vi. 3. వర్షం
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు
1.బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు ?
జవాబు.బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు వాన చినుకులతో ఆడుకుంటున్నారు.
2.బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.
జవాబు.బాలిక మబ్బును చూస్తూ
వానావానా వల్లప్పా వానలు కురిసే వల్లప్పా
బావులు నిండే చెరువులు నిండే
వాగులు పొంగి పరుగులు తీసే ॥ వానావానా వల్లప్పా|| అనే పాట పాడుతున్నది.
3.వానపడుతుంటే మీరేం చేస్తారు ? మీకేం చేయాలనిపిస్తుంది ?
జవాబు.వానపడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపిస్తుంది చురుక్కుమంటూ మీదపడే చినుకులతో ఆడుకోవాలని అనిపిస్తుంది.
పాఠం ఉద్దేశం:
పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళి పోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
