సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

అష్ట దిగ్గజ కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అష్ట దిగ్గజ కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2023, శనివారం

అష్ట దిగ్గజ కవులు

అష్ట దిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉండేవారు.
Sri-Krishna-Devarayaవారి పేర్లు గుర్తుంచుకోవడఓ కోసo బండ గుర్తు
NTR PADMA (ఎన్ టి ఆర్ పద్మ)
N-నండి తిమ్మన,
T-తెనాలి రామకృష్ణ,
R-రామరాజు భూషణుడు,
P-పింగళి సూరన,
A-అల్లసాని పెద్దన,
D-దూర్జటీ,
M-మాదయగారి మల్లన,
A-అయ్యలరాజు రామభద్రుడు
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు - వారి రచనలు
కవులు రచనలు 
అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథా సారం  
నంది తిమ్మన పారిజాతాపహరణం 
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం 
మాదయగారి మల్లన రాజశేఖర చరితము 
పింగళి సూరన రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నము, కళా పూర్ణోదయం 
అయ్యలరాజు రామభద్రుడు సకల  నీతిసార సంగ్రహం 
తెనాలి రామకృష్ణుడు (వికటకవి)పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం 
రామరాజ భూషణుడు వసుచరిత్ర 

తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాలుగా వీరికే ప్రఖ్యాతి ఉంది. ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన చాటువుల ప్రకారం పైనున్న వారే అష్టదిగ్గజ కవులు. వీరి మధ్య జరిగినాయన్న కథలూ, వాటికి సంబంధించిన పద్యాలు వంటివి ఎన్నో ఉన్నాయి. అష్టదిగ్గజాల గురించి తెలుగునాట ఎన్నోచోట్ల విస్తారంగా జరిగే సాహిత్యరూపకంలోనూ వీరి పాత్రలే వస్తూంటాయి. ఐతే పరిశోధకుల్లో వేరే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలుకుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయము అనే గ్రంథంలో

సరస సాహిత్య విస్ఫురణ మొనయ
సార మధురోక్తి మాదయగారి మల్ల
నార్యుడల యల్లసాని పెద్దనార్యవరుండు
ముక్కు తిమ్మన మొదలైన ముఖ్య కవులు    అనే పద్యం ఉంది.

అష్టదిగ్గజాలలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును –

  1. అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు.
  2. నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
  3. అయ్యలరాజు రామభద్రుడు : ఇతని సకలకథాసార సంగ్రహమును రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. రామాభ్యుదయము మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు అళియ రామరాజుకు అంకితమిచ్చాడు.
  4. ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
  5. మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.

ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురి పేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. ఊహలలో ఉన్న పేర్లు – (1) తాళ్ళపాక చిన్నన్న (2) పింగళి సూరన (3) తెనాలి రామకృష్ణుడు (4) కందుకూరి రుద్రయ్య (5) రామరాజ భూషణుడు (6) ఎడపాటి ఎఱ్ఱన (7) చింతలపూడి ఎల్లన. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు …

  • అతను రాయల సమకాలికుడయ్యుండాలి
  • రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి

ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా తాళ్ళపాక అన్నమయ్య కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. ఆయన రాయల ఆస్థానంలో ప్రవేశించడానికి మంత్రులు, తాతాచార్యులు వంటివారెవరూ ఉపకరించకపోవడంతో రాయల క్షురకుడైన మంగలి కొండోజీ ద్వారా చేరారని, మంత్రుల కన్నా మంగలి కొండోజుయే గొప్పవాడని కీర్తిస్తూ పద్యం రాసినట్టు ప్రతీతి. ఈ మంగలి కొండోజు కృష్ణరాయల మరణానంతరం 1542-1565 వరకూ రాజ్యంచేసిన సదాశివరాయల కాలంలో ఆయనకూ, అసలైన అధికారం చేతిలో ఉన్న అళియ రామరాయలకు సన్నిహిత భృత్యుడు. బాడవి పట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మోజు కొండోజు గారు అంటూ ప్రస్తావిస్తూ చాలా దానశాసనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుద్రకవి అతని సహకారంతోనే సదాశివరాయల కొలువులోకి వచ్చారనీ, రాయల మరణానంతరం కూడా ఆయన అష్టదిగ్గజాల్లో ప్రఖ్యాతులైన కొందరు కవులు ఉండేవారని వారితోనే ఈయనకు చాటువుల్లో చెప్పే సంగతి సందర్భాలు ఎదురై ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు దిగవల్లి వెంకట శివరావు పేర్కొన్నారు. చేరి కన్నడభూమి చెఱవట్టు పాశ్చాత్య/నృపతిపై నొక్కింత కృప తలిర్చు అన్న పద్యంలో రుద్రకవి విద్యానగర వినాశనాన్ని వర్ణించడమూ ఇందుకు బలమిచ్చింది. రామరాజభూషణుని వసుచరిత్ర తళ్ళికోట యుద్ధం తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంథం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.

ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి – “రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును”

అల్లసాని పెద్దన

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్రఆంధ్రవాఙ్మయములో ప్రధమ ప్రబంధముగా ప్రసిద్దికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఒక గొప్ప యాంధ్రకవి. ఇతఁడు బల్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతనికృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.

అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌(కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.

రచనలు : 


అల్లసాని పెద్దన చిత్రపటం

  1. స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర)
అలభ్య రచనలు : హరికథాసారము, రామస్తవరాజము, అద్వైత సిద్ధాంతము
  1. చాటు పద్యాలు

నంది తిమ్మన

నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!

ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవి కి అరణంగా విజయనగరం వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్థంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు.

1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున గయను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్టించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.

రచనా శైలి

తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను “వాణీ విలాసము” అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.
తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్దతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణం లో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు

ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి “ముద్దు పలుకులు” అనిపిస్తాయి.

కృష్ణుని చేష్టలకు సత్యభామ ఇలా తూలనాడింది

ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే

సత్యభామ రోదించిన విధము

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రానవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్

పారిజాతాపహరణం

ఇది ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించినాడు. నారదుడు పారిజాతం కృష్ణునకివ్వడం, ఆ సమయములో అతను రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్దం పారిజాత వృక్షం సత్య తీసుకోని రావడం, తులాభారంతో కథ సుఖాంతం అవుతుంది.
ఫారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అనే అని అంటారు కాని నిజానికి దీనికిని, సంస్కృత హఝరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.

విశేషాలు: తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన అతనికి “ముక్కు తిమ్మన” అనే పేరు వచ్చి ఉండవచ్చును. అతను ముక్కు మీద చక్కని పద్యం వ్రాశాడట. క్రింది ఆ పద్యాన్ని రామరాజ భూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో చేర్చుకొన్నాడట.

నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్

ధూర్జటి

8_Dhurjatiధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.

ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.

ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేకచాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి

ఉదాహరణ పద్యాలు

  • శ్రీ కాళహస్తీశ్వర శతకము నుండి
పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,
గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!

సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!

ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ, నే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా

మాదయ్యగారి మల్లన

మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.

మల్లన 516 గద్యపద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అను మూడు అశ్వాసాల కావ్యమును రచించినాడు. ప్రబంధ శైలిలో రచించబడిన రాజశేఖర చరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉన్నది. సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.

రాయలతోపాటు దండయాత్రలకు, తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన కావ్యమును 1516 – 1520 మధ్య వినుకొండ, గుత్తి సీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పమంత్రి కి అంకితమిచ్చాడు. అప్పమంత్రి తిమ్మరుసుమేనల్లుడు మరియు అల్లుడు.

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్లితంతు గురించి రాజశేఖర చరిత్రలో వర్ణించాడు.

రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)

మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన కృష్ణా జిల్లాలోని అయ్యంకిపురము కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే వైఎస్ఆర్ జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు వైఎస్ఆర్ జిల్లా పుష్పగిరి కి చెందిన అఘోర శివాచార్యులు.

అయ్యలరాజు రామభద్రుడు

జీవిత విశేషాలు

ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు. ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన “రామాభ్యుదయాన్ని” శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా “సకలకథాసారానుగ్రహము” అనే సంస్కృత గ్రంథము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంథము అలభ్యం. ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు. ఇత డొంటిమెట్టలో నున్నకాలములో నచ్చటి వీరరాఘవస్వామిమీద నొకశతకమును జేసెను. ఇతడు మొట్టమొదట గృష్ణదేవరాయల యంతిమదశలో విజయనగరములో బ్రవేశించి కృష్ణదేవరాయనిచేత దద్విరచితమయిన సకలకథాసారసంగ్రమును తెనిగింప గోరబడెను. కాని గ్రంథపూర్తి కాకముందే కృష్ణదేవరాయలు పరమపదము నొందినందున రామభద్రకవి గ్రంథము నాతని కంకితము చేయక యవతారికయందు కృష్ణదేవరాయల ప్రార్థనచేత దానాగ్రంథమును రచించితినని మాత్రము వ్రాసెను. ఈసకల కథాసారసంగ్రహము శ్రీరామ పురూరవశ్చరిత్రాదులనుగల తొమ్మిది యాశ్వాసముల గ్రంథముగా నున్నది. ఈగ్రంథమునందును రామభద్ర కవి సూక్ష్మబుద్ధి గలవాడని యూహించుటకు దగినమార్గము లనేకములు గానబడుచున్నను, కవిత్వము ప్రౌడముగాక వ్యాకరణదుష్టమయి బాలవిరచిత మని సూచించుచున్నది. 1530 వ సంవత్సరమున కొకటి రెండేండ్లుముం దీకవి గ్రంథరచనకారంభించినట్లు తోచుచున్నది. ఈకవి సకల కథాసారసంగ్రహముయొక్క యవతారికయందు దాను గ్రంథరచన చేయబూనుటనుగూర్చి యీక్రిందిపద్యమును వ్రాసి యున్నాడు-

ఉ. నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే

‘కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని

త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం
పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్.

రామాభ్యుదయము

రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణక ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్రాయటమనేది గొప్ప ప్రయోగం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం రామభద్రుడికే చెల్లింది. కాని పాత్ర పోషణ పట్ల కొంత అశ్రద్ధ అనేదీతని బలహీనత. కాని ఇందులో ఆయన రామరాజభూషణుడు అనబడే భట్టుమూర్తి కన్న నయము, అనేది పండితుల అభిప్రాయము. అశోకవనంలో ఆంజనేయస్వామి సీతమ్మ వారికి శ్రీరాముని ముద్రిక ఇచ్చినపుడు సీతమ్మ అన్న మాటలను రామభద్రుడు 14 పద్యాలుగా వ్రాశాడు. ఆ పద్యాలే రామాభ్యుదయానికి సొబగులద్దాయి అని పండితుల అభిప్రాయము.

రామాభ్యుదయము లోని అలంకార ప్రత్యేకతలకు క్రింద ఉదహరించిన పద్యము చక్కని ఉదాహరణ.ఈ పద్యము 7వ ఆశ్వాసము లోని 75 వ కంద పద్యము. ఇందులో విభీషణుడు రావణునికి నీతి చెప్తున్నప్పటిది.

సకలకధాసారసంగ్రహము

ఈ కవి వ్రాయ తలపెట్టిన/అంకితమీయ సంకల్పించిన సకల కథాసార సంగ్రహము అను గ్రంథము ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-

రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం
భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!

