సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

తెలుగుvసామర్థ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగుvసామర్థ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2023, మంగళవారం

6,7,8 తరగతుల తెలుగు సామర్థ్యాలు


1. వినడం - మాట్లాడడం, ధారాళంగా చదివి, అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం

అను సామర్థ్యాలు ఉంటాయి. 

ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.

విద్యార్థి విన్న, చదివిన అంశాలను అర్థం చేసుకోవాలి.

తన అభిప్రాయాలను వ్యక్తీకరించాలి.

సమర్థిస్తూ, విభేదిస్తూ మాట్లాడగలగాలి. కారణాలు వివరించగలగాలి.

నచ్చిన సందర్భాన్ని, అనుభూతులను వర్ణించగలగాలి.


2. చదవడం - ధారాళంగా సొంత మాటల్లో వ్యక్త పరుచడం 

అపరిచిత గద్య, పద్యాలను చదివి అర్థం చేసుకోవాలి.

పద్య భావాలు, పాఠ్య భాగ సారాంశాలు, కథలు సొంత మాటల్లో చెప్పగలగాలి.

వక్తృత్వ పోటిల్లో పాల్గొనాలి. సద్యోభాషణం చేయగలగాలి.

జాతీయాలు, సామెతలు గుర్తించగలగాలి.

సందర్భాలను గుర్తించగలగాలి.

భావాలకు తగిన పద్యపాదాలను గుర్తించగలగాలి.

పేరాలకు శీర్షికలు పెట్టడం, శీర్షికలకనుగుణంగా పేరాలను గుర్తించాలి.



3. స్వీయరచన: కారణాలు రాయగలగాలి

వివరిస్తూ రాయగలగాలి

అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను రాయగలగాలి.

రచయిత అభిప్రాయాలను గ్రహించి, వివరించగలగాలి.

సమర్థిస్తూ, విభేదిస్తూ రాయగలగాలి.

ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ రాయగలగాలి.


4. సృజనాత్మకత / ప్రశంస:



అభినందన వ్యాసాలు, 

కరపత్రాలు, 

సన్మాన పత్రాలు రాయగలగాలి.

వ్యాసాలు, కవితలు, కథలు రాయగలగాలి.


5. పదజాలం, 

 

పదాలకు అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు రాయగలగాలి.

ఇచ్చిన పదాలను, జాతీయాలను సొంత వాక్యాలలో ప్రయోగించగలగాలి.

ప్రకృతి, వికృతులను రాయగలగాలి.

దైనందిన జీవితంలో జాతీయాలను, సామెతలను ఉపయోగించాలి.

పద్యాల లక్షణాలను అర్థం చేసుకోవాలి.


6. భాషను గురించి తెలుసుకోవటం:

భాషా భాగాలు, వాక్యాలు, సంధులు, సమాసాలను అర్థం చేసుకొని వివరించగలగాలి.

అలంకారాలను అర్థం చేసుకొని, వివరించగలగాలి.

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...