సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

కరపత్రం ఎలా రాయాలి


కరపత్రం ఎలా రాయాలి 

కరము =  చేతి 
పత్రము= వ్రాతతో పత్రమును వ్రాయడం. 
పూర్వకాలంలో కరపత్రాన్ని చేవ్రాతతో రాసేవారు
దీనినే కరపత్రం అంటారు. ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేసి పంచుతున్నారు.
కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.


కరపత్రం యొక్క లక్షణాలు:
పైన ఎడమవైపున తప్పనిసరిగా తేదీ రాయాలి.
శీర్షిక లేదా టైటిల్ అతి ముఖ్యం.
క్లుప్తంగా వివరిస్తూ సందర్భం తెలియజేయాలి.
ఆకర్షనీయంగా ఉండాలి. 
పాఠకునికి సరళంగా అర్థం అవుతుంది.
అవగాహన కలుగుతుంది.
ఆంగ్లంలో దీనిని పాంప్లీట్ అంటారు.


 

                                                                                                      తేది:23-09-23.

చదవండి !                                                                ఎదగండి !

 

పరిసరాల పరిశుభ్రత


రోగం వస్తే చేంతాడు క్యూలో నిలబడి, డాక్టరును కలిసి మందులు కొనుక్కొని మింగుతాం. అసలు రోగాలెందుకు వస్తున్నాయి? దానికి మనం ఎంతవరకు కారణం అని ఆలోచించం. నిజంగా ఆలోచిస్తే మన ఇంటిచుట్టూ పరిసరాల శుభ్రత లేకపోవడం వల్లే, ఈ రోగాలు మనపై దండయాత్ర చేస్తున్నాయి.

మనం ఇల్లు తుడిచి ఆ తుక్కు పక్క ఇంటి వాని గుమ్మం ముందు వేస్తాం. మన ఇంట్లోని మురికినీరు రోడ్లపైకి వదలివేస్తాం. మనకు పనికిరాని వస్తువులు రోడ్లపైకి విసరుతాం. మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. దోమల వల్లే మనకు సగం రోగాలు. అందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మందులూ, డాక్టర్లూ అవసరం ఉండదు. పరిసరాల పరిశుభ్రత పాటించండి. మందుల అవసరం తగ్గించండి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు మానండి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోండి.   మా మాట వినండి.


.

ఇట్లు,
పాఠశాల ఆరోగ్యసమితి.

ఇందిరానగర్.

 


స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.
ఇట్లు,
మహిళా రక్షణ సమితి.









స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.


ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.


ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
సిద్దిపేట.

16, సెప్టెంబర్ 2023, శనివారం

కిష్కింధా కాండ

కిష్కింధా కాండ 

శ్రీరామ, సుగ్రీవుల మైత్రి
సుగ్రీవుడు, వాలి పోరాటం
రాముని వాలి నిందించుట
రాముని సమాధానం
వాలి చివరి కోరికలు
శ్రీరాముని వేదన
సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం
సీతాన్వేషణ ఆరంభం
దక్షిణ దిశలో సాగిన అన్వేషణ
హనుమంతుని సంకల్పం



శ్రీరామ, సుగ్రీవుల మైత్రి:  హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు.

వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


సుగ్రీవుడు, వాలి పోరాటం       హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని  సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు 

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--

రాముని వాలి నిందించుట: రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.


రాముని సమాధానం:  వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.

నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.

నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కానీ నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.


వాలి చివరి కోరికలు:రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించువాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.

శ్రీరాముని వేదన: వర్షఋతువులో అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే రావణ వధకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవునకు చెప్పాడు. రామ లక్ష్మణులు ధాతు సంపన్నమైన ప్రస్రవణ పర్వతంపై నివశించసాగారు. ఆ రమణీయ ప్రదేశం వర్షాకాలంలో మరింత సుందరంగా ఉంది. అందువలన రాముడు మరింతగా సీతాస్మరణంతో రోదించ సాగాడు. దుఃఖించేవాడికి సర్వ కార్యాలు చెడుతాయని, ఒక్క నాలుగు నెలలాగితే కార్యసాధన సానుకూలమౌతుందని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.


సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహంరాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.

అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.


సీతాన్వేషణ ఆరంభం: సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేల కొలది సేనతో తూర్పు దిక్కున సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, ఉత్తర దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్ళారు. అంగదుడు దక్షిణ దిశాన్వేషణా బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.


దక్షిణ దిశలో సాగిన అన్వేషణ: దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైని వెదికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. దాహార్తులై ఋక్షబిలం అనే ఒక సొరంగంలో ప్రవేశించారు. అందులోంచి బయట పడే మార్గం కానరాలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకొంటూ మహా తేజస్వినియై వెలిగిపోతున్నది. వారి కథ విని ఆమె వారికి ఆతిధ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని, తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది.

అంతు లేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరు వేసుకొంటుండగా అక్కడికి సంపాతి అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన జటాయువు మరణించాడని తెలిసికొని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకొని పోయి సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు.


హనుమంతుని సంకల్పం: సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు.

అంగదుని వారించి జాంబవంతుడు హనుమంతునితో ఇలాగన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు కష్టం కాదు. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.

ఆంజనేయుడు పర్వకాల సముద్రంలా ఉప్పొంగిపోయాడు. దీర్ఘ దేహుడై విజృంభించాడు. అతని ముఖం ధూమం లేని అగ్నిలాగా ప్రకాశించింది. జాంబవంతునికీ, అన్య వానర ప్రముఖులకూ వందనం చేశాడు. అంగదుని ఆశీర్వదించి ఇలా అన్నాడు – మహనీయులారా! మా తండ్రికి సాటియైన నేను అవశ్యం సాగరాన్ని గోష్పదంలా లంఘిస్తాను. నా వేగానికి సాగరం అల్లకల్లోలం అవుతుంది. సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు అగుపడుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. లంఘనా సమయంలో నా పద ఘట్టనకును భూమి తట్టుకోలేదు. కనుక ఈ మహేంద్రగిరిపైనుండి లంఘిస్తాను – అన్నాడు.

కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలూనిన చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి. శత్రు నాశన సమర్ధుడు, అత్యంత వేగగామి అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంకాభిముఖంగా నిలుచున్నాడు.