సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

6, ఆగస్టు 2023, ఆదివారం

X 4. కొత్తబాట - Dr. Siddenky

డా. పాకాల యశోద్ధా రెడ్డి 

 పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు రచించిన "యశోద రెడ్డి ఉత్తమ కథలు" అనే గ్రంథంలోనిది. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానికి తగ్గట్టుగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి. యశోదా రెడ్డి గారు ఈ 'కొత్త బాట' కథలో తెలియజేశారు.


రచయిత్రి పరిచయం
* కొత్తబాట పాఠ్యాంశ రచయిత్రి - పాకాల యశోదా రెడ్డి. 
* మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో 
జననం: ఆగస్టు 8, 1929లో జన్మించారు.
 * తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. 
* తెలుగు ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
రేడియో కార్యక్రమం: మహాలక్ష్మి ముచ్చట్లు
రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసం 
పారిజాతాపహరణ పర్యాలోచనము 
ఎర్ర ప్రగడ 
కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలు.
 మా ఊరి ముచ్చట్లు 
ఎచ్చమ్మ కథలు
కథా చరిత్ర 
ధర్మశాల కథా సంపుటాలు.




కొత్తబాట పరీక్ష


కింది లింక్ నొక్కి వినండి :



ప్రవేశిక

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

I

పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్లదో? కూసుంటే నడుములిరె, నడిస్తే కాళ్ళు బెణికెనంట వొ "నేను రానా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వార్తలకూ వొరదలక నొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినద్వ నాశాతగాదు తండ్రి." అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వాసి నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా?

జారుడా 536 గురిగి గొర్రె ఘుట్టు అదు

తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటవడి "కాదక్కా! మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాడు" ఒకటే పట్టు, మొండిపట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సొద? వీడెక్కడి నక్షత్రకుడురా? నాయినా! అంట పయనమై బండి బయలుదేర్శ, తోవపొంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుక పోతుండడు. వసదాగిన పిట్టోలె.

"అక్కా! ఇది ఈగ కాలం కాదె! పూలకాలం, ఎన్నెల మాసం, తియ్యటి తీపుల దినం, ఏమనుకున్నవో? ఎక్కడ జ కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకు రాలంగ అడవి అంత పసరాకు పోషాకులు తొడ్డి సోకులు పోతుండడి. మోదుగు వనం జూడు! పెయి అంతపుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి, ఎర్రగపూసి, కొత్తబాటకు మంగళార్తులు పడ్తున్న ముత్తైదరి సాళ్ళు సాళ్ళుగ నిలవడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార జూడు! ఎంత ఎత్తుకు ఎదిగినవో? కొటారి కొమ్మ తేనెతెట్టెలన్నీ పిక్కటిల్లంగ తేనెలు ఎట్ల నింపుకొన్నవో? ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు?

ఆపు బాట

లలాలా నిదా

అదో! అక్కడి దిక్కు జెరనా చెవువారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిలకూతలు అక్కా! అదో! ఆ కండ్లపడేదే చింతలతోపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు జూడు! పొన్నకాయలసోట ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిపుడె మొగ్గలు ఇచ్చుకుంటుండవి.

అదో! సూడు! మాటలల్లనే మనూరి పొలిమేర రానెవచ్చె. ఎదురుకోళ్ళ నాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలుకేర మంపు గట్టినట్లు గుబుర్గ వెరిగిన ఈ వాయిలు పొదలు జూడు! అక్కా! బాట పక్కల పొంటి ముసలి మాన్లన్ని గూలం

దిగి వస్తున్న కొత్త చెట్లను జూడమ్మా!

ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువారజేయి, ఆ చెర్వుజూడు! ఇప్పుడు నిండుగ నీల సముద్రమోలె నీ -స్తుండది. ఈ చెర్వుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది".
అవును నిజంగనె! ఏకసిస్తుగ పాదరసం చొలువోసినట్లు ఈ చెర్వు ఎన్నెలకు మెరుస్తుందది, గని, ఇల్లలుకంగనె పండుగైతాది? ఈ పాయకుంటల కెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న దాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేషనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గట్టెలను మెక్కింది జాలక, చెట్ల శికెలకు ఎగవారి జెంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది సాలక, ఆ పూట కల్లుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈక్కి ఆడ కాళ్ళుగాలిన పిల్లలులోలె అనువోస్లనే ఉండవి. అని, మనసులు అనుకుంట, ఆ గుడెల్టులను బ్రూసే కంటిని అట్ల మీదిమీదికి సారిచ్చేట్యాళ్ళకు గట్టుమీద జారుడు బండల ఎన్న అల్లుదుంకె కాడ, చిరగండు కాదు, అడిదే! అపుడే ఈనిందే ఏమో? కండ్లు గానక పొట్లాపతికి గాండ్రుగాండ్రు మనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్కు మింగ జూస్తుండది. ఆ పక్కునే పోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము కెర చెట్టుకు తీగోలి సుట్టుకున్నది. తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలె గుడ్లు మిట్కుమిట్కున మిట్కరిచ్చుకుంట సుట్టకుదురోలె సుట్టుకొని 'అతీ గతీ' ఎరుగకుంద వద్దది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్లవడనె ఉండది.

ఆలోచించండి-చెప్పండి.

* "సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేమి అర్థమైంది?
* మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి?
* మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి?

మరి! మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్తదారి, కొత్తమలుపు అంట పదం బాడండేంది? ఇదంత నాకు దెల్సిన బాటనె! ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వడ్డ బాట! ఇందుట్ల కొత్త యాడుండది? అంట అనుకున్నగని, నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లనిపిచ్చింది.

అయిన గాకున్నగని మరీ, ఇంత కరుగనితనం, ఉండగూడదు. పురాగ ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బర్వగూడదు. యాదాన్ని మెచ్చకుండ మరి అంటె మరి, రొమ్మున ఎముకలు లెక్కబెడ్తానంటె ఎట్ల? రౌండు కండ్లు దెర్సి నిదానంగ లోతులు వాటిచ్చి సూడాలె, యాది కనుమరుగైన, మరుగున పడి తప్పినట్లే గద! నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మట్కు బాగైందా? లేదా? బాట నడిసె కాలుకు రొంపి అంటుకోకుంటె కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు,

39
తాక్తదా? తగుల్తదా? ఎంత చెడ్డగని, ఎంత బాగ బతికిన గని ఇంకోని ఆసరతోటి, మంది బుజాలెక్కి నడువకుండ పయిన సాగితె సాలు మనకు కావలసింది, మనం జూడవలసిందల్ల, ఒగడు తన కాళ్ళమీద తాను నిలవడడా? లేదా? అనేది

ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి, ఈ కొట్టాల్ల గడ్డివాములని ఇగి చెదరకుండ కుదురుగ మట్టసంగ ఉండవి. ఇంటిమొకం బట్టిన ఎడ్లు లగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండ ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినం,

ఆ కండ్ల నదేదే! గోపాల్రాయని భవంతి బంగుల, ఈడ్కి బండి జేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే, ఇంద్యా మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవుసెన్ల దాసినట్లు, ఎవరికంట్ల పడకుండ ఈ త్యాప గూడ వు తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కద్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కర్ల దిద్దుకొని కొంగు నిండుగ సవరిచ్చుకున్న, అసొంటి దాపరికపు పనులు యావి జరుగలేదు. అంతకొస్తె అడ పర్దాలు ఉన్న ఉనికి గూడ కండ్లపడలేదు. నా ప్రాణానికి కొత్తగ ఊపిరి పీల్చుకున్నట్లనిపిచ్చింది..

ఆలోచించండి- చెప్పంది
"తన కాళ్ళ మీద తను నిలబడటం" అంటే ఏమిటి? చర్చించండి.

పెండ్లి సూపుల నాడు పిలగాణోళ్ళు పెండ్లి పిల్లను గోటికొన నుండి శికెళ్ళ జూసినట్లు నేను మా ఊరిని జూడవట్టిన నా కంటి ఎదురుంగనె రచ్చకట్ట. కందెరుగని మణుసులోలె మా రచ్చకట్ట రాగి చెట్టు రౌండు ఒకదాన్నిడ్సి ఇంగో ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగ నిలవడ్డవి. అదేం సిత్రమొ? గని ఈసారి సూడు సూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పుప కుప్పలైనవి. ఎప్పటి తీర్గ ముచ్చెలకన్న కిందై వోరగ గూసుండి మణుసులు మట్కు కాన్రాలేదు. ఇదేం ముంచుకొచ్చె మా ఊరికి? ఇది కలనా? మాయనా? అంట నిదానిచ్చి చూసెట్యాళ్ళకు వాళ్ళల్ల ఒగరో ఇద్దరో రచ్చమీద కూసున్నట్లు గానొచ్చిన్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాలేదు. రొండు జేతుల బాగ నల్పుకొని మళ్ళ జూసిన గూడ అదే నిలుకడి నిలవడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ! ఓ రాగిచెట్టు! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగ తావును, నీడను పంచి ఇచ్చే యోగం, బుద్ధి మీకు దక్కింది! అని మెచ్చుకుంట సంబురాన ముందుకు సాగిన,

* నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటని?

మీ ఊర్లో రచ్చబండ/గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడుతారు?

బండి సాగిపోతనే ఉండది. ఇంగ, గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు బవంతి, ఊరంతటికి కులపెద్దనంట నెత్తి ఎత్తుకోని నిలవడ్డట్లు గానొచ్చింది. మరి? ఎన్నడు లేంది ఆ భవంతి బంకులేమొ దిగూళ్ళల్ల దీపాలు ఎలుగుత లేవు, నేను జూస్తున్నది పొద్దు మాపు పూటనేగని, ప్రమిదలన్ని చమురు నిండుకోంగ దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంత పాడు గొట్లాడినట్లు, కళదప్పి 'దో' అంటుందది. ఎందుకో? అంట అనుమాన పడ్తుండంగనే మావోడు పెద్దపులిని ప్రాణంతోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి.

"అక్కా! ఇన్నాళ్ళకు మనూరికి వట్టిన 'మిత్తి దొర్సాని' అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సుక పోయింది. మన ఊరోళ్ళంత ఇప్పుడిప్పుడె తెలివి దెల్సి మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మళ్ళెవడి అయినకె పంగనామం బెట్టిన్రు. దాంతోటి అయిన దిమ్మదిరిగి చెప్పుకుంటే సిగ్గువాయె, మూసుకుంటే ప్రాణం బాయెనంట 40

ఇర్చుటాన వడి కుడ్తాల పడ్డ ఎలుతీర్థ తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లల దీస్కొని సుట్టాల మార్గం అంట రంగాపురం జేరిండు."

ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాడే! ఈ పసికారు రొండెర్గక నివురు గమ్మిన కొరివి తోటి నెత్తి గోక్కుంట లేరు గదా! ఏమో? మనుసు ఉట్టి ఊగినట్లు ఊగింది.

బండి మా పాలొండ్ల ఇండ్లకాడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసుపటేలు పాపిరెడ్డికి సాగువాటు పరిగలేదంట సూచాయగ ఇన్న. మరి అయినం పచ్చపూస గనునా? రంగరాయనికి కుడి ఎడు అంతె! పేరుకు సవశేరు పొత్తిళ్ళనాడే అబ్బుకొచ్చినవి. అవును గని, అనుమంతరాయుడు? అయిని నోట్ల, నాలికె సింగోటం? వీళ్ళు మరి? అనుకుంటున్న 'ఆది': ఊళ్ళ ఒకణ్ణి ఎక్క్సిచ్చి ఒగణ్ణి దించి ఇద్దర్ని ఎదుగనీయకుండ ఎప్పటి శిగలు అప్పుడె గత్తరిచ్చె విద్దెలు ఈ అయ్యలకు మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు.

"అక్కా! ఆ కుటిలవాజి అనుమంతరాయుడు, కడ్పుల ఇసం నాల్కెన తీపి తోటి నగుకుంట గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు దగిలిస్తుంటే నకుతంతుల సింగోటం ఉన్నది లేంది దపురంల ఎక్కిస్తుండె. ఇంగ ఇప్పుడు కండ్లు దర్చిన జనం వాళ్ళ కన్న రొండాకులు ఎక్కువ జదివినట్లు ఆ తంత్రాలన్ని పురుట్లనే పుట్కుమనిపిస్తుండరు. లేకుంటె ఎందట? ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పుకింద తేళ్ళ తీర్గ అణిగి మణిగి ఉంటరు? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తిపట్లు పట్టి నెత్తురు కండ్ల జూస్కోని పంచాయితిల పడి ఆ పంచాయితిదార్లకు అప్పు సప్పు జేసి దండుగలు గట్టుకం లేదు. ఏ వాడన పంచాయితి ఆ వాడనె తీర్పులు జరుగుతుండవి. అక్కా! ఇన్నాళ్ళ తీరుగ అద్దమ్మ రాత్రిర్లు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, పరిక్కంపలు లేవు, లాగుల కొండలు లేవు, ముంతపొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బర్వులు లేవు, అడుక్కు తిండ్లు లేవు".

IV

* 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
* పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయితీలను ఎట్లా జరుపుతారు?
"కళదప్పిన ఇల్లు" ఎట్లా ఉంటుంది?

బండి మా ఇంటిదిక్కు మూలమల్పు దిరిగింది. ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మణుసులు మెసిల్నట్లు జళకళ గలగల సప్పుడు ఇనిపిచ్చింది. ఇదేందిరా? అన్నట్లు మా తమ్ముణి దిక్కుజూసిన, ఎంటనే మా హాజిర్ జవాబు ఎక్కళ్ళేని ఉల్లాసం తోటి బుజాన ఏసుకున్న దస్తు రుమాలు జాడిచ్చి దులుపుకుంట "అక్కా! ఇది మన మ్యాన పల్లకీ లుండె పాత పొత్తులిల్లు. జనం మెదులక బండ జింకలు జేరి అబ్బో అన్నట్లుంటుండె, అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి ఐంది. మేమంత గలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లిళ్ళైనగాని, వాళ్ళెంత మోతెబరి కర్ణప్పటేండ్లైన, వాండ్ల పెండ్లిండ్లకు మణుసులు మోసే మ్యానా పల్లకీలు రాగూడదు. సంబురానికి మెరిమెణ జేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచ్చిన మెరియ్యని ఊరేగింపులు తీసె మగ్దూరు లేదు అంట కట్టడి జేసినం. ఇంగ మనపెత్తాత కండ్లు నిప్పుకలు సెరుగంగ, చేసేది లేక తామసం ఆపుకొని పణమీది చెముటలు చిన్నపంచె తోటి తుడ్సుకుంట బుస్సు బుస్సు మంటుండంగ మేమంత ఈ పాత సవారీలను బద్దురంగ గుమ్ములింట్ల అలంకారాలోలె యాళ్ళాడగట్టినం".

బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ సుట్టుపక్కల పిల్లలంత ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టుకున్నరు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీర్గ ఈసురుమంట లేరు, ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సుకండ్లు లేవు, పిల్లలందరు దోసపండ్లోలె, ఉంకు చెండ్లోలె కళకళ లాడ్తుండరు.
41
బండిదిగి బంకులు దాటి ఇంట్లకు నడ్సిన. అలువాటు సొప్పున బాయికాడి గచ్చుల్లకు నడ్సిన. ఆడ ఎప్పటి తీర్గ కండ్లు బయట బంకుల్లకు సారిచ్చి, ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున వెట్టి వొయ్యారంగ వోనమాలి నిలవడి లేదు. వొనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవుణింటి ముందల గూసుండి వొత్తులు పేనుతుండది. ఇది కలనా? నిజమా? అంట డింగై అక్కడికక్కడ జూస్తుండంగనే 'అక్కా'' అంట విల్సుకుంటొచ్చి కుసుమ నాకు నీల్ల చెంబు అందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది, గని అనుకోకుండ నా రొండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ (దానికి ఆ పేరు పెట్టింది నేనే) దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి అనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సేడవట్టినవి. ఇవ్వరుకదులలేదు. ఇవ్వరినోట మాట పెకులలేదు. మా బాయి దగ్గరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండ మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు వడ్తుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసి ముసి నగుకుంట బాయికాడి కమాను స్తంభానికి అని నిలవడ్డడు. ఇల్లంత ఎన్నెలలు కురిసినట్లనిపిచ్చింది.

అవును ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది? యాడుంటది? బాట ఏసెటోళ్ళు నడుస్తుండాలె గని, పాపం ఆ బాట వొల్లనంటదా? వొదుగనంటదా? నల్గురు పల్కిందె మాట, నల్గురు మెచ్చిందె నడుత, నల్గురు నడిసిందె బాట.

ఆలోచించండి-చెప్పండి
* రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు?
* 'నల్గురు నడిసిందె బాట'లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.
* మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి?
ఇవి చేయండి

అవగాహన - ప్రతిస్పందన

1. ఈ కథకు 'కొత్తబాట' అనే పేరు తగినదని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి..
భావిస్తున్నాను. ఎందుకంటే పల్లెల్లోనూ మనుషుల మధ్య గొప్ప మార్పు తెచ్చిన కొత్తదనాన్ని ఆవిష్కరించింది.

2. పాఠం చదువండి. కింది పేరాల ఆధారంగా పట్టిక నింపింది.

పేరా సంఖ్య
2. వసతాగిన పిట్ట లాంటి తమ్ముడు / మాటకారి తమ్ముడు

7. ప్రకృతి / వనం / అడవి

13. ఎచ్చుతచ్చులు లేని తత్వం

18.

పేరా శీర్షిక

పేరాలోని ముఖ్యమైన విషయం

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది. వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది?
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరం లోఉన్నది.

) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది?
జవాబు 1945లో ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడింది

ఇ) గ్రామ సర్పంచ్ ఎవరు?
 కొండాపూర్ సర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో , ఎవరు నిర్మించారు?
లోడి సంస్థ సహకారంతో 'గ్రామ కమిటీలు', గ్రామస్తుల శ్రమదానంతో పక్కా రోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి?
జవాబు. మద్యపానం నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్, పిల్లలందరిని బడిలో చేర్చడం మొదలైనవి చేశారు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు?  ఎందుకు?
జవాబు. ఆదర్శగ్రామం కొండాపూర్.
ఊరికి పక్కా రోడ్ వేసుకున్నారు. మద్యపాన నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. బడిలో పిల్లల్ని చేర్చడం మొదలైనవి చేసుకుంటూ ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆదర్శ గ్రామం కొండాపూర్ అనడం సబబు.
43

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

అ) "ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గాని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండ పయినం సాగితే సాలు" అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ. మనుషులు ఎవరు ఇతరుల పైన ఆధారపడి జీవించకూడదు. ఎవరైనా సరే ప్రతి దానికీ ఇతరుల మీద
ఆధారపడితే చులకనగా చూడబడుతారు. ఆ మనిషి విలువ తగ్గిపోతుంది. ఉన్నంతలో జీవితం ఉన్నతంగా ఉండాలంటే కష్టపడాలి. పని చేయాలి. ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి. కలిగినంతలో కలో, గంజి, మంచినీళ్లో తాగి పూట గడిచేటట్లు జీవించాలి. తన మటుకు తను బతికితే ఎవరితో వైరం రాదు. స్వేచ్ఛగా, సంతోషంగా, జీవితం గడపడం సంతోషించే విషయం. అందుకోసం ఎవరిని ఆశించకూడదు. ఎవరిపై ఆధారపడ కూడదు.

ఆ) "అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతున్నది" అంటే మీకేం అర్థమైంది?
జ. నక్కలు అవకాశవాద జంతువులు. నక్కలకు జిత్తుల మారి తాను అధికం. ఎలా వంచించాలి? ఎవరిని వంచించాలని కుయుక్తులు పన్నుతూ సులువుగా ఆహారం సంపాదించాలని ఆలోచిస్తుంటాయి. పెద్దపులి సింహం మొదలైన జంతువులు తిని వదిలిపెట్టిన మాంసాన్ని భుజిస్తాయి. రెండు జంతువులు కొట్లాడి చనిపోయిన వాటి మాంసం కోసం కాచుకుని కనిపెడుతుంటాయి.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ. మా ఊరు పచ్చని పంట పొలాలతో పాడిపంటలతో పాడిపంటలతో కలకలలాడుతుంది. గ్రామం చుట్టూ ప్రకృతి సోయగం అందర్నీ అలరిస్తుంది. పారే ఏటి అలల మీద జెల్లా, బొచ్చె మెరుపులకు మరింత సౌందర్యాన్ని చేకూర్చుతాయి. ఊరు మధ్య మందిర్లు మసీదులు చర్చిలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి?
చెరువులు ఒక లోతైన ప్రదేశంలో వాన నీరు పడడం వల్ల కాని, భూమి లోపలినుండి అంతర్జలం బయటకు పొరలు దాటుకొని వచ్చి చేరుతుంది. కొన్ని చెరువులు ప్రభుత్వమో, రాజులో త్రవ్వించారు. చెరువుల వల్లన వ్యవసాయానికి నీరు దొరుకుతుంది. కొన్ని గ్రామాలకు చెరువు లో నీరే మంచినీరు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
జ: కొత్త పాట ఆధారంగా పనులు వచ్చిన మార్పులు: 
మా ఊరి పొలిమేరల్లో పచ్చని పొలాలు, నిండుకుండ లాంటి చెరువు, ఎప్పుడూ పారే కాలువలు, వంతెనహ్మ్ కింది నుంచి పారే వాగు పరవళ్లు అందంగా ఉంటాయి. మామిడి చెట్లు, చెరకు తోటలు విరివిగా ఉంటాయి. 
పంట పొలాల కింద ఇసుకు దిబ్బలు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పూర్వం పల్లెలో భూస్వాములు ఉండేవారు.
 వారు పేదలపై తమ పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేవారు.
పేద ప్రజలను మోసం చేస్తూ ఉండేవారు.
బాకీలు ఇచ్చి అధికంగా వడ్డీలు వసూలు చేసేవారు. 
కొందరు జీవిత కాలం చేసిన అప్పు తీరకపోయే పరిస్థితులను కల్పించేవారు. పండుగలు పబ్బాలకు మా ఊరంతా కట్టుబడి ఉంటది. మా ఊరి ప్రజలు పరస్పర సహా కారం చేసుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుంటారు.

3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తులు వచన కవిత రాయండి.

పల్లే పై కవిత 

మా ఊరు మంచి స్ఫూర్తి

మతల హారతి మనసులు  చూద్దువు

చిరునవ్వులు రువ్వుతూ

కన్నతల్లి ఆత్మను మరిపించే ఆత్మను చూద్దువు  

పచ్చని చెట్లు,  పాడిపంటలతో 

కలకలలాడే మాపల్లె  

పంట పొలాలు పశు  సంపదతో

శోబిల్లే  మాపల్లె 

ఆత్మీయులకి పెట్టుబోతల తీరు 

అప్యాయతలకీ ఆయువుపట్టు  

పుట్టతేనె తీరు 

పిల్లగాలులతో పల్లె సేను ఒయ్యారం ఒలుకబోస్తది

చెరువు అలలతో చెంగలిస్తూ తుల్లిపాడ్తది 

విద్యుత్ కాంతిలో మాపల్లె విరాజిల్లోతోంది

అన్నదమ్ముల అనుబంధం తో అలరారుతోంది

కులమతాలు కాదనీ 

వరుసలతో అనుబాధాలు అల్లుకుంటది. 

ఒక్కసారి రా పోగొట్టుకున్న ప్రేమలో తేలుదువు

      

III. భాషాంశాలు

 1. పదజాలం:
 1. చెవి వారిచ్చి         = శ్రద్ధగా
 నేను మా నాన్న చెప్పే నీతి కథలు చెవివారిచ్చి వింటాను.
2. చిరుత పులులు గవినిలలో నివసిస్తాయి.
గవిన్లు = గుహలు
 3. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి.
        పొలిమేర = సరిహద్దు
4. కుటిలవాజితనం = సోమరితనము
   మనుషులకు కుటిలవాజితనం పనికిరాదు 
5. పోలిమేర : సరిహద్దు  

2. పర్యాయపదాలు
1. పెయి=  మేను దేహం
2. తావుల్ల = చోటు ప్రదేశం
3. ప్రకృతి వికృతులు:
1. సముద్రము      - సంద్రం 
2. విద్య               -  విద్దె 
3. ఆధారము       - ఆదెరువు
4. శిఖ                 - సిగ
5. ప్రయాణం - పయనం

4. జాతీయాలు:
నక్షత్రకుడు             : వెంటపడి పీడించేవాడని అర్థం లోవాడుతారు
నిండుకున్నవి        : అయిపోయినవి
దడిగట్టు                 :రక్షణ కల్పించు
నిప్పులు సెరగంగ : మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం.

4. జాతీయాలు వివరణ:
నక్షత్రకుడు : వెంటపడి పీడించేవాడని అద్దంలో వాడుతారు.
నిండుకొన్నవి :  అయిపోయాయని అర్థంలో వాడుతారు.
దడిగట్టు : చుట్టూ చేరారని అర్థంలో వాడుతారు.
నిప్పుకలు సెరగంగ: కోపోద్రిక్తులు అవుతుండగా అని అర్థంలో వాడుతారు.

వ్యాకరణాంశాలు: 

ప్రాణాలుగోల్పోవు = ప్రాణాలు +  కోల్పోవు గసడవాదేశ సంధి
మూటగట్టు   = మూట  +  కట్టు - సరళాదేశ సంధి / దృత ప్రకృతిక సంధి
ఆసుపోయుట =  ఆసు +    పయుట -గసడవాదేశ సంధి
కాలుసేతులు  =   కాలు  +   సేతులు  -గజదవాదేశ సంధి
 పూచెనుగలువలు  = పూచెను  +  కలువలు -సరళాదేశ సంధి లేదా ద్రుత/ ప్రకృతిక సంధి


వృద్ధి సంధి
రసైక = రస +ఏక - (అ  +ఏ = ఐ )
ఏకైక = ఏక  +  ఏక  - (అ +ఏ = ఐ )
వసుధైక = వసుధ  + ఏక - (అ +ఏ = ఐ )
ఉదా: దివ్యైరావతం  = దివ్య  + ఐరావతం  - (అ +ఏ = ఐ )
దేశైశ్వర్యం =దేశ  +  ఐశ్వర్యం   - (అ +ఏ = ఐ )
అష్టైశ్వర్యాలు = అష్ట  + ఐశ్వర్యాలు  - (అ +ఏ = ఐ )
ఉదా: ఘనౌషధి =ఘన  + ఓషధీ      - (అ +ఓ = ఓ )
వనౌషధి =వాన +  ఓషధి - (అ +ఓ = ఔ )
 ఉదా: రసౌచిత్యం =రస  + ఔచిత్యం - (అ +ఔ  = ఔ )
దివ్య ఔషధం =దివ్య  +  ఔషధం - (అ + ఔ  = ఔ )
నాటకౌచిత్యం =నాటక  +  ఔచిత్యం - (అ + ఔ  = ఔ )
పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించవలసిన విషయం సరి చూడండి. ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా అ ఆ లు వచ్చాయి. పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లు ఉన్నాయి. అకారానికి ఏ,ఐ కలిసినప్పుడు ఐకారం వచ్చింది. ఓ, ఔ లు కలిసినపుడు ఔ కారం వచ్చింది.

1. సూత్రం : ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
2. సూత్రం: అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐ కారం, ఓ, ఔ లు పరమైతే ఔ కారం  ఏకాదేశంగా వస్తాయి. 


:సారాంశం:

కొత్తబాట 

'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు.

అక్క పయనమై బండెక్కి బయలు దేరింది.

వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు. 

అక్క  ఎంత సేపటికీ  మాట్లాడపోయే  సరికి

ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.


  చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి  తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.


  కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది. 

  ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.

   గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ  పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే  గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.

   బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.


బాట పాఠం ప్రకారం 

మారుతున్న సమాజంలో..

  1. ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని. 
  2. కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
  3. చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
  4. ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
  5. రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
  6. మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
  7. ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
  8. పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
  9. దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
  10. ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
  11. మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
  12. పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
  13. యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు. 

ముగింపు :

  ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం. 

అ ) "నల్గురు నడిసిందే బాట " లోని అంతరార్ధమేమిటి?

1.'నల్గురు నడిచిందే బాట 'అంటే పదిమంది ఏ పని చేస్తే అదే అందరికి ఆమోదం అవుతుందని భావం, పదిమంది పాటించింది పద్దతి అవుతుందని నానుడి.
ప్రక్రియ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది కథ లేదా కథానిక. సంఘటనల మధ్య సంభాషణ సంబంధాల్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది వచన ప్రక్రియ. సంభాషణ కథనం శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. క్లూప్త దీని ప్రత్యేకత దీనిని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు.

2.అదే సాంప్రదాయ మవుతుంది.నలుగురు నడిచినప్పుడే అది బాటగా మారుతుంది.దాన్నే మిగిలిన వారందరూ అనుసరిస్తారు.పదుగురాడు మాట పాడి ఐ ధర చెల్లు" అని వేమన కూడా అన్నాడు కదా! 

౩.పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.

4.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

''అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవిఅంటే మీకేం అర్థమైంది? జ: నక్కలు చాలా తెలివైనవి. అవి ఉచితంగా ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని కనిపెడుతుంటాయి. పెద్ద జంతువులు తినగా మిగిలిన వాటిని తింటాయి.

ఆ) సేవ్వు మిద పెను వార్తెన? అంటే మీకు ఏమి అర్థమయ్యింది ...

మన చెవి మీద పెను పాకితే ,మనలో వెంటనే చైతన్యం కలుగుతుంది.దిని అర్థం పట్టించుకోవడం.
పంచేంద్రియాలలో చెవి కూడా ఒకటి. కాని ఈ పాఠం లో అక్క చెప్తున్నా మాటలు,తమ్ముడికి చెవి మిద పెను పాకితే కలిగే టంత చలనం కూడా కలిగించలేదు.

అందువల్ల అతను అక్క చెప్పిన మాటలు వినిపించుకోకుండా తానె అక్కకు చెప్తున్నాడు.'అసలు పట్టించుకోవడం లేదు','గ్రహించాడంలేదు అని .దిని అర్థం.

పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి
జ: పల్లెల్లో ఆనాడు దారులన్నీ వర్షంవస్తే బురదమయంగా మారేవి. ఇప్పుడు ప్రతి పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు.

కొత్త బాట పాఠం

ప్రవేశిక:

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

I

"నేను రాన్రా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వానలకూ వొరదలకు ఏర్శ పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్డదో? కూసుంటే నడుములిర్గె, నడిస్తే కాళ్ళు బెణికెనంట వొర్రెల ఎ వొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినడ్వ నాశాతగాదు తండ్రి." అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వార్తెనా? గ నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా?

తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటవడి "కాదక్కా మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాదు" అంట ఒకటే పట్టు, మొండిపట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సాద? వీడెక్కడి నక్షత్రకుడురా? నాయినా! అంట పయనమై బండెక్కి బయలుదేర్శ, తోవపొంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుక పోతుండడు. వసదాగిన పిట్టోలె.

"అక్కా ఇది ఈగ కాలం కాదె! పూలకాలం, ఎన్నెల మాసం, తియ్యటి తీపుల దినం, ఏమనుకున్నవో? ఎక్కడ జూసిన కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకు రాలంగ అడవి అంత పసరాకు పోషాకులు తొడ్డి సోకులు పోతుండది. • మోదుగు వనం జూడు! పెయి అంతపుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి, ఎర్రగపూసి, కొత్తబాటకు మంగళార్తులు పడ్తున్న ముత్తైదలో సాళ్ళు సాళ్ళుగ నిలవడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార జూడు! ఎంత ఎత్తుకు ఎదిగినవో? కొటారి కొమ్మలు తేనెతెట్టెలన్ని పిక్కటిల్లంగ తేనెలు ఎట్ల నింపుకొన్నవో? ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు?

అదో! అక్కడి దిక్కు జెరనా చెవువారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిలకూతలు! అక్కా అదో! ఆ కండ్లపడేదే చింతలతోపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు జూడు! పొన్నకాయలసోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిపుడె మొగ్గలు ఇచ్చుకుంటుండవి.

అదో! సూడు! మాటలల్లనే మనూరి పొలిమేర రానెవచ్చె. ఎదురుకోళ్ళ నాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలుజేయ గుంపు గట్టినట్లు గుబుర్ల వెరిగిన ఈ వాయిలు పొదలు జూడు! అక్కా! బాట పక్కల పొంటి ముసలి మాన్లన్ని గూలంగ ఎదిగి వస్తున్న కొత్త చెట్లను జూడమ్మా!

ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువారజేయి, ఆ చెర్వుజూడు! ఇప్పుడు నిండుగ నీల సముద్రమోలె నీరు మోస్తుండది. ఈ చెర్వుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది".
38


అవును నిజంగనే! ఏకసిస్తుగ పాదరసం వొలువోసినట్లు ఈ చెర్వు ఎన్నెలకు మెరుస్తుండది. గని, ఇల్లలుకంగనె పండుగైతాది? ఈ పాయకుంటల కెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న దాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేప్తనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక, చెట్ల శిసెలకు ఎగవాకి జెంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది. సాలక, ఆ పూట కల్లుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈక్కి ఆడ్కి కాళ్ళు గాలిన పిల్లులోలె అసువోస్తనే ఉండవి, అని, మనసుల అనుకుంట, ఆ గుడ్డెల్గులను జూసే కంటిని అట్ల మీదిమీదికి సారిచ్చేట్యాళ్ళకు గట్టుమీద జారుడు బండల ఎన్క అల్గుదుంకె కాడ, చిరగండు ఆ కాదు, ఆడిదే! అప్పుడే ఈనిందో ఏమో? కండ్లు గానక పొట్టాపతికి గాండ్రుగాండ్రు మనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్క మింగ జూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము సీకెర చెట్టుకు తీగోలె సుట్టుకున్నది. తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలె గుడ్లు మిట్కుమిట్కున మిట్కరిచ్చుకుంట సుట్టకుదురోలె సుట్టుకొని 'అతీ గతీ' ఎరుగకుండ వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్లవర్తనే ఉండది.
--------------------------------
----------------------------
ఆలోచించండి- చెప్పండి.

"సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేమి అర్ధమైంది?

మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి? మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి?
--------------------------------
----------------------------

II
మరి! మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్తదారి, కొత్తమలుపు అంట పదం బార్తండేంది? ఇదంత నాకు దెల్సిన బాటనె! ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వద్ద బాట! ఇందుట్ల కొత్త యాడుండది? అంట అనుకున్నగని, నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లనిపిచ్చింది..

అయిన గాకున్నగని మరీ, ఇంత కరుగనితనం, ఉండగూడదు. పురాగ ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బర్వగూడదు. యాదాన్ని మెచ్చకుండ మరి అంటే మరి, రొమ్మున ఎముకలు లెక్కబెడ్తానంటే ఎట్ల? రొండు కండ్లు దెర్సి నిదానంగ లోతులు వాటిచ్చి సూడాలె, యాది కనుమరుగైన, మరుగున పడి తప్పినట్లే గద! నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మట్కు బాగైందా? లేదా? బాట నడిసె కాలుకు రొంపి అంటుకోకుంటె కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు,
(page. 39)


తాక్తదా? తగుల్తదా? ఎంత చెడ్డగని, ఎంత బాగ బతికిన గని ఇంకోని ఆసరతోటి, మంది బుజాలెక్కి నడువకుండ పయినం సాగితే  సాలు మనకు కావలసింది, మనం జూడవలసిందల్ల, ఒగడు తన కాళ్ళమీద తాను  నిలబడ్డడా? లేదా? అనేది.

ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి. ఈ కొట్టాల్ల గడ్డివాములన్ని ఇగి చెదరకుండ కుదురుగా మట్టనంగ ఉండవి. ఇంటిమొకం బట్టిన ఎడ్లు లగేస్తుండవి, మా ఊరి ఎల్లమ్మ గుడి వొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండ ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినం,

ఆ కండ్ల పడేదే! గోపాల్రాయని భవంతి బంగుల, ఈడ్కి బండి జేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవుసెన్ల దాసినట్లు, ఎవరికంట్ల పడకుండ ఈ త్యాప గూడ మా తమ్మయ్య నాగల మీదికెళ్ళి చెంగున దుంకి కద్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగ సవరిచ్చుకున్న. అసొంటి దాపరికపు పనులు యావి జరుగలేదు. అంతకొస్తె ఆడ పర్దాలు ఉన్న ఉనికి గూడ కండ్లపడలేదు. నా ప్రాణానికి కొత్తగ ఊపిరి పీల్చుకున్నట్లనిపిచ్చింది.

పెండ్లి సూపుల నాడు పిలగాణోళ్ళు పెండ్లి పిల్లను గోటికొన నుండి శికెళ్ళ జూసినట్లు నేను మా ఊరిని జూడపట్టిన. నా కంటి ఎదురుంగనె రచ్చకట్ట. కందెరుగని మణుసులోలె మా రచ్చకట్ట రాగి చెట్టు రొండు ఒకదాన్నిడ్చి ఇంగోటి ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగ నిలవడ్డవి. అదేం సిత్రమొ? గని ఈసారి సూడు సూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులె కుప్పలైనవి. కాన్రాలేదు. ఇదేం ముంచుకొచ్చె మా ఊరికి? ఇది కలనా? మాయనా? అంట నిదానిచ్చి చూసెట్యాళ్ళకు వాళ్ళల్ల ఒగరో ఇద్దరో రచ్చమీద కూసున్నట్లు గానొచ్చిన్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాలేదు. రొండు జేతుల బాగ నల్పుకొని మళ్ళ జూసిన గూడ అదే నిలుకడై నిలవడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ! ఓ రాగిచెట్టు! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగ తావును, నీడను పంచి ఇచ్చే యోగం, బుద్ధి మీకు దక్కింది! అని మెచ్చుకుంట సంబురాన ముందుకు సాగిన.

iii

బండి సాగిపోతనే ఉండది. ఇంగ, గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు బవంతి, ఊరంతటికి కులపెద్దనంట నెత్తి ఎత్తుకోని నిలవడ్డట్లు గానొచ్చింది. మరి? ఎన్నడు లేంది ఆ భవంతి బంకులేమొ దిగూళ్ళల్ల దీపాలు ఎలుగుత లేవు, నేను జూస్తున్నది పొద్దు మాపు పూటనేగని, ప్రమిదలన్ని చమురు నిండుకోంగ దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంత పాడు గొట్లాడినట్లు, కళదప్పి 'దో' అంటుండది. ఎందుకో? అంట అనుమాన పడుండంగనె మావోడు పెద్దపులిని ప్రాణంతోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి.

"అక్కా! ఇన్నాళ్ళకు మసూరికి వట్టిన 'మిత్తి దొర్సాని' అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సుక పోయింది. మన ఊరోళ్ళంత ఇప్పుడిప్పుడె తెలివి దెల్సి మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మళ్ళెవడి అయినకె పంగనామం బెట్టిన్రు. దాంతోటి అయిన దిమ్మదిరిగి చెప్పుకుంటె సిగ్గువాయె, మూసుకుంటే ప్రాణం బాయెనంట ఇర్కుటాన (page40)

-----------------------------------------------------------------

ఆలోచింంచండి - చర్చించండి. 

"తన కాళ్ళ మీద తను నిలబడటం" అంటే ఏమిటి

 ఎప్పటి తీర్ల! ముచ్చెలకన్న కిందై వోరగ గూసుండె మణుసులు 

నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటవి?
మీ ఊర్లో రచ్చబండ/గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడుతారు?
-------------------------------------------------------------

వడి కుడ్తాల పడ్డ ఎల్కతీర్గ తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లల దీస్కొని సుట్టాల మార్గం అంట రంగాపురం జేరిండు."

ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాడే! ఈ పసికారు రొండెర్గక నివురు గమ్మిన కొరివి తోటి నెత్తి గోక్కుంట లేరు గదా! ఏమో? మనుసు ఉట్టి ఊగినట్లు ఊగింది.

బండి మా పాల్గొండ్ల ఇండ్లకాడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసుపటేలు పాపిరెడ్డికి సాగువాటు సరిగలేదంట సూచాయగ ఇన్న. మరి అయినేం పచ్చపూస గన్యనా? రంగరాయనికి కుడి ఎదు అంతె! సేరుకు సవశేరు 'ఉద్ది'. ఊళ్ళ ఒకణ్ణి ఎక్కిచ్చి ఒగణ్ణి దించి ఇద్దర్ని ఎదుగనీయకుండ ఎప్పటి శిగలు అప్పుడె గత్తరిచ్చె విద్దెలు ఈ అయ్యలకు పొత్తిళ్ళనాడె అబ్బుకొచ్చినవి. అవును గని, అనుమంతరాయుడు? అయిని నోట్ల, నాలికె సింగోటం? వీళ్ళు మరి? అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు.

"అక్కా ఆ కుటిలవాజి అనుమంతరాయుడు, కడ్పుల ఇసం నాల్కెన తీపి తోటి నగుకుంట గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు దగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేంది దస్తురంల ఎక్కిస్తుండె. ఇంగ ఇప్పుడు కండ్లు దెర్సిన జనం వాళ్ళ కన్న దొండాకులు ఎక్కువ జదివినట్లు ఆ తంత్రాలన్ని పురుట్లనే పుట్కుమనిపిస్తుండరు. లేకుంటె ఎందట? ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పుకింద తేళ్ళ తీర్గ అణిగి మణిగి ఉంటరు? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తీపట్లు పట్టి నెత్తురు కండ్ల జూస్కోని పంచాయితిల పడి ఆ పంచాయితిదార్లకు అప్పు సప్పు జేసి దండుగలు గట్టుకం లేదు. ఏ వాడన పంచాయితి ఆ వాడనె తీర్పులు జరుగుతుండవి. అక్కా! ఇన్నాళ్ళ తీరుగ అద్దమ్మ రాత్రిర్లు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, పరిక్కంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంతపొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బర్వులు లేవు, అడుక్కు తిండ్లు లేవు".
-----------------------------
----------------------------
అలోచించండి-చెప్పండి.

* 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్ధం చేసుకున్నారు?

* పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయితీలను ఎట్లా జరుపుతారు?

* "కళదప్పిన ఇల్లు" ఎట్లా ఉంటుంది?


----------------------------
----------------------------
IV
బండి మా ఇంటిదిక్కు మూలమల్పు దిరిగింది. ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మణుసులు మెసిల్నట్లు జళకళ గలగల సప్పుడు ఇనిపిచ్చింది. ఇదేందిరా? అన్నట్లు మా తమ్ముణి దిక్కుజూసిన, ఎంటనే మా హాజిర్ జవాబు ఎక్కుళ్ళేని ఉల్లాసం తోటి బుజాన ఏసుకున్న దస్తు రుమాలు జాడిచ్చి దులుపుకుంట "అక్కా ఇది మన మ్యాన పల్లకీ లుండె పాత పొత్తులిల్లు, జనం మెదులక బండ జింకలు జేరి అబ్బో అన్నట్లుంటుండె, అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి బంది. మేమంత గలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లిళ్ళైనగాని, వాళ్ళెంత మోతెబరి కర్ణప్పటేండ్లన, వాండ్ల పెండ్లిండ్లకు మణుసులు మోసే మ్యానా పల్లకీలు రాగూడదు. సంబురానికి మెరిమెణ జేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచ్చిన మెరియ్యని ఊరేగింపులు తీసె మద్దూరు లేదు అంట కట్టడి జేసినం. ఇంగ మనపెత్తాత కండ్లు నిప్పుకలు సెరుగంగ, చేసేది లేక తామసం ఆపుకొని పణమీది చెముటలు చిన్నపంచె తోటి తుడ్చుకుంట బుస్సు బుస్సు మంటుండంగ మేమంత ఈ పాత సవారీలను బద్దురంగ గుమ్ములింట్ల అలంకారాలోలె యాళ్ళాడగట్టినం".

బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ సుట్టుపక్కల పిల్లలంత ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టుకున్నరు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీర్గ ఈసురుమంట లేరు, ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సుకండ్లు లేవు, పిల్లలందరు దోసపండ్లోలె, ఉంకు చెండ్లోలె కళకళ లాడ్తుండరు.
(page: 41)


బండిదిగి బంకులు దాటి ఇంట్లకు నడ్సిన, అలువాటు సొప్పున బాయికాడి గచ్చుల్లకు నడ్సిన. ఆడ ఎప్పటి తీర్ల కండ్లు బయట బంకుల్లకు సారిచ్చి, ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున వెట్టి వొయ్యారంగ వోనమాలి నిలవడి లేదు. పౌనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవుణింటి ముందల గూసుండి వొత్తులు పేనుతుందది. ఇది కలనా? నిజమా? అంట డింగై అక్కడికక్కడ జూస్తుండంగనే 'అక్కా!' అంట విల్సుకుంటొచ్చి కుసుమ నాకు నీల్ల చెంబు అందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది, గని అనుకోకుండ నా రొండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ (దానికి ఆ పేరు పెట్టింది నేనే) దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సూడవట్టినవి. ఇవ్వరుకదులలేదు. ఇవ్వరినోట మాట పెకులలేదు. మా బాయి దగ్గెరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండ మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు వడ్తుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసి ముసి నగుకుంట బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు. ఇల్లంత ఎన్నెలలు కురిసినట్లనిపిచ్చింది.

అవును ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది? యాడుంటది? బాట ఏసెటోళ్ళు నడుస్తుండాలె గని, పాపం ఆ బాట వొల్లనంటదా? వొదుగనంటదా? నల్గురు పల్కిందె మాట, నల్గురు మెచ్చిందె నడుత, నల్గురు నడిసిందె బాట.

-----------------------------------------------------------------

ఆలోచించంది చెప్పండి.

రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు?

* 'నల్గురు నడిసిందె బాట'లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.

-------------------------------------------------------------------

24, జులై 2023, సోమవారం

Viii. 1. త్యాగనిరతి - డా. సిద్దెంకి



త్యాగనిరతి

నన్నయ

చదువండి ఆలోచించి చెప్పండి

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్నలు

1. దధీచి ఎవరు?
2. దధీచి చేసిన త్యాగం ఏమిటి? ఎందుకు?
3. త్యాగం అంటే ఏమిటి?
4. మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.

పాఠం నేపథ్యం
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే 'ఇది ఇట్లా జరిగింది' అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు.
ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ అశ్వాసం నుండి గ్రహించారు.


కవి పరిచయం
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది.
(11వ శతాబ్దం)
వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో 'శారదరాత్రులు' అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. 'ఆంధ్రశబ్ద చింతామణి' అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో 'ప్రసన్నకథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వం' అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.



విద్యార్థులకు సూచనలు
పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
ఆ పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.


ప్రవేశిక
మన ప్రాచీనసాహిత్యంలో నైతికవిలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబిచక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలుసుకుందాం.

I

ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు 
నట్టి నీకు బాడియయ్య? యిప్పు 
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా 
హార విఘ్న మిట్టులాచరింప?

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనంజేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు 2

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

ధర్మజ్ఞులైన పురుషులు 
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ 
ధర్మముగా మదిఁ దలఁపరు 
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్, 3

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు. 'శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి' యను వేదవచనంబ గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి యిట్లనియె 4
4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను 
నాశ్రయించే నాశ్రితునెట్టి యధముఁడయిన 
విడువఁడనినను నేనెట్లు విడుతు దీని? 
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె? చెపుమ 5

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.


ఆలోచించండి - చెప్పండి.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు?
"ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్" దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు?
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు?

వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండె? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీ యత్నం బాహారార్థం బేని యిప్పుం డివ్వసంబున మృగ మహిష వరాహ భగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువ' ననిన శ్యేనం బిట్లనియె... 6
6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షిఁ 
బూని కావ నీకు బుద్దియేని య
వని నాథ! దీని యంత నీ మాంసంబు 
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ 7
7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

చ॥ అనిన 'ననుగ్రహించితి మహా విహగోత్తమ' యంచు సంతసం 
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం |
నఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె 
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్  ... 8
8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.


ఈ॥ దానికి నచ్చెరువడి ధర 
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం 
దాన తుల యెక్కెనంతన్ 
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ 9
9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...


వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి 'నీధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యం శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్థిల్లుచుండు'మని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి. 10
10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు. 

ఆలోచించండి - చెప్పండి.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది?
"అనుగ్రహించితి మహా విహగోత్తమ' అని శిబిచక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్ధం చేసుకున్నారు?
శిబిచక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా! త్యాగం అవశ్యకత ఏమిటి?

తాత్పర్యాలు

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...

10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు.

ఇవి చేయండి

1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1.. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి?
2. ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.
అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి 
ధర్మువు సర్వంబునకుహితంబగహుమన
ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం 
వేద విహితంబైన యాహారంబు 
ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు 
నాశ్రీ త్యాగమిడి ధర్మువగునే? చెపుమ

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.
బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు 
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు 
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల.

అ) 'చెట్టు' అను పదానికి సరిపోయేపదం.(ఎ)
ఎ) తరువు,   బి) గురువు,   సి) ఫలం, డి) గుణం

ఆ) త్యాగానికి గురువులు ఎవరు?(బి )
ఎ) మానవులు,  బి) చెట్లు సి) పక్షులు డి) జంతువులు

ఇ) తనువును చీల్చి యిచ్చేవి(సి)
ఎ) మేఘాలు బి) నదులు సి) చెట్లు డి) పక్షులు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్ధం (సి)
ఎ) పెరుగుట బి) తరుగుట సి) బ్రతుకుట డి) మేల్కొనుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక (డి)
ఎ) భారం బి) ప్రాణం సి) యోగం డి) త్యాగం

III స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.

ఆహారం తినే సమయంలో ఇతరులకు విఘ్నం కలిగించకూడదు. ఆ సమయంలో మాట్లాడించడం, ఆటపట్టించడం లేదా ఇతర పనులతో ఇబ్బంది పెట్టడం వల్ల వారు ప్రశాంతంగా భోజనం చేయలేరు. ఆహారాన్ని సరిగా నమలకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భోజనం చేయడం ఒక అవసరమైన, గౌరవించదగిన ప్రక్రియ. ఇతరుల పట్ల మర్యాద, సహనం, గౌరవం చూపుతూ వారు భోజనం పూర్తిచేసే వరకు వేచి ఉండాలి. ఇలా చేయడం మంచి సంస్కారం, మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది.

ఆ) 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
ధర్మం మానవ జీవితానికి పునాది. ధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజంలో శాంతి, న్యాయం, సామరస్యం నెలకొంటాయి. సత్యం చెప్పడం, పెద్దలను గౌరవించడం, పరులకు సహాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటి సత్కార్యాలే ధర్మం. ధర్మాన్ని పాటించే వ్యక్తి అందరి ఆదరణను పొందుతాడు. కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలి. "ధర్మో రక్షతి రక్షితః" అనే సూక్తి ప్రకారం ధర్మాన్ని రక్షించిన వారినే ధర్మం రక్షిస్తుంది. కాబట్టి అందరూ ధర్మాన్ని ఆచరించడం ప్రతి మనిషి కర్తవ్యం.

ఇ) ఇతరుల కొఱకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.

ఇతరుల శ్రేయస్సు కోసం మన శక్తి మేరకు త్యాగాలు చేయడం గొప్ప మానవతా గుణం. అవసరంలో ఉన్నవారికి ధనం, ఆహారం, వస్త్రాలు, విద్యా సహాయం అందించవచ్చు. మన సమయం, శ్రమ, జ్ఞానాన్ని పంచుకొని వారికి అండగా నిలవవచ్చు. రక్తదానం, అవయవదానం వంటి మహోన్నత సేవలు కూడా త్యాగమే. ప్రకృతిని కాపాడేందుకు స్వార్థాన్ని తగ్గించి బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల సుఖం కోసం చేసిన చిన్న త్యాగం కూడా సమాజంలో ప్రేమ, దయ, సహకార భావాలను పెంపొందించి మన జీవితాన్ని సార్థకం చేస్తుంది.


ఈ) 'త్యాగనిరతి' అనే శీర్షిక పాఠానికి ఏవిధంగా తగినదో రాయండి.
ఈ పాఠంలో దధీచి మహర్షి తన ఎముకలను దేవతల మేలు కోసం దానం చేసి పరమ త్యాగాన్ని చాటాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నా కవచకుండలాలను దానంగా ఇచ్చి దానశీలతను ప్రదర్శించాడు. ఈ మహనీయులు స్వార్థం లేకుండా పరుల శ్రేయస్సు కోసం తమ సర్వస్వాన్ని అర్పించారు. త్యాగమే వారి జీవిత లక్ష్యంగా నిలిచింది. అందువల్ల ఈ పాఠానికి 'త్యాగనిరతి' అనే శీర్షిక అత్యంత సముచితంగా, భావగర్భితంగా సరిపోతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి..

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని అనుభూతిని వివరించండి.
త్యాగం మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దే గొప్ప సద్గుణం. స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల శ్రేయస్సు కోసం తన సమయం, శ్రమ, సంపద, అవసరమైతే ప్రాణాలను సైతం అర్పించడం త్యాగం. త్యాగం వల్ల మనిషిలో దయ, కరుణ, ప్రేమ, సేవాభావం వంటి ఉన్నత విలువలు పెంపొందుతాయి. త్యాగం చేసినవారు తమ కోసం కాకుండా సమాజ హితం కోసం జీవిస్తారు. దధీచి మహర్షి తన ఎముకలను దేవతల విజయానికి దానం చేసి త్యాగానికి ఆదర్శంగా నిలిచాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కవచకుండలాలను దానంగా ఇచ్చి దానగుణాన్ని చాటాడు. వారి త్యాగం వల్ల ఇతరులకు మేలు జరిగింది. త్యాగం చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి, ఆనందం, గౌరవం ధనంతో కొనలేనివి. త్యాగం వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టి సమాజంలో ఆదర్శంగా నిలిపిస్తుంది. అందువల్ల త్యాగం మానవత్వానికి చిహ్నం, సమాజ అభ్యున్నతికి మూలాధారం.

IV. సృజనాత్మకత / ప్రశంస.

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.

ఇబ్రాహీంనగర్,
తేది: 20.06.2025.

కు

సంపాదకులు గారికి,
వార్తాపత్రిక.

విషయం: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించవలెనని విజ్ఞప్తి.

మహోదయా,

మీ వార్తాపత్రిక ద్వారా ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. అన్నదానం ఆకలిని తీర్చితే, అవయవదానం ప్రాణాలను కాపాడుతుంది. మరణానంతరం దానం చేసిన కళ్లతో అంధులకు చూపు, మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాలతో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అయినప్పటికీ అవగాహన లేకపోవడం, అపోహల కారణంగా చాలామంది అవయవదానానికి ముందుకు రావడం లేదు. కాబట్టి అవయవదానం ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేక కథనాలు, వ్యాసాలు ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.

ధన్యవాదాలతో,

ఇట్లు,

విధేయురాలు,

(చిత్తరి వైష్ణవి)

8వ తరగతి,

ఇబ్రహీంనగర్.


V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్ధాలను రాయండి.

ఉదా: కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.

కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు. = ధర్మం 

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు. = మేలు

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణా రాష్ట్రం సిద్ధించింది. = సమర్పణ 

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక! = విస్తరించు, అభివృద్ది పొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. = ఆకలితో ఉన్నవాడు 

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా: ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో కలపడం ధర్మంకాదు
పాడి: న్యాయం, ధర్మం, తీర్పు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
అడవి:  అరణ్యం, విపినం

VI.భాషను గురించి తెలుసుకుందాం.


1. కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా: లోపలకి రావచ్చు అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి (4) 1. ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు. (3) 2. ప్రశ్నార్ధకవాక్యం
ఇ) ఆహా! ఎంత బాగుందో (1) 3. సామర్థ్యార్ధక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు (5) 4. ప్రార్ధనార్ధక వాక్యం
ఉ) గిరి! ఎక్కడున్నావు? (2) 5. నిషేధార్థక వాక్యం

6. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) ఇంద్రాగ్నులు - ఇంద్ర + అగ్నులు = సవరదీర్ఘ సంధి
ఆ) త్యాగమిది -  త్యాగము + ఇది  ఉత్వసంధి 
ఇ) ఆహారార్థం - ఆహార + అర్థం  = సవర్ణదీర్ఘ సంధి 
ఈ) నేనెట్లు  - నేను + ఎట్లు ఉత్తగుంధి
ఉ) శౌర్యాది - శౌర్య + ఆది  సవర్ణదీర్ఘ సంధి 

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలు – రంతిదేవుడు, కర్ణుడు


 
ప్రాజెక్ట్ పేరు ......................................................
ప్రాజెక్ట్ సంఖ్య 
విద్యార్థి పేరు ......................................................
క్రమసంఖ్య ......................................................
సేకరించిన వివరాలు 

నివేదిక

త్యాగం, దానం, పరోపకారం వంటి సద్గుణాలు మనిషిని మహనీయునిగా నిలబెడతాయి. భారతదేశ చరిత్ర, పురాణాల్లో త్యాగబుద్ధికి ఆదర్శంగా నిలిచిన మహనీయులలో రంతిదేవుడు, కర్ణుడు ప్రముఖులు.

1. రంతిదేవుడు

రంతిదేవుడు దయ, దానం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహారాజు. ఒకసారి నలభై ఎనిమిది రోజుల ఉపవాసం తర్వాత భోజనం చేయబోతుండగా వరుసగా వచ్చిన అతిథులకు తన వద్ద ఉన్న ఆహారమంతా దానం చేశాడు. చివరకు తాగడానికి మిగిలిన కొద్దిపాటి నీటిని కూడా దాహంతో వచ్చిన ఒక చండాలునికి ఇచ్చాడు. తన ఆకలి, దాహాన్ని లెక్కచేయకుండా పరుల బాధను తొలగించడమే తన ధర్మమని భావించాడు. ఈ విధంగా రంతిదేవుడు నిస్వార్థ సేవాభావానికి ఆదర్శంగా నిలిచాడు.

2. కర్ణుడు

కర్ణుడు మహాభారతంలోని దానవీరుడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతని సహజ కవచకుండలాలను దానంగా అడిగినప్పుడు, అవి తన ప్రాణరక్షణకు అవసరమని తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా దానం చేశాడు. తన మాటను నిలబెట్టుకొని దానగుణాన్ని ప్రదర్శించాడు. అందుకే కర్ణుడు **"దానవీరశూర కర్ణుడు"**గా చిరస్మరణీయుడయ్యాడు.

ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న విషయాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా త్యాగం, దానం, పరోపకారం వంటి మానవీయ విలువల గొప్పతనాన్ని తెలుసుకున్నాను. రంతిదేవుడు ఆకలితో ఉన్నప్పటికీ తన ఆహారాన్ని ఇతరులకు పంచడం, కర్ణుడు తన ప్రాణరక్షణకు అవసరమైన కవచకుండలాలను కూడా దానం చేయడం ద్వారా నిస్వార్థ త్యాగానికి ఆదర్శంగా నిలిచారని గ్రహించాను. పరుల శ్రేయస్సు కోసం చేసిన త్యాగమే నిజమైన మానవత్వమని తెలుసుకున్నాను. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, దానగుణాన్ని అలవరచుకోవడం, సమాజ సేవలో భాగస్వామి కావడం ప్రతి మనిషి కర్తవ్యమని ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్నాను. ఈ మహనీయుల ఆదర్శాలను నా జీవితంలో ఆచరించాలని సంకల్పించాను.


సూక్తి:

"త్యాగం చేసినవాడు గొప్పవాడు; పరుల కోసం జీవించినవాడు మహనీయుడు."

 

నేనివి చేయగలనా?
1. త్యాగంలోని గొప్పదనాన్ని సొంతమాటల్లో చెప్పగలను.
అవును /కాదు
2. అపరిచిత పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలను. సరైన జవాబులు గుర్తించగలను.
అవును /కాదు
3. నిత్యజీవితంలో జరిగిన ఒక సంఘటనలోని త్యాగభావాన్ని గుర్తించగలను.
అవును /కాదు
4. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికకు లేఖ రాయుము
అవును /కాదు

సూక్తి
త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల మానవజన్మ సార్థకమవుతాయి.ద్ఫజ్డ్