్టారు. ఆ కాలంలో త్యాగాలు చేసి మీరంతా నన్ను బంధ విముక్తి చేసుకున్నారు.
కలల కాణాచిని. 
పాటగాసిన పట్టు నా నేను. 
నా సంతతి అద్భుతాలను ఆవిష్కరించిన మేధస్సు.  
పాటలతో జనాలని మమేకం చేసిన ఉప్పెన - గాయకులు. 
పోతన, గోపన్న, దాశరధి, మగ్ధుం మోహియోద్దీన్ ల కవిత్వం ఎప్పటికీ నిత్య నూతనం.
శిల్ప సౌందర్యం తో సప్త స్వరాలను పలికించిన ఘనత నా పిల్లలది. 
హిందూ ముస్లిం క్రైస్తవ జైన మతాల సంగమమే నేను.
రామప్ప యాదాద్రి భువనగిరి మెదక్ చర్చి కొలనుపాక జైన దేవాలయం, దర్గా సంస్కృతి, సూఫీ తత్వముల, సర్వ మతాల సమ్మేళనం నేను.
హైదరాబాద్ భిన్న సంస్కృతులకు ఎదిగి పూచిన పాదయి దేశ సంస్కృతి సంప్రదాయాలకు అలవాలమైంది.
ఎందరో నాట్య కళావతం సరస్సులు నాట్యం చేయించారు రామదాసాది  భక్తాగ్రంధిలో వాగ్గేయకారులుగా ఇంకా నిత్య నూతనంగా తేజరిల్లుతున్నారు.
నా సంతానం చూపిన త్యాగనిరికి బలిదానం చరిత్ర నుదుటిపై సింధూరం దిద్దింది. భారతాన్ని పౌరులను ప్రేరేపించింది. గోదావరి కృష్ణమ్మ వంటి గంగా ప్రవాహాలు నా చనుబాల ధారలై ఈనెల తల్లిని సస్యశ్యామలం చేస్తున్నాయి. నా ప్రేమ గుణం  రక్తంలో ప్రవహించిన నా ముద్దుబిడ్డలు ప్రేమమూర్తులు, సహనశీ లురు, ఆలోచనపరులు.
వీరవరులకు విప్లయ్ యోధులకు కలలకు ఘన సంస్కృతికి అపురూప నిర్మాణాలకు పుణ్యక్షేత్రాలకు తీర్థాలకు దర్గాలకు నిలయమైన నా ఘనత కాపాడవలసింది మీరే. నా చరిత్రను కీర్తించండి. 
అవమానం కలిగినప్పుడు నన్ను ఆహ్వానించండి మీలో కొత్త ఆలోచనలు పుట్టిస్తాను కర్తవ్యాన్ని ఆదేశిస్తాను ప్రగతి కాముకలై మన భాగ్య నగరాన్ని, 
తెలంగాణ ను విశ్వ పటం మీద అత్యున్నతంగా తీర్చిదిద్దండి. అప్పుడే మీరు నాకు తగ్గ వారసులు


III భాషాంశాలు:
1. సొంత వాక్యాలు
అ)సయ్యాటలాడుతున్నాయి
బావ మరుదులు సయ్యాటలాడుతారు
ఆ) కల్లోలం
తెలంగాణ ఉద్యమంలో కల్లోలం జరిగింది
ఇ) వెనుకాడరు
మరణిస్తారని తెలిసి వీరులు వెనుకాడరు
ఈ) దిక్కుతోచప్పుడు
ఏం చేయాలో దిక్కుతోచనప్పుడు ఇతరులపై ఆధారపడతారు

2. నానార్థాలు
ఆ)ఉదయము :  పుట్టుక, సృష్టి, తూర్పు కొండ, ఉదయించడం
ఆ)ఆశ : కోరిక, దిక్కు, 
ఇ) అభ్రము: తుమ్మెద, మేఘం బంగారం, కర్పూరం, స్వర్గం.