కవి చివరిదశలో

ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత

సీ.మోహాపదేశ తమోముద్రితము లైన
కనుదమ్ముల హిమంబు లునుపరాదు
శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక
ముల జంద్రనామంబు దలపరాదు
శీర్యదాశావృంత శిథిలతాసులతాంత
మసియాడ వీవనల్విసరరాదు
పటుతాపపుటపాక పరిహీణతను హేమ
మింక బల్లవపుటా ర్చిడగరాదు
లలన కానంగకీలికీలాకలాప
సంతతాలీడ హృదయపాత్రాంతరాళ చ. ప్రమద మెలర్ప నుగ్రమృగబాధ హరింపగ వేటమై నర
ణ్యమునకు రా నఘం బొదవె నక్కట| ధర్మము చాలు గుక్క బ
ట్టు మనుట యెంచి విల్లబు తటుక్కున ధారుణి వైచి సారమే
యముల మరల్ప బంచె మృగయాక్రియ మాని విభుండు ఖిన్నుడై. [అ.2]
ఉ. అక్కట! కోసలక్షీతివరాత్మజ కానకకన్నముద్దులే
జక్కనిమంచిరాకొమరుజందురు డెక్కడ ? యధ్వరావనం
బెక్కడ ? దైత్యసంహరణ మెక్కడ ? ఘోరవనాంతరశ్రమం
బెక్కడ ? యెట్టు లంపుమనియె న్ముని ? నో రెటులాడె నింతకున్ ? [అ.4]
ఉ. వింధ్య మధిత్యకాకటకవిస్ఫుటపాదపపుష్ప గుచ్ఛసౌ
గంధ్యము హేమధాతుమయకల్పితసంధ్యము బద్ధమేరుసా
గంధ్యము చండకేసరనికాయనిరాకృతభద్రదంతిద
ర్పాంధ్యము గ్రుంగద్రొక్కితి మహాగుణభూషణ సత్యభాషణా. [అ.5
ఉ. చూచుటలే దశోకవని జొచ్చి యటుంజని చూచెదంగదా!
యాచపలాక్షి మజ్జినని యచ్చటనుండినయేని లెస్స లే
దా చతురాననుండు మొదలైన నుపర్వు లెఱుంగ జిచ్చులో
వై చెదగాక యీయొడలు వానరవీరులమ్రోల వైతునే ? [అ.6]

పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు, పెరిగిన
తెవులడగ జూడు పెద్దతనానన్!

పింగళి సూరనామాత్యుడు

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
  • రాఘవపాండవీయం
  • కళాపూర్ణోదయం – ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
  • ప్రభావతీప్రద్యుమ్నం

పింగళి సూరన కవి వంశము

సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన గోకనామాత్వుడు పింగళి యను గ్రామమున నివశించుటచే నా వంశము వారందరికీ పింగళి వారని వంశ నామము వచ్చెనట.

సూరన నివాసము

పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ఈతడు కర్నూలు జిల్లా లోని నంద్యాల మండలము కానాల గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.

రామరాజభూషణుడు

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దము కు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు ‘రామరాజభూషణుడు’ అని పేరు వచ్చినది. ఒక గొప్ప ఆంధ్రకవి. ఈతని జన్మభూమి బల్లారికి సమీపమునందలి పాలమండలము అను ప్రదేశమున ఉండెడు భట్టుపల్లె. ఇతఁడు శాలివాహనశకము 13 వ శతమాన మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలియవచ్చుచు ఉన్నది. ఇతఁడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెనుఁగున లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉన్నది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటియె కానఁబడుచు ఉన్నది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నవి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.

నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.

ఇతనిని గూర్చి పింగళి లక్ష్మీకాంతం ఇలా వ్రాసాడు – “ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. …. ఇతనికే శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.

కావ్యాలంకారసంగ్రహము

భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంథము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంథము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రచించిన అలజిహ్వము_

భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
భాగ మహీభాగమహాభోగావహబాహుభోగిపుంగవభోగా

అన్న పద్యంలో నాలుక కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించినాడు.

వసు చరిత్రము

ఇది భారతములోని ఉపరిచర వసువు కథ,ఇది కవిత్రయము రాసిన మహ భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంధంగా మలిచారు, తిరుమల నాయుని కి ఈ కృతి అంకితమివ్వబడినది.

ఉపరిచర వసువు , మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధాని గా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలం అనే పర్వతము, సూక్తిమతి అనే నది ప్రేమలో పదడతారు. కోలహలానికి, సూక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరిక ను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు.

ఇది మూడు రోజుల్లో జరిగే కథ.

  • 1.ప్రథమాశ్వసము: కృతి భర్త వంశ చరిత్ర, కోలాహలం సూక్తిమతి నదికి అడ్డంపడటం.
  • 2.ద్వితీయాశ్వాసము: కోలాహలం సూక్తిమతుల ప్రేమ.
  • 3. తృతీయాశ్వాసము:గిరిక, వసుపదుల పుట్టుక???
  • 4. చతుర్థాశ్వాసము:
  • 5. పంచమాశ్వాసము:
  • 6. షష్ఠమాశ్వాసము:

హరిశ్చంద్రనలోపాఖ్యానము

ఇది ఒక ద్వద్ది కావ్యము అంటే ఒకే పద్యములో రెండు అర్థాలు వస్తాయి, ఒకటీ నలుని పరంగా ఒకటీ హరిశ్చంద్రుడి పరంగా అన్వయించుకొని చదవాలి.

ఉదాహరణ పద్యాలు

మ. హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్

గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. తమోనేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి(అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు – హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు – ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణ బింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది.

తెనాలి రామకృష్ణుడుTenali-ramalinga

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు కలదు. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో కలవు.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు. రామలింగయ్య తాత,ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరు కు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.

రచనలు

  1. ఉద్భటారాధ్య చరిత్ర
  2. ఘటికాచల మహాత్మ్యము
  3. పాండురంగ మహాత్మ్యము

ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాధ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల(ప్రస్తుతం షోళింగుర్)క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము నందలి విఠ్ఠలుని మహాత్మ్యాలు మరియు ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం.

అలభ్య రచనలు 

కందర్పకేతు విలాసము

  1. హరిలీలా విలాసము

ఇవి అలభ్య గ్రంథములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.

శైలి

తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి

చాటువులు

వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి.

అల్లసాని పెద్దన వారితో

ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో “అమావాశ్యనిశి” ని ఛందస్సు కోసం “అమవసనిసి” అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,

ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో
ఉమెతకయలు తిని సెపితో
అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా ||

ఇక్కడ “అలసని” అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.

ధూర్జటి వారితో

ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు :
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం:
హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !!

అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు.

కావలి తిమ్మడు

మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి
వాకిటి కావలి తిమ్మా !
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా !
నీకిదె పద్యము కొమ్మా !
నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి

తిరుమలరాయల గురించి

రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.

అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే!||
(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఒక కన్ను ఉంది కానీ అది లేకపోయి ఉంటే కురుపతి దృతరాష్టుడివి)

తాతాచార్యుల వారితో

ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు “కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్” అనే సమస్యను పూరణకివ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్

అదే సమస్యని రామలింగ కవి శ్రీ కృష్ణ దేవరయల సమక్షంలో పూరించిన విధం:
రంజన చెడి పాందవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడిరకటా!
సంజయ! విధి నేమందును
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్

భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ

చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

రాయల వారిని పెద్దన పొగడిన పద్యం

చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్‌ గల్గి దు ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌ నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్‌ వచ్చు నీ సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

( అర్జునుడు, సింహము, క్షితి – ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తో పోల్చ రాదంటూనే పద్యం చివర ‘రాజ సింహమా’ అని పిలవడం ఏం సబబు ? అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ తార కుం డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో గలగంబారుతునేగె నీవయనుశంకన్‌ కృష్ణరాయాధిపా !!

(ఇంకో పద్యం)

నరసింహ కృష్ణ రాయని కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్‌ గిరిభిత్‌ కరి కరిభిత్‌ గిరి గిరిభిత్‌ కరిభిత్‌ గిరిభి త్తురంగ కమనీయంబై !

(‘కుంజర యూధంబు..’ అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)

గంజాయి తాగి తురకల సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా లంజల కొడకా ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!

(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)

రంజన చెడి పాండవులరి భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా సంజయ విధి నే మందును కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!

(‘గొల్వు పాలై రకటా’ అని పాఠాంతరం)

(నంది తిమ్మన ను పొగడుతూ)

మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట ద్భేకములకు గగనధునీ శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని ‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’ (కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)

(వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి )

వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

(ధూర్జటి ని స్తుతిస్తూ రాయలు :

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ యతులిత మాధురీ మహిమ ?

(దానికి రామకృష్ణుని కూమత్కార సమాధానం) హా తెలిసెన్‌ భువనైక మోహనో ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ

ఈ పద్యాలు రామలింగని సమయ స్పూర్తిని, కవితా పటిమను చాటి చెపుతాయి.

ప్రెగడరాజు నరస కవి వారి పరాభవం

ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చినారు. అదేమంటే, ఈ కొలువు లో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట.
త్బృ….వ్వట బాబా తల పై
బు….వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళులు….
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!

ఇది ఆయన సమయస్ఫూర్తికి మచ్చుతునక.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అల్లసాని పెద్దన వారు, “షఠ్ఝా మఠ్ఝ కరాడ్ఝ్య వేడ్ఝ్య వసు తఢ్ఝా తఠ్ఝ తఠ్ఝ్యా ఖరే …” అంటూ చెప్పిన చాటువు అద్భుతం అద్వితీయం.

ఏ పద్యానికైనా అర్ధం చెప్పెదనన్న నరస కవి కి,”మేకతోకకు మేక, తోకమేకకు తోక, తోకమేకాతోక తోకమేక …… మేకకొక తోక, మెక మేక తోక తోక …….” అనే పద్యము అప్పగించిరి. ఇంకనూ నరస కవి గారు ఇతరుల కవిత్వంలో తప్పులు ఎంచెదననినందులకు కోపంతో,

ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !!

అంటూ, ఇంకనూ శాంతింపక,

తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!
అని దులిపివైచెను.

 

నైజాంలో సంస్థానాలు.. మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉండేవి. గద్వాల, వనపర్తి వంటి సంస్థానాలు కుతుబ్‌షాహీ ల కాలం నాటి నుంచే ఉన్నాయి. సంస్థానాలు ఉన్న జిల్లాల్లో తెలుగు భాష బోధన, తెలుగులో చదవ టం, రాయటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర జిల్లాల్లో తెలుగు భాష ప్రాధాన్యం అంతగా లేదు. నిజాంల కాలంలో తెలుగు భాష ఉనికిని, సాహిత్యాన్ని కాపాడింది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంస్థానాలే. మరీ ముఖ్యంగా గద్వాల సంస్థానం గొప్ప చేయూతను అందించింది. అందుకే గద్వాల ‘విద్వద్‌ గద్వాల’గా ప్రసిద్ధి చెందింది. గద్వాల కోట ను నిర్మించిన పెద సోమ భూపాలుడు (1663-1712) జయదేవుని అష్టపదులకు సంస్కృతం, తెలుగు భాషల్లో వ్యాఖ్యానం రాశాడు. ఇది అముద్రితం. సోమభూపాలుడు కుతుబ్‌షాహీల నుంచి ‘దేశముఖ్య’ అనే పాలనా గౌరవాన్ని పొం దాడు. ఈ ‘దేశముఖ్య’నే తర్వాత కాలంలో ‘దేశముఖి’గా మారింది.

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...