సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

నేనెర్గిన బూర్గుల - డా. సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేనెర్గిన బూర్గుల - డా. సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఆగస్టు 2023, సోమవారం

IX- 2. నేనెర్గిన బూర్గుల - డా. సిద్దెంకి





పాఠ్యభాగ 
వివరాలు: ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్ప వారి జీవితాన్ని వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్  మహాసపత్రిక 1972 సంవత్సరం డిసెంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

రచయిత పరిచయం:
పేరు : పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు
జననం : 1921
మరణం : 2004
జన్మస్థలం:  వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు.
దత్త పుత్రుడు : రుక్మిణమ్మ - రంగారావు గార్లకు దత్తపుత్రుడు

రాజకీయ గురువు : స్వామి రామానంద తీర్థ
పదవులు :1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయ జీవితం ప్రారంభమైంది.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో బహుకాలం మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలు అందించారు.

భాషలు:  17 భాషలలో ప్రావీణ్యం.

రచనలు : విశ్వనాథ 'వెయ్యి పడగలు' నవలను హిందీలోకి "సహస్రఫన్" పేరుతో అనువాదం చేశాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
పత్రికా నిర్వహణ : కాకతీయ
వీరి ఆత్మకథ ఇన్సైడర్.
"ఫన్ లక్షన్ కోన్ ఘతో" అని మరాఠీ పుస్తకాన్ని తెలుగులో "అబలా జీవితం" అనువదించాడు


I
స్వర్గీయ డా. బూర్గుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి.  
 వ్యాసం రాయమని మిత్రులు కొందరు నన్ను కోరారు. 
డా. రామకృష్ణారావుగారి పేరు ప వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొని భావోద్రేకంతో నా మనస్సు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటుంది. 

నా భావాలన్నింటిని వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. 
 రేఖామాత్రంగా నా భావాలను యిక్కడ పొందుపరుస్తాను. 
 చరిత్రకారులు ఏవి వ్రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు. 
"డాక్టరు రామకృష్ణారావుగారు ఫలాన తేదీన ఫలాన గ్రామంలో పుట్టారు. 
ప్రొ-పూనాలోని ఫెర్గూసన్ కాలేజి నుండి పర్షియన్భాష విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు.
 పర్షియన్ ట్యూటరు, సం. కొంతకాలం పనిచేశారు. తరువాత న్యాయవాద పట్టా పొంది ఫలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసారు. ఇన్ని ప్రజా ఉద్యమాలలో అ ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెసులో వారొక ప్రముఖ నాయకులు. మంత్రి, ముఖ్యమంత్రిగాను, రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక కమిటీలకు కమీషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. గుండెపోటు వలన 1967 సెప్టెంబరు 14వ తేదీన కన్నుమూశారు.  మొదలయిన అంశాల రహ వ్రాస్తారు. 

చారిత్రకంగాను, కాలక్రమ ప్రకారంగాను అది అంతా నిజమే. కాని, అంతమాత్రం చేత డా. రామకృష్ణారావుగారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు. 

గొప్ప విషయాలు చిత్రిస్తారు.
 దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకొన్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంది. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకొంటూ తమ శక్తిసామర్ధ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్ధపరుచుకొంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని యిందుకు డా. రామకృష్ణారావుగారు మాత్రం అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడు అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పుతూ వుండేవారు. ఎంత ఉంటే అంతే, వీసం ఎత్తు ఎక్కువాలేదు. వీసం ఎత్తు తక్కువా లేదు.

పొట్టితనం మరుగుపరుస్తూ ఉండేదని కొంతమంది అంటారు.  
అది సత్యదూరమైన విషయం మరొకటి లేదని నా భావన. నిజానికి ఒడ్డు పొడుగూ ఉన్న చాలామందికంటే కూడ వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి -భావనిర్లిప్తతతో చెప్తూ ఉండేవారు. 
లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్ బ్రైత్ అసాధారణ పొడగరితనం కంటె డా. రామకృష్ణారావు గారి హైదరాబాదు సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా.రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియారాజు ఇబన్ షా ఉద్ పుష్పమాలాలంకృతునిగా చేసిన సందర్భంగా అతిథి ఆతిథేయులిర్వురు పరస్పర సౌజన్య సౌహార్దాలతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం యిప్పటికీ చాలా మందికి జ్ఞాపకముండే ఉంటుంది. అలాగే ఒక విందు సందర్భంలో -ప్రొ. గాల్త్, డా. రామకృష్ణారావు గార్ల ఫొటో తియ్యడం ఫొటోగ్రాఫర్ల కళానైపుణ్యానికొక గీటురాయి అయి ఆ సందర్భానికొక చక్కని వినోదాన్ని చేకూర్చింది

ఆలోచించండి- చెప్పండి
• అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఎప్పుడు?
* ఇతరులకంటే తాను అధికుడనని- పించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
*సత్యదూరమైన విషయం అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడుతారు?

II

అవసరమైతే విరాట్ రూపం....

వారు గుర్తించబడడానికి, గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానేలేదు. అంతకన్న గహనమైన దేదో వారి వ్యక్తిత్వంలో వుండి ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికంగా (routine) వారు గుర్తించబడడంకాని, గుర్తించబడకపోవడం గాని జరుగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తివలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. పని పూర్తి అయిన వెంటనే తిరిగి తమ వామన రూపంలో ఇమిడిపోతూ ఉండేవారు, మరొక అవసరం వచ్చేవరకు. అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో యిమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో యిమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డా. రామకృష్ణారావుగారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోతులలోనే పరిలక్షితమౌతూ ఉండేవి.

న్యాయవాదిగా

ఆ న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండేవి. వారి ప్రాక్టీసు roaring practice (క్షణం తీరికలేనిది) అని చెప్పడానికి వీలులేదు. అలా అని వారికి కేసుల కొరత ఎప్పుడూ ఉండేదికాదు. కాని వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలను సంబంధించినట్టివి. ఫీజు లేనట్లోవీను, ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి, ధనసంపాదనకు ఉపకరిస్తే, డా.రామకృష్ణారావుగారి విషయంలో మాత్రం అది తారుమారైంది. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డా.రామకృష్ణారావుగారి శక్తిసామర్థ్యాలు, ప్రజ్ఞా ప్రాభవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రతవలన కేసులమీద ఎక్కువ ధ్యానముంచలేరేమో అన్న అనుమానంకూడా క్లయింట్ల మనస్సులలో ఉంటూ ఉండేది. నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేదికాదు. కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్నిరేఖామాత్రంగా వ్రాసిపెట్టుకొనే వారు అంతే. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డా.రామకృష్ణారావుగారి జాజ్జ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనాఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం నేను స్వయంగా చూచాను. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశిత మేధాసంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది వారి అనన్యమైన వాదనా పటిమ.

ప్రోత్సాహం

సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారివద్ద అందరికంటె జూనియర్గా ఉండేవాడిని. కాని తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేషమమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా. రామకృష్ణారావుగారికి నామీద ఉంటూ ఉండేది. చొరవతోను, నిరాఘాటంగాను, నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడుపడని చిక్కు కేసులను - స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. నా యీ చొరవ వారి సీనియర్ గుమాస్తాకు కోపకారణమై ఆయన నామీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు. ఒకసారి డా.రామకృష్ణారావుగారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోదముద్ర వెయ్యడం, అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటినుండి మా యిరువురి మధ్య సీనియర్, జూనియర్ సంబంధంపోయి నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయి చర్చాసంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకొన్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తిసామర్ధ్యాలున్నాయని, స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లపుడూ జోహారు లర్పిస్తూనే ఉంటాను. వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలలోను, యితర చోట్లను కూడ శ్రీరామరక్షగా ఉంటూ వస్తూంది. ప్రాతఃస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావుగారి విశిష్టవ్యక్తిత్వ మట్టిది.

రాజకీయాలలో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినప్పటికి వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తూఉన్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహకోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికినీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీచట్టాన్ని తయారుచేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూకామందులు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

పూర్వపు హైదరాబాద్ సంస్థానవిచ్ఛిత్తి తన రాజకీయ ని ప్రాబల్యానికి స్వస్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు, అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మవరిత్యాగానికీ, చివరకు సక్రియ రాజకీయాలనుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు. రామకృష్ణారావుగారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, మంచి వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు. ఒకసారి నిర్ణయం ని తీసుకొన్నారంటే ఆరునూరైనా దానిమీద స్థిరంగా నిల్చేవారు. ఇదీ డా. రామకృష్ణారావుగారి సంక్షిప్త రాజకీయచరిత్ర.



ఆలోచించండి- చెప్పండి.

*ఎవరైనా గుర్తింపుపొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్చుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?

• అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం? ఎందుకు?

• 'కొరుకుడు పడకపోవడం' అంటే ఏమిటి? దీన్ని ఏప సందర్భాలలో వాడతారు?

సౌజన్యానికి మారుపేరు :

వారి విశిష్టవ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీరామకృష్ణారావుగారు. శరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు బద్ధవ్యతిరేకి అయినప్పటికినీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమమిత్రులు, ఆప్తులూను! అతి నిరాడంబరముగా వారు మతాతీతస్థితిని పాటించేవారు. వారి డ్రాయింగు రూం ఒక సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాలముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీటోపీలవారు, ఖద్దరుధారులు, అధునాతన టెరిలిస్ యువకులు ఒకరేమిటి, అన్ని రకాలవారు, వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరు అయేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే డా.రామకృష్ణారావుగారు మూడు విభిన్నతరాల చివరి వారధిలా కన్పించేవారు. ఇంతటి విశాలవ్యక్తిత్వంతో వారు ఆనాటి ప్రజాజీవితాన్ని తీర్చిదిద్దారు.

నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభా నాయకులుగా వారు సునిశితమేధ, పరిమార్జితభాష, వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరచిన ఉన్నతప్రమాణాలను, నేటికి- ముఖ్యంగా యీ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకొంటూ ఉంటారు. అవసరమైనపుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపుబొట్టుమాట అలా ఉంచి, ఒక్క కన్నీరుబొట్టు పడడంగాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడంగాని జరిగేదికాదు. పార్లమెంటేరియన్గా డా. రామకృష్ణారావుగారి అద్వితీయ కళాకౌశలమట్టిది.

బహుభాషావేత్త :

వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినదే. వారు చదువుకున్న చాలా భాషలు వాటియందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా. రామకృష్ణారావుగారు ప్రతిరోజూ అర్ధరాత్రివరకు ఆఫీసు ఫైళ్ళు చూచుకొని, ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ, డా.రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీజగత్తుకు చెందినవారని నా నమ్మకం. ఇది చాల వింతగానే తోచవచ్చు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరుగవలసినంత ఎక్కువగా జరుగలేదు.
బహుముఖప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. రామకృష్ణారావుగారు ముట్టని, పెంపొందించని క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. కాని ఏం లాభం? ఏ సాహిత్య క్షేతానికైతే వారి సునిశిత మేధాసంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో, ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలుగలేదు. రాజకీయవేత్తగా కూడ వారు తమ కాలంనాటి అంటే దేశచరిత్రలో చాల ప్రధానమైన, ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులెంత చెప్పినప్పటికీ వారా పనులు చేయలేకపోయారు. ఆవిధంగా వారు తమ జీవితకాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ, చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్న ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులెవరికంటె కూడ వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేనూ, నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం.

వారి ఔదార్యం, ఉపకారబుద్ధి ఎంతవరకు ఉండేదంటే, ఒక్కొక్కపుడది ఒక దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడ వారు నెమ్మదిగా నచ్చచెప్తూ ఓపికగా చాలసేపు కూర్చొనేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండిఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కాని డా. రామకృష్ణారావుగారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే, శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది. ఏమైతేనేమి? వారావిధంగా మలచబడ్డారు. అది అంతే.

ఉపకారశీలి

డా.రామకృష్ణారావుగారిది పెద్దకుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుబడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలుకూడ ఎంతో ప్రేమతోను, ఓర్మితోను, గంటల తరబడి వేచిఉంటూ ఉండడం, వారు రాగానే "సోదర సోదరీమణులారా; నేను అలవాటు ప్రకారం నేడు కూడ ఆలస్యంగానే వచ్చాను" అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది.

వారి సామాజికయాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మనసెర్యాన్ని సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కాని, ప్రత్యర్థులు దూషించినప్పుడుగాని వారనేదల్లా ఒకటే - "సరే - అవన్నీ ఆటలో ఉండేవేగా”

అని. డా.రామకృష్ణారావుగారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు.

ఆలోచించండి- చెప్పండి.

* గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థంఎందుకు చేయాలి?

మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా? లేక ఇతరపనులకా?

రామకృష్ణారావుగారిని పి.వి.గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు'కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? ఏమేం చేయాలి?







అవగాహన ప్రతిస్పందన :
1.
2.
3
4. గద్యభాగం
అ)రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకం ఏమిటి 
జవాబు. రుద్రమాంబ సమర్ధరాలు
ఆ) రుద్రమ అమ్మ చేసిన సత్కార్యాలేవి
జ. రుద్ర మాంబ చేసిన సత్కార్యాలు విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.
ఇ) మార్కోపోలో ఏ అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు?
జ.  పరిపాలన దక్షత సాహిత్య సేవ, శిల్పకళలు, మహదేశ్వరం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు.
ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
రుద్రమదేవి గొప్ప వీరవనిత, ప్రజాను రంజకంగా పరిపాలన చేసిన రాణి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
అ) బూర్గుల పి వి గార్ల సంబంధము గురు శిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జ. బూర్గుల పివి గార్ల సంబంధము గురు శిష్య సంబంధం: బూర్గుల రామకృష్ణారావు గారు అప్పటికే పేరు మోసిన న్యాయవాది రాజకీయ నాయకులు. వారి వద్ద జూనియర్ లాయర్ గా పీవీ నరసింహారావు గారు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ క్రమంలో అనేక విషయాలు తెలియని అంశాలను గురువు లాగా పివి నరసింహారావు గారికి బూర్గుల గారు బోధించేవారు. న్యాయవాద వృత్తిలో సీనియర్ గా ఉన్నప్పటికీ, స్నేహితుడిగా ఉన్నను పేద భావం అరమరిక్ లేకుండా బోధించేవారు. అనేక విషయాలు తెలియజేస్తున్నందువల్ల వీరిద్దరి సంబంధం గా మనం అర్థం చేసుకోవాలి.

ఆ) "సరే! అవన్నీ ఆటలు ఉండేవేగా" అని బూర్గుల వారు అనేవారు కదా ఏ సందర్భంలో ఎందుకనే వారు దానికి గల కారణాలు రాయండి.
జ. రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్ధులు ఎప్పుడు తప్పుని వెతుకుతారు. మాట్లాడిన పని చేసిన మంచి బోధించిన వారికి తప్పే కనబడుతుంది. బూర్గుల గారి ద్వారా లాభము పొంది కూడా నిందారోపనలు చేస్తారు. మంచి చేసిన తప్పుని వెతుకు తారు. మళ్లీ అవసరమైనప్పుడు మీరే రక్షించాలి అని వేడుకుంటారు
 అవసరం తీరిన తర్వాత మళ్లీ పూర్వపు లాగానే వ్యవహరిస్తారు కాబట్టి ఈ రాజకీయ క్రీడలలో మిత్రులు ఎవరు ఉండరు గనుక వారి ఆరోపణలను అధిగమించడం కోసం ఇవన్నీ రాజకీయ ఆటలో ఉండేవేగా వాటిని పట్టించుకోవద్దని అర్థం లో వివరిస్తాడు

ఇ) బూర్గుల వారిని ప్రాతస్మరణీయులు అని పివి నరసింహారావు గారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జ. బూర్గుల వారు ప్రాతస్మరణీయులు: ప్రాతస్మరణీయులనగానే ఉదయకాలం లేవగానే ఇష్ట దైవాన్ని తలచుకున్నట్లు ఉపయోగపడే వారిని తలచుకుంటారు. న్యాయవాద వృత్తిలో జూనియర్ అయిన పీవీకి అనేకమైన విషయాల పట్ల అవగాహన కలిగించారు. రాజకీయాల లో ఏ విధంగా మసులుకోవాలో బోధించాడు. ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలో తన ప్రత్యర్థుల పట్ల చేసిన మేలులను బట్టి తెలుసుకున్నాడు పీవీ నరసింహారావు. ప్రతి విషయంలో అతనికి మేలు చేసి అతని భవిష్యత్తును తీర్చిదిద్దాడు. అట్లా పీవీ నరసింహారావు గారికి ఎంతగానో ప్రయోజనం చేసిన బూర్గుల రామకృష్ణారావు గారిని ప్రాతస్మరణీయులు అన్నాడు.

2. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జ. బూర్గుల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వం:
శాంతి స్వభావులు: గురుకుల రామకృష్ణారావు గారు శాంతి శాంతికాముకులు. ఇతరులను ద్వేషించేవారు కాదు వారు పొట్టి వారైనప్పటికీ వారు గొప్ప  వ్యక్తిత్వం కలిగిన వారు. మిత్రులతోటి స్నేహపూరితమైన వాతావరణంలో ఎన్నో పరిహాసాలు వారే ఆడేవారు. 
అవసరమైతే విరాట్ స్వరూపం:
వారు మృదుస్వభావి అయినప్పటికీ అవసరాన్ని బట్టి వామనుని తీరు వ్యవహరించేవారు.

న్యాయవాదిగా... బూర్గుల వారి న్యాయవాద ప్రాక్టీసు క్షణం తీరిక లేనిది తన క్లైంట్లతో ఓపికతో వ్యవహరించేవారు అనన్య శక్తి సామర్థ్యాలతో తన జాజ్వలమానమైన ప్రతిభాపాటవాలను చూపుతూ ఎదుటివారిని దుర్యోధ్యమైన కంచుగోడలుగా నిలవడం అందరికీ సుపరిచితమే.

ఇతరులకు ప్రోత్సాహం: తన వద్ద పనిచేసే జూనియర్ న్యాయవాదులకు గుమస్తాలకు ఎంతో ప్రోత్సాహము ఇచ్చేవారు. రాజకీయాలలో తనకంటే తక్కువ స్థాయి నేతలతో ప్రజలతో సత్సంబంధాలను కలిగి వారి బాగోగులను తెలుసుకునేవారు. కౌలుదారి చట్టం తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు వారు కారకులు అయ్యారు. మంచిదక్షిత తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడంలో వారికి వారే సాటి.

సౌజన్యానికి మారుపేరు: రామకృష్ణారావు గారు సుగుణాల మూర్తిమత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వారి వద్దకు ప్రభుత్వ పెద్దలు కుచ్చుటోపిల మౌళిలు, గడ్డాల ముల్లాలు, తలపాగ పండితులు, మహా మహా ఉపాధ్యాయులు, గాంధీ టోపీల వారు,... అన్ని రకాల వారు వారితో కలివిడిగా ఉండేవారు. వారంటే ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకుంటారు. 
బహుభాషా వేత్త: తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్న రామకృష్ణారావు గారు సంస్కృతిక చారిత్రక తెలుగు రాసిన కావ్యాలను అధ్యయనం చేసేవారు. 

లేదా
ఆ) నేనెరిగిన బూర్గుల పాఠం ఆధారంగా "గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది" అనే అంశం గురించి సమర్థిస్తూ రాయండి.
జ. గొప్పవారు సాంగత్యం వల్ల గొప్ప స్ఫూర్తి కలుగుతుంది.
గొప్ప వారితో ఉంటే గొప్ప లక్షణాలే అలవాడతాయి. పూల విలువ దారానికి లేదు.  పూలు తలకెక్కుతాయి పూలతో పాటు దారం తలకెక్కుతుంది. ఆ విధంగానే బూర్గుల రామకృష్ణారావు గారి ఉత్తమ వ్యక్తిత్వం వలన పీవీ నరసింహారావు గారు తన జీవితాన్ని సరిపడా తర్ఫీదు పొందారు. భారతదేశాన్ని ప్రగతి మార్గంలో పయనింపజేశారు. 

3. సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి.
అ)పాఠంలోని పదజాలం విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జ. పొట్టితనం ముందు పొడగరితనం అల్పమవుతుంది
విశిష్ట లక్షణాలు విశ్వమంతా వ్యాపిస్తాయి
ధర్మాగ్రం విరాట్ రూపం అయితే  
అధర్మం వాడిపోతుంది
న్యాయాన్ని వాదించేవాడు అన్యాయాన్ని వేధిస్తూనే ఉంటాడు
ప్రోత్సాహం ఒక సమ్మోహనం 
టన్నుల కొద్ది ఆత్మవిశ్వాసం నింపి భవిష్యత్తుకు బాటలేస్తుంది మనిషిలోని సౌజన్యత మహోన్నతునిగా తీర్చుతుంది అధ్యయనం బహుభాషా వేత్తగా మార్చి 
పాండిత్యం పరిణవిల్ల చేస్తుంది అపకారికి ఉపకారి అసలైన వ్యక్తిత్వంగా 
ఆరాధనల అందుకుంటుంది
అజరామరం అవుతుంది

ఆ)ఈ పాఠం ఓ అభినందన పత్రము గా ఉంది కాదు దీని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తుల గురించి అభినందన వ్యాసం రాయండి.
జ. నాకు నచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్
కడుగు జాతులు కటిక చీకట్లో ఉన్నప్పుడు ఉదయించే సూర్యుడు చీకట్లోంచి పుట్టిన జ్ఞానమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
పుడుతూనే వెల్తురు వెలుగులు వెదజల్లినట్లు ప్రతిభతో పాఠశాలను గ్రామాన్ని ఉపాధ్యాయులను పరవశింపజేశారు. పుస్తకాలను చదివినట్టే సమాజాన్ని మనుషులను అంతరాలను అంచనా వేశారు. ఈ సమాజాన్ని మార్చాలంటే తానే చదువుకోవాలని సిద్ధపడ్డాడు. ఏ వైపు తిరిగిన ఆ వైపు కుల వివక్ష ఎదురయింది. చుట్టూ ఆవరించి ఉన్న పేదరికంలోంచి లేని ఆత్మగౌరవాన్ని కలగన్నాడు. రోజుకొక పూట భుజిస్తూ రాత్రింబవళ్లు కంట్లో వత్తులు పెట్టుకొని చదివా డు. ప్రయోజకుడు అయ్యాడు. మానవులంతా సమానమని ఎలుగెత్తి చాటాడు. జ్ఞానముొక్కరి సొత్తు కాదని, అందరూ గొప్పవారేనని ఆలోచింపజేశారు.  మనిషి ఒక ఓటు ఓటుకు ఒక విలువ అని సమానత్వాన్ని ప్రతిపాదించాడు. ఆమోదింప చేశాడు. హుహనా వాదన పటిమకు మేదస్సుతో అనేక మందిని మెప్పించాడు. నాయకులను ఒప్పించాడు. అనుకున్నది సాధించాడు బలహీనుల బలమైన గొంతుకయ్యాడు. హక్కులు కల్పించాడు బాధ్యతలను కూడా నేర్పాడు రాజ్యాంగాన్ని అందించి సువిశాల భారతదేశానికి మార్గదర్శనం చేశాడు.  (


III. భాషాంశాలు :
పదజాలం:
1.  కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) ముప్పిరి = జ్ఞాపకాలు అల్లుకోవడం
ఆ) వీసమెత్తు = ఒక చిన్న కొలత
ఇ) కడగొట్టు =చిట్టచివరి
ఈ) ప్రాభవం=గొప్పతనం
ఉ) ప్రాతస్మరణీయుడు = ఉదయకాలం లేవగానే గుర్తు చేసుకునే లక్షణం కలవాడు
ఊ) హితైషి = మేలుకోరేవాడు

2.  కింది జాతీయాలను మీ సొంత వాక్యాలలో ప్రయోగించండి.
అ)శ్రీరామరక్ష - నాకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం =శ్రీరామరక్ష
ఆ)గీటు రాయి - నా జీవితంలో ఓ ప్రధానోపాధ్యాయులు మెచ్చడం మర్చిపోలేని గీటురాయి
ఇ)రూపుమాపడం నాలోని దురలవాట్లను రూపుమాపుకుంటాను.
ఈ) కారాలు మిరియాలు నూరడం నేను అనవసరంగా ఇతరుల మీదికి కారాలు మిర్యాలు నూరను.
ఉ) స్వస్తి వాచకం ఈరోజు నుండి నాకు ఇష్టమైన చాయ్ కి క స్వస్తి వాచకం పలుకుతున్నాను.

3. కింది వాక్యాలలో పర్యాయపదాలు గుర్తించండి.
అ)సాలు, వర్షం, సంవత్సరం
ఆ) భూమి, ధరిత్రి, అవని
ఇ) దక్షత, సామర్థ్యం

4. ప్రకృతి వికృతులు
అ)దవ్వు - దూరం
ఆ)గారవం గౌరవం
ఇ)పగ్గె/పగ్గియ = పగ
ఈ)దోసం- దోషం
ఉ)రాతిరి - రాత్రి 
ఊ)బాస- భాష

5. వృత్తులు - ప్రత్యేక లక్షణాలు
1. ఉపాధ్యాయ వృత్తి - నిరంతర అధ్యయనము బోధన
2. వైద్య వృత్తి - నిరంతరము చికిత్స అధ్యయనం
3. కులవృత్తులు - నైపుణ్యంగా చేయడం

వ్యాకరణాంశాలు:
కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
విమానాశ్రయం - విమాన  ఆశ్రయం సవర్ణదీర్ఘ సంధి
ఆ) జ్ఞాపకముడడము - జ్ఞాపకము+ ఉండడము - ఉత్వ సంధి
ఇ) శరీరాకృతి = శరీర + ఆకృతి సవర్ణదర్ఘ సంధి
ఈ) మహోన్నత= మహా + ఉన్నత -గుణ సంధి
ఉ) జీవితాన్నంత = జీవితాన్ని + అంతా - ఇకార సంధి 
ఊ) చెప్పినప్పటికీ=  చెప్పిన + అప్పటికి అత్వ సంధి
ఋ) ఒక్కొక్క= ఒక్క+ఒక్క - ఆమ్రేడిత సంధి.

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహ వాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదాహరణ సత్యదూరము సత్యమునకు దూరము - షష్టి తత్పురుష సమాసం
అ)అమెరికా రాయబారి - అమెరికా యొక్క రాయబారి - షష్టితత్పూర్ష సమాసం
ఆ) వాదనాపటిమ- వాదన యందు పటిమ - సప్తమి తత్పురుష సమాసం 
ఇ) అసాధ్యము - సాధ్యము కానిది - నైన్ తత్పురుష సమాసం.
ఉ) నెలతాల్పు - నెలను ధరించిన వాడు- ద్వితీయ తత్పురుష సమాసం 
ఊ)గురుదక్షిణ - గురువుకు దక్షిణ- తృతీయ తత్పురుష సమాసం 
ఋ) వయోవృద్ధుడు - వయసు చేత వృద్ధుడు - తృతీయ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు -  రెండు సంఖ్యల గల రాష్ట్రాలు - ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్థ్యాలు- శక్తియును, సామర్థ్యమును - ద్వంద సమాసం 
ఏ) అమూల్య సమయం - అమూల్యమైన సమయం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఐ) పూర్ణ పురుషులు - పూర్ణులైన  పురుషులు విశేషణ పూర్వ గల కర్మధారయ సమాసం
ఒ)ప్రాచీనమైన కావ్యాలు - ప్రాచీనమైన కావ్యాలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఓ)పెద్ద కుటుంబం - పెద్దదైన కుటుంబం -విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

3. ఇది సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి.
అ)పూనాలోని పెరుగుసన్ కాలేజీలో చేరాడు.
 పర్షియన్ భాషను చదివాడు.
 ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జ. పూనాలోని పెరుగు సన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.

ఆ)బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు. 
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జ. బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామర కీర్తిని పొందాడు.

నమస్కారం