సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

9, ఆగస్టు 2023, బుధవారం

VIII. 3. బండారి బసవన్న

VIII . 3. బండారి బసవన్న

చదవండి ఆలోచించి చెప్పండి

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తిడిని చేశాడు.

ప్రశ్నలు:

1.కంచర్ల గోపన్న ఎవరు ?

జవాబు.గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న వ్యక్తే కంచర్ల గోపన్న.

2. అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జ.ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడని, సీతారాములకు విలువైన నగలు చేయించాడని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే అభియోగం ఉంది.

 3. గోపన్న ఎట్లా బంధవిముక్తుడయ్యాడు ?
జ.శ్రీరాముడే స్వయంగా మారువేషంలో తానాషా వద్దకు వచ్చి, గోపన్న చెల్లించాల్సిన డబ్బును చెల్లించాడు. దాంతో గోపన్నకు బంధవిముక్తి కలిగింది.

4.గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?

జ. గోపన్న వంటి భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, తుకారాం వంటి వారి గురించి తెలుసు. వారంతా భగవంతుని సేవలో తరించారు.

చదువండి ఆలోచించి చెప్పండి


గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా, ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజలనుండి వసూలుచేసిన సుమారు ఆరులక్షల రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తిడిని చేశాడు.


ప్రశ్నలు


1. కంచర్ల గోపన్న ఎవరు?


2. అతనిపై మోపిన అభియోగమేమిటి?


3. గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు?


4. గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా?


పాఠం నేపథ్యం, ఉద్దేశం


బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి "నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను" అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.


బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్త్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు


ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగేరచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని 'ద్విపద కావ్యం' అంటారు.


ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన 'బసవపురాణం' తృతీయాశ్వాసం లోనిది.


కవి పరిచయం


(ఊహాచిత్రం) 12వ శతాబ్దం


దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలికవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. జనగామ జిల్లా పాలకుర్తి (పాలకురికి / పాల్కురికి) సోమన జన్మస్థలం.


బనవపురాణము, అనుభవసారము, బనవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో 'మణి ప్రవాళ శైలి'ని వాడిన తొలికవి.


విద్యార్థులకు సూచనలు


* పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.


* పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.


పై వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్ఛీలుదుగనే నిలబెడుతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


I


కళాగారం 5 బండారి బసవన దండనాయకుని


రప్పించి “మాయర్థ మొప్పించి పొమ్ము దప్పేమి? సాలుఁ బ్రధాని తనంబు 'దండింప రా'దను తలఁపున నిట్లు బండార మంతయుఁ బాడు సేసితివి పరధనం బపహరింపని బాస యంద్ర పరధనం బెక్ బసవ! కైకొంటి వేయు మాటలు నేల వెఱతుము నీకు మాయర్థ మొప్పించి నీయంత నుండు' మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగు జననాథునకు బసవన మంత్రి యనిది "బరమేశు భక్తియన్ సురతరువుండ హరుభక్తియన్ కనకాచలంబుండ గామారి భక్తి చింతామణి యుండ సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ బగుతుఁడాసించునే పరధనంబునకు మృగపతి యెద్దెస మేయునే పుల్లు?


ఆలోచించండి- చెప్పండి.


సురతరువు, కనకాచలం, సురధేను భక్తిచింతామణి అనే పదాలను వాడడం కవి ఉద్దేశం ఏమిటి?


. 'బగుతుడాసించునే పరధనమునకు' దీని మీ అభిప్రాయమేమిటి?


క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగఁ?


జూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గొనునె?


రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ విరిదమ్మి వాసన విహరించుతేఁటి పరిగొని సుడియునే బబ్బిలి విరుల? నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ యెఱపంది చను సీక? నెఱుఁగవు గాక యరుదగు లింగ సదర్థుల యిండ్ల వరవుడ నా కొక సరకెయర్థంబు పుడమీశ! మీధనంబునకుఁ జేసాఁప నొడయల కిచ్చితి నొడయలధనము పాదిగదఱిఁగిన భక్తుండఁగాను

గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ నచ్చెరువై లెక్క కగ్గలంబున్న


ఆలోచించండి-చెప్పండి.


శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?


"ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది?


సారాంశం


బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. "మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు" అన్నాడు. అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో "పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా?


2


పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలకోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో" అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడుతున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.


ఇవి చేయండి


W2S3E8


L విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం


1. 'అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు' దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.


2. ద్విపదను రాగయుక్తంగా పాదండి.


II. ధారాళంగా చదువడం అర్ధం చేసుకొని ప్రతిస్పందించడం


1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.


అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.


ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది?


ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా?



2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ!


అ) ఖరము అంటే గాడిద


ఆ) కుడు అంటే తిండి


ఇ) గంగిగోవు పాలను తో పోల్చాడు.


ఈ) ఈ పద్యాన్ని రాశాడు.


ఉ) ఈ పద్యం వేమన శతకంలోనిది.

ఆలోచించండి – చెప్పండి: 

1.‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి’ అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జ. .కల్పవృక్షం, మేరుపర్వతం, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉంటే తరగని సంపదలను అనుగ్రహిస్తాయి. అవి దగ్గరుండగా పరులధనముతో పని ఏమి ? పరమేశ్వరుని యందు భక్తి ఉంటే సకల సంపదలు కలుగుతాయని కవి ఆశయం.

2. ‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జ. భక్తుడు తాను నమ్మిన దైవమునందే నిశ్చలమైన భక్తి కలిగి ఉంటాడు. భగవంతుడే భక్తునికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడే అండగా ఉండగా ఇతరుల ధనాన్ని ఎట్లా ఆశిస్తాడు ? ఎన్నటికి ఆశింపడని భావం.

ఆలోచించండి- చెప్పండి: 

1.శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జ. లోకంలో చిలుక, హంస, చకోరం, తుమ్మెద మొదలైనవి శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయిస్తాయిగాని అల్పములైన వాటిని ఆశ్రయింపవు. అట్లే శివభక్తులు కూడా ఉన్నతంగా ఉంటారేగాని అల్పములైన వాటిని కోరరు. అందుకే కవి శివభక్తులను పైవాటితో పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జ. ప్రజలు పన్నుల ద్వారా ధనం చెల్లిస్తేనే రాజు దగ్గర ధనం ఉంటుంది. అది రాజు సంపాదించింది కాదు. అది పరుల ధనమే. అందుకే భక్తుడు ఆ ధనాన్ని పరులకే ఇస్తున్నానని చెప్పాడు.

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

1.“అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” – దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ. భక్తులు భగవంతునియందే అచంచలమైన భక్తిని కల్గియుంటారు. భక్తులకు భగవంతుని సేవే ధనం. పేదవానిలో కూడా భక్తులు భగవంతుడిని దర్శిస్తారు. వారికి ఏనాడు ధనాశ ఉండదు. తనకున్న సంపదనంతా దైవానికి అర్పిస్తారు. మనసా, వాచా, కర్మణా దైవసాన్నిధ్యాన్నే కోరుతారు.

రఘుమహారాజు లాంటి మహారాజులు విశ్వజిత యాగాన్ని చేసి సంపదనంతా త్యాగం చేశారు. పోతన వంటి భగవత్ భక్తులు ఏనాడు ధనాశకు లోనుకాలేదు. జీవితాంతం భగవంతుడినే సేవించారు. ఈ రకంగా భగవత్ భక్తులు ఎన్నడునూ ధనాశకు లోను కారని తెలుస్తున్నది.

2.ద్విపదను రాగయుక్తంగా పాడండ.

జ.

3.బండారి బసవన్న
జ.ద్విపదకు రెండే పాదాలు ఉంటాయి. పద్యాలవలె నాలుగు పాదాలు ఉండవు. పాడుటకు వీలుగా ఉంటాయి. -ఉపాధ్యాయుని శిక్షణలో చక్కని రాగంతో పాడేలా ప్రయత్నించండి.


II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జ.బిజ్జలుడు బసవన్నను పిలిపించి ఖజానా ఖాళీ చేస్తున్నందుకు మందలించాడు. తన ధనాన్ని తనకు అప్పగించి వెళ్ళమని బిజ్జలుడు బసవన్నను హెచ్చరించుచున్న సందర్భంలోని వాక్యమిది.

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?.
జవాబు.ఈ వాక్యం బసవన్న రాజుతో పలుకుచున్న సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని ఎన్నడునూ ఆశింపనని, ఉన్నతంగా జీవిస్తానని, తామరపూల సువాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను కోరదు కదా ! అని చెప్పాడు.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ?
జ.ఈ వాక్యాన్ని బసవన్న రాజుతో పలికిన సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని కోరనని, ఆ అవసరం కూడా లేదని, సింహం ఎక్కడ గడ్డి మేయదని ఉదాహరణగా చెప్పిన సందర్భంలోనిది.

 2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము =గాడిద

ఆ) కూడు =తిండి

ఇ) గంగిగోవు పాలను ____భక్తి_____ తో పోల్చాడు.    జ. 

ఈ) ఈ పద్యాన్ని _____వేమన____ రాశాడు.

ఉ) ఈ పద్యం ___వేమన______ శతకంలోనిది.


III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బంధారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జ.   బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. అతనికి శివుణ్ణి మించిన దైవం లేదు. లోకంలో శివభక్తే శాశ్వతమైందని నమ్మేవాడు. శివునియందు భక్తి ప్రపత్తులను కల్గియుంటే సకల సంపదలను అనుగ్రహిస్తాడనే విశ్వాసం కలవాడు. ఇతరుల ధనమును ఆశింపనివాడు. తన నిజాయితీని నిరూపించుకోవడా ‘నికి వెనుకాడని భక్తశిఖామణి. ఈ లోకంలో భక్తి మాత్రమే శాశ్వతమైందని నమ్మిన గొప్ప శివభక్తుడు. దేనికీ, ఎవరికీ చలింపని ధీరగుణసంపన్నుడు.

ఆ) బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు ?
జ.  మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ. అందులోను నిజాయితీగాను, నిర్భయంగాను మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. నిర్భయంగా మాట్లాడే వానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తాను జీవితంలో తప్పుచేయకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడం లేదా దొంగిలించకపోవడం, ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కల్గి ఉండడం. ఇటువంటి లక్షణాలు కలిగినవాడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు.

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
జ.  భక్తుడు ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటాడు. భగవంతుని మీద తనకు గల భక్తినే సంపదగా గుర్తిస్తాడు. భక్తినే కల్పవృక్షంగాను, కామధేనువుగాను, చింతామణిగాను భావిస్తాడు. ఇతరుల ధనాన్ని ఎన్నటికీ ఆశింపడు. పరుల సంపదను పాములాగా చూస్తాడు. భక్తినే తగిన ధనంగా తలచుకొని జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా జీవిస్తాడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి ?
జ. పాలసముద్రంలో క్రీడించే హంస మడుగుల్లోని నీరు త్రాగడానికి ఇష్టపడదు. నిశ్చలమైన భక్తి గల భక్తునికి భక్తి మాత్రమే ధనం.  దేవుడుంటే సర్వస్వం ఉంటాయాని నమ్మకం. భగవంతునిపట్ల భక్తిని కల్పవృక్షంగాను, చింతామణిగాను, కామధేనువుగాను భావిస్తారు.

అట్లే భక్తుడు కూడా ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడుగాని అల్పమైన పరుల ధనాన్ని ఆశించడు. హంస చెడును వదిలి మంచిని స్వీకరించినట్లు నమ్మకం గల భక్తుడు హంస లాంటివాడు. జీవితంలో ఉన్నతంగానే జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. పరుల ధనవ్యామోహం ఉండదని అర్థం. 


2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో  రాయండి.

జ.  భగవంతునిపైగల నిశ్చలమైన ప్రేమకే ‘భక్తి’ అని పేరు. ఇది నిష్కల్మషంగా ఉంటుంది. తోటివారికి ఆదర్శంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని సేవ చేస్తాడు. భగవంతుని సేవలో తారతమ్యాలు ఉండవు. సంపదలు, చదువు, వైభవము మొదలైనవి భక్తి మార్గంలో కనిపించవు. నిజమైన భక్తునికి కొన్ని మహోన్నతమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని –

  1. అన్ని ప్రాణులయందు దయ కలిగి ఉండడం.
  2. ఎవ్వరినీ, ఏదీ, ఎప్పుడూ యాచింపకుండడం.
  3. నాది, నావాళ్ళు అనే మమకారం వీడి, మనది అనే విశాల భావనను కల్గి ఉండడం.
  4. మానవసేవే మాధవసేవగా భావించి పేదలయందు భగవంతుడిని దర్శించి, వారిని సేవించడం.
  5. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మహిళలను గౌరవభావంతో చూడగలగడం.
  6. దానధర్మాన్ని తాను ఆచరించడం. తన సమాజానికి అంకితభావంతో సేవ చేయడం.
  7. పరిపూర్ణమైన భక్తిని, జ్ఞానమును పొందగలగడం.
  8. ఎవ్వరినీ ద్వేషింపకుండడం; చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ చేయండి.

IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జ.

బసవన్న : మహారాజా ! మీకు ఇవే నా నమస్కారాలు. మీకు అన్నింట జయం కలుగుగాక.
రాజు : బసవన్నా ! నీకు ఇది తగునా ! ఇంతటి అధర్మానికి పాల్పడతావా !
బసవన్న : రాజా ! నేనేమి చేశాను. నాకు తెలిసి ఏ పాపం చేయదు.
రాజు : బసవన్నా ! నీవు బుకాయించకు. మా ధనాన్ని నాకు అప్పగించి వెళ్ళు.. ఇక నీ ప్రధాని పదవిచాలు. నన్ను ఎవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. పరుల ధనాన్ని అపహరింపదలచావు. ఇది నీకు తగునా ? ఇతరుల ధనాన్ని తీసుకోనని ప్రతిజ్ఞ చేశావు. ఇది నీకు తెలియదా ? ఇక ఇన్ని మాటలు ఎందుకు ? మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళు.
బసవన్న : రాజా ! మీ ఆరోపణల్లో నిజం లేదు. నేను మీ ధనాన్ని అపహరించలేదు. పరమేశ్వరునిపై భక్తి అనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటివి నా దగ్గర ఉన్నాయి. అలాంటి నాకు మీ సంపదలతో ఏమవసరం ? పాలసముద్రంలో విహరించే రాజహంస మురికిగుంటలోని నీటిలో విహరించడానికి ఇష్టపడుతుందా ! భగవంతుని ధనాన్ని భగవంతునికే అర్పించాను. నేను అపహరించలేదు. నీవు కాదనుకుంటే ధనాన్ని లెక్కించుకోండి.
రాజు : భటులారా ! బంగారు నాణాలతో కూడిన ఆ పెట్టెలను తీసుకొనిరండి.
భటులు : చిత్తం మహారాజా ! (కొద్దిసేపటి తర్వాత) మహారాజా ! ఇవిగో ఆ పెట్టెలు.
రాజు : ఈ పెట్టెకున్న తాళాలు తీయండి. ధనాన్ని లెక్కించండి. (తెరచిచూస్తారు)
భటులు : మహారాజా ! అద్భుతం ! మహాద్భుతం ! ధనం మొత్తం ఉంది. ఇంకా ఎక్కువగానే ఉంది.
రాజు : బసవన్నా ! నీవు ధన్యుడివి. నీ భక్తికి తిరుగులేదు, నన్ను క్షమించండి.

V. పదజాల వినియోగం:

 1.గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.రాజులు

2.కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.


అ) ఆశ్చర్యంఎ) బత్తి
ఆ) భక్తిబి) దెస
ఇ) దిశసి) పుడమి
ఈ) పృథ్విడి) అచ్చెరువు

అ) డి
ఆ) ఎ
ఇ)  బి 
ఈ)  సి 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

 1.కింది పట్టికను పూరించండి.

జవాబు.

సంధి పదం-విడదీసి రాయండి.-సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి

1. కనకాచలం = కనక + అచలం – సవర్ణదీర్ఘ సంధి
2. క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
3. నాకొక = నాకు + ఒక – ఉత్వసంధి
4. కాదేని = కాదు + ఏని = ఉత్వసంధి
5. అతనికిచ్చెను = అతనికి + ఇచ్చెను – ఇకారసంధి
6. పుట్టినిల్లు = పుట్టిన + ಇಲ್ಲು – అత్వసంధి
7. ఏమిటిది = ఏమిటి + ఇది – ఇత్వ సంధి

8. నాయనమ్మ = నాయన + అమ్మ – అత్వసంధి

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.
ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

  • ‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ 
    అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
  • ”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
  • ‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
    ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.

‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

'అ' కారానికి 'ఇ/ఈ' - పరమైనప్పుడు 'ఏ' (*)

ఆకారము అంటే 'అ' లేదా 

'అ' కారానికి 'ఉ' - పరమైనప్పుడు 'ఓ' (*).

'అ' కారానికి 'ఋ' - పరమైనప్పుడు 'అర్

'అ' కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు

'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఆదేశంగా వస్తాయి.


3. కింది పదాలను కలిపి సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.

ఉదా: మహా + ఇంద్రుడు మహేంద్రుడు

అ) దేవ + ఇంద్రుడు దేవేంద్రుడు. అ + ఇ  (

ఆ) గణ + ఈశుడు అన +ఈ = ఏ  

ఇ) నర + ఉత్తముడు = నరోతముడు అ + ఉ = ఓ

ఈ) నవ + ఉదయం =  నవోదయం . అ + ఉ = ఓ

ఉ) బ్రహ్మ + ఋషి =బ్రహ్మర్షి అ +బుు = అర్


భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని


బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.


నేనివి చేయగలనా?


1. భక్తులకు ధనాశ ఉండదనే అంశంపై అభిప్రాయం చెప్పగలను.


అవును /కాదు


2. అపరిచిత పద్యం చదివి ఖాళీలను పూరించగలను.


అవును /కాదు


3. భక్తుడి లక్షణాలను సొంతమాటల్లో రాయగలను.


అవును /కాదు


4. పాఠం ఆధారంగా సంభాషణలు రాయగలను.


అవును /కాదు.


సూర్తి


“పవిత్రులు, మంచివారైన వ్యక్తుల దగ్గరకు... దుఃఖం ఎన్నటికీ చేరదు"


29


స్వామి వివేకానంద



8, ఆగస్టు 2023, మంగళవారం

VIII. 2. సముద్ర ప్రయాణం - డా. సిద్దెంకి


2. సముద్ర ప్రయాణం
                      -ముద్దు రామకృష్ణయ్య


చదువండి – ఆలోచించి చెప్పండి
పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతోమాట్లాడుతూ ఉండిరి, సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్నిబట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను, బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను.

గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనంచేసితిని.

ప్రశ్నలు
1. పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు?
జవాబు. ఇంగ్లాండు లేదా గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్.
2. వాళ్ళు బ్రిటన్ కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు?
జవాబు. చదువుకోవడానికి
3. పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు. తుదకు గ్రేడ్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేశాడు

పాఠ్యం నేపథ్యం, ఉద్దేశం:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్నపని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం.

కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో దృఢసంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించ గలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
'యాత్రా చరిత్ర' ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన 'నా ప్రథమ విదేశీ యాత్ర' పుస్తకంలోనిది.

రచయిత పరిచయం: 
రచయిత పేరు:  ముద్దు రామకృష్ణయ్య
జననం: 18 .10.1907 
మరణం:  21. 10. 1985 
తల్లిదండ్రులు :  ముద్దు అమ్మాయి, ముద్దు రాజన్న, 
విద్యార్హతలు: బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 
కృషి: ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ వివిధ  దేశాలలో విద్యా నిమిత్తం అధ్యయనం.
చేపట్టిన కార్యక్రమం: ఈచ్ వన్ టీచ్ వన్.

ప్రవేశిక
ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు.
అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు.
ప్రయాణం కొనసాగుతున్నది!
అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది? ఎట్లా చేరుకున్నది ..... తెలుసుకుందాం.

 

I

 పడవ యునైటెడ్ కింగ్ డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధకాలము.  యుద్ధం 1939లో మొదలయింది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటనుకు పడవలు తరుచుగా పోవటంలేదు. నేను వెళ్ళినది సెప్టెంబర్ 8-1944లో.  గ్రేట్ బ్రిటనుకు చేరేవరకు ఏవేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు "కాన్వాయి" వెళ్ళేది.

     బందోబస్తులో చాలా నౌకల కాన్వాయ్ వెళ్ళేది. మా కాన్వాయ్ లో 50-60 నౌకలు ఉండె. ప్రతి పడవపైన 'Life Boats' ఉండేవి. పడవ కాప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి, మమ్ములను సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి, తరువాత అందరిని పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తరువాత కూడా, కొన్నిదినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండె. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే. వారు తినే డెక్ వేరే.

పడవ చిన్నదీ కాదు, చాల పెద్దదీ కాదు. కొత్త వారికి సముద్రరోగము వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బురాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవవారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది. తల నొస్తుంది. కక్కు వస్తుంది. కండ్లు తిరుగుతవి. ఆ సమయంలో పక్కపైన పడుకొని ఉంటారు.

పడవలో హాస్పిటల్ కూడా ఉంటది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కు పంపుతారు. పోస్టు ఆఫీసు కూడా ఉంటుంది. తరువాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీసు పెట్టుతారు. మనకు జాబువస్తే క్యాబిన్కు పంపుతారు.

టెలిగ్రాఫ్ ఆఫీసు (వైర్ లెస్) కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో "రిసెప్షన్ రూం" కూడా ఉంటుంది.  అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన -3 విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణము కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి.

 ఆలోచించండి-చెప్పండి

వాహనాలు కాన్వాయ్ వెళ్ళడం ఎప్పుడైనా చూశారా? దేని కొరకు అట్లా వెళ్తాయి?

జవాబు. చూసాము. మంత్రులు వచ్చినప్పుడు కాన్వాయ్ వస్తుంది

◆ సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు?

జవాబు. మేము వస్తున్నాం అనే విషయం తెలియడానికి, అక్కడున్న వాళ్లు పక్కకు జరగడానికి.

* దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి?జవాబు.  దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కావలసిన వస్తువులు: బ్యాగు, సరిపడా బట్టలు, వాటర్ బాటిల్, అల్పాహారం, బ్రష్, పేస్టు,.. మొదలైన కనీస అవసరాలతో సిద్ధం కావాలి

II. 

పడవపైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడు స్పీకర్లతో కనెక్టు చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైపు చేయించి, సైక్లోస్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లోని ఫర్నీచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖ్మల్ (వెల్వెట్) తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు.

చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంటలేకుండా ప్రయాణం చేసే పసి పిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీకూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్ కు చదువుకోవటానికి ఇచ్చేవారు. ఔట్ డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణీకులు ఆడుతుండేవారు. చివరిదినం టూర్నమెంట్స్ పెట్టించి, గెలిచినవారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఏర్లో రాత్రి ఎందరో పడ్కుండేవారు.

మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి. భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో బ్రిటీష్వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్వారు ఎవరూ కాని నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత రోజుగా కూర్చుని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేదికాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కాని వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి, నా ఉచ్చారణ తెలుసుకొనేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవటం చాలా శ్రమ అయ్యేది

రేడియో ఇంగ్లీషు భాష కూడా తెలియకపొయ్యేది. నేను ధోవతి షేర్వానీతో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. ఐనా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరుచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు,

ఇంకొకరు ఆంగ్లో ఇండియను. వ్యక్తి తెల్లగా లేకుండె. అతనిపేరు ఫాల్సెట్టు ఇంగ్లాండుకు సెలవుపైన వెళ్ళుతూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటీష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. వేయిల రూపాయలు ఉంటేగాని బ్రిటన్లో జీవితం జరుగదు. అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరుకదు అనేవాడు.

అలోచించండి-చెప్పండి

* ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.

ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి? ఎందుకు?

కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి? అప్పుడు మీరేం చేస్తారు?

III

డెక్పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంటచేసే వాణ్ణని, నా డ్రస్సు చూసి అనుకున్నాడట. తరువాత నేను విద్యాభ్యాసానికి వెళ్ళుతున్నానని చెప్పినాను. నేను బీదవాణ్ణి. డబ్బులేకుండా వెళ్ళుతున్నానని వారికి తెలువదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బులేదని తెలిస్తే నన్ను 'డీపోర్టు' చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు.

ఇంగ్లాండుకు పడవ చేరగానే, బ్రిటీషు రేవులోని పోలీసులు, తగినంత పైసాలేని వారిని డీపోర్టు చేసి వాపసు పంపుతారనీ, బ్రిటీష్ పోలీసువారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు. వారి మాటలు విని. నన్ను ఇంగ్లండులో దిగనివ్వరని మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొట్టుతారని లోలోపల భయం వేసి "ఈశ్వరా నీవే దిక్కు నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు. కనుక నీవే నన్ను డీపోర్టు చేయించకుండా ఇంగ్లండులో ప్రవేశపెట్టమని ప్రతి నిముషం మొక్కేవాణ్ణి.

నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండుకు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్ఛేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అణాలు. ఉన్ని బట్టలు నావద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వానీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. కనుక నాకు ఇంగ్లాండులో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటను బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి. కాబట్టి రోజూ గడియారం వెనుకకు తిప్పుకోవాలనీ, ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీసు పెట్టేవారు.

గ్రేట్ బ్రిటన్ చేరే వరకు అయిదున్నర గంటలు వెనుకకు తిప్పినాము. మొదటి హాల్ట్ మాది ఆడన్ (ఏడెన్)లో. ఆడెన్ పట్టణములోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడన్లో ఉండిరి.

14

విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక

అతడు కారు తెచ్చి మమ్ములను తీసుకొని వెళ్ళినాడు. ఆడన్ ప్రాంతములోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడచినాడు. ఆడన్లో ఉండేవారందరు అరబ్బీ ముస్లిములు, -మన హైదరాబాదులోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది.

2

మా పడవ కొన్ని దినాలు పోర్టు సయీద్లో ఉండి, మధ్యధరా సముద్రములో ప్రవేశించెను. చాలా జాగ్రత్తగా * ప్రయాణం చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవపైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మేసేజ్ "" వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. కొంతసేపు అయిన ఆ తరువాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. ఆన్ 'జిబ్రాల్టర్' రేవుకు చేరుకొంటిమి.

ఆలోచించండి- చెప్పండి.

* విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి?

విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి?

"ఈశ్వరా నీవే దిక్కు" అని రచయిత అనుకోవటానికి కారణమేమిటి? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.

IV

అట్లాంటిక్ మహాసముద్రములో ప్రవేశించేటప్పుడు సముద్రము చాలా 'కాము' (ప్రశాంతం)గా ఉండెను. యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. మేము 'బే ఆఫ్ బిస్కే' చేరితిమి. సముద్రము చాలా ఘోరంగా వైల్డ్ గా ఉండెను. వాతావరణం చల్లగా, మబ్బులతో నిండియుండెను. అప్పుడే ఇంగ్లాండు దగ్గరకు వస్తున్నదని, అందరూ దిగే ఇడట సన్నాహాలు మొదలు పెట్టినరు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకొంటిమని బ్రిటిష్వారు సంతోషపడుచుండిరి.

ఇంగ్లీష్ చానల్ లో మా పడవ చేరగానే సముద్రం 'కాం' (ప్రశాంతం) అయింది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని, కాని పాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు, బ్రిటిష్ కస్టం వాళ్ళు పడవ దిగేముందు డబ్బు గురించి అడుగుతారనీ, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటిమాటికి గట్టిగాచెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోలోపల చింతించుకొంటూ, మాటి మాటికి దేవుణ్ణి శరణుజొచ్చితిని.

అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్ క్కు ప్రయాణిస్తున్న కరీంనగరు జిల్లా ఎగ్జికూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేశ్ బాబును కలిసితిని. క్లుప్తంగా నా పరిస్థితి వివరించితిని. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికీ చెప్పనని అతని నుండి వాగ్దానము తీసుకొంటిని. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150/- పౌండ్ల డ్రాఫ్ట్ ఉండె. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడుగరు. అతనికి పడవదిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో "బాబూ! నీకు డబ్బు ప్రశ్నలేదు. నిన్ను డబ్బు విషయం అడుగరు. నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్టరువు. కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి నూరు పౌండ్లు ఉన్నవనీ, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్ లో ఉన్నవని చెప్పు. భయపడకు. నేను నీ డబ్బు తీసుకోను. నిన్ను డబ్బు అడుగను. నన్ను పడవ దిగేటట్టు చూడు" అని అంటిని. ఈ మాటకు సురేశ్ బాబు ఒప్పుకొన్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. అక్కడి పోలీసువారు, మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి

 విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ

కానుక

15
వచ్చినారు. ప్యాసింజర్ల ఇతర కాగితాలను చెక్ చేయటం మొదలు పెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమి అవుతుందో అని. పాల్సెట్ గారు మహా సంతోషముతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కాని వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చమటలు పట్టినవి. కాని పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా, నేను షేర్వానీ, పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్టు చూసిన పోలీసు అధికారి "మీరు స్టడీస్ కొరకు వచ్చినారా?" అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా, ఇంకా ఏమీ అడగకుండానే "పర్మిటెడ్" అని స్టాంపు వేసినారు.

నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకొన్నదాన్ని సాధ్యం చేసినాడు. నేను ఎక్కడ? గ్రేట్ బ్రిటన్ కు పైసాలేకుండా రావటమెక్కడ? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు- బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతా వందనాలు చేసితిని. పాల్సేట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేశ్ బాబుకు గూడా పర్మిషన్ దొరికింది. సురేశ్ బాబు సహాయం లేకుండానే అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవనుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది. నవంబర్ నెల. చాలా చలి. సామాను దింపటానికి కూలివారులేరు. నా సందుగ చాలా పెద్దది. అందరు తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండిరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును, సరిపడ డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో, షేర్వానీ పైజామా తొడుగుకొని గ్రేట్ బ్రిటన్ లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగుపెట్టితిని.

ఆలోచించండి- చెప్పండి..
* రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది?

* ఏయే సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.

16

విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ
కానుక


ఇవి చేయండి
1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
వాక్యం                           పేరా సంఖ్య శీర్షిక

పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది
నేను ధోవతి శేర్వానీతో ఉంటిని
ఏవేళ ప్రాణం పోతుందో
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదా తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది..

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచ పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అము నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తా రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ ఉన్నది.

II. పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ)బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు?
బాసర పుణ్యక్షేత్రంలోని దేవత శ్రీ జ్ఞానసరస్వతి.
 ఆ) సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? 
జ. గోదావరి నది తీరము
ఇ) సరస్వతి దేవి సైకతా మూర్తిని మలిచిన వారు ఎవరు? 
జ. వ్యాసం మహర్షి సైకతమూర్తిగా మల్చాడని ప్రసిద్ధి
ఈ). నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి 
జ.దసరా పండుగ రోజు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు
ఉ)పై పేరాకు శీర్షిక సూచించండి.
జ. బాసర సరస్వతి / బాసర వీణపాణి