బోధన వ్యూహాలు Teaching startagies
- KWL పద్ధతి – పూర్వజ్ఞానం తెలుసుకోవడం, తెలుసుకోవాల్సినవి గుర్తించడం, నేర్చుకున్నవి చెప్పడం.
- మైండ్ మ్యాపింగ్ – కీలక పదాల చర్చ, ఆలోచనల క్రమపరచడం.
- కొరియోగ్రఫీ – పాఠాన్ని నృత్యరూపకంగా ప్రదర్శించడం.
- ఏకపాత్రాభినయం – ఒక పాత్రను స్వగతంగా అభినయించడం.
- మూకాభినయం (Mime) – మాటలులేకుండా మౌనాభినయం.
- జట్టు పనులు – గుంపుగా కృత్యాలు చేసి నివేదిక ఇవ్వడం.
- ప్రాజెక్టు పనులు – వ్యక్తిగత/జట్టుగా ఇంటిపనులు, నివేదికలతో ప్రదర్శన.
- చర్చలు – ఒక అంశంపై విభిన్న అభిప్రాయాల పంచుకోవడం.
- స్వీయ అవగాహన-వ్యక్తీకరణ – పిల్లలు తాము అర్థం చేసుకున్నదాన్ని స్వయంగా ప్రదర్శించడం.
- జిగ్‌సా పద్ధతి – పాఠాన్ని భాగాలుగా విభజించి పంచుకొని చర్చించడం.
- క్లోజ్ టెస్ట్ – వాక్యాల్లో మిస్సైన పదాలను ఊహించి నింపడం.
- సాహిత్య కార్యక్రమాలు – పదజాలం, చిత్రకళ, ప్రశ్నలు, వ్యాఖ్యానం.
- పుస్తక సమీక్షలు – చదివిన పుస్తకాలపై అభిప్రాయం, విశ్లేషణ.
సామర్థ్యాల ఆధారంగా వ్యూహాలు
- వినడం-మాట్లాడడం – ప్రశ్నలు, చర్చలు, ప్రోత్సాహం.
- చదవడం-ప్రతిస్పందించడం – ధారాళంగా చదివి అర్థం చెప్పడం.
- స్వీయరచన – తన ఆలోచనలతో సమాధానాలు రాయడం.
- సృజనాత్మకత – వ్యాసం, కవిత, వ్యాఖ్యానం రాయడం.
- ప్రశంస – ఇతరుల ప్రతిభను గుర్తించి అభినందించడం.
- పదజాలం – పర్యాయపదాలు, నానార్థాలు, నిఘంటువు వినియోగం.
- భాషాంశాలు – సంధులు, సమాసాలు, వాక్యనిర్మాణం.
- స్వీయ మూల్యాంకనం ("నేనివి చేయగలనా?") – పిల్లలు తామే తమ స్థాయి అంచనావేసుకోవడం.
----------------------------------------------------------
ఉన్నతి ఆధారంగా బోధన వ్యూహాలు
3)బోధన వ్యూహాలు
1) KWL : (What I know? What I want to know? What I learnt?)
(నాకేం తెలుసు? నాకేం తెలియాలి? నేనేం తెలుసుకున్నాను?)
ఏదేని ఒక అంశం గురించి చర్చించే ముందు పిల్లల్ని ఆ అంశం గురించి వారికేం తెలుసో అడగాలి. ఇది మొదరి 4) సోపానం తర్వాత ఆ అంశం గురించి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చర్చించాలి. వాళ్ళ అభిప్రాయాలు వినాలి. ఇది రెండవ సోపానం. ఇలా చర్చించిన తర్వాత విషయావగాహన అయిన పిదప వాళ్ళకు ఏమి అర్థమైంది ఏమి నేర్చుకున్నారో అడగాలి. ఇది మూడవ సోపానం. ఈ వ్యూహంలో ఒక అంశాన్ని పిల్లలకు పరిచయం చేసేటప్పుడు వాళ్ళకు ఆ అంశంపట్ల ఉన్న పూర్వ జ్ఞానాన్ని, ఆసక్తిని, వారి అవగాహనను నేర్చుకుంటున్నామనే స్పృహతో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ముందుగా ఊహించడానికి, తాము ఊహించినదాన్ని వాస్తవాలతో పోల్చుకోవడానికి, ఆసక్తికరమైన అభ్యసనానికి 50 అవకాశం ఉంటుంది.
2) భావనా చిత్రం (Mind/Concept Mapping):
పిల్లలకు తమ పరిసరాలతో, ప్రతిచర్యలు జరపడం వల్ల ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతారు. ఎన్నో విషయాలపట్ల అవగాహనతో తమదైన శైలిలో స్పందిస్తుంటారు. మైండ్ మ్యాపింగ్ అనేది పిల్లల్ని ఒక అంశం పట్ల మేథోమధనం చేయించడం. ముఖ్యంగా అంశానికి సంబంధించిన కీలక పదాలను నల్లబల్లపై రాసి ఆ పదాల భావనలను అందరితో చర్చించడం జరుగుతుంది. పిల్లల స్వేచ్ఛా అభిప్రాయాలకు ఇందులో స్థానం ఉంటుంది. ఒకే అంశం గురించి పిల్లలను వివిధ కోణాల్లో ఆలోచింపజేయడం, ఆలోచనల సారాన్ని క్రమానుగుణంగా రాయడం ద్వారా వారిలో స్వీయరచనను ప్రోత్సహించడానికి ఈ వ్యూహం ఉపకరిస్తుంది. కింది ఉదాహరణను గమనించండి.
3) నృత్యాభినయం (Choreography):
విద్యార్థులు తాము విన్న, చదివిన, తెలుసుకున్న అంశాలను స్వయంగా అభినయంతో నృత్యరూపకంగా ప్రదర్శించడమే కొరియోగ్రఫీ ఇందులో నృత్యరూపక పాఠ్యంశాలను ప్రదర్శించడానికి అవకాశముంటుంది. ఇందుకు ముందుగా పాఠ్యాంశాన్ని చదివించి పాత్రలను నిర్ణయించాలి. ఆ పాత్రలు పోషించడానికి పిల్లల్ని ఎంపికచేయాలి. సన్నివేశ దృశ్యాలకు కూడా పిల్లల్ని ఎంపిక చేయాలి. అంటే వృక్షాలు, పొదలు, కొండలు, నీటిమడుగులు వీటిని చూపడానికి కూడా పిల్లల్ని ఎంపికచేయాలి. ఇలా ఎంపికచేసిన పిదప జట్లులో సాధన చేయించాలి. ప్రదర్శించే సమయంలో పేబ్యాణ్ పాటను కూడా సాధన చేయించాలి. వృత్యరూపకాన్ని ప్రదర్శింపజేయాలి.
ఉదా: అభినందన (6వ తరగతి), మంజీర (8వ తరగతి)
4) ఏకపాత్రాభినయం (Mono Action) :
ఏదైనా ఒక పాఠ్యాంశంగాని లేదా అందులోని ఒక పాత్ర మాట్లాడిన విషయాన్నిగాని తీసుకొని వ్యక్తిగతంగా, స్వగతంగా విద్యార్థిచేత పాత్రోచితంగా అభినయం చేయించడాన్నే ఏకపాత్రాభినయం అంటారు.
6వ తరగతిలో చెరువు పాఠాన్ని, బాలనాగమ్మ పాఠంలోని బాలవద్ది రాజు పాత్ర ఏకపాత్రాభినయం చేయించవచ్చు.
5) మూకాభినయం (Mime) :
మౌనంగా అభినయిస్తూ భావ వ్యక్తీకరణ చేయడమే మూకాభినయం. ఒక సంఘటనగాని, సన్నివేశాన్నిగాని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో అభినయించి చూపడాన్ని మూకాభినయం అంటారు. ఇందులో డైలాగులు, బ్యాక్ గ్రౌండ్లు ఉండవు. కేవలం మౌనంగా నటించడమే ఉంటుంది.
శిల్పి (7వ తరగతి) పాఠం ఆధారంగా మూకాభినయం చేయవచ్చు.
6) జట్టుపనులు నిర్వహించడం (Group Works) :
పాలాలకు సంబంధించిన కొన్ని అంశాలను జట్టులో నిర్వహించడం ద్వారా పిల్లలలో కలిసి పనిచేయడం, అభిప్రాయాలను పంచుకోవడం, జట్టులో ఒక నివేదిక రాయడమో, అర్థాలు గ్రహించడమో చేయడం. జట్టుపని అనంతరం జట్టుచేత ప్రదర్శింపజేయడం. వివిధ జట్లవారు రాసిన వాటిని ప్రదర్శించినప్పుడు చర్చించడం, వారి వారి జట్టు పనులను సరిచేసుకోవడం జరుగుతుంది. ఈ జట్టుపనుల కింద పాఠ్యపుస్తకంలోని పఠనకృత్యాలు, చదవడం, రాయడం, పదజాలం వంటి వాటిని స్వభావాన్ని బట్టి నిర్వహించాలి.
7) ప్రాజెక్ట్ పనులు (Project Works):
ప్రాజెక్టుపనులు వివిధ కృత్యాల సమాహారం. ప్రాజెక్టు పనులను ఇంటిపనులుగా ఇవ్వాలి. ఇంటిపనిగా ఇచ్చేముందు ప్రాజెక్టుపనిలో పిల్లలు ఏంచేయాలో ఎలా చేయాలో సూచనలు ఇచ్చి అర్థం చేయించాలి. ప్రాజెక్టుపని స్వభావాన్నిబట్టి -వ్యక్తిగతంగా లేదా జట్టుపనిగా ఇవ్వాలి. జట్టుపనులుగా ఇచ్చేటప్పుడు ఆ ప్రాజెక్టుపనిలో జట్టులోని సభ్యులు ఎవరెవరు ఏమేం 'చేయాలో స్పష్టంగా బాధ్యతలను కేటాయించాలి. ప్రాజెక్టుపనిని పూర్తిచేసిన తరవాత పిల్లలతో ప్రదర్శింపజేయాలి. పిల్లలు ప్రాజెక్టుపనులను ప్రదర్శించేటప్పుడు దోషాలుంటే సవరించాలి. అవసరమైన సలహాలు, సూచనలు అందించాలి. పిల్లలతో ప్రదర్శనాంతరం ప్రాజెక్టుపనిని ఎలా నిర్వహించారో ఒక నివేదిక రాయించాలి. ఈ నివేదికలో ఏ ప్రాజెక్టు, ఎవరిం సభ్యులు, ఎవరెవరు ఏ బాధ్యతలను స్వీకరించారు? ప్రాజెక్టుపనికి సంబంధించి వివరాలను ఎలా సేకరించారు? విషయాలు అందులో ఉన్నాయి? వంటి సమాచారాన్ని నివేదిక రూపంలో పిల్లలు రాయాలి.
8) చర్చ (Discussions):
ఒక అంశం గురించి పిల్లలను భాగస్వాములను చేయడం. ఆ అంశం గురించి అభిప్రాయాలు చెప్పించడం సమర్పించం విభేదించడం, కారణాలు చెప్పించడం వంటివాటి గురించి చర్చ నిర్వహించాలి. చర్చ చివర- క్రోడీకరణ చేయా స్వీయరచన, సృజనాత్మకత వంటి సామర్ధ్యాల సాధన కృత్యాల సమయంలో చర్చను ఒక వ్యూహంగా నిర్వహించవచ్చు.
9) స్వీయావగాహన - ప్రదర్శన (Self Understanding - Expression):
ఏదేని అంశానికి సంబంధించిన విషయాన్ని పిల్లలే తమకు తాము చదివి అర్ధం చేసుకొని దాన్ని ఏకపాత్రాభినం రూపంలోనూ, నాటకీకరణ రూపంలోనూ, తోలుబొమ్మలాట రూపంలోనూ ఇలా ఏ రూపమనేది వాళ్ళే నిర్ణయించుక ప్రదర్శించాల్సి ఉంటుంది.
- 10) జీగ్ సా విధానం (Zigsaw Technique):
ఈ విధానంలో ఒక అంశంకు సంబంధించిన విషయాన్ని భాగాలుగా / పేరాలుగా విభజించుకొని 4, 5 గురు *ఒక్కోపేరా పంచాలి. ఎవరి భాగాన్ని వాళ్ళు చదువుకోవాలి. పూర్తి అవగాహన చేసుకోవాలి. తర్వాత అందరూ కలిసి వారి చదివిన భాగంపై అనుభవాలను పంచుకొని దానిపై సంపూర్ణ అవగాహనకు రావాలి.
11)క్లోస్డ్ టెస్ట్ (Cloze Test Technique):
ఇది చదవడం - అర్థంచేసుకొనే సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే వ్యూహం. ఇందులో ఒక అంశంలో ప్రతి వ పదాన్ని తొలగించి ఇస్తారు. దాన్ని చదువుకొంటూ తొలగించిన స్థానంలోని పదాన్ని ఊహించాలి, నింపాలి.
12. సాహిత్య కార్యక్రమాలు (Literature activities):
పిల్లలను నలుగురు చొప్పున నాలుగు జట్లను చేయాలి. ఒక్కో జట్టుకు భాషాపరమైన అభ్యాసాన్ని కేటాయించాలి. అంటే చదివిన అంశం గురించి ఒక జట్టుకు పదజాలం, సామెతలు వంటివి ఇంకోజట్టు చదివిన అంశంలోని భాష గొప్పతనం గురించి, ఇంకో జట్టుకు చదివిన అంశంపై చిత్రాలు గీయమని, ఇంకోజట్టుకు చదివిన అంశంపై ప్రశ్నలు తయారుచేయమని లేదా వ్యాఖ్యానం రాయమని చెప్పవచ్చు. అంటే ఒకే అంశంపై అన్ని జట్లవాళ్ళు సాహిత్యపరంగా - పనిచేస్తారు. భాషకు సంబంధించి ఉత్పత్తి రూపాలు చోటుచేసుకోవాలి.
13) పుస్తక సమీక్షలు నిర్వహించడం (Book Reviews) :
పిల్లల పఠనాభిలాషను పెంపొందించడానికి పాఠశాలల్లో గ్రంథాలయ పుస్తకాలను సరఫరాచేశారు. పిల్లల్ని వివిధ సాహిత్య రూపాలలో ఉన్న పుస్తకాలను చదవమనాలి. పిల్లలు చదివిన వాటిపై సమీక్షలు నిర్వహించాలి. సమీక్షలో
వాళ్ళు చదివిన పుస్తకమేంటి?
చదివిన అంశంపై అభిప్రాయం చెప్పడం.
చదువుతున్నప్పుడు వాళ్ళ అనుభూతులను చెప్పించడం.
చదివిన అంశంలోని పాత్రల గురించి, సంఘటనల గురించి మాట్లాడించడం.
కవి ఏ ఉద్దేశంతో ఆ అంశాన్ని రాసారో చర్చించడం వంటివి జరగాలి.
సామర్థ్యాల వారీగా వ్యూహాలు
పైన సూచించిన వివిధ సాధారణ వ్యూహాలతోపాటు నూతన పాఠ్యపుస్తకాలలో పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలపై అభ్యాసం కల్పించడానికి తరగతిగదిలో సామర్థ్య స్వభావాన్నిబట్టి వ్యూహాలను నిర్వహించాలి. వాటిని చూద్దాం.
I వినడం - మాట్లాడడం:
విద్యార్థి తన ఇంటి వాతావరణం నుండే వినడం మాట్లాడడం అలవాటు చేసుకొంటాడు. అయితే క్రమక్రమంగా ఈ వినడం - మాట్లాడడంలోని విభిన్నకోణాలను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకొనే సామర్థ్యాన్ని పొందాలి. పాఠ్యపుస్తకాలు ఇందుకు తోడ్పడాలి. బడికి రాకముందే మాట్లాడే పిల్లవాడు బడిలో చేరిన తరవాత స్వేచ్ఛగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, సూటిగా మాట్లాడడం, సందర్భోచితంగా మాట్లాడడం, సరైన పదజాలంలో అర్థవంతంగా వినసొంపుగా మాట్లాడడం గురించి అభ్యసిస్తాడు. అట్లాగే విన్నదాన్ని గురించి అర్ధం చేసుకోవడంతోపాటు విశ్లేషించడం, అంతరార్థం గ్రహించడం, సందేశాన్ని పట్టుకోవడం వంటివి చేయగలగాలి.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థి విని అర్ధం చేసుకొని మాట్లాడే స్థాయికి చేరుకుంటే, మాధ్యమిక స్థాయిలో, విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇక సెకండరీస్థాయి చేరుకొనేటప్పటికి వినడంలో మార్పు వస్తుంది. అర్థం చేసుకోవడం, ఆలోచించడం, విశ్లేషించుకోవడం, తన వాదనకు సరైన కారణాలను సమర్థంగా నిర్మించుకోవడం, బహుకోణాల్లో స్పందించడం తద్వారా మాట్లాడడం చేస్తాడు. అందుకే ప్రాథమిక స్థాయి నుండి సెకండరీ స్థాయి వరకుగల పాఠ్యపుస్తకాల్లో 'వినడం- మాట్లాడడం' అనే సామర్థ్యాన్ని అభ్యాసాల్లో చేర్చడం జరిగింది.
వ్యూహం : 'వినడం-మాట్లాడడం' అనే ఈ సామర్థ్యాన్ని పూర్తి తరగతి కృత్యంగా అంటే ప్రతి ప్రశ్నను తరగతిలోని పిల్లలందరినీ అడగాలి. ఒక్కొక్కరిచేత మాట్లాడించాలి.
అవసరమైన చోట్ల అనుబంధ ప్రశ్నలను అడగాలి విద్యార్థులు చెప్పే సమాధానాలను ఖండించే ప్రయత్నం చేయగూడదు. ఎందుకంటే విద్యార్థి తన వాతావరణంనుంచో, తన వ్యవహారిక భాషా స్థితులనుంచో, తన అనుభవాలనుంచో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల వాటిని ఖండించగూడదు. ఖండించడంవల్ల తాను మాట్లాడే స్థితిని కోల్పోయి భయంతో మౌనంగా ఉండే ప్రమాదం ఉంటుంది.
విద్యార్థులు చెప్పే సమాధానాలలో దొర్లే దోషాలను ఆప్యాయతతో సవరించాలి. విద్యార్థుల సహజమైన మాటలను ప్రోత్సహించాలి. వాళ్ళను అభినందించాలి.
II. ధారాళంగా చదువడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం :
చేసుకోవడం, దాన్ని వివరించగలగడం, ప్రతిస్పందించగలగడంలో శిక్షణ పొందుతారు. సెకండరీ స్థాయిలో పిల్లలు చదివిన ప్రాథమిక స్థాయిలో ధారాళంగా చదువడం చేయగలిగిన పిల్లలు ప్రాథమికోన్నత స్థాయిలో చదివిన అంశాన్ని అవగాప్య జరగ అంశం గురించి విమర్శనాత్మక దృష్టితో ఆలోచించగలగాలి. రచయిత/ కవి అంతరాత్మను, ఉద్దేశాన్ని పట్టుకోగలగాలి. 'చదవడం' అనే సామర్థ్యం ద్వారా పిల్లలో పఠనాభిలాష పెరగడం, అర్థం చేసుకొని వ్యక్తీకరించగలగడం, తన జ్ఞానపరిరిని విస్తృతపరుచుకోవడం జరగాలి. ఇందుకోసం 8, 9 తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని అభ్యాసాలను పరిశీలించండి.
వ్యూహం: ధారాళంగా చదువడం, అర్ధం చేసుకొని ప్రతిస్పందించడం. సామర్థ్యానికి సంబంధించిన అభ్యాసాలను వ్యక్తిగత కృత్యంగానే నిర్వహించాలి. విద్యార్థులందరిచేత సాధన చేయించాలి. వారు చేసే దోషాలను వెనువెంటనే సవరించాలి. వారు చేసే ప్రయత్నాలను ప్రోత్సహించాలి. విద్యార్థి ఉచ్ఛారణకు అనుకూలమైన పదాలను రాయడం తప్పుగాదని గుర్తించాలి. ఉచ్ఛారణ సరిచేసి సరైన పదాలను రాసేలా ముందుకు నడిపించాలి. అభినందించాలి. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయడాన్ని ఇంటిపనిగా ఇవ్వవచ్చు. మిగతావాటిని తరగతి గదిలోనే వ్యక్తిగత కృత్యంగా నిర్వహించాలి. విద్యార్థుల సంఖ్యనుబట్టి సామర్థ్యసాధనకు అనుకూలమైన విధానాన్ని ఉపాధ్యాయుడు ఎన్నుకోవాలి.
III. స్వీయరచన :
స్వీయరచన అంటే విద్యార్థి తన సొంత ఆలోచనలతో తనదైన విధానంలో ప్రశ్నలకు జవాబులు రాసే విధానం లేదా తెలిసిన అంశాల గురించి రాయడం. ప్రాథమిక, మాధ్యమిక స్థాయి నుండి పిల్లలు సెకండరీ స్థాయికి చేరుకొనే క్రమంలో ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. APSCF-2011 నిర్దేశించిన ప్రకారం అవగాహన చేసుకొని తన సొంతమాటల్లో రాయడం అనేది రావాలి. (ఇప్పటివరకు పాఠ్య పుస్తకంలోని పాఠాల్లో ఉన్న ప్రశ్నలను బట్టీ ద్వారా సమాధానాలు రాసేవారు.) అంటే విశ్లేషణ, విమర్శనాత్మక, బహుకోణీయాలోచన, సమస్యాపరిష్కార సాధన మొదలగు అనేక విషయాల్లో తాను స్వయంగా రాయాల్సి ఉంది. అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించాల్సి ఉంటుంది. అందుకే సెకండరీ స్థాయిలో ఈ స్వీయరచనలో ఉన్న ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. జవాబురాసే విధానంలో కూడా మార్పులుంటాయి. భాషా వినియోగంలో కూడా మార్పులుంటాయి.
వ్యూహం : ఈ 'స్వీయరచన' అభ్యాసాన్ని వ్యక్తిగత కృత్యంగా నిర్వహించాలి. అవసరమైన సందర్భంలో పూర్తి తరగతి -కృత్యంగా నిర్వహించాలి. ఆయా ప్రశ్నలను పిల్లలు పూర్తిగా అవగాహన చేసుకొనేలా ఉపాధ్యాయుడు చర్చ నిర్వహించాలి. కొన్ని సందర్భాలలో సూచనలు, సలహాలు కూడా ఇవ్వాల్సివస్తే అందించాలి. వాళ్ళడిగే సందేహాలను నివృత్తి చేయాలి.
ఇందులో కొన్ని ప్రశ్నలను ఇంటిపనిగా ఇచ్చే అవకాశం ఉన్నట్లైతే అది ఉపాధ్యాయుడు వినియోగించుకొనవచ్చు.
దోషసవరణ తరగతి గదిలో చేపట్టాలి. ఇది పూర్తి తరగతిలో చర్చ ద్వారా జరగాలి. విద్యార్థుల అభిప్రాయాలకు వనివ్వాలి. అభిప్రాయాల్లో ఉన్న తార్కికతను పిల్లలకు వివరించే ప్రయత్నం చేయాలి.
అభ్యాసాల్లోని ప్రశ్నలకు జవాబులు ప్రతి విద్యార్థినుండి భిన్నంగానే వస్తాయి. ఒకవేళ అలా కానట్టైతే సామర్థ్యసాధన జరగనట్లే భావించాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి స్వీయరచన చేసేట్లు ప్రోత్సహించాలి. సామర్థ్యాన్ని సాధించేట్లు చూడాలి. పిల్లలు రాసిన అంశాలను సవరించే విధానం
పిల్లలు జట్లలో చర్చించి రాసిన / వ్యక్తిగతంగా రాసిన సమాధానాలను చార్టుపై రాయించాలి లేదా వర్గానిపై
రాయించాలి.
* ఒక్కో జట్టువారిచే ప్రదర్శింపజేయాలి.
.
పిల్లలు రాసిన అంశాన్ని తరగతిలో చర్చిస్తూ కింది విధంగా సరిచేయాలి.
భావం సరిగా ఉందా? వరుసక్రమంలో విషయాన్ని రాశారా?
వాక్యనిర్మాణం సరిగా ఉందా?
వాక్యాలు సంపూర్ణ వాక్యాలుగా దోషరహితంగా ఉన్నాయా?
వాక్యాలలో ఉపయోగించిన పదాలు సరిగా ఉన్నాయా? ఇంకే పదాలు ఉపయోగించవచ్చు?
అక్షర దోషాలు ఏవైనా ఉన్నాయా?
ఇలా ఒక్కో ప్రశ్న పిల్లలను అడుగుతూ పిల్లలురాసిన దాన్ని పిల్లలతో చర్చిస్తూ సరిచేయించాలి. కొంత అభ్యాసం జరిగిన తరవాత ఒక జట్టువారు రాసిన అంశాలు ఇంకొక జట్టువారికిచ్చి సరిచేయించవచ్చు.
* ఇలా సరిదిద్దిన తరవాత పిల్లలతో వ్యక్తిగతంగా రాయించాలి.
IVసృజానాత్మక / ప్రశంస
పిల్లలు పాఠంలోని ప్రశ్నలకు జవాబులను బట్టీపట్టి రాయడంవల్ల భాషలోని ఏ ప్రక్రియను తాము స్వయంగా జించలేకపోతున్నారు. ఈ లోటును పూడ్చాలని APSCF-2011 భావించింది. అందుకే విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీయగలిగేలా అభ్యాసాల నిర్వహణ ఉండాలని నిర్దేశించింది. దానికనుగుణంగా నూతన పాఠ్యపుస్తకాల్లో ఈ సామర్థ్యం పొందుపరచడమైంది.
సృజనాత్మకత అనేది ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుండి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి వారిలో ఉంటుంది. దాన్ని వెలికితీసే ప్రయత్నం చేయకుంటే స్తబ్దత నెలకొంటుంది. అలా కాకూడదనే, వివిధ స్థాయిలో సృజనాత్మకత కింద అభ్యాసాలు అందుపరచడం జరిగింది. ఉన్నత స్థాయి పిల్లలు వ్యాఖ్యానం రాయగలగడం, కవిత, వ్యాసం, పీఠిక మొదలగునవి రాయగలగాలి.
వ్యూహం : ఈ సామర్థ్యాన్ని పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. ఉపాధ్యాయుని ప్రోత్సాహం ఎక్కువగా ఉండాలి. "ర్చ ద్వారా అవగాహన కల్పించాలి. విద్యార్థి తన భావాలను ప్రదర్శించడానికి అనుమతించాలి, అభినందించాలి. తోటి ఆద్యార్థులచే అభినందింపజేయాలి. 'స్వీయరచన' నిర్వహణలాగానే సృజనాత్మక కృత్యాలను కూడా నిర్వహించాలి. అంటే కార్తితరగతిలో సూచనలు ఇవ్వడం, జట్లలో లేదా వ్యక్తిగతంగా చేయించడం / రాయించడం, వాటిని ప్రదర్శింపజేయడం, -రిదిద్దడం జరగాలి. తరవాత పిల్లలచేత వ్యక్తిగతంగా రాయించాలి.
ప్రశంస చాలు, కోటి ఏనుగుల బలం లభించినట్లు చేయడానికి, అయితే ఈ ప్రశంస అనేది కుల, మత, వర్గ, సంకుచిత ధోరణులు ప్రబలుతున్నాయి. మేధ అదుగంటి దుర్బుద్ధి రాజ్యం చేస్తున్నది. ప్రశంస అనేది ఒక వ్యక్తికి, ఒక లింగ, భాషాభేదాల చుట్టూ తిరగడంవల్ల దేశంలో నైతిక విలువలు తగ్గిపోయి ఈర్ష్య, అసూయా ద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. ఉండాలి, పిల్లల్లో ఎదుటివారిలోని / వర్గంలోని గొప్పదనాన్ని గుర్తించి ప్రశంసించే వైఖరి పెంపొందించాలి. ఇది ఉత్తవు వ్యవస్థకు, ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక మేధకు లేదా మరోదానికి కావచ్చు. అది సార్వజనీనంగా, సార్వత్రికంగా
వ్యక్తిత్వానికి ప్రతీక. వ్యూహం : విద్యార్థుల్లో ప్రశంసించే తత్త్వాన్ని, విధానాన్ని తెలియజేయాలి. దీన్ని మొదట పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. సూచనలు ఇవ్వాలి. తరువాత వ్యక్తిగత కృత్యంగా వ్యక్తీకరించేట్లు చేయించాలి. ప్రశంసల్లోని మాధుర్యా భూతిని వర్ణించి చెప్పాలి. ఇతరులు రాసిన విషయాన్ని పరిశీలించి అంగీకారయోగ్యంగాని భావనలున్నట్లైతే చర్చ ద్వా సరిదిద్దాలి.
V. పదజాలం:
ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవడానికి వాడే మాటల అర్థవంతమయిన కూర్పు భాష, దీనిలో ముఖ్యమై భాగం పదజాలం. విద్యార్థులు పదజాలాన్ని ఎంత ఎక్కువగా సంపాదిస్తే భాషమీద అంతపట్టు పెరుగుతుంది. సందర్భాన్నిబట్టి సమయోచితంగా మాట్లాడాలంటే, రాయాలంటే పదజాల వినియోగాన్ని గురించి సరైన అవగాహన ఉండాలి.
ఉన్నత స్థాయిలోని విద్యార్థులు జాతీయాలు, సామెతలు, నానార్ధాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు లాం వాటిని గురించి వివరంగా తెలుసుకొనే అవకాశం ఉంది. ప్రాచీన, ఆధునిక భాషా పాఠ్యాంశాల్లోని పద ప్రయోగాలు తెలుసుకోగలగాలి. ఆయా పదాల ప్రయోగాలను అవగాహన చేసుకొని తాను వినియోగించాలంటే “పదజాలం" ఆ సామర్థ్యాన్ని సాధించాలి.
బోధనావ్యూహం : 'పదజాలం' అభ్యాసాలను వ్యక్తిగత కృత్యంగాను, పూర్తి తరగతి కృత్యంగాను నిర్వహించవచ్చు. సందర్భానికి ఏవి అవసరమో అది నిర్వహించాలి. విద్యార్థులను సమూహాలుగా చేసి, జట్టు కృత్యంగానూ నిర్వహించవచ్చు 3 ఈ పదజాల వినియోగానికి నిఘంటువును ఉపయోగించేలా చూడాలి. పర్యాయపదాలు. నానార్థాలను వాక్యాల్లో ప్రయోగిం అర్థం చేసుకునేలాచేయాలి. ప్రకృతి వికృతులు, వ్యతిరేకార్థకాలు, జాతీయాలు మొదలయినవన్నింటిని ప్రయోగ పద్ధతి! చూపించి విద్యార్థుల వినియోగంలోకి తేవాలి. విద్యార్థి కల్పతరువు లాంటి పుస్తకాలను ఉపయోగించేలా నిర్వహించాలి.
దోషసవరణ వెంటవెంటనే చేయాలి. విద్యార్థుల భాషలోని మూసను ఖండించగూడదు. ప్రాంతీయ / మాండలిక పదా ఉపయోగాన్ని తప్పు అని అనగూడదు. వారి భాషను గౌరవించాలి. వారి స్థాయికి తగిన భాషారూపమేదో చెప్పాలి.
VI. భాషాంశాలు :
భాషాంశాల్లో సంధులు, సమాసాలు, వాక్యభేదాలు, అలంకారాలు, ఛందస్సు మొదలయిన అంశాలన్నీ ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో భాషాభాగాలతో మొదలైన భాషాంశాలు ఉన్నతస్థాయి వచ్చేసరికి వాక్యాలు నిర్మాణాల్లో ఉండే తేడాతోపాట భాషకు సంబంధించిన వివిధ నియమాలను విద్యార్థులు అవగతం చేసుకుంటారు.
వ్యూహం: ఈ సామర్థ్యాన్ని తరగతి కృత్యంగాను, వ్యక్తిగత కృత్యంగాను నిర్వహించాలి. ప్రతి విద్యార్థి సూత్ర నిర్మాణాన్ని సాధించగలగాలి, అందుకు ఉపాధ్యాయుడు విభిన్న ఉదాహరణలను ఉపయోగించుకోవాలి. నిత్య వ్యవహారంలోని వాక్యాలను, పదాలను కూడా వాడి విద్యార్థులచేత సామర్థ్య సాధన చేయవచ్చు. దీనికి కేటాయించిన పీరియడ్లలో ఈ అభ్యాసం జరగాలి. విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. విద్యార్థులతో ఉదాహరణలను చెప్పించి స్వయంగా అవగాహన చేసుకునేలా చూడాలి.
VII. నేనివి చేయగలనా?
పాఠ్యపుస్తకాలు పిల్లలు నేర్చుకోవడానికి తోడ్పడే సాధనాలు, తమ పిల్లలు ఏం నేర్చుకొంటున్నారు? ఎంత వరకు నేర్చుకొంటున్నారు? అని తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం కూడా! సాధారణంగా ఒక పాఠం పూర్తయిందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లలైనా చెప్పగల్గుతారు. అయితే ఇటు పిల్లలకు, అటు వారి తల్లిదండ్రులకు ఒక పాఠం పూర్తయిన పిదప ఏం నేర్చుకొన్నారు? అని తెలుసుకొనే అంశం గత వాచకాల్లో లేదు. ఎందుకు బోధిస్తున్నారో ఉపాధ్యాయులకు మాత్రం తెలిసి ఉంటుంది. తాము అనుకున్న ఈ లక్ష్యాలు తరగతిగదిలో ఎంతశాతం మంది చేయగలరు? అనే అంశంపై సాధారణంగా దృష్టిపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. వీటిని దృష్టిలోపెట్టుకొని పిల్లలు ఒక పాఠం పూర్తయిన పిదప తామేమి నేర్చుకున్నారో? తమనుతాము స్వంతంగా అంచనావేసుకోవడానికి అనగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి వీలుగా భాషా సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని "నేనివి చేయగలనా?" అభ్యాసాలు రూపొందించారు. దీని ఆధారంగా ఉపాధ్యాయులు కూడా సామర్థ్యాల వారీగా పిల్లల స్థాయిని అంచనావేయడానికి అవకాశం లభిస్తుంది. అట్లే తల్లిదండ్రులకు కూడా బోధించిన పాఠం ద్వారా తమ పిల్లలు ఏ సామర్థ్యాలు పొందారో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
వీటిని ఎలా నిర్వహించాలి? :
నేనివి చేయగలనా? లోని ఒక్కొక్క వాక్యాన్ని తరగతిలో చదివి వినిపించాలి. పిల్లలు వాటిని చేయగలిగితే 'ఔను' వద్ద, చేయలేకుంటే 'కాదు' వద్ద ''' గుర్తును పెట్టమనాలి. తరవాత ఒక్కొక్క అంశాన్ని ఎంతమంది '✓'' గుర్తుపెట్టారో చేతులెత్తమనాలి. చేతులెత్తినవారి సంఖ్యను లెక్కించాలి. ఒక అంశంలో 80% కంటే తక్కువ మంది చేతులెత్తితే దానిపై పునరభ్యాసం కల్పించాలి.
ముగింపు :
భాషాబోధన మూసపోసినట్లుగా, యాంత్రికంగా ఉండకూడదు. భాష అంటేనే ఆలోచించడం, వ్యక్తీకరించడం పిల్లలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ తమ అనుభవాలను విభిన్న రూపాలలో వ్యక్తపరచడానికి వీలుగా భాషాబోధన వ్యూహాలు, సోపానాలు ఉండాలి. పిల్లలందరూ పాల్గొనేలా, చర్చించుకునేలా, ప్రదర్శించేలా, వ్యక్తీకరించేలా ఈ వ్యూహాలు ఉండాలి. ప్రతీరోజూ భాషాబోధనకు కేటాయించిన పీరియళ్ళలో పీరియడ్ వారీ ప్రణాళికలో ఇటువంటి వ్యూహాలతో పిల్లలకు ఉత్సాహం, ఉత్సుకత పెంపొందించేలా నిర్వహించాలి. సందర్భాన్ని, బోధనాంశాన్ని బట్టి తమ వ్యూహాలను మార్చుకోవాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి