సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

ధ్వని పరిణామం- నిర్వచనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధ్వని పరిణామం- నిర్వచనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2023, ఆదివారం

ధ్వని పరిణామం

ధ్వని పరిణామం- నిర్వచనం

• ధ్వనుల స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్ఛారణ విధానాన్ని తెలిపేది ధ్వని విజ్ఞానం. • ఒక భాషలో ఉన్న ఒక ధ్వనులు తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు. • భాషలోని పదాల్లో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడాన్ని శబ్ద పరిణామం లేదా ధ్వని పరిణామం అంటారు. • ధ్వని పరిణామాన్ని ఆంగ్లంలో Phonetic Change అంటారు.

ధ్వని పరిణామం – భేదాలు
వ‌ర్ణ సమీకరణం: సమీకరణం అంటే కూడిక. రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని వర్ణ సమీకరణం అంటారు. ఇది రెండు రకాలు. అవి.

పూర్వ వర్ణ సమీకరణం: దీనికి ఉదాహరనలు – ఉదా:

గది+లు = గదులు
పది+లు = పదులు
ములికి+లు = ములుకులు
పలికి+లు= పలుకులు
పర వర్ణ సమీకరణం: దీనికి ఉదాహరణలు – ఉదా:

గది+కు = గదికి
మది+కు = మదికి
వాని+కు = వానికి
నది+కు = నదికి
వర్ణ విభేదం
ఒకే ధ్వనిని గాబరా, తడబాటు వల్ల రెండుసార్లు ఉచ్ఛరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదం అంటారు. ఇది వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైంది. ఉదా:

వచించు + ఇంచు = వచింపించు
ఆవులించు+ ఇంచు = ఆవులింపించు
చూచు + ఇంచు = చూపించు
వర్ణ సమ్మేళనం
అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందడమే వర్ణ సమ్మే ళనం. దీనినే వర్ణ సంయోగం, వర్ణ సంయోజనం అని కూడా అంటారు.

వర్ణ వ్యత్యయం
ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడమే వర్ణ వ్యత్యయం. దీన్నే స్థాన పరివర్తనం, అక్షర విపర్యం అని కూడా అంటారు. ఉదా:

నవ్వులాట – నవ్వుటాల
వారణాసి – వాణారసి
తమాషా – షాతమా
జగదొంగ – గజదొంగ
పారువం – పావురం
పలుచన – చలుపన
గమనించు – మంచుగని
మోటతోలాలి – తోటమోలాలి
వర్ణాగమం
సామ్యం వల్ల, ప్రామాణికం కాదనే భావంతో కొత్త వర్ణాలు.. పదాల్లో చేరడాన్ని వర్ణాగమం అంటారు. దీన్నే వర్ణాధిక్యం అని కూడా అంటారు. ఉచ్ఛారణలో ఏదో కొరత ఉన్నట్లు భావించడం వల్ల ఇలాంటి ఆధిక్యత ఏర్పడుతుంది.

ఉదా:

కోలాటం – కోలాటకం,
దొంగాటం – దొంగాటకం,
నడిరేయి – నడికిరేయి,
వేగుచుక్క – వేగురుచుక్క.
వర్ణ లోపం
ఒక పదం చివర వచ్చిన హల్లు, మరొక పదం మొదట వచ్చినప్పుడు, మొదటిది లోపించడాన్ని వర్ణ లోపం అంటారు. దీన్నే సవర్ణ లోపం, అక్షర లోపం, వర్ణ నాశనం, హల్లోపం అంటారు.

ఉదా:

నిప్పు + పుల్ల = నిప్పుల్ల
రెప్ప + పాటు = రెప్పాటు
కంచు + చెంబు = కంచెంబు
రెప్ప + పోటు = రెప్పోటు
అజాదిత్వం
కొన్ని హల్లులకు ముందు ఉచ్ఛారణలో అచ్చు చేర్చి పలకడాన్ని అజాదిత్వం అంటారు. దీన్నే స్వర ప్రారంభం అని కూడా పిలుస్తారు.

ఉదా: రథం – అరదం

స్కేలు – ఇస్కేలు

స్కూలు – ఇస్కూలు

స్కూటరు – ఇస్కూటరు

హోళిగ – ఓళిగ

స్వరభక్తి
భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని స్వరభక్తి అంటారు. దీన్ని విప్రకర్ష, వికర్ష అని కూడా వ్యవహరిస్తారు. ఉదా:

తర్వాత – తరువాత
మర్యాద – మరియాద
రాత్రి – రాతిరి
పర్వము – పరువము
పల్చన – పలుచన
అల్పము – అలుపము
నిద్ర – నిద్దుర
కల్పము – కలుపము
లగ్నం – లగనము
చంద్రుడు – చందురుడు
తాలవ్యీకరణం
మూలద్రావిడ భాషలోని పదాది ‘క’ కారానికి తాలవ్యాచ్చులు పరమైనప్పుడు ‘చ’ వర్ణంగా మారుతుంది. ఇలా ‘క’ కారం ‘చ’ కారంగా మారడాన్ని తాలవ్యీకరణం అంటారు. ఉదా:

కివి – చెవి, కిళి – చిలుక, కెంపు – చెంపు
కై – చేయి, కెందొవ – చెందొవ, కెఱయ్ – చెఱయ్.
లోప దీర్ఘం
ఉచ్ఛారణలో ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వ స్వరం దీర్ఘమవుతుంది. దీన్నే లోప దీర్ఘం లేదా లోప దీర్ఘత అంటారు. ఉదా:

గుర్రములు – గుర్రాలు
చివుకు – చీకు
కంచములు – కంచాలు
వజ్రములు – వజ్రాలు
ముత్యములు – ముత్యాలు
బలపములు – బలపాలు.
అనుచిత విభాగం
పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని అనుచిత విభాగం అంటారు. ఉదా:

కిళి + కళ్ = చిలుకలు (చిలుక +లు)
ఎళి + కళ్ = ఎలికలు (ఎలుక+లు)
ఈగలు, గొడుగులు, ఏనుగులు, కొల కులు, బల్లలు.
ద్విత్వ కల్పనం
కొన్ని పదాల్లో ద్విత్వం లేకపోయినా కల్పించి చెప్పడాన్ని ద్విత్వ కల్పనం అంటారు. ఉదా:

తలక్రిందులు – తల్లక్రిందులు
పడిన – పడ్డ, కొనిన – కొన్న, కలదు – కద్దు
తలడిలు – తల్లడిల్లు
తలమునకలు – తల్లమునకలు
తెలవారు – తెల్లవారు
వలదు – వద్దు

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...