సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

ప్రణయ హంపి నవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రణయ హంపి నవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఆగస్టు 2024, ఆదివారం

అసామాన్యుల చరిత్ర - ప్రణయ హంపి నవల

మిత్రులందరికీ నమస్కారం 
జై భీమ్ 

తెలుగు నేలలో 
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యమైనది రాక్షస తంగడి యుద్ధం.

ఈ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతరాలు లేని బహుజన సమాజాన్ని ఆవిష్కరించిన నవల 

మారుతి పౌరోహితం గారి ప్రణయ హంపి పై నేను రాసిన సమీక్ష వ్యాసం ఆగస్టు మాసం 2024 నడుస్తున్న తెలంగాణ సంచిక (యుజిసి జర్నల్)లో ప్రచురిచితమైనది. 

ప్రచురించిన ప్రధాన సంపాదకురాలు స్నేహలత అక్క గారికి 
ప్రొఫెసర్ కాశీం అన్న శివరాత్రి సుధాకర్ అన్నగారికి కృతజ్ఞతలు.

నడుస్తున్న తెలంగాణ ఆన్లైన్ లింక్ లో చదవచ్చు

అసామాన్యుల చరిత్రకు దర్పణం 'ప్రణయ హంపి'
             - డా. సిద్దెంకి

"తారీకులు దస్తావేజులు అవి కావోయ్ చరిత్రకర్థం...
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ దానిని మోసిన బోయీలు ఎవరు" అంటూ సామాన్యుని గురించి ఆలోచింపజేసిన తెలుగు సాహిత్యం అనేక ప్రక్రియల్లో వివిధ కోణాల్లో సాధారణ జీవితాలను ఆవిష్కరిస్తూనే ఉంది. 

 మనసు పెట్టి తడిమితే పునాదులలో దాగిన సామాన్యుని స్వేద పరిమళం తొవ్వినాకొద్ది జీవపు ఊటలా కనబతూ ఉంటది. ఎంత కప్పి పెట్టినా, ముల్లెగట్టిన సూది మొనలా పొడుచుకొని బయటికి వస్తూ ఉంటుంది. 

 సామాన్యుల బాధలను విపులీకరిస్తూ మారుతి పౌరోహితం రాసిన నవల "ప్రణయ హంపి." ఛాయా బుక్స్ హైదరాబాద్ వారు ప్రచురించిన చారిత్రక కాల్పనిక నవల. 

ఇటీవల కాలంలో రాయలసీమ మండలికములో అక్కడి ఆత్మను పట్టుకొని నెర్రలు వారిన జీవితాల్లోని విషాదాలను అక్షరాల్లో 'నీల్లింకని నేల' లాంటి కథలతో విలపిస్తూ... "ఊరిమర్లు" కథా సంపుటిని ప్రచురించి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకత నేర్పరచుకున్న మారుతి పౌరోహితం అక్షరం మానవత్వానికి చిరునామా. మనిషి తత్వానికి పంచనామ.

సామాన్యుల సాహసం,‌ సమాజ హితం కోసం పాటుపడే మనుషుల జీవితమే 'ప్రణయ హంపి' నవల.

 చారిత్రక నవలలు దాదాపు రాజుల కోణంలోనూ, రాణుల కోణంలోనూ రాయబడ్డ కావ్యాలే. కానీ సామాన్యుల జీవిత గాథలను విజయనగర పతనంలోనూ సమాజ హితం కోసం పాటుపడ్డ యువతీ యువకుల ప్రేమ కథనే ఈ కాల్పానిక నవల. 

కాకతీయుల తర్వాత తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది విజయనగర సామ్రాజ్యం. 

నాలుగు వంశాలు, ఏడు తరాలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం అరివీటి వంశపు అలియ రామరాయలు చిట్టచివరి రోజుల సామాజిక ‌ ప్రతిబింబమే ఈ నవల.

విజయదశమి పర్వదినాన తుళ్ళి పడుతున్న యవ్వనంతో హంపినగరం కేరింతలు కొడుతున్నది. ఉత్సవ ఆచారం ప్రకారం బలి నిర్ణయమైనది. మహిషాన్ని వధించడానికి ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాలేని సమయంలో నేనున్నానని ధైర్యసహసాలతో ముందుకొచ్చి మహిషుడి అన్న వలె ఉన్న ఆ దున్నను ఒక్క వేటుతో నరికిన వీరుడు అనెగొంది సంబజ్జ గౌడ. వాయిద్యములు దిక్కులు పిక్కుటిల్లుతున్న వేళ, ప్రజల కేరింతల నడుమ అలియ రామరాయలు‌ తన సింహాసనం నుంచి లేచి వచ్చి "భలా భళివీరుడా ! నీవంటి బలశాలి రాజ్యమునకు అవశ్యం" అని ఆలింగనం చేసుకున్నాడు. అదే రోజు రాత్రి విరూపాక్ష స్వామి ఆలయ వీధిలో ఆనెగొంది నివాసి ముద్దుకుప్పాయి నృత్య ప్రదర్శనకు మైమర్చి చూస్తున్నాడు. ముద్దు కుప్పాయి చూపులు సంబజ్జ గౌడ్ ను తాకాయి. చూపులతో ప్రారంభమైన వారి స్నేహం పౌర్ణమి నాటి రాత్రి వేళ అంజనాద్రి చెట్టు కింది కలయికకు నాంది పలికింది. 

వెదజల్లే వెన్నెలలో
పరస్పర పొగడ్తల నడుమ బిడియం సమసిపోయి ఇరువురి హృదయాల్లో ప్రేమ అంకురించింది. ఇరువురి కుటుంబ చరిత్రను పంచుకొన్నారు. 

సామంత రాజులు నన్ను వివాహం ఆడుతామని ప్రతిపాదించినా నేను ఒప్పుకోలేదు. సమాజ హితం కోరే నృత్య కళ అంటే నాకు ప్రాణం.
కళకు సంకెళ్లు పడటం నా మనసుకు నచ్చనిది. నీ గురించి తెలిసే ఈ నా నిర్ణయం అని ముద్దు కుప్పాయి నివేదించింది.

 సమాజంలోని అంతరాలు పోవాలని ప్రబోధించిన కనక దాసరు అనుయాయి అయినా నా తండ్రి బైరప్ప గౌడ " నీ చుట్టూ ఉన్న నలుగురు సుఖమే నీ సుఖము" అని నాకు నేర్పాడని సంబజ్జ గౌడు వివరిస్తూ రాజు సైన్యములో చేరి రాజ్య రక్షణకు రమ్మన్నాడు. సైనికులకు భవిష్యత్తు అనిచ్చితం కదా మన పెళ్ళికి ఆటంకం అవుతుంది కదా అని ఆలోచించమంటాడు.

యుద్ధానికి
తక్షణమే వెళ్లండి. అంతా మంచే జరుగుతుందని హితువు పలికింది. నేను నీ రాకకోసం, నీ సంకేతం కోసం శ్రీ నా రంగనాథ స్వామి దేవాలయంలో వేచి చూస్తాను అని ముద్దు కుప్పాయి చెప్పి శుభమస్తు అని నిష్క్రమించింది. 

అలియా రామరాయలు సభా భవనంలో దొడ్డ సంకణ నాయకతో సభ భవనంలో ప్రవేశించిన సంబజ్జ గౌడ్ "ఆజ్ఞ ప్రభూ! నీ ప్రాణం నాకు నా ప్రాణం అడ్డు అని ప్రమాణం చేస్తున్నానని వాగ్దానం చేసి అంతరంగికుడిగా అంగరక్షకుడిగా చేరాడు.

