ఇక్ష్వాకుల వంశ చరిత్ర
పుత్రకామేష్టి యాగం :
ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది. తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు
- అయోధ్యాపురం, రాముని జననం
- విశ్వామిత్రుని వద్ద శిష్యరికం
- తాటక వధ
- యాగ పరిరక్షణ
- అహల్య వృత్తాంతము
- విశ్వామిత్రుని వంశము
- గంగావతరణ గాధ
- వివాహ నిశ్చయము
- సీతారామ కల్యాణము
- పరశురామ గర్వ భంగము
- అయోధ్యాగమనం
- బాలకాండకీలక పదాలు: జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం.కోసల దశరథ మహారాజు గారి దేశం.అయోధ్య కోసల దేశపు రాజధానిఅయోధ్య అనగా యోధులు జయింపశక్యము కానిదిదశరథుని మంత్రి సుమంతుడుఋష్యశ్రుంగ మహర్షి మూడు రోజులపాటు అశ్వమేధ యాగం చేశాడు.బల అతిబల విద్యలుదేవతలు రావణాసురుని బాధ తప్పించమని బ్రాహ్మణ వేడుకున్నారు. రావణాసురుడికి మానవునితోనే మరణం అని బ్రహ్మ చెప్పాడు.దేవతలంతా శ్రీమహావిష్ణువు వేడుకున్నారు.విష్ణువు అభయమిచ్చాడు.
- సామెతలు, సూక్తులు: చెవిలో ఇల్లు కట్టుకొని కోరుతున్నాయి.
- యోధులకు జయింపసత్యం గాని అయోధ్య.
- 'యధా రాజా తథా ప్రజాః' రాజీ ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు.
- గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది.
రామాయణం డౌన్ లోడ్ చేసుకోండి.
రాముని జననం:
యజ్ఞపురుషుడిచ్చిన దివ్య పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకిచ్చాడు. వారు చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, గురూదయ సమయంలోకౌసల్యకు రాముడు జన్మించాడు.కైకేయి కి భరతుడు జన్మించాడు.సుమిత్రకు - లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.
బాల్యం :
- విశ్వామిత్రుని వద్ద శిష్యరికం మారీచ స్వభావులు యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు."యజ్ఞ రక్షణ కొరకు రాముని పంపు" -విశ్వామిత్రుడు"రాముని పంపలేను. నేనే వస్తా" - దశరధుడురాముడు వెళ్లడానికి దశరథునికి నచ్చజెప్పి ఒప్పించింది వశిష్ట మహర్షి.
- వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపాడు.
మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. వాటివలన అలసట, ఆకలిదప్పులు కలుగవు.
- తాటక వధ, యాగ పరిరక్షణ
తాటకా వనంలో మహాబలవంతురాలు, మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువుఆజ్ఞపై రాముడు తాటకను వాడిబాణంతో సంహరించాడు.
తాటక వధ: విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మలద, కరూశ అనే జనపదాలకు చేరుకున్నారు. విరుచుకుపడుతున్న తాటకిని శబ్దవేది బాణ ప్రయోగం చేసి హతమార్చాడు.
యాగ పరిరక్షణ : యాగ పరిరక్షణలో రాముడు శుతేశువుతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో రాక్షసులందరినీ తరిమికొట్టాడు.
అహల్య శాపవిమోచనం : గౌతమ ముని భార్య అహల్యకు శాప విమోచనం కలిగించారు. మిథిలకు వెళ్ళే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ రూపం ధరించివచ్చి గౌతముని ముని అయిన అహల్యతో కలిసాడు. అందుకు గౌతముడు కుపితుడై ఇంద్రుని, అహల్యను శపించాడు. తత్కారణంగా ఇంద్రుడు మేషవృషణుడూ (శరీరము అన్తటా 1000 కన్నులు కలవాడూ) అయ్యాడు. అహల్య అదృశ్యరూపంలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ, ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే, మంచుతెరచే కప్పబడిన పూర్ణ చంద్రబింబంలా, ధూమావృతమైన అగ్నిజ్వాలలా ఉంది. శ్రీరాముడు ఆశ్రమంలోకి వచ్చినపుడు ఆమె శాపం తొలగిపోవడం వలన ఆమె అందరికీ కనిపించింది. రామ లక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు. ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది. గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించాడు.
- గంగావతరణ గాధ:అయోధ్యాధిపతి సగరునకు పెద్దభార్య కేశిని వల్ల అసమంజసుడనే కొడుకు, రెండవ భార్య సుమతి వల్ల అరవై వేలమంది కొడుకులు జన్మించారు. భగీరధుని ప్రార్థనపై ఒక పాయను నేలకు వదిలాడు. ఉరుకులు పరుగులతో గంగ భగీరధుని వెంట బయలుదేరి, దారిలో ఎందరినో పునీతం చేసింది. ఆ ప్రవాహం తన యజ్ఞశాలను ముంచివేసినందుకు కోపించి జహ్న మహర్షి గంగను పానం చేసేశాడు. పిదప దేవతల విన్నపాలపై తన చెవిలోనుండి వదలిపెట్టాడు. కనుక ఆమె జాహ్నవి అయ్యింది. గంగ భగీరధుని వెంట సముద్రంలో కలిసి, పాతాళానికి వెళ్ళి, సగర పుత్రుల భస్మరాసులపైనుండి ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కలిగించింది.(అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది. ) భగీరథుని వంశంలోని వాడే రాముడు.
అహల్య వృత్తాంతము: విశ్వామిత్ర సమేతుడై రాముడుగౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసింది అని భావించి బూడిదలో పడి ఉండమని ఆమెను శపించారు.
రాముని రాకతో శాపం విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతారని పేర్కొన్నారు.
రామా గౌతమ ఆశ్రమంలో కాలు మోపి అహల్య శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించారు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. అహల్య గౌతముల కుమారుడైన శతానందుడు మిథిలలో రామ దర్శనం చేసుకున్నాడు.
సీతా స్వయంవరం: జనకుడు యాగ సమయంలో భూమిని దున్నుతున్నపుడు నాగేటి చాళ్ళలో ఒక ఆడ బిడ్డ లభించింది. నాగర్శాలలో దొరికినందువల్ల ఆమెకు సీత అని పేరు వచ్చింది అని చెప్పారు.
విశ్వామిత్రుని అనుజ్ఞ తీసికొని రాముడు అవలీలగా నారి ఎక్కుపెట్టాడు. బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిగిపోయింది. జనకుడు సంతోషించి వీర్యశుల్క అని తాను ప్రతిజ్ఞ చేసిన సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించాడు.
సీతారామ కళ్యాణం : వశిష్ఠుడూ విశ్వామిత్రుడూ సంప్రదించి జనకుని కుమార్తెలైన
సీతకు రాముడూ,
ఊర్మిళకు లక్ష్మణుడూ,
కుశధ్వజుని కుమార్తెలైన మాండవికి భరతుడూ,
శ్రుతకీర్తికి శత్రుఘ్నుడూ తగిన వరులని నిర్ణయించారు. వారి ప్రతిపాదనకు జనకుడు ఎంతో సంతోషించి, దోసిలియొగ్గి వందనమొనర్చి, భగదేవతానీకమైన ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో నలుగురు జంటల వివాహం కావాలని ఆకాంక్షించాడు.
పరుశురాముని గర్వభంగం: దశరథుడు నూతన వధూవరులతో అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు భీకరమైన గాలి దుమారం లేచింది. కాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూ కైలాసగిరి సదృశుడైన పరశురాముడు వారియెదుట ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠాది మహర్షులు అతనిని పూజించారు.
రాముడు అవలీలగా పరశురాముని ధవస్సుకు బాణం తొడిగాడు. దివ్యాస్త్రం వృధా కారాదు గనుక పరశురాముని పాదగతిని కానీ, లేదా అతను తపస్సుతో సాధించుకొన్న లోకాలను గానీ ఏదో ఒకటి నాశనం చేస్తానని చెప్పాడు.
_------------------------------
రామాయణం గొప్పతనం వివరించండి?
రాముని గొప్పతనము వివరించండి.
రామావతరణ గురించి రాయండి.
రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ,
సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి,
మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి.
శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడే అయినప్పటికీ దైవశక్తిని వినియోగించకుండా మానవ శక్తితోనే దుష్ట శిక్షణ చేయడమే కాకుండా ఒక సాధారణ మానవుడుగా జీవించాడు.
అరణ్యవాసం, భార్యావియోగం వంటి కష్టాలన్నీ అనుభవించాడు.
రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ,
అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం.
ఈ సత్కార్యాలవల్ల సాధారణ ప్రజలు ఆయన బాటలోనే నడిచి సుఖ జీవనం సాగించే అవకాశం కలిగింది. అందుకే ఏ యుగానికైనా ఆయనే ఆదర్శ పురుషుడు.
రామునిగురించి తెలుసుకున్న తర్వాత వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు.
అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.
"మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
దశరథునికి సంతానం కలిగిన విధానాన్ని వివరించండి (లేదా)
రామలక్ష్మణ భరత శత్రజ్ఞుల జననం గురించి రాయండి.
జవాబు సరయున్నది తీరంలో కోసల దేశం
పూసల దేశం రాజధాని అయోధ్య.
కోసల దేశపు రాజు దశరథ మహారాజు. వీరు సూర్యవంశం నకు చెందినవారు.
సకల సంపదలతో తులతూగే దేశం కోసల.
సంతానం కోసం అశ్వమేధ యాగం చేద్దామనుకున్నాడు దశరథుడు.
దశరధుని మంత్రి సుమంతుడు రుష్య శృంగ మహర్షిని పిలవమన్నారు.
రుష్య శృంగ మహర్షి అశ్వమేధ యాగం చేయించాడు.
పుత్ర కామేశ్టియాగ చేయించమని కోరారు.
ఇంతలో రావణాసురుడు తమను చిత్రహింసలు పెడుతున్నాడని బ్రహ్మదేవునికి మొరపెట్టుకుంటా రు.
రావణాసురుని నుంచి బాధ తప్పే ఉపాయం చెప్పమన్నారు దేవతలు.
రావణాసురునికి మానవునితోనే మరణం ఉందని బ్రహ్మ వివరించారు.ఇంతలో శ్రీమహావిష్ణువు అక్కడికి చేరుకున్నారు.
దేవతలు విష్ణుమూర్తిని రావణాసురుడు నుంచి తప్పించుమని వేడుకున్నారు.
దశరథ మహారాజుకు నాలుగు రూపాలలో పుత్రుడుగా పుట్టమని దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు.
విష్ణువు వారికి ఆభయం ఇచ్చాడు
దశరథుడి పుత్రకామేస్త్రి యజ్ఞం నుండి బ్రహ్మ పంపించగా ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో దివ్య పాయసం తెచ్చాడు
ఆ పాయసాన్ని దశరథునకు ఇచ్చాడు
దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు.
కౌసల్యకు రాముడుకైక కు భరతుడుసుమిత్రకు లక్ష్మణ శత్రజ్ఞులు పుట్టారు.
రామాయణంలోని ఉత్తమ ఆదర్శాలను రాయండి
(లేదా)
రామాయణం ద్వారా తెలుసుకున్న నీతిని వివరించండి
(లేదా)
మానవ జీవితానికి ఉపయోగపడే ఆదర్శ గ్రంథం రామాయణం అని ఎలా చెప్పగలవు
మొదలైన ప్రశ్నలకు జవాబు
- తల్లిదండ్రులను పూజించాలి వారి మాటలను ఆచరించాలి
- గురువులను భక్తితో గౌరవించాలి ఆపదలో ఉన్న వారిని బలహీనులను ఆదుకోవాలి
- మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి.
- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఆశ్రయం కోరిన వారిని ఆదుకోవాలి.
- అన్ని సమయాల్లో ధైర్యాన్ని కలిగి ఉండాలి.
- మిత్రుత్వం కోసం సుఖ సంతోషాలను వదిలిపెట్టి సహాయం అందించాలి.
- స్త్రీలు మాతృమూర్తులు స్త్రీలందరిని గౌరవించాలి.
- ధర్మాలు సారంగా జీవించడం నేర్చుకోవాలి.
- పవిత్రమైన జీవితాన్ని ఆచరించాలి. చేయాల్సిన పనితో పాటు దానికి భంగం కలగకుండా దానికి అనుగుణమైన అనుబంధమైన ఇతర కార్యాలను కూడా సాధించాలి.
- ఇతరులను గౌరవించాలి.
- అందరి పట్ల సహానుభూతి ఉండాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సత్పురుషులతో మేధావులతో మంచి విషయాలు చర్చించాలి.
- ప్రకృతిని ప్రేమించాలి.
- ఇతరుల పట్ల అసూయ ఈర్ష ద్వేషం లేకుండా జీవనం గడపాలి.
పాత్రల స్వభావం:
దశరథుడు. కోసలదేశానికి రాజు
సూర్య వంశానికి చెందినవాడు.
దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధం చేశాడు.
పుత్ర కామేష్టి యాగం చేసి నలుగురు కుమారులను పొందాడు.
చివరకు పుత్ర వియోగంతో మరణించారు.
రాముడు: `
విశ్వామిత్రుడు
గొప్ప ఋషి మహా తపశ్శాలి.