ప్రశ్నలు:
1.పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.పై బొమ్మలో ఒక
వృద్ధురాలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2. బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు. బొమ్మలో వృద్ధురాలు
అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆ సమయంలో భార్యాభర్తలు ఆ వృద్ధురాలికి సపర్యలు
చేస్తున్నారు. పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు.
3.ముసలమ్మకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు ?
జవాబు.ముసలమ్మకు సేవలు
చేస్తున్నది ఆమె కుమారుడు, కోడలు అయి ఉంటారు.
ప్రశ్న 4.మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు ?
జవాబు.మా ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉన్నారు. వారు వృద్ధులు. వారికి నేను సేవ చేస్తాను. వారికి
అవసరమైన మందులు అందిస్తాను. బయటకు తీసుకొని వెళ్తాను. అల్పాహారం, భోజనం పెడతాను. కాళ్ళు నొప్పులు వస్తే మర్దన చేస్తాను.
పాఠం ఉద్దేశం:
వృద్ధులపట్ల సానుకూలవైఖరి
పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా
సేవలు చేయాలి. ఒకవేళ మనవల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక
పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారిపట్ల గౌరవభావంతో
మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘కథానిక’ ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది.
విద్యార్థులకు సూచనలు
* పాఠంలోని బొమ్మలను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
* పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.
* అర్ధంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.
* పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు- అర్థాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.
ప్రవేశిక
కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబవ్యవస్థ నిలిచి ఉన్నది. 'అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం' అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మ... ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం
I
రవి వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ.
నాయనమ్మకు కండ్లు సరిగ్గా కనిపించవు. మోకాళ్లు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది.
నాయనమ్మను చూడటానికి వచ్చిన వాళ్లందరూ “ఏం అవ్వా! మంచిగున్నవా?” అని అడిగితే, “ఏం మంచిగుండుడు బిడ్డా! ఎవ్వళ్లకూ పనికిరాని బతుకు” అని అనేది.
“ఏం కాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నాడు” అని వచ్చినవాళ్లు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్లంతా తలవంచి దండం పెడుతుంటే, “సల్లగుండు బిడ్డా” అని దీవించేది.
అవ్వ పడుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు ఇంకా కొన్ని బట్టలుంటాయి. పక్కన బల్లమీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజూ మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు.
మంచానికి రెండుదిక్కులా ఏమేమి వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు. ఎంత రాత్రి నిద్రలేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేత్తోటి అందుకుంటుంది.
అవ్వ మంచానికి ఒక దిక్కున నీళ్ల బిందె, చెంబు ఉంటాయి. దాహం అయితే చెంబుతోని నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కున చెప్పులుంటాయి. మంచం దిగితే చూడకుండానే కాళ్లను చెప్పుల్లో పెట్టి తొడుక్కుంటుంది.
అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారంలెక్క చూసుకుంటారు. రవివాళ్ల అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకుపోతారు. స్నానం చేయించినంక మళ్లా మంచంమీద కూచుండబెట్టినపుడు నాయనమ్మ ముఖంమీద నీళ్ల చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనబడుతాయి.
రవివాళ్ల అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దువ్వుతూ, నాయనమ్మ నొసలుమీద ముద్దుపెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి. ఏ మందు గోలీలు ఎప్పుడు వేసుకోవాలో నాయనమ్మకు తెలుసు. రవివాళ్ల అమ్మగానీ, నాన్నగానీ మందులు వేయబోతే “నాకు చాతనయితది బిడ్డా... నేనేసుకుంట” అంటుంది.
ఆలోచించండి
-
‘సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు’ ఎందుకు?
-
“ఏం కాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నాడు” అని ఇంటికి వచ్చినవారు అనటంలో ఆంతర్యమేమిటి?
-
‘సల్లగుండు బిడ్డా’ అని ఏయే సందర్భా
13 page II
రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకు ఏదైనా పని చేసిపెట్టడమన్నా, నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా ఇష్టం. రవికేకాదు అతని తమ్మునికి, చెల్లెకు కూడ నాయనమ్మ అంటే ఇష్టం. నాయనమ్మ కూడ పిల్లలు బడినుంచి ఇంటికి ఎప్పుడు వస్తారో అని ఎదురుచూస్తుంది.
ఒకరోజు వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళ కొడుకు శేఖర్. రవి ఒకే ఈడువాళ్ళు. ఒకరితో ఒకరు కలసి ఆడుకోవడమంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, అడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలసి అడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు.
శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న తమ్మునితో కలసి ఇంటికిరాగానే రవికి ఎంతో సంబురమైంది. ఇద్దరూ కలసి కొంచెంసేపు ఆడుకున్నారు. కాని కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్ కు నచ్చలేదు. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు.
ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం.తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్ కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. "రవీ! నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను. నాతో పాటే ఎందుకు ఉండవు"? అని అడిగాడు శేఖర్.
"నాయనమ్మకు పనులు చేసుకోవడం చాతనయిత లేదు. అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి. రేపు మొత్తం నీతోటే ఉంటలే" అన్నాడు రవి.
తెల్లవారి లేవగానే తయారయి, శేఖర్ ను తోలుకోని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. అందరూ కలసి బడిలో ఆటస్థలానికి వెళ్ళి (చిర్రగోనె) ద్రాగుడుమూతలు, కబడ్డి ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ మాపటికి ఇంటికి రాంగనే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్ కు ఇంకా బాధగా అనిపించింది.
ఆలోచించండి- చెప్పండి..
* మీరు ఏయే ఆటలు ఆడుతారు?
* మీతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది?
కలసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది?
మీరు ఎవరికైనా, ఎప్పుడైనా సహాయంచేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి.
III
తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది. రవి భాధపడ్డాడు. జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది. శేఖర్ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకో రెండురోజులూ రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేసాడు. రవి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోటే ఉన్నారు.
రెండురోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కానీ చాతగాకుండా ఉండడంతో నాయనమ్మ పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరనే ఉండిపోయాడు.
13. విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక
14.
ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరనే ఉండడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతోపాటు రవిని ఆడుకోనీయకుండా చేస్తున్నది నాయనమ్మ అని ఆమెమీద ద్వేషం పెంచుకున్నాడు.
రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలుచేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్నకొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండాచూసి నాయనమ్మ మంచానికి రెండు దిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగ కూచుని నాయనమ్మనే చూడసాగాడు.
ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్రలేవంగనే చెప్పులు ఉండే దిక్కునుంచి కిందికి దిగింది. కాని అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కుని కింద పడింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మను పైకిలేపి మంచంమీద పడుకోబెట్టారు.
డాక్టరు వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు. ఎక్స్-రే తీయించాడు. నాయనమ్మ తొడఎముక విరిగిందని డాక్టరు చెప్పాడు. ఆపరేషన్ చెయ్యాలి, కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు.
అసలు చెప్పులు ఉండేచోట బిందె ఎవరు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. పనిమనిషి మతిమరుపుతో అట్లా చేసిందేమోనని అనుకున్నారు.
2. ఆలోచించండి చెప్పండి..
జ్వరం వచ్చినపుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారుకదా! దీనివల్ల నీవు ఏమి గ్రహించావు?
* శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?
* నీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలుపండి?
14. విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక
15Page
IV
నాయనమ్మ నెలరోజులు దవాఖానాలోనే ఉన్నది. రవితోసహా అందరూ ప్రతిరోజూ దవాఖానాకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు.
తన అమ్మానాన్నలతోసహా ఇంట్లో అందరూ = నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖరు కూడా బుగులైంది.
'అయ్యో! నాయనమ్మకు ఈ కష్టం కలగ డానికి కారణం నేనేకదా! ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ అని ఆలోచించగానే ప్రాణాలకు ప్రమాదం జరిగిఉంటే' అతనికి చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి 'ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే' అనుకోంగనే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరూ ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటితీరుగ మాట్లాడలేకపోయాడు. ముభావంగా ఉండిపోయాడు. శేఖర్ ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ అర్థంకాలేదు. శేఖర్ను మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు.
కొద్దిరోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకు వచ్చారు. నాయనమ్మ కాలుకు కట్టుతో మంచంమీదనే ఉండిపోయింది. శేఖరు నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరకు పోయి ఆమెనే చూసుకుంటూ కూచునే వాడు.
అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ ను నాయనమ్మ పిలిచేది. తన దగ్గరున్న పళ్ళు తినమని ఇచ్చేది. దానిమ్మ గింజలను ఒలిచి శేఖర్ నోట్లో పోసేది.
అట్లా చేస్తున్న ప్రతిసారీ శేఖర్ కు ఏడుపువచ్చేది. ఆరోజు
15.విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక
నుండి అతడూ రవివలె నాయనమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. నాయనమ్మ అతడిని రవిని చూసినట్టు ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్నకొద్దీ శేఖర్కు తాను చేసినతప్ప గుర్తు ఏడుపువచ్చేది. ఆ ఏడుపునుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలువలేదు.
ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్.
"ఏమయింది?" అడిగింది నాయనమ్మ. "నాయనమ్మా! నీమీద కోపంతోని చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది నేనే" అని భోరున ఏడ్చాడు.
నాయనమ్మ ఏమనలేదు. “నాయనమ్మా! నాకు రవితోని ఆడుకోవడమంటే బాగా ఇష్టం. కాని రవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లా చేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధలేదు" అన్నాడు ఏడ్చుకుంట. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్ళు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగనే శేఖర్ ఏడువడం ఆపాడు.
"అంతా మంచే జరిగిందిరా... నేను కష్ట పడడం చూసి నీలో మార్పువచ్చింది. రవి నాతోనే ఉండడం. నీకు నామీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడా ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది నువ్వింక అందరితో కలిసి ఆడుకో... సంతోషంగ ఉండు" అంటూ శేఖర్ వీపుమీద తన అరచేత్తో రాసు ఓదార్చింది.
ఆలోచించండి చెప్పండి
* శేఖర్ పశ్చాత్తాపపడ్డాడుకదా! మీరు ఏయే సందర్భాల్లో పశ్చాత్తాపపడ్డారో చెప్పండి?
* శేఖర్ అందరితోని మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి?
* నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు?
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా !
వీరిద్దరిలో ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నాను. వీరిలో అందరు రవిలాగా
ఉండాలనుకుంటారు. ఇంట్లో నాయనమ్మ,
తాతయ్య ఉంటారు. వారు
వృద్ధులు. వారికి సేవలు చేయాలి. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వాళ్ళకు
ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. వారి దీవెనలు పొందాలి. నాయనమ్మకు పిల్లలపై
మమకారం ఉంటుంది. పిల్లలకు కూడా తాతయ్య, నాయనమ్మలంటే బాగా
ఇష్టపడతారు. అందువల్ల అందరు రవిలాగా ఉండాలని అనుకుంటారు.
ప్రశ్న 2.నాయనమ్మ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.వృద్ధులపట్ల సానుకూలవైఖరిని
ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను
ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి.
నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.
ఒకసారి బంధువులు ఊరి నుండి
వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందామని
అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో
శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను
తారుమారు చేశాడు. దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది.
కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు
కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు.
నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1. కింది పేరా చదువండి.
ముఖ్యమైన పదాలు రాయండి.
ఒక శివరాత్రినాడు శివుడిని
దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక
వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదుటిమీద
దెబ్బతోని అవ్వ స్పృహతప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. అందరూ శివుడిని
చూడడానికి ఎగబడ్డారు. కాని ఇద్దరు ఆడపిల్లలు చూశారు. అవ్వను లేవదీసి
కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. చల్లని నీళ్ళు
తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. “బంగారుతల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారు” అని అవ్వ ఆనందబాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది.
ఉదా : జనసమ్మర్థం, దీవించటం
1. స్పృహతప్పింది
2. ఎగబడ్డారు
3. కట్టుకట్టారు
4. దుమ్ముధూళి
5. బంగారుతల్లులు
6. ఆనందబాష్పాలు
2. కింది వాక్యాలు చదువండి. వీటిలో మీరు ‘అవును’ అని అనుకొనే వాటికి (✓) లేకుంటే (✗) గుర్తు పెట్టండి.
అ) నాకు ముసలివాళ్ళంటే బాగా
ఇష్టం. ✓
ఆ) నేను ముసలివాళ్ళకు
ఎప్పుడైనా పనులను చేసిపెడుతాను. ✓
ఇ) ఎవరి వస్తువులనైనా
నాకిష్టమైతే తీసుకొంటాను. ✗
ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు, పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను. ✓
ఉ) ముసలివాళ్ళకు
మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను. ✓
ఊ) అమ్మానాన్నలకు పనులలో
సహాయం చేస్తాను.✓
ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే
నాకు కోపం వస్తుంది. ✗
ఏ) నావల్ల ఎవరికైనా బాధకలిగితే, నేనుకూడా బాధపడుతాను. ✓
ఐ) నేను చేసిన తప్పులను
ఒప్పుకుంటాను. ✓