రాజ కొలువులో చేరిన సంబజ్జ గౌడకు ఇంటి వద్ద ఉన్న ముద్దు కుప్పాయికి పరస్పరం ఆలోచనలతో నిద్రలేని రాత్రులవుతున్నాయి. 

ఆనెగొందికి తిరిగి వచ్చినా సంబజ్జ గౌడ్ ముద్దు కుప్పాయి కలుసుకున్నారు.
నీవు లేకుండా వంద సంవత్సరాలు జీవించడం కంటే రేపు మరణించడం మేలు అని తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆమెను సంబజ్జ గౌడ్ కౌగిలించుకుని నోటిని మూసి "నీలాంటి అమ్మాయిలు సరసాల కోసం కాకుండా ప్రేమ కోసం సృష్టించబడతారు" అని హృదయపూర్వకంగా హత్తుకుంటాడు.

పంచ పాదూషాల వల్ల
విజయనగర సామ్రాజ్యం పై యుద్దచ్ఛాయలు కమ్ముకున్నాయని వివరిస్తాడు.

యుద్ధం అనివార్యమైనప్పుడు వీరుడి కర్తవ్యం రాజ్య రక్షణయే కదా అని యుద్ధానికి పురికొల్పుతుంది ముద్దు కుప్పాయి. 

ఒక స్త్రీ ఏ పురుషుడినైనా ప్రేమించి పెళ్లి చేసుకోదలిచితే అతన్ని తనకు భర్తగా ప్రసాదించాలని సిరిమాను మొక్కు చెల్లిస్తారని తెలిపింది. తాను సిరిమాను సేవ చేస్తానని మొక్కుకున్నానని అలా శ్రీ రంగనాథ స్వామికి మొక్కు చెల్లిస్తున్నానని తెలియజేసింది. 

మరునాటి ఉదయం దేవాలయ ప్రాంగణంలో ఇనుపకొండిని వీపు చర్మం లోపలకు గుచ్చారు. సిడిని పైకి ఎత్తారు. ఆమె ఎడమ చేతిలో చిన్న బాకును ధరించింది. స్తంభానికి తగిలించి ఆమెను సిడిపైకి లాగాడు. ఆమె కొక్కెమునకు వేలాడుతుండగా జనం జయజయ ధ్వానాలు చేశారు. రక్తము కాళ్ళ పొడవునా కారుతున్నా ఆమె ఏ మాత్రం బాధను ప్రదర్శించడం లేదు. దైవస్మరణ చేస్తూ ఎడమ చేతిలోని బాకుని తిప్పుతూ కుడి చేతిలో నిమ్మకాయలను తన ప్రియుడు సంబజ్జ గౌడ్ పైకి విసురుతుంది.

ఆ వేడుకను చూస్తున్న సంబజ్జ గౌడ్ కి ఏకకాలంలో దుఃఖము సంతోషమూ, విస్మయం కలిగింది.

అలియ రామరాయల రాజ్యంలో సకల మర్యాదలు అనుభవించిన రాయబారి ఆలీ ఆదిల్ షాకు ఇస్లాం పై గౌరవం లేదని విజయనగర సామ్రాజ్యంపై దండెత్తాలని విద్వేషాలు నింపారు. అహ్మద్ నగర్ బీదర్, బీరార్, గోల్కొండ మొదలగు పంచపాదుషాలు విజయనగరం పై యుద్ధానికి సిద్ధమయ్యారని వేగుల సమాచారం అందగానే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. 

తాను వలందిని అని ఒక యవ్వనవతి పరిచయం చేసుకొని మనసిప్పి మాట్లాడుతూ
విజయనగర సామ్రాజ్యంలో వ్యభిచారం అధికారికమని, మేము రాజుకు పన్ను చెల్లిస్తాం. మా నుండి వచ్చే ఆదాయాన్ని సైన్యానికి జీతం ఇచ్చేందుకు రాజు వినియోగిస్తున్నారు. యుద్ధం అంటేనే మేమంతా వణికిపోతాం. కళ్యాణి ముట్టడి సమయంలో యుద్ధానికి ఐదు లక్షల మంది సైనికులు బయలుదేరితే మా వారు ఇరువై రెండు వేలమంది వారిని అనుసరించారట. రాత్రుల్లో సైనికులకు సుఖాన్ని ఇవ్వటమే మా పని. అట్లా అంతమందికి ఈ కొద్దిమంది సరిపోతారా? యుద్ధం మాకు ప్రత్యక్ష నరకం అని హృదయ విదారకంగా నివేదించింది.
సున్నిత మనస్కురాలైన వలంది ఎలా పరిస్థితులు ఎదుర్కోగలుగుతుందో అనే ఆలోచనతో ఆ రాత్రి నిద్ర రాలేదు. మొదటిసారిగా యుద్ధం ఆగితే బాగుంటుందని సంబజ్జ గౌడ్ కి అనిపించింది. 

అలియరామ రాయలకు ఆలోచిస్తుండగా సంగతి మహల్లోనే నిద్రించినప్పుడు అజ్ఞాత వ్యక్తులు తన చెవి కమ్మల నుండి ముత్యాలను బలవంతంగా తీసుకువెళ్లినట్లు కలలోంచి ఉలికి పడి లేచాడు. విస్మయం పొందాడు. పండితోత్తములను సంప్రదించి వివిధ దోషాల నిమిత్తం సంహరించే పూజలు గావించాడు. పిమ్మట ఆస్థాన పండితులు విజయలక్ష్మి మిమ్ములను తప్పక వరిస్తుందని నమ్మకం కలిగించారు. 

సంబజ్జ గౌడ్ ను, వలందిని యుద్ధమునకు సాగ నంపుటకు ముద్దుకుప్పాయి మైదానంలోకి వచ్చింది. మీరు ముందు మనసును గెలవాలి. మనసుపై విజయం మీ విజయానికి మొదటి మెట్టు అని ముద్దుకుప్పాయి ప్రేరేపించి శుభ వచనాలు అందించింది. ముద్దుకుప్పాయి చూపుతున్న ప్రేమకు వలందికి కన్నీళ్లు వచ్చాయి. నేను, సంబజ్జ గౌడ క్షేమంగా తిరిగి వస్తామని హామీ ఇచ్చి ముందుకుప్పాయిని వలంది సాగనంపింది.

రాక్షస తంగడి గ్రామాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. తొంభై ఏళ్లు పైబడ్డా ముప్ఫై ఏళ్ల యువకుడి ధైర్య సాహసాలు ప్రదర్శించే రాజు అలియ రామరాయులుకు రక్షణ కవచంగా సంబజ్జ గౌడ్ ఉన్నాడు. ఒకనాటి సాయంత్రం యుద్ధ విరమణ అనంతరం పరిసరాలు గమనిస్తుంటే మద్యం, మాంసం, మగువలతో సైనికులు మునిగి తేలుతుంటే వలంది గుర్తుకొచ్చి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే శుష్కించిన దేహంతో మరణ పడకపై ఆయాస పడుతున్నది. మీరు రేపు ఉదయాన్నే యుద్ధానికి వెళ్లవలసిన వారు వెళ్లి విశ్రమించండి.
 మీరు యుద్ధ విజేతలవుతారు. వలందిని చూసి సంబజ్జ గౌడ్ దుఃఖపడతాడు. మీకోసం ముద్దుకుప్పాయి ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త అని చెప్పి పంపిస్తది.