3. పర్యాయపదాలు:
ఆ)రవము : ధ్వని, రొద, చప్పుడు, శబ్దం
ఆ)కృపాణము : కత్తి, ఖడ్గం, అసి, కరవాలం
ఇ) జలధి : అంబుధి, సముద్రం, పయోధి, అబ్ధి, కడలి
ఈ) జెండా : పతాకము, బావుటా, ధ్వజం 
ఉ) లంఘించడం : దాటు, దుముకు, తరించు
     
వ్యాకరణాంశాలు: 
కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) జగమెల్ల : జగము + ఎల్ల = ఉత్వ సంధి
ఆ) సయ్యాటలాడెన్ : సయ్యాటలు + ఆడేన్ = ఉత్వ సంధి
ఇ) దారినిచ్చిరి : దారిని + ఇచ్చిరి = ఇత్వ సంధి
ఈ) ధరాతలమెల్ల : ధరాతలము + ఎల్ల = ఉత్వ సంధి 
ఉ) దిశాంచలము : దిశా + అంచలము = సవర్ణదీర్ఘ సంధి 
ఊ) శ్రావణాభ్రము :  శ్రావణ + అభ్రము = సవర్ణదీర్ఘ సంధి
ఋ) మేనత్త : మేన + అత్త = అత్వ సంధి. 

 







2. విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
అ) కాకతీయుల కంచుగంట : 
కాకతీయుల యొక్క కంచుగంట -షష్టి తత్పురుష సమాసం
ఆ) కళ్యాణ గంటలు :‌ కళ్యాణ ప్రదమైన గంటలు -విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) బ్రతుకు త్రోవ : బ్రతుకు కొరకు త్రోవ -చతుర్థి తత్పురుష సమాసం
ఈ) మహారవము : మహాదైన రవము -విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉ) వికార దంష్ట్రలు : వికారమైన దంష్ట్రాలు -విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఊ) కాంతి వార్ధులు : కాంతులనే వార్తలు -రూపక సమాసం 
ఋ) తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ అనెడి పేరుగల రాష్ట్రం -సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ౠ) మత పిశాచి : మతం అనే పిశాచి -రూపక సమాసం



 



సారాంశము 
         తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 

         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 

      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.

దాశరథి శైలి రాయండి:


 "ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో" అంటూ ప్రారంభమయ్యే ఈ గేయంలో కేవలం రెండు పంక్తులలోనే మొత్తం భూమి పుటుక, మానవ పరిణామం గురించిన శాస్త్రీయ అవగాహనను చాలా సరళంగా తెలియజేశాడు. సూర్యుని నుంచి వేరుపడిన అనేక అగ్నిముద్దల్లో, చల్లబడిన ఒక మద్దయే మన భూమి. ఈ శాస్త్రీయ అవగాహనని ప్రజలకు తెలియచేసేలా 'భూగోళం పుటుక కోసం రాలిన సురగోళాలెన్నో" అని రాశారు. ఇలా సంక్లిష్ట శాస్ర విషయాలను చాలా సులభశైలిలో పామరులకు కూడా అర్థం అయ్యేలా భూగ్రహ, మానవ పరిణామాల గురించి శాస్త్రీయ అవగాహనను కల్పించాడు.

తెలంగాణ ప్రజల కన్నీళ్ళను “అగ్నిధార"గా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం అద్భుత రచనలు దాశరథి చేశాడు.


 
అదనపు సమాచారం
సారాంశం:
ఓ తెలంగాణమా! నీ పెదవులతో ఊపిన శంఖధ్వనులు ఈ భూమండల మంతా ఒక్కమారుగా బొబ్బుడు.. పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగాతరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.

2) అమ్మా తెలంగాణమా! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. నీ ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం. స్వచ్ఛమైన కాంతిమంతమైన సూర్యుడు ఉదయించాడు. వచ్చింది.

3) అమ్మా! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్ర సమానమైన భుజపరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాంరాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!

4)ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తిబట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగా

యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో

ఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.

5) తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గు వైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.

6) అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలాన్నంతా

సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు.

వీరంతా వీరులు, పరోపకారులు కూడా.

7) అమ్మా! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. రుద్రులు మెచ్చేటట్లు యుద్ధం చేసి చివరకు విజయాన్ని సాధించాం.

8) కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం | చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.




డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...