సమయం : 10-00 10-45
- III బోధన-అభ్యసన
ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు
- భాషా ప్రాధాన్యత తగ్గడం
- ఇంగ్లీష్ మాధ్యమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులు తెలుగును రెండవ స్థాయిలో మాత్రమే భావిస్తున్నారు.
- ఇంటి, సమాజం,
సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో తెలుగు తక్కువగా ఉండటం.
- సరైన బోధనా పద్ధతుల లోపం
- గురువులు సాంప్రదాయ బోధన విధానాలకే పరిమితం కావడం.
- సృజనాత్మక పద్ధతులు,
కథలు, పాటలు, నాటికలు వంటి ఆసక్తిదాయకమైన పద్ధతుల కొరత.
- అభ్యాస పట్ల నిర్లక్ష్యం
- విద్యార్థులు తెలుగులో చదవడం,
రాయడం పట్ల ఆసక్తి తగ్గడం.
- కేవలం పరీక్షల కోసమే నేర్చుకోవడం.
- పాఠ్యపుస్తకాల కష్టతరత
- చిన్న వయసులోనే క్లిష్టమైన పదజాలం,
వ్యాకరణం పరిచయం చేయడం వల్ల భయం కలగడం.
- సాంకేతిక పరిజ్ఞాన వినియోగం లోపం
- తెలుగు భాష బోధనలో డిజిటల్ పద్ధతులు (ఆడియో,
వీడియో, యాప్స్, గేమ్స్) వాడకం తక్కువగా ఉండడం.
- తల్లిదండ్రుల సహకారం లోపం
- చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లీష్పై దృష్టి పెట్టి తెలుగును నిర్లక్ష్యం చేయడం.
- ఇంటిపని, బావిపని,.....
- బడికి రాడు,
సదువడు, రాయడు, చెప్పాడు.
- పరిష్కార మార్గాలు
- భాషా ప్రాధాన్యత పెంపు
- పాఠశాలల్లో, కుటుంబంలో తెలుగు మాట్లాడే వాతావరణాన్ని ప్రోత్సహించడం.
- తెలుగు దినోత్సవాలు,
పోటీలు, కవితా వాచనాలు నిర్వహించడం.
- ఆకర్షణీయమైన బోధన విధానాలు
- కథలు, పాటలు,
నాటికలు, పద్యపఠనాలు వాడటం.
- సృజనాత్మక రాత,
కవిత్వ రచన,
పాత్రధారణ ద్వారా ఆసక్తి కలిగించడం.
- సులభమైన పాఠ్య ప్రణాళిక
- వయస్సుకు తగిన పదజాలం,
వ్యాకరణం పరిచయం చేయడం.
- క్లిష్టమైన భావాలను ఉదాహరణల ద్వారా సులభతరం చేయడం.
- సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
- తెలుగు నేర్చుకునే యాప్స్,
ఈ-పుస్తకాలు,
యూట్యూబ్ వీడియోలు వాడకం.
- డిజిటల్ గేమ్స్,
క్విజ్లు ద్వారా పదజాలం అభివృద్ధి.
- తల్లిదండ్రుల సహకారం
- ఇంట్లో పిల్లలతో తెలుగు మాట్లాడటం.
- పిల్లల కథలు వినడం,
పుస్తకాలు చదవమని ప్రోత్సహించడం.
- ప్రయోగాత్మక అభ్యాసం
- వ్యాసరచన, ప్రసంగం,
చర్చలు, వాదనలు నిర్వహించడం.
- u విద్యార్థులను సాహిత్య సదస్సులు,
జానపద కార్యక్రమాలలో పాల్గొనమని ప్రోత్సహించడం.
------------------------------------------------------------------------------------------------------------------------IV. మధ్యాహ్నం 11.00-12.00
రాబోయే నెలలో కవర్ చేయబోయే పాఠాల నుoడి సోపానాలు & భావనలను ఎంచుకోవడం, బోధనా దశలపై చర్చ. ppt
Discussion on teaching steps selecting concepts from thelessons to be covered in the upcoming month PPT
పై లింక్ నొక్కి పాఠం steps / సోపానాలు వివరించవచ్చు...
పాఠం - పీరియళ్ళ వారీ విభజన – బోధనాంశాలు
పీరియడ్ సంఖ్య | బోధనాంశం |
|
1 | ఉన్ముఖీకరణ , పాఠం నేపథ్యం/ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవిపరిచయం |
|
2 | విద్యార్థులకు సూచనలు, ప్రవేశిక, (అర్థ సంగ్రహణం) |
|
3 | పాఠ్యాంశం - 1 |
|
4 | పాఠ్యాంశం - 2 |
|
5 | పాఠ్యాంశం - 3 |
|
6 | చదువడం – రాయడం నేర్పడం / అభ్యాసం ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు |
|
7 | చదువడం – రాయడం నేర్పడం / అభ్యాసం ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు |
|
8 | ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం |
|
9 | స్వీయరచన (లఘుసమాధాన ప్రశ్నలు) |
|
10 | స్వీయరచన (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు) |
|
11 | సృజనాత్మకత |
|
12 | సృజనాత్మకత |
|
13 | పదజాలం |
|
14 | వ్యాకరణాంశాలు |
|
15 | ప్రాజెక్టు పని |
|
-------------------------------------------------------------------------------------------------------------
IV LIP ప్రభావవంతమైన అమలు కోసం విద్యార్థులు గ్రంథాలయాలను ఎలా ఉపయోగించుకోవాలి? PPT
స్కిమ్మింగ్ చేయడం (Skimming): పారాగ్రాఫ్ ల ప్రధాన ఆలోచనను కి వేగంగా చదవడం. దీనిలో ప్రతి పదాన్ని చదవకుండా ముఖ్యమైన పదాలు మరియు పదబంధాలపై దృష్టి పెడతారు.
స్కాన్ చేయడం (Scanning): నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడానికి టెక్స్ట్ ద్వారా వేగంగా వెతకడం.
యాక్టివ్‌గా చదవడం (Active Reading): చదువుతున్నప్పుడు ఆలోచించడం, ప్రశ్నలు అడగడం, ముఖ్యమైన పాయింట్లను గుర్తించడం మరియు సంగ్రహించడం. ఇది మీ అవగాహనను పెంచుతుంది.
సమీక్షించడం (Reviewing): చదివిన తర్వాత, మీరు చదివిన వాటిని గుర్తుంచుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి సమీక్షించండి. ఇది మీ జ్ఞానాన్ని మరింత దృఢంగా చేస్తుంది.
ఇతర వ్యూహాలను కూడా ఉపయోగించవచ్చు:
క్లిష్టమైన పఠనం (Critical Reading): రచయిత వాదనలను ప్రశ్నించడం, రుజువులను పరిశీలించడం
సారాంశాన్ని రాయడం (Summarizing):
జ్ఞాపకశక్తి పద్ధతులు (Mnemonics):
పఠన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా, మీరు మీ పఠన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు
ఒక స్నేహపూర్వక గ్రంథాలయం కోసం అవసరమైనవి ppt
1. పిల్లలను పుస్తకాలకు చేరువ చేయడం
2. భాషాభివృద్ధి వాతావరణం/ విద్యా వాతావరణం
3. అందుబాటులో నాణ్యమైన బాలసాహిత్యం
4. నిర్ధారిత పఠన కాల నిర్ణయ పట్టిక (కాలాంశం)
5. పఠన కార్యాచరణ ప్రణాళిక
6. ఉపాధ్యాయుల సామర్థ్యం మెరుగుపరుచుటకు శిక్షణ
7. కుటుంబ సభ్యుల భాగస్వామ్యం
8. ప్రభుత్వం పాత్ర
- పఠన అలవాటు పెంపు
• రోజూ కొంత సమయం కథలు, వ్యాసాలు, పద్యాలు చదివే అలవాటు చేసుకోవాలి.
• సులభమైన పుస్తకాలతో మొదలు పెట్టి క్రమంగా క్లిష్టమైన సాహిత్యాన్ని చదవాలి.
- పదజాలం అభివృద్ధి
• కొత్త పదాలను అర్థాలతో పాటు నోటు చేసుకోవాలి.
• పుస్తకాల నుంచి సేకరించిన పదాలను వాక్యాల్లో వాడటానికి ప్రయత్నించాలి.
- రచనా నైపుణ్యాల అభివృద్ధి
• చదివిన కథలను సంక్షిప్తంగా రాయడం.
• పుస్తకాల ఆధారంగా వ్యాసరచన, కవితారచన, సమీక్ష రాయడం.
- ప్రసంగం, పఠనం ప్రాక్టీస్
• కథలు, పద్యాలను పఠించడం ద్వారా ఉచ్ఛారణ, శబ్దస్పష్టత మెరుగవుతుంది.
• గ్రంథాలయంలో చిన్న సమూహ చర్చలు, వాదవివాదాలు నిర్వహించడం.
- సృజనాత్మక అభ్యాసం
• చదివిన కథలను నాటికలుగా, పాత్రధారణగా ప్రదర్శించడం.
• గ్రంథాలయ పుస్తకాల ఆధారంగా క్విజ్లు, భాషా ఆటలు నిర్వహించడం.
- సమయపాలన, స్వతంత్ర అభ్యాసం
• నిర్దిష్ట సమయం కేటాయించి పుస్తకాలను చదివి సారాంశం రాసే అలవాటు చేసుకోవాలి.
• గురువుల సహాయం లేకుండా స్వయంగా చదివి అర్థం చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
•
-------------------------------------------------------------------------------------------------
సమయం : మ. 1-45 2.45
సబ్జెక్టు నిర్దిష్ట ప్రయోగశాలల స్థాపన మరియు వినియోగం ppt
1. ప్రయోగశాల ఏర్పాటులో అవసరమయ్యే అంశాలు
-
తెలుగు భాషపై ప్రేమ, అభిరుచి కల్పించడం.
-
చదవడం, రాయడం, వినడం, మాట్లాడడంలో శైలి పెంపొందించడం.
-
సృజనాత్మకత, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందించడం.
-
పాఠ్యాంశం అవగాహన, అన్వయ సామర్థ్యం పెంచడం.
-
ఫర్నిచర్: టేబుల్స్, కుర్చీలు, బ్లాక్‌బోర్డు, డిస్ప్లే బోర్డు.
-
పరికరాలు: మైక్, స్పీకర్, కంప్యూటర్, ప్రొజెక్టర్, హెడ్‌ఫోన్లు.
-
గ్రంథ సంపద: కథలు, పద్యాలు, వ్యాసాలు, పత్రికలు, నిఘంటువులు.\\
-
దృశ్య–శ్రవణ సాధనాలు (TLMs):
-
చిత్రాలు, మ్యాప్స్, ఫ్లాష్ కార్డులు
-
కథాచిత్రాలు, పోస్టర్లు
-
ఆడియో/వీడియో పాఠాలు
-
ప్రొజెక్టర్/స్మార్ట్ బోర్డ్
-
పుస్తకాలు: కథలు, కవితా సంకలనాలు, వ్యాసాలు, నానుడులు, సామెతలు.
-
ఆడియో-విజువల్ సాధనాలు: రికార్డర్, హెడ్‌ఫోన్లు, ప్రొజెక్టర్, టీవీ, కంప్యూటర్.
-
గ్రాఫికల్ సాధనాలు: ఫ్లాష్ కార్డులు, చిత్రకథలు, భాషా ఆటల చార్టులు.
-
ప్రాక్టికల్ వనరులు: పదకోశం, నిఘంటువు, అక్షరాలు – పదమాల బోర్డులు.
-
ప్రదర్శనలు: ప్రసిద్ధ రచయితల చిత్రాలు, వారి సూక్తులు, సాహిత్య పటం.
-
-
తెలుగు భాషా ప్రయోగశాల నిర్వహణ విధానం
(అ) శ్రవణ నైపుణ్యం (Listening Skills)
- • విద్యార్థులకు కథలు, పద్యాలు, సంభాషణలు వినిపించడం.
- • వినిన తర్వాత ప్రశ్నలు అడిగి సమాధానాలు రాయించడం.పద్యాలు, పాటలు, ప్రసంగాలు రికార్డింగ్ వినిపించడం.
- విద్యార్థులే తమ స్వరాన్ని రికార్డు చేసి వినడం.
(ఆ) వచన ఉచ్చారణ నైపుణ్యం (Speaking Skills)
- • సరైన అక్షరాలు, పదాలు, వాక్యాలు చదివించడం. పద్య పఠనం, సంభాషణాభ్యాసం, వక్తృత్వం చేయించడం.
- • మైక్రోఫోన్ సహాయంతో విద్యార్థుల స్వరాన్ని రికార్డు చేసి వినిపించడం.వాక్చాతుర్యం
- అభ్యాసం, వాదవివాదాలు, డిబేట్ లు .
- పాత్రధారణ (Role play), సంభాషణల ప్రదర్శన
(ఇ) పఠన నైపుణ్యం (Reading Skills)
- సరళమైన పద్యం/గద్యాన్ని ప్రదర్శించి విద్యార్థులు వరుసగా చదివించడం.
- పాఠంలో అర్థం తెలియని పదాలను సేకరించి అర్థాలు చెప్పించడం.
- కవితా పఠనం , కథా పఠనం.
- పాఠ్యపుస్తకం బయట అదనపు పఠనాన్ని ప్రోత్సహించడం.
(ఈ) లేఖన నైపుణ్యం (Writing Skills)
- వినిన/చదివిన విషయాన్ని స్వయంగా రాయమని ఇవ్వడం.
- సరళ వ్యాసరచన, కవితారచన, లేఖారచన చేయించడం.
- సృజనాత్మక రచన: కథలు, పద్యాలు, వ్యాసాలు.
- వార్త రాయడం, ఆహ్వాన పత్రం తయారు చేయడం.
- డిక్టేషన్, శీర్షిక రాయడం.
3. ఉపాధ్యాయుల పాత్ర
- సాంకేతిక పరికరాల వాడకంలో శిక్షణ పొందాలి.
- విద్యార్థుల ఉచ్చారణ, భాషా శైలి లోపాలను గుర్తించి సవరిస్తూ మార్గనిర్దేశనం చేయాలి.
- అభ్యాసానికి ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి.
• 2. పాఠశాలలో నిర్వహణ పద్ధతి
- పదాల ఆటలు (ఉదా: చివరి అక్షరంతో కొత్త పదం).అంత్యాక్షర
పాత్రధారణ (Role Play). ఏకపాత్రాభినయం , ముఖాభినయం.....
-
ప్రక్రియను మార్చడం : వచనాన్ని పద్యంగా, పద్యాన్ని వచనంగా మార్చడం.
-
చిన్న కథను నాటికగా మలచి ప్రదర్శించడం.
ప్రత్యేక కార్యక్రమాలు
"పద్యపఠన పోటీలు"
"కథల పోటీలు""వాక్య నిర్మాణం" వర్క్‌షాప్‌లు
పదబంధాల ఆటలు (అక్షరమాల జత చేయడం, సరస్వతి క్రీడలు).
• (a) తరగతుల వారీగా
• ప్రాథమిక స్థాయి (6–7 వ తరగతులు):
• పదాలు వినిపించి పునరావృతం చేయించడం.
• చిన్న కథలు, పద్యాలు వినిపించడం.
• ఆటల రూపంలో పదజాలం (Vocabulary Games).
• మాధ్యమిక స్థాయి (8–10 వ తరగతులు):
• సంభాషణలు, డైలాగ్లు ప్రాక్టీస్ చేయించడం.
• పఠనం వేగం, ఉచ్చారణ మీద వ్యాయామాలు.
• వ్యాసరచన, లేఖారచన కంప్యూటర్లో రాయించడం.
• (b) ఉపాధ్యాయుని పాత్ర
విద్యార్థి కేంద్రిత విధానంలో అభ్యాసాన్ని నడిపించడం.
• సాంకేతిక పరికరాలను సరిగ్గా ఉపయోగించడం. ముందుగా ఆడియో/వీడియో పాఠాలు సిద్ధం చేయాలి.
భాషా కార్యకలాపాల్లో ప్రోత్సాహకుడుగా ఉండడం.
• ప్రతి విద్యార్థి వినే విధంగా మార్గనిర్దేశం చేయాలి.
• వారి ఉచ్చారణను విని సరిదిద్దాలి.
• వారానికి ఒకసారి ప్రాక్టికల్ టెస్ట్ పెట్టాలి.
మూల్యాంకనం – విద్యార్థి చదవడం, రాయడం, మాట్లాడడం పట్ల నిరంతరం గమనించడం
VII మధ్యాహ్నం 3.00-3.30