link below link for youtube
భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంత పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని బేరీజువేస్తూ, తెలుగుభాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుందీ పాఠం.
పూర్వకథ/నేపథ్యం :
నాలుగేళ్ళు కూడా నిండని సామల సదాశివ గారి మనుమరాలు లావణ్య ఒకనాడు
‘తాతా ! ఇగపటు నీ పాను జర్దా డబ్బి’. అని అచ్చమైన తెలుగు నుడికారంలో ఇగపటు అనగానే తన మనుమరాలికి ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడ్డ ఆనందంలో కొన్నాళ్ళ క్రిందట సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు;
‘ఆంధ్రబిల్హణ’ బిరుదాంకితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అన్నటువంటి-
“వారీ! రామచంద్ర! ఇగపటు” అనే మాటలు యాదికి వచ్చి ప్రస్తుత పాఠ్యభాగమైన “ఎవరిభాష వాళ్ళకు వినసొంపు” అనే వ్యాసాన్ని రాయడానికి పూనుకుంటాడు.
"తాతా! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ" అని నా నాలుగేళ్ల మనుమరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే రెండేళ్లు పెద్ద మనుమరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట వున్నది. హైదరాబాద్లో వుండే నా ఇద్దరు మనుమరాళ్లు హిందీ మాట్లాడతారు. వాళ్లకు తెలుగురాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. గాని తెలుగువాళ్ల పలుకుబడి, నుడికారము వాళ్లకు తెలియదు. నాకవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిపుడు తోడు. నాలుగేళ్లు పూర్తిగా నిండని లావణ్య "ఇగపటు" అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడ్డందుకు అబ్బురపడ్డాను. ఆనందించాను.
"తాతగారండీ! ఇదిగోనండి నీ పాను" అన్నా తెలుగే. తెలుగు మాట్లాడలేని మనుమరాలుకు ఇక్కడి తెలుగు పలుకుబడి పట్టుబడ్డందుకు సామల సదాశివ గారికి సంతోషం కలిగింది.
తిరుమల రామచంద్ర ఆంధ్ర ప్రభ ఆదివారం చివరి పేజీకి హైదరాబాద్ నోట్ బుక్ పేరిట ఏదో ఒకటి రాస్తుంటాడు.
ఇలాంటి ప్రత్యేకమైన ప్రత్యేకతలు గల కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే వాటి కోసమే అత్యధిక కాపీలు అమ్ముడుపోయేది.
ఒకరోజు తిరుమల రామచంద్ర మిత్రుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గుర్తు చేసుకున్నారు.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు "వారీ రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డూ"అనగానే ఇగపటు అనునది ఇక్కడి ప్రాంతీయ పరిమళం. ఇక్కడి భాష. ఇక్కడి పలుకుబడి.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు.
సంస్కృత బిల్హణ కవి రాసిన 'విక్రమాంక దేవ చరిత్ర' అనే ప్రౌఢ గ్రంథాన్ని అంతే ప్రౌఢంగా తెలుగులోకి అనువదించాడు.
బిల్హణకవి గారిదే 'కర్ణ సుందరి' అనే నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు.
"కర్ణ సుందరీ" నాటకం రాత ప్రతి పైన చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు మొదలుకొని మహా పండితుల వరకు వ్యాఖ్యానం చేశారు.
అందువల్ల వారు "ఆంధ్ర బిల్హణ" బిరుదాంచితులు
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి నుంచి సామల సదాశివ గారు తెలియని అనేక విషయాలను శిష్యరికం చేయకుండా ఉత్తరాల ద్వారా తెలుసుకునేవాడు. అందువల్ల కప్పగంతుల వారిని గురుస్తానీయులుగా భావించాడు రచయిత.
సామల సదాశివ గారికి గురుస్థానీయులు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు 'ఇగపటు' అనడం వింతగా అనిపిస్తుంది కదా అది ప్రాంతీయ భాష.
బాసర సరస్వతీ క్షేత్రంలో వ్యాస వాంగ్మయం మీద సదస్సుధారాళంగా ప్రసంగించినది కే. కమల.
ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత రిటైర్డ్ ప్రొఫెసర్.
ఆమె వాగ్దాటి విన్న రచయిత భోజన సమయంలో పరిచయం చేసుకున్నాడు ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. గురు పుత్రిక కాబట్టి నమస్కరించాడు.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిది మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానము.
నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినాడు.
ఆలోచించండి-చెప్పండి.
◆ “ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా వుంటుంది.” సమర్థించండి.
రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్ళలో ఏయే ప్రత్యేకతలుండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి.
“పసందైన ప్రాంతీయ భాష” - దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి.
II
మహబూబ్నగర్ వాళ్ళ భాష తెలుగుతనం:
సురవరం ప్రతాపరెడ్డి- ఇటిక్యాల పాడు
ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ కు వెళ్ళింది.
గడియారం రామకృష్ణ గారు పరిశోధకులు, పత్రిక నిర్వాహకులు. హైదరాబాద్ ఆంధ్ర సార్వసత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన వారిలో ఒకరు. రచయితకు తెలియని అనేక విషయాలు తెలియజేశారు కాబట్టి వారిని గురుస్థానీయులుగా భావించాడు.
గడియారం రామకృష్ణ గారు ఆలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయం పునరుద్ధరణ గావించారు.
నల్లగొండ జిల్లా తెలుగు సొంపయినదే. మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాల్లో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉన్నారు.
నల్లగొండలో అంబటిపూడి వెంకటరత్నం - వత్సలుడు అనే కావ్యం.
కొండూరి వీరరాఘవాచార్యులు వారు వీరు వేలూరి వారి శిష్యులు. అంబటిపూడి
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాత.
ఆంధ్ర సారస్వత పరిషత్తు పరీక్ష లో అంబడిపూడి కావ్యం, కప్పగంతుల సంక్షిప్త వ్యాకరణం సిలబస్ లో ఉండేవి.
పలుకుబడి నుడికారం జాతీయాలు ఉర్దూ ప్రాధాన్యం ఎక్కువ.వీటిని రోజుమర్రా, మొహావీర అంటారు.
వరంగల్ తెలుగును టాక్సాలి తెలుగు అంటారు.
ఢిల్లీ ఉర్దూను టాక్సాలి ఉర్దూ అంటారు.
టాక్సాలి అనగా టంకశాల. టంకశాల నాణేనికి విలువ ఎక్కువ. ఇతరులు ఎవరు చేసినా అది నకిలీ నాణెం.
ఆలోచించండి-చెప్పండి.
* "వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది” దీని గురించి చర్చించండి.
* 'ఏకలవ్యశిష్యు’డనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.
"పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాలవంటివి" ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
III
ఆడవాళ్లనోట అసలైన భాష
మా వూరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు "మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి" అంటాడు. "అయ్యా! అట్లనవద్దు. శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్లకు నీళ్లు పెట్టుకోవటమేమిటి? ఈ సందర్భాన మేం అర్ధం చేసుకుంటాంగాని ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకూ మరాఠీ వచ్చుకదా మరాఠీలో చెప్పండి" అంటాను, కాని అతడు వినడు. మధ్యలో 'కు' షష్ఠి చేరుస్తాడు. అది కొంతనయమే. "కళ్లనీళ్లు పెట్టుకోండి" అనడు. ఇది టంకసాల బయట తయారయిన నకిలీ నాణెం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమయిన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిమ్ స్త్రీలు, ఇల్లు దాటి వెళ్లనివాళ్లు-రాజమహల్లలో వుండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను 'బేగమతీజుబాన్' 'మహెల్లాతీ జుబాన్' అనేవాళ్లు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజామ్ కాలేజిలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదరుసేన్ అనుకుంటాను. అనుకుంటానే కాని గట్టిగా అనలేను. అతడు గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో ప్రసంగించేవాడు.
వరంగల్లు తెలుగు గురించి మాట్లాడుతున్నాను గదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ యింట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవాన్ని, నాకు పిలుపువచ్చేది. లేదా, నేనే వెళ్లేవాన్ని, ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా. కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి ఇద్దరో ముగ్గురో గాయకులు (మీరాసంగీత్ సభ) వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూకవి. కలం పేరు షాద్. నేను వెళ్లేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై వున్నారు. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరు తెలుగు విద్వాంసులుండగా, అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటమేమిటి? అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాన్నికాను. ఉత్తమ కవితలూ, కథలూ రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి వున్నాను. నేను ప్రస్తావించని వాళ్లనేకులు. అందుకే.. కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షులవారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీషు, ఉర్దూ పదాల జోలికంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. "అధ్యక్షులవారి కల్తీలేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను. ఉర్దూలో మాట్లాడతాను"
అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. అధ్యక్షులవారిలాగే కల్తీలేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారక్కడ. ఇతరులూ వున్నారు. వార్త పత్రికలో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాసినాను. ఇప్పుడు యాది. రాస్తున్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు, అడ్వొకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా, "మీ వ్యాసాల్లో తెలంగాణా ప్రాంతీయ భాష కనిపిస్తూ వున్నది. మీరు ఆ ప్రాంతంవారేనా? మా ప్రాంతానికెప్పుడూ రాలేదా?" అని ప్రశ్నిస్తూ వుంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదుగాని అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణాలోనే వుంటూ ఆంధ్రప్రాంతం వాళ్లు గూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా.
ఆలోచించండి- చెప్పండి.
"మొదలు మీకళ్లకు నీళ్లు పెట్టుకోండి" అని మరాఠీ పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి.
* "ఏ ప్రాంతంలోనైన అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం" దీన్ని సమర్థిస్తూ చర్చించండి.
* కవిసమ్మేళనం అంటే మీకు తెలుసా? ఎవుడైనా కవి నమ్మేళన సభలో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని తెలుపండి.
IV
ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని, గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే, వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ- మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే ఐల్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు.. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం, సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో వున్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నదుమ ఏదో టి.వి. ఛానల్లో "తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి" అని చెప్పటం జరుగుతున్నది. ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను. "ఏ తెలుగు? ఎక్కడి తెలుగు" అని.
ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాలకంటే, ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్, అతని కవిత గంభీర భావ భరితమైనా, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. ఎవరో అతన్నడిగినారట "ఉస్తాద్! ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు గదా మీరు. ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు?" అని, "శుక్రవారం శుక్రవారం ఢిల్లీ జామె మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటూయిటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రధ్ధగా వింటాను, నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు. పోతుంటారు. మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా" అన్నాడట మహాకవి మీర్ తఖీమీర్.
శ్రధ్ధగా వింటాను, నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు. పోతుంటారు. మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా" అన్నాడట మహాకవి మీర్ తఖీమీర్. ఒక షేర్ గూడ రాసినాడు;
గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
ఖాస్ - ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్). కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.
II వ్యక్తీకరణ - సృజనాత్మకత :
1. ఐదేసి వాక్యలలో జవాబులు రాయండి.
అ) మనుమరాలు మాటలు విని తాత ఎందుకు అబ్బురపడ్డాడు?
జ. రచయిత సామల సదాశివ గారు రెండో మనవరాలు లావణ్య ఆమెకు నాలుగేళ్లు. వాళ్లు హైదరాబాదులో ఉంటారు. లావణ్య కు తెలుగు రాదు. వారు హిందీలో మాట్లాడుతారు. వారు కొన్ని తెలుగు మాటలు హిందీలో అనువదించుకొని మాట్లాడుతారు. నీ వారికి పలుకుబడి నుడికారం అస్సలు తెలియదు.
అలా నాలుగేళ్లు పూర్తిగా నిండని మనవరాలు లావణ్య "తాతా ! ఇగపటు నీ పాను జర్ధా డబ్బీ' అని ప్రాంతీయ భాషలో మాట్లాడి సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య ఇగపటు అనగా, ఇదిగోనండి అని అర్థం వచ్చేలా ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతపు తెలుగు భాష మాట్లాడినందుకు తన చిన్న మనవరాలికి ఆ భాష పట్టు బట్టినందుకు సదాశివ గారు అబ్బురపడ్డాడు.
ఆ) కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురిస్తానీయులుగా ఎందుకు భావించారు వివరించండి.
జ. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహా పండితులు ఈయన సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్ధండులు.
డాక్టర్ సామల సదాశివ గారు లక్ష్మి శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయలేదు కానీ ఒక్కొక్కప్పుడు శాస్త్రి గారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి దగ్గర నుండి అనేక తెలియని సాహిత్య విషయాలను తెలుసుకున్నారు. అందువల్ల సదాశివ గారు లక్ష్మి శాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించారు.
ఇ) అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది?
జ. వరంగల్లులో సాహితీ మిత్ర మండలి ఉంది. సాహితి పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సభలో ఎందరో తెలుగు విద్వాంసులున్నారు. ఎందరో విశ్వవిద్యాలయ ఆచార్యులున్నారు. అంతమంది తెలుగు సాహిత్య పండితులు ఉన్న ఆ సభకు, ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణం ఏమిటో రచయిత సదాశివ గారికి ఆలోచించారు. బహుశా కాళోజికి ఆఫీసర్ స్నేహితుడి ఏమో అని సదాశివ గారు భావించారు. తర్వాత అధ్యక్షుడైన రెవిన్యూ ఆఫీసర్ వరంగల్ ప్రాంతీయ తెలుగులో అచ్చు తెలుగు పదాలలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో సంస్కృత పదాలను ఇంగ్లీష్, ఉర్దూ, పదాలను వాడకుండా మాట్లాడారు. అప్పుడు సదాశివ గారికి ఆయనను ఎందుకు అధ్యక్షులు చేశారో తెలిసింది. యూనివర్సిటీ ఆచార్యులు రెవిన్యూ ఆఫీసర్ కన్నా బాగా మాట్లాడుతారని సదాశివ గారి ఉద్దేశం. అందరికంటే అనర్గళంగా మహాపాండిత్యంతో మాట్లాడిన వాడు రెవిన్యూ ఆఫీసర్.
ఈ) రచయిత రచన శివుని ప్రశంసిస్తూ రాయండి.
జ. డాక్టర్ సామల సదాశివ గారు సహృదయ విమర్శకుడు విశ్లేషకులు సాహితీవేత్త. ఈయన రచనలలో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసును హత్తుకుపోయేటట్లు ఉంటుంది. సదాశివ గారు వ్యాసం శైలి పాఠకునికి అతి సులువుగా అర్థమవుతుంది స్పష్టంగా నిర్దిష్టంగా అర్థమయ్యే విధంగా రాయడం సామల సదాశివ గారి ప్రత్యేకత. ఈ వ్యాసంలో సదాశివ గారు తెలంగాణ మాండలికంలో తీయని తెలుగు గూర్చి చక్కగా వివరించారు. విశ్లేషించారు.
సదాశివ గారి వచన రచన శైలి ప్రాంతాల వారికి సులభంగా అర్థమవుతుంది సదాశివ గారు వివిధ భాషలలో మంచి పండితులు కల్తీ చేయకుండా ఆంధ్రులందరికీ అర్థమయ్యేలా తమ రచన వ్యాసాన్ని చక్కగా సాగించారు.
2 పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేం అర్థమైందో రాయండి.
జ. సామల సదాశివ గారు తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం తెనుగు పల్లె లో జన్మించారు. సామల సదాశివ గారికి తెలంగాణ తెలుగుపై మమకారము ఎక్కువ. తన మనుమరాలు లావణ్య ఇగపటు అని అసిఫాబాద్ మాండలికంలో మాట్లాడండి. రచయిత ఆనందంతో ఆశ్చర్యపడ్డాడు.
అనేక విషయాలు తెలుసుకున్న కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారిని గురుస్తానీయులగా భావించారు రచయిత. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడడానికి కారకులైన గడియారం రామకృష్ణ శర్మగారు కూడా సదాశివ గారికి గురు స్థానీయులు. సదాశివ గారికి వేలూరు వారికి కూడా ఏకలవ్య శిష్యులు.
వరంగల్లులో కూరగాయల మేస్త్రి మాటలలో కూడా స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు మాట వినిపిస్తుందని సదాశివ గారు వివరిస్తారు. ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినిపిస్తుందని సదాశివ గారి ఉద్దేశం. సదాశివ గారు అనేక భాషలో పండితుడైనప్పటికీ ఉర్దూ లో మాడగలుగుతారు. సదాశివ గారి తెలుగు రచనా వ్యాస విశ్లేషణ ఆంధ్ర ప్రాంతం వాళ్లు కూడా మెచ్చుకునేవారు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో కలుపుతూ విలక్షణంగా రాసే సదాశివ గారి వివరణ అద్భుతంగా ఉంటుంది. ఉర్దూ భాషలో ప్రజల పలుకుబడితే ప్రాధాన్యమని సదాశివ గారు అభిప్రాయం.
సదాశివ గారు హిందీ సంస్కృతం తెలుగు ఇంగ్లీషు మరాఠీ మహర్షి భాషలో పండితులు. అయినప్పటికీ తెలుగునే అమితంగా ప్రేమించేవారు. వీరి స్వరలయలు గ్రంధానికి కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డు, యాది సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.
ఆ) కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి సదాశివ గారు ఏ విధంగా గుర్తు చేసుకున్నారు?
లేదా
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి సదాశివ గారు చెప్పిన విషయాలు ఏమిటి?
or
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని సామల సదాశివ గారు గురుస్తానీయులుగా ఎందుకెంచారో తెలుపండి?
- జ: కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు.
- సంస్కృత బిల్హన మహాకవి రాసిన విక్రమార్క దేవ చరితము అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో అంతే ప్రౌఢంగా వారు అనువాదం చేశారు అందువల్ల వారికి ఆంధ్ర బిల్హణ అనే బిరుదు సార్ధకం అయింది.
- లక్ష్మణ శాస్త్రి గారు బిల్హన కవి గారిది కర్ణ సుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించారు. నాటకం కాకపోయినా వీరి విక్రమార్క దేవ చరిత్రను చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు మొదులుకొని నాటి పండితులంతా ప్రశంసా వాక్యాలు ఆ వ్రాతప్రతిపై ఉన్నాయి.
- సదాశివ గారు లక్ష్మణ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యులు గా పేర్కొన్నారు.
- శిష్యులు కాకపోయినా వారి వారు శాస్త్రి గారి దగ్గర కూర్చుని తరచుగా లేఖలు రాసి తెలియని అనేక విషయాలను వారి ద్వారా తెలుసుకున్నారు.
- ఒకరోజు వ్యాస పూర్ణిమనాడు బాసర క్షేత్రంలో లక్ష్మణ శాస్త్రి గారి కూతురు కే కమల వ్యాసవగ్మపై మాట్లాడుతూ ఉన్నారు. నా ఆమె ప్రసంగానికి ముద్దులయ్యారు . ఆమే కప్పగంతుల వారి కుమార్తె. గురువుగారి కుమార్తె అని నంస్కరించారు.
- కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు.
- లక్ష్మణ శాస్త్రి నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరి చివరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఓరియంటల్ లాంగ్వేజెస్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉద్యోగ విరమణ చేశారు.
3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి.
నేను నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరిచిపోలేని సంఘటన నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజు నేను ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరించాను. ప్రధానోపాధ్యాయిని హోదా బాధ్యతలు విధులు నిర్వర్తిస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. కానీ అది తాత్కాలికమైనది నా జీవితంలో ప్రభుత్వ ఉద్యోగిగా అనేకమందికి ప్రయోజనకరంగా నా చదువును ఉపయోగించడానికి కష్టపడతానని కంకణం కట్టుకున్నాను.
అదేరోజు ముగింపు సభలో నన్ను మా ఎచ్చం గారు ఉపాధ్యాయ బృందం నా పనిని గుర్తించి అభినందించారు అది ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన.
లేదా
ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి.
మా పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన వాడుక భాషలో.
రవి: అక్క ఎప్పుడొస్తవు
రమణి: తమ్మి! వచ్చే నెలలో రాఖీల పున్నము వస్తుంది కదా! అప్పుడు వస్తా.
రవి: రాఖీల పున్నమికి ఎట్లాగో వస్తరు.ఈ నడుమ నువ్వు, బావా ఒక్కసారి వచ్చి పోండ్రి.
రమణి: ఎందుకు రా? ఊకె రమ్మంటున్నవు.
రవి: తాతా! నాయనమ్మ ఒక్క తీరుగా కలవరిస్తుండ్రు.
రమణి: ముసలోళ్ళకి ఏం పని? అట్లనే కలవరిస్తరు. మాకు పని ఉన్నది. మేం రాం.
రవి: పని లేనిదే ఎవళ్లకే. ఒక్కపూట వచ్చి పోండ్రి అంతే.
రమణి: సరే వస్తా గని, వచ్చే సోమవారం వస్తాం.
రవి: సరే సరే! మీకోసం ఎదురు చూస్తం. తప్పకుండా రండ్రి.
రమణి: అయ్యను, అవ్వను, తాతను, నాయనమ్మను అందరిని అడిగినట్టు చెప్పు.
III వ్యాకరణాంశాలు :
పదజాలం :
సొంతవాక్యాలు
యాది చేసుకొను: నా బాల్య మిత్రులందరిని యాది చేసుకుంటాను.
పసందు : మా అమ్మ వంటకాలు పసందుగా ఉంటాయి
రమ్యం : పూలు బహు రమ్యంగా పూస్తాయి.
క్షేత్రం : మా వూరిలో పుణ్యక్షేత్రం కలదు.
నార్థాలు :
కవి: 1. కావ్యం రాసినవాడు. 2. శుక్రుడు, 3. నీటికాకి
క్షేత్రం : 1. పుణ్యస్థలం, 2. భార్య 3. వరిమడి
పర్యాయ పదాలు :
ఇల్లు, గృహం, గేహం, సదనం
పొగడ్త, స్త్రోత్రం, ప్రశంస
ప్రకృతి - వికృతులు
భాష - బాస
కవిత - కైత
కథ - కత
స్త్రీ - ఇంతి
వ్యుత్పత్తి అర్థాలు:
అజ్ఞానమనేడు అంధకారాన్ని తొలగించువాడు - గురువు
భాషింపబడునది - భాష
వ్యాకరణంశాలు:
సామాన్య వాక్యాలుగా మార్చడం:
1. తిరుమల రాంచంద్రాగారు సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడు (సంయుక్త వాక్యం)
తిరుమల రాంచంద్రాగారు సంస్కృత, భాషలో పండితుడు. (సామాన్య వాక్యం)
తిరుమల రాంచంద్రాగారు ఆంధ్ర భాషలో పండితుడు (సామాన్య వాక్యం)
2. నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథికభాషలో రాసేవాడిని (సంయుక్త వాక్యం)
నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని (సామాన్య వాక్యం)
నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని (సామాన్య వాక్యం)
3. ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరు వేరు (సంయుక్త వాక్యం)
ఇంట్లో మాట్లాడే భాష వేరు.
బడిలో చదివే భాష వేరు (సామాన్య వాక్యం)
2. క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. (సామాన్య వాక్యం)
వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు (సామాన్య వాక్యం)
జ. తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషల్లో దొరకుతాయి కాని వాటిని మనం భద్రపరచుకోలేదు. (సంయుక్త వాక్యం)
ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. (సామాన్య వాక్యం)
నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. (సామాన్య వాక్యం)
ఇ. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేఖరులు ఉన్నారు.
(సంయుక్త వాక్యం)
ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. (సామాన్య వాక్యం)
నమాజు చదివి ఎందరో పోతుంటారు. (సామాన్య వాక్యం)
ఇ. నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు. పోతుంటారు. (సంయుక్త వాక్యం)
3. సంశ్లిష్ట వాక్యాలు :
అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. (సామాన్య వాక్యం)
అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. (సామాన్య వాక్యం)
అంబటిపూడి వెంకటరత్నంకావ్యం రాసి అచ్చు వేయించాడు(సంశ్లిష్ట వాక్యం)
ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. (సామాన్య వాక్యం)
గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.(సామాన్య వాక్యం)
- గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.(సంక్లిష్ట వా )
ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరీ నాటకాన్ని అనువదించాడు.
కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.(సామాన్య వాక్యం)
a. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరీ నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.(సంశ్లిష్ట వాక్యం)
రుగాగమ సంధి:
ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.
పేదరాలు ఆ) బీదరాలు ఇ) బాలింతరాలు
పేద + ఆలు
ఆ) బీద + ఆలు
ఇ) బాలింత + ఆలు ''ఈ ఉదాహరణలకు రుగాగమం వస్తుంది. ఇలా మారుతాయి.
ఉదా : అ) పేద + ఆలు - పేద + ర్ + ఆలు - పేదరాలు
ఆ) బీద + ఆలు =బీద + ర్ + ఆలు బీదరాలు
ఇ) బాలింతరాలు బాలింత + ర్ + ఆలు - బాలింతరాలు
ఆగగమనగ ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడం
గమనిక: పై మూడు సంధి పదాల్లోనూ పరపదం 'ఆలు'
1) పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది. అంటారు.
2) పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను "పేదాదులు"
3) పేదాది పదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
4) 'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.
పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది. పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)
విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
రుగాగమ సంధి సూత్రం కర్మధారయమందు పేదాది శబ్దాలకు "ఆలు" శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.
"పసందు అంటే బాగా ఇష్టం అని అర్థం" .
ఏ ప్రాంతంవారికి ఆప్రాంతం లో మాట్లాడే భాష బాగా నచ్చుతుంది.అలామాట్లాడడంలో భాషకు ములాలైన స్థానిక పదాలు, అన్య భాష ప్రయోగాలు, నుడికారాలు,సామెతలు, జాతీయాలు, యాసలు,ఇవన్ని ఎక్కడి వాళ్లకు అక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడే భాషలో ప్రయోగించడం జరుగుతంది,.అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి బహు పసందుగా వుంటుంది.ఎంతటి కవులైన,పండితులైన దీనికి అతీతులు కారు
భాష అంతా ఒకటే ఐన , ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు. ఈ యాస క్రియా రుపాల్లోనే గాక నామవాచకంలో,సంబోధనలో, మర్యాదల్లో వైవిధ్యభరితంగా వుంటుంది.
ఒకప్రాంతంలోని మనుషుల జీవన విధానం,వ్యవహార శైలి,పాలకుల విధానం,పరిసర ప్రభావం,తదితరాంశాలు,భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి.ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం వుంటుంది. వస్త్ర ధారణా, ఆహార వ్యవహారాలు, వాళ్ళ భాషలో అంతర్లినమై వుంటాయి. భాష పరమార్థం భావ వ్యక్తికరనే కాబట్టి ఎక్కడి వారు అక్కడి భాషకు అలవాటు పడతారు. చెవులకింపుగా, హృదయాన్ని తాకే టట్టుగా ఉండే భాష వాళ్ళతో విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది. అలవాటు లేని భాష విన్నప్పుడు విచిత్రంగా వుంటుంది. అది రుచించదు. అందుకే ఎవరి భాష వారికి చాల బాగా అనిపిస్తుంది.
కింది లింక్ నొక్కి యూట్యూబ్ లో వినండి
ఆడవాళ్ళ నోట అసలైన భాష ఉంటుందని' సామల సదాశివ ఎందుకు అన్నాడు ?
జ. 'ఆడవాళ్ళ నోటి నుండే అసలైన భాషను వినగలం' అనే మాటను, నేను సమర్థిస్తాను. ఆడవాళ్ళ మాటల్లో కల్తీ ఉండదు. వారు ఇంటిపట్టునే ఉంటారు. కనుక, వారు మాట్లాడే భాషలో ఇతర భాషా పదాలు కలియవు. అందుకే ఆడవాళ్ళ నోట అసలైన భాషను మనము వినగలం. అందుకు గల కారణాలు.
1) వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లో అచ్చమయిన తెలుగు నుడి వినిపిస్తుంది.
2) అలాగే ఉర్దూ మాట్లాడే ముస్లిము స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళెన రాజమహల్లులో ఉండే బేగముల భాష, పరిశుద్ధమైనదని ఆ రోజుల్లో విద్వాంసులు చెప్పేవారు. అందుకే కల్తీ లేని ఉర్దూను, 'బేగమాతీ జుబాన్', 'మహెల్లాతీ జుబాన్' అని పిలిచేవారు.
సారాంశం:
సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.
మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది.
సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి