సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

20, జనవరి 2026, మంగళవారం

దానవీరశూరకర్ణ డైలాగ్స్

 దుర్యో:- ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము? ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయన దే కులము ?

నాతో చెప్పింతువేమయ్యా , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?



భీష్మ:- నాయనా సుయోధనా! ఏరుల, పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే! క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే! వారిలో రాజ్యమున్న వారే రాజులు! అట్టి యీ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!



దుర్యో:- ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు, అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

సోదరా.. దుశ్శాసనా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; పరిచారకులారా ! పుణ్య భాగీరథీనదీ తోయములనందుకొనుడు; కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు; పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ద సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి వాంఛలురేగ వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజనసమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను.



ప్రతిపదార్ధం:
ఆగాగు - ఆగు, ఆగు
ఆచర్యదేవా - ద్రోణాచార్య
ఏమంటివి - ఏమన్నావు
జాతి నెపమున - నెపము అనగా కారణము.
జాతి నెపము అనగా పుట్టుకులము తక్కువది అని ఎంచిన కారణము చేత.
సూత సుతునికిందు - సారధి యెక్క పుత్రునికి ఇక్కడ
నిలువ - ఉండటానికి
అర్హత లేదందువా - అర్హత లేదన్నావా
ఎంత మాట - ఎంత మాట
ఇది - ఇది
క్షాత్ర పరీక్ష - కళ పైన ఆధిపత్యాన్ని తెలుపుటకు పరీక్ష (test to determine talent or supremacy)
కాని - కానీ
క్షత్రియ పరీక్ష - క్షత్రియుల పరీక్ష (క్షత్రియులకు మాత్రమే పరీక్ష)
కాదే - కాదు కదా
కాదు - కాదు
కాకూడదు - అవ్వ కూడడు
ఇది - ఇది
కుల పరీక్ష - కులము కనుక్కోవడానికి పరీక్ష
అందువా - అన్నవా
నీ - నీ
తండ్రి - తండ్రి, నాన్న
భరద్వాజుని జననమెట్టిది? - (ద్రోణాచార్యుని) తండ్రి భారధ్వజ మహర్షి జననం ఎలాంటిది? (బృహస్పతి మహర్షికి అయిన వదినకి జన్మించారు)
అతి - ఎంతో
జుగుప్సాకరమైన - అసహ్యమైన్ (ఆక్రమంగా)
నీ సంభావమెట్టిది? - నీ జన్మ ఎలాంటిది?/ నీ జననమెలాంటిది?
మట్టి కుండలో - మట్టి కుండలో
పుట్టితివికదా - పుట్టావు కదా
హహ్హ నీది ఏ కులము - (నవ్వుతూ) నీది ఏ కులం
ఇంతయేల - ఇంత ఎందుకు
అస్మత్పితామహుడు - పితామహుడు భీష్ముదు (పితమహా అంటే నాన్నగారి నాన్నగారు) (అస్మ (మన/సొంత) పితామహుడు — (వ్యతిరేకార్థం తస్మ, తస్మదీయ అంటే వ్యతిరేకులు, అవతలి వారు, మాయాబజార్ సినిమా నుంచి ఈ పదాల అర్ధం తెలుసుకోవచ్చు!))
కురుకుల వృద్ధుడైన - కురు వంశ పెద్దవాడైన
శాంతనవుడు - శంతన మహారాజు పుత్రుడు (భీష్ముడు)
శివసముద్రుల - శివుడి
భార్యయగు గంగా - భార్య అయిన గంగ (శివ పురాణం ప్రకారం శివుని భార్య గంగ)
గర్భమున జనిoచలేదా - కడుపున పుట్టలేదా
ఈయన దే కులము ? - ఈయన ది ఏ కులం?
చెప్పింతువేమయ్యా - (నిజాన్ని) నాతో ఎందుకు చెప్పిస్తున్నావు అయ్యా?
మా వంశమునకు - మా వంశానికి
మూలపురుషుడైన - ముఖ్యమైన వ్యక్తి
వశిష్ఠుడు - వసిష్ఠ మహర్షి
దేవవేశ్యయగు - దేవతల లోకం లో వేశ్య (whore) అయిన
ఊర్వశీపుత్రుడు - ఊర్వశి (అప్సరస) పుత్రుడు
ఆతడు - అతను
పంచమజాతి కన్యయగు - తక్కువ జాతి కన్య అయిన
అరుంధతియందు శక్తిని - అరుంధతి తో శక్తిని (కనలేదా?)
(అరుంధతి కథ శివ పురాణంలో చెప్పారు: అరుంధతి పూర్వ జన్మలో సంధ్య అనే పేరు గల బ్రహ్మ దేవుడి పుత్రిక. కానీ కామ దేవుడి ప్రభావం వల్ల సంధ్యకి, బ్రహ్మ దేవుడికి ఇద్దరికి ఒకరి పై ఇంకొకరికి కోరిక కలిగింది. దీని కారణం తానే అనుకుంటూ సంధ్య బాధ పడుతూ పర్వత ప్రాంతాలకు తపస్సుకు వెళ్ళిపోతుంది. కానీ సంధ్యకి తపస్సు చేసే పద్ధతి తెలియదు. ఈ విషయం తెలిసిన బ్రహ్మ దేవుడు వశిష్ఠ మహర్షిని సంధ్యకి తపస్సు చేసే విధానం చెప్పడానికి పంపిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో శివుడికి తపస్సు చేసింది సంధ్య. ఆ తపస్సు ఫలించి, శివుడు ప్రత్యక్షం అయ్యాడు. శివుడు సంధ్యని మేధాతిథి అనే మహర్షి చంద్రభాగా నది ఒడ్డున చేస్తున్న యజ్ఞం దగ్గరికి వెళ్లు, నా కృప చే నువ్వు అతని పుత్రికగా జన్మిస్తావు. ఎంతో గొప్ప గుణం కలిగిన వ్యక్తిని పతిగా పొందుతావు అని దీవిస్తాడు శివుడు. ఇక్కడ పంచమజాతి కన్య అనే విశేషణానికి అర్ధం నాకు సరిగ్గా కనిపించలేదు. బహుశా సొంత తండ్రి పైనే కోరిక కలగడం వలన అలా అన్నారేమో అని సందేహం. దీని పై ఎవరైనా చర్చించవచ్చు).
(ఈ విషయం పైన Satagopam Mitti Mohan గారు చెప్పిన ఒక మాట సమంజసంగానే ఉంది:
ముఖ్యముగా 'వర్ణములు' నాలుగు. అవి బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్రులు.
(భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణం
మయాసృష్టం, గుణకర్మ విభాగస్య - అంటే, గుణము మరియు చేయుపనిని బట్టి ఈ నాలుగువర్ణములను ఏర్పరిచితిని ఆన్నాడు).
ఈ నాలుగు వర్ణములకంటే తక్కువైన వారిని పంచములు అని అంటారు.
నాలుగు వర్ణాల వారి కంటే తక్కువ జాతి వారిని "పంచమజాతి" అనడం బాగానే ఉంది.
ఏదైనా అన్ని అర్ధాలు ఇక్కడ చెప్పే విషయం తక్కువ/హీనమైన జాతి అని.
ఈ విషయం గూర్చి చెప్పినందుకు Satagopam Mitti Mohan గారికి నా ధన్యవాదాలు!)
ఆశక్తి - శక్తి
ఛండాలాంగనయందు పరాశరుని - ఛండాలాంగన తో పరాశర మహర్షిని (కనలేదా?)
ఆ పరాశరుడు - పరాశరుడు
పల్లెపడుచైన - పల్లెటూరి పిల్ల అయిన
మత్స్యగంధియందు - మత్స్యగంధి (సత్యవతి) తో
మా తాత వ్యాసుని - మా తాతగారు (వేద) వ్యాసుడిని (కనలేదా?)
ఆ వ్యాసుడు - వ్యాస మహర్షి
విధవరాండ్రైన మా - విధవరాళ్ళైన (బహు వచనం) మా
పితామహి - నానమ్మ
అంబికతో మా తండ్రిని - అంబిక తో మా తండ్రిని (ధృతరాష్ట్రుడిని) (కనలేదా?)
పినపితామహి - పిన నానమ్మ
అంబాలికతో మా పినతండ్రి పాండురాజును - అంబాలిక తో మా పిన తండ్రి పాండురాజుని (కనలేదా?)
మా ఇంటిదాసితో - మా ఇంటి దాసీ తో
ధర్మనిర్మాణచణుడని - ధర్మ నిర్మాతగా (ఎల్లప్పుడూ ధర్మాన్ని చెప్పి, పాటించే వ్యక్తి అని)
మీచే - మీ అందరి చేత
కీర్తింపబడుచున్న - పొగడ్తలు పొందుతున్న
ఈ విదురదేవుని కనలేదా?- ఈ విదురుడుని కనలేదా?
సందర్భావసరములనుబట్టి - సందర్భము, అవసరాన్ని బట్టి (పరిస్థితులు మరియు అవసరాలకు అనుగుణంగా /కావలిసిన విధంగా)
క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన - ప్రదేశాన్నిబట్టి మారే ప్రాధాన్యతలతో (priorities that vary with the situation/place) ఉన్న
మా కురువంశము - మా కురువంశం
ఏనాడో - ఎప్పుడో
కులహీనమైనది - కులహీనమైంది
కాగా - అయితే
నేడు - ఈరోజు
కులము - కులం
అను - అని
వ్యర్ధవాదమెందులకు? - అనవసర వాదమెందుకు?
(భీష్ముదన్నాడు)
నాయనా సుయోధనా - నాయనా దుర్యోధనా
ఏరుల పారుల - ఏరులు ఎలా ఎటు పారతాయో మనం నిర్ణయించం కదా అని చెప్పటం
బ్రహ్మర్షుల - మహర్షుల
జననములు - పుట్టుకలు
మనము - మనం
విచారించదగినవికావు - విచారించాల్సిన పని లేదు/విచారించుటకు తగినవి కావు
ఇది - ఇది
నీవన్నట్లుగా - నువ్వు చెప్పినట్టు గా
ముమ్మాటికీ - ఎప్పటికి
క్షాత్ర పరీక్షయే - ప్రతిభా ప్రదర్శనే
క్షాత్రమున్నవారెల్లరూ - ప్రతిభ, ఆధిపత్యం ఉన్నవారందరూ
క్షత్రియులే - క్షత్రియులే
వారిలో - వారిలో
రాజ్యమున్న వారే రాజులు - రాజ్యమున్న వాళ్లే రాజులు
అట్టి యీ - అలాంటి (వాళ్లే) ఈ
కురురాజ పరిషత్తులో - కురు రాజ్యం యొక్క పరిషత్తు లో (council)
పాల్గొనుటకు అర్హులు - పాల్గొనడానికి అర్హత ఉన్న వారు
(దుర్యోధనుడన్నాడు)
ఓహో! - ఓహో!
రాచరికమా - రాజు గా ఉండటమా, రాజ్యాన్ని పొందటమా (Is it Monarchy)
అర్హతను - అర్హతని
నిర్ణయించునది - నిర్ణయించేది (?)
అయిన - అయినా
మాసామ్రాజ్యములో - మా (కురు) సామ్రాజ్యంలో
సస్యశ్యామలమై - సస్యశ్యామలమైన (with prosperity)
సంపద్గ్రామమై - సంపదలతో నిండి
వెలుగొందు - వెలిగిపోతున్న
అంగరాజ్యమునకిప్పుడే - అంగరాజ్యానికి ఇప్పుడే
ఈతని - ఇతన్ని
మూర్ధాభిషిక్తుని - పట్టాభిషక్తుని, అంటే అధికార రాజా సింహాసనం మీద కూర్చోబెట్టి, అధికారం కట్టబెట్టడం
గావించుచున్నాను - చెయ్యబోతున్నాను/చేస్తాను
సోదరా.. దుశ్శాసనా! - తమ్ముడా.. దుశ్శాసనా!
అనర్ఘనవరత్న ఖచిత - ఎలాంటి లోపాలు లేని, అందమైన నవరత్నాలు కలిగిన
కిరీటమును - కిరీటాన్ని
వేగముగ - తొందరగా/వేగంతో/వెను వెంటనే
తెమ్ము - తీసుకురా!
గాంధారసార్వభౌమా - గాంధార రాజ్య మహారాజా! (శకుని)
సురుచిరమణిమయమండిత - ఎప్పటికీ అందముగా, రమణీయంగా (చూడగానే ఓహో అనే విధంగా), ఆకర్షణీయంగా ఉండే రకరకాల మణి మాణిక్యాలతో అలంకరించి ఉన్న (ఈ పదం సురు, చిర, రమణీయ, మణిమయ, మండిత పదాల సమాహారం)
సువర్ణ - బంగారు
సింహాసనమును - సింహాసనాన్ని (the throne)
తెప్పింపుము - తెప్పించండి
పరిచారకులారా! - సేవకులారా (పరిచర్యలు చేసే ఆడ , మగ , ఎవరైనా)
పుణ్య భాగీరథీనదీ - ఎంతో పుణ్యమైన భాగీరథీ (భగీరధుడు సృష్టించిన — గంగా నది) నది
తోయములనందుకొనుడు - నీళ్లను/జలములను అందుకోండి
కళ్యాణభట్టులారా! - కళ్యాణ మేళతాళాలు వాయించే వారు
మంగలతూర్యారవములు - మంగళకరమయిన మేళతాళాలు, నాదాలు (మంగళవాయిద్యాలు)
సుస్వరముగ - స్వర తప్పులు లేకుండా/మంచి స్వరముతో
మ్రోగనిండు - మ్రోగించండి/వాయించండి
వంధిమాగధులారా! - చెప్పింది చెప్పినట్టు చేస్తూ, పొగుడుతూ, సపర్యలు చేసే, ఆజ్ఞలు పాటించే, సేవక గణాన్ని పిలుస్తూ/హెచ్చరిస్తూ
కర్ణ మహారాజును - కర్ణ మహారాజుని (పట్టాభిషేకం చెయ్యకపోయినా, దుర్యోధనుడి మనసులో కర్ణుడు మహారాజే కాబట్టి ఈ సంబోధన)
కైవారము గావింపుడు - చుట్టూ/దరి చేరండి/ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆదేశం (కైవారం అంటే ప్రహరీ, చుట్టూరా)
పుణ్యాంగనలారా! - (పరిచారికలను ఉద్దేశించి) ఎంతో పుణ్యం చేసుకున్న మహిళ్ళారా
ఈ - ఈ
రాధాసుతునకు - రాధ యొక్క పుత్రుడికి (కర్ణుడు జ్యేష్ఠ కుంతీపుత్రుడు అయినప్పటికీ రాధా-అధిరథుల కొడుకు గా కురు రంగభూమికి వస్తాడు కాబట్టి)
పాలభాగమున - నుదిటి భాగాన (on the forehead)
కస్తూరీతిలకము - కస్తూరి కలిపిన తిలకం (కస్తూరి అనబడే కాయ నుండి తీసి కలిపిన సుగంధ ద్రవ్యం)
తీర్చిదిద్ది - కళాత్మకంగా దిద్ది (పెట్టి)
బహుజన్మసుకృత - ఎన్నో జన్మల నుండి చేసుకున్న
పరీపాకసౌలబ్ద - పుణ్యఫల కృషీతో పొందిన/లభించిన
సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి - సహజమయిన కవచం (shield) తొడగబడి వైడూర్య కిరణాలులాగా పొద్దుట పూట మెరిసిపోయే సూర్య అంశతో ఉన్న కర్ణునికి (కర్ణుడు సూర్యపుత్రుడు కాబట్టి)
వాంఛలురేగ - (అధికారం పై) కోరికలు కలిగేలాగ
వీరగంధము - వీరగంధం (వీరునికి నుదిటిన అద్ధే సువాసన/పరిమళభరిత గంధము)
విదరాల్పుడు - చిలికించండి (sprinkle)
నేడీ - నేడు ఈ (రోజు)
సకలమహాజనసమక్షమున - జనులందరి సమక్షంలో
పండిత పరిషన్మధ్యమున - పండితులందరి ముందు
సర్వదా - ఎప్పటికీ
సర్వథా - ఎన్నటికీ
శతథా - వందల
సహస్రథా - వేల సంవత్సరాలకి (యుగ యుగాలకి అనే అర్ధంలో)
ఈ - ఈ
కులకలక - కులమనే మచ్చని
మహాపంకిలమును - మహా ఛండాలన్నీ/మురికినీ
శాశ్వతముగా - ఎప్పటికీ (లేకుండా)
ప్రక్షాళనము - సమూలంగా తీసివేయుటం/మార్చివేయటం/విడగొట్టటం
గావించెదను - చేస్తాను
దుర్యోధనుడు తర్వాత రాజులే దీనికి అర్హులైతే, ఇప్పుడే సస్యశ్యామలంగా సంపదలతో వెలుగుతున్న అంగరాజ్యానికి ఇప్పుడే కర్ణుడిని పట్టాభిషిక్తుడిని చేస్తానని ప్రచారం చేస్తాడు.
దుశ్శాసణున్ని నవరత్నాలతో, వజ్ర వైఢూర్యాలతో అందంగా అలంకరించిన కిరీటాన్ని తెమ్మంటాడు, శకుని ని (గంధర్వసర్వభౌమ అని సంబోధిస్తాడు) బంగార సింహాసనాన్ని తెమ్మంటాడు, పుణ్య గంగ భగీరథి జలములను ఏర్పాటు చేయిస్తాడు, నుదుటి పై కస్తూరి తిలకం దిద్దామంటాడు, మంగళ వాయిద్యాలు వాయిస్తూ కర్ణుడిని పొగడమని అదేశిస్తాడు. సకల మహాజనుల మధ్యలో, పండితుల సమక్షంలో, కర్ణుడిని "అంగ రాజుగా" కీర్తిస్తాడు. అక్కడే కర్ణుడికి ఎంతో ఘనంగా పట్టాభిషేకం చేస్తారు.
ఈ సంభాషణ సుయోధనుడికి (దుర్యోధనుడికి) మరియు ద్రోణాచార్యునికి జరుగుతుంది. ఇది మహాభారతం లో చాలా ముఖ్య ఘట్టం. ఈ సన్నివేశంలో చూపరులకు కర్ణుడి పరిచయం చేసారు. కర్ణుడు జన్మకు జ్యేష్ఠ కౌంతేయుడు. కానీ కుంతి అతడిని పుట్టిన వెంటనే గంగా నది లో వదిలేస్తుంది. అలా నదిలో ప్రవహిస్తూ కర్ణుడు రాధ-అదిరథ దంపతులకు దొరుకుతాడు. సంతానము లేకపోవడంతో వాళ్ళు అతన్ని పెంచుతారు. అలాగ కర్ణుడు క్షత్రియుడైనప్పటికి సూత పుత్రుడిగా, రాధేయుడిగా ప్రసిద్ధి. పాండవులు, కౌరవులు ద్రోణుడి వద్ద శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారిరువురికి రంగభూమి లో పరీక్ష పెట్టాలని కురు వృద్ధులు నిర్ణయించారు.
ఆ వేదిక పై అర్జునుణ్ణి "సర్వశ్రేష్ఠ ధనుర్ధారి"గా ప్రకటిస్తుండగా కర్ణుడొచ్చి అందర్నీ పరీక్షించకుండా అర్జునుడి కన్నా గొప్ప ధనుర్ధారి లేడని చెప్పడం తప్పు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడిని అతని పరిచయం చేసుకోమని చెప్తే, "సూతపుత్రుడు" కావడం వల్ల తల దించుకుంటాడు కర్ణుడు. అప్పుడు, ఇంతటి గొప్ప వీరుడికి అవమానం జరుగుతోందని, ఆచార్యుడిని తన కులం గురించి ప్రశ్నిస్తాడు సుయోధనుడు. అలా ప్రశ్నించి, కర్ణుడికి తన చేతిలో ఉన్న అంగ రాజ్యాన్ని కట్టబెట్టి, అప్పుడు అర్జునుణ్ణి పోటీకి రమ్మని చెప్తాడు.
ఈ మధ్యలో ద్రోణాచార్యుడిని, భీష్ముడిని వారి జననం, కులం గురించి అడుగుతాడు. అప్పుడు భీష్ముడు సుయోధనుడితో రాజ్యమున్నవారే ఈ పోటీకి అర్హులు అని చెప్తే, కర్ణుడికి అంగ రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తాడు దుర్యోధనుడు.
ఇప్పుడు ఈ సమావేశాన్ని మళ్ళీ చదివితే, ఖచ్చితంగా అర్థమైపోతుంది.
ఇక్కడ ఒక్క మాట కొండవీటి వెంకట కవి గారి గురించి చెప్పాలి. ఎంత మంచి మాటలు అందించారో! అయినకి జోహార్లు పలుకుతూ, ఆ నట సార్వభౌముణ్ణి తలచుకుంటూ… నమస్కారములు.
నేను తెలుగువాడినే అయినప్పటికీ ఇప్పటి వరకు తెలుగు లో జవాబులు వ్రాయలేదు. ఇదే నా మొదటి జవాబు. నచ్చితే తప్పక అప్వోట్ చేయండి.
Edit: తెలుగుని పదో తరగతి వరకు ద్వితీయ భాషగా చదివిన నేను, Quora తెలుగులో రాసిన ఒక "ప్రతిపదార్ధానికి" 74 అప్వోట్లు వస్తాయని కలలో నైనా అనుకుంటానా చెప్పండి? ఇదంతా మీ అభిమానం! మీ అందరికి నా కోటి కోటి కృతజ్ఞతలు!
NTR దాన, వీర, శూర, కర్ణ సినిమాలో కౌరవులను హీరోలుగా, పాండవులను చవటలుగా చూపించాడా…?
ఇంతకీ నేను మహాభారతం చదివి ఈ సమాధానం వ్రాస్తున్నానా? అన్న అనుమానం రావడం సహజం. మూడు వేరు వేరు ప్రచురణలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో చదివాను

కథానాయకుడు విషయం లో చూపించిన favouritism తెలుసుకుంటే పాండవులను ఎలా చూపించారు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అర్థం అవుతుంది.
కర్ణుడి చేతిలో విల్లు ఉన్నంత వరకూ ఆయనని ఎవరూ ఓడించలేరు! అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా చేసింది
ఆ సినిమాలో దుర్యోధనుడు, పద్మ వ్యూహం లో, కర్ణుడి దగ్గరకి వచ్చి అభిమన్యుడి విల్లు విరచమని ఎందుకు అడిగాడు? కర్ణ, నువ్వు అభిమన్యుడి తో యుద్ధం చేసి ఓడించు అని ఎందుకు అడగలేదు?
ఎందుకంటే, అప్పటికే కర్ణుడు రెండు సార్లు అభిమన్యుడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు కాబ
దానవీరశూరకర్ణ చిత్రానికి పురాణ ఇతిహాసాల మీద పట్టున్న వేటూరిని కాకుండా వెంకటకవిని మాటల రచయితగా తీసుకోవడం వెనుక అంతర్యం ఏమిటి?
వేటూరి గారు మాటల రచయిత కాదు. సముద్రాల sr అప్పటికి లేరు. సముద్రాల jr, పింగళి వంటి వారు రామారావు గారి పౌరాణికాలకు పని చేసే వారు.వాళ్ళలో ఒకరిని పెట్టుకోవచ్చు. కానీ ఆ చిత్రం లో పాత్రలను వేరే కోణంలో చూపించాలి అనుకొన్న ఆయనకు మోదుకూరి జాన్సన్ గారు (ఆయన కూడా స్క్రిప్ట్ రైటర్) హేతువాది, నా స్తికుడు అయిన కొండవీటి వెంకటకవి గారి పేరుని సూచించారు. ఆయనకు ఇంకొక సంస్కృత పండితులు దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు గారు కూడా సహకరించారని విన్నాను
NTR దాన, వీర, శూర, కర్ణ సినిమాలో కౌరవులను హీరోలుగా, పాండవులను చవటలుగా చూపించాడా…?
ఎవరి పిచ్చి వారికానందం. యన్ టి ఆర్ గారు ఆ పాత్రలు చేశారు కాబట్టి ఆయన కౌరవులను హీరోలుగా చూపించుకున్నారు.
ఆరోజుల్లో టిడిపి తరపున ఉపేంద్రగారు కేంద్ర సమాచార మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సినిమాను వారు దూరదర్శన్ లో ప్రసారం చేసుకున్నారు.
ఇక నటనా పరంగా యన్ టి ఆర్ ను ఎవరూ తప్పు పట్టజాలరు. కానీ ఆయన నటించిన పౌరాణిక పాత్రలను ఆయనకు అనుకూలంగా వాడుకన్నాడు.
దాన వీర శూర కర్ణ సినిమా climax లో…పన్ను ఎందుకు ఇస్తారూ? ఎన్నోసార్లు చూసా..అర్థం కాలేదు
**"దాన వీర శూర కర్ణ"** సినిమా క్లైమాక్స్‌లో కర్ణుడు తన పన్ను ఇవ్వడం ఒక ప్రతీకాత్మక భావన. ఇది మహాభారతంలోని ఒక సంఘటన ఆధారంగా ఉంటుంది.
ఈ సందర్భంలో, కర్ణుడు చావు దగ్గరలో ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడిని కలుస్తాడు. కృష్ణుడు కర్ణుడిని తనకి చివరి దానం ఇవ్వమని అడుగుతాడు. కర్ణుడు అప్పటికి తన దగ్గరలో ఏమీలేకపోవడంతో, తన బంగారపు పన్ను (దంతం) తీసి దానం చేయాలని నిర్ణయించుకుంటాడు.
ఈ సంఘటన కర్ణుడి త్యాగ, ధర్మపారాయణతను ప్రతిబింబిస్తుంది. అతను తన జీవితంలో ఎంతటి కష్టాలను అనుభవించినా, చివరిదైన క్షణంలో కూడా తన పన్నును దానం చేయడం ద్వారా అతని దాతృత్వాన్ని, ధర్మాన్ని వ్యక్తపరుస్తాడు.
ఇది కర్ణుడి వ్యక్తిత్వం లో ఒక ముఖ్యమైన గుణం - అతడు తన శక్తి, సంపత్తి ఏదైనా చివరి నిమిషంలో కూడా దానం చేసేందుకు సిద్ధంగా ఉంటాడని చూపిస్తుంది.
కథనంలో కర్ణుడి పాపాలు దోషాలను లేదా ఋణాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశ్యం కూడా ఉండవచ్చు, ఇది ఒక శాస్త్రప్రాయమైన అభివ్యక్తిగా కూడా చూడవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి