కం. తనకోపమె తన శత్రువుతనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁదనసంతోషమె స్వర్గముతనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
ప్రశ్నలు – జవాబులు
పాఠం నేపథ్యం / ఉద్దేశం :
కవి పేరు : శ్రీ నాథుడుకాలం : 1380 - 1470తల్లిదండ్రులు : బీమాంబ మారయతల్లి దండ్రులు : మారయ - భీమాంబ.ఎవరి ఆస్థాన కవి: కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఈయన వున్నారు.బిరుదు : కవి సార్వభౌముడు (విజయనగర దేవరాయల స్థానంలో 'గౌడ డిండిమ భట్టు' ను ఓడించి కనకాభిషేకంతోపాటు పొందిన బిరుదు.)శ్రీనాథుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అద్దం పట్టే చాటువులు చాల వున్నాయి.
శ్రీనాధుని రచనలు:1. మరుత్తరాట్చరిత్ర2. శాలివాహన సప్తశతి3. పండితారాధ్య చరిత్ర4. శృంగార నౌషధం5. భీమఖండం6. కాశీఖండం7. హరవిలాసం8. ధనంజయ విజయం9. క్రీడాభిరామం10. శివరాత్రి మాహాత్మ్యం11. పల్నాటి వీర చరిత్ర12. నందనందన చరిత్ర
రాయన్ = ఒరసికొనగాకాశిన్ = కాశీయందుఅన్నపూర్ణ = అన్నపూర్ణ అను పేరుగలభవాని = పార్వతికడు + అనుంగు = గారాబమైనచెలులు = స్నేహితురాండ్రుభిక్షకులను = యాచకులకుమధుకర = మధూకరమనుభిక్షన్ = భిక్షనుపెట్టుదురు = పెడతారు
2.ఒకరోజు మధ్యాన్నం వేళలో ఆయన భిక్షకోసం శిష్యులతో కలసి బ్రాహ్మణ వాడలలో కి వెళ్ళాడు.ఏవేవో కారణాలతో ,ఎవరూ భిక్ష పెట్టలేదు.
౩.ఆ రోజుకు ఉపవాసం ఉందామని ,మరుసటి రోజు తప్పక భిక్ష దొరుకుతుందని ,వ్యాసుడు నిశ్చయించుకొన్నాడు.
4.ఈస్వరుడి మాయ వల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష వేయలేదు.వ్యాసుడు కోపంతో భిక్ష పాత్రను నడివీధిలో పగులగొట్టి ,కాశివాసులకు మూడు తరాల పాటు దానం,మోక్షం,లేకుండుగాక అని సపించబోయాడు.
5.ఇంతలో పార్వతి దేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మన గృహం వాకిట్లో ప్రత్యక్షమై ,వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది.
6.అప్పుడు వ్యాసుడు తనకు పదివేలమంది శిష్యులున్నారని ,సూర్యాస్తమయం అవుతున్నదని తన శిష్యులను విడచి తానోక్కడు తినడం తగదని చెప్పాడు.
అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా ఉపవాసమున్నమో ,అలాగే ఈ రోజు కూడా ఉంటామని దీని అంతరార్ధం.
7.అప్పుడు పార్వతి దేవి నవ్వి,నీవు నీ శిష్యులన్దరినీ ని వెంట తీసుకోని రా.ఈస్వరుడి దయతో ఎంత మంది వచ్చిన కావలసిన పదార్ధాలు పెడతాను.అని చెప్పింది.
8.వ్యాసుడు సరే అని ,శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు.పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజన శాలలో వారందరికీ భోజనం పెట్టింది.
జ. కోపం పాప కారణం. కోపం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేక పోతాడు ఫలితంగా అనర్ధాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతమంది "కోపం వస్తే నేను మనిషిని కాను" అనే మాటని ఊతపదంగా వాడుతుంటారు.
కోపం వల్ల మనుషులోని రాక్షసుడు మేల్కొంటాడు.
కోపంలోనే మనిషి మృగంలా మారిపోతాడు. అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్లను, భార్యను, పిల్లల్ని చంపిన సంఘటనలు వార్తల్లో చూస్తూ ఉంటాం.
కాబట్టి కోపం మంచిది కాదు.
బిక్ష పాఠం లో మహాజ్ఞాని, సకల శాస్త్రాలకు ఆది గురువు అయిన వ్యాసుడు రెండు రోజులపాటు బిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. అంటే విచక్షణ కోల్పోయాడు. "క్షమ కవచంబు క్రోధమది శత్రువు" అని బర్తహరి అంటాడు.
అనగా ఓర్పు కవచం, కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులు శత్రువు లాంటి కోపాన్ని విడిచిపెట్టాలని వారు సూచించే అర్థం. "కోపము నను ఘనత కొంచెమైపోవును' అని వేమన గారు చెప్పారు.
"తనకోపమే తన శత్రువు" అని సుమతి శతక కర్త అయిన బద్దెన వివరించాడు.
కోపాన్ని విడిచిపెడదాం.
మనుషులుగా బతుకుదాం. మానవత్వాన్ని పెంచుదాం.
పాఠ్యభాగ సారాంశము
వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.
ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించ డానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ మధూభవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.
నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.
పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.
అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.
వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.
9441244773
