హవ్వ - సతీష్ చందర్ కథ సారంగా 1-04-24
* ఇలాంటి తవ్వాయి వస్తే (1934)
రచయిత: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
* యజ్ఞం (1966) రచయిత: కాళీపట్నం రామారావు
(తరాతరాలుగా దళితుల బతుకు బానిసత్వమే! తాత, తండ్రి, మనవడు.. అందరూ పెద్దల మోచేతికింద బతకాల్సిందే! ఈ వ్యవస్థతో విసుగెత్తిన ఒక మాల రైతు అప్పల్రాముడి కొడుకు సీతారాముడు ఏం చేశాడన్నది కథ).
* అస్పృశ్య గంగ(1969) రచయిత: కొలకలూరి ఇనాక్
(ఆయన లెక్చరర్. కొత్తగా ఆ ఊరికొచ్చాడు. దళితుడు. కాబట్టి దూరం పాటించాలి. దేన్నీ తాకకూడదు. ముఖ్యంగా నీరు. ఆ ఊరిలో కరవు. పైన ఎండాకాలం. ఎవరూ నీళ్లు ఇవ్వలేదు. చూశాడు. సహించాడు. ఇలా కాదని బావి తవ్వడం ప్రారంభించాడు. ఆపైన??)
* ఆమళ్లదిన్నె శర్మగారి అబ్బాయి అను ఏసోబు (1995)
రచయిత: వల్లూరి రాఘవరావు
(కులం కారణంగా తన స్నేహితుడైన ఓ మాలవాడిని కొట్టిన బాబాయి మీద, తాను పెద్దయి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు ఓ బ్రాహ్మణ పిల్లాడు. వివక్షను చిన్నపిల్లల కోణం నుంచి చెప్పిన తీరు బాగుంటుంది).
కథ కోసం: http://m.gotelugu.com/issue17/31/telugu-serials/vamsee-ki-nachina-katha/aamalladinne-sarmagari-abbayi/
* మోహనా! మోహనా! (1997) రచయిత: వి.చంద్రశేఖరరావు
(కలిచేడు అనే ఊహాత్మక ప్రదేశంలో జరిగే దళితులపై జరిగిన క్రూరమైన దాడి ఈ కథ. సర్రియలిస్ట్ ధోరణిలో సాగుతూ దళిత అస్తిత్వ పోరాటాన్ని కళ్లముందు నిలిపే కథ ఇది. ఇందులోని పాత్రలు, వాటి అస్తిత్వం మనల్ని వెంటాడతాయి).
* నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద (1997)
రచయిత: నాగప్పగారి సుందర్రాజు
(నడిమింటి మాదిగ బోడెక్కను బసివిరాలిని చేసే తంతే ఈ కథ. దళిత మహిళల జీవితాల్లోని విషాద కోణాన్ని ఆవిష్కరించిన కథ ఇది. మాండలికం ఈ కథకు ప్రాణం).
* సిగ్గు (1998)
రచయిత: సతీష్ చందర్
(దళితులు బట్టకు మొహం వాచిన స్థితినుంచి, శుభ్రమైన బట్ట కట్టుకునే స్థితికి చేరుకున్నారు. అందులోని ప్రభావవంతమైన కోణాన్ని అద్భుతంగా చూపిన కథ. తెలుగులో మేటి కథ).
* గురుదక్షిణ (2001)
రచయిత: చిలుకూరి దేవపుత్ర
(దళితుడైన విద్యార్థి అందరూ తాగే కుండలో నీళ్ళు తాగిన పాపానికి గురువు చేత దెబ్బలు తినడం ఈ కథ. చివరికి ఆ గురువు ఎలా పశ్చాత్తాపం పొందాడో ఆసక్తికరంగా ఉంటుంది).
* రాయక్క మాన్యమ్
రచయిత్రి: జూపాక సుభద్ర
(దళిత కులాల్లో ఉపకులమైన డక్కలి కులంలోని ఓ స్త్రీ కథ ఇది. రాయక్క తన భూమిని కాపాడుకున్న వైనం ఈ కథ).
* తప్పిపోయిన కుమార్తె (2008)
రచయిత్రి: ఎం.వినోదిని
(దళితులు అగ్రవర్ణాల సంస్కృతిని అనుకరిస్తూ, తమ జీవిత విధానాన్ని దూరం నెడుతున్న తీరుపై ఘాటైన చురక ఈ కథ. దళిత క్రైస్తవుల జీవితాల గురించి వచ్చిన మేలైన కథ).
* అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా (2012)
రచయిత: పసునూరి రవీందర్
(పల్లెల్లో మాత్రమే వివక్ష ఉంటుంది. పట్నాల్లో అటువంటిది లేదు అని భావించే వారికి కనువిప్పు కలిగించే కథ ఇది. పట్నవాసుల్లోనూ కుల స్పృహ ఎంత వేళ్లూనుకుందో చెప్పే కథ ఇది).
* థూ(2014)
రచయిత: పి.వి.సునీల్‌కుమార్
(చుండూరు ఊచకోతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రాసిన కథ ఇది. తెలుగులో వచ్చిన అత్యంత ప్రభావవంతమైన వ్యంగ్య కథల్లో ఒకటిగా నిలిచింది).
కథ కోసం: * అంటరాని బతుకమ్మ (2015)
రచయిత: పి.చిన్నయ్య
(ప్రత్యేక తెలంగాణ వచ్చింది. బంగారు బతుకమ్మ ఊరూరా కొలువుతీరింది. కానీ దళితులకు మాత్రం అది అంటరానిదిగానే మిగిలింది. గ్రామాల్లో వేడుకలకు దళితుల్ని చేరనిచ్చే పరిస్థితి లేదు. ఈ అంశంపై వచ్చిన మేలైన కథ).
* రిసరెక్షన్(2016)
రచయిత: వెంకట్ శిద్దారెడ్డి
(హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో వచ్చిన ప్రభావవంతమైన కథ).
కథ కోసం: https://www.kahaniya.com/s/risarekshan/risarekshan
* బొట్టు భోజనాలు (2016)
రచయిత్రి: ఎండ్లూరి మానస
(వనభోజనాలు కులభోజనాలుగా మారిన నేపథ్యంలో ఓ దళిత క్రైస్తవ అధ్యాపకురాలి అనుభవాలు ఆసక్తికరంగా చదివిస్తాయి).
కథ కోసం: https://epaper.andhrajyothy.com/m5/939727/Sunday-Andhra-Pradesh/18.09.2016#page/25/1
* పియ్యెత్తే మాదిగి సుబ్బులు (2020)
రచయిత: సొలోమోన్ విజయ్‌కుమార్
(తోటీ(సఫాయ్ కర్మచారీ) పనివారి మీద తెలుగులో వచ్చిన అతి తక్కువ కథల్లో ఒకటి. ముగింపు తృప్తిగా అనిపిస్తుంది)