సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

23, అక్టోబర్ 2025, గురువారం

vii. ఉ. 1 అద్భుతమైన సెలవులు

ఉపవాచకం

ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణదురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు...

໑໖໖...

1. సోమనాద్రి

(చారిత్రక వీరగాథ)

అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.

గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం)

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు మన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను దినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను వృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను శ్రీ కళాభిమాని, గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. సరంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల వర విగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు సంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, రంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

131
సోమనాద్రి 'పూడూరు' ను రాజధానిగ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగ ప్రసిద్దికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్యప్రాంతంగ ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న 'ఉప్పేడు'' కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబూ అయిన నాసిరుదౌలాకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి, సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని, దావూద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకొన్న దావూడ్మియా మండిపడ్డాడు. ముందువెనకలు ఆలోచించకుండ సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబయిన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురుసాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన 'ఆరగిద్ద' దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని, సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసరుజంగు యుద్ధంనుంచి తప్పుకొని, తన సైన్యంతో ఇంటిముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడ బుద్దితెచ్చుకొని మెల్లగ జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి, ఏకాకి అయిపోయాడు. ఇక చేసేదిలేక, తాను కూడ ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగుమీదికి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరుకున్నాడు. ఇక ముందెన్నడు సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధచిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను, సోమనాద్రికి సమర్పించుకొని, తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు.

ఎట్లానో ఆరాత్రి గడిపాడు సయ్యద్ దావూద్్మయా. మర్నాడు ఉదయాన్నే తన కోటమీదకి ఎక్కి, గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోట పై ఏ రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరికి కడుపులో మండింది. ఎట్లాగైన

132
తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేరూర్చుమని కోరాడు. నిజాం నవాబు నాసిరుదౌలా, సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చజెప్పాడు. కాని సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక, నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రిమీద యుద్ధానికి బయలుదేరాడు.

5 పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి, పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించ దీనికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు.

0.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న 'నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో పిన్న్ 'కలుగోట్ల' గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆ నాటి యుద్ధపు నవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట ం సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు మంకరంగా యుద్ధంచేస్తూ నిజాంసైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దీ 'కలుగోట్ల' ను చేరి విశ్రమించాడు.

3. న సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని _. ంగదీసుకొనే ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడొక సర్దారు, "సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే మన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు' అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి -నినాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. "తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు "న్నిను" అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు ఐ. మయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ద్ద గో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. యంమీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగనే నిజాము ఆనందానికి అంతులేకుండ యింది. వెంటనే ఆ సైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడ బహుమానంగా ఇచ్చాడు.

తెల్లవారింది. గుర్రంలేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. తన పై వీచెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యాన్ని విడువలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు.

133
ఆరోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలూ యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తనవారితో సమాలోచన చేశాడు. "తెలారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెసారో వారికి నా గుర్రం ఒక రోజంత ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగ ఇస్తాను" అని ప్రకటించాడు.

గద్వాలకు పదిమైళ్ళ దూరంలో 'జొచ్చెంగన్నపల్లి' అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు. ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రంకోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రంకూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్పనాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటుపుల్లలకోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.

గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంత సేపటికి ఒకడు వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకు పోయింది.

నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తనమీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు.

134

అర్ధగంటలో, ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమచేత్తో సలాం డు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండిచేతిని చూపించి, జరిగిందంత వివరించాడు. -జు ఆశ్చర్యపోయాడు. నాయుణ్ణి కౌగిలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దానశాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉదయాన్నే తన మాన్యాన్ని వెంటపెట్టుకొని నిజాం సైన్యంమీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయభేరి ధ్వనులు నిజాం సైన్యం - పండెల్ని బద్దలుచేశాయి. సోమనాద్రిసైన్యం నిజాంసైన్యాన్ని దావానలంలా చుట్టుముట్టింది. భయంకరంగ యుద్ధం గింది. ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యాన్ని -ర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ ర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతపడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి లోపల ఉన్నాడు; మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది.

గద్వాల సర్దారులకు భయం ఎక్కువయింది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా యత్నించారు. కాని ఫలితం లేకుండ పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో, బయట ఉన్న గద్వాల 2 ద్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. ఆం ర్వాలలో ఉన్న లింగమ్మరాణికి పరిస్థితిని తెలియజేస్తు, తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనారి మాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు, కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. టనే రెట్టింపు పట్టుదలతో, ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగలగొట్టి లోపలికి దేశించారు.

కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్నా సోమనాద్రి వీరోచితంగ పోరాడుతున్నాడు. తన సైన్యం చాలవరకు పృతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో న్నంజడి హెచ్చింది. పిడికెడుమందితోనే సోమనాద్రి కోటలోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే కేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధవిముఖులయ్యారు. స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో జెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు. সু

నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. చేయస్ఫూర్తి గల సోమనాద్రి కూడ సంధికి అంగీకరించాడు. యుద్ధపరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి - రుజులో ఉన్న 'ఎల్లమ్మ' ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ, లక్ష్మణ' అనే పేర్లుగల రెండు సంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంతభాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం + మభూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది, విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

యుద్ధం ముగిసిన తరువాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత మిని హనుమప్పనాయుడికి ఇనాముగ ఇచ్చాడు. ఈ నాటికీ బొచ్చెంగన్నపల్లిలో హనుమప్ప సంతతివారు ఆ హములను అనుభవిస్తు, తమకు ఆ భూమి ఎక్కువ కావటంవల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ముగ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

(సురవరం ప్రతాపరెడ్డిగారి 'హైందవ ధర్మవీరులు' అనే గ్రంథం ఈ కథకు ఆధారం)

135

VI.ఉ 2. మన జాతర జన జాతర (సమ్మక్క సారలమ్మ జాతర)

ఉపవాచకం

పచ్చని అడవిలో ఇసుకవేస్తే రాలనంత జనం కంకవనం తోడుగా కుంకుమ బరిణెలో గద్దెలకు పయనం కోయపూజారులతో కొలువైన చిలుకలగుట్ట దేవగణం తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం నిలువెత్తు బెల్లాలు తల్లులకు మొక్కులుగా సమర్పణం సంప్రదాయ వేషధారణల నృత్యాల సమ్మేళనం రెండేళ్ళకొకసారి అంబరమంటే సంబురం - మన మేదారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం.

2. మన జాతర - జన జాతర

(సమ్మక్క- సారక్కల మేడారం జాతర)

జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృతపదం 'యాత్ర' కు వికృతిరూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ఫోన్లు, రవాణసౌకర్యాలు ఉన్నాయి కాని ఇవేవీ లేని కాలంలో సకలజనం కలుసుకుని మాట్లాడుకునేది జాతరలోనె. పుట్టినా, చనిపోయినా, ఈ వార్తలన్నీ తెలిసిపోయేది 5-జాతరలోనె. ఊరికి దూరంగా వాగుపక్కనో. అడవిమధ్యనో జాతరలు రెండు మూడు రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంటసామాగ్రి తీసుకుని పోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపునిండా మాట్లాడుకొని వచ్చేవారు. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరుపొందిన 'మేడారం' గిరిజన జాతర గురించి తెలుసుకుందాం.

జాతర జరిగే స్థలం : జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవిమధ్యలో 'చిలకల గుట్ట' ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు

136
రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరినెలలో) మొదలుకొని మూడురోజులపాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క - సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రంనుంచేకాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

ఎవరీ సమ్మక్క- సారక్క : గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే నమ్మక్క సారక్కలు ఇద్దరు తల్లీకూతుళ్లు, - గిరిజన హక్కులకోసం ఎదురుతిరిగి పోరాడిన వీరవనితలు.

12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా 'పొలవాస' ప్రాంతాన్ని గిరిజనదొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న -దం న్నపిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని లేని రుపెట్టుకున్నాడు. చిన్నప్పటినుంచే సమ్మక్క చెట్లవైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు యేది న్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది.

జనం మరో

ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి డుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల ం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనులకోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల గోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు. ప్రజలకు కనిపించరు. కాని విదారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజలమధ్యనే ఉండేది.

యుద్ధం అనివార్యం అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తుండేవాడు. రాజ్యవిస్తరణలో గంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు ద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయమిచ్చినట్టు తాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు.

137

అప్పుడే కరువు కాటకాలొచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజలనుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టంలేదు. ఆదాయంలేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇట్లా రెండు మూడేండ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించు కున్నాడు.

.

అసలే పగిడిద్దరాజుమీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. అతని మంత్రి యౌగంధరాయణుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరుచుకున్నది.

సమ్మక్క వీరోచిత పోరాటం : యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరి పోసింది. తమ ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది. యుద్ధం మొదలయింది. సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. వీరితోపాటు కొండాయి, గోవిందరాజు, కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు.

అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయరాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరుగా అందరు వీరమరణం పొందుతున్నారు. వీరోచితంగా పోరాడుతు గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడ శత్రువుల చేతిలో హతం అయ్యాడు. చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రుసైన్యాలను ఎదుర్కొన్నది.

యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనకనుంచి వచ్చి దెబ్బకొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుకనుంచి వెళ్లి బల్లెంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రంమీద ఈశాన్యదిక్కున ఉన్న చిలకల గుట్టమీదికి పోయింది. ఎంత వెతికినా మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆమెకోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దానికింద ఓ పుట్ట. పుట్టమీద ఓ కుంకుమ బరిణ కనిపించింది.

సమ్మక్క గద్దె

138
ఆ బరిణలో పసుపు, కుంకుమ, చెట్లమూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు.

రాజు కల : మేడారం కాకతీయుల వశమయింది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం 'ఏకవీరాదేవి' కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు తన పురోహితుడిని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట.

జాతర జరిగే విధం జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకలగుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు.

జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న బరిణను, చెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క 2. గాయపడ్డ చోటును తల్లిగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని 'దేవతలను ఆహ్వానించడం' అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు. య దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

139
అమ్మవారి మొక్కులు : భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని 'బంగారం' అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడుతారు. అంతేకాకుండ ఒడి బియ్యం, తలవెంట్రుకలు ఇయ్యడం, వెదురుతొట్టె కట్టడం, కోడెలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు.

వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది.

పర్యావరణాన్ని రక్షించండి : మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు,

వంకలు, పేర్లు వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనమీద ఉన్నది. ఇవి లేకుంటే వర్షాలుండవు. వనరులు ఉండవు. కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువయింది. ఏ జాతరకు వెళ్లినా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతున్నది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది. జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారుచేయడం, అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి.

జాతరలతో సుఖసంతోషాలు పొందాలే కాని పర్యావరణాన్ని పాడుచేసుకోకూడదు. మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు.

140