VI. 5. శతక సుధ
ప్రశ్నలు
1. పై బొమ్మలో ఎవరెవరున్నారు?
2. గురువుగారు ఏం చెప్తున్నారు?
3. మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి.
పాఠం ఉద్దేశం
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం 'శతక' ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్ధం. కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలున్నాయి.
కవి పరిచయాలు
1. సుమతి శతకం- బద్దెన
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతి శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.
(13వ శతాబ్దం)
2. శ్రీకాళహస్తీశ్వర శతకం- ధూర్జటి
మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడ ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. 'అతులిత మాధురీమహిమ' కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.
(16వ శతాబ్దం)
3. కుమారి శతకం- పక్కి వేంకట నరసింహకవి
పక్కి వేంకట నరసింహకవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వేంకట నరసింహకవి సులభరీతిలో చెప్పాడు.
(17వ శతాబ్దం)
4. సుభాషిత రత్నావళి - ఏనుగు లక్ష్మణకవి
సంస్కృతంలో భర్తృహరి రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానం లోని పెద్దాడ గ్రామనివాసి. సుభాషిత రత్నావళితోపాటు రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగామాహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన, రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి.
(18వ శతాబ్దం)
5. ప్రభుతనయ శతకం - కౌకుంట్ల నారాయణరావు
కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డిజిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయా! అనే మకుటంతో ఈయన రాసిన 'ప్రభుతనయ శతకం' చాలా ప్రసిద్ధి చెందింది.
1883-1953
6. గాంధీతాత శతకం - శిరశినహల్ కృష్ణమాచార్యులు
శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా 'మోర్తాడ్' లో జన్మించాడు. కోరుట్లలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరుపొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు 'రత్నమాల' అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన 'అభినవ కాళిదాసు' అనే బిరుదుపొందాడు.
7. *భరత సింహా శతకం సూరోదు బాల నరసింహాచారి
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండజిల్లా చిన్నకావర్తి గ్రామానికి చెందిన వాడు. కవితాకేతనం, బాలనృసింహశతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. 'సహజకవి' గా ప్రసిద్ధుడు.
9.5.1946 2.2.2014
8. భవ్యచరిత శతకం - డాక్టర్ టి.వి. నారాయణ
డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26.07.1925 లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవనవేదం, అర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితాసంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.
విద్యార్థులకు సూచనలు
* పాఠంలోని బొమ్మలను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
* పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.
* అర్ధంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.
* పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు అర్థాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.
ప్రవేశిక
జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము.
అట్లా తెలుసుకున్న విషయాల్లో మంచివాటిని భవిష్యత్తు తరాలవారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడ కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతకపద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం.
I
* కం|| పరనారీ సోదరుడై
పరధనమున కాసపడక పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడక
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!
- బద్దెన
1. మంచి బుద్ది కలవాడా! ఇతర స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారిమీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు.
* మ॥ కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
వడిసెం బుత్రులులేని యాశుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! 2
- ధూర్జటి
2. శ్రీకాళహస్తీశ్వరా! 'నాకు కొడుకులు పుట్టలేదే' అని తెలివిలేనివారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలూ జరుగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంతమాత్రాన ము లభించకపోవడం జరుగదు.
ఆలోచించండి - చెప్పండి
* ఇతరులు తనను పొగిడితే పొంగి పోకుండా ఉండాలని కవి అన్నాడు. కదా! అట్లా ఎందుకన్నాడో. చెప్పండి.
* నూర్గురు కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరుగలేదు. అదెట్లాగో చెప్పండి.
II
* కం॥ చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినఁగాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలపు కుమారీ! 3
-పక్కి వేంకట నరసింహకవి
3. ఓ కుమారీ! నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.
* ఉ. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్
- ఏనుగు లక్ష్మణకవి.
4. కాలిన ఇనుముమీద నీళ్లుపడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకుమీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా (ముత్యాలుగా) మారుతాయి, మనిషి అధములతో చేరితే అధముడౌతాడు. మధ్యములతో చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములతో చేరితే ఉత్తముడౌతాడు.
* కం॥ వాదంబు లాడకెప్పుడు.
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్
భేదంబు సేయకెన్నడు
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా! 5
- కౌకుంట్ల నారాయణరావు
5. ఓ తనయా! ఎప్పుడూ అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరిపట్ల భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి.
-------------------------------------------------------------------
ఆలోచించండి - చెప్పండి
* చేసిన మేలును చెప్పుకోవద్దని కవి' ఎందుకు అని ఉండవచ్చు?
* వాదములాడవద్దని కవి అన్నాడు. కదా! వాదము లాడడంవల్ల కలిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి?
------------------------------------------------------------------
* కం॥ మానవుడె మాధవుండను.
జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియె నీ
మానవతలోని మాన్య
స్థానంబనె గాంధీతాత సద్గుణజాతా! 6
-శిరిశినగల్ కృష్ణమాచార్యులు
6. 'మంచిగుణాలు కలవాడా! మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నతస్థానం' అని గాంధీతాత చెప్పాడు. గమనించు.
* ఆ॥వె॥ నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
కడుపునిండ విషము గలుగువాడు
కాలనాగుకన్న కడు ప్రమాదంబయా
బాలనారసింహ! భరతసింహ! 7
-సూరోజు బాలనరసింహాచారి.
7. బాలనారసింహా! భరతసింహా! నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారు కాలనాగు (నల్లత్రాచు) కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
* ఆ॥వె॥ తప్పుచేసికూడ తమదగు తప్పును
కప్పిపుచ్చువారు కలుషమతులు
ఒప్పుకొనెడివారు గొప్పమనీషులు
భరతవంశతిలక! భవ్యచరిత! 8
- డా|| టి.వి. నారాయణ
8. భరతవంశానికి తిలకం వంటివాడా! మంచి నడవడిక గలవాడా! తప్పుచేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.
ఆలోచించండి- చెప్పండి.
* కడుపునిండ విషమున్నవాడు కాలనాగుకన్న ప్రమాదకరమని కవి అన్నాడుకదా! అది ఎట్లో చెప్పండి.
* 'మానవుడే మాధవుడని భావించి ప్రజలసేవ చేయాలి' అట్లా చేసి గొప్పపేరు తెచ్చుకున్న కొందరి గురించి చెప్పండి.
ఇవి చేయండి విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం శతక పద్యాలు చదివారు కదా వీటిని గొప్పతనం గురించి చెప్పండి
2. ఒకరు పద్యం చదవండి మరొకరు భావం చెప్పండి.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించదం
1. కింది భావాలకు సరిపోయిన పద్యపాదాలను పాఠంనుండి వెతికి రాయండి.
అ. మనిషే భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి.
జ. మానవుడే మాధవుండను
ఆ. తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు.
జ. తప్పుచేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు
ఇ. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే.
జ. గొప్పలు చెప్పిన నదియును తప్పే
ఈ. మంచివారికి సేవ చేయాలి.
జ. సాధుల కనుగొన్న సేవ
2 కింది పద్యాన్ని చదువండి.
పుత్తడి గలవాని పుండు బాధైనను
వసుధలోన చాల వార్తకెక్కు
పేదవాని యింట పెండ్లైన యెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
పై పద్యం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి.
అ. పుత్తడిగలవాడంటే ఇనుము గలవాడు. ( x )
ఆ. వార్తకెక్కు అంటే వార్తల్లోకి రావడం. ( ✓ )
పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు. ( ✓ )
ఈ. శ్రీమంతులు ఏదిచేసినా అది వార్త అవుతుంది. ( ✓ )
3. కింది వాక్యాలు చదువండి. మీరు చేసే పనులకు సంబంధించి సరైన జవాబును'' తో గుర్తించంది.
అ. నేను తప్పుచేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను. అవును ✓/ కాదు
ఆ. ఇతరులకు మేలుచేసి ఆ గొప్పలు చెప్పుకోను.
అవును✓ / కాదు
ఇ. నాకు అందరు మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవును / కాదు ✓
ఈ. నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను.
అవును / కాదు x
ఉ. నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను.
అవును / కాదు ✓
ఊ. ఇతరుల మధ్య గొడవలు పెట్టను. అవును✓ / కాదు
ఋ. ఇతరులకు ఏదైనా అవసరముంటే ఇస్తాను. అవును ✓/కాదు
ౠ. ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను. అవును ✓/ కాదు
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. మనం ఇతరులకు మేలు చెయ్యాలి. ఎందుకు?
జ. ఇతరులకు మేలు చేయడం వలన అందరూ క్షేమంగా ఉంటారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటే కలకాలం గుర్తుంటాము. సాయం చేయడం వల్ల వారి హృదయాలలో మనకు గొప్ప స్థానం ఉంటుంది. ఇతరుల సంపదలకు డబ్బుకు ఆశ పడకూడదు.
ఆ) "మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలవాడతాయి" సమర్థిస్తూ రాయండి.
జ. మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు అలవాడతాయి. ఇతరుల ధనానికి ఆశపడము. పొగిడినా పొంగకుండా ఉండగలం. స్త్రీల పట్ల సోదరునిలా మెలుగుతాము. పెద్దలను గురువులను గౌరవిస్తాము. క్రమశిక్షణగా జీవిస్తాము. ఇతరులు తిట్టినా వారిపై కోపాన్ని ప్రదర్శించము
ఇ)"గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే" అని తెలుసుకున్నారుకదా. దీని గురించి మీ అభిప్రాయం. తెలుపండి.
జ. మనం చేసే మేలును ఎప్పుడూ బయటకి చెప్పకూడదు. అలా చెప్పితే మెచ్చుకోరు మన మీద నిందలు వేస్తారు. గొప్పలు చెప్పి గర్వాన్ని ప్రదర్శిస్తారు అందువల్ల గొప్పలుచెప్పుకోవడం కూడా తప్పు అవుతుంది.
ఈ. అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు?
జ. అనవసర వాదాలకు పోవడం సమయాన్ని వృథా చేస్తుంది, మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. వాదనలో కోపం, అహంకారం పెరిగి సంబంధాలు చెడిపోతాయి. వాదించడం కంటే వినడం, అర్థం చేసుకోవడం మంచిది. వాదన ద్వారా ఎవరికీ లాభం ఉండదు, కానీ మనసులో విభేదాలు పెరుగుతాయి. వివేకంతో నిశ్శబ్దంగా ఉండటం, సరైన సమయంలో సరైన మాట చెప్పడం మన ప్రతిష్ఠను, సమాధానాన్ని కాపాడుతుంది. అందుకే అనవసర వాదాలకు దూరంగా ఉండాలి.
2 కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది?
జ.శతక కవులు సమాజానికి నైతిక విలువలు, సత్యనిష్ఠ, ధార్మికతను బోధించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. వారు అన్యాయం, అజ్ఞానం, కులవ్యవస్థలను విమర్శించి సమానత్వాన్ని ప్రోత్సహించారు. సులభమైన భాషలో రాసిన శతకాలు ప్రజల మనసులో ఆలోచన, విజ్ఞానం నాటాయి. తెలుగు భాషా సంస్కృతిని కాపాడి, సాహిత్య సౌందర్యంతో జీవన మార్గదర్శకత్వం చూపి సమాజానికి మేలు చేశారు.
IV. సృజనాత్మకత / ప్రశంస
శతక పద్యాల ఆధారంగా మనం చేయకూడనివి, చేయవలసినవి పట్టిక తయారుచేసి ప్రదర్శించండి.
జ. చేయవలసినవి
నిజాయితీగా ఉండి సత్యం మాట్లాడాలి.
మంచి వ్యక్తుల సాంగత్యం చేసి జ్ఞానం పెంచుకోవాలి.
విద్యను సంపాదించి మనసు వికసింపజేయాలి.
పెద్దలను గౌరవించి ధర్మం పాటించాలి.
శ్రమతో సంపాదించి ఇతరులకు సహాయం చేయాలి.
చేయకూడనివి
అబద్ధాలు చెప్పి విశ్వాసం కోల్పోవడం.
చెడు సాంగత్యంతో చెడు మార్గంలోకి వెళ్లడం.
అజ్ఞానంలో మునిగి నీచ స్థితికి దిగజారడం.
పెద్దలను అవమానించి పాపం మూటగట్టడం.
సోమరితనం, లోభంతో స్వార్థంగా జీవించడం
V. పదజాల వినియోగం
1. కింది పదాలతో సొంతవాక్యాలను రాయండి.
ఉదా: మోదం పండుగలు మోదంను కలిగిస్తాయి;
అ. హితం = (మేలు) : హితం పలుకుట మంచిది
ఆ. హర్షించుట = (సంతోషము) : మన మిత్రులు గొప్ప కార్యాలు సాధించినప్పుడు హర్షించాలి.
ఇ. సంతోషం : నేను కబడ్డీ ఆటలో ప్రథమ విజేతగా నిలిచినప్పుడు సంతోషం కలిగింది.
ఈ. పరధనం=(ఇతరుల ధనం): మనము పరదనము ఆశించకూడదు
ఉ. దుర్గతి =(చెడ్డగతి): చెడ్డ అలవాట్లు దుర్గతికి కారణమవుతాయి.
ఊ. మేలు =(లాభం ): తోటి వారికి మేలు చేయాలి.
ఋ. ప్రజల సేవ : ప్రజల సేవ చేస్తే సమాజం బాగుపడుతుంది.
VI
2. జట్టుపని : పద్యాల్లోని పదాల్లో ఏయే పదాలు పుస్తకం చివరి అకారాది పట్టికలో ఉన్నాయో చూసి వాటికింద గీత గీయండి. అర్థాలు రాయండి.
VI.
భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పేదాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు, చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ! బతుకమ్మ! సంపదను ఇవ్వమ్మ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజలవల్ల ఫలితాన్ని పొందుతారు.
పదం
ఉదా: బతుకును
ఈ
4.
విభక్తి ప్రత్యయం
విభక్తి పేరు
ద్వితీయావిభక్తి
2. కింది ఖాళీలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి.
ఉదా॥ చెరువు నందు నీరు నిండుగా ఉన్నది (సప్తమీ విభక్తి )
అ) చదువు కు మూలం శ్రద్ధయే. (షష్టి విభక్తి)
ఆ) చేసిన తప్పు ను ఒప్పుకునేవారు ఉత్తములు.(ద్వితీయ విభక్తి)
ఇ. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. (పంచమీ విభక్తి)
ఈ. ఘటము నందు నీరు నిండుగా ఉంది. (సప్తమి విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. (చతుర్థి విభక్తి)
ఊ. ఈ హింస.. తో... దేనిని సాధించలేం..(తృతీయ విభక్తి)
(ఋ. అతడు కుంచె ...తో...చిత్రాలు గీశాడు. (తృతీయ విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం..... వల్ల.. మనస్సు (పంచమి విభక్తి)
ఎ. బాలిక ..తో.... బహుమానాలు తీసుకోవడానికి వేదిక పైకి ఎక్కారు. ( తృతీయ విభక్తి )
ఏ. రైతు నాగలి ... తో.. పొలం దున్నుతాడు. ( )
చెరువు ....లో... బట్టలు ఉతుకొద్దు. ( )
గౌరవించాలి. ఒ. పెద్దలమాటల ( )
ఓ. పసివాడు పాల ఏడుస్తున్నాడు. ( )
ఔ. బాలబాలికలు స్వయంకృషి పైకి రావాలి.
( )
క. సుస్మిత మానస తెలివైనది. ( )
అవ్యయం
కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నా కదా! ఇప్పుడు 'అవ్యయం' అంటే ఏమిటో తెలుసుకుందాం.
* కింది వాక్యాలను చదువండి.
నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం పనికిరాదు.
మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఆహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో!
ఈ వాక్యాల్లో ఉన్న 'అట్లని, అయితే, ఆహా!' మొదలైన పదాలను చూశారుకదా! ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులూ కావు. ఏకవచన, బహువచనమను తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను 'అవ్యయాలు' అంటారు.
లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు.
1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయపదాలకింద గీతగీయండి.
"ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది." అని సీత రాముడితో అన్నది.
ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు..
'శభాష్' అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.
ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.
ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.
ఊ. ధనం సంపాదించాలి. అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.
ప్రాజెక్టు పని
మీకు బాగా నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి వినిపించండి.
నేనివి చేయగలనా?
* శతక పద్యాల గొప్పదనం గురించి చెప్పగలను.
అవును / కాదు
* అపరిచిత పద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించగలను.
అవును / కాదు
* శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను.
అవును / కాదు
* శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయగూడనివి, చేయవలసినవి పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించగలను.
అవును / కాదు
సూక్తి
పాతదంతా బంగారం కాదు.
కొత్తదంతా ఇత్తడీ కాదు. తెలివైనవాడు మంచిని ఎక్కడినుండైనా స్వీకరిస్తాడు.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం
1. కింది భావాల కు సరిపోయిన పద్య పాదాలను పాఠం నుండి వెతికి రాయండి.
1. కింది పదాలతో సొంత వాక్యాలను రాయండి.
ఉదాహరణ: మోదం- పండుగలు మోదం ను కలిగిస్తాయి
అ) హితం: నేను ఇతరులకు హితం చేస్తాను
ఆ) హర్షించుట: నేను బాగా చదివినప్పుడు నా తల్లిదండ్రులు హర్షిస్తారు.
ఇ) సంతోషం - నేను మరియు నా మిత్రులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను.
ఈ) పరధనం - నేను ఇతరుల పరధనం ఆశించను.
ఉ) దుర్గతి - చెడు వ్యసనాలకు లోనైన వారు దుర్గతి పాలవుతారు.
ఊ) మేలు- ఇతరులకు కీడు చేయకపోతే మేలు చేసినట్లే.
ఋ) ప్రజల సేవ - రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తారు.
2. జట్టు పని: పద్యాల్లోని పదాల్లో ఏ ఏ పదాలు పుస్తకం చివరి అకారాతి పట్టికలో ఉన్నాయో వాటి కింద గీత గీయండి. అర్ధాలు రాయండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. భాషను గురించి తెలుసుకుందాం
L కింది పేరాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ! బతుకమ్మ! సంపదను ఇవ్వమ్మ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజలవల్ల ఫలితాన్ని పొందుతారు.
పదం విభక్తి ప్రత్యయం విభక్తి పేరు
పండుగను ను ద్వితీయ విభక్తి
ఆ. పండుగలో లో షష్టి విభక్తి
అనుబంధాలకు కు షష్టి విభక్తి
చేతులతో తో తృతీయ విభక్తి
అందుకొరకు కొరకు చతుర్థి విభక్తి
పాటల అందు అందు సప్తమి విభక్తి
2. కింది
ఖాళీలను సరైన విభక్తి ప్రత్యాయాలతో గుర్తించి, అవి ఏమి విభక్తులో రాయండి.
ఉదా: చెరువు నందు నీరు నిండుగా ఉన్నది (సప్తమి విభక్తి)
అ)చదువు ...కు... మూలం శ్రద్దయే (షష్టి తత్పురుష సమాసం)
ఆ) చేసిన తప్పు.... ను ... ఒప్పుకునే వారు (ద్వితీయ తత్పురుష సమాసం)
ఇ) కడుపులో విషయం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు (పంచమి తత్పురుష సమాసం)
ఈ) ఘటము ..లో.. నీరు నిండుగా ఉన్నది (షష్టి విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం ... కోసం...తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.
ఊ. హింస ... వల్ల... దేనిని సాధించలేం.
(పంచమి విభక్తి)
ఋ. అతడు కుంచె ..తో.. చిత్రాలు గీశాడు. (తృతీయ విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం ..వల్ల... మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. (
ఎ. బాలిక......తో...... బహుమానాలు తీసుకోవడానికి వేదిక పైకి ఎక్కారు. (తృతీయ విభక్తి)
ఏ. రైతు నాగలి తో పొలం దున్నుతాడు.
(తృతీయ విభక్తి (
బట్టలు లో ఉతుకొద్దు. (షష్టి విభక్తి)
ఒ. పెద్దలమాటల ను గౌరవించాలి.
ఓ. పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు.
(చతుర్ధి విభక్తి)
ఔ. బాలబాలికలు స్వయంకృషి తో పైకి రావాలి. (తృతీయ విభక్తి)
క. సుస్మిత కంటే మానస తెలివైనది. (పంచమి విభక్తి)
అవ్యయం
కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నాయి.
కదా! ఇప్పుడు 'అవ్యయం' అంటే ఏమిటో తెలుసుకుందాం.
కింది వాక్యాలను చదువండి.
అ) నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం పనికిరాదు.
ఆ) మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఇ) ఆహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో!
ఈ వాక్యాల్లో ఉన్న 'అట్లని, అయితే, ఆహా!' మొదలైన పదాలను చూశారుకదా! ఇవి పుంలింగం, స్త్రీలిం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులూ కావు. ఏకవచన, బహువచన తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను 'అవ్యయాలు' అంటారు.
లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు
1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయపదాలకింద గీతగీయండి.
ఆ. "ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది." అని సీత రాముడితో అన్నది.
ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు.
'ఇ. 'శభాష్' అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.
ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.
ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.
ఊ. ధనం సంపాదించాలి. అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.
ప్రాజెక్టు పని
మీకు నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి. వినిపించండి.
నేనివి చేయగలనా?
1. శతక పద్యాల గొప్పదనం గురించి చెప్పగలను. అవును /కాదు
2. అపరిచిత పద్యాన్ని చదిని తప్పొప్పులను గుర్తించగలను.అవును /కాదు
3. శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను. అవును /కాదు
4. శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయగూడనివి, చేయవలసినవి పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించగలను.
అవును /కాదు
సూక్తి
పాతదంతా బంగారం కాదు.
కొత్తదంతా ఇత్తడి కాదు.
తెలివైనవాడు
మంచిని ఎక్కడినుండైనా స్వీకరిస్తాడు.