పాదుషాల ఫిరంగుల ధాటికి తట్టుకోలేక అశేషమైన విజయనగర సైన్య సమూహం రాలిపోతున్నది. ఫిరంగులు బలి తీసుకుంటున్నాయి. తిరుమల రాయల ఎడమ కంట్లో ఆదిల్షా సైనికుడు ఒక్కడు బరిసె దింపాడు. పక్కకు తీసుకెళ్లి తిరుమల రాయలకు హుటాహుటిన వైద్యం అందించారు.
ఒక దళవాయి దూసుకొరావడానికి గమనించిన అలియా రామరాయలు పెద్ద కుమారుడు కృష్ణప్ప యుద్ధంలో మరణించిన విషాద వార్త విన్నాడు. సంబజ్జ గౌడు వారిస్తున్న వినకుండా అంబారి దిగాడు అలియరామరాయలు. ఒక ఏనుగు పిచ్చి పట్టినట్లు ఆలయ రామరాయలు అంగరక్షకుల పైకి దూసుకెళ్లింది. అలియరామరాయులకు ఏనుగు మధ్య సంబజ్జ గౌడ్ దూరి రాజును తప్పించాడు. తొండాన్ని పట్టుకున్న సంబజ్జ గౌడను పది అడుగుల దూరం విసిరింది. బంతిలా తన్నింది. కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. పంచభూతాల సాక్షిగా నిన్ను వివాహమాడుతానని మాట ఇచ్చిన ముద్దు కుప్పాయిని స్మరించుకుంటుండగా కళ్ళు మూతలు పడ్డాయి. ఆ తర్వాత నిజాం పాదుషా పొడవాటి కత్తితో అలియా రామరాల తలను ఒక్క వేటుతో చంపేశాడు. ఫిరంగి గుండు పేల్చుతున్న బీజాపూర్ సైన్యాలకు పెమ్మసాని ఎర్ర తిమ్మానాయుడు గమనించి తిరుమల రాయల్ని కాపాడుతూ చనిపోయాడు. క్రమక్రమంగా విధ్వంసం జరిగి హంపి పాడు పడిన హంపిగా మారింది. 

సంబజ్జ గౌడ్ ను స్మరించుకుంటూ ముద్దుకుప్పాయి విరహవేదనతో ఉంటున్నప్పుడు తన తల్లి సూచన మేరకు సంబజ్జ గౌడ్ త్యాగాన్ని పరులహితం కోరే అతడి గుణగణాలను కీర్తిస్తూ నృత్యరూపకాన్ని రూపొందించడానికి శ్రీకారం చుట్టింది.

యుద్ధంలో పట్టుబడిన విజయనగర సైనికులతో
బీజాపూర్ కు పశ్చిమ భాగంలో ఆలీ ఆదిల్షా తన భార్య చాంద్ బీబీ స్మారకార్థం చాంద్ బావి(డి)ని తవ్విస్తున్నాడు. పర్యవేక్షుడు ఫారుకి కొంత దయా గుణం గలవారు. ఫారుకికి సల్మా అహ్మద్ తో మాట్లాడడం ఆనందంగానూ ఆధ్యాత్మికంగానూ, తాత్వికంగానూ ఉంటుంది. ఒకనాడు ఫారుకి నీ పూర్తి వివరాలు చెప్పమని అడిగాడు. నా పేరు సంబజ్జ గౌడ్ మాది ఆనెగొంది. నేను అలియ రామరాయుల అంగరక్షకుడిని అంటూ తన విషయాలన్నీ చెప్పడం ప్రారంభించాడు. ముద్దుకుప్పాయి నేను ప్రేమించుకున్నాం. మధ్యలో యుద్ధం రావడం వల్ల మా వివాహం వాయిదా పడిందనీ వివరిస్తాడు. 

కళంకం లేని ప్రేమ ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కనుగొంటుంది. నీ ప్రేమ తప్పక విజయాన్ని సాధిస్తుందని చెప్పాడు. 

తోటలో పూలు కోస్తున్న ముద్దుకుప్పాయితో ఒక దళవాయి సంబజ్జ గౌడ్ బీజాపూర్ లో ఉన్నాడని వివరము చెప్పాడు. 

ముద్దుకుప్పాయి బృందం బీజాపూర్ చేరుకొని నృత్య ప్రదర్శన చేస్తామని పాదుషా గారి ద్వారా ఆనతి పొందినది.
నాయికా నాయకకు జరిగిన ఎడబాటు గురించి ప్రేక్షకులందరికీ కళ్ళు చెముర్చుతుండగా ప్రదర్శన ముగిసింది. ప్రదర్శన వీక్షించిన ఆలీ ఆదిల్షా హృదయం బరువెక్కింది. రూపకం తన మనసును కలిగించిందని కొనియాడాడు. కరుణరస ప్రధానమైన నృత్య ప్రదర్శకం ప్రేక్షకులనందరిని ఆకట్టుకుంది. కానుకలతో కళాకారులను గౌరవిస్తామని ఆదేశాలు ఇచ్చి అక్కడి నుంచి నిష్క్రమించాడు. మరుసటి రోజు ఉదయం రాజుయొద్దకు వచ్చిన కళాకారులతో కథానాయక అభినయం అమోఘం. నీ రూపకం నన్ను అంతలా లీనమయ్యేట్లు చేసిందని ఆ పాత్రకు జీవం పోసావని మెచ్చుకున్నాడు. 

ముద్దు కుప్పాయి మహారాజా మమ్మల్ని క్షమిస్తామంటే ఒక విన్నపం చేసుకుంటామని అర్థించినది. 

తప్పక తీర్చగలం ఏంటో చెప్పండి అని రాజు అడగగానే ప్రదర్శించిన నృత్య రూపకం నా జీవితమే. నాయకుడు ఎక్కడో లేడు మీ ఆధీనంలోనే ఉన్నాడు. చాంద్బావిడి తవ్వకం బాధ్యతలో ఉన్నాడు. ప్రజల దాహం తీర్చడం కోసం మీరు చేస్తున్న మహాకార్యంలో సంతోషంగా పాల్పంచుకుంటున్నాడు. దయచేసి విముక్తి చేయండి అని దీనంగా వేడుకుంది

సైనికుల ద్వారా సంబజ్జ గౌడ్ కు రాజు వద్థ నుంచి కబురు వచ్చింది అన్నాడు ఫరూకి. 

ఈ బావి తవ్వడం పూర్తిగా గాని మిమ్మల్ని కూడా మీ ప్రాంతాలకు పంపుతామని ప్రకటించాడు.

సంబజ్జ గౌడ పరుగున వచ్చి ముద్దుకుప్పాయి కౌగిలించుకున్నారు. ఆనందభాష్పాలతో తడిసిపోయారు. వీరిద్దరిని చూసిన మిగతా వాళ్లందరి కళ్ళలో నీళ్లు వచ్చాయి. 

కన్నీళ్లు తుడుచుకుంటూ ముద్దుకుప్పాయితో ఈయన సల్మా అహ్మద్ ఫారుకి మనకు జీవిత బిక్ష పెట్టిన మహానుభావుడు అని పరిచయం చేసాడు.

నేను, సంబజ్జ మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామంటూ ఉద్వేగంతో చెప్పింది.

తన కాళ్ల మీద పడిన ముద్దుకుప్పాయిని లేపుతూ సోదరి అల్లాహ్ ఉన్నాడు కాబట్టే అనుకున్నది జరిగింది మీరు ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమే మిమ్మల్ని ఒకటిగా చేసిందని, దీనిని అల్లా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నాకు సోదరులు లేరు. మా వివాహానికి తప్పక రాగలరు. అని ముద్దుకుప్పాయి చెప్పగానే నీవు నాకు అల్లా ప్రసాదించిన సోదరివి అని మాట ఇచ్చారు. వివాహానంతరం అనతి కాలంలో పుట్టిన వారి గారాలపట్టికి వలంది అని పేరు పెట్టారు.

వర్ణన: రచయిత మారుతి పురోహితం పరిస్థితులకు అనుగుణంగా వర్ణన గావించి పాఠకులకు ఆసక్తి కలిగించాడు. రచయితగా తాను చెప్పదలచుకున్న అంశాన్ని ఉన్నతీకరించి వ్యక్తీకరించారు. కొన్ని )కొన్ని సందర్భాల్లో వారు వ్యక్తీకరించిన వ్యాఖ్యలు అద్భుతంగా ఉన్నాయి. రచయిత వ్యక్తీకరించిన అభిప్రాయాలను విస్తృతంగా రాయవచ్చు.

పాత్రోచిత సంభాషణ: ప్రతిపాత్రకు రచయిత సముచిత స్థానం కల్పించాడు. ఈ పాత్రకు ఎంత నిడివి కేటాయించాలో అంతే నిడివి కేటాయించారు. అలియ రామరాయలు, సంబజ్జ గౌడ్, ముద్దు కుప్పాయి, నాగసాని, వలంది, ఆలీ ఆదిల్షా, పంచపాదూషాల సంభాషణ, ఫారుకి ప్రతి పాత్రకు తగిన విధంగా సంభాషణలు రసవత్తరంగా చిత్రీకరించారు. ఆ సంభాషణలలో జీవం ఉట్టిపడే విధంగా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. 

ప్రణయ హంపిలోని సామాజిక పరిస్థితులు: కాల్పానిక చారిత్రక నవలే అయినా సమాజంలోని వివిధ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, మొదలైనవి గమనించవచ్చు. రాజరిక ఠీవి ప్రదర్శించడం. దొడ్డ సంకన అలియరామరాయల పాదాన్ని ముద్దు పెట్టుకోవడం ప్రభు భక్తి ప్రదర్శనకు పరాకాష్టగా ఆవిష్కరించబడ్డది. అంగరక్షకులు నాలుగు !రకాల కొలువులు రాజు వారికి చేస్తారని వివరించబడింది. అత్యంత క్లిష్టమైన సిరిమాను సేవను ముద్దుకుప్పాయి నిర్వహించిన తీరును నాటకీయంగా రచయిత మలిచాడు.

మతము - సంస్కరణ: పరమాత్ముని దృష్టిలో మానవుల మధ్య అంతరాలు లేవని తెలియజెప్పడం భక్తి ఉద్యమం యొక్క ప్రత్యేకత. కనక దాసరి సమాజంలో అంతరాలు పోవాలని ప్రబోధించాడు. కనుక దాసరికి ఆలయ ప్రవేశం నిరాకరించినప్పుడు గోడలు కూలి, విగ్రహ రూపంలో ఉన్న దైవమే ఆయన వైపు తిరిగినట్లుగా ఈ నవలలో చూస్తాం. ఇది దళితుల భక్తికి అత్యంత ఉన్నతీకరణగా చెప్పవచ్చును. కనక దాసరు అనుయాయి బైరప్ప గౌడ్ కుమారుడే సంబజ్జ గౌడు.

 తారతమ్యాలు - పరిష్కారం: శూద్రులు బ్రాహ్మణుల మధ్య ఉన్న తారతమ్యాన్ని రాగి పిండి బియ్యప్పిండి రెండు పోట్లాడుకున్న వైనాన్ని పోలికలతో తేల్చి చెప్పుతూ సమాజంలో అందరూ సమానమే అందరితో అందరికీ అవసరాలు ఉంటాయి కాబట్టి మనుషుల మధ్య తారతమ్యాలు ఉండకూడదు అని చెప్పబడ్డది. 

బహుజన తత్వం: సమాజంలోని అతడు బడుగు బలహీన వర్గాల వారు అందరూ బహుజనలే. సంబజ్జ గౌడ్ నవల నాయకుడు. కథానాయకి ముద్దుకుప్పాయి ఒక నృత్య కారిణి. ఆనాటి వ్యవస్థలో వ్యభిచారం గురించి వివరించడం అంటే సమాజాన్ని చిత్రించడమే.

పరమత సహనం: భారతదేశ హిందూ సంప్రదాయ బద్ధమైన దేశమే అయినా ముస్లిం పాలకులు పరిపాలించడం వల్ల వారి ప్రభావం ఈ సమాజంపై సమర్థవంతంగా ఉంది. మహమ్మదీయుల ఆచా రాలు పరిస్థితులు గౌరవించారని చెప్పడానికి ఉదాహరణ: మహమ్మదీయులు అవిశ్వాసులకు అభివాదం చేయరనే ఎరుకతో అలియరామరాయులు తమ సింహాసనం పక్కన ఒక బంగారు ఆశను దీవించి ఆ ఆసనంపై పవిత్ర ఖురాన్ ఉంచాడు. ముస్లింలు వ్యక్తులకు అభివాదం చేయడంలో తమ పవిత్ర గ్రంధానికి అభివాదం చేశామని భావన కల్పించడం కొరకు ఏర్పాటు చేశాడు. 
త్రిపాదుషాల కుట్రలు మొదలైనవి వర్ణించబడ్డాయి. 
వేశ్యలు తమ శరీరాలను అమ్ముకోరు. తమ శరీరాలను అద్దెకిస్తారు. నిత్య సుమంగళులు. మాకు వివాహాలు ఉండవని వలంది మనోగతం ఆవిష్కరించడం ఆనాటి పరిస్థితులకు ప్రతిబింబం. వేశ్యలందరూ దేవదాసీలు కారు. కానీ దేవదాసులు అందరూ వేశ్యలే అని వాస్తవాన్ని తెలియజేశారు. వ్యభిచారం స్వీకరించేందుకు ముద్రాదికోత్సవం అద్దం చూపడం అనే మతపరమైన ఆచారాన్ని ఆనాటి రోజుల్లో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి వేశ్యలందరూ హాజరవుతారని వివరించారు. యుద్ధం అంటే వేశ్యలు వణికిపోతారని వలంది మాటల్లో మనం వింటాం.
యుద్ధ సన్నద్ధతను తెలిపే శబ్దాలు శంఖు, కహాళ, డక్కా, దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగడం మొదలైనవి కనబడుతుంటాయి. యుద్ధాలు మోసం పైనే ఆధారపడి ఉంటాయి జాగ్రత్త అని ముద్దు కుప్పాయి చెప్పడం యుద్ధాల్లో మోసాలు ఉంటాయని వ్యక్తీకరించడమే. ముప్ఫైఆరు రకాల పనులు కట్టించుకుని కనీస బాధ్యత లేకుండా ఎవరి దారి వారు చూసుకుంటే ఎలా అని హంపిని విడిచి వెళ్లి పోతున్న వారిని ముసలి వాళ్లు శాపనార్ధాలు పెట్టడం ఆనాటి ఓటమి అనంతర పరిస్థితులకు దర్పణంగా నిలిచాయి. 
యుద్ధంలో ఓడిపోయిన వారిని చెరపట్టడం సర్వసాధారమని చెరపట్టబడిన సైనికులతో వెట్టి పని చేయడం అతి సామాన్య విషయమని నాటకీయంగా ప్రదర్శించబడ్డది. ఈ నవలలో బడుగు బలహీన వర్గాల పరిస్థితులను ఇంకా చిత్రించాల్సి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది

సమాజ హితం కోరిన ఇద్దరు యువతీ యువకులు తమ ప్రణయాన్ని దేశం కోసం అంకితం ఎలా చేశారో వివరించబడడం మనం చూడవచ్చు. ఈ నవలను చక్కగా తీర్చిదిద్దిన రచయిత మారుతి పౌరోహితం గారికి అభినందనలు.  

-డాక్టర్ సిద్దెంకి యాదగిరి 
9441244773




డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...