సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

X. 9. జీవన భాష్యం

 9. జీవన భాష్యం:

జీవన భాష్యం పరీక్ష



పాఠం ఉద్దేశం:
 మనిషి దేనిని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం "గజల్" లో పల్లవిని "మత్లా" అని చివరి చిరణాన్ని "మక్తా" అని కవి నామముద్రం "తఖల్లుస్" అని అంటారు. ప్రతి చరణం చివరన అంత్యప్రాస రూపొందిస్తుంది. 
సరస భావన, చమత్కార ఖేలన ఇంపూ, కుదింపూ గజల్ జీవ గుణాలు.
 ప్రస్తుత పాఠ్యభాగం "డాక్టర్ సి.నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం" ఆరవ సంపుటిలోని "తెలుగు గజళ్ళు" లోనిది.

. జీవన భాష్యం పరీక్ష

సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (వికీపీడియా నుంచి)

జననం: జూలై 291931 

మరణం: జూన్ 122017).

తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం:1931 జూలై 29
భారతదేశం హనుమాజీపేట్, రాజన్న సిరిసిల్ల.
మరణం2017 జూన్ 12 (వయసు 85)
హైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుసినారె
వృత్తికవి, గేయరచయిత,
సాహితీవేత్త
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు (1973), 
పద్మ శ్రీ (1977),
కళాప్రపూర్ణ (1978), 
'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు  (1988), 
పద్మ భూషణ్ (1992),
సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)

రచనలు : 

  • విశ్వంభర
  • మనిషి - చిలక
  • ముఖాముఖి
  • భూగోళమంత మనిషి
  • దృక్పథం
  • కలం సాక్షిగా
  • కలిసి నడిచే కలం
  • కర్పూర వసంతరాయలు
  • మట్టి మనిషి ఆకాశం
  • మంటలూ - మానవుడూ - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973)
  • తేజస్సు నా తపస్సు
  • నాగార్జున సాగరం
  • విశ్వనాథ నాయకుడు
  • కొనగోటి మీద జీవితం
  • రెక్కల సంతకాలు


పురస్కారాలు :
  1. 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం
  4. భారతీయా భాషా పరిషత్ పురస్కారం
  5. రాజలక్ష్మీ పురస్కారం
  6. సోవియట్-నెహ్రూ పురస్కారం
  7. అసాన్ పురస్కారం
  8. పద్మశ్రీ పురస్కారం
  9. పద్మభూషణ్ పురస్కారం
  10. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ
  11. ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
  12. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
  13. డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)

పదవులు :- విద్యారంగంలోనూ, పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించాడు.

  1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
  3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
  4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
  5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు

భారత రాష్ట్రపతి అతన్ని 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.

 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు

బిరుదులు: ‘నవ్యగేయ మహాకవి, గేయకవి సమ్రాట్, పుంభావసరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవితా మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వనిచక్రవర్తి, ప్రజాకవి, నవకవితా సమ్రాట్, చలనచిత్ర కవి చక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథులు, నవరసాలమూర్తి’’వంటి ప్రశంసలతో సహృదయ ప్రపంచం నారాయణరెడ్డిగారిని సన్మానించింది. 


(గమనిక : సినారె గురించి రాయమంటే బాల్యం, రచనలు : జ్ఞానపీఠ్,పద్మశ్రీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, పదవులలో ఒక్ ఐదు రాస్తే  కొన్ని రాస్తే సరిపోతుంది. 


ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోని ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్భవించి మానవ వికాస భాష్యాన్ని విందాం.





 జీవన భాష్యం పరీక్ష


ఇదిగో జీవన భాష్యం సారాంశానికి వర్ణ మైండ్ మ్యాప్!

మధ్యలో "జీవన భాష్యం" కేంద్రంగా ఉండి, ఆరు ముఖ్యమైన భావాలు చుట్టూ అమర్చబడ్డాయి:

 మనసు & కన్నీరు — మేఘాలు వర్షంగా మారినట్లే బాధలు కన్నీరవుతాయి

🌿 లక్ష్యం & విజయం — కష్టాలకు వెరవక ముందుకు సాగితేనే విజయం

🍂 బీడు నేల & కృషి — శ్రమతో విత్తనాలు వేస్తే పంట తప్పక పండుతుంది

🌸 సమాజం & సహకారం — అన్యోన్యంగా జీవించడమే నిజమైన మానవత్వం

🌄 విధి & వినమ్రత — హిమాలయమే కరిగినట్లు గర్వం ముందుకు సాగదు

🌱 నిస్వార్థ సేవ — సేవా జీవితమే చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది


I. అవగాహన ప్రతిస్పందన కింది 1. అంశాన్ని గురించి చర్చించండి.

అ)  జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజలకు ఎలా సరిపోయిందో చెప్పండి.

జవాబు:  జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్‌కు అనేక విధాలుగా సరిగ్గా సరిపోయింది.

"జీవనం" అంటే మనిషి జీవించే తీరు. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు కలిసిన  ప్రయాణం. "భాష్యం" అంటే  వివరణ.  ఈ గజల్ జీవితానికి ఒక మార్గదర్శనం. కన్నీరు, లక్ష్యం, కృషి, సమాజం, విధి, సేవ అనే ఆరు జీవన సత్యాలను వరుసగా వ్యాఖ్యానిస్తూ మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి కోణాన్ని స్పృశించింది.. పుట్టుక నుండి చరిత్ర వరకు  రాయబడింది. కాబట్టి "జీవన" అనే పదం సరిగ్గా ఇమిడింది. విధి ముందు వినమ్రత, నిస్వార్థ సేవ వంటి గొప్ప జీవన తాత్త్విక సత్యాలను చెప్పే  జీవన దర్శనం అనిపిస్తుంది. అందుకే జీవన భాష్యం అనే శీర్షిక కు సూటిగా చెప్పే అద్దం వంటిది.

2. పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.

నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది

పేరవంతుంది 

నీరు — జీవన గానం

చినుకు పడిన చోట నీరవుతుంది, 

పాయగా పరిగెత్తి దారవుతుంది.

దారిన పచ్చగా పైరవుతుంది, 

పైరు నవ్విన చోట ఊరవుతుంది.

ఊరి గుండెలో ఏరవుతుంది, 

ఏరు పాటలాడి పేరవుతుంది.

చినుకు నుండి పేరు వరకు 

 ఒకే నీటి యాత్ర, 

ఒకే జీవన గాథ.

ఇచ్చిన చోట పండుతుంది, 

ఇచ్చినవాడే పేరవంతుంది.


చినుకు నీరై పుట్టి, దారై పారి, పైరై పెరిగి, ఊరై నిలిచి, ఏరై పాడి, చివరకు పేరవంతై నిలిచే ప్రయాణమే జీవితం అని ఈ కవిత చెబుతోంది.



3. కింది అపరిచిత గేయ పాదాలు చదవండి.

భీతిలేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో

 తనివి తీరజనులకకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో 

అడ్డుగోడలేని సమ సమాజమేచటనుండుననో 

హృదయంతరాళ జనితమౌ సత్యమేచట వరలునో 

ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము 

లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా!

గేయం చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) 'శిరము నెత్తి నిలుచుననో' అంటే మీకేమి అర్థం అయింది

జవాబు : తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలుస్తుందో అని అర్థమైంది

ఆ) జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయం లో ఉన్నది?

జవాబు : 

ఇ) సమ సమాజం ఎట్లా ఏర్పడుతుంది జవాబు: 

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి? జవాబు 

ఉ) స్వర్గసీమ అనడంలో ఆంతర్యం ఏమిటి?

జవాబు


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత 

"చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? 

జవాబు:చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.

పేరు నిలవడానికి చేయవసిన పనులు :

  1. దానధర్మాలు విరివిగా చేయాలి.
  2. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
  3. పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
  4. కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
  5. బావులు, చెరువులు తవ్వించాలి.
  6. ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
  7. విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  8. చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
  9. వైద్యశాలలు కట్టించాలి.
  10. గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి.
  11. . జీవన భాష్యం పరీక్ష

ఆ)“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు

జ: ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.  సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఇ) "మనుషులు పడుగురు కూడితే ఒక ఊరవుతుంది" అని సినారె ఎందుకు అని ఉంటారు?
జ. మనిషి భగవంతుడు సృష్టిలో ఒకే రకం జీవి. మనుషులందరూ సమానమే అనే భావం ఉన్నదని అర్థమవుతుంది. నీటి సమాజంలో కుల మాత వర్ణ ప్రాంత భేదాలకు విడిపోతున్నారు. 
తద్వారా సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. మత వైశాల్యాల వల్ల దేశాలు రాష్ట్రాలు మనుషులు నాశనం అవుతున్నారు. ఈ వేదాల వల్ల కలతలు కార్పన్యాలు కుట్రలు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. పదిమంది కలిసి ఉంటే అది చక్కని ప్రదేశం. ఆ ప్రదేశమే గ్రామం. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే గ్రామం సుభిక్షంగా, సంతోషంగా ఉంటుంది. కుల మత భేదాలు మరచి కలిసి ఉండటంవల్ల గ్రామానికి సకలం సమకూర్తాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తుంది. 

గ్రామ ప్రజల్లో సహకారం సమన్వయం ఐక్యత అవసరం చెప్పడానికి సినారె గారు ఈ వాక్యాన్ని అందించారు.

2. ఈ క్రింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)జీవన భాష్యం పాఠంలో సినారె అందించిన సందేశం:

మనము ఒక లక్ష్యాన్ని సాధించనీకే బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురౌతాయి ,లోకం మనల్ని భయపెడుతుంది .ఆ భయాలకు లొంగకుండా ముందుకు పోతే గెలుపు మనదే .

  • బీడు భూముల్లో ఏం పండవని నిరాశ పడకుండా కష్టపడి విత్తనాలు ఎస్తే మంచి పంట వస్తుంది.
  • నలుగురు మనుషులు కలిసి ఉంటేనే సాంఘిక జీవనం ,మన బతుకుకు ఒక అర్థం . అట్లాంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక మంచి ఊరు అవుతుంది .
  • మనం ఎంత సంపాదించినా ,ఎంత సాధించినా , కష్టాలు వస్తాయి . మనిషి ఏమి కాదని ధీమాగా ఉండకూడదు . విధి ఎప్పుడు ఎటువంటి పరీక్ష పెడుతుందో చెప్పలేం.
  • బిరుదులు సాధించామని , మంచి పేరు సాధించామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు ఉండదు . మనిషి సాటి వారికి సహాయపడి ,త్యాగాలు చేస్తేనే వారి పేరు చరిత్రలో నిలుస్తుంది .
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. 
జీవన భాష్యం గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవిత ను రాయండి

నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది
పేరవంతుంది

నీరు — జీవన గానం

చినుకు పడిన చోట నీరవుతుంది, పాయగా పరిగెత్తి దారవుతుంది.

దారిన పచ్చగా పైరవుతుంది, పైరు నవ్విన చోట ఊరవుతుంది.

ఊరి గుండెలో ఏరవుతుంది, ఏరు పాటలాడి పేరవుతుంది.

చినుకు నుండి పేరు వరకు — ఒకే నీటి యాత్ర, ఒకే జీవన గాథ.

ఇచ్చిన చోట పండుతుంది, ఇచ్చినవాడే పేరవంతుంది.

(చినుకు నీరై పుట్టి, దారై పారి, పైరై పెరిగి, ఊరై నిలిచి, ఏరై పాడి, చివరకు పేరవంతై నిలిచే ప్రయాణమే జీవితం అని ఈ కవిత చెబుతోంది.)



లేదా 
ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.

1️⃣ రెడ్డి గారూ! నమస్కారం. మీ సినీ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదటగా ఏ సినిమాకు మీరు పాటలు రాశారు?

2️⃣ మీరు సినిమా కథా సంభాషణలు కూడా వ్రాశారా? ఉంటే, ఆ సినిమా పేరు చెప్పగలరా?

3️⃣ ‘మీ పరిశోధన గ్రంథం నేటి విద్యార్థులకు మార్గదర్శకం’ అని పలువురు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యపై మీ స్పందన ఏమిటి?

4️⃣ ‘విశ్వంభర’ కావ్యం ద్వారా మీరు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆ కావ్యంలో ప్రత్యేకతలేమిటి?

5️⃣ మీరు పద్య రచనలోనూ నిమగ్నమై ఉన్నారని విన్నాం. మీ పద్యకావ్యం పేరేమిటి? దాని అంశం ఏది?

6️⃣ మీ కవిత్వం నవ్య కవిత్వం లోని ఏ శ్రేణికి చెందిందని మీరు భావిస్తారు?

7️⃣ ప్రాచీన తెలుగు కవుల్లో మీకు అత్యంత ప్రేరణనిచ్చిన కవి ఎవరు? ఎందుకు?

8️⃣ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’పై మీ అభిప్రాయం రెండు మాటల్లో చెప్పగలరా?

9️⃣ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తెలుగును పరిపాలనా భాషగా స్థిరపరచడానికి మీరు చేసిన ముఖ్యమైన చర్యలేమిటి?

🔟 మీరు భవిష్యత్తులో సినిమా పాటలు రాయరని ప్రతిజ్ఞ చేసినట్టు విన్నాం. దానికి కారణమేమిటి?

1️⃣ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న బీట్ సంగీతానికి తగ్గట్టు మీరు ఏమైనా పాటలు రాశారా? ఉంటే వాటి గురించి చెప్పండి.


జీవన భాష్యం -  సారాంశం

మేఘాలు నీటితో నిండినప్పుడు వర్షంగా కురిసినట్లే, మనసు బాధలతో నిండినప్పుడు కన్నీరు వస్తుంది.

ఆకాశంలో మబ్బులు తేమను మోసుకుని బరువెక్కినప్పుడు వర్షంగా మారి భూమిపై కురుస్తాయి. అదే విధంగా మనసులో ఆందోళనలు, చింతలు, దుఃఖాలు పేరుకుపోయినప్పుడు మనిషి తట్టుకోలేక కన్నీరు కార్చడం సహజమే. కన్నీరు మనిషి బలహీనత కాదు, మనసు మోసే భారానికి సహజమైన స్పందన.

లక్ష్యం వైపు సాగేటప్పుడు కష్టాలు తప్పవు. కానీ వాటికి భయపడకుండా ముందుకు నడిస్తేనే విజయం వస్తుంది.

ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరినప్పుడు లోకం అడుగడుగునా అడ్డంకులను చూపిస్తుంది, భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి మాటలకు చలించిపోకుండా, నిరుత్సాహపడకుండా దృఢమైన మనసుతో ముందుకు సాగినవారే చివరకు విజయం సాధిస్తారు. వారి ధైర్యం, పట్టుదల చూసి మిగతావారు కూడా స్ఫూర్తి పొంది అదే దారిలో నడుస్తారు. అలా ఒక్కరి విజయం వేలమందికి వెలుగు చూపే దీపం అవుతుంది.

బీడు నేలలో పంట పండదని నిరాశపడకూడదు. శ్రమించి దున్ని, విశ్వాసంతో విత్తనాలు వేస్తే మంచి పంట పండుతుంది.

పనికిరాదని అందరూ వదిలేసిన బీడు నేలను చూసి నిరాశపడే బదులు, పట్టుదలతో కష్టపడి దున్ని విత్తనాలు నాటితే ఆ నేల కూడా పచ్చగా మారుతుంది. అలాగే జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితి అయినా విశ్వాసాన్ని వదులుకోకుండా కృషి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ప్రయత్నించకుండానే వదిలేయడం అసలైన వైఫల్యం.

పరస్పర సహకారంతో జీవించడమే మంచి సమాజం. అందరి పట్ల సానుకూలంగా ఉంటేనే కలిసి సంతోషంగా జీవించగలం.

మనిషి ఒంటరిగా జీవించలేడు. ఒకరికొకరు సహాయపడుతూ, అన్యోన్యంగా మెలిగితేనే జీవితం సుఖంగా సాగుతుంది. సాటి మనుషుల పట్ల అభిమానం, గౌరవం కలిగి ఉంటేనే సమాజంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. అలాంటి మనుషులు కలిసి నివసించే చోటే నిజమైన ఊరు ఏర్పడుతుంది, నిజమైన మానవత్వం వికసిస్తుంది.

సంపద, అధికారం, విజయాలు ఎన్ని ఉన్నా విధి ముందు ఎవరూ తలవంచవలసిందే.

మనిషి ఎంత సంపన్నుడైనా, ఎంత అధికారవంతుడైనా, ఎన్ని విజయాలు సాధించినా "ఇక నాకు ఏ కష్టమూ రాదు" అని గర్వంగా చెప్పుకోలేడు. విధి ఎప్పుడు ఎలా పరీక్షిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆకాశమంత ఎత్తులో నిలిచిన హిమాలయ పర్వతశిఖరమే ఎండ వేడికి కరిగి నదిగా ప్రవహించవలసి వస్తుంది. అలాగే ఎంతటి మహాపురుషుని గర్వమైనా కాలం ముందు సాగనేరదు. కాబట్టి మనిషి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండటమే శ్రేయస్కరం.

పేరు, బిరుదులు, సత్కారాలు నిజమైన గుర్తింపు కావు. నిస్వార్థ సేవ చేసినవారి పేరే చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ప్రపంచమంతా తన పేరు తెలుసని గర్వపడటంలో, గొప్ప బిరుదులు, సత్కారాలు పొందడంలో నిజమైన విలువ లేదు. అవన్నీ కాలంతో పాటు మాయమైపోతాయి. కానీ మానవాళి కోసం నిస్వార్థంగా కష్టపడి, తన సుఖాన్ని త్యాగం చేసి మేలు చేసిన వారి పేరు మాత్రం చరిత్రలో చిరకాలం చెరగకుండా నిలిచిపోతుంది. అందుకే మనిషి పేరు కోసం కాకుండా సేవ కోసం జీవించాలి.


III. భాషాంశాలు

అ)మబ్బు : మేఘము, మేయిలు అంబుదము, ఘనము 
ఆ)గుండె : హృదయము, హృత్తు, ఎద డెందము
ఇ) శిరస్సు : తల, శీర్షము, మస్తకము, మూర్ధము, 
2) కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి
అ)వ్యాప్తి :  పరిమళ వాసన వ్యాప్తి చెందుతుంది.
ఆ)జంకని అడుగులు : జంకని అడుగులే ధైర్యం 
ఇ)ఎడారి దిబ్బలు : ఒంటెలు ఎడారి దిబ్బల్లో నడుస్తుంటాయి.
ఈ)చెరగని త్యాగం:  నాన్నగారి చెరగని త్యాగం వల్ల కుటుంబం గొప్ప స్థాయికి ఎదుగుతుంది.

వ్యాకరణాంశాలు

కింది పదాలు కలిపి సంధిని గుర్తించి రాయండి

నీరు + అవుతుంది = నీరవుతుంది - ఉత్వ సంధి.
ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన,- ఉత్వ సంధి
పేరు + అవుతుంది = పేరవుతుంది - ఉత్వ సంధి.
ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం.
2. కింది పంక్తులలోని పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.
అ)ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు 
ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు - షష్టి తత్పురుష సమాసం
ఆ)ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు - షష్టి తత్పురుష సమాసం
3. కింది వాటిని చదివి అలంకారాలో గుర్తించండి.
అ)నీకు వంద వందనాలు
జ. పై వాక్యంలో ఛేకాను ప్రాసాలంకారము ఉంది.
 లక్షణం : హల్లుల జంట అర్థ బేధంతో వెంట వెంటనే వాడితే ఛేకాను ప్రాసాలకారం అంటారు.
ఆ) తెలుగుజాతికి అభ్యుదయం 
నవభారతికే నవోదయం
        అంత్యానుప్రాసాలంకారము 
లక్షణం : పాదం చివరలో లేదా  చివర్లో  ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది అంత్యాను ప్రాసాలంకారం అంటారు.
ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్ - వృత్యనుప్రాసాలంకారము.
ఈ) అజ్ఞానాంధకారం తొలగితే మంచిది రూపకాలంకారం
అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారము అనేది ఉపమానం ఇక్కడ అజ్ఞానము అంధకారము అనే ఉపమాన ఉపమేయాలకు బేధం ఉన్న లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇక్కడ రూపకాలంకారం ఉంది.
రూపకాలంకారము:  ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం రూపకాలంకారం.

 జీవన భాష్యం పరీక్ష

18, సెప్టెంబర్ 2023, సోమవారం

X. 8. లక్య సిద్ధి

X. 8. లక్య సిద్ధి

పాఠం ఉద్దేశం: దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింప చేయడం సాధారణ వార్తలకు, సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది ఈ పాఠం.


పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకుని పత్రికలో తమ వ్యాఖ్యానంతో ఆ విషయానికి సంబంధించిన పూర్వపరాలను పరామర్శిస్తూ సాగే రచనను సంపాదకీ వ్యాసం అంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఆలోచించే విధంగా రాయగలగడం మంచి సంపాదకీయానికి గల లక్షణం. ఈ సంపాదకీయాలు, ఆయా కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో వీటిలో విభిన్న కాలాలకు అన్వర్తింపజేసుకోవచ్చు.
 తెలంగాణ రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2, 2014 నాడు ఇది ఒక తెలుగు దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
I. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జ. అది తెలంగాణ పోరాటం గమ్యాన్ని అందుకున్న శుభ సందర్భం. తెలంగాణ జాతి చరిత్రలో అదొక మహత్తరమైన క్షణం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తొలిదశ తెలంగాణ ఉద్యమం. మలిదశ తెలంగాణ ఉద్యమం అన్ని కలగలిపి కలలు సాధించుకున్న అద్భుతమైన క్షణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మూడు తరాల పిల్లల కనుల నుండి భావోద్వేగంతో ఆనంద భాష్పాలు వర్షించాయి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు తెలంగాణ ప్రజల ఎదలపై ఆర్ద్రంగా మారాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.

ఆ) ప్రస్తుత సంపాదకీయ వ్యాసం లోని భాష శైలి ఎట్లా ఉన్నది?
జ. సంపాదకీయమంటే సమాజ దర్పణం సంపాదకీయం సృజనాత్మక శైలి రచన సరళంగాను, సూటిగాను, నిష్కర్షగా ప్రాధికారికంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. సంక్లిష్టమైన అంశాలను జన భవిష్యత్తును వర్తమానాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలను విశ్లేషించి, ఉత్తమమైన దానిని పరిచయం చేస్తూ పాఠకుడి కందివ్వాలి. సంపాదకీయాల్లో ఆసక్తి కలిగించే ఎత్తుగడ, వివరణ తప్పనిసరి. ఆలోచించే ముగింపు అవసరం.  పత్రిక హృదయమే సంపాదకీయ వ్యాసం. ఒకప్పటి  పద్యాలు, శ్లోకాలు వివరణలు కొంచెం లోపించాయి అని చెప్పవలసి ఉంటుంది. సృజనాత్మక శైలి ఎక్కువగా సంపాదకీయాల్లోనూ ప్రత్యేక వ్యాసాల్లోను కనిపిస్తున్నది.

ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు?
సంపాదకీయాలు పత్రికల్లో అతి ముఖ్యమైన రచన. సంపాదకీయమంటే పత్రిక హృదయమని కొందరు చెప్తారు. ప్రజల అభిప్రాయాలు వ్యాఖ్యానించి అర్థం చేయించి, మార్గదర్శనం చేసేందుకు వివిధ సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపజేసేందుకు సంపాదకీయం రాస్తారు. తక్షణ సమస్యలపై తాజా వార్తలపై, సంఘటనలపై చేసే పరిశోధన ఆలోచనల వాక్యాన్ని  సంపాదకీయంలో ఆసక్తిని కలిగించే ఎత్తుగడ, వివరణ, ముగింపు ఉంటాయి. సంపాదకీయాలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి‌. తక్కువ మాటల్లో పాఠకులను ఆలోచింపజేసేటట్లు ఆకట్టుకునేటట్లు సంపాదకీయాలు రాస్తారు. సంపాదకీయ వ్యాసాలు ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాయి.

ఈ) పత్రికల్లోని సంపాదకీయాలకు సాధారణ వార్తాంశాలకు మధ్యలో ఉన్న భేదాలు ఏవి?
జ. పత్రికల్లో సంపాదకీయాలకు సృజనాత్మక శైలి వాడడం వలన పాఠకులు ఇష్టంగా చదువుతారు
 వార్త రచనలో కల్పనలకు, అభిషేక్తులకు, ఊహలకు చోటు ఇవ్వరాదు. ప్రజల పట్ల ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల బాధ్యత కలిగి వార్తా రచన చేయాలి. సంపాదకీ రచన సరళంగా సూటిగా నిష్కర్షగా సాధికారికంగా సులభ గ్రాహ్యంగా
 ఉండాలి. వార్త వ్యాసాలలాగే సంపాదకీయాలు కూడా ఆసక్తిని కలిగించే అవసరం ఉంది. చిన్న పదాల్లో చెప్పదగిన భావాన్ని చిన్న మాటల్లోనే సూచించాలి. పెద్ద మాటలను అనవసరంగా ఉపయోగించకూడదు.


సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు

జ: పత్రికకు ప్రాణవాయువు సంపాదకీయం. జరిగిన సంఘటనలను పత్రికలో యథావిధిగా పాఠకులు నేరుగా తెలుసుకుంటారు. కానీ, దాని పూర్వాపరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలను సంపాదకీయాలు తెలియజేస్తాయి.
2. కింది ప్రశ్న కు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

1. సంపాదకీయ వ్యాసం అనగా నేమి?
లేదా
2. సమకాలీన ప్రతి బింబం - "సంపాదకీయ వ్యాసం" వివరింపుము
లేదా
3. సంపాదకీయ వ్యాసం వల్ల ప్రయోజనం ఏమి?
లేదా
"నేటి సమాజానికి సంపాదకీయ వ్యాసమే మేలుకొలుపు " - విశ్లేషించండి.

పై 4 ప్రశ్నలకు జవాబు

జ.  సమకాలీన సంఘటనలలో మానవ జీవితం నుంచి విడదీయలేని అతి ముఖ్యమైన అంశాలను,  తీసుకొని వ్యాఖ్యాన రూపంతో పూర్వపరాలను పరామర్శిస్తూ, విశ్లేషణ చేస్తారు.  

అనేక అంశాలతో ముడిపడి ఉన్న సంఘటన ఉదహరిస్తూ వీటి ద్వారా వచ్చే ఫలితాన్ని విశ్లేషిస్తూ సోదాహరణంగా సాగే రచనను సంపాదకీయ వ్యాసం అని అంటారు.

సంపాదకీయ వ్యాసం పత్రిక యొక్క ప్రాణాత్మదేహాలుగా పరిగణించవచ్చు.
 సంపాదకీయ వ్యాసం రాసేటప్పుడు ప్రముఖుల మాటల్ని ఉదహరిస్తారు. లోకంలో ప్రసిద్ధమైన సామెతలను అతికినట్టుగా వాడుతారు.

 తదనుగునమైన నిర్వచనాలను వివరిస్తారు. ఉపోద్ఘాతం ముడిబడి ఉన్న చారిత్రక అంశాలను, వర్తమాన వాస్తవికతలను వివరిస్తూ భవిష్యత్తును అంచనా వేస్తారు. ఫలితాలను క్రోడీకరిస్తారు.  అల్పాక్షరాల్లో అనాల్పార్థ రచన చేస్తూ పాఠకులను ఆకట్టుకుంటారు.

అంశము అంశ స్వభావాన్ని పరిధిని  విస్తృతిని వివరిస్తారు.
లోతైన విశ్లేషణతో మార్మికమైన రహస్యాలను బట్టబయలు చేస్తారు.

 ఉదాసీన వైఖరి విడనాడు మని బోధిస్తారు. కార్య ఆరంభము కంటే  కార్యాంతము మేలని దిశానిర్దేశం చేస్తారు. ఉత్పాతాలను గ్రహించమని  చదువువరులకు ఆలోచింపజేయగలిగే మేధస్సును అందజేస్తారు. అలా ఆలోచింపజేయగలడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి ఆయా కాలాలకు సంబంధించినవే అయినప్పటికీ ఒక్కొక్క సందర్భంలో వివిధ సంబంధాలకు, అనుబంధ సంఘటనలకు, విభిన్న కాలాలకు అనవర్తింపజేసుకోవచ్చు. సంపాదకీయ వ్యాసం తత్కాలానికి సంబంధించిన అయినా విభిన్న కాలాలకు కూడా చెందుతుంది

 అలాంటి గొప్ప సంపాదకీయ వ్యాసాలలో ఒకటైనది లక్ష్యసిద్ధి వ్యాసం తెలంగాణ ఏర్పాటును పురస్కరించుకుని జూన్ 2 2014 రోజున వెలువడిన వ్యాసం.



పత్రికా వార్తలకు సంపాదకీయ వార్తలు తేడా ఏమిటి
సాధారణ వార్తలు 
1. సమకాలీన ప్రపంచంలో జరిగిన అనేక విషయాలు వార్తలుగా రాస్తారు 
2. జరిగిన సంఘటన మాత్రమే లిఖిస్తారు.
3.  జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగానే వివరిస్తారు.
4. వింతలు విశేషాలు జయాపజయాలు మొదలగునవి సహజంగా చిత్రీకరిస్తారు 
5. వార్తాంశం పత్రికల్లో ఒక భాగం మాత్రమే భాష సరళంగా మామూలు శైలిలో సాగుతుంది.
6. ఈ వార్తల్ని విలేకరులు సేకరించి రాస్తారు సాధారణ అంశాలు చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది తెలియజేస్తాయి.

సంపాదకీయ వ్యాసాలు:
1. సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటికి తీసుకొని వ్యాఖ్యల రూపంలో సంక్షిప్తంగా రాస్తారు.
2. ఆసక్తిని కలిగించే వ్యూహాత్మక ఎత్తుగడ స్పష్టమైన వివరణ సమర్థవంతమైన ముగింపు అవసరం. 
3. సంపాదకీయాల వల్ల సమాజానికి జరిగే మంచి చెడులను బాధ్యతాయుతంగా విశ్లేషిస్తారు ఆలోచన రేకెత్తిస్తారు.
4. ఇందులో 1000 పదాలు మించకుండా పత్రికా హృదయం సామాజిక దృక్పథంతో ఆవిష్కరించబడుతుంది.
5. భాష సరళంగా సూటిగా స్పష్టంగా ఉంటుంది సృజనాత్మక శైలిలో సంపాదకీయం కొనసాగుతుంది. 
6. సంపాదకుడు లేదా సంపాదకమండలి సమాజ చైతన్యానికి తోడ్పడే విధంగా రాస్తారు.

III. భాషాంశాలు 
పదజాలం

కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.

ఆ) ముసురుకొను : కొన్ని జ్ఞాపకాలు మనసుపై ముసురుకుంటాయి.
ఇ) ప్రాణం పోయు : శిల్పి శిల్పానికి ప్రాణం పోస్తాడు.
ఈ) గొంతు వినిపించు : నల్ల జాతి తరపున మైకేల్ జాక్సన్ గొంతు వినిపించారు
ఉ) యజ్ఞం: వర్షాలు రావాలని ప్రజలు వరుణ యజ్ఞం  నిర్వహించారు.

కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
తారలు చుక్కలు నక్షత్రాలు వాక్య ప్రయోగం ఆకాశంలోని నక్షత్రాలు మల్లెలు వెదజల్లినట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా
అ)జ్ఞాపకం : జ్ఞప్తి, స్మృతి
నా చిన్ననాటి సంగతులు నాకు జ్ఞప్తికి రావడం లేదు.
పోరాటం : యుద్ధం, సమరం, రణం
వాక్య ప్రయోగం: అన్నదమ్ముల మధ్య సమరం మంచిది కాదు.
విషాదం : ఖేదం, దుఃఖం
వాక్య ప్రయోగం: కోరిక వలనే దుఃఖం కలుగుతుందని గౌతమ బుద్ధుడు చెప్పాడు.
సంస్కరణ: సంస్కారం, సంస్క్రియ
వాక్య ప్రయోగం: దేశాభివృద్ధికి ఉత్తమ సంస్కారాలు అమలు చేయాలి.


వ్యాకరణాంశాలు 

ప్రత్యక్ష పరోక్ష  కథనం లోకి మార్చడం

రాజకీయ పార్టీల వారు "జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర" అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (ప్రత్యక్ష వాక్యం)
రాజకీయ పార్టీల వారు జనానికి కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (పరోక్ష వాక్యం)

"సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని నెహ్రు అన్నారు (ప్రత్యక్ష కథనం)
సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతును వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు. (పరోక్ష కథనం)

పరోక్ష కథనం ప్రత్యక్ష కథనం లోకి మార్చడం
పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు (పరోక్ష  కథనం)

"పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం" అని ముఖ్యమంత్రి ప్రకటించాడు (ప్రత్యక్షకథనం)

సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు (పరోక్ష కథనం) 
 "సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి" అని మేధావులు నిర్ణయించారు (ప్రత్యక్ష కథనం) 

తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడనని టీవీ ఛానల్ లో ప్రసారం చేశారు. (పరోక్ష కథనం) 
"తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి" అని టీవీ ఛానల్ లో ప్రసారం చేశారు. (ప్రత్యక్ష కథనం)

2. కింది పదాలను విడదీసి సంధులు గుర్తించి సూత్రాలను రాయండి. 
ప్రపంచమంతా = ప్రపంచము + అంతా = ఉత్వ సంధి.
సూత్రం:  ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.

అత్యద్భుతం = అతి + అద్భుతం = అత్యద్భుతం -  యణాదేశ సంధి.
సూత్రం: ఇ, ఉ, రు,లకు అసవర్ణంలైన అచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశం గా వస్తాయి.

సచివాలయం = సచివ + ఆలయం = సచివాలయం -  సవర్ణదీర్ఘ సంధి 
సూత్రం:  ఆ ఈ ఊ రూ  లకుఅవే అచ్చులు  పరమైతే సవర్ణదీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.

కింది పదాలను విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి.
బృహత్కార్యం బృహత్తు అయిన కార్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

శక్తి యుక్తులు : శక్తియును, యుక్తియును - ద్వంద్వ సమాసం.
సంక్షేమ పథకాలు : సంక్షేమం కొరకు పథకాలు - షష్టి తత్పురుష సమాసం.

అతిశయోక్తి అలంకారం:
ఏదైనా ఒక వస్తువును గాని, విషయాన్ని గాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం.

డాక్టర్ సిద్దెంకి యాదగిరి
9441244773