గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి స్వచ్ఛదనం, పచ్చదానం కార్యక్రమాన్ని చేపట్టనుంది*
*నేటి నుంచి ఈ నెల 9వ తేది వరకు అయిదు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 127 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంపై నేడు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం, చెత్త సేకరించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు*
*💥ఈ నెల 6న తాగునీటిని అందించే ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెరువులను సంరక్షణ, కలుషితం కాకుండా చూడటం, 7న గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో మురుగా నీరు నిలువకుండా చర్యలు తీసుకోవడం, మురుగునీటి గుంతలను పూడ్చటం, 8న సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీధి కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్‌కు తరలించడం, ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, 9న శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యల చూపట్టడం, రోడ్లకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లను తీసేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే ప్రతి మంగళ, శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. రోజువారీగా చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రభుత్వ విభాగాలతోపాటు స్థానిక నాయకులు, యువకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి