సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

23, నవంబర్ 2023, గురువారం

VII. 11. శ్రీలుపొంగిన జీవగడ్డ


11. శ్రీలు పొంగిన జీవగడ్డ

పాఠం ఉద్దేశం:

భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశగౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇతి మాత్రా ఛందస్సులో, అంత్యప్రాసలతో, రాగయుక్తంగా, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించాడు.

కవి పరిచయం:
పేరు: రాయప్రోలు సుబ్బారావు 
జన్మస్థలం : గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. 

రచనలు: తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

ప్రవేశిక

భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాఙ్మయం ఉపనిషత్తులు సమాజానికి దివ్యమార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్యరీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మనదేశపు ఘనత ఎంత విశిష్టమైనవో ఈ పాఠం
ద్వారా తెలుసుకుందాం!

చదవండి – ఆలోచించండి – మాట్లాడండి

ప్రశ్నలు:
1.పై వాక్యాలు దేని గురించి చెప్తున్నాయి?
జవాబు.పై వాక్యాలు దేశం యొక్క గొప్పదనం గూర్చి చెప్తున్నాయి.
2.దేశంపట్ల ఎటువంటి భావనతో ఉండాలి?
జవాబు.మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ కాలుపెట్టినా, ఎంత ఉన్నతస్థానానికి వెళ్ళినా మన దేశం పట్ల గౌరవ భావంతో ఉండాలి.
3.జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు.మన భారతమాత గొప్పతనాన్ని చాటడమే జాతి గౌరవాన్ని నిలపడం అని నా ఉద్దేశ్యం.
4.ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు?
జవాబు.శ్రీ రాయప్రోలు సుబ్బారావు.

ఆలోచించండి – చెప్పండి ( Page No.108)
1.కవి భారత భూమిని ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.భారత భూమిలో సంపదలున్నాయి. వజ్రాల గనులు, బంగారం గనులు, ఇవికాక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఎన్నటికీ తరగని ప్రకృతి సంపద ఉన్నది. చదువులకు, సాములకు, ఋషులకు, వీరులకు నిలయమైనది భారతభూమి. ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులు దేశగౌరవాన్ని కీర్తి శిఖరాలపై నిలిపారు. అందుకే కవి భారతదేశాన్ని శ్రీలుపొంగిన జీవగడ్డ అన్నాడు. శ్రీలు అంటే సంపదలు.

 2.భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది.
జవాబు.భారతదేశంలో వ్యాసుడు, వాల్మీకి మొదలుగా గల మహాకవులు, మహర్షులు జన్మించారు. సంస్కృతికి, సంప్రదాయానికి నిలయంగా ఉన్నది ఈ దేశం. వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది పవిత్ర గ్రంథాలు ఇక్కడే పుట్టాయి. అందుకే ఈ దేశం పుణ్యభూమిగా కీర్తించబడింది.
3.చెవులకు విందుచేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు.మనకు ఇష్టమైనది సమృద్ధిగా దొరకడమే విందు. ఇంపైన భోజనం విందు భోజనం. చూడటానికి అందంగా ఉంటే కనుల విందు అనీ, అలాగే వినడానికి ఇష్టంగా ఉండే మాటలుగాని పాటలుగాని లభించినపుడు చెవులకు విందు అనీ అంటాము. చెవులకు విందుచేయడం అంటే మధురంగా పాడటం, ప్రియంగా మాట్లాడటం.


ఆలోచించండి – చెప్పండి ( Page No.109)
 1.ఎటువంటి పనులు చేసినవారు ధీరపురుషులుగా కీర్తించబడతారు?
జవాబు.దేశము యొక్క గర్వమును నిలబెట్టేట్లు ప్రకాశింపజేసిన వారిని, దేశము యొక్క గొప్ప చరిత్రను ప్రపంచమంతా తెలిసేలా చేసిన వారిని, దేశమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారిని ‘ధీరపురుషులు’ అని కీర్తిస్తారు. ధీరులు అంటే వీరులు.
2.భారత వైభవాన్ని ఎందుకు పాడుకోవాలి?
జవాబు.మనం భారతదేశంలో పుట్టాం. భారతీయులం. ఈ భారతదేశం గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఆ గొప్పదనాన్ని సంపాదించి పెట్టిన మహనీయులను గుర్తుచేసుకుంటూ భక్తితో భారతదేశ వైభవాన్ని పాడుకోవాలి.


ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఈ గేయం దేన్ని గురించి చెపుతున్నది? ఇందులో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి ?
జవాబు.
1. ఈ గేయం భారతదేశం గొప్పతనం గూర్చి చెపుతోంది.
2. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, వీరులైన రాజులను గూర్చి, ఇక్కడి నదుల గొప్పదనం గురించి గానం
చేయాలని చెపుతోంది.
దేశభక్తికి సంబంధించిన విషయాలు :
భారతదేశం సిరులు పొంగిన జీవగడ్డ, పాడిపంటలు గల భాగ్యదేశం.
దేశ గౌరవం ప్రకాశించేటట్లు, దేశ చరిత్ర విస్తరించేటట్లు, దేశాన్ని కాపాడిన వీర పురుషుల గురించి తెలుసుకోవాలి. అదే దేశభక్తి.

2. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి.
జవాబు.
కవి రాయప్రోలు సుబ్బారావు మనదేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేవిధంగా, ప్రతివారూ పాడుకొనేందుకు వీలుగా ఈ కింది విషయాలను చెప్పారు.మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. అలాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.

వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది.

ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారంగల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది.

సూత్రాలను చెప్పిన కాలంనాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి.

కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి.
నవరసాలతో నిండిన, తేటతెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.

పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగుపదాలతో అందరూ కలసి పాడుకోవాలి.

ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు.భరతఖండము, జీవగడ్డ, భాగ్యసీమ, విమల తలము, భావిభారతము.

2. ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
అ. మనదేశం వేదాలకు పుట్టినిల్లు
జవాబు.వేదశాఖలు వెలిసెనిచ్చట.
ఆ. కాకతీయుల యుద్ధ నైపుణ్యం
జవాబు.కాకతీయుల కదన పాండితి.

ఇ. లేత మాటలు చెవులకింపుగ
జవాబు.చివురు పలుకులు చెవులవిందుగ.
ఈ. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
జవాబు.ఉపనిషన్మధువొలికె నిచ్చట.
ఉ. నవరసాలు నాట్యమాడాయి.
జవాబు.నవరసమ్ములు నాట్యమాడగ

III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి.
జవాబు.చరిత్రలో భారత దేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. కాకతీయరాజులు గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు, విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయలు తమ పరాక్రమంతో శత్రువులను మట్టుపెట్టి సుస్థిర రాజ్యాన్ని స్థాపించారు. వీరశివాజీ మన దేశాన్ని శత్రువుల బారినుండి కాపాడిన మహావీరుడు.

ఆ) “బానిసతనం” అంటే ఏమిటి ?
జవాబు.“బానిసతనం” అనగా ‘దాస్యము’ అని అర్థం. స్వేచ్ఛగా బతకలేకపోవడం, ఇతరుల అధికారానికి లోబడి ఉండడం బానిసతనం. ఆంగ్లేయులు మనదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి నెమ్మదిగా మనమీద పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలకు పైగా మనలను పాలించారు. ఆ సమయంలో ఆంగ్లేయులు మనలను చిత్రహింసలకు గురిచేశారు. ఆంగ్లేయుల అహంకారానికి ‘మనం 200 సంవత్సరాలు పైగా బానిసతనం’ చేయవలసి వచ్చింది. చివరకు మనదేశ ప్రజలు ఉద్యమాలు నడిపి వారిని తరిమికొట్టారు.

ఇ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
జవాబు.“భరతఖండంబు” సిరులు పొంగిన, జీవమున్న భూమి.
పాడి పంటలతో వర్ధిల్లుతుంది.
విస్తారమైన అడవులు సమృద్ధిగా ఉన్నాయి.
అనేక నదీజలాలు మన దేశాన్ని సమృద్ధం చేస్తున్నాయి.
అటువంటి భారతదేశాన్ని భాగ్యసీమ అనడంలో సందేహం లేదు.

ఈ) రాయప్రోలు సుబ్బారావుగారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
జవాబు.భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

2. కింది ప్రశ్నలకు పదేసి పంక్తులలో జవాబులు రాయండి.
 1.భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు.మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలుగల భాగ్యదేశం. వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్ర భూమి ఇది. అయితే ఆ కాలం నాటి గొప్పతనం, చరిత్ర పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. అవన్నీ మరుగున పడిపోయాయి.
మనందరం భారతీయులం. కాబట్టి మనం మనదేశ గొప్పదనాన్ని గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పవిత్రమైన నదులు, పవిత్రమైన అరణ్యాలున్నాయి. “భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం” మనది. మనదేశం మతసామరస్యానికి (ఆలవాలం) నిలయం. ఇవన్నీ మనదేశానికి ఉన్న ప్రత్యేకతలు. మనందరం మనదేశము యొక్క గొప్పదనాన్ని గూర్చి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. అప్పుడే మనం ఏ దేశం వెళ్ళినా, మన దేశం యొక్క గొప్పదనాన్ని గూర్చి విదేశీయులకు చక్కగా వివరించగలుగుతాం.
 2.శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి.
జవాబు.భారతదేశం సిరిసంపదలకు నిలయం. ఇక్కడ వేదాలు, వేదాంగాలు వెలిసినాయి. ఆదికావ్యమైన రామాయణం వాల్మీకి రాశాడు. వ్యాసుడు మొదలైన గొప్ప ఋషులకు ఇది నివాసం. అందమైన అడవులు, మహావృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఉపనిషత్తులు రాయబడ్డాయి. తత్త్వవేత్తలకు నిలయమైన పుణ్యభూమి భారతదేశం. సూత్రయుగములనాటి సంస్కారము, క్షేత్రయుగములనాటి శౌర్యము ఈ నడుమ వచ్చిన బానిసత్వంతో చెరిగిపోయేవికావు. ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి చిరకాలం పాడుకుందాం.
చెవులకు ఇంపైన పదాలు కూర్చి నవరసభరితంగా కావ్యాలు రాసిన మంచి మనసుగల కవులను గౌరవిద్దాం. దేశమంతా తిరిగి దేశచరిత్రను ప్రపంచవ్యాప్తంచేసి ధీరులను గురించి తెలుసుకుందాం. ధర్మపరులైన పాండవుల పరాక్రమాన్ని తెలిపే మహాభారత కథను, లోకాన్ని వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని గానం చేద్దాం. తుంగభద్రతీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి జగద్విఖ్యాతుడైన తెలుగురాజు శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుందాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

అ. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
జవాబు. నేను భరతమాతను. సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగుతున్నాను. రామాయణ, భారత భాగవతాలను రచించిన వాల్మీకి, వ్యాసులకు తల్లినైనాను. ఔషధాలతో నిండిన అరణ్యాలెన్నో నాలో ఉన్నాయి. బలపరాక్రమాలు కలిగిన రాజులకు జన్మనిచ్చి పోషించాను. వీరాధివీరులైన నాయకులై నా బిడ్డలవలన నా కీర్తి ప్రపంచ వ్యాప్తమైంది. నా బిడ్డలైన కౌరవ పాండవులు ధైర్యసాహసాలతో కురుక్షేత్ర యుద్ధం చేశారు. వారందరిని భక్తి శ్రద్ధలతో పాడుకోండి. పవిత్రమైన నదులెన్నో నాపై ప్రవహిస్తున్నాయి. వాటిలో మధురజలాలను తాగడానికి, పంట పొలాలకు ఉపయోగించుకోండి. అందరూ కలిసి నా గొప్పతనాన్ని గానం చేయండి. జన్మధన్యం చేసుకోండి అని భరతమాత తన ఆత్మకథను తెలిపింది.
ఆ. మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు.మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపద గాయకులం
మా ఊరిలో బడి ఉంది
మా ఊరిలో గుడి ఉంది.
మా ఊరు మారుమూలపల్లె. పంట పొలాలున్నాయ్
మా ఊరి చుట్టుపట్ల మామిడితోటలున్నయ్
మా ఊరికి మైలుదూరాన.
మా ఊరు మారుమూలపల్లె
వ్యవసాయం మా జీవనం
పదిమందికి సాయమే మాకు మనోబలం
ఐఏయస్ లయిండ్రు మా ఊరిపోరగాండ్రు
ఐపియస్ లయిండ్రు మా ఊరి చెల్లెండ్రు
మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపదగాయకులం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి.

అ. ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తూంటారు.
జవాబు.విపినాలు = అడవులు 
సొంతవాక్యం : అనేక రకాలైన పక్షులు, జంతువులు అడవులలో ఉంటాయి.

ఆ. మనందరం భూ తలం మీద నివసిస్తున్నాము.
జవాబు.తలం = ప్రదేశం, చోటు
సొంతవాక్యం : భారతదేశంలో పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఇ. ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
జవాబు.మేళవింపు = కలియు, జతగూర్చు.
సొంతవాక్యం : నవరసాల జతకూర్చు మన తెలుగు నాటకాలు.

ఈ. తేనెటీగలు మధువును ఇస్తాయి.
జవాబు. మధువు = తేనె
సొంతవాక్యం : తేనెను పాలల్లో వేసి పిల్లలు ప్రతిరోజూ తాగటం వల్ల బలం వస్తుంది.

ఉ. నేటి బాలలే భావి భారతపౌరులు.
జవాబు.భావి = భవిష్యత్తు
సొంతవాక్యం : విద్యార్థులు భవిష్యత్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి.

ఊ. సైనికులకు చేవ ఉండాలి.
జవాబు.చేవ = సారము, ధైర్యము.
సొంతవాక్యం : యుద్ధమునందు సైనికులకు ధైర్యము ఉండాలి.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి.
అ. అధిక సంపదలు కలిగినవారికంటే గుణవంతులే గొప్ప.
జవాబు.శ్రీలు, భాగ్యములు.
ఆ. మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటీషువారి కింద బానిసతనంలో మగ్గిపోయింది.
జవాబు.బానిసతనం, దాస్యం
ఇ. మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి.
జవాబు.మంచివారు, గొప్పవారు, మహనీయులు
ఈ. వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది.
జవాబు.వేడి, కాక
ఉ. వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు.
జవాబు.వ్యాసుడు, బాదరాయణుడు.
3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.
అ. విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
జవాబు.విపినాలు, అరణ్యాలు
ఆ. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
జవాబు.ధరణి, గడ్డ వీరులు, పౌరుషవంతులు జన్మించిన, పుట్టిన
ఇ. గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
జవాబు.కలకాలం, ఎల్లప్పుడు
ఈ. విశాలమైన మన దేశంలో విస్తారమైన అడవులున్నాయి.
జవాబు.విశాలమైన, విస్తారమైన.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలను చదువండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ఉదా : ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ! – ఆశ్చర్యార్థక వాక్యం
అ) పనిని త్వరగా పూర్తిచేయాలి.
జవాబు.నిశ్చయార్థక వాక్యం
ఆ) చుట్టాలు ఎప్పుడు వస్తారు.
జవాబు.ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఈ పుస్తకం వెల ఎంత.
జవాబు.ప్రశ్నార్థక వాక్యం
ఈ) పాఠం అందరూ చదువుకొని రండి.
జవాబు.విధ్యర్థక వాక్యం
ఉ) మీరు నానుండి తెలుసుకోండి.
జవాబు.విధ్యర్థక వాక్యం
కింది వాక్యాలను చూద్దాం.
అతడు వస్తాడో? రాడో?
రేపు వర్షం పడవచ్చు.
ఈ రోజు ఎండ కాస్తుందో? లేదో?
ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది.
పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.

లోపలికి రావచ్చు.
కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
మీరు వెళ్ళవచ్చు.
ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు’.
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

ఇతరులను ఎగతాళి చేయవద్దు.
నీటిని వృథా చేయవద్దు.
ఎక్కువసేపు నిద్రపోవద్దు.
ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి “నిషేధార్థక వాక్యాలు”.

ఒక పనిని చేయవద్దనే (నిషేధించే) అర్థాన్ని సూచించే వాక్యం ‘నిషేధార్థక వాక్యం”.

2. కింది వాక్యాలను చదువండి. అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
అ) అట్లా అనుకోకండి.
జవాబు.నిషేదార్థక వాక్యం
ఆ) నేను చెప్పింది విన్నారో ! లేదో !
జవాబు.సందేహార్థక వాక్యం

ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో ! లేదో !
జవాబు.సందేహార్థక వాక్యం

ఈ) మీరెప్పుడైనా రావచ్చు.
జవాబు.అనుమత్యర్థక వాక్యం

ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు.
జవాబు.నిషేదార్థక వాక్యం

ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు.
జవాబు.అనుమత్యర్థక వాక్యం
ఋ) అబ్బ ! ఎంత వర్షం కురిసింది.
జవాబు.
ఆశ్చార్యార్థక వాక్యం

ౠ) మనసు పెట్టి వినండి.
జవాబు.విద్యర్థక వాక్యం

ప్రాజెక్టు పని:

భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు
1. భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
అసేతుహిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు

త్రివేణిసంగమ పవిత్రభూమి
నాల్గువేదములు పుట్టినభూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి

2. జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి
జయజయజయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి॥
జయజయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలితలలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా||
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథవిహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా॥ (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి)

3. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీజాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
జనియించి నాడవీ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోసె నీ తల్లి కనకగర్భమున
లేదురా ఇటువంటి భూదేవి ఎందు
లేరురా మనవంటి పౌరులింకెందు
పాడరా నీ తెల్గు బాలగీతమును
పాడరా నీ వీర భావభారతము (రాయప్రోలు సుబ్బారావు)

విశేషాంశాలు
నవరసాలు : శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. వీటిని నవరసాలు అంటారు.
 1.భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకన్నారు ?
జవాబు.వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న భూమి ఇది. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు.
2.దేశగౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.
జవాబు.రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన కాకతీయ వీరుల పరాక్రమం ప్రపంచ ప్రఖ్యాతం. పాండవులు ధర్మాన్ని పాటించి కురుక్షేత్రయుద్ధంలో కౌరవుల అధర్మాన్ని నాశనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన బలపరాక్రమాలతో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కళలను, కళాకారులను పోషించాడు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ సాటిలేనిది.

3.యుద్ధాలు ఎందుకు చేస్తారు ? యుద్ధాలవల్ల లాభమా ? నష్టమా ? ఎందువల్ల ?
జవాబు.1) ఏదైనా ఒక దేశము యొక్క అధికార యంత్రాంగం కాని, సైన్యంగాని బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఆక్రమించుకొనటానికి బలంగాఉన్న దేశాలు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుంటాయి.
2) యుద్ధాలవల్ల రెండు పక్షాలలోనూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. యుద్ధసామాగ్రికి ఎంతో ధనం నష్టపోతాము. యుద్ధాలవల్ల నష్టాలను పూడ్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది.
3) కొన్ని అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెగబడి యుద్ధాలు చేసి ఆ దేశ నాయకులను, సామాన్యపౌరులను చిత్రహింసలకు గురిచేసి చంపేస్తాయి.
4) కొన్ని దేశాల ప్రజలు యుద్ధాలకు భయపడి బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తారు. పై విషయాలను గమనిస్తుంటే యుద్ధాలవల్ల నష్టాలేగాని లాభం ఏ మాత్రం ఉండదు అని నా అభిప్రాయము 
 4.మీకు తెలిసిన కొందరు ప్రాచీన, ఆధునిక తెలుగుకవులను గురించి తెలపండి.
జవాబు.తెలుగులో ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతానికి శ్రీకారం చుట్టాడు. తరువాత వచ్చిన తిక్కన, ఎర్రన భారతాన్ని పూర్తిచేశారు. పోతన, శ్రీనాథుడు గొప్ప కవులు పండితులు. శ్రీకృష్ణదేవరాయలు కవిరాజు. అష్టదిగ్గజ కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. వీరంతా ప్రాచీనకవులు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, చిన్నయసూరి, తిరుపతి వేంకటకవులు, వేటూరిప్రభాకర శాస్త్రిగారు, దాశరథి, బి. రామరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ఆధునిక కవులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది.
5.గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.“రాయప్రోలు సుబ్బారావు” గారు రచించిన ఈ గేయం చాలా బాగుంది. దీనిని చదువుతుంటేనే శరీరం గగుర్పాటుకు గురౌతున్నది. కవి హృదయంలో నుండి ఈ గేయం పొంగిపొర్లింది. కవికి గల దేశభక్తి బాగా తెలుస్తున్నది. భారతదేశ ఔన్నత్యాన్ని బాగా అవగాహన చేసుకొని భక్తితో ఈ దేశభక్తి గేయాన్ని కవి రచించారు. రచయిత ఈ గేయాన్ని రచించి

‘మాతృదేశం’ పట్ల తనకు గల గౌరవాన్ని చాటుకొన్నారు.
మన దేశంలో వేదాలు పుట్టాయని, భారత రామాయణాది గ్రంథాలు జన్మించాయని, వ్యాస, వాల్మీకాది కవులు జన్మించిన పుణ్యభూమి అని కవి దేశ గౌరవాన్ని చాటి చెప్పారు. తెలుగు కవులు తేట తెలుగు పదాలతో చెవులకు ఆనందం కలిగించే విధంగా కవిత్వం రాశారని, వాటిద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచమంతా వ్యాపించాయని కవి తమ అభిప్రాయాలను చక్కగా వివరించారు.
పర్యాయ పదాలు
శ్రీలు – సంపదలు, భాగ్యములు
పాలు – క్షీరము, దుగ్ధము
వేదము – ఆమ్నాయము, ఋషి
కావ్యము – కృతి, గ్రంథము
విపినం – అరణ్యం, అడవి
వృక్షం – చెట్టు, భూరుహము
మధువు – తేనె, పవిత్రము
దీప్తి – కాంతి, వెలుగు
రణం – యుద్ధం, సమరం, కదనం
కత్తి – అసి, ఖడ్గం
కదనం – యుద్ధం, రణం
భంగం – అల తరంగ
నింగి – ఆకాశం, గగనం
వ్యతిరేక పదాలు
ఆది × అంత
నింగి × నేల
గౌరవం × అగౌరవం
పుణ్య × పాపం
ప్రకృతులు – వికృతులు

ప్రకృతి – వికృతి

శ్రీ – సిరి
భక్తి – బత్తి, బగితి
కావ్యం – కబ్బం
హృదయం – ఎద, ఎడ, ఎడద
కవిత – కయిత, కైత
గౌరవం – గారవం
కథ – కత, కద
సంధులు

జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వసంధి
భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వసంధి
అత్వసంధి : సూత్రం – అత్తునకు సంధి బహుళము.
విమలతలమిదె – విమలతలము + ఇదే – ఉత్వసంధి
కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
దేశమరసిన – దేశము + అరసిన – ఉత్వసంధి
ఉత్వసంధి : సూత్రం – ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
క్రింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

వేద శాఖలు వెలసె నిచ్చట
ఆది కావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !

ప్రశ్నలు:
1. ‘వేదశాఖలు’ అనగా నేమి ?
జవాబు.వేదశాఖలు అనగా వేదాలు, వేదాంగాలు
2. ‘ఆదికావ్యం’ అనగా ఏది ?
జవాబు.ఆదికావ్యం అనగా శ్రీమద్రామాయణము.
3. ‘బాదరాయణుడు’ అంటే ఎవరు ?
జవాబు.బాదరాయణుడనగా వేదవ్యాసుడు.
4. “పరమ” అనగా ఏమిటి ?
జవాబు.పరమ అనగా ‘శ్రేష్ఠమైన’ అని అర్థం.
5. ఈ గేయాన్ని ఎవరు రచించారు ?
జవాబు.ఈ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు రచించాడు.
క్రింది గేయ భాగాలను చదివి ప్రశ్నలు తయారుచేయండి.
1. “లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా!”
జవాబు.
1. ఈ గేయం దేన్ని గురించి చెబుతోంది?
2. చీకిపోవడం అంటే ఏమిటి?
3. కాకతీయులెటువంటివారు?
4. ఈ గేయం దేన్ని గురించి పాడమంటోంది?
5. ఎలా పాడమంటోంది?

2. పాండవేయుల పదునుకత్తులు
మండి మెరసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవే చెల్లెలా !
జవాబు.
1. పాండవేయులు అంటే ఎవరు?
2. కత్తులు ఎటువంటివి?
3. రణకథ అంటే ఏమిటి?
4. కత్తులు ఎవరివి?
5. రణకథను ఎలా పాడాలి?

ఈ గేయభాగంలోని పదాల క్రమాన్ని సరిచేసి రాయండి. భావం రాయండి.
1. వృక్ష విపిన బంధుర వాటిక
నిచ్చట వొలికె ఉపనిషన్మధు
విస్తరించిన తత్త్వము విపుల
తలమిదె విమల తమ్ముడా !”
జవాబు.
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా

భావం : ఓ తమ్ముడా! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది- అని పద్యభావం.

2. నాట్యమాడగ రసమ్ములునవ
పలుకులు విందుగ చివురు చెవుల…
కాంత కవితలల్లిన హృదయుల
చెల్లెలా గారవింపవె !
జవాబు.నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా!
భావం : ఓ చెల్లెలా! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పద్యభావం.

కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలకృష్ణగోఖలే ముఖ్యులు. ఈయన గాంధీజీకి రాజకీయ గురువు, ధైర్యశాలి. వందేమాతర గీతం ద్వారా ప్రజలను చైతన్యపరచిన బంకించంద్ర చటర్జీ ధీశాలి. బ్రిటిషువారిని గడగడలాడించిన లాలాలజపతిరాయ్ “పంజాబ్ కేసరి”గా ప్రసిద్ధి చెందారు. బ్రిటిషు వారి దుర్మార్గాలను ఎదిరించిన తాంతియాతోపే గొప్పవీరుడు. 1859లో ఏప్రియల్ 18న ఈయనను బ్రిటిషువారు ఉరితీశారు. బ్రిటిషు పాలకుల నెదిరించి ప్రజలను చైతన్యపరచిన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఏమాత్రం జంకని వీరనాయకుడు. ‘సైమన్ గోబ్యాక్ అని నినదించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యశాలిగాక మరెవ్వరు.
ప్రశ్నలు:
1. గోపాల కృష్ణ గోఖలే ఎవరు ?
జవాబు.గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు.
2.. వందేమాతరం గీతం ఎవరు రాశారు ?
జవాబు.
వందేమాతరం గీతం బంకించంద్ర ఛటర్జీ రాశారు.
3. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు ?
జవాబు.
లాలాలజపతిరాయ్ ని ‘పంజాబ్ కేసరి’ అని పిలుస్తారు.
4. ప్రకాశం పంతులు ఏమని నినాదం చేశారు ?
జవాబు.ప్రకాశం పంతులు ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదం చేశారు.
5. 1859 ఏప్రియల్ 18న బ్రిటిష్వారు ఎవరిని ఉరితీశారు ?
జవాబు.1859 ఏప్రిల్ 18న తాంతియాతోపేను బ్రిటీష్వారు ఉరితీశారు.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
‘భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాలమైన దేశం. ఎంతో మంది రాజులు దీనిని పాలించారు. కళలను పోషించి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదేశం. ఉన్నతులైన వైద్యులను, శాస్త్రవేత్తలను తయారుచేసి ప్రపంచంలో తన గొప్పతనాన్ని చాటుకున్నది.
ప్రశ్నలు:
1. భారతదేశం ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించింది?
జవాబు.
భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది.

2. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిందెవరు ?
జవాబు.
మనదేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు

3. మన దేశానికి గొప్పదనం ఎవరివల్ల వచ్చింది ?
జవాబు.
ఉన్నతమైన వైద్యులు, శాస్త్రవేత్తల వలన

4. మనదేశం ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం

5. పై పేరాలోనుంచి ఒక వ్యతిరేక పదముల జంటను రాయండి.
జవాబు.
భిన్నత్వం × ఏకత్వం

కింది పదాలు విడదీసి, సంధిపేర్లు రాయండి.

1. భాగ్యసీమయి
జవాబు.
భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వ సంధి

2. కవితలల్లిన
జవాబు.
కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి

3. రాగమెత్తి
జవాబు.
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి

సంధిగల పదం గుర్తించి, విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
1.. రాలు కరగగ రాగమెత్తి
జవాబు.
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
2. శ్రీలు పొంగిన జీవగడ్డయి
జవాబు.
జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వ సంధి
3. దేశాన్ని గురించి కవి ఇట్లనెను
జవాబు.ఇట్లనెను ఇట్లు + అనెను – ఉత్వసంధి

26. కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.
1. నవరసాల ………… నిండి, తేట తెలుగు మాటల ………… చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవుల ………… గౌరవించాలి.
జవాబు.
నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జీవగడ్డ
జవాబు.భారతదేశము సిరులు పొంగిన జీవగడ్డ.
2. భాగ్యసీమ :
జవాబు.భారతదేశము పాడిప
3. శౌర్యచండిమ :
జవాబు.కాకతీయ రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
4. చెవుల విందు :
జవాబు.బాలమురళి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
5. చీకిపోవని :
జవాబు.ఆంధ్రుల తేజస్సు చీకిపోవని చేవగలది.
కింది పదాలకు వ్యతిరేకపదాలు రాసి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.
1. ధీరుడు
జవాబు.ధీరుడు × భీరుడు
నా మిత్రుడు భీరుడు కాదు
2. ఆది
జవాబు.ఆది × అనాది
మన దేశంలో వరకట్న దురాచారం అనాదిగా వస్తోంది.
3. పదను
జవాబు.పదను × మొండి
మొండి మనుషులు ఏమి చెప్పినా అర్ధం చేసుకోరు.
గేయం – అర్థాలు – భావాలు
1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా !
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
శ్రీలు = సంపదలు
పొంగిన = పొంగినటువంటి
జీవగడ్డ + అయి = ప్రాణముగల భూమి అయి
పాలు పారిన = = పాలు ప్రవహించిన
భాగ్యసీమ+అయి = సంపదలుగల దేశం అయి
ఈ భరతఖండము = ఈ భారతదేశము
వరలినది = వర్దిల్లినది
భక్తిపాడర = భక్తితో పాడుము

భావం: మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. ఓ తమ్ముడా! అలాంటి భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలని భావము.

2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
వేదశాఖలు = వేదాలు వేదాంగాలు
ఇచ్చటన్ = ఇక్కడ (ఈ భారతదేశంలో)
వెలసెన్ = వెలిశాయి
ఇచ్చట = ఇక్కడ, ఈ భారతదేశంలో
ఆదికావ్యంబు = మొదటి కావ్యం (వాల్మీకి రచించిన రామాయణం)
అలరెన్ = ప్రకాశించింది
ఇది = ఈ భారతదేశము
బాదరాయణ = వేదవ్యాసుడు మొదలుగా గల
పరమ ఋషులకు = శ్రేష్ఠులైన ఋషులకు (మునులకు)
పాదుసుమ్ము = కుదురుసుమా !
భావం: ఓ చెల్లెలా ! వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం అని పై పద్యభావం.
3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమలతల మీదె తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
ఇచ్చట = ఇక్కడ (ఈ భారతదేశంలో)
విపిన = అడవియందలి
బంధుర = దట్టమైన
వృక్షవాటిక = చెట్ల తోపు
ఉపనిషత్+మధువు = వేదాంతము అనెడి తేనెను
ఒలికెన్ = చిందించింది.
ఇదె = ఈ భారతదేశమే
విపుల = విపులమైన, విరివియైన
తత్త్వము = సత్యమును
విస్తరించిన = ప్రసరింపజేసిన
విమలతలము = పవిత్రమైన భూమి
భావం: ఓ తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది పద్యభావం.
4. సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్రదాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెను చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
సూత్రయుగముల = సూత్రాలను చెప్పిన కాలం నాటి
శుద్ధవాసన = స్వచ్ఛమైన సంస్కారం
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
క్షాత్రయుగముల క్షత్రియుల కాలం నాటి =
చిత్ర దాస్యముచే = వింత బానిసతనం వల్ల
చరిత్రల = కథల నుండి
చెరిగిపోయెను = అంతరించిపోయాయి
భావం: ఓ చెల్లెలా ! సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పదనం, ప్రచండ పరాక్రమం ఉన్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ విదేశీయుల క్రింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి అని పై పద్యభావం.
5. మేలికిన్నెర మేళవించీ
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
మేలికిన్నెర = శ్రేష్ఠమైన వీణను
మేళవించ = కలిపి, జతగూర్చి
రాలు కరగగ = రాళ్ళను కూడా కరిగించగల
రాగమెత్తి = రాగమును గ్రహించి
పాలతీయని = పాలవంటి తియ్యనైన
భావిభారత = భావి భారతదేశ భాగ్యాన్ని గురించి
పదము = పాటలను
పాడర = పాడాలి
భావం: ఓ తమ్ముడా! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో, బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాటలు పాడుకోవాలని భావం.
6. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
నవరసమ్ములు = తొమ్మిది రసములు
నాట్యము + ఆడగ = నాట్యము చేయునట్లుగా
చివురుపలుకులు = చిగురు వంటి మెత్తనైన మాటలు
చెవుల విందుగ = చెవులకు ఇంపు కలుగ జేయు నట్లుగా, వినసొంపుగా
కవితలు+అల్లిన = కవిత్వాన్ని కూర్చిన
కాంతహృదయులన్ = మనోహరమైన మనస్సులు గలవారైన కవులను
గారవింపవె = గౌరవింపుము
భావం: ఓ చెల్లెలా ! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పై పద్యభావం.
7. దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
దేశగర్వము = దేశము యొక్క గౌరవము, గొప్పదనం
దీప్తి చెందగ = ప్రకాశించేటట్లు
దేశ చరితము = దేశము యొక్క చరిత్ర
తేజరిల్లగ = ప్రకాశించేటట్లుగా
దేశము + అరసిన = భారత దేశాన్ని కాపాడిన
ధీరపురుషుల = వీరపురుషులను గురించి
తెలిసి = తెలుసుకొని
పాడ = పాడుము
భావం: ఓ తమ్ముడా ! దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని పాడాలని భావం.
8. పాండవేయుల పదును కత్తులు
మంది మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
పాండవేయుల = పాండవుల యొక్క
పదును కత్తులు = పదునైన కత్తులు
మండి = మండుతూ
మెఱసిన = ప్రకాశించిన
మహిత = గొప్ప దైన
రణకథ = కురుక్షేత్రయుద్ధ కథను గుఱించి
కండగల = దృఢమైన, స్థిరమైన
చిక్కని = చక్కని తెలుగు పదాలతో
తెలుంగుల = తెలుగువారితో
కలసి = కలిసి
పాడవె = పాట పాడుము
భావం: ఓ చెల్లెలా ! పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి దృఢమైన తెలుగు వారితో కలసి పాడుకోవాలని పై పద్యానికి భావం.
9. లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదములు
చేర్చి పాడర తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా! = ఓ తమ్ముడా !
లోకమంతకు = ప్రపంచమంతటికీ
కాక పెట్టిన = వేడెక్కించిన
కాకతీయుల = కాకతీయరాజుల యొక్క
కదన పాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
చీకిపోవని = బలహీనముకాని
చేవపదముల = శక్తివంతమైన మాటలను
చేర్చి = కూర్చి
పాడర = పాడుమా !
భావం: ఓ తమ్ముడా! ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో పాడుకోవాలని పై పద్యభావం.
10. తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడని తెలుంగునాథుల
పాట పాడవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
తుంగభద్రా = తుంగభద్రానది యందలి
భంగములతో = అలలతో
పొంగి = ఉప్పొంగి
నింగిని = ఆకాశాన్ని
పొడిచి = పిడికిలితో కొట్టి
తుళ్ళి = గర్వించి
భంగపడని = ఓటమిని పొందని
తెలుగునాథుల = ధైర్యం గల తెలుగు రాజుల గురించి (శ్రీకృష్ణ దేవరాయలు)
పాట పాడవె = పాట పాడుమా !
భావం: ఓ చెల్లెలా ! తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కు చెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని పై పద్యభావం.






ప్రాజెక్టు పని 
భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి నివేదికను రాశి ప్రదర్శించండి. 
ప్రాథమిక సమాచారం

ప్రాజెక్టు శీర్షిక: భారతమాతను స్తుతించే గేయాలు
ప్రాజెక్టు సంఖ్య: 4
విద్యార్థి పేరు: __________
తరగతి: ఎనిమిదవ తరగతి
క్రమ సంఖ్య: ___
తేది: __________

నివేదిక
భారతదేశం మన మాతృభూమి. ఈ పవిత్ర భూమిని “భారతమాత”గా భావించి ఎన్నో గేయాలు రచించబడ్డాయి. ఈ గేయాలు మనలో దేశభక్తిని, ఐక్యతను, త్యాగస్ఫూర్తిని పెంపొందిస్తాయి. భారతమాతను స్తుతించే కొన్ని జాతీయ గీతాల పల్లవులను సేకరించి వాటి భావాన్ని ఈ నివేదికలో అందిస్తున్నాను.

“వందే మాతరం” జాతీయ గీతం భారతమాతను ప్రకృతి సౌందర్యంతో నిండిన తల్లిగా చిత్రిస్తుంది.
పల్లవి:
“వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజశీతలాం”
ఈ గేయం స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. దేశం పట్ల ప్రేమను రగిలించింది.
“జన గణ మన” మన జాతీయ గానం.
పల్లవి:
“జన గణ మన అధినాయక జయ హె
భారత భాగ్య విధాత”
ఈ గేయం భారతదేశంలోని అన్ని ప్రాంతాల ఐక్యతను ప్రతిబింబిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావాన్ని బలపరుస్తుంది.
“సారే జహాం సే అచ్చా” గేయం దేశ గౌరవాన్ని తెలియజేస్తుంది.
పల్లవి:
“సారే జహాం సే అచ్చా
హిందోస్తాం హమారా”
ఈ గేయం భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా కొనియాడుతుంది. సోదరభావం, శాంతి, సంస్కృతిని ప్రశంసిస్తుంది.
“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం ప్రాంతీయ గర్వాన్ని తెలియజేస్తుంది.
పల్లవి:
“మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతి”
ఈ గేయం భాషా సంస్కృతిని గౌరవిస్తూ దేశ ఐక్యతకు తోడ్పడుతుంది.
ఈ గేయాలన్నీ భారతమాతను స్తుతిస్తూ దేశభక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పండుగల సందర్భంగా ఈ గేయాలను పాడడం ద్వారా మనం దేశానికి గౌరవం తెలుపుతాము. విద్యార్థులు ఈ గేయాల భావాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మంచి పౌరులుగా ఎదగగలరు.
ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలు: ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ గీతాల ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. దేశభక్తి, ఐక్యత, గౌరవం వంటి విలువలు మన జీవితంలో ఎంత ముఖ్యమో గ్రహించాను. భారతమాత పట్ల ప్రేమ, బాధ్యత మరింత పెరిగింది.
ముగింపు: భారతమాతను స్తుతించే గేయాలు మన హృదయాలలో దేశప్రేమను వెలిగిస్తాయి. ఈ గేయాలు మన సంస్కృతి, ఐక్యత, గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. భారతమాతకు వందనం చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి.

Vii. 9. ఏ కులం

7.ఏ కులం

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

ప్రశ్నలు
 1.పై బొమ్మలో ఎవరెవరున్నారు?
పై బొమ్మలో ఉపాధ్యాయిని, ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని ఉన్నారు.
2.నల్లబల్లపైనున్న పద్యం ఏ శతకంలోనిది?

నల్లబల్లపైనున్న పద్యం వేమన శతకంలోనిది.
3.ఆ పద్యం ఏ సందేశాన్నిస్తుంది?.
ఏ కులంలో పుట్టారన్నది ముఖ్యంకాదు, మంచి గుణములు కలవారా, కాదా అన్నది గమనించాలి అని ఆ పద్యం సందేశాన్నిస్తుంది.

పాఠం ఉద్దేశం

సమాజంలో అనేక కులాలవారు, తెగలవారు, వృత్తులవారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన ‘జన్మహక్కు’ అనే కవితా సంపుటిలోనిది.

కవి పరిచయం
చెరబండరాజు అసలుపేరు బద్దం భాస్కరరెడ్డి. 
నల్లగొండజిల్లాలోని అంకుశాపురం ఇతని సొంతూరు. 
ఈయన ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 
1965లో దిగంబర కవిగా మొదలై, 1970 తర్వాత విప్లవగేయాలు, కథలు, నవలలు రాశాడు. ‘గమ్యం’, ‘ముట్టడి’, ‘పల్లవి’ ఇతని కవితా సంకలనాలు. “కత్తిపాట” ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు, ధిక్కారస్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు.

ప్రవేశిక

మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా, శరీరమంతా బాధపడుతుంది గదా! అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనదంతా ఒకేజాతి – మనమంతా భారతీయులం. ‘ఐకమత్యమే మహాబలం’ అనే విషయాన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.


ఆలోచించండి – చెప్పండి (Page No.86)
1.కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది?
జవాబు.
కొలిమి దగ్గర పనిచేస్తుంటే ఆ సెగలకు పొగలకు కార్మికుల పేగులు కాలిపోతున్నాయి. బొగ్గుగనులలో తవ్వుతుంటే కమ్ముకునే దుమ్ము గొంతులోకి పోయి ఊపిరాడకపోవటం, దగ్గతూ ఉండటం జరుగుతుంది. అలా కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తున్నది.

2.ఈ “మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు” అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి?
జవాబు.
మాగాణం అంటే శ్రేష్ఠమైన భూమి. అందులో వ్యవసాయం చేస్తే నాణ్యమైన పంటే చేతికందుతుంది. అంత కష్టపడి అటువంటి మంచి పంట పండించి మనకందించే రైతుకు తినడానికి ఏమీ మిగలడం లేదు. అడుగుబొడుగూ మిగిలినది ఏదో తింటాడు అని చెప్పటం కవి ఉద్దేశం.

ఆలోచించండి – చెప్పండి ( Page No.87)

 1.
రామకోటి రాసే కాగితాన్నీ, పూలబుట్టను కష్టపడి తయారుచేసిన వారిపట్ల మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
కార్మికుడు కాగితాలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తే కాగితాలు పుస్తకాలుగా తయారుచేస్తే ఆ పుస్తకాలలో మనం రామకోటి రాసుకుంటాం. మనమెంతో పుణ్యాత్ములమనుకుంటాం. అలాగే పూలబుట్టలు అల్లి తెచ్చిపెడితే వాటిలోకి పూలుకోసుకుని పూజలు చేసి పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటాం. కాని మనం పుణ్యం సంపాదించగలగడానికి సౌకర్యం కలిగించిన వారిని మాత్రం మర్చిపోతాం. నా ఉద్దేశంలో అవి తయారు చేసినవారే గొప్ప పుణ్యాత్ములు

 2.శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?
జవాబు.
శ్రమకు తగ్గ జీతం, ప్రతిఫలం శ్రామికుడికి రావడంలేదు. ముఖ్యంగా కుండలుచేసే కుమ్మరి గురించి చెప్పుకోవాలి. మనం తినే అన్నం వండుకోవడానికి కుండ కావాలి. ఆ కుండ తయారు చేయడానికి కుమ్మరి ఉండాలి. కానీ ఆ కుమ్మరికి కుండలు తయారీ డబ్బులు కూడా రాక, తిండికి ఇబ్బంది పడడం విచిత్రం.


3.ఈ “పాత రోత రథం విరిగిపోయింది” అని కవి అన్నాడు కదా! దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు. కొంతమంది పెత్తందార్లు కార్మికులను కర్షకులను తమ చేతికింద మనుషులుగా చేసుకొని వెట్టిచాకిరీ చేయిస్తూ వారికి కూటికి గతిలేకుండా చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఆ అమాయకులను మోసం చేస్తున్నారు. కాని కాలం మారింది. మెల్లగా వారిలోనూ చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా సాగిన జులుం ఇకపై సాగదు. అని చెప్పడానికి కవి “పాతరోత రథం విరిగిపోయింది” అన్నాడు.


4.శ్రీ శ్రామికులందరు చేయి చేయి కలిపి నిలబడితే ఏమి జరుగుతుంది?
జవాబు.
అన్ని వృత్తులవారూ ఏకమై చేయి చేయి కలిపితే స్వార్థపరుల ఆటలు సాగవు. సమసమాజం ఏర్పడుతుంది. ఆ నవసమాజంలో అందరూ సుఖంగా ఉంటారు.


ఇవి చేయండి

I విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “ఏకులమబ్బీ….” అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది? చర్చించండి.
జవాబు.
అన్ని వృత్తుల వారూ సమానమే. కులాలు మతాలు పేరుతో వారిని వేరుచేసి చూడటం తప్పు. వారు చేసే సేవల వల్లనే సమాజంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా జీవితం సాఫీగా గడిచిపోతోంది. కాబట్టి కులాల మధ్య స్వార్థంతో అనైక్యతను సృష్టించకూడదు అని సమాజానికి గుణపాఠం చెప్పటమే ఈ పాట ఉద్దేశం.



2. పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయా? దీనిమీద అభిప్రాయాలు తెలుపండి.
జవాబు.
ఈ పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు కష్టాల కడలిలో కొట్టుకు పోతున్నాయి. పగలూ రాత్రీ కష్టపడినా చాలినంత కూలి లేక చాలీచాలని తిండితో శ్రామికులు పస్తులతో బతుకు గడుపుతున్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే వారు రకరకాలుగా బాధలు పడుతూ అనారోగ్యం పాలౌతున్నారు. వారి కష్టాన్ని పట్టించుకొనే వారుగాని ఆదరించే వారుగాని లేరు. ఇవన్నీ గమనించిన తరువాతే కవి ఆ విధంగా చెప్పాడు.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. మనిషి జీవనగమనమంతా శ్రామికులమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి లౌకిక జీవన పార్శ్వాలన్నీ శ్రామికుల స్పర్శతో చైతన్యవంతమవుతాయి. పొద్దున్నే లేవగానే అవసరమయ్యే నీళ్ళు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగివున్నదో ఆలోచించామా? వేడివేడి చాయ్, కాఫీలు తాగే రుచి వెనుక పాలుపోసే పాలవాడిని గుర్తుచేసుకుంటామా? ఇల్లూ వాకిలిని పరిశుభ్రంగా ఉంచేవారిని, మనం వేసుకునే ఉతికిన దుస్తులు, ఇస్త్రీ మడతల వెనుక ఉన్న శ్రమ సౌందర్యాన్ని తలచుకున్నామా? అందమైన పూల తోటల పరిమళాలు, అపురూప శిల్ప సంపదలతో విలసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగిన కార్మికశక్తులను స్మరించుకున్నామా? ఇట్లా అడుగడుగునా మన అవసరాలకు, విలాసాలకు ఉపయోగపడే శ్రామికులు, కార్మికులు, వివిధ కులవృత్తులవాళ్ళు తీవ్రమైన సామాజిక వివక్షతకు గురౌతున్నారు.

చేసిన పనికి తగిన వేతనం లేక, సరైన గౌరవమూ లభించక శ్రమదోపిడికి, నిరాదరణకు గురౌతూ మానసిక వేదనలను అనుభవిస్తున్నారు. వారిపట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరమున్నది. ఆయా వృత్తుల వెనుక వున్న సాంస్కృతిక వారసత్వాన్ని సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి. శ్రామికుల స్వేదంతో ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవిద్దాం.

పై పేరా ఆధారంగా పట్టికను నింపండి.

శ్రమజీవులు వారి సేవలు
1. నీటి సరఫరా చేసే ఉద్యోగులు ఇంటింటికీ తెల్లవారేసరికి నీరు అందేట్లు కావలసిన ఏర్పాట్లు చేస్తారు.
2. పాలవారు చీకటినే లేచి పశువులను సిద్ధంచేసి పాలు పిండి అందరికీ అందిస్తారు.
3. పనివారు ఇల్లు, వాకిలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతారు. మన దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేస్తారు.
4. తోటమాలి అందమైన పూలతోటలు పెంచి ఆ పూల పరిమళాలను అందిస్తాడు.
5. శిల్పి చక్కని నిర్మాణంతో శిల్పాలతో దేవాలయాలను నిర్మిస్తాడు.
2. ఈ పాఠంలోని ప్రాసపదాలు రాయండి.

జవాబు.
ఉదా :
1. పెట్టినపుడు, ఎత్తినపుడు; ఇటుక చేసి, కొండ్రలేసి, ఇచ్చినపుడు చేసినపుడు, చిమ్మినపుడు, త్రవ్వినపుడు, దున్నినపుడు, చెక్కినపుడు;
2. పాత – రోత, ఎండలు – బండలు

III. స్వీయరచన


1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) “చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు.
ఈ సమాజంలో కులాలు మతాలు పేరుతో జనాన్ని వేరుచేసి చూడటం, ఎక్కువ తక్కువ అంటూ వర్గీకరించటం జరుగుతున్నది. ఈ భేదాల మూలంగా శ్రామికుల మధ్య విభేదాలు కల్పించి అనైక్యతను సృష్టిస్తున్నారు. వారి సేవలందుకుంటున్నప్పుడు కనబడని హెచ్చుతగ్గులు మిగతా సమయాలలో గుర్తురావడం బాధాకరం. ఆ శ్రామికులంతా ఏకమై కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ స్వార్థపరుల ఆటలు సాగవు అని కవి చెబుతున్నాడు.

ఆ) శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా? అభిప్రాయం రాయండి.
జవాబు.
శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభించటం లేదు. కనీసం వారిని మనుషులుగా కూడా గుర్తించడంలేదు. వారిచేత ఊపిరాడకుండా చాకిరీ చేయిస్తారు. తగిన కూలి మాత్రం ఇవ్వరు. వారు తిన్నారా? పస్తులున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, రోగాలతో బాధపడుతున్నారా? ఇవేవీ పట్టించుకోని స్వార్థపూరితమైన సమాజం మనది. అందుకే మన సమాజంలో శ్రమకు గుర్తింపులేదు.


ఇ) పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి.
జవాబు.
మన సమాజంలో ఇప్పటికీ బూజుపట్టిన సాంప్రదాయాలనూ ఆచారాలనూ పాటించే మూర్ఖులున్నారు. కులాలు-వాటిలో శాఖలు- ఎచ్చుతగ్గులు, మతాలు అంటూ రకరకాల భేదాలను కల్పించి సమాజాన్ని ముందుకు పోనివ్వరు. ఇలాంటి పాత కబుర్లకు కాలం చెల్లిపోయింది. సమాజంలో వస్తున్న మార్పులను అందరూ గుర్తించి పాటించాలి. అందరూ సమానమే అనే భావం కలిగి ఉండాలి. కలిసిమెలిసి ఉంటూ శాంతిని నెలకొల్పాలి అని కవి భావిస్తున్నాడు. అందుకే పాతకబుర్లకు చెదలు పట్టాయన్నాడు.

ఈ) పాఠం ఆధారంగా కవికి గల సామాజిక భావన ఎటువంటిదో రాయండి.
జవాబు.
కవి మన సమాజంలో కులమత భేదాలు నశించిపోవాలని కోరుకుంటున్నాడు. ఏ వృత్తియైనా గౌరవప్రదమైనదే. ఇతరుల ఉపయోగం కోసమే ఆయా వృత్తులు సాగిస్తున్నారు ఆ శ్రామికులు. మన అవసరాలు తీరుస్తున్న వారిని మనమెంతో గౌరవించాలి. వారి పనిలోని నేర్పరితనాన్ని గుర్తించి ప్రోత్సాహపరచాలి. అప్పుడు వారెంతో ఆనందిస్తారు. అలాగే వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి. అని కవి భావిస్తున్నాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ‘సమాజంలో మనుషులంతా ఒక్కటే’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
సమాజంలో మనుషులంతా ఒక్కటే. వారిలో కుల మత వర్ణ వర్గ విభేదాలు లేవు. అన్నీ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం కల్పించుకున్నవే. నేతపనివారు బట్టలు తయారుచేయకపోతే మన పరిస్థితి ఏమిటి? రైతు పత్తి పండించకపోతే నేతపని వారికి దారమెక్కడిది? రైతు పంటలు పండించాడు. అన్నం వండుకోడానికి కుండలు కావాలి కదా! కుమ్మరి వాడు ఆ కుండలు చేసి ఇస్తాడు. అతడికి సారె ఎక్కడిది? వడ్రంగి చక్రం తయారు చేయాలి. కమ్మరి దానికి పట్టా తయారు చేయాలి.

రైతు పొలం దున్నటానికి, పంట వెయ్యడానికి, కొయ్యడానికి కావలసిన పనిముట్లు కొడవలి, నాగలి, గొడ్డలి. ఇవన్నీ కమ్మరి, వడ్రంగి తయారు చెయ్యాల్సిందే. ధాన్యం మొయ్యాలంటే చెరగాలటే మేదరి బుట్టలు చేటలు అల్లాల్సిందే. కాళ్ళు కాలకుండా నడవాలంటే ఒకరు చెప్పులు కుట్టాల్సిందే. వానలో తడవకుండా ఉండాలంటే ఒకరు మేడలు కట్టాల్సిందే. వీరందరికీ ఎవరైనా మంచి చెడూ చెప్పేవారొకరు. వీరికి కష్టాలొస్తే కాపాడటానికొకరు. ఇలా సమాజంలోని మనుషులంతా ఒకరిమీద ఒకరు ఆధారపడి బతుకుతుంటే వీరిలో ఎక్కువ తక్కువలు ఎక్కడి నుండి వచ్చాయి. కాబట్టి మనుషుల మధ్య తేడాలేదు. అందరూ సమానమే.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ పాఠశాలలో ఈ గేయాన్ని అభినయించి చూపండి.

జవాబు.  విద్యార్థులు చేయవలసిన పని

(లేదా)

ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకొని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత/గేయం రాయండి.

i) పొలాల నన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి, ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!
నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్థిల్లాలని
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!
కావున – లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చే వేదన
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా-
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థదృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు
నా వినుతించే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం!

ii)
సమరం
సూర్యుడు ఉదయించగానే, మొదలౌతుందీ సమరం
మట్టిబొట్టు పెట్టుకొని, ఆయుధాలు పట్టుకొని
సమరానికి సాగుతారు, గుంపులుగా సైనికులు
దేనికోసమీ సమరం?, ఏమి గెలుచుకుంటారు?
కాలేకడుపులకోసం, పిడికెడు మెతుకులకోసం
సాగే ఈ సమరంలో, గెలిచేదేముంటుంది?
ఒక్కపూట అర్ధాకలి, ఒక్కపూట పస్తులు
ఎవరా సైనికులంటే, శ్రామికులూ కార్మికులూ
ఎవరు వారి శత్రువులు? కాలుతున్న కడుపులు
ఏవి వారి ఆయుధాలు? కొడవలి నాగలి రంపం
కత్తి సుత్తి ఉలి గొడ్డలి, చేతులలో నైపుణ్యం.

V. పదజాల వినియోగం.

1. కింద ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది.
జవాబు.
క్షీణించింది = తరిగి పోయింది.

ఆ) నేను మా బడిదగ్గర కమ్మరి కొలిమిని చూశాను.
జవాబు.
కొలిమి = కమ్మరివారు ఇనుమును కాల్చడానికి మంటపెట్టిన చోటు

ఇ) పొలంలోని కొండ్రలు చక్కని గీతలవలె ఉన్నాయి.
జవాబు.
కొండ్రలు = భూమి దున్నిన సాళ్ళు
గీతలవలె = చారలవలె

ఈ) మా వీధిలోని కుక్కకు తిండి లేక డొక్కలెండిపోయినాయి.
డొక్క = కడుపు

ఉ) పిల్లలు కబుర్లలో పడిపోయారు.
కబుర్లు = ముచ్చట్లు

ఊ) మన దేశంలో కూడు లేనివారు ఉండరాదు.
కూడు = బువ్వ

2. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) కల్లబొల్లి = మోసం చేసే
కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి.


ఆ. ఆ) పాతరోత =పాతరోత పాతది అసహ్యంగా ఉంటుంది.
కొత్త వింత అని పాత రోత అనీ నిరసించడం తప్పు.

ఇ) చెమటోడ్చి = కష్టపడి
చెమటోడ్చి పనిచేసినా కడుపునిండా తిండిలేని పేదలు ఎంతోమంది ఉన్నారు.

ఈ) విగ్రహాలు =  శిల్పాలు
రాళ్ళతో విగ్రహాలు చెక్కే కళ శిల్పకళ.

3. కింది వాక్యాలు చదువండి. ప్రతివాక్యంలోనూ ప్రకృతి-వికృతి పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి.

అ. కొందరు పిల్లలు పశువులను మేపుతున్నారు. మరికొందరు పసరాలతో ఆడుతున్నారు.
పశువు (ప్ర) – పసరం (వి)

ఆ. జాతరలో రథం తిప్పుతరట! ఆ అరదం అందంగా ఉంటుందట!.
రథం (ప్ర) – అరదం (వి)

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు రాయండి.

ఉదా : ఎవరితడు = ఎవరు + ఇతడు (ఉకార సంధి)

అ) డొక్కలెండి = డొక్కలు + ఎండి (ఉకార సంధి)

ఆ) బుట్టలల్లి = బుట్టలు + అల్లి (ఉకార సంధి)

ఇ) గుడ్డలుతికి =గుడ్డలు + ఉతికి (ఉకార సంధి)

ఈ) రాముడెప్పుడు = రాముడు + ఇప్పుడు (ఉకార సంధి)

2. ఈ కింది పదాలను కలుపండి. సంధుల పేర్లు రాయండి.

ఉదా : వెలుగును + ఇచ్చెను = వెలుగునిచ్చెను (ఉకార సంధి)

అ) కులాలు + అని = కులాలని (ఉకార సంధి)

ఆ) కూటికి + ఇంత =కూటికింత (ఉకార సంధి)

ఇ) కొండ్రలు + ఏసి = (ఉకార సంధి)

ఈ) కబుర్లు + అని =కబుర్లని (ఉకార సంధి)

ఉ) అంది + ఇచ్చు = అందిచ్చు (ఇకార సంధి)

3. కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతోటి ఖాళీలు పూరించండి.


కు, ఓ, చేత, కి, ము, వలన, లో, కొరకు, కంటె, తో
జవాబు.
అనగనగా ఒక రాజ్యము. ఆ రాజ్యములో ప్రజలకు కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి కంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా ! మీరంతా ధన్యులు. మీకు నా జేజేలు అన్నాడు రాజు.

ప్రాజెక్టు పని

కుల వ్యవస్థను రూపుమాపేందుకు కృషిచేసిన ఒక సంఘసంస్కర్త గురించి, మీ పాఠశాల గ్రంథాలయం నుండి సమాచారం సేకరించండి, వారి గురించి నివేదిక రాయండి. ప్రదర్శించండి.

బాబాసాహెబ్ అంబేద్కర్ :
పూర్వకాలంలో కులవ్యవస్థ బాగా పాతుకుపోయి ఉండేది. అంటరానితనం అనేది భూతంలాగా భయపెడుతూ బాధిస్తూ ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించి, అవమానాలకు గురియై, సమాజానికి ఎదురు తిరిగాడు. పట్టుదలతో పెద్దచదువులు చదివాడు. దళితులలో ఆత్మవిశ్వాసం పెంచాడు. వారిని చైతన్యవంతులను చేశాడు. రాజ్యాంగ నిర్మాణసంఘానికి అధ్యక్షుడై దళితులకు కొన్ని హక్కులు కల్పించాడు. రిజర్వేషన్లు, రాయితీలు కల్పించాడు. ఆ విధంగా కులాల వ్యవస్థను కదిలించి అణగద్రొక్కబడ్డవారిని తల ఎత్తుకొని జీవించేలా ప్రోత్సహించాడు. అలా అందరికీ ఆరాధ్య దైవమైనాడు.


ప్రశ్న 1.
రైతు చేసే కష్టాన్ని వివరించండి.
జవాబు.
రైతు తన కడుపుమాడుతున్నా లెక్కచేయకుండా భూమి చదును చేసి నాట్లు వేస్తాడు. పగలూ రాత్రీ కష్టపడి పొలంలో పంట పండించి ధాన్యపు రాసులను బస్తాల కెత్తుతాడు. ప్రజలందరి ఆకలి తీరుస్తాడు. అతనికి చివరికి మిగిలేది మాడిపోయిన మాడు అన్నమే. దానితోనే సరిపెట్టుకుంటూ కష్టపడుతూ మాగాణి పొలాలను దున్ని నాణెమైన పంటలు పండిస్తున్నాడు రైతు.

ప్రశ్న 2.
“మనుషులంతా ఒక్కటే” అనడానికి ఉదాహరణగా మీకు తెలిసిన ఒక సంఘటన గాని, కథగాని రాయండి.
జవాబు.
కోట్లాదిమంది ప్రజలు తమ ఆరాధన స్థలాలకు రోజూ వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. శక్తి కొద్దీ కానుకలిస్తారు. కాని భగవంతుడికి వీటన్నిటికంటే దయాదాక్షిణ్యాలు, జాలి, కరుణ కలిగిన వాళ్ళు, దానధర్మాలు చేసేవాళ్ళు అంటేనే ఇష్టం.
మనిషి మనిషికీ మధ్య అసూయాద్వేషాలు, ఓర్వలేనితనం, మోసాలు ద్వేషాలు, నేరాలు అడ్డుగోడలైనాయి.

మానవత్వం మరుగున పడిపోయింది. సమత, మమత అంతరించాయి. ఒక శివరాత్రినాడు శివాలయానికి తండోపతండాలుగా వచ్చారు. ఆ జనసమ్మర్దంలో ఒక కళ్ళులేని బిచ్చకత్తె కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలో గిన్నె గోతిలో పడిపోయింది. అవ్వ స్పృహకోల్పోయింది. అక్కడికొచ్చిన మంత్రులు, అధికారులు, పెద్దమనుషులు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. గుడిలో గంట ఎవరు కొట్టినా మోగటం లేదు. ఇద్దరు పిల్లలు ఆమె పరిస్థితి చూసి అక్కడికొచ్చారు.

అవ్వను లేపి కూర్చోబెట్టారు. దుమ్ము ధూళి దులిపి గాయానికి కట్టుగట్టారు. అవ్వనోట్లో చల్లని నీరు పోశారు. శివపూజకు తెచ్చిన అరటిపళ్ళు తినిపించారు. అవ్వ ఎంతో ఆనందంగా ఆ పిల్లల్ని మెచ్చుకొని దీవించింది. అంతే గుడిగంటలు గణగణా మ్రోగాయి. సమాజంలో నేడు అందరూ అలవరచుకోవలసింది ఇటువంటి మానవత్వమే.

పర్యాయపదాలు

ఇల్లు = గృహం, సదనం, నివాసం, ఆవాసం
బండ = శిల, రాయి
పూజ = అర్చన, సపర్య
రథం = తేరు, స్యందనం
విగ్రహం = ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి
సన్యాసి = భిక్షువు, జడధారి, యతి, ముని
పశువు = జంతువు, మృగము
నానార్థాలు

కులం = వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి
పశువు = గొర్రె, బలికి ఇచ్చు మృగం, మేడిచెట్టు, ప్రమథగణం
ప్రకృతులు -వికృతులు

ప్రకృతి – వికృతి

పశువు – పసరం
శిఖ – సెగ
కులం – కొలం
రాశి – రాసి
రథం – అరదం
సంధులు

కులమబ్బీ = కులము + అబ్బీ = ఉత్వసంధి
మతము + అబ్బీ = ఉత్వ సంధి
రాసులెత్తి = రాసులు + ఎత్తి = ఉత్వ సంధి
గొట్టాలై = గొట్టాలు + ఐ = ఉత్వ సంధి
పెట్టినపుడు = పెట్టిన + అపుడు = అత్వసంధి
చేసినపుడు = చేసిన + అపుడు = అత్వసంధి
ఎత్తినపుడు = ఎత్తిన + అపుడు = అత్వసంధి
చెమటోడ్చే = చెమట + ఓడ్చే = అత్వసంధి
మాదే = మాది + ఏ = అత్వసంధి
సమాసములు

పొగగొట్టాలు = పొగయొక్క గొట్టాలు – షష్ఠీ తత్పురుష సమాసం
బొగ్గుట్టలు = బొగ్గుల యొక్క గుట్టలు – షష్ఠీ తత్పురుష సమాసం
ధాన్యరాసులు = ధాన్యము యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
చెమటోడ్చు బట్టల = చెమటను ఓడ్చు – ద్వితీయా తత్పురుష సమాసం
బుట్టలల్లి = బుట్టలను అల్లి – ద్వితీయా తత్పురుష సమాసం
కూటికింత = కూటి కొరకు ఇంత – ద్వితీయా తత్పురుష సమాసం
I. కింద ఇచ్చిన వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.

1. వేసవి ఎండలవేడి కొలిమిలో పెట్టినట్లున్నది.
కొలిమి = ఇనుము కాల్చే నిప్పులు మండే చోటు

2. మాగాణంలో వరి బాగా పండుతుంది.
మాగాణం = తరిపొలం
3. వేసవిలో మల్లెపూలు రాసులు మంచి వాసన వెదజల్లుతాయి.
రాసులు = కుప్పలు

4. పశువులను ప్రేమగా చూడాలి.
జవాబు.
పశువుల = జంతువులు

5. ఎండలలో బండలు కాలిపోతుంటాయి.
బండలు = రాళ్ళు

II. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) దగ్గు
దగ్గు ఎక్కువగా వస్తుంటే మందువాడాలి.

2) పూజ
ఈ రోజు గుడిలో ప్రత్యేకమైన పూజ ఉన్నది

3) కాగితాలు
జవాబు.
మనం కాగితాల పై రాసుకుంటాము.

4) చేయి కలిపి
ఏ పనియైనా అందరూ చేయి కలిపితే తేలికగా అయిపోతుంది.

III. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి.

1) అడవిలో అగ్నిశిఖలు వ్యాపించినాయి. ఆ సెగలకు చెట్లు మాడిపోయాయి.
శిఖ (ప్ర) – సెగ (వి)

2) కులంలో గుణవంతుడైన కొడుకుంటే ఆ కొలం ప్రసిద్ధమౌతుంది.
కులం (ప్ర) – కొలం (వి)

3) దేవుని రథం బయలుదేరింది. ఆ అరదాన్ని భక్తులంతా లాగారు.
రథం (ప్ర) – అరదం (వి)

IV. కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
1) రవి ఇల్లు మా గృహం పక్కనే ఉంది. వారి నివాసానికి నేను వెళుతూ ఉంటాను.
ఇల్లు – గృహం, నివాసం

2) సన్న్యాసి అంటే అన్ని కోరికలను వదిలేసినవాడు. కాని ఈ కాలంలో జడధారులు అంతా మోసగాళ్ళే. ఆ దొంగ యతులను నమ్మకూడదు.
జవాబు.
సన్న్యాసి – జడధారి, యతి

V. క్రింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.

1. బుట్టలల్లి
జవాబు.
బుట్టలు + అల్లి = ఉత్వసంధి

2. గొట్టాలై
జవాబు.
గొట్టాలు + ఐ = ఉత్వసంధి

3. కూటికింత = కూటికి + ఇంత = ఉత్వసంధి

4. చెమటోడ్చి - చెమట + ఓడ్చి= ఉత్వసంధి

VI. క్రింది పదాలకు విగ్రహవాక్యం రాసి ఏ సమాసాలో రాయండి.

1. చెమటోడ్చి=చెమటను ఓడ్చి = ద్వితీయాతత్పురుష సమాసం

2. పొగగొట్టాలు=పొగ యొక్క గొట్టాలు = షష్ఠీతత్పురుష సమాసం

3. కూటికింత=కూటి కొరకు ఇంత = చతుర్థీ తత్పురుష సమాసం

గేయం – అర్థాలు – భావాలు

ఏ కులమబ్బీ!
మాదే మతమబ్బీ!!

1. మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు
డొక్క లెండి కొండ్ర లేసి
ధాన్యరాసులెత్తినపుడు ॥ఏ॥

అర్థాలు
అబ్బీ = ఓ అబ్బాయీ
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం ?
అబ్బీ = ఓ అబ్బాయీ
ఏ మతం = మాది ఏ మతం?
మట్టి పిసికి = మట్టిని మెత్తగా పిసికి
ఇటుక చేసి = ఇటుక రాయి తయారుచేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు = మీకు ఇళ్ళు కట్టి ఇచ్చినపుడు
డొక్కలు + ఎండి = ఆకలితో డొక్కలు ఎండిపోయి
కొండ్రలు + ఏసి = పొలాలు వేసి పంటలు పండించి
ధాన్యరాసులు = ధాన్యపు కుప్పలను
ఎత్తినపుడు= బస్తాల కెత్తినపుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం?

భావం : మట్టిని మెత్తగా తొక్కి, పిసికి, ఇటుకలను తయారుచేసి, ఇల్లు కట్టేవారిది ఏ కులం? కడుపు మాడ్చుకొని, దున్నిన చాలులో పంటను పండించి, ధాన్యరాసులను బస్తాలకు ఎత్తినపుడు రైతుదేకులం?! ఏ మతం?


2. పొగగొట్టాలై పేగులు
కొలిమి సెగలు చిమ్మినపుడు
దగ్గులతో క్షీణిస్తూ
బొగ్గుట్టలు త్రవ్వినపుడు ॥ఏ॥

కొలిమి సెగలు = మండే కొలిమి దగ్గర వచ్చే వేడిని
చిమ్మినపుడు = బయటికి వదిలినప్పుడు
పేగుల = కడుపులోని పేగులు
పొగగొట్టాలు+ఐ = పొగతో నిండిన గొట్టాలవలె మాడిపోయి
దగ్గులతో = ఊపిరాడని దగ్గుతో
క్షీణిస్తూ = ఆరోగ్యం దిగజారిపోతుంటే
బొగ్గు + గుట్టలు = బొగ్గు గనులను
త్రవ్వినపుడు = తొవ్వినపుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?

భావం : ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినపుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం?! ఏ మతం?! ఇక్కడ కార్మికుని పేగులను పొగ గొట్టాలతో కవి పోల్చాడు)

3. మాడు చెక్కలే తింటూ
మాగాణం దున్నినపుడు
ఎండలలో బండలపై
విగ్రహాలు చెక్కినపుడు ॥ఏ॥

అర్థాలు
మాడు చెక్కలు + ఏ = మాడిపోయిన అన్నంచెక్కను
తింటూ = ఆహారంగా తీసుకుంటూ
మాగాణం = శ్రేష్ఠమైన పొలాలను
దున్నిన + అపుడు = సాగుచేసినపుడు
ఎండలలో = మండే ఎండల్లో
బండలపై = బండరాళ్ళపై
విగ్రహాలు = బొమ్మలను
చెక్కినపుడు = తయారుచేసినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?

భావం: మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరిపంటను పండించే రైతుది ఏ కులం? మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం?! ఏ మతం?!

4. పూజకు అందిచ్చు పూల
బుట్టలల్లి ఇచ్చినపుడు
రామకోటి రాసుకొనే
కాగితాలు చేసినపుడు ॥పా॥

అర్థాలు

పూజ = పూజ చేసుకోడానికి
పూల బుట్టలు = పూలు పెట్టుకొనే బుట్టలు
అల్లి = తయారుచేసి
ఇచ్చిన + అపుడు = ఇచ్చినప్పుడు
రామకోటి రాసుకొనే = రామకోటి రాసుకోడానికి
కాగితాలు చేసినపుడు = కాయితాలు తయారు చేసినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?

భావం: దైవపూజకు తీసుకొని వెళ్ళే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం?! భక్తితో రామకోటి రాసుకునే వారికి కాగితాలన తయారుచేసే శ్రామికులది ఏ కులం? ఏ మతం?!

5. పశువు గొంతు కోసి మీకు
చెప్పులు కుట్టిచ్చినపుడు
కూటికింత కూడు లేక
కుండలు జేసిచ్చినపుడు ॥ఏ॥

అర్థాలు

పశువు = జంతువు యొక్క
గొంతుకోసి = పీకను కోసి
మీకు = మీకందరికి
చెప్పులు = కాళ్ళకు వేసుకొనే చెప్పులు
కుట్టి+ఇచ్చిన+అపుడు = తయారుచేసి ఇచ్చినప్పుడు
కూటికి = తినడానికి
ఇంత = కొంచెమైనా
కూడులేక = ఆహారం లేక
కుండలు = మట్టిపాత్రలను
చేసి+ఇచ్చినపుడు = తయారుచేసి ఇచ్చినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం?

భావం : జంతువుల చర్మంతో చెప్పులు తయారుచేసి ఇచ్చిన వారిది ఏకులం?! ఏమతం?! బతకడానికి తిండిలేక జనం కోసం కుండలను తయారుచేసిన శ్రమజీవులది ఏ కులం?! ఏ మతం?!

6. సన్యాసులై వస్తే
క్షవరాలూ చేసినపుడు
మురికి గుడ్డలుతికి మల్లె
పూలు చేసి ఇచ్చినపుడు ॥ఏ॥

అర్థాలు

సన్యాసుళ్ళు+ఐ = సన్యాసుల్లాగా గడ్డాలు మీసాలు పెంచుకొని
వస్తే = మా దగ్గరి కొస్తే
క్షవరాలూ చేసినపుడు = జుట్టు కత్తిరించినప్పుడు
మురికి గుడ్డలు = మాసిపోయిన బట్టలు
ఉతికి = శుభ్రం చేసి
మల్లెపూలు చేసి = తెల్లగా మల్లెపూలలాగా చేసి
ఇచ్చిన+అపుడు = మీకిచ్చినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = = ఏమి కులం?

భావం: గడ్డాలు, మీసాలు, జుట్టు పెంచుకొని వచ్చిన వారికి క్షవరాలు చేసేవారిది ఏ కులం?! మురికి బట్టలను మల్లెపువ్వులవలె తెల్లగా ఉతికి ఇచ్చేవారిది ఏ కులం?! ఏ మతం?! ఇట్లా వారి శ్రమను సమాజం వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీరుస్తూనే ఉన్నారు.

7. చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లన్ని చెదలు పట్టె
ఆగదు మీ పాతరోత
రథం విరిగిపోయినది ॥ఏ॥

అర్థాలు

మీ = మీ యొక్క
కల్లబొల్లి = అబద్ధాల
కబుర్లు+అన్ని = మాటలన్నీ
చెల్లవు = ఇకపై సాగవు
చెదలు పట్టె = పాతబడి పుచ్చిపోయాయి
మీ పాత = మీ గతమంతా
రోత = అసహ్యమైనది
రథం విరిగిపోయింది = మీ ఆలోచనల రథం పాడైపోయింది
ఆగదు = మార్పు ఆగదు.

భావం: మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను వినం. వాటికి చెదలుపట్టినాయి. ఆగకుండ సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది.

8. కులాలనీ కులంలోని
శాఖలనీ వేరుజేస్తే
చెమటోడ్చే మనషులమూ
చేయి కలిపి నిలబడితే ॥ఏ॥

అర్థాలు

కులాలనీ = కులములనూ
కులంలోని = ప్రతి కులంలో ఉన్న
శాఖలనీ = భేదాలనూ
వేరు + చేస్తే = విడదీస్తే
చెమట + ఓడ్చే = కష్టపడి పనిచేసే
మనుషులమూ = మానవులము
చేయి కలిపి = ఐకమత్యంతో
నిలబడితే = సమూహంగా ఉంటే

భావం : కులాలను, కులాల్లోని అన్ని శాఖలను వేరుచేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి, గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చేయి చేయి కలిపి నిలబడతారు. అప్పుడే నవసమాజం, సమసమాజం ఏర్పడుతుంది.

20, నవంబర్ 2023, సోమవారం

VI. 7.ఉడత సాయం

VIII. 7. ఉడత సాయం
        గోనబుద్ధారెడ్డి
పాఠం ఉద్దేశం : 
రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రం పై వారధి నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అతనికి వానరులు  రాళ్లు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఎట్లా సహాయం చేయబోయిందో ఈ పాఠంలో చదువుతాం. ద్విపద పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభివృద్ధిని కల్పించడం, అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం 


పాఠ్యభాగ వివరాలు: 
ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపద లో రెండు పాదాలుంటాయి. ఇది వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణం లోని యుద్ధకాండలోనిది.

కవి పరిచయం: 
కవి పేరు : గోనబుద్ధారెడ్డి 
కాలం : 13 శతాబ్దం 
రచన : రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రచించాడు. మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠల భూపతి పూర్తి చేశారు.
కవిత శైలి : సరళం మధురం 
ఇతర విశేషాలు : గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంత రాజు వర్ధమానపురం (నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లాలోనిది) రాజధానిగా పాలించాడు.

ప్రవేశిక : పరస్పర సహాయ సహకారాలు మనుషులకైనా జంతువులకైన అవసరం. అయితే సమాజంలో మూడు రకాల మనుషులు ఉంటారు.  వీరు ఎవరైనా సహాయం చేయమని కోరిన చేయరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సాయం చేస్తారు. మూడో రకం వారు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణాలు కలిగిన ఉడత గురించి ఈ పాఠంలో చదువుకుందాం.

1
నలు చేతిఁ కొసగఁ నా నలుఁ డవి పుచ్చి 
తలకొని కట్ట నా తరి యొక్క యుడుత 
గొబ్బున సేతువు గొనసాగవలయు 
నిబ్బలియులకుఁ దోడేసి గావింతు 
ననుచు శ్రీరాముని యడుగుఁ దామరలు 
మనమునఁ జేర్చి యమ్మనుజేశు నెదుర 
నచ్చపు భక్తితో నట వార్ధి మునిఁగి 
వచ్చి తా నిసుకలో వడిఁ బొరలాడి

తడయక చనుదెంచి తన మేని యిసుక 
వడిగట్టపై రాల్చి వనధిలో మునిఁగి 
తేలి గట్టున కేగి తిరుగంగఁ బొరలి 
వాలిన భక్తితో వచ్చి విదుల్చె

నివ్విధంబున నుండ నినకులాధిపుఁడు 
దవ్వులఁ బొడగాంచి తమ్మునిఁ జూచి 
పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు 
ముందఱ నొక తరుమూషకం బెలమి
___________
ఆలోచించండి-చెప్పండి

'నిర్మల భక్తి' అంటే ఏమిటి?

'అడుగు దామరలు మనమున జేర్చి' అంటే నీకేమి అర్థమైంది?

ఉడుత నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లాడి వేగంగా వచ్చి కట్టపై రాలుస్తున్నదికదా! అట్లా ఎందుకు చేయాలని అనుకున్నది?
___________
నామీఁద భక్తి యున్నతగతి బూనిఁ తా మేను జలముల దడపి గట్టునకు జని వేగ నిసుక పైఁ జల్లాడి తిరుగఁ జనుదెంచి కొండల సందున రాల్చి కరమొప్పుచున్నది కపికులాధీశు లురుశక్తి ద్దరు గిరు లొగి దెచ్చుచోట దా నెంత యని మదిదలపక ప్రేమ బూని సహాయమై పొదలుచున్నదియు కనుగొంటివే యన గమలాప్త వంశ!

కనుగొంటి భవ దంఘికమల యుగ్మమును



I. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడం
 
1. మీరు ఎవరికైనా సాయం చేశారా? అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు?
జవాబు: నేను చాలాసార్లు చాలామందికి సాయం చేశాను. నా సహాయం అందుకున్న వారి ముఖములో సంతోషాన్ని చూశాను. 

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం కింది అర్థం గల పద్యపానాలను మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి 
అ. త్వరగా సేతు నిర్మాణం కావాలి.
 జ. గొబ్బున సేతువు కొనసాగవలెయు

ఆ) తన ఒంటి కంటిన ఇసుకను రాలుస్తున్నది.
జ. తనమేని ఇసుక వడగట్ట పై రాల్చి

ఇ) పలువిదాల పొగడి.
జ.  పలుతెరంగుల జాల ప్రస్తుతి జేసి

ఈ) భక్తితో గడ్డి పోచంత పనిచేసినా అది కొండతో సమానం.
జ. ఎవ్వడు మది నిల్పి యెసగు దృణంబు నవ్వేల్పు గిరిబోలు

2. కింది పద్యాలు చదివి సరైన జవాబును గుర్తించండి.
 ఉపకారికి ఉపకారం 
విపరీతము కాదు సేయ వివరింపంగా 
నపకారికి నుపకారం 
నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతీ!

అ) అపకారి 
జ. (క) కీడు చేసేవాడు
ఆ)పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది
జ. (ఘ) నేర్పరి
ఇ) గొప్ప విషయం
జ. (క) అపకారికి ఉపకారం చేయడం
ఈ) పద్యంలో తప్పు అని అర్థం వచ్చే పదం
జ. ఖ) నెపము
పద్యమ మకుటం
జ. క)  సుమతీ 

III. స్వీయ రచన
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
అ)  తొందర గా సేతు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి?
జవాబు. సేతువు నిర్మాణం పూర్తయితే గాని రాముడు సైన్యంతో లంక చేరలేడు. లంకకు వెళ్ళకపోతే అక్కడ రావణుని చెరలో సీతమ్మ కష్టాలు తీర్చలేడు. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే తప్ప లోకాలకు వాని పీడ వదలదు. సీతను విడిపించుకొని తెచ్చుకోవాలంటే వనవాసం గడువుకూడా పూర్తైపోతోంది. గడువు పూర్తయ్యే లోపల అయోధ్య చేరకపోతే భరతుడు ప్రాణాలు వదులుతానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక తొందరగా సేతువు నిర్మాణం పూర్తి కావాలని ఉడుత అనుకున్నది.


ఆ) భక్తితో చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది సమర్థిస్తూ రాయండి.
 జవాబు:భక్తితో చేసిన చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉడుత రాముని మీద భక్తితో తన శక్తిమేరకు సాయం చేయాలనుకుంది. వానర వీరులు చేసే పనిలో ఉడుత చేయగలిగిన పని చాలా తక్కువ. ఐనా ఉడుత నిరాశ పడకుండా సముద్రం నీటిలో మునిగి గట్టుమీద ఇసుకలో పొర్లి వంతెన మీద ఆ ఇసుక దులిపింది. ఇక్కడ ఎంత ఇసుక మోసింది అనికాదు చూడాల్సింది. ఉడుత భక్తిని గమనించాలి. శ్రీరాముడు గమనించాడు. తన వద్దకు ఉడుతను రప్పించుకొని తన కుడి చేతితో ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు. ఆయన వేళ్ళ గుర్తులు దాని వీపు మీద మూడు చారలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ అవి ముచ్చట గొలుపుతూ శాశ్వతంగా ఉండి పోయాయి.

ఇ) రాముడు ఉడత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. అట్లాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకున్న సంఘటన గురించి రాయండి.
జవాబు. మా నాన్నగారు నా పుట్టిన రోజున, నీ స్నేహితులందరినీ పిలుచుకో. పార్టీ ఇద్దువు గాని అన్నారు. నేను నాన్నగారి నడిగి అనాథాశ్రమంలోని పిల్లల్ని పిలిచి వారితో కలిసి పుట్టిన రోజు చేసుకున్నాను. వారందరికీ మిఠాయిలు, పళు కేకు పంచి పెట్టాను. ఆటలు ఆడుకున్నాము. వారందరికీ బహుమతిగా పెన్నులు, పుస్తకాలు ఇచ్చాను. వాళ్ళెంతో సంతోషించారు. నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, ఇరుగు పొరుగు వారు ఎంతో మెచ్చుకున్నారు. ఒక మంచి పని చేశానని నాకు గర్వమూ, ఆనందమూ కలిగాయి.

ఈ) ఈ పాఠం ఆధారంగా గోడ బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది?
జవాబు.ఈ పాఠం ద్విపద ఛందస్సులో ఉన్నది. చక్కగా పాడుకోవచ్చు. ఇక కవి ఇందులో చెప్పిన కథ ఉడుత చేసిన సాయం. ఇందులో భాష భావం తేలికగా అర్థమయ్యేటట్లు తేలికైన పదాలు ఉపయోగించాడు కవి. ఉడుత చేసిన పని చదువుతుంటే ఎదురుగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది. అంత స్పష్టమైన వర్ణనలు. నాకీ పాఠం ఎంతగానో నచ్చింది.


2. కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.
ఉడత సాయం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు: సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను.” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, తమ్ముడు లక్ష్మణుని పిలిచి “నా పై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది.
బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో, గడ్డిపోచంత (కొంచెం) పనిచేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా!” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేతితో దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా, ఆనందకరంగా ఏర్పడ్డాయి.


IV. సృజనాత్మకత / ప్రశంస: 
ఈ పాఠాన్ని గేయ రూపంలో రాయండి.
చిన్ని ఉడుత చూడండి ఎంత ముద్దుగా ఉందో
వీపుమీద నల్లనైన – మూడు చారలున్నాయి
ఎక్కడివీ ఈ చారలు – కనులకింపు గొలుపుతూ
చూపు తిప్పుకోనీవు – ముచ్చటైన చారలు
రాముడిచ్చినాడమ్మా – ఉడుతకు ఈ అందాలు
మునివేళ్ళతో వీపునిమిరి తన ప్రేమను అద్దినాడు
ఎందుకంత ప్రేమంటే – దాని కథను వినండి
“రాముడు లంకను జేరగ – కోతులు వంతెన గట్టెను
పెద్ద పెద్ద బండరాళ్ళు – మోయుచున్న కోతులగని
శ్రీరాముని కార్యంలో – నేను ఏమి చెయ్యగలను ?
అని ఆలోచించి ఉడుత – శ్రీరాముని పాదాలను
భక్తితోడ మదిని దలచి సముద్రంపు నీటమునిగి
తన ఒంటిని తడుపుకొని – గట్టుమీద ఇసుకలోన
అటూ ఇటూ పొరలాడి – అంటిన ఆ ఇసుక తెచ్చి
మరల నీట మునిగింది వంతెనపై దులిపింది
అలుపులేక సొలుపులేక – మరల మరల తిరిగింది
అది చేసిన సాయానికి అది చూపిన వినయానికి
ముచ్చటపడి శ్రీరాముడు – మునివేళ్ళతో నిమిరెదాని
వీపున నల్లని చారలు – శాశ్వతముగ నిలచిపోయె

 లేదా 
పక్క పేజీలో బొమ్మను చూసి సంభాషణలు రాయండి.
చీమ : ఉడుతమ్మా! రా. ఏంటిలా వచ్చావు ?

ఉడుత : ఊరికెనే నిన్నుచూసి పోదామని వచ్చాను చీమమ్మా!

చీమ : చాలా సంతోషం. ఇదిగో ఈ వేరుసెనగ పప్పులు తిను.

ఉడుత : ధన్యవాదాలు. నీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా ఆహారం.

చీమ : అవును. కష్టపడి తెచ్చుకున్నదాంట్లో కొంత తిని కొంత దాచుకుంటాం.

ఉడుత : అలాగా! దాచుకోటానికి, ఉండటానికి మీరు కట్టుకున్న ఇళ్ళు ఎంత బాగున్నాయో!


V. పదజాల వినియోగం
ఈ క్రింది వాక్యాలు చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి.
అ)
శిఖరం అద్రి కొండ

ఆ) 
వంతెన, వారధి, సేతువు
ఇ) 
పచ్చిక, గడ్డిపోచ, తృణం
ఈ)
సముద్రం, వార్ది, వనధి.
కింది వాక్యాలలోని ప్రకృతి వికృతిలో గుర్తించి రాయండి.

అ) (వికృతి)దవ్వు - దూరం (ప్రకృతి)
ఆ) (ప్రకృతి) సహాయం - సాయం(వికృతి)
ఇ) (ప్రకృతి) శక్తి - సత్తువ (వికృతి)

భాష గురించి తెలుసుకుందాం
అ) రవి పుస్తకం తెరిచి పాఠం చదువుతున్నాడు (క్రియ)

ఆ) రాముడు సీతతో కలిసి అరణ్యానికి పోయాడు (నామవాచకం)

ఇ) కిరణ్ పరుగుపందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు (సర్వనామం)

ఈ) అయ్యో ! అంత పని జరిగిందా (అవ్యయము) 

ఉ) పండుగ రోజు విమల కొత్త బట్టలు కొన్నది (విశేషణము)

2. కింది వాక్యాల్లో విభక్తి ప్రతియాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి అవి ఏవి భక్తులో బ్రాకెట్లో రాయండి.
అ) మౌనిక మల్లెపూల ను ధరించింది (ద్వితీయ విభక్తి )

ఆ)  రాజేందర్ అడవికి వెళ్లి ఉసిరికాయలు తెచ్చాడు (షష్టి విభక్తి)

ఇ) చిన్నపిల్లలు పెద్దల తో గౌరవంగా మెలగాలి (తృతీయ విభక్తి)

ఈ) కీర్తన ఇంజనీరింగ్ చదవడం కోసం బాసర వెళ్ళింది (చతుర్థి విభక్తి)

ఉ) సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు (పంచమి విభక్తి)