సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

అర్థ పరిమాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అర్థ పరిమాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2023, ఆదివారం

అర్థ పరిణామం

అర్థ పరిమాణం అంటే మార్పు. భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఇలా ప్రతిదీ మారినట్లుగా అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా ఆయా పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో కలిగిన మార్పుల్నే అర్థ పరిణామం అని అంటారు. అర్థ బోధనను వివరించేదానిని సెమాంటిక్స్ స్టడీ (synchronic study)అంటారు.

అర్ధ విపరిమాణంయొక్క నిర్వచనం
పదజాలానికి సంబంధించిన అర్థంలో కలిగే మార్పు అర్థ పరిణామం. – ఆచార్య జి.ఎన్.రెడ్డి (అర్ధపరిణామణ్ రకాలు గ్రంథం, A study of Telugu Semantics)
భాష కాలక్రమాన మారుతుంది. కాబట్టి ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు, వ్యాకరణ నిర్మాణం మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారతాయి. ఒక భాషలోని పదాల అర్థాల్లో వచ్చిన మార్పుని అర్థ పరిణామం అని అంటారు. – ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం

అర్థ పరిణామం – రకాలు
1897లో ఫ్రెంచి భాషావేత్త మైఖేల్ బ్రెయిల్ ‘La Semanticue’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం. ఈ గ్రంథంలో బ్రెయిల్ చెప్పిన అర్థ పరిణామ రీతుల్ని ఆధారంగా చేసుకుని తెలుగుభాషలో జరిగిన అర్థ పరిణామాలను భాషావేత్తలు స్థూలంగా వర్గీకరించారు. అవి: 
1. అర్థ వ్యాకోచం: అర్థం విస్తృతి పెరగటం అనేక అర్ధాలను అందించడం అంటే మొదట పరిమితార్థాన్ని తెలిపే ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని తెలిపినట్లయితే అది అర్థ వ్యాకోచం. దీనికి ఉదాహరణలు

చెంబు
నూనె
కమ్మ
ధర్మరాజు
భీముడు
నారదుడు
మహారాజు
రాక్షసుడు
అవధాని
గంగ
అష్టకష్టాలు
అష్టైశ్వర్యాలు
తైలం
గ్లాసు.


అర్థ సంకోచం
అర్థం సంకోచం చెందడమే అర్థ సంకోచం. అంటే విశాల అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని లేదా తక్కువ అర్థాన్ని ఇస్తే దానిని అర్ధసంకోచ అంటారు దీనికి ఉదాహరణలు

చీర
కోక
మధు పర్కాలు
వస్తాదు
ఉద్యోగం
తద్దినం
ఆరాధ్యుడు
సంభావన
పెద్ద
వ్యవసాయం
మృగం
శ్రాద్దం
సాంవత్సరీకం
నెయ్యి
సాహెబు
పత్రం

అర్థ గౌరవం
ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు, సామాన్య అర్థంలో వాడిన పదాలు కొన్ని నేటి సాహిత్యంలో గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. ఇలా మారడాన్ని అర్థ సౌమ్యత లేదా అర్థోత్కర్ష అంటారు. దీనికి ఉదాహరనలు

సభికులు
ముహూర్తం
మర్యాద
వైతాళికుడు
అదృష్టం
అంతస్తు


అర్థ గ్రామ్యత
జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో, నిందార్థంలో, నిమ్నార్థంలో పదం వాడితే దాన్ని అర్థ గ్రామ్యత అంటారు. పాత కాలంలోని అర్థం కంటే తర్వాత కాలంలో అర్థం నీచమైంది, చెడ్డది అయితే దాన్ని అర్థాపకర్ష అంటారు. దీనికి ఉదాహరణలు

కర్మ
ఛాందసుడు
వ్యంగ్యం
కంపు
సన్యాసి
స్వాహా
దేవదాసి
కళావంతులు
కైంకర్యం
అసహ్యం
సాని
విధవ
ముండ
గ్రహచారం
పూజ్యం
నిండుకొన్నవి
శనిగ్రహం
ఘటం
సభ్యోక్తి
సభలో, కొందరి సమక్షంలో, సంఘంలో, ప్రత్యక్షంగా మాట్లాడటానికి, చెప్పటానికి చేయడానికి వీలుకాని పదాల అర్థాన్ని పరోక్షంగా లేదా నూతన పదబంధ కల్పనతో తెలియజేసే విధానాన్ని సభ్యోక్తి అంటారు. దీనికి ఉదాహరనలు

చనిపోవు: కాలధర్మం, కీర్తిశేషుడు, బాల్చితన్నాడు, శివైక్యం పొందాడు. స్వర్గస్థుడయ్యాడు, దివంగతుడయ్యాడు, దీర్ఘనిద్ర, నూకలు చెల్లాయి, పరమపదించాడు.
మూత్ర విసర్జన, మల విసర్జన: ఒంటికి, రెంటికి, లఘుశంక, గురుశంక, దొడ్డికెళ్లు, చెరువుకెళ్లు, కాల్వకు పోవు, చెంబట్టికెళ్లు, బయటకుపోవు, బహిర్భూమికి పోవు.
మలం: అశుద్ధం.
మల విసర్జన ప్రదేశం: పాయిఖానా, దొడ్డి,మరుగుదొడ్డి.
కడుపుతో ఉంది (గర్భవతి): ఆవిడ ఉత్తి మనిషి కాదు, నెల తప్పింది.
మృదూక్తి
కఠిన భావాల్ని, దుఃఖకరమైన విషయాన్ని, అభిప్రాయాన్ని మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి. దీనికి ఉదాహరణలు

దీపం కొండెక్కింది – దీపం ఆరిపోయింది
సూత్రం పెరిగిపోయింది – తెగిపోయింది.
నల్లపూసలు పెరిగిపోయాయి – తెగిపోయాయి.

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...