సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

నాయనమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాయనమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2024, సోమవారం

VII. 2. నాయనమ్మ


ప్రశ్నలు:

1.పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.పై బొమ్మలో ఒక వృద్ధురాలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

2. బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు. బొమ్మలో వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆ సమయంలో భార్యాభర్తలు ఆ వృద్ధురాలికి సపర్యలు చేస్తున్నారు. పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు.

3.ముసలమ్మకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు ?
జవాబు.ముసలమ్మకు సేవలు చేస్తున్నది ఆమె కుమారుడు, కోడలు అయి ఉంటారు.

ప్రశ్న 4.మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు ?
జవాబు.మా ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉన్నారు. వారు వృద్ధులు. వారికి నేను సేవ చేస్తాను. వారికి అవసరమైన మందులు అందిస్తాను. బయటకు తీసుకొని వెళ్తాను. అల్పాహారం, భోజనం పెడతాను. కాళ్ళు నొప్పులు వస్తే మర్దన చేస్తాను.

 

 

పాఠం ఉద్దేశం:

వృద్ధులపట్ల సానుకూలవైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మనవల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారిపట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం కథానికప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది.

ప్రవేశిక:

కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబవ్యవస్థ నిలిచి ఉన్నది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితంఅనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం….


I


ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా ! వీరిద్దరిలో ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నాను. వీరిలో అందరు రవిలాగా ఉండాలనుకుంటారు. ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉంటారు. వారు వృద్ధులు. వారికి సేవలు చేయాలి. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. వారి దీవెనలు పొందాలి. నాయనమ్మకు పిల్లలపై మమకారం ఉంటుంది. పిల్లలకు కూడా తాతయ్య, నాయనమ్మలంటే బాగా ఇష్టపడతారు. అందువల్ల అందరు రవిలాగా ఉండాలని అనుకుంటారు.

ప్రశ్న 2.నాయనమ్మ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.వృద్ధులపట్ల సానుకూలవైఖరిని ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి. నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.

ఒకసారి బంధువులు ఊరి నుండి వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందామని అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను తారుమారు చేశాడు. దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.


II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

ప్రశ్న 1. కింది పేరా చదువండి. ముఖ్యమైన పదాలు రాయండి.

ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదుటిమీద దెబ్బతోని అవ్వ స్పృహతప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. అందరూ శివుడిని చూడడానికి ఎగబడ్డారు. కాని ఇద్దరు ఆడపిల్లలు చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. బంగారుతల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారుఅని అవ్వ ఆనందబాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది.

ఉదా : జనసమ్మర్థం, దీవించటం

1.    స్పృహతప్పింది

2.    ఎగబడ్డారు

3.    కట్టుకట్టారు

4.    దుమ్ముధూళి

5.    బంగారుతల్లులు

6.    ఆనందబాష్పాలు

2. కింది వాక్యాలు చదువండి. వీటిలో మీరు అవునుఅని అనుకొనే వాటికి () లేకుంటే () గుర్తు పెట్టండి.

అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం.       

ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులను చేసిపెడుతాను. 

ఇ) ఎవరి వస్తువులనైనా నాకిష్టమైతే తీసుకొంటాను.                 

ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు, పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను.  

ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను.

ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను.

ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది. 

ఏ) నావల్ల ఎవరికైనా బాధకలిగితే, నేనుకూడా బాధపడుతాను.

ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను.