సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

17, నవంబర్ 2023, శుక్రవారం

VIII. 8.చిన్నప్పుడే

VIII. 8. చిన్నప్పుడే
వట్టికోట ఆల్వారు స్వామి
పాఠం ఉద్దేశం :
ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమము విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు: 
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితం ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది;  ఇటువంటి వచన ప్రక్రియని 'కథానిక' అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత.

1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వార్ స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.


కవి పరిచయం: 
పేరు         : వట్టి కోట ఆళ్వారు స్వామి
జన్మస్థలం :  నల్గొండ జిల్లాలోని చెరువు మాదారం
జననం :  01-11-1915.
మరణం : 05-02-1961.
నిర్వహించిన పదవి : ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడు.
సంస్థలు : దేశోద్ధారక గ్రంథమాల 35 పుస్తకాల ప్రచురణ.
నడిపించిన పత్రికలు: 'తెలంగాణ', 'గుమస్తా'.
కథా సంపుటి : జైలు లోపల.
నవలలు : 'ప్రజల మనిషి',  'గంగు'.
ఇతర రచనలు :  'రామప్ప రభస', 'తెలంగాణ'. వ్యాసాలు.



ప్రవేశిక

రజాకార్ల అఘాయిత్యాలకు పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు, ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనంకోసం.. ఈ పాఠం చదువుదాం......

I

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకటరావు నాయకులతో రంగాపురానికి బయలు దేరాడు.

“మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. గ్రామీయులు వాయిద్యాలతో -ఎదుర్కొని తీసుకు వెళ్ళుతారు" అని వెంకటరావు హెచ్చరించాడు నాయకులను.

ఉదయం 12 గంటల కాలం. వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనం అంతా నాయకులు ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరిబయట మోటబావి వద్ద కూర్చున్నారు. చెట్టునీడను కూర్చున్న ఒకరైతు యువకుడు “దండమండే" అని పెద్దగొంతుతో అన్నాడు. వెంకటరావువైపు చూస్తూ, విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోను, భయంతో గ్రామ పెత్తందార్లకు పెట్టే దండంలోను వెంకట్రావుకు పెట్టే దండంలోను ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు "దండమండే" అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి. వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్తగా సుమారు రెండు నెల్లనుండి ఏక దీక్షతో గ్రామీయులు సమస్యలను తీసుకుని పని చేస్తున్నాడు. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుని వరకూ వెంకట్రావంటే ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు, చిన్న, పెద్దు గౌరవ మర్యాద లేక ప్రతివారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించటం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. గ్రామ పెత్తందార్లు దయతో ఇచ్చే కూలితో, విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవటం తుదకు పనివారు కడుపునిండా తిండి లేక మాడుచుండటం మానిపించాడు వెంకట్రావు. బావివద్ద చెట్టుక్రింద కూర్చున్న రైతుయువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెల్పాడు.

కొద్ది సేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరిచెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని, జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్క కూర్చున్నారు.

నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతీ సాగించారు.

వారిలో ఒకరు "నీపేరేం" అని బాలుడ్ని ప్రశ్నించాడు.

"లింగయ్య" అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాని వయస్సు పదిఏండ్లు సుమారు ఉంటాయి.

80
"లింగా! అని మొదలు మేము పిలిచేది" వెంకట్రావు వైపు చూపుతూ "సంగంపంతులు బడి పెట్టినప్పటినుండీ లింగయ్య అని పిలుస్తున్నాం" అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు.

నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు.

"మీరెవరు" అని ఒక నాయకుడు ప్రశ్నించాడు.

"మేం బట్టలుతుకుతాం" అని లింగయ్య చెప్పాడు.

“నాకొక ఉసిరికాయ ఇస్తావు" అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయిచాపాడు. మొదట పరిహాసమనుకున్నాడు. లింగయ్య. అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందిచ్చాడు.

ఆ నాయకుడు వెంటనే అందుకుని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గభాలున ఆ నాయకునివైపు వచ్చి తమ జేబులో నున్న కాయలన్నీ అతని ముందర పోశారు.

"ఎందుకివన్నీ, చాలు, చాలు" అని నాయకుడంటుండగానే "ఇది బాగుంది. ఇది బాగుంది" అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి వీరి అందించసాగారు.

ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరిని తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకుల్లాగ వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుణ్ణి చుట్టివేశారు.

ఆ బాలురకు, ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ గట్టగలం? ప్రతిరోజు, ప్రతివస్తువు అన్యాయంగా -హరించే గ్రామ పెత్తందారుణ్ణి అసహ్యించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వటమేగాక దాన్ని నాయకుడు 
81
R0011

అంగీకరించటంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం? తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందార్లు అంటే హడలిపోయే ఆ బాలుదు పరగ్రామీయుడు, పది నిమిషాలక్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత, అవ్యాజబంధువుగా తలచ బడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం?

ఆలోచించండి - చెప్పండి

వరికోతల రోజులు, అయినా పొలాల్లో ఎవరూ లేరు ఈ మీకేమి అర్ధమయింది.

ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి?

• పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు' అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి?



II
"వీండ్లందరెవరో ఎరికేనా?" అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు.

"మే మెందుకొచ్చామో చెప్పు" అని నాయకుల్లో ఒకరడిగారు.

పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. అందరిముఖాలు వికసించినవి.

"మమ్ముల బతికించటానికి" అని ఒక బాలుడన్నాడు.

"మీబతుకుకేమైంది? నీ చేతులకు వెండికడియాలున్నాయి. ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి.. పిల్లవానికి బంగారు గుండీలున్నాయి" అని ఒక నాయకుడు పిల్లలవైపు చేతులు చూపుతూ అన్నాడు.

"ఇవి ఉంటే? ఒకసారి మాపూరిదొర మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు".

"మా అన్న కోడెదూడ చేలో బడ్డదని మావూరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు"

"మా దున్నపోతు 'బుస్సుమన్నదట, ముకుతాడు లేదని ముప్పయిరూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు."

"సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి"

"వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకిపోతె దెబ్బలు కొడతానని మొన్న మా దొర గుమాస్తా బెదిరించాడు."

"మొన్న మా అమ్మ కూలికిపోయి వస్తూ చేటో కట్టెపుల్ల లేరుకుంటుంటే ఎందుకేరుకున్నావని మా అమ్మని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంబోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు."

ఈ విధంగా పిల్లవాండ్లంతా తమకష్టాలు కుప్పలుగా కురిపించారు.

“పొయ్యిలో కట్టెలు లేకపోతె ఆరోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ?" అని ఒక నాయకుడు ప్రశ్నించాడు.

"నేను పసులుకాడనుండి ఇంటికొచ్చేవరకూ మా అమ్మా అయ్యా మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో బువ్వ ఉన్నదేమోనని కుండలన్నీ వెతుకుతూంటే, మా అయ్యలేచి చెట్లపొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ పండుతుంటే, గిర్దావరు బరులకు పోవాలని షేక్ సింది బట్టుకపోయిండు. పొయ్యిమీద బువ్వంత చెడిపోయింది. దాంట్లనే మీరం, ఉప్పు పోసుకుని, నీళ్ళు పోసికొని తిన్న" అని ఆ బాలుడు జనాబు చెప్పాడు.

"మీరెవరబ్బాయి?" అని నెత్తినుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు.

"నేను సంగి శెట్టి కొడుకును"

82

"మీకేం కష్టాలున్నాయి చెప్పు" అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు.

"ఏమో నాకేం ఎరుక. మా నాయనకెరుక" అని ముఖం తిప్పాడు.

" ఓసారి మీ అమ్మ పసుల జంగల్లోనుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకోలే?" అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. "ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడ" అని శెట్టి కొడుకు అందుకున్నాడు.

ఈ విధంగా నాయకులు సుమారు అరగంటకాలం పిల్లలతో గడిపారు.

"పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తున్నది" అని నాయకుల్లో ఒకరన్నారు.

"మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా" అని ఒక నాయకుడన్నాడు.

"మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంత హాయిగా బతుకుతారు" అని ఒక నాయకుడన్నాడు.

"స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం. ఇదే నేటి మానవ సమాజానికి వజ్ర, వైడూర్యాలు, దివ్యభవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం" ఇంకొక నాయకుడన్నాడు.

ఇంతలో గ్రామంలో వాద్యాలచప్పుడు వినబడింది., "వాళ్ళతో కలిసి మళ్ళావస్తాం" అని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరుగెత్తారు.

ఆలోచించండి-చెప్పండి..

* పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్ధం చేసుకున్నారు.

"మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా" అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?






I. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం

చిన్నప్పుడే కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్రానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.


II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం
1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారు చర్చించండి.


అ) వీండ్ల అందరెవరో ఎరికేనా? 
వెంకట్రావు పిల్లలతో

ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
వెంకట్రావు ఒక బాబుని చూచి మీరెవరు అని అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం.

ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
పిల్లల దీనత్వాన్ని చూచి చలించిన ఒక నాయకుడు పలికిన మాటలు

2. కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి. 
(టెక్స్ట్ బుక్ పేజి నెంబర్ 84 లోని పేరా.)
ప్రశ్నలు 
అ) అణిచివేత గురైన వారెవరు? 
జవాబు : తెలంగాణ ప్రజలు.

ఆ)వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణిచివేతకు గురి అయ్యారు ?
జవాబు. సాంస్కృతికంగా భాషాపరంగా అంచవేయబడ్డారు.

ఇ) తెలంగాణలో ఆంధ్రోద్యమము ఎందుకు విస్తరించింది ?
జవాబు: జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే ఆంద్రోద్యమము విస్తరించింది.

ఈ) తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు. గ్రంధాలయాలు పఠనాలయాలు తెలుగు పత్రికలు

ఉ) తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు?
జవాబు : మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయ్, రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి, రావి నారాయణరెడ్డి లు ముఖ్యులు




III. స్వీయ రచన 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) వెంకట్రావు స్వభావాన్ని తెలపండి.
జ. వెంకట్రావు నాయకుడు ఆంధ్ర మహాసభ కార్యకర్త అతనిని చిన్న పెద్ద ప్రజలంతా తమ ధన మాన ప్రాణ రక్షకునిగా భావించేవారు. గ్రామీయుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా పనిచేసేవాడు. అడగడానికి నిందలు నేరాలు మోపడం లంచాలు లాగడం వంటివి లేకుండా పెత్తందాల నుండి ప్రజలకు రక్షణ కల్పించారు. పెత్తందారుల దుర్భాషల నుండి కాపాడడం, నీచంగా మాట్లాడడం వంటివి వెంకట్రావు నిరోధించాడు. దయతో గ్రామ పెద్దలు ఇచ్చే కూలితో వెట్టి చాకిరి చేయకుండా వెంకట్రావు కృషి చేశాడు.

ఆ) వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? 
జ. వెంకట్రావు వంటి యువకులు ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కష్టసుఖాల్లో అండగా ఉండి వారికి జరిగే అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతారు. పెత్తందారులు, యజమానులు చేసే దుర్మార్గాలను అరికడతారు. యువకులను పెద్దలను అందర్నీ చైతన్యవంతం చేసి వారి సాయంతో గ్రామీయుల సమస్యలను తీరుస్తారు. సుఖ సంతోషాలు కలిగేలా సహాయపడతారు. ఇతరుల మేలుకోసిన వారు పనిచేస్తారు. స్వార్థానికి చోటు ఇవ్వరు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు మంచి కోసం మార్గదర్శనం చేస్తారు.

ఇ)వెంకట్రావు తో నేటి యువతను పరిశీలించి, పోల్చండి
జ. వెంకట్రావు నాయకుడు. హితవరి. సంఘసేవకుడు పరోపకారి. ఇతరుల కష్టాలను తన కష్టంగా భావించి వాటిని నిర్మూలించడానికి కృషి చేస్తాడు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు. విజయాన్ని సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును తమ ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావించారు. మరి నేటి యువకులు‌ స్వార్థంగా ఆలోచిస్తున్నారు తమకు మేలు జరుగుతుందంటే ఇతరులకు హాని  తలపెడుతున్నారు. వివిధ వ్యసనాల బారిన పడకపోతే చాలా మంచిది. కొంతమంది యువకులు సంఘ సేవకులుగా, పరోపకారులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ) "మనం ఈ రోజు స్వార్ధ రహితంగా, ధైర్యంగా పట్టుదలతో పని చేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు" అని ఒక నాయకుడు ఎందుకని ఉంటాడు?
జ. నిజాం రాష్ట్రంలో గ్రామ పెత్తందారులు మునసబులు, గ్రామ నౌకరు, పోలీస్ అధికారులు, పోలీస్ పటేల్, మాలి పటేల్ , మొదలైన వారు ఆనాటి అధికారం కలిగిన వ్యక్తులు నిజాం ప్రభువు వద్ద పనిచేసి చిన్న అధికారులు ప్రజల్ని బెదిరించి తిట్టి కొట్టి జర్మానాలు వసూలు చేసి దోపిడీ చేసేవారు. ప్రజలు వారికి నమస్కారం చేయవలసి వచ్చేది.
 ప్రజల నుండి బలవంతంగా ఆ పెత్తందారులు కావాల్సినవన్నీ తీసుకుపోయేవారు అడవిలో కట్టెలు ఏరుకోవడానికి ప్రజలకు అనుమతి లేదు.
ఆ నాయకుడు తామంత ధైర్యంగా పట్టుదలతో ఆ పెత్తందారులకు ఎదురు తిరిగితే తమకు స్వాతంత్రం వస్తుందని హాయిగా బతుకుతారని చెప్పే ప్రజలకు కార్యకర్తలకు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు.

2.  కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! ఆనాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా? కారణాలు ఏమిటి?
జ. తెలంగాణ ఒకప్పుడు నిజాం చక్రవర్తి పాలనలో ఉండేది. గ్రామంలో వివిధ రకాల అధికారులు ఉండేవారు. వారు మాటిమాటికి హింసించి జరిమానాలు విధించి వసూలు చేసేవారు. ప్రజలకు పెత్తందారులంటే మహా భయం. ఊరిదొరలు ప్రజలను బర్రెలను బందెల దొడ్డిలో పెట్టించేవారు. చేలో పడితే ఊరు పట్టేలు పది రూపాయలు జరిమానా పుచ్చుకునేవాడు. ఒక దున్న పక్క వారిపై బుసుమంటే దానికి మూతాడు లేదని నేరం మోపి మాలి పటేల్ వారి వద్ద 30 రూపాయల పన్ను వసూలు చేసేవాడు.

ఆడవారు కూలికి వెళ్లి చేలో కట్టెలేరుకుంటే దొర సేగిదారు ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని కొట్టేవాడు. ఎవరైనా అడ్డుపడితే వారి సైతం బాధేవాడు. వండుకున్న తిండిని కూడా గిర్ధవార్ల కోసం పట్టుకపోయేవారు.
ఆనాడు అడవులలో పీడ ఏరుకున్నా తట్ట లాగుకునే వారు మందలించేవారు ఈ విధంగా గ్రామ పెత్తందారు నిజాం పేరు చెప్పి ప్రజలపై పెత్తనం సాగించేవారు.

IV. సృజనాత్మకత ప్రశంస 
అ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.
అ) ఈ పాఠం ఆధారంగా చేసుకొని మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జ. తరతరాలుగా ప్రజల బాధలు తీర్చడానికి నాయకులు అంకణం కట్టుకుంటారు సిద్దిపేట పురోభివృద్ధి చెందడానికి చాలామంది నాయకులు కృషి చేశారు డిగ్రీ కళాశాల తేవడానికి రాజేశ్వరరావు ఎడ్ల గురువారెడ్డి గారు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేశారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సిద్దిపేట పట్టణంలో తాగునీరు అందజేశారు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అద్భుతంగా తీర్చిదిద్దారు కోమటి చెరువు రంగనాయక సాగర్ ఆధునిక నగరముగా అభివృద్ధి చేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారల ఆశీస్సులతో ఈ పట్టణానికి రైలు సౌకర్యం కల్పించబడ్డది.


 లేదా 
ఆ) వెంకటరావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్లు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జ. మాది సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ వారు చెత్త ఎత్తేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేశారు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ చెత్త విడివిడిగా సేకరిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు చాలా ప్రయాస కోర్చి ఆ దుర్వాసనలోనూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి మరీ శుభ్రపరిచారు నిజంగా వారి సేవను ఏమని కొనియాడగలుగుతాము
మున్సిపల్ కార్మికులకు వారి కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు అందిస్తున్న 
         

 ఇట్లు
ఎస్ హరీష్
8వ తరగతి, జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్

IV. పదజాలం :
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు తెలుసుకొని రాయండి.
అ) దండం నమస్కారం
ఆ) అవ్యాజ కపటం లేని సహజమైన
ఇ) రకం పన్ను
ఈ) మిరం కారం మీడియం
ఉ) ఎరుక జ్ఞానం తెలుసుకోవడం

2. సమానార్థకాలు అదే అర్థం వచ్చే పదాలు.
అ) విలువ 
విలువ ఖరీదు మూల్యం
ఆ) కుప్పలుగా :ప్రోగులు, రాశులు
ఇ) గభాలున : గుభేలున, గుభిల్లున 
ఈ) వెండి : రజితం, కలధౌతం

3. ప్రకృతి పదాలు
 వికృతి               ప్రకృతి
అ) మొగం      -    ముఖం
ఆ) సంతసం   -   సంతోషం
ఇ) సుకం        -   సుఖం
ఈ) గారవం    -   గౌరవం

V. భాషను గురించి తెలుసుకుందాం: 
1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.
సమాస పదం              విగ్రహవాక్యం                                        సమాసం పేరు
అ) రాజ్య కాంక్ష : రాజ్యం నందుకాంక్ష - సప్తమి తత్పురుష సమాసం
ఆ) విజయ గర్వం : విజయం వల్ల గర్వం - పంచమి తత్పురుష సమాసం
ఇ) అష్టదిక్కులు : అష్టసంఖ్య గల దిక్కులు - ద్విగు సమాసం
ఈ) బలరాములు : బలరాముడును, కృష్ణుడు - ద్వంద్వ మాసం
ఉ) ప్రజల భాష : ప్రజల యొక్క భాష- షష్టి తత్పురుష సమాసం
ఊ) అక్రమము : క్రమం కానిది నైన్ - తత్పురుష  సమాసం


ఆమ్రేడిత సంధి 
కింది వాటిని చదవండి.
ఔరౌర! ఎంత గొప్ప పని చేశావు 
ఆహాహా ఎంతో ఆనందం కలిగించావు
పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర =  ఔర + ఔర = ఔరౌర 
ఆహాహా = ఆహా + ఆహా = ఆహాహా అవుతున్నాయి కదా!
ఇప్పుడు ఒకే పదం రెండుసార్లు వచ్చింది అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు.

అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

కింది పదాలను కలిపి రాయండి అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు
ఏమి ఏమి ఏమేమి
ఊరు ఊరు ఊరూరు
ఇంట ఇంట ఇంటింటా
ఓరి ఓరి ఓరోరి

ద్విరుక్త టకార సంధి:
 పగలు+పగలు = పట్టపగలు
చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి పగలు పగలు పట్టపగలు అవుతుంది అంటే మొదటి పదంలోని పగలులో తర్వాత ఉన్న గలు పోయి దానికి బదులుగా ట వచ్చింది అప్పుడు పట్టపగలు అయింది అట్లనే చిట్టచివర పదం కూడా.


 






16, నవంబర్ 2023, గురువారం

VII. 8. గ్రామాలలోని వేడుకలు - క్రీడా వినోదాలు

Vii.8.గ్రామాలలోని వేడుకలు - క్రీడా వినోదాలు 
                             -దేవులపల్లి రామానుజ రావు.


పాఠం ఉద్దేశం: నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చుని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏఏ వినోద సాధనాలు ఉండేవో వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు : 
ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజ రావు గారు తన ప్రసంగంలో వివరించారు.

రచయిత పరిచయం:
రచయిత పేరు :  దేవులపల్లి రామానుజ రావు
తల్లిదండ్రులు : అండాలమ్మ, వెంకట చలపతిరావు.
జననం : 25 - 8 - 1917 
మరణం : 8 - 6 - 1993
జన్మస్థలం : దేశాయపేట గ్రామం, హనుమకొండ జిల్లా.
సంపాదకుడు 1946లో శోభ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రిక ను కూడా నడిపించాడు.

రచనలు: పచ్చ తోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు జ్ఞాపకాలు ఈయన ఆత్మ కథ.

పదవులు : ఆంధ్ర సరస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, 
రాజ్యసభ సభ్యుడుగా విశేష సేవలు అందించారు.

III. స్వీయ రచన : 
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి
అ)  స్త్రీల పాటల వల్ల స్త్రీలకు పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
స్త్రీలు ప్రతి సందర్భంలో పాటలు పాడుతుంటారు వారు పెళ్లిలో పెళ్లి పాటలు. కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అప్పగింతల పాటలు పాడుతారు బతుకమ్మ పండుగకు బతుకమ్మ పాటలు, ఊయల పాటలు రకరకాలైన పాటలు పాడుతారు.

ఆ) 'వినే వారి రక్తం ఉడుకెతకున్నట్లు కథ చెప్పడం' అంటే మీరేమి అనుకుంటున్నారో రాయండి.
పల్లెటూర్లలో కథలు వింటుంటారు.  వీరు వీరత్వం కలిగిన కథలు విన్నప్పుడు వీరిలో ధైర్యము ఉడుకు రక్తం ఉడికినట్లుగా పొంగుతుంటది. నవరసాలను ఒలికించి శ్రోతలను ప్రేక్షకులను మేము మా వీరత్వాన్ని ప్రదర్శించాలని తహతహ లాడేటట్లు చెబుతున్నారని అర్థం.

ఇ) 'కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి' అనే వాక్యాన్ని బట్టి వినోదాలకు ఆర్థిక స్థితికి గల సంబంధాన్ని చెప్పండి.
జ. ధనవంతులకు శ్రీమంతులకు కొన్ని క్రీడలు వినోదాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. శ్రీమంతుల ధనవంతుల ఇండ్లలో జరిగే ప్రతి పండుగలో శుభకార్యాలలో వినోదాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ప్రతిష్టగా, గొప్పగా భావిస్తారు. కాబట్టి వారి వారి ఆర్థిక స్థితిని బట్టి వినోదాలు అందుబాటులో ఉంటాయి.

ఈ) ఒకనటి బాలికల ఆటలకు నేటి బాలికల ఆటలు గల తేడాలు చెప్పండి.
ఒకప్పటి బాలికలు సంప్రదాయ ఆటలు చెమ్మచెక్క దాల్దడి ఓమనగుంటలాట గుజ్జనగులాట బొమ్మరిల్లు గిరిగింజలు మొదలైన ఆటలాడేవారు నేటి బాలికలకు ఇటువంటి పరిజ్ఞానం లేదు ఇప్పుడు నూతన పద్ధతుల్లో ఆటలాడుతున్నారు చదరంగం క్యారమ్స్ క్రికెట్ మొదలైన ఆటలు ఆడుతున్నారు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. క్రీడలు వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ మీ అభిప్రాయం రాయండి.
 జవాబు : క్రీడలు వినోదాలు శరీరానికి మానసిక వికాసానికి దోహదపడతాయి వీటిని ఆడడం వల్ల ఆరోగ్యము మెరుగు పడుతుంది రక్త ప్సరణ బాగా జరుగుతుంది ఆటలు పాటలు కొన్ని
 సార్వజనీయమైనవి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని తరగతుల ప్రజలకు ఆటలు క్రీడలు వినోదాలు అందుబాటులో ఉన్నాయి.

లేదా 

ఆటకు పాటకు వీడరాని చుట్టూ ఉన్నదని రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.
ఆటకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. అవినాభావ సంబంధం అంటే విడదీయలేని సంబంధం. ఇంకా చెప్పాలంటే ఒక చుట్టరికం లాంటి బంధుత్వం ఉన్నది. పల్లెల్లో రకరకాలైన ఆటలను మనము చూస్తాము. మనసుకు ఉల్లాసం కలిగించే వేడుకలు సంబరాలు ఉంటాయి. తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ మహాభారత భాగవత కథలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ ఆటలు పాటలు చాలా పల్లెటూర్లలో ఉన్నాయి.

IV. సృజనాత్మకత / ప్రశంస : 
మీకు తెలిసిన ఏవి నీ నాలుగు పద్యాలను బతుకమ్మ పాటలాగ మార్చి రాయండి.
బలవంతుడ అననేము ఉయ్యాలో
అనకూడదమ్మ ఉయ్యాలో
 బలవంతమైనదే ఉయ్యాలో
సర్పము ఉయ్యాలో 
చలి చీమల ఉయాలో
చేతిలో చిక్కింది ఉయ్యాలో 
చిక్కిన వెంటనే ఉయ్యాలో
చావనే చచ్చింది ఉయ్యాలో

ఉప్పుకప్పురంబు ఉయ్యాలో 
ఒక్క పోలికనుండు ఉయ్యాలో 
చూడ రుచుల ఉయ్యాలో 
జాడలు వేరమ్మ ఉయ్యాలో

లేదా 
గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.

V. పదజాలం వినియోగం 
కింది పదాలకు అర్థాలు రాయండి మేలుకొలుపు 
అ) ఆసక్తి : ఆపేక్ష ఆస
ఆ) వీనుల విందు: ఇష్టమైన ధ్వనులచే చెవులకు ఇంపు
ఇ) శోభ : కాంతి ఇచ్చా సౌందర్యం
ఈ) పురాతనమైన: అతి ప్రాచీనమైన పాతదైన

కింది వాక్యాలు చదివి సమానార్థం వచ్చే పదాల కింద గీత గీయండి.
అ) పండగ పర్వం వేడుక
ఆ) ఆసక్తి ఆపేక్ష అభిరుచి
ఇ) గృహము ఇల్లు సదనం

3. కింది వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గళ్ళలో ఉన్నాయి వాటిని వెతికి రాయండి.
అ. పబ్బము పర్వము
ఆ) పున్నమి పౌర్ణమి
ఇ) జీతము జీవితము 
ఈ) కర్జము కార్యము

VI. భాషను గురించి తెలుసుకుందాం.
కింది వాక్యాల్లో సమాపక అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి.
అ) అసమాపక క్రియ తిని సమాపక క్రియ వెళ్ళింది 
ఆ) అసమాపక క్రియ వెళ్లి సమాపక క్రియ చదువుకున్నది 
ఇ) అసమాపక క్రియ చదివి సమాపక క్రియ నిద్రపోయాడు
ఈ) అసమాపక క్రియ గీసి సమాపక క్రియ పెట్టాడు.

క్రియలను బట్టి కాకుండా అర్ధాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలు ఉంటయని గమనించండి

ఉదాహరణకు 
ఆహా ఎంత బాగుందో !
"చేతులు కడుక్కో"
మన రాష్ట్ర రాజధాని ఏది? 
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అది ఎట్లాగో చూద్దాం. ఆహా ఎంత బాగుందో ! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యం. ఇక రెండో వాక్యం "చేతులు కడుక్కో" ఇవి విధిగా చేయాలి అని అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి అని అర్థాన్ని సూచించే వాక్యం విద్యర్థక వాక్యం.

 ఇక మూడవ వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ఇది ప్రశ్నార్ధకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ప్రశ్నార్ధక వాక్యం.

2. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి.

అ) మీరు ఏ ఊరు వెళ్తున్నారు (ప్రశ్నార్ధక వాక్యం) 
ఆ) ఈ పాఠం చదువు (విద్యర్థక వాక్యం) ఇ) వసంత ఎంత బాగా పాడిందో (ఆశ్చర్యార్థక వాక్యం) 
ఈ) మన పాఠశాలకు ఎవరు వచ్చారు? (ప్రశ్నార్ధక వాక్యం) 
ఉ) చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా! ( ఆశ్చర్యార్థక వాక్యం) 
ఊ) పూలన్నింటినీ హారంగా కూర్చుండి (విద్యర్థక వాక్యం)

ప్రాజెక్టు పని
మీ జిల్లాలోని ముఖ్యమైన పెద్ద చెరువులేవి అవి ఎక్కడ ఉన్నాయి మొదలగు విషయాలను ఒక పట్టికదా వివరించండి నివేదిక ప్రదర్శించండి.
మాది సిద్దిపేట జిల్లా.
శనిగరం చెరువు శనిగరం గ్రామం
దిలాల్పూర్ చెరువు దిలాల్పూర్ గ్రామం
రాజగోపాల్పేట చెరువు రాజగోపాల్ పేట గ్రామం
హుస్నాబాద్ చెరువు హుస్నాబాద్ ప్రాంతం
మొదలైనవి.
ఈ చెరువుల పురాతనమైనవి కొన్ని కాకతీయుల కాలం నాటివి కూడా ఉన్నాయి. వర్షప నీరుఈ వ్యర్థం కాకుండా నిలువ చేస్తున్నాయి. చెరువుల ద్వారానే పొలాలు పారుతున్నాయి.

లేదా 
గ్రామీణ వేడుకలు లేదా క్రీడలకు సంబంధించిన పాట కథ వ్యాసం సేకరించి నివేదిక రాసి తరగతి లో ప్రదర్శించండి.
భారతదేశం పల్లెల్లో నివసిస్తుంది అని గాంధీజీ గారు అన్నారు. నూటికి 90% ప్రజలు పల్లెటూర్లలో ఉంటున్నారు. తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న వేడుకల్లో క్రీడా వినోదాలు ఎన్నో ఇక్కడ జరుపుకుంటారు. ఈ వినోదాలలో వేడుకలలో పాటలలో సంస్కృతి, నాగరికత హిత బోధ, మేలు చేసే తత్వం ఉంది.
తెలుగు పల్లెల్లో రకరకాలైన ఆటలను, క్రీడా వినోదాలను మనం చూడవచ్చు. తోలుబొమ్మలాటలు, యక్షగానాలు వీధి భాగవతాలు మొదలైనవి జన ప్రచారంలో చాలా ఉన్నవి. ఉయ్యాల పాటలు నిద్రపుచ్చుట కొరకు పాడే జోల పాటలు మనదేశంలో వినని వారు ఉండరని చెప్పవచ్చు. పల్లెటూర్లు క్రీడలకు పాటలకు జీవన విధానానికి పట్టు గొమ్మలు


VIII.6. తెలుగు జానపద గేయాలు

Viii.6. తెలుగు జానపద గేయాలు 
-ఆచార్య బిరుదు రాజు రామరాజు 

పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదు రాజు రామరాజు రాసిన వ్యాసం.

రచయిత పరిచయం
పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు పాఠం పేరు : తెలుగు జానపద గేయాలు జననం : 16 - 4 - 1925 
మరణం : 8 - 2 - 2010 
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామం.
 వృత్తి : కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడు.
 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్ గా పనిచేశారు.

 ఇతర రచనలు : "తెలుగు జానపద గేయ సాహిత్యం" ఈయన పరిశోధన గ్రంథం. చరిత్ర చరితార్థులు. ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ - తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
--------
చదువండి - ఆలోచించి చెప్పండి.

చిక్కుడుపూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో చిక్కుడు తెంపాసీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో కొంగూలుపట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాలో బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్నలు

1. ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది?

2. ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా?

3. ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.

4. ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి?

పాఠం ఉద్దేశం

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానప

గొప్పతనం, వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.
................
విద్యార్థులకు సూచనలు
* పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
* వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి,
****************************
ప్రవేశిక

జానపద సాహిత్యమనగానే గుర్తుకువచ్చేది గేయమే. పదాలను, పాటలను జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంతప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం..
****************************

I
ఇతర భాషలలోని జానపదగేయాలలాగే తెలుగు జానపదగేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్క నీ లువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి ఆప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవ సీ ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషాసంస్కృతుల చరిత్ర ఎం ప్రాచీనమైనదో తెలుగు జానపదగేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.

ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయ తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్యస్పూర్తిని తెనుగు ప్రజల జీవనస్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందు, తపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాన ఆనోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవిత, మావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శ్రుతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుభాళిస్తుంది. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు. లందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు.. ఇటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృధు =హృదయం అవసరం. తెలుగు జానపద కవిత ఎంత సంపన్నమైనదో ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపేందుకు ప్రయత్నించడం జరిగింది.

పౌరాణిక గేయాలు
శిష్టసాహిత్యంలో మాదిరే జానపదగేయాలకు కూడా పురాణేతిహాసాల నుంచి కథావస్తువు స్వీకరించారు. రామాయణాదులలో అనువాదాలలో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి. జానపదగేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. పౌరాణిక గాథలపైన మన గ్రామీణులు గొప్పభక్తి, ప్రేమాభిమానాలు చూపుతారు. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకుని అర్ధం చేసుకుంటారు. కాగా పామరులు వాటిని జానపదగేయాల ద్వారా గ్రహిస్తారు. పామరులు ఈ ఉపదేశాలను అర్ధంచేసుకునే విధంగా జానపద గేయాలలో పొందుపరచారు. రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలు వారి వారి అభీష్టానుగుణంగా యాపుధరించాయి. శిష్ట సాహిత్యంలో మాదిరే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైన జానపదగేయాలే అధికంగా ఉన్నాయి.

శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవకల్యాణం, రాములవారి అలుక, సుగ్రీవవిజయం, అంగదరాయబారం, లక్ష్మణమూర్ఛ, లంకాయాగం, శ్రీరామపట్టాభిషేకం, ఊర్మిళాదేవినిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి. తెలుగు వారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్యదైవం. సీత పుట్టుక, సీతాకళ్యాణం, సీతనత్తవారింటికంపుట, తసమర్త, సీతశుభగోష్టి, సీతగడియ, సీతవామనగుంటలు, సీతమ్మవారి అలుక, సీత అగ్నిప్రవేశం, సీతచెర, మాయలేడిపాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధికసంఖ్యలో ఉన్నాయి.
****************************
ఆలోచించండి -చెప్పండి.
సీత అగ్నిప్రవేశం, సీతచెర, మాయలేడిపాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధికసంఖ్యలో ఉన్నాయి.
*********************
II
-చారిత్రక గేయాలు

జానపదగేయ వాఙ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్తం, శైలి, కథా కథన విధానాలలో తక్కినవానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలను వీరగీతాలని వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తాడు. 3 అపాట క్రమక్రమంగా పాకిపోతుంది. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. = ఇట్టి గీతాలు ప్రతి భాషలోనూ ఉన్నాయి.

వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి, ఉల్లాసానికి - మాత్రమే కాదు. అవి వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింప చేస్తాయి. తెలుగునాడు తొలినుండి వీరసీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాధివీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవ గలదే.

మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణిశంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాలమల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ, కుమార రాముని కథ, తెలంగాణలో బహుళ ప్రచారం పొందిన వీర గీతాలు, వల్నాటి వీరులకథలు, కాటమరాజుకథ, దేశింగురాజుకథ, బొబ్బిలికథ, పెద్దాపురం కోడిపందేల కథ, అల్లూరి సీతారామరాజుకథ మొదలైనవి ఆంధ్రప్రాంతమంతటా ప్రచారం పొందినాయి. మహాభారత కాలం నుంచి సమరనీతి ప్రకారం ద్వంద్వయుద్ధం జరిగినప్పుడు ఒకవీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలాకాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది. కాలక్రమంలో అతనిని జానపదులు దైవసమానుడుగా భావిస్తారు. అంతటితో వీరపూజ ప్రారంభమవుతుంది. హైదరాబాదు విమోచనోద్యమంలో అసువులు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోకి వస్తున్నాయి.

పారమార్థిక గేయాలు

భక్తి, కర్మ, జ్ఞానమార్గాలు మూడు మోక్షసాధనాలని భారతీయుల విశ్వాసం, ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనట్టిది. తెలుగునాట శైవవైష్ణవాది కీర్తనలు వేలసంఖ్యలో ప్రజాబాహుళ్యంలో అధిక ప్రచారం పొందాయి. అదృష్టవశాత్తూ అతి ప్రాచీనమైన భక్తిగీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగంవారు. హరిదాసులు తమజీవనాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాస కిర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు, తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దరుపులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు స్త్రోత్రములు తారావళులు, నామావళుల కూడ కీర్తనల కిందికే వస్తాయి. 

భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాం పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు. వా గురించి చర్చించుకుంటారు. వీటిని 'తత్త్వాలు' అని అంటాం సంఘవ్యవస్థలోని కులబేధాలను ఎక్కువ తక్కువలను ఈ గీతాలలో ఖండించారు. వరలక్ష్మిపాట, శ్రావణశుక్రవారపు పాల్గొ ■ తులసిపాట, లక్షవత్తులపాట, కామేశ్వరీపాట మొదలైన్య నోములపాటలు, బొడ్డెమ్మ పాట, బతుకమ్మపాట తెలంగాణలో బహుళ ప్రచారం పొందినట్టివి.

స్త్రీల పాటలు

గృహజీవనంలో స్త్రీకి పురుషునకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవిత్వం ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అన్వే రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి, రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమై ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగుపాటలు, అలుకపాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.
అతి ప్రాచీనమైన భక్తిగీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగంవారు. హరిదాసులు తమజీవనాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాస కిర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు, తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దరుపులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు స్త్రోత్రములు తారావళులు, నామావళుల కూడ కీర్తనల కిందికే వస్తాయి. 

శ్రామిక గేయాలు
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనపడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి కూనిరాగాలు వెలువడుతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. పిండి విసురుతున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు, ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలితో దున్నుతున్నప్పుడు, నాట్లు వేస్తున్నప్పుడు పొలానికి నీరు పెడుతున్నపుడు.

విత్తనాలు జల్లుతున్నప్పుడు, వంట నూర్చుతున్నప్పుడు, పడవలాగుతున్నప్పుడు, రాళ్లు కొడుతున్నప్పుడు, బరువులు మోస్తున్నప్పుడు, రోడ్డు రోలరు లాగుతున్నప్పుడు, ఇంటికప్పులు వేస్తున్నప్పుడు, పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు పాడతారు. ఈ పాటలు పాడుతూ వనిచేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరకశ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి

'ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే' - దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్ధం చేసుకున్నారు?
******************
ఆలోచించండి- చెప్పండి.
* 'వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు.' దీనిని వివరించండి.
* 'భక్తిగీతాలు కొందరికి జీవనోపాధి.' ఎట్లాగో చెప్పండి.
**************
III
పిల్లల పాటలు
జానపదగేయాలందు పిల్లల పాటల దొక ప్రత్యేక శాఖ. పసిపిల్లల లేతహృదయం ఎంత నిష్కపటమో, నిర్మలమో, స్వచ్ఛమో, మార్దవమో వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను, మార్దవంగాను ఉంటాయి. ఈ గేయాలు రెండు విధాలు. పిల్లల కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకం. పిల్లలు రాసి ఒక తరం నుండి మరోతరానికి అందినవి రెండవరకం. పెద్దలు రాసిన వాటిల్లో పిల్లలను లాలించేందుకు వ్రాసినవి లాలిపాటలు, నిద్రపుచ్చేందుకు వ్రాసినవి జోల పాటు నిద్రపుచ్చుతాయి, పెద్దలు వ్రాసిన పాటలు, పిల్లలు మెట్లవలె క్రమక్రమంగా పెరిగి పిల్లలు తాము తల్లిదండ్రుల వల్లనో ఇతర్వ ఈ లాలిపాటలు, జోలపాటలలోని భావాలు పిల్లలకు అర్థం కావు, వాటిలోని సంగీతం. లయ పిల్లలను లాలిస్తాల వల్లనో విన్న పాటలు స్వయంగా పాడేటంత వరకు సాగి ఆగిపోతాయి. ఈ పాటలు పిల్లలకు మొదట నాదామృతం గ్రోలకు వేర్చుతాయి, తర్వాత అనుకరించి చేతులు తిప్పటం చివరకు లయానుగుణంగా చేతులు చరచటం నేర్చుతాయి, మొకు దశలో ఆకర్షణ, రెండవ దశలో ఉత్సాహం, మూడవ దశలో అభ్యాసం కనిపిస్తాయి.

పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరికొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినదిన ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలని గ్రహిస్తారు. వాటిలో అర్థం ఉండదు. వాటి 'అర్ధం లేని పాటలు'గా వ్యవహరిస్తారు. బాలబాలికలు ఆటలలో పాడేపాటలు ఇట్టి కోవకు చెందినట్టివి. చెమ్మచెక్క బిన్ని కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజ రేకులు, గొబ్బిళ్లు, చిట్టిచిట్టి చిర్ర ఇందుకు కొన్ని ఉదాహరణలు.

కరుణరస గేయాలు
నిత్యం జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారసిల్లుతుంది. అందుచేత కరుణరస ప్రధానమైన సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసీ పొంగే పాట మున్నగునవి తెలంగాణాలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు.

తెలుగు జానపద గేయాలలో అధిక ప్రచారం పొందినవాటి సంగ్రహచరిత్ర ఇది. అముద్రితమైన ఈ గేయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని భద్రపరచేందుకు తగుశ్రద్ధ వహించక పోయినట్లయితే నాగరికత పల్లెసీమలకు విస్తరించిన కొలది ఇవి క్రమంగా అంతరించిపోతాయి. వాటికి సాహితీ పరమైన విలువ మాత్రమే కాక సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడ ఉన్నది. నిఘంటువులో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనిపిస్తాయి. రమణీయమైన స్థానికగాథలు వాటిలో అభినర్పితాలయ్యాయి. ప్రతిభ గల కవులు వాటిని చక్కటి కావ్యాల్లోను. మలచవచ్చును. వివిధ ప్రణాళికల ద్వారాను, బహుళార్ధ సాధకమైన ప్రాజెక్టుల ద్వారాను భారత దేశానికి కొత్త రూపురేఖలు. తీర్చిదిద్దేందుకు బృహత్తర కృషి జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో జానపద గేయాలు నిరక్షరాస్యులైన ప్రజలలో ప్రచారానికి అత్యుత్తమ సాధనం కాగలవు. ఈ దిశలో వంగీయులు, హిందీవారు ఎక్కువ పురోగతి సాధించారు. భద్రవరచుకున్నారు. వాటిని ఉత్తమంగా వారు తమ జానపద గేయాలను జాగ్రత్తగా అనుసరించ గలరని నా విశ్వాసం. వినియోగించుకుంటున్నారు. తెలుగువారు కూడ వారిని
**************************
ఆలోచించండి- చెప్పండి.
"నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి?

జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి?
*****************"*


ఇవి చేయండి

I. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని 

II. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. 'జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం' - చర్చించండి.

2. మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.

1. కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య, ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

అంశం

పేరా సంఖ్య

కీలక (ముఖ్యమైన) విషయాలు

* పౌరాణికగేయాలు
* చారిత్రకగేయాలు
* శ్రామికగేయాలు
* పిల్లలపాటలు

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది.. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్త్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు, ముక్తపదగ్రస్తాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి?
జానపదులు తమకు తాము సహజంగా నేర్చుకున్నది కానీ వేరొకరు నేర్పింది కాదు.
ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
జ. పెద్దలు చెప్పే కథల వల్ల వినోదమే గాక విజ్ఞానం కూడా లభిస్తుంది.
ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ?
జ. పిల్లలు మాజం నుంచి నేర్చుకునే చదువుకొండంత.
ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు?
లోకజ్ఞానానికి హేతువు జానపదల సాహిత్యమే 
) పొడుపు కథలు, ముక్తపదగ్రస్తాలు వీటి ప్రత్యేకత ఏమిటి?
జ. పొడుపు కథలు వల్ల బుద్ధి, ముక్తపద గ్రస్తం వల్ల పదవిజ్ఞానం తెలుస్తుంది.
.............................

II. స్వీయ రచన
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి?
జ. జానపద గేయాలు మన సంస్కృతికి నాగరికతకు, సంప్రదాయాలకు ప్రతీకలూ వాటిల్లో విద్యాభ్యాసము లోకజ్ఞానము, హేతువు అంతా వారి సాహిత్యమే. జానపద గేయాలలో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. బుద్ధికి పదును పెట్టే సమస్యలు ఉంటాయి.  ముక్తపదగ్రస్తాలు వివిధ అలంకారాలు ఉంటాయి.  జానపద గేయాల్లో శైలి విశిష్టమైనదిగా పేర్కొనవచ్చు. వివిధ పురాణ గాథలు చారిత్రక కథలు విశిష్టమైన అంశాలు జానపద గేయాల్లో కనిపిస్తాయి. జానపద గేయాలు చాలా సరళమైన భాషలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి. చరిత్రను తెలియజేస్తాయి. ఇటువంటి జానపద గేయాలను మనం వారసత్వ సంపదగా భావించాలి. ముందు తరాల వారికి అందించాలంటే వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది.

ఆ)జానపద గేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి?
జవాబు:  రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథము అని సూక్తి ఇది భారతీయులకు ఆదికావ్యం రామాయణం.  అనువాదాలలో మూలంలో లేని కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నవి ఉంటాయి. సీతారాములు ఆదర్శ దంపతులుగా దర్శనమిస్తారు. రాముడు మానవాళికి ఆరాధ్యుడు. శ్రీరాముడు, రాఘవ కళ్యాణం, రాములవారి అలక, సుగ్రీవ విజయం, లక్ష్మణ మూర్ఛ, లంక యాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైనవి రామాయణంలో కొన్ని ఘట్టాలను తెలియజేస్తాయి. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. సీత అంటే కష్టాలకు చిరునామా అని భావిస్తారు. అప్పుడప్పుడు నాకు సీత కష్టం వచ్చిందని కూడా పేర్కొంటారు. సీత పుట్టుక కళ్యాణం మొదలైన వారిని ఉన్నాయి

ఇ) ‘గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది’ – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సంసార విషయాలు స్త్రీలకే బాగా తెలుస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలగడం, గృహసంబంధమైన వేడుకలు మొదలైన వాటిల్లో స్త్రీలకే ప్రాధాన్యం ఎక్కువ.

జానపదగేయాల్లో కూడా స్త్రీలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా తల్లి తన కుమారుడిని రామునిగానో, కృష్ణునిగానో, కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో తలచుకొని తన్మయత్వం పొందుతుంది. పిల్లల అభివృద్ధి కోసం స్త్రీలు ఎన్నో త్యాగాలను చేస్తారు. స్త్రీకి పురుషుని కంటే ఓర్పు చాలా ఎక్కువ. కుటుంబజీవనం ఇంతగా వృద్ధి పొందడానికి స్త్రీలే ప్రధానకారణమని చెప్పవచ్చు.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
జానపదగేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడుతారు. ఈ పాటలను పాడుతున్నప్పుడు శ్రామికులు తమ శ్రమను మరచిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి శారీరక శ్రమ కలుగదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.

(లేదా)

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” – దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు.
ఇతర భాషలలోని జానపద గేయాల లాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయచరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.

ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితాసౌరభం గుభాళిస్తుంది.

మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమ పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృదు హృదయం అవసరం. తెలుగు జానపదం ఎంతో మధురమైంది. ఈ జానపద వాఙ్మయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

IV. సృజనాత్మకత / ప్రశంస
1. కింది ప్రశ్నలకు జవాబులు సృజనాత్మకంగా రాయండి.
అ) వారం రోజులపాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారు చేయండి.

జానపద కళావారోత్సవాలు ఆహ్వాన పత్రిక

జై తెలంగాణ ! జై జై జానపదం !

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో జానపద కళా రూపాలను ప్రదర్శిస్తున్నాము. తరతరాల వారసత్వంగా మనకు సిద్ధించిన ఈ జానపదకళారూపాలను దర్శించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము.

వేదిక : కోటిలింగాల దేవస్థాన కళామండపం, సిద్దిపేట.
సమయం : రాత్రి 7 గం॥ నుండి 9 గం||ల వరకు

ప్రదర్శించే రోజు – ప్రదర్శించే జానపదకళారూపం
1) 13. 10. 18 – సీతాకళ్యాణం – తోలుబొమ్మలాట
2) 14.10.18 – సుగ్రీవ విజయం (యక్షగానం)
3) 15.10.18 – రాధాకళ్యాణం – కురువంజినృత్యం
4) 16.10.18 – వాలివధ – వీధి భాగవతం
5) 17.10.18 – వీరాభిమన్యు – హరికథ
6) 18.10.18 – రుక్మిణీ కళ్యాణం – బుర్రకథ
7) 19. 10. 18 – శ్రీకృష్ణలీలలు – ఒగ్గు కథ

ఇట్లు,
సిద్దిపేట జానపద కళా సమితి.

V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి 
సౌరభం : సువాసన, పరిమళం
అ)ఆలంబన : ఆధారం ఆశ్రయం
ఆ)మోక్షం : కైవల్యం ముక్తి 
ఇ)కష్టం : ఇక్కట్లు, శ్రమ

2. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
పురోగతి:  
ఇంకా మానవ పురోగతి సాధించాలి.
రూపురేఖలు:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల రూపురేఖలు మారాయి.

కూని రాగాలు : కొందరు తీరిక సమయాల్లో పోలిరాగాలు తీస్తారు.

VI. భాషను గురించి తెలుసుకుందాం.
ఒకటి కింది వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి
అ)  మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జ. మామయ్య ఇంటికి వచ్చి, కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది. 
కొమ్మ విరిగి కింద పడింది.
శత్రువులు భయపడ్డారు.
 శత్రువులు పారిపోయారు. 
జవాబు: శత్రువులు భయపడి పారిపోయారు

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు : శివ అన్నం, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది.
ఆమె కొబ్బరికాయలు ఇచ్చింది.
జ. ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకున్నాయి.
 వర్షం పడలేదు.
జ. నల్లని మబ్బులు కమ్ముకున్నా వర్షం పడలేదు.

కింది పదాలు చదవండి వాటికి విగ్రహవాక్యాలు రాయండి అవి ఏ తత్పురుష సమాసం రాయండి

అ) గదా ధరుడు : గదను ధరించిన వాడు ద్వితీయ తత్పురుష సమాసం 
ఆ) అగ్ని భయం : అగ్ని వలన భయం - పంచమి తత్పురుష సమాసం 
ఇ) గుణహీనుడు : గుణముల చేత హీనుడు - తృతీయ తత్పురుష సమాసం 
ఈ) ధనాశా : ధనమునందు ఆశ - సప్తమి తత్పురుష సమాసం 
ఉ) దైవభక్తి : దైవమునందు భక్తి - సప్తమి తత్పురుష సమాసం 
ఊ) అజ్ఞానం : జ్ఞానం కానిది - నణ్ తత్పురుష సమాసం

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
పెళ్లిళ్లలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు సేకరించి నివేదిక రాయండి.
సీత కల్యాణ వైభోగమే 
రామ కల్యాణ వైభోగమే 
పవనజ స్తుతి పాత్ర పావని చరిత్ర 
రవి సోమ నవనేత్ర రమనీయ గాత్ర భక్తజన పరిపాల భరిత శరజాల 
భక్తి ముక్తి దలీల భూదేవ పాల